ఇంత ప్రొద్దాయె ఇంక
ఇంత ప్రొద్దాయె ఇంక వాడేమి వచ్చేని ||
చింతింప పని లేదు చెలియ మువ్వ గోపాలు
చేరి నాతో నేస్తము చేసిన పాపమా
కీరవాణి రో ఏల వేగించే వే నీవు
నూరిన గంధ కస్తూరి పార వేసి పవళించు
ఏ రమణి ఇంట నున్నాడో యూరెల్ల మాటు మడగె ||
భాసురాంగి రో వినవె పక్షులు మొదలు గాను
వసముల చేరి తమ వనితల గూడె
ఆసించిన ఫలించె దరుదు గాదటవే నే
చేసిన పాపము ఎవ్వరు చేసినారే ఓ చెలియ ||
పమ్మిన వేడుక తోను పడకిల్లు శ్రుంగారించి
ఎమ్మె కాడు వచ్చు నని ఎదురు చూచితి
సొమ్ములేలే విరులేలే సొగసెవ్వరు చూచెదరే
కొమ్మ నన్నేలిన మువ్వ గోపాలుని నమ్మ రాదే ||
inta proddAye inka vADEmi vachchEni ||
chintimpa pani lEdu cheliya muvva gOpAlu
chEri nAtO nEstamu chEsina pApamA
keeravANi rO Ela vEginchE vE neevu
noorina gandha kastoori pAra vEsi pavaLinchu
E ramaNi inTa nunnADO yoorella mATu maDage ||
bhAsurAngi rO vinave pakshulu modalu gAnu
vasamula chEri tama vanitala gooDe
Asinchina phalinche darudu gAdaTavE nE
chEsina pApamu evvaru chEsinArE O cheliya ||
pammina vEDuka tOnu paDakillu SrungArinchi
emme kADu vachchu nani eduru choochiti
sommulElE virulElE sogasevvaru choochedarE
komma nannElina muvva gOpAluni namma rAdE ||
బయటి లింకులు
మార్చుThis work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.