ఆ భా 7 5 151 to 7 5 180
--ప్రకాశ్ స్వామినాథన్
7_5_151
క. ఆలోనన తెలిసి మెఱుఁగు
వాలికనారసము దైత్యువక్షమున వెసం
గీలించిన నరదముపై
సోలి పడుడుఁ దేరు దొలఁగ సూతుఁడు దోలెన్.
7_5_152
క. భీముఁడుఁ గురుపతియు శర
స్తోమము లొండొరుల మీఁదఁ దొరఁగించుచు ను
ద్దామాంభోదపిహితరవి
సోములచందమున నొప్పుచుం బోరునెడన్.
7_5_153
చ. ధనువు సిడంబుఁ ద్రుంచి సముదగ్రత భీముఁడు మేను నొంప న
మ్మనుజవిభుండు వేఱొకసమగ్రబలం బగుచాప మెత్తియా
యనమెయిఁ గాఁడ విల్ విఱుగునట్లుగ నేసిన నొండువింట న
య్యనిలజుఁ డేడునారసము లానృపుగాత్రమునందుఁ గ్రుచ్చుచున్.
7_5_154
చ. విలు దునుమాడి వెండియును విందులు నాల్గతఁ డెత్త నెత్తను
త్తలముగఁ ద్రుంచివైచె గదఁ దత్తురగంబుల సూతుఁ జావ న
గ్గల మగుభీతి రాజు దొలఁగన్ వెస దాఁటుడుఁ గాన కాతడుంఁ
బొలిసెనకాఁ దలంచి మదిఁ బొంగి వృకోదరుఁ డార్చె నార్చినన్.
7_5_155
వ. మనమూఁకలు నట్లకాఁ దలంచి హాహాకారంబులతో నాకులతం బొందె
నందలిజనంబులు ప్రమదంబునం జెలంగి రక్కౌరవేంద్రుండు వేఱొక్కతే
రెక్కి తోఁచినం గని యెల్లవారును డిందుపడిరి కర్ణసహదేవులు సముదీర్ణ
విక్రమంబు వెలయం బెనంగునప్పుడు.
7_5_156
క. అమ్మాద్రీసుతుఁ డేవునఁ
దొమ్మిదివాలమ్ము లొడలఁ దూర్చిన నతిరో
షమ్మునఁ గర్ణుండు దదం
గమ్ములు నొప్పించెఁ దీవ్రకాండశతమునన్.
7_5_157
వ. ఇట్లు సహదేవుం బొదివి రాధేయుండు.
7_5_158
చ. రయమున విల్లు ద్రుంచినఁ బరాక్రమమ మొండొకవింటఁ జేయఁగా
హయముల సూతుఁ జంపుటయు నాతఁడు ఖడ్గము ఖేటకంబు ని
ర్భయముగఁ బుచ్చుకొన్న బహుబాణములం దునుమాడె నన్యదు
ర్జయ మగులావునం గడువెసన్ గదవైవ నడంచె నవ్వుచున్.
7_5_159
వ. దానం బెండువడక యప్పాండునందనుండు.
-: కర్ణుఁడు సహదేవుని వింటికోపునం బొడుచుచు నవమానించుట :-
7_5_160
ఆ. శక్తివైవనిశితచక్రంబు నిగిడింప
వరుస నదియు నిదియు వ్రయ్య లయ్యుఁ
దునియ లయ్యు నేలఁ దొరగంగఁ జేసి పె
ల్లేసి తెరలుటయును నెయ్దె నతఁడు.
7_5_161
వ. ఇత్తెఱంగునఁ గర్ణుండు గదిసి నిశ్చేష్టితుం డగుసహదేవు నాలోకించి కుంతిమాటలు దలంచి యొండు సేయ నొల్లక యల్లన వింటికోపునం గడుపువొడిచి నవ్వుచు నెక్కు డైనపగఱ నుక్కునం దలపడకు మల్లవాఁడెనరుండు గురుసేనతోడ బిరుదై పెనంగెడు నతనికడకుం బొమ్మని పలికిపోయె నక్కుమారుండును నట్లు గర్ణునేటులను మాటలను గడునొచ్చితనబ్రదుకునకు రోయుచుం బోయి వేఱొక్కరథం బెక్కె మత్స్యముద్రేశ్వ రులు జంభావాసవుల చందంబున సమరంబు సేయుసమయంబున నాశల్యుండు.
7_5_162
క. హరులను సూతునిఁ జంపిన
విరటుఁడు పొలివోక వివిధవిశిఖచయంబుల్
గురియ శతానీకుఁడు శ
ల్యురథం బస్త్రములఁ బొదివె నుద్ధతభంగిన్.
7_5_163
వ. ఇట్లు మత్స్యానుజుండు దాఁకిన.
7_5_164
తే. అతనిఁ గూల్చె మదేశ్రుఁడయ్యరద మెక్కి
విరటుఁ డడలును గినుకయుఁ బిరి గొనంగ
ముట్టె నాతని నాతండు మూర్ఛ వోవ
నేయ సారథి దొలగంగ నెగచె రథము.
7_5_165
వ. ఇవ్విధంబున విరటుండు వికలుం డగుటయు నాచక్కటిసైన్యంబు శల్యునురవడికిం గాక తెరలినం దఱిమి ధనంజయుండు నిలుపరించిన బలాఢ్యుం డగు నలంబసుం డతనిమేన మార్గణంబులు గ్రుచ్చి పేర్చిన నప్పాండవమధ్యముండు.
7_5_166
ఉ. చాపముఁ గేతువుం దునిమి సారథి నశ్వములన్ వధింప ను
త్కోపవికారుఁడై యసుర క్రూరకృపాణము గొన్న నేసె ను
గ్గైపృథివీస్థలిం దొరఁగున ట్లలయించి చతుశ్శతిన్ సమా
టోపము సూప నాతఁడు గడున్ వెసఁ బాఱె భయార్తమూర్తియై.
7_5_167
సీ. నకులనందనుఁడు నీనందనుతోఁ బోరునెడ నాశతానీకుఁ డేచి యతని
కంకట మంగంబు గ్రక్కునఁ బాసి పోఁబడ నేసి విల్లును సిడముఁ ద్రుంప
దలఁకక యొండుకోదండంబు గొని నీదుపుత్త్రుండు నొంప నా చిత్రసేను
శరముల కోర్చితత్తురగంబులను సూతు ధరఁ గూల్చె వెస భవత్పౌత్త్రుఁడపుడు
తే. గలఁక లేక యతండు శీఘ్రమున నిరువ
దేనుదూపుల నొంచిన నెసక మెసఁగఁ
గనుక నాతఁ డాధనువును దునుదు నక్కు
మారుఁ డేఁగె హార్దిక్యుని తేరిపైకి.
7_5_168
క. ద్రుపదుడు వృషసేనుండును
నుపమానాతీతఘోరయుద్ధంబున బా
ణపరీతశోణితప్లుత
వపురుజ్జ్వలులైరి కౌరవక్షితినాథా.
7_5_169
వ. అట్టియెడ నాకర్ణుపట్టిచేయి బెట్టిదం బయి నచ్చినం బాంచాలబలంబు నిజ
పతికిం దలకడచి యతనిం బొదవి యాసైనికోత్తము నంపసేన కోటఱి
పఱచినం బ్రదీప్తుండై యతండు మెఱసె దుశ్శాసనుండు ధర్మనందన
నందనుండును బోరినెడ నప్పాండుపౌత్త్రుం డతనిపాలంబున వాలికనార
సంబులు మూఁడు నాటించినం ద్రిశిఖరయుతశైలంబులీల నయ్యువరా
జొప్పి యవ్వీరుం గ్రూరశరంబులం గప్పి కేతుసారథిరథంబులఁ దిలప్రమాణశకలంబులు సేసిన.
7_5_170
క. వింధ్యాద్రివోలె నాప్రతి
వింధ్యుం డచలితోగ్రమూర్తి వెలయ నిలిచి ద
ర్పాంధ్యమతి నడరి దీప్తా
వంధ్యాస్త్రము లక్కుమారవరుపైఁ బఱపెన్.
7_5_171
ఆ. అడిగి వెడఁద వాతియమ్మున నాతని
ధనువుఁ దునియ నేసి తనువునందు
నిశితవిశిఖచయము నిగిడించె నీకొడు
కంతఁ దత్సహోదరాళి గదిసి.
7_5_172
వ. కయ్యంబు సేయ నందు భీమసేననందనుం డగుశ్రుతసోము నరదం బయ్యు
ధిష్ఠిరతనయుం డెక్కి యొక్కనముద్దండం బగికోదండంబు వుచ్చికొని
భండనంబు సేసె మనవారు నయ్యువరాజున కడ్డంబుసొచ్చి పెనంగిరి నకు
లుండును శకునియు సమానవిక్రమంబుల సమరంబు సేయునెడ నా
సౌబలుండు.
7_5_173
చ. ఒకబలుతూ పురంబు గొని యుచ్చి చనం గర మల్లి యేయుడున్
నకులుఁడు మూర్ఛ వోవుటయు నాదము రోదసి నిండ నార్చె నం
తకుఁ దెలి వొంది చాపముఁ బతాకయుఁ ద్రుంచి యతండు నీమఱం
దికి నరసా వొనర్చి ఘనతీవ్రసముజ్జ్వలమార్గణంబులన్.
7_5_174
వ. ఇట్లు గాంధారపతి పడుటయుఁ దత్సారథి దేరు దొలంగఁ దోలుకొని
పోయెఁ గృపాచార్యుతోడ రణక్రీడఁ జలుపుచుండ శిఖండికోదండంబు
బిసకాండంబుగా ఖండించి యతండు శక్తివైవనదియును దునిమిన ఘనం
బగుధనువు గొని తోరంపునారసంబున నతనిం దేరిపై సొగయ నేసి యగ్గౌ
తముండు గోపంబునం జంపఁ దలం పెత్తి వెండియు నేయ నిగుడునంతకు
వద్దెసయోధులు పలువు రొక్కట నుక్కున నురువడించిన మనదిక్కుసైని
కులు శారద్వతుం గడచి కడిమి నెఱయఁ బోరిరి మఱియు ననేకద్వంద్వ
యుద్ధంబులు సెల్లుచుండ సంకులసమరం బయ్యె నయ్యవసరంబున.
7_5_175
సీ. ఏచి ధృష్టద్యుమ్నుఁ డాచార్యునురమున వెస నాఁటెనైదునారసము లాతఁ
డాతని నిరువదేనమ్మల నొంచి విల్ దునిమిన నొండువిల్ గొని యతండు
మంటలు గ్రమ్మెడు మహితాస్త్ర మేయుడుఁ గాలంబు గాకిదికలశజునకు
ననుచు నీవారు భయం బంద నేకాదశాస్త్రంబు లొకముష్టి నలవరించి
తే .యేసి కర్ణుండు దునియలు సేసె నడుమ
నంతఁ గురురాజు యువరాజు నడర గురుసు
తుండు శకునియు శల్యుండుఁ దోడుపడిరి
వార లేడ్వురతాఁకు నవ్వీరుఁ డోర్చె.
7_5_176
క. ద్రుమసేనుఁ డడరి పటుబా
ణము లుద్దతిఁ బఱపె సూతనందనుపైఁ గో
పము గదిరి యతఁడు వానిశి
రము గుండలదీప్తమై ధరం బడ నేసెన్.
7_5_177
వ. ఇట్లు ద్రుమసేనుండు నచ్చినం బేర్చినకోపంబునం గర్ణుకోదండంబు దునిమి
ధృష్టద్యుమ్నుండు నఱిమిన నొండుబలువింటం బెనంగునతనిం గూడుకొని
కురురాజు మొదలగు నేగురురథికులు పెలుచ నేని రాసమయంబున సాత్యకి
సమదగతిం గవిసి నిలు నిలు మని యదల్చి రాధేయుం దలపడియె నయ్యి
రువుర యుక్కును నొక్కరూపున నక్కజంబై యుండె నట్టియెడ వృష
సేనుండు వచ్చిశైనేయు నేయుటయు నతండు వాలమ్ములు నిగిడించి
వానిం దేరిపయిం ద్రెళ్లి మూర్ఛిల్లం జేసినం బుత్రశోకపీడితుం డగుసూత
పుత్త్రుఁ డచ్యుతానుజు నానాస్త్రపీడితుం గావించె నంతకుం దెలిసి తనయుం
డునుం దోడుపడియె నట్లడరునయ్యద్దఱ నాశినివరుండు గినుక యెక్కిన
యేడ్తెఱం జిక్కు వఱిచె నప్పుడు గాండీవగుణ దేవదత్తమహారానంబును
మహాకారంబున వీతెంచిన నయ్యంగరాజు రారాజున కిట్లనియె.
-: కర్ణదుర్యోధనులు దురాలోచన సేసి సాత్యకిం దలపడుట :-
7_5_178
క. అదె పార్థుఁడు దనమునుమున
కొదవినసేనలఁ గలంచునులి వతఁ డితనిం
గదియఁగ రాకుండగ మును
పొదువుదమే సాత్యకిం బ్రభూతబలముతోన్.
7_5_179
వ. అట్లయినవీఁ డభిమన్యుపోయునపోకం బోవునదినీకు విజయంబునకుఁ గార
ణం బగు వీనిం బలువురు సుట్టముట్టుట యెఱింగెసేని వివ్వచ్చుండు వచ్చు
నతం డెఱుంగకుండ నక్కడ నిలువరించి పోరం జాలుజిల్లిదుల నట పుచ్చ
వలయు ననుటయు నమ్మనుజవిభుం డిది లెస్సకర్జం బని గాంధారపతిం
గనుంగొని నీవు పదివేలేనుంగులు నన్నియరందంబులుం గొని దుశ్శాసన
సుబాహుదుష్ప్రధర్షణదుర్విషహులు దోడుగాఁ గ్రీడిపై నడచి కయ్యంబు
సేయు మద్దిక్కునం దక్కిన పాండవులు నున్నవా రయ్యన్నదమ్ములం
బొదివి గెలువు మనిన నతం డమ్మెయికిం జనియెఁ దదనంతరంబ.
7_5_180
క. చేయ గలరథికులును రా
ధేయుఁడు బలయుతము గాఁగఁ దెప్పదెరలశై
నేయుపయిఁ గవిసి బహువిధ
సాయకములు గురిసి రధికసంరంభమునన్.