7_2_331 వ. అని యనేక ప్రకారంబులం బలికె నప్పు డగ్గోవిందుం గనుంగొనుట నుత్కటంబయిన శోకంబున సుభద్ర యాకలతం బొంది.

7_2_332 ఉ. అక్కట పుత్ర నిన్నుఁ గనినంతియ పుణ్మమ కాని నాకు నీ వెక్కుడు భక్తి సేసి నను నెప్పుడు నారయ నీ కుమారకు ల్మక్కువ నాకడం దిరుగ లాలన సేయుచు నుండునట్టి యా మిక్కిలి నోము లేద యిటమీఁదికి నెవ్వరు దిక్కు సెప్పుమా.

7_2_333 ఉ. బాలుఁడ వైననీ వరిదిబంటు తనంబునఁ బ్రౌఢ వీర భూ పాలురఁ గుంభజ ప్రభృతి బాహు బలాఢ్యులఁ గిట్టి నేలకుం గోలకుఁ దెచ్చి యి ట్లగుటకున్ వెఱఁగందుచు వంతఁ బొందుచున్ లోలతఁ జూడ కున్నె జనలోకము నీదగు రూపు రేఖయున్.

7_2_334 తే. మేను మృదుశయ్య సగము నా మేని మీఁద సగము గాఁ జేర్చుకొని ముద్దు మిగుల నిద్ర సేయు నట్టి నీ విప్పుడు చెనఁటి నేలఁ దనువు వొందుట కోర్చితె తండ్రి చెపుమ.

7_2_335 క. వంది జనంబులు మాగధ బృందంబులు సంస్తుతింపఁ బెంపొందుదు మ్రో లం దిరిగెడు క్రవ్యాదుల క్రందున నీ వీను లిపుడు కటకటఁ బడవే.

7_2_336 చ. అనిల తనూజులావు గలఁ డందురు సాత్యకి శౌర్యశాలి నాఁ జను ద్రుపదుండు సంగర విశారద భావము పూని యుండు మా త్స్యుని బటు విక్రమాఢ్యుఁ డని చూతురు పాండవు లింద ఱుండి యొ క్కనికిఁ గడంగఁ లేర నినుఁ గావఁగ నే మన నేర్తుఁ బుత్రకా.

7_2_337 సీ. ఈ లోక మెల్లఁ బాడిల్లును బోలె నై యున్నది నీవు లేకునికిఁ జేసి నీవు వేగమ గండు నెరసి బంధులఁ బ్రీతి బొంద జేయుట గలవోలె నయ్యె జిష్ణుని కొడుకవు కృష్ణు నల్లుండ వీ వరులచేఁ బడుట చోద్యంబు గాదె చెలువంపు మేనును జెన్ను మొగంబు నై యెప్పుడు పొడ సూపె దింకఁ గుఱ్ఱ

తే. యకట యుత్తర యొప్పెడునది మనంబు దీని కెంతయు మెత్తన యేను నిన్ను వేఁడికొనియెద వచ్చి యివ్వెలఁది వంత దీపి దళుకొత్తు పలుకులఁ కులఁ దేప్ర వన్న.

7_2_338 ఉ. అలఘు తపంబులం బ్రకట యాగములన్ మునిచోదిత వ్రతం బుల మహనీయ దానములఁ బుణ్య చరిత్రములన్ మహాత్ము లెం తలు రమణీయ విశ్రుత పదంబుల కేఁగుదు రంతకంటె ను జ్జ్వల మగు సద్గతిం బడయు వాసవపౌత్ర పవిత్ర వర్తనా.

7_2_339 వ. అని బహు ప్రరారంబులం బలవించుచున్న సమయంబునం బాంచాలి యేతెంచి యిరుగేల నుత్తరా సుభద్రులం బొదివి తానును వారును నడలూని పుడమిం బడి వివశతం బొంది వికలాక్రందనంబు సేయుచున్న నన్నారాయణుండును శోక సంతాపితాంతః కరణుం డగచు నుచిత వచనంబుల నయ్యువిదల శోకంబు దొలగఁ నెట్టకేలకు మారార్చి మగుడి పాండవుల పాలికిం జనుదెంచె నప్పుడు ధర్మతనయుం డమ్మాధవ ధనంజయులను భీమసేనునిం గవలను నిత పరిజనంబులను నిజ నివాసంబులకుం బోవం బనిచి తాను నభ్యంతర మందిరంబునకు నరిగె గృష్ణుండును జిష్ణుతోన తదీయ సదనంబనకుం జని విమల జలంబులం గృతాచమనుం డయు యొక్క వివిక్త ప్రదేశంబున దర్భశయ్య గావించి దాని నక్షత గంధ పుష్పంబుల నలంకరించి యాయుధంబు లర్చించి చుట్టు నిడి కవ్వడి నందుండు మని నియోగించి నీవు నిశా సమయంబునం జేయు దేవపుజ యింతకు మున్న చేయ వని తలంపించిన నతండును బాద ప్రక్షాళనంబు నుపస్పర్శనంబును నాచరించి తాను నిత్యంబును నడపుత్య్రంబక పూజనంబు తెఱంగున మాన్యాను లేపన ధూప దీప నైవేద్యంబు జనార్దనునకు సమర్పించిన నమ్మహాత్ముండు సంభావించి యాప్తులగు దౌవీరిక జనంబుల శస్త్రబస్తు లై కాచికొని యుండునట్లుగా సంఘటించి యా సవ్యసాచిం జూచి నీవు సుఖ నిద్ర సేయు మేన నీకు శుభంబు గోరియుండెదఁ బోయి వచ్చెద నని పలికి దారుకుండు దోడ నరుగ నాత్మ గేహంబునకుం బోయి.

7_2_340 ఆ. సెజ్జయందు మేను సేర్చి యర్జన కౌర్య చింతఁ బలుక కుండి కొంతవడికిఁ బవ్వళించెఁ గృరు నృపాలక జలశాయు దారుకుండు గొలిచి యారకుండ.

7_2_341 వ. ఆ సమయంబున నవ్వీటి వారెల్లను దమ యుల్లంబుల నెవ్వగలు నివ్వటిల్లం గన్ను మూయక విన్న నయి యుండి.

7_2_342 సీ. అభిమన్యుఁ డీల్గిన నర్జునుఁ డధిక శోకావేశ మొంది సాహసిక వృత్తి నతి దుర్ఘటం బైన ప్రతిన యిట్టులు వట్టునే కౌరవులు దీని నెట్టు లైనఁ దప్పింపఁ జూతురు దర్పంబు వెరవును గలవారు వారి కగ్గలము గలరు కడు దెప్పరంబైన కార్యంబు వాటిల్లె నెమ్మెయి నిది నిర్వహించు వాఁడో

ఆ. యకట దిములోన నా సైంధవునిఁ జంప నబ్బకున్న నతని కగ్ని సొరఁగ వలయు నాతఁ డనృత వాదిగాఁ డిక్కార్య మెట్టలు లగునొ మనకు నేది గతియొ.

7_2_343 వ. అని వెండియు.

7_2_344 క. మన చేసిన సుకృతంబుల వినుత ఫలము లెల్ల నెల్లి వివ్వచ్చుఁడు సిం ధు నరేంద్రుఁ జంపునట్లుగ నొనరి యొదవ వలయు నని దృఢోక్తిఁ బలుకుచున్.

7_2_345 ఆ. అగ్ర పుస్తకంబు లర్చించి చూచుచుఁ బరమ నియతిమై నుపశ్రుతులకు బోవుచును శుభంబు లావహించుటఁ గాంచి చెలఁగి యొండొరులకుఁ జెప్పికొనుచు.

7_2_346 క. గురు నట్టి వారు పది వే వురు గాచిన నెల్లి సైంధవుని బగలిటిలోఁ బొరిగొనునట్లుగ నరునకు వర మీండీ వేల్పలార వారని కరుణన్.

7_2_347 వ. అని ప్రార్థించుచు దైవంబుల కేటికోళ్ళు నిరూపించును మఱియు బహు ప్రకారంబులం బలుకు చుండిరి రాత్రి సాలం జనిన మేలుకని దామోదరుండు దారకు నాలోకించి.

- శ్రీ కృష్ణుండు దారుకుతో నర్జును ప్రతిజ్ఞా విషయంబు లైన వాక్యంబులం గొన్ని సెప్పుట – సం. 7-56-27

7_2_348 చ. నరుఁ డిటు లాడునే నృప గణంబు వినంగ జయుంప వచ్చునే గురుకురు సైనలం దరణి గ్రుంకకమున్న తలంపఁ జాల దు స్తర మిది యాతఁ డీ ప్రతిన దప్పక యుండఁగఁ దీర్చునట్లుగాఁ బొరయక యున్న దుర్ధశలఁ బొందనె పాయని నిందఁ గుందనే.

7_2_349 క. కడుఁ గూర్తుఁ గవ్వడికి న య్యొడలు గలుగ నేను బ్రదికి యుండుదుఁ గా కె క్కడు బ్రదుకు నాకు నాతం డెడలిన నప్పార్థుఁ గాతు నెల్ల విధములన్.

7_2_350 క. నాలో సగ మర్జునుఁ డే నాలమునం దతని కగుట యరుదే యెమ్మై వ్రాలెదెనో రిపు లెట్టులు గూలెదరో చూడు నాకుఁ గురుబల మెదురే.

7_2_351 తే. ఎల్లి సచరాచరము లు నెల్ల భూత ములును నాదగు నేర్పును బలముఁ బాండు తనయులకు నేను గూర్చుటయును నెఱుంగ వలయు దారక యేచెదఁ గలని లోన.

7_2_352 క. ఇనుఁ డస్తమింప కుండఁగ మును సైంధవుఁ జంపువాఁడ మునుకొని పరు లే చినఁ జిత్రవధ విహాహం బున నప్పుడు రౌద్ర రసము పొడ వేర్పఱతున్.

7_2_353 ఉ. సైంధవుఁ డొక్కఁ డేల యనిఁ జావక పోవఁగ నేర్తు రెట్లు గ ర్వాంధుఁడు గౌరవేశ్వరుఁడు నందఱు దమ్ములు నెల్ల మిత్త్రులున్ బంధులుఁ దోడు వచ్చిన నృపాలురుఁ బాండవకీర్తి సర్వ ది క్సింధుర దంతకాండములఁ జెందఁగఁ జేయుట కేను బూనఁగన్.

7_2_354 వ. అది క్రమంబునం జూచెద వెల్లి నీవు మనయరదంబు వన్ని శైబ్యసుగ్రీవ మేఘ పుష్పవలాహకంబులను గనక మణి మాలీకాలంకృతంబులం జేసి పూన్చి గరుడ ధ్వజంబు సంఘటించి చక్ర గదా శార్ఞ్గ ప్రముఖాస్త్ర శస్త్రంబులు దగు తెఱంగున నునిచికొని మైమఱువు దొడిగి రమ్ము పాంచజన్య రవం బాకర్ణించినప్పుడ వేగంబు యెయిదికొను మనిన విని దారుకుండు.

7_2_355 చ. అలఘు విచార యట్ల తగు నప్పని సేసెద నంత సేయఁగా వలయునె యెవ్వ రక్కడ నవార్యులు గ్రీడికి సారథిత్వముం దలకొని నీ వనూన శుభదం బగు వర్తన మాచరింప నీ నిలుపును బార్థుచాలుటయు నేఁడు గదా భువనం బెఱింగెడున్.

7_2_356 వ. అని సవినయంబుగాఁ బలికి దనుజమర్దనుతమకంబు వారించె నంతఁ పాంచజన్య రవాభిజ్ఞానంబ సవిశేషంబుగా నతనిచేత వినికొని తత్కాలంబున నాలంబులోనికి నరదంబు గొని వచ్చెద ననియె వెండియు వాసుదేవుండు సూతునితోడ సముచిత సల్లాపంబులు సేయుచుండె నంత నిట బీభత్సుండు ప్రతిజ్ఞోత్సాహంబు నిర్వహించు తెఱంగు దలంచుచు దామోదర కృత స్థలండిల శయనంబున నుండి శోక నిద్రా వివశుం డయ్యె నయ్యవసరంబునం గలలోనం గృష్ణు డతని పాలికిం బోయిన నాతండు భక్తిం బ్రత్యుత్థానంబు సేసి తనయున్న సెజ్జ యిచ్చి తొలంగి నిలుచుండ నమ్మురారి యాసీనుండై యుండి యతని కిట్లనియె.

7_2_357 క. వగపున కెడ యీకుము నె వ్వగఁ గుందిన మానవుండు వైరుల చేతం దెగుఁ గాని తనదు కార్యముఁ దగ నొనరింపంగ లేఁడు తగునే వగవన్.

7_2_358 వ. అనిన విని యతం డతని కిట్లనియె.

7_2_359 క. వగ పింక నెన్నఁటికి దెగు మిగిలి ప్రతిన పూరగింప మేకొని చనునా మగఁటిమి లావు మాన్చుట తగవే గురునకు నతండు దానికిఁ బూనన్.

7_2_360 క. ఇన తనయ సహిత మడ్డము ననుదెంచు జనంబు పెల్లు సైంధవుఁడు బలం బున కెల్ల వెనుక మనికియు మనముఁ దలపోయు వగపు మానునె నాకున్.


http://www.volamsite.com