ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము

ఎక్కడిమతము లింక (రాగం: ) (తాళం : )


ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము
తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక

కాదనగ నెట్టువచ్చు కన్నులెదుటిలోకము
లేదనగ నెట్టువచ్చు లీలకర్మము
నీదాసుడ ననుచు నీమరగు చొచ్చుకొంటే
యేదెసనైనా బెట్టి యీడేరింతుగాక

తోయ నెట్టువచ్చు మించి తొలకేటినీమాయ
పాయ నెట్టువచ్చు యీభవబంధాలు
చేయార నిన్ను బూజించి చేరి నీముద్రలు మోచి
యీయెడ నుండగా నీవే యీడేరింతుగాక

తెలియగ నెట్టువచ్చు ద్రిష్టమైననిమహిమ
తలచగ నెట్టువచ్చు తగునీరూపు
నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండగా
యిలమీద మమ్ము నీవే యీడేరింతు గాక


Ekkadimatamu limka (Raagam: ) (Taalam: )



Ekkadimatamu limka naemi sodimchaemu naemu
Takkaka Sreepati neevae dayajootugaaka

Kaadanaga nettuvachchu kannuledutilokamu
Laedanaga nettuvachchu leelakarmamu
Needaasuda nanuchu neemaragu chochchukomtae
Yaedesanainaa betti yeedaerimtugaaka

Toya nettuvachchu mimchi tolakaetineemaaya
Paaya nettuvachchu yeebhavabamdhaalu
Chaeyaara ninnu boojimchi chaeri neemudralu mochi
Yeeyeda numdagaa neevae yeedaerimtugaaka

Teliyaga nettuvachchu drishtamainanimahima
Talachaga nettuvachchu taguneeroopu
Nelavai sreevaemkataesa neevu galavanumdagaa
Yilameeda mammu neevae yeedaerimtu gaaka


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |