ఆ భా 7 5 91 to 7 5 126
--వేదుల కృష్ణ
7-5-91
క. తలవ్రయ్య లైన నిష్ఠుర
కులిశహతిం బగిలి కూలుకులపర్వతముం
దలపించుచుఁ గురువృద్ధుం
డిలఁ గూలెం బ్రతిబలంబు లే పారంగన్.
7-5-92
వ. అయ్యవసపంబున దశరథసుతసన్నిభం బగుభనత్కుమారదశకం బా కిమ్మీ
రవైరిం బొదువుటయు దశనిశితబాణంబులం బ్రాణంబులు గొనియెఁ
గర్ణానుజుం డగువృకరథుండు గడంగి వచ్చినం బొరివుచ్చె సౌబలసోదరులు
పన్నిరువురు బరవసంబు సేసినం బడ నేసెనిట్లు పటుపరాక్రమంబునం బేర్చిన
భీమసేనుమీఁ ద శూరసేనవసాతి మాళవత్రిగర్తబాహ్లికప్రముఖంబు లగు
దేశంబులబలంబులు బలువిడిం గవిసినం గని కౌంతేయాగ్రజుండు సైన్యసం
తానసమేతంబుగా నురవడించి భుజాటోపంబు సూపిన నవి మడిసియుఁ జడి
సియు జిక్కువడియు నుక్కుమడిగియు వెఱంగుపడి చూచుచుండనాచార్యుని
దుర్యోధనుండు పురికొల్పిన నతం డుత్సాహదీప్తుం డై యాధర్మతనయుఁ
దాఁకి వాయవ్యయామ్య వారుణాగ్నేయత్వాష్ట్ర సావిత్రంబు లగు సాయ
కంబుల వారించిన నతం డైంద్రాస్త్రంబున నిజప్రతిజ్ఞ నెఱపం జూచిన నదియు నట్ల
యడంగుటయుం గోపించి సకలభూతభయంకరం బగు బ్రహ్మస్త్రంబు
ప్రయోగించిన నమ్మహీపతియు నమ్మహనీయాస్త్రంబునన నమయించె
నంత ధృష్టద్యుమ్నుం డతిని కడ్డపడిన నారథికుతోడి యనికిం గ్రీడించి కుంభ
సంభవుండు.
7-5-93
చ. ద్రుపదుని సేన పై నడరి తోలినఁ జూచి వృకోదరుండు దే
నపతిసుతుండుఁ దాఁకి యనివారణ నగ్గురు నొంప నేచి యు
గ్రపువడి మాత్స్యకేకయముఖం బగు పాండవసైన్య మొక్కపె
ట్ట పరగి నీబలంబులకడంక యడంచి మదించి పేర్చినన్.
7-5-94
వ. కనుంగొని కౌరవేశ్వరుండు కర్ణుని కిట్లనియె
7-5-95
క. పాండవపాంచాలాదులు
గండుమిగిలి బెట్లు దఱుమఁ గౌరవబల మొం
డొండ కలంగెడు నీదగు
దండితనము సూరి కావఁదగుతఱి వచ్చెన్.
7-5-96
వ. అనవుడు.
7-5-97
శా. చంపం జాలుదు నేనొకండన భుజాశక్తిన్ నరున్ వెండి మ
ర్దంపం జుల్కన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబుఁ బా
లింపం బూనిన యేను గల్గఁగ రిపు ల్జృంభింతురే చూడు నా
తెంపుంబెంపును నంచుఁ గర్ణుఁడు మహోదీర్ణాకృతిం బొల్చినన్.
7-5-98
వ. కనుంగొని గృపాచార్యుం డలంతినవ్వుతో నతని కిట్లనియె
7-5-99
చ. అగు నగు మేలు మేలు మనుజాధిపుఁడున్ మహీ యేలుమాటల
న్మగఁటిమి యిమ్మెయిన్ నెఱపినం జెడుఁ బాండుతనూజకోటియుం
దగు ముమ ఘోషయాత్రను బదంపడి గోగ్రహణఁబు నందుఁ బే
రు గొనిన నీకు ని ట్లనుట క్రొవ్వులు దక్కుము సాలు నిన్నియున్.
7-5-100
వ. అని వెండియు.
7-5-101
క. నిన్నును బాండుతనూజుల
నెన్నండును బోరఁ జూచి యెఱుఁగని వారిం
గన్నట్లు వలుక నేటికి
నిన్ని సెనఁటిరజ్జు లనికి నివి దోడ్పడునే.
7-5-102
క. క్రీడికి మును మన మందఱు
నోడు టెఱుఁగు దన్నలును ఘటోత్కచుఁడుఁ దగం
దోడుపడ బంధునృపతులుఁ
గూడి నడన మనకు గెలుపుగొన నెట్టు లగున్.
7-5-103
చ. అనవుడుఁ గర్ణుఁ డిట్లులను నాడినయంతయుఁ జేయఁ జాలుబం
టున కెటులన్న నేమగుఁ గడుం బెలుచన్ మును మ్రోసి కాదె దృ
ష్టి నిగుడఁజేయు నంబుదము సెల్లదు నీపలు కింతవట్టు సైఁ
పన తగునింక నేమనినఁ బాఱుఁడ నాలుక గోయుదుం జుమీ.
7-5-104
వ. అని పలికి మఱియును.
7-5-105
క. నరు నద్దెసఁ గలవారిని
గురుబల ముబ్బు సెడఁబొగడి కొఱగాఁగన్
గురుని గురుతనయు మద్రే
శ్వరునను నేమిటికిఁ గానివారిం జేయన్.
7-5-106
క. అని మామఁ బలుకుపలుకులు
విని యశ్వత్థామ క్రోధనినశుం డయి గ్ర
క్కున వాలు వెఱికికొని క
ర్ణుని దెసకుం గవియ భూవరుం డెడసొచ్చెన్.
7-5-107
ఆ. నృపతితోడఁ గూడి కృపుడును నెడసొచ్చె
వారు లతనిఁ బట్టి వలదు రోష
ముడుగవలయు ననిన నుగ్రత నాతఁడు
పెనగఁ గర్ణుఁ డిట్టు లనియెఁ గనలి.
7-5-108
క. విడు విడు మాతం డిమ్మెయి
నడిచిపడఁగ నేల పట్టె దవనీశ్వర నీ
వుడిపెడుతెఱఁగున నాబిరు
దుడుగునె నాచేయిదాఁకి యుడిగినభంగిన్.
7-5-109
క. అనుడుఁ గృపాచార్యుం డి
జ్జనపతికిం గాఁగ నేను సైరించిన నే
మని పలికితేని నీకుం
జనియెం బొమ్మింక వలదు సంభ్రమ మనియెన్.
7-5-110
వ. అప్పు డక్కురుపతి గురుపుత్రు నుద్దేశించి.
7-5-111
క. గురుఁడును నీవును మద్రే
శ్వరుఁడును గర్ణండుఁ గృపుఁడు సౌబలుఁడు ననున్
ధర యేలింపఁగ నున్నా
రరు మీకుం దగున్ సంగరములోఁ గలఁగన్.
7-5-112
క. క్షమియింపు మనుడు నతఁ డురు
శమ మొందిన గర్ణుఁడుం బ్రశాంతుం డై వి
క్రమ కేలి సలుపఁ బ్రతిసై
న్యము దెస మొగ మయ్యెఁ బటుగుణధ్వని సెలఁగన్.
7-5-113
వ. ఇట్లు గడంగినం బ్రత్యర్థి పార్థివు లయ్యోధవరు నాలోకించి పాండవులకుఁ
బాటిల్లిన యనర్థంబుల కెల్లను మూలంబు వీఁడ కాఁడే వీనిం బొదువుఁడు
పోనీకుఁడు పడవైవుం డనుచుఁ దలపడిన నాసూతసూనుఁడు నిజనామాం
కితంబు లగునారాచంబుల నన్నరపతులఁ గరులఁ నరులఁ దురగంబుల నరదంబుల రూపుమాపి యేపునుఁ దదీయాంగంబులు రుధిరంబున మునుంగునట్లు సేనినం జూచి సవ్యసాచి సాయకజాలంబులు నిగిడించుటుం గవిసిన నతండు
మూఁఢు మార్గణంబులు దన తనువునఁ జొనుపుటయుం గినిసి యక్కరీటి
ముప్పదిశరంబుల నొప్పించి భుజశిఖరంబున బలునారసంబులు నాఁటించినం
జేతివిల్లు వడియెం బడుటకుఁ దలంకక యక్కర్ణుం డాక్షణంబ విల్లువుచ్చు
కొని వివ్వచ్చండు వెడంగుపడు నట్టి వేగంబున వివిధవిశిఖంబులు
నిగిడించిన.
7-5-114
మ. కడక న్నెఱ్ఱనిచెల్వుఁ దాల్ప నతఁ డగ్రస్ఫూర్తివిల్ ద్రుంచి యె
క్కుడువేగంబున సూతుమ స్తకముతోఁ గూడుం దురంగాంగముల్
గడికండంబులు సేసి యారథికు మై గాఁడంగ బెక్కమ్ము లే
యుడు నొవ్వారినఁ బాఱి యెక్కెఁ గృపుతే రుర్వీశ నిర్లజ్జుఁ డై.
7-5-115
వ. ఇవ్విధంబున రాధేయుం డోడి పాఱిన నీడంబోవు మనసైనికులం గనుం
గొని కురువిభుండు.
7-5-116
క. నిలుపుఁడు వెఱ పేటికి నేఁ
గలుగఁగ గాండీవిఁ దక్కుఁగలపాండవులన్
గెలిచెద నిదె చూడుఁడు నా
యలవుఁ జలము ననుచు నడచె నన్నరుమీఁదన్.
7-5-117
వ. అప్పుడు కృపాచార్యుం డాచార్యనందనున కి ట్లనియె
7-5-118
చ. శలభము వహ్నిమీఁదఁ జనుచందము గాదెనృపాలుఁ డర్జునుం
దలపడఁ బోక యాతని శితప్రదరంబులబారి కగ్గ మై
యెలసినఁ గావఁగా వశమె యీతని నీవును నేను నుండి మొ
క్కలమునఁ బోవనీఁ దగదు గ్రమ్మని నెయ్దుము నిల్పు మవ్విభున్.
7-5-119
క. అనుటయు గురునందనుఁ డ
మ్మనుజాధిపు నెయిది యేను మాన్చెద బీభ
త్సునికడఁక యెమి మూఁడినఁ
జనియెదు తలకడిచి సాహసక్రియ ననుడున్.
7-5-120
ఆ. గురుఁడు పాండవులకుఁ గూర్చి నీవును దాని
నెఱిఁగి బవరమున నుపేక్ష సేయు
దిది మదీయభాగ్యహీనత గాక నీ
వేచితేని నెవ్వ రెదురు సెపుము.
7-5-121
క. పలువురుబంధులు నాకై
పొలిసిరి మీ రింకఁ బాండుపుత్త్రుల దెస రా
వలవదు పాంచాలాదుల
వలన నిలిచి గెలువుఁ డేను వారల దీర్తున్.
7-5-122
వ. అవిస విని యశ్యత్థామ భూమిశ్వరున కిట్లనియె.
7-5-123
క. గురునకు నాకును బాండవు
లరయఁగఁ గూరిమికిఁ బాత్ర మగుదుర యైనన్
దురమునఁ జుట్టరికం బను
గరు సిడికొను టేల కలుగుఁ గౌరవనాథా.
7-5-124
ఉ. పెక్కురణఁబులం గనియుఁ బెద్దయు నమ్మవు నన్ను మద్గురుం
దక్కినవారు మేము విను దాఁపము ప్రాణము లోపినట్టు పే
రుక్కునఁ బోర దైవగతి యున్నటు లుండెడుఁ గాక పాండవుల్
మిక్కిలి వారు నీతలఁపు మే గెలువన్ వశమే మహీశ్వరా.
7-5-125
వ. మా కిరువురకుం దోడు కృపకర్ణకృతవర్మమద్రపతులు గల రెట్లును బాం
డవసై న్యంబు సమయింతు మూఱడు మని వెండియు.
7-5-126
తే. మమ్ము కాదు నీ వెవ్వరి నమ్మ వెట్లు
నమ్మకున్నను నే మగు నరవరెణ్య
ప్రతిబలంబులలోనికిఁ బసులనడుము
సొచ్చుపులివోలెఁ జొచ్చెదఁ జూడు నన్ను.