ఏమయ్య రామ
పల్లవి
ఏమయ్య రామా బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియ వశమా శ్రీ రామ
అనుపల్లవి
కామారి వినుత గుణధామ కువలయదళ శ్యామ ననుగన్న తండ్రి శ్రీరామ
చరణములు
1.సుతుడనుచు దశరధుడు హితుడనుచు సుగ్రీవు డతి బలుడనుచు కపులు శ్రీ రామ క్షితినాధుడనుచు భూపతులు గొలిచిరే గాని పతిత పావనుడనుచు తెలియలేరైరి
2.చెలికాడనుచు పాండవులు విరొధివటంచు నల జరాసంధులు శ్రీరమ కలవాడవని కుచేలుడు నెరిగిరే గాని జలజాక్షుడని నిన్ను సేవింపలేరైరి
3.నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు వరుడవనుచు గోప సతులు శ్రీరామ! కరివరద భద్రగిరి శ్రీరామదాసనుత పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి