ఇందరికి నభయంబులిచ్చు
ఇందరికి న భయంబులిచ్చు ఇందరికి న భయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి॥ ౨ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాది చేయి ఇందరికి ౨ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి ఇందరికి ౨॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబు బరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు - తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి॥ ఇందరికి ౨॥ అన్నమయ్య పాట Imdariki na bhayambulichchu Imdariki na bhayambulichchu chaeyi Kamduvagu mamchi bamgaaru chaeyi ~2 Velalaeni vaedamulu vedaki techchinachaeyi Chiluku gubbali kimda chaerchu chaeyi Kaliki yagu bhookaamta kaugilimchinachaeyi Valanaina konagolla vaadi chaeyi Imdariki ~2 Tanivoka balichaeta daanamadigina chaeyi Onaramga bhoodaana mosagu chaeyi Monasi jalanidhi yammumonaku dechchina chaeyi Enaya naagaelu dhariyimchu chaeyi Imdariki ~2 Purasatula maanamulu pollasaesinachaeyi Turagambu barapedi doddachaeyi Tiruvaemkataachalaadeesudai mokshambu - Teruvu praanula kella telipedi chaeyi Imdariki ~2 Annamayya paata
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|