ఈ మిడిసిపాటు నీ మ్రోల నేల తేనె
ఈ మిడిసిపాటు నీ మ్రోల నేల తేనె
తేట చిను కేని లేని యీ పాట కిపుడు?
ఇంత చివు రిచ్చి యంత హేమంత శృంఖ
లాల బంధింతు మూగతనాల గొంతు!
స్వామి! నూత్న వసంతజీవ ప్రవాళ
పల్లవమ్ముల రుచులె నా బ్రతుకుజీర
కోసి తీయదనమ్ములు వోసి నపుడె
వెడలిపడలేద! యొక యడు గిడగలేద!
మూడులోకాల బరువుల మ్రోత నడగి
యడగి చిదికెను గద అంధజడము తాను!
ఓయి గాయకసార్వభౌమా! యి వేటి
తగని తుళ్ళింత వెలితినృత్యమ్ము లోయి!