ఉన్నది ఒకడే శివుడేగా
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
పల్లవి: ఉన్నది ఒకడే శివుడే గా శివుడే శివుడే శివుడే గా నాలో ఉన్నది శివుడేగా - నీలో ఉన్నది శివుడే గా నాలో నింపిన ఆ గాలే - నింగిని నింపిన గాలి గదా నింగిని నింపిన ఆ గాలే - అందరి ప్రాణమ్మౌను గదా నా జఠరాగ్నియె తలపంగా - వెలుపల వెలుగై విచ్చె గదా వెలుపల విచ్చిన ఈ వెలుగే - అందరిలో జఠరాగ్ని గదా నేలా నీరు నింగియునూ - ఉన్నవి నాలో వెలుపలనూ భూతములైదును శివుడనగా - అశివము నాలో కలదేది? నాలో శివుడని అననేలా - నేనై ఉన్నది శివుడేగా నేనై నీవై అన్నియనై - ఉన్నది శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా - ఆ శ్రీమాతయు శివుడేగా భూతము భావియు శివుడేగా - కాలాతీతుడు శివుడేగా సత్పద వేద్యుడు శివుడేగా - చిత్పద గమ్యుడు శివుడేగా సచిదానందుడు శివుడేగా - శివుడే శివుడే శివుడేగా