ఎంతటివారలు నెవ్వరును

ఎంతటివారలు నెవ్వరును (రాగం: ) (తాళం : )

ఎంతటివారలు నెవ్వరును హరి
జింతించక నిశ్చింతలు గారు ||

అతిజితేంద్రియులు ననశనవ్రతులు
నతులతపోధనులగువారు
చతురాననగురుస్మరణము దొరకక
తతి నూరక పుణ్యతములు గారు ||

అనఘులు శాంతులు సధ్యాత్మతతులు
ననుపమపుణ్యులు యాజకులు
వనజోదరు ననవరతము దలచక
వినుతిస్మృతిని విబుధులు గారు ||

దురితవిదూరులు దుర్మతిహీనులు
నిరతానందులు నిత్యులును
తిరువేంకటగిరిదేవుని గొలువక
పరమార్గమునకు బ్రహ్మలు గారు ||


eMtaTivAralu nevvarunu (Raagam: ) (Taalam: )

eMtaTivAralu nevvarunu hari
jiMtiMcaka niSciMtalu gAru

atijitEMdriyulu nanaSanavratulu
natulatapOdhanulaguvAru
caturAnanagurusmaraNamu dorakaka
tati nUraka puNyatamulu gAru

anaGulu SAMtulu sadhyAtmatatulu
nanupamapuNyulu yAjakulu
vanajOdaru nanavaratamu dalacaka
vinutismRutini vibudhulu gAru

duritavidUrulu durmatihInulu
niratAnaMdulu nityulunu
tiruvEMkaTagiridEvuni goluvaka
paramArgamunaku brahmalu gAru


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |