--వేదుల కృష్ణ

7-5-1

క. శ్రీధామలసదపాంగ

వ్యాధూతప్రణతదురితవర్గనిరోహ

ద్భోధాత్మకదేహా జగ

దాధారవిహారనిపుణ హరిహరనాథా.


7-5-2

వ. దేవ వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె న ట్లద్బతోదారం

బగు నరనారాయణుల విక్రమవిహారంబు విని వెఱఁ గంది యూంబికే

యుండ సంజయుదిక్కు మొగం బై.


7-5-3

క. ఇవ్విధమున సైంధవుఁ డా

కవ్వడిచేఁ బడిన పిదపఁ గౌరవు లెట్లై

రవ్వార్త సెప్పు మనవుడు

నవ్విభునకు నాతఁ డిట్లు లనియె నరేంద్రా.


7-5-4

వ. అట్లు పాండవబలంబులు పొంగి కడంగి కుంభసంభవుమీఁ దం గవిసి కయ్యంబు

సేసె నాసమయంబున నిక్కడ.


7-5-5

చ. కృవుఁ డును ద్రౌణియం గడగి క్రీడిపయిన్ శరవర్షముల్ మహో

గ్రపురభసంబునం గిరియఁ గా నవి మాన్చి యతండు వారలం

గుపితుఁ డు గాకయున్ విశిఖకోటుల నల్లన కప్పుపెల్లునం

గృపునిశరీర మొయ్య నొఱగెన్ రుధిరచ్యుతి మూర్ఛి నచ్చినన్.


7-5-6

వ. ఇట్లు క ృపాచార్యుండు రథుంబుమీఁ దం బడినఁ దత్సారథి దేరు దొలంగం

దోలుకొని పోయె నశ్వ్థతామయు నోహటించి తొలంగెఁ దక్కటిరథకులు

పైఁ బెట్టం జాలక యంతంత నిలిచి రట్లు శారద్వతుండు దనయమ్ముల

మూర్ఛిల్లుట సూచి సవ్యసాచి వగచె నప్పు డన్నరునిం గౌఁ గిలించుకొని

నారాయణుం డి ట్లనియె.


7-5-7

క. కురుబలముఁ దొడరి గెలువఁ గ

సురగణముల కైన నరిది శూరోత్తమ నీ

వురవడి గెలిచితి భాగ్య

స్ఫురణంబును బాహుబలముఁ బొగడం దగదే.


7-5-8

క. ఆవృద్ధక్షత్త్రుతపము

వావిరి నోర్వంగ నీకు వచ్చినటుల దు

ర్భావుఁ డగు కర్ణు నోర్వం

గా వచ్చివఁ గాదెఁ నాకుఁ గడుఁ బ్రీతి యగున్.


7-5-9

చ. ఆనవుడు నాతఁ డిట్లవు మహాత్మ భవత్కరుణం బ్రతిజ్ఞ యే

ను నెఱపఁ గంటిఁ బాండవమనోరథనిద్థి భవద్దయాసమృ

ద్థి నగుట వింతయే భవదధీనులకున్ విజయంబు బ్రాఁ తె నీ

పను పొనరించువారు మట భారమ నీయది గాదె యెప్పుడున్


7-5-10

కే. అనుడు నుద్గతమం దస్మితాస్యుఁ డగుచు

దనుజమర్దనుఁ డతనితో ధర్మతనయుఁ

గానఁ బోవంగ వలయు భాస్కరుఁ డు గ్రుంకు

చున్న వాఁ డని పలికిన నన్నరుండు.


7-5-11

వ. అట్లు కాక యనుటయుఁ గదిలి భీమసేనుండును సాత్యకియును యుధా

మన్యుండును ను త్తమౌజుండును సముచిత సల్లాపంబులు నేయుచుఁ దో

నేతేర సాంద్రళోణితపూరసేకంబున ఘోరం బైనసంగ్రామతంబునం జని

చని శౌరి సవ్యసాచి నాలోకించి.


7-5-12

చ. కరులు రథంబు లశ్వములు గాలుబలంబు చమూపతుల్ మహీ

శ్వరు లఖలాస్త్రశస్త్రములు చామరముల్ గొడుగుల్ సిడంబు లా

భరణము లిత్తెఱంగునను బార్థకడుం జెలువొందెఁ జాడ సం

కరమహిచిత్రవస్త్రమునఁ గప్పినచందముఁ దోఁ పఁ జేయుచున్.


7-5-13

వ. భవదీయబాహావిహావిహారంబు నుదారత్వం బిట్లుండునే యగ్గించుచు

నరిగి సమయోచితం బగుటయును బ్రతియోధులు ఱిచ్చవడి యునికిం

జేసియు సమరంబు సాలించి తమరాక కెదురుచూచుం గూడికొని

యున్నయుధష్ఠరాదుల సమీపం బగటయుం బాంచజన్యంబు పూరించినం

బాంజవాగ్రజుండు.


7-5-14

తే. రథము డిగ్గి హర్షాశ్రులు గ్రమ్ముదేర

నెదురుకొనుటయు సంభ్రమ మెసకమెసఁ గఁ

బార్థుఁ డును గేశవుండును బాదచారు

లై రయంబునఁ జని మ్రొక్కి రవ్విభునకు.


7-5-15

వ. ఇట్లు ప్రణమిల్లిన.


7-5-16

క. నరపతి యానందాశ్రులు

గరసరసిరుహముల నొత్తికను దనియఁ గ న

య్యిరువురఁ జూచుచు మేనులు

గరు పాఱఁ గ గ్రుచ్చి యొక్క కౌఁ గిటఁ జేర్చెన్.


7-5-17

వ. ఇవ్విధంబున నాలింగనంబు సేసి యర్జునుతో నిట్లనియె


7-5-18

క. చేనెత్తురు గాకుండం

గా నాసైంధవునిఁ జంపి క్రమ్మఱ మిరల్

రా నోచితి నాభాగ్యం

బేన పొగడునట్టి దయ్యె నీతనికరుణన్.


7-5-19

క. అని వాసుదేవుఁ జూపిన

విని యాతఁ డు నీదుకోపవేగుంబున ద

ర్జనుఁ నెవ్వరి కెట్లు సేయఁ జెల్లదె యనినన్.


7-5-20

వ. అమ్మహీపతి యమ్మహాత్ము నుద్దేశంచి


7-5-21

క. దేవసురసంఘంబులు

నీ వలిగిన రూ పడంగు నీకూరిమి సౌ

ఖ్యావహ మఖల జగములకు

దేవ భవద్భక్తు లరులఁ యరుదే.


7-5-22

వ. అని మఱియు ననేకప్రకారంబులం బ్రస్తుతించి భీష్మాదు లతనికతన

మడియుట యుగ్గడించి నీవు కోపించినట్టు వర్తంచుటఁ గౌరవులు నెడిర

కాఁ దలంచెద ననుటయు నచ్యుతుం డాభూపాలు నాలోకించి ధర్మో

త్కృష్టుండ వగునీకు నరిష్టం బాచరించినవారికిఁ జెజకుండ వచ్చునే

యనునెడ ననిలసుతుండును సాత్యకియును దనవులఁ గ్రొత్తగంట్లు

గొమరార నద్ధరణీపతిచరణంబులకుఁ బ్రణతు లైన నతం డెత్తి కౌఁ గ

లించుకొని వారలు కుంభసంభవకృతవర్మాదులసంరంభంబు మర్దించుట

పెర్కొని యభినందించె నుచితవచనంబుల సంభావించెఁ దదీయసైన్యం

బెల్లను బ్రమోదభరితం బై కయ్యంబునకుం గాలుద్రవ్వుచుండె వాసమ

యంబున శోకవిస్మయవివశుం డగుచు దుర్యోధనం డంతర్గతంబున.


7-5-23

ఉ. ద్రోణుఁ డు గర్ణుఁ డుం గృపుఁ డు ద్రోణసుతుండును నేల వాని గీ

ర్వాణులకై ననుం జెనయవచ్చునె యెవ్వరు నాజిఁ గౌరవ

త్రాణపరాయణత్వమున దర్రము సూపఁ గ లోమి దెల్ల మ

క్షీణపరాక్రముం డయిన క్రీడికి నిక్కవుటల్క వచ్చినన్.


7-5-24

వ. అనుచు నుత్సాహరహితం జైనచిత్తం బుత్తలపడఁ గుంభసంభవుపాలికిం

బోయి వరులజయంబును దమవారు సమయుటయు నుగ్గడించి

మఱియును.


7-5-25

సీ. బల్లిదుఁ డగుభీష్ముఁ బడ వై చి సోదరవర్గంబుఁ దాను ననర్గళముగఁ

గ్రాలెడు నేచి శఖండి యింతకు మున్న పొలిసె నేడక్షౌహిణులు గిరీటి

చేతసైంధవుపాటు సెప్ప జిట్టలు నాకుఁ బూని యేతెంచి కాంభోజనిభుఁ డు

జలసంధుఁ డును సుదర్శనుఁ డును లోనుగాఁ గలుగు భూపతులు పెక్కండ్ర నేఁ డు


తే. గలనఁ గూలిరి వీరిలోకంబ యైన

నొండెఁ బాంచాలబలమును బాండవులను

దండినై తెగఁ జూచిన నొండెఁ గాక

యెట్లు వాయు నాకిందఱఋణము సెపుమ


7-5-26

క. నరుఁ డనుణ గుబంటు గావునఁ

బొరిగొనఁ జొర వీవు సూతపుత్రుఁ డొకఁ డ మా

ర్తుర మార్కొనియెడు నతనికి

వెరవును గఱతలును లేవు వీరుడగుటన్.


7-5-27

వ. అతఁ డునుం బోరి పోరి చేడ్పడి సైంధవుం గోలుపోయె ననవుడుఁ గటగటం

బడి యాచార్యుం డతని కి ట్లనియె.


7-5-28

చ. నను మది దూఁ టు వోవువచనంబుల నేటికి నిట్లు నొంప న

ర్జునునిజయింపరామి పలుచోటులఁ జేప్పనె దేవకోటికై

నను నవిజయ్యు భీష్ముఁ బ్రథనంబున నాతఁ డు సంపఁ గౌరవుల్

మన రని తోఁ చి నాకు నభిమానముఁ గాచుటకై పెనం గెదన్.


7-5-29

ఆ. శకునిచేతి యడ్డసాళ్లులు నేఁ డు గాం

డీవముక్తబహుపటిష్ఠబాణ

మూర్తిఁ గవిసి నీకు నార్తి యొనర్పంగ

నాఁ గ గొనఁ గ నెట్టు లగుఁ గుమార.


7-5-30

క. భూరమణ విదురుఁ డమ్మెయి

వారింపఁ గ నతులపుణ్యవతిఁ గృష్ణను మీ

వారెల్లఁ జూడఁ బఱచిన

క్రూరపుఁ బాపంబు ఫలంబు గుడపక యున్నే.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_7_5_1_to_7_5_30&oldid=3219" నుండి వెలికితీశారు