8_1_271 క. స్తుత్యాను భావ నిర్మల నిత్యానంద స్వరూప నిగమ విరోధి స్థిత్యప నయనోన్ముఖ చి త్సత్యాత్మక భక్తలోక దౌర్గత్యహరా.

8_1_272 వ. అని మఱియు ననేక ప్రకారంబులం బ్రస్తుతించినం బ్రసన్నుం డై భ రించి మీకు భయంబు వలవదు మీ చెప్పిన యట్ల చేసెద వలం బెయ్యది యనిన దేవముని సంఘంబులు ప్రహర్షంబు నొందె నర డప్పరమేశ్వరున కిట్లనియె.

8_1_273 సీ. ప్రజలకుఁ బతిగాఁగఁ బనిచితి నీవు నన్నట్లు పదస్థుండ నగుటఁ జేసి విచ్చలవిడి వరం బిచ్చితి నసుర త్రయమునకు దుర్గ త్రయంబు గలిగి యిమ్మువ్వురును దారణాక్రమమున భువన త్రయ సంబాధనం బొనర్చు చున్నారు వారల నొరులకు నుడుప శక్యము గాదు నీవు శీఘ్రంబు చెఱుప

వలయు మునులు దేవతను నేను శరణు చొ చ్చితిమి నిన్నుఁ గరుణఁ జేకొనంగ వలదె మమ్ము నొరులు గలరె జగంబులు గావ భూతనాథ నీవు దక్క.

8_1_274 వ. అనవుడు నద్దేవుం డయ్యసురులు సెఱుప వలయు వా రగుదురు వారలు బలవంతు లే నొంటిమై నా పనికి నుత్సహింప నేర మదీయంబు లయున తేజో బలంబులందర్థంబు వుచ్చికొని మీరందఱుం గూడి యా దుష్టదైత్యుల మర్దించుట కార్యంబనిన నద్దివిజులు మాకందఱకుం గల తేజో బలంబులకు నద్దనుజుల తేజో బలంబులు రెట్టి యయి యుండు నట్లగుటం జేసి మా చేతం జెడరు భవదీయ తేజో బలంబులు భరియింప మేము శక్తులము గాము మా యందఱ తేజో బలంబులలో సగంబు వుచ్చికొని నీవ యా శత్రుల సమయింపు మెల్ల భంగిని నీకు రక్షణీయుల మగు మమ్ము రక్షింపు మనుటయు నజ్జగన్నాథుండు.

8_1_275 అమరులకు నసురులకు నే సముఁడ శివం బఖిల భూత జాలంబులకున్ సమత నొనరింప శివ నా మము నాకుం జెల్లు లోకమాన్యం బగుచున్.

8_1_276 వ. అయినను.

8_1_277 అనయముఁ గ్రూరకర్ము లగు నట్టి విమూఢులఁ బిల్కు మార్పఁ బూ నన తగు ధర్మవర్తను లనం జను మీ యెడ ద్రోహు లైన య ద్దనుజులఁ ద్రుంచి మీకుఁ బ్రమదం బొనరించెదఁ దేజమున్ బలం బును సగ పాలు వెట్టి ననుఁ బొందఁగఁ జేయుఁడు మీర లందఱున్.

8_1_278 వ. అని మఱియు నొక్కటి సెప్పెద లోకంబుల కెల్లను బశుత్వంబును నాకుం బశుపతిత్వంబునుం గావలయు నట్లయినఁ బశుహననంబునం బాపంబు లేకుండు.

8_1_279 ఒనరింపుఁడు దివ్యరథం బును దచ్చోదకుని నశ్వముల విల్లును న మ్మును నాకు నట్టు లైనను దనుజుల దుర్గములు వినిహతము లగు నాచేన్.

8_1_280 అనిన విని పశుత్వమునకు శంకించి వి షణ్ణులైన సురల చంద మెఱిఁగి భయము గొనఁగ వలదు పశుభావ మోక్షణ విధియుఁ గలదు దాని వినుఁడు మీరు.

8_1_281 వ. అని పలికి హరుండు వారలతోఁ బాశుపత వ్రతానుష్ఠానంబునం బశుత్వ మోక్షఅం బగు నదియును ద్వాదశాబ్దంబులు నడప వలయు నిష్ఠాను రూపంబుగా సంవత్సరంబునఁ దదర్థంబున ఋతువున మాసంబునఁ బండ్రెండు దినంబుల మాత్రను ఫలించు ననుటయు నట్ల కాక యని వార లందఱును లోకంబులకు లోకేశ్వరునకుఁ బశుత్వంబుం బశుపతిత్వంబుఁ గలుగుట యమ్మహాత్మునిఁ బశుపతి వని పేర్కొని నిజ తేజో బలార్ధంబులు గైకొని యత్యధిక బలుండై తొల్లింటి కంటె వెలింగె నప్పు డద్దేలు విభవం బెసఁగఁ బుర హననంబునకయి యభిషేకంబు సేసి కించి మహాదేవునకు దివ్య రథంబును దగియెడు సాధనంబులను గ డుఁ దపః ప్రభావ మహనీయుం డగు విశ్వకర్మ యవహితుండై.

8_1_282 సీ. సామర్థ్య మొప్ప విశ్వంభరాచక్రంబు రథముగఁ జేసి చంద్రముని కరునిఁ జక్రంబులు గాఁ బెట్టి వారిథి నక్ష మొనర్చి హిమావనీధ రంబున వింధ్య నగంబున నస్తాచలంబున నుదయ శైలమున బలువు టవయంబులు దీర్చి యగ్నుల మూఁటఁ ద్రివేణుకరచనఁ గావిం

ఆ. పర్వతమున నాత పత్రంబు గల్పించి హరులు వేదములు శరాస వత్సరంబు శరము వాసుదేవుండును గాఁగ సంఘటించె గౌరవవ

8_1_283 వ. ఇట్లు చరాచరాత్మకం బై తేజరిల్లు నత్తేరు వీక్షించి ఫాలాక్షుం డిత వ్యోమ మండలం బుపాదాన కారణంబుగా విశ్వకర్మ గావించి డిగి శరాసనంబు ధరియించి శరంబు వుచ్చికొని దానవ సంత్రా డగుచు నారోహణంబు సేసి వృషభ ధ్వజంబునం బొలు పొంది.

8_1_284 ఆ. అప్సరోగణంబు లాడుచుఁ బాడుచు సంతసమునఁ జెలఁగ సకల బహువిధములఁ దన్నుఁ బ్రస్తుతి సేయంగ నమర వరులఁ జూచి

8_1_285 క. సారథి యెవ్వం డనుటయు వారలు నీ చిత్తమునకు వచ్చిన వానిం గారుణ్యంబునఁ గైకొని తేరు నడపఁ బనుపు మనిరి ధీర విచారా.

8_1_286 వ. అనవుడు నద్దేవుండు.

8_1_287 తే. అరయ నెవ్వాఁడు నాకంటె నధికుఁ డతని మీర యెఱిఁగి యొనర్పుఁడు సారథిత్వ మునకు నని చెప్పుటయు మహా మునులఁ గూర్చి కొని యమర్త్యులు సంభృత వినయు లగుచు.

8_1_288 వ. కమలాసను కట్టెదిరికి జని భక్తిం బ్రణమిల్లి దేవా నీ వలన నీల గ్రీవు డయ్యె భవదాజ్ఞ నేమతనికి రథంబుం దగు సాధనంబులు సమకట్టి దొరక కున్న వాఁడది యెట్లనిన సారథ్యం బాచరించుపు సత్త్వంబుల రథికున కధికుండు గావలసి యుండు రథంబు పృది వేదంబులు రథికుండు రుద్రుండు రథ చోదకుంు సులభుం డగునే వగునీ విప్పనికిం బూన వలయు దానవ భయ భ్రాంతుల మైన మస్త మా కేడుగడయ నీవ భవదీయ ప్రసాదంబున బ్రదికెదమని చాఁగిలి మ్రొక్కినం బరమాదరంబున నెత్తి యప్పరమేష్ఠి వారలఁ గారుణ్యంబునం గనుంగొని.

8_1_289 ఉ. మీరు నిజంబ చెప్పితిరి మిక్కిలి నేర్పును లావు గల్గినన్ సారథి వోరులన్ రథిక సత్తముఁ దా గెలిపించు బుద్ధిదో స్సార విలాస భంగులకు శర్వుఁడు మెచ్చఁగ నాగమాత్మ కో దార హయంబులన్ నడపెదన్ దనుజుల్ వెఱఁ గందునట్లుగన్.

8_1_290 వ. అని పలిగి సురగణంబు ముదంబునం బొదలఁ దన చేతి కమండలు వొక్కెడ నిడి జడ ముడి బిగియించి యజిన పరిథానంబు దృఢంబుగా బంధించి ప్రణవంబునం ద్వష్టయొనర్చిన మునికోల పుచ్చికొని నొగ లెక్కె నిట్లు లోక పితీమహుని సురలు శంకర సారథ్యంబు సేయించి రని చెప్పి దుర్యోధనుండు వెండియు నిట్లనియె.

8_1_291 క. హరు లమ్మహాత్ము లిరువుర భరియించుట కోర్వలేక పడుటయు నెత్తెన్ వెరవున లావున వాగెలు ధరియించుచుఁ బద్మభవుఁడు ధరణీనాథా.

8_1_292 వ. ఎత్తి యత్తురంగంబులకు వీర్య శౌర్యంబులు గలుగ ననుగ్రహించి రథంబు గడపం దత్కౌశలంబు గొనియాడి కామదమనుం డా దనుజులు దుర్గంబుల దెసకు నరదంబు వఱపుము నేఁడు జగంబుల యలజడి మాల్చెద నా చేతి బలుపు సూడు మని పలికిన నప్పరమ సారథి మనోమారుత జవసత్త్వంబులు గలుగు నవ్వేదాశ్వంబులం బఱప నధర్వాంగిరసులు చక్ర రక్షకు లయి చనుదేర నత్తే రావురంబుల కడరిన నయ్యాదిమ రథికుండు.

- రుద్రుఁడు త్రిపురంబుల సంహరించి సురల సంతోష పఱుచుట -

8_1_293 సీ. కోప సందీప్తుఁడై చాపంబు సజ్యంబు గావించి మౌర్వి మార్గణముఁ గూర్చి పాశుపతాస్త్ర సంబద్ధంబుగాఁ జేసి పురములు మూఁటిని బుద్ధి నిలుప నవి యొక్క చోటికి నప్పుడ కూడిన మునులును సురలును ముదముఁ బొంది గెలు గెలు మంచు నుగ్గింప నయ్యుగ్రుండు దెగ వాపి యేసిన దితిజయుతము

ఆ. గాఁ బురత్రయంబు గాని నీఱై వశ్చి మాబ్థిఁ దొరఁగ నమ్మహాగ్ని లోక ములు దహింబఁ జొచ్చెఁ బురహరుఁ డది మాన్చె సంతసిల్లె సకల జంతువులును.

8_1_294 వ. అప్పు డనిమిషము గృతకృత్యు లయి భూతనాథుం బ్రణుతించి యతం డనుమతి సేయ నంబుజాసనుండు లోనుగా నందఱు నిజ స్థానంబులకుం జని రివ్విధంబున లోకహితార్థంబుగా నప్పరమేష్ఠి శివునకు సారథ్యం బనుష్ఠించె నీవు నట్లపోలెఁ గౌరవ రక్షణార్థంబుగా నెక్కు డయిన వాఁడవు మదీయ జీవితంబును రాజ్యంబును భవదధీనంబులు వానిం గలిగింపను జయంబును సుఖంబును గావింపను నీవ యొడయుండ నిక్కార్యం బాచరించి నన్ను రక్షింపు మని ప్రార్థించి నీ పుత్రుండు మద్రపతికి మఱియు నిట్లనియె.

8_1_295 సీ. ఇది యొక్క యితిహాస మే నొద్ద నుండ ధర్మ ప్రవీణుం డగు బ్రాహ్మణుండు ధృతరాష్ట్ర వసుమతీ పతికిఁ జెప్పినయది వినుము భార్గవ వంశమునఁ బ్రసిద్ధుఁ డగు జమదగ్నికి నత్యంత నిర్మలమతి రాముఁ డుదయుంచె నతని చేయు తపమున హరుఁడు ప్రత్యక్షమై నిలిచిన నతఁడు దివ్యాస్త్రంబు లడుగుటయును

ఆ,. నమ్మహాత్ముఁ డశుచు లైన వారల నవి నిర్దహించుఁ గాన నీవు పరమ శుచివి గమ్ము నీకుఁ జొప్పడు నఖిల మ హాస్త్ర వీర్య మనియె నాదరమున.

8_1_296 వ. అనిన విని జామదగ్న్యుండు వినతుం డై నా కెప్పుడు పాత్రత్వంబు గలిగె నప్పుడు నీవ తలంచి దయసేతువు గాక నీకు శుశ్రూష సేయు చుండునట్లుగా బ్రసాదింప వలయు నని విన్నవించిన విని కరుణాయత్త చిత్తుండగు భవుం డవ్వరం బిచ్చిన నమ్మహాత్ముండు నియమ నిష్ఠా పరుండై పూజోపహార ప్రముఖ విథానంబుల నద్దేవు నారాధించు చుండ ననేక సంవత్సరంబులు సన నొక్కనాఁడు పరమేశ్వరుండు ప్రసాదలసితాననుం డై గౌరీదేవికి నతనిం జూపుచు.

8_1_297 క. రాముఁడు విమల వ్రత చ ర్యా మహితుఁడు నాకు భక్తుఁ డని పలు మాఱుం దా ముద్దు సేసి మృదు వచ నామృత సంసిక్తుఁ జేయు నా సమయమునన్.

8_1_298 వ. బలవంతులగు దనుజుల చేత బాధితులయి బృందారకు లయ్యిందుధరు పాలి భయ సంభ్రమంబులతో నరుగుదెంచి తమ యలజడి యెఱింగించిన.

8_1_299 ఆ. జామదగ్న్యుఁ జూచి చయ్యనఁ జని దాన వుల వధించి దేవతలకుఁ బ్రీతి యాచరింపు మనియె హరుఁడు దానికి మది ముదముఁ బొంది కేలు మొగిచి యతఁడు.

8_1_300 క. అకృతాస్త్రుఁడ నగు నాకుం బ్రకట భుజాబలులు నస్త్రపారీణులు నై సకల సుర నికర సంబా ధకు లుగ దానవుల గెలువఁ దరమే యనుడున్.

తే. అంబికానాథుఁ డిట్లను నతని తోడఁ దలఁపు నీ దెస నిలిపెద దానఁ జేసి పగఱ నిర్జింప నగుఁ బదంబడి మనో ర థంబు సిద్ధించు నరుగుము దడయ కనఘ.