ఇంక నిన్ను బోనిత్తునా


ఇంక నిన్ను బోనిత్తునా (రాగం: ) (తాళం : )

ఇంక నిన్ను బోనిత్తునా ఇభ రాజ వరదా ||

శుక వాణి చేత నీ సుద్దు లెల్ల విన్నట్లాయె ||

నవ్వులంట యున్నావేమో నా పద్దు చూడు మీ సారి
పువ్వు బోడూల చేత రవ్వ సేయించక మాన
జవ్వన మెల్ల నీ పాలు చేసి చాల నమ్మి యున్నందు
కెవ్వతె తో నో కూడి వచ్చి ఇపుడు లేదని బొంకేవు ||

పన్నుగ మువ్వ గోపాల బాస లిచ్చి నన్ను కూడి
వన్నె లాడికే లోనైన వగ లెల్ల విన్నార నేడు ||


inka ninnu bOnittunA (Raagam: ) (Taalam: )

inka ninnu bOnittunA ibha rAja varadA ||

Suka vANi chEta nee suddu lella vinnaTlAye ||

navvulanTa yunnAvEmO nA paddu chooDu mee sAri
puvvu bODUla chEta ravva sEyinchaka mAna
javvana mella nee pAlu chEsi chAla nammi yunnandu
kevvate tO nO kooDi vachchi ipuDu lEdani bonkEvu ||

pannuga muvva gOpAla bAsa lichchi nannu kooDi
vanne lADikE lOnaina vaga lella vinnAra nEDu ||

బయటి లింకులు

మార్చు
 

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.