- అభిమన్యు దుశ్శాసన సుతు లిరువురుఁ జచ్చుట – సం. 7-48-8

7_2_151 వ. అనిన సాత్యవతేయునకుం గౌంతేయాగ్రజు డిట్లనియె.

7_2_152 చ. వెరవును లావును గలిగి విక్రమసంపద నొప్పి ధీరు లై పరగిర కాని తమ్ము మృత భావ వికారము వొందకుండ సు స్థిరముగఁ బ్రాణరక్షణము సేయఁగ రాజులు సాల రై రె యె వ్వరుఁ దలపోయ మృత్యు వనివార్యమె తాపస ముఖ్య యిమ్మెయిన్.

7_2_153 వ. అనుటయుఁ బారశర్యుంజు పాండవాగ్రజున కిట్లనుఁ దొల్లి యిట్లు పుత్రమరణ శోకాతురుండైన యకంపనుం డను రాజు నారమ మునిచేత మృత్యు ప్రకారంబు దెల్లంబుగా విని యుపశమిత శోకుండయ్యె నని విందు మయ్యితిహాసంబు తెఱం గెఱింగించెద నది నీ యంతఃకరణంబు సంతాపంబు మాన్చి శాంతి యొనర్చు నవహితుండ వై యాకర్ణింపుము.

7_2_154 సీ. పగతు రకంపనువై నెత్తి వచ్చి కయ్యము సేసి యాతని నడఁగఁ బట్టి కొనుటయుఁ జూచి తత్తనయుండు హరి యనువాఁడు దోర్ధర్ప దుర్వారమూర్తి యవ్విరోధుల మీఁద నడరి బల్విడిఁ దండ్రి విడిపించి విక్రమ విహరణమునఁ దనివోక మఱియు నుద్ధతిఁ గరి రథ ఘోట భట నికాయంబుల బడలు బఱుప

ఆ. నుగ్రులగు ననేక యోధులు చలమునఁ గూడుకొని మహాస్త్ర ఘోర శస్త్ర తతుల నక్కుమారు మృతుఁ జేసి రప్పుడు గనలి రభసమున నకంపనుండు.

7_2_155 క. విపినంబు నడఁచు దవశిఖి కుప మాస్థాన మయి పగఱయొప్పు సెఱచి యా త్మపురమ్ము సొత్తెంచెం దూ ర్య పటుధ్వను లెసఁగ ననిమిషాధిపు భంగిన్.

7_2_156 వ. ఇట్లు గెలిచి వచ్చియు.

7_2_157 ఆ. పుత్రుఁ దలఁచి తలఁచి పొగులుచు నున్న య న్నర వరేణ్యు కడకు నారదుండు నెమ్మి వచ్చుడయును నిభృతుఁ డై యాసనా ర్ఘ్యాది పూజనంబు లాచరించి.

7_2_158 వ. అతని కడనుండి యమ్మహీపతి యత్తాపస ముఖ్యునకు నిజ వృత్తాంతం బెఱింగించి కొడుకు గుణంబు లుగ్గించి వానిం గోలుపోవుటం జేసి విజయంబు ప్రియంబు సేయ కున్న దని తన వగపును దెలిపి మఱియును.

7_2_159 క. ముని నాయక మృత్యువు ప్రభు వని విందుము లోకమునకు నది యెట్లొకొ త జ్జననంబుఁ దత్ప్రభావము వినఁ దలఁచెద నుచితమేని వినిపింపు తగన్.

- నారదుఁ డకంపనునకు మృత్యుదేవతా ప్రభావం బెఱింగించుట – సం. ఆను-1-8-67 పంక్తి

7_2_160 వ. అనిన విని యమ్మాహాత్ముండు గరుణాయ చిత్తుం డై యతని కిట్లను బంధు మరణ శోకం బుడుపం జాలెడు మృత్యు ప్రకార కథ వినుట మోలు నీవవధాన పరుండవై వినుము సెప్పెదం బ్రజాపతి ప్రజల సృజియించి పదంపడి సంహారంబు లేమిం జేసి భూమికిఁ దదీయ భారంబు దుర్భరం బగుటయు ననుసంధించి చింతాక్రాంతుండై తత్సంహారంబునకు నుపకరణంబు జనియించి యెల్ల దిక్కులం బరఁగి చరాచరాత్మకం బైన భూత వ్రాతంబు దహింపం గడంగుటయు భువన హితార్థంబుగా భవుండు సని కమల భవు శరణు సొచ్చినం బ్రజ్వరిల్లుచున్న యమ్మహానుభావుం డద్దేవు నాలోకించి యాదర భరీతాంతః కరణుం డై.

7_2_161 క. నీ కోరికి యప్రతిహత మే కార్యము గొరి వచ్చి తెఱిఁగింపు మమే యాకార కామహర యది సేకొని యీక్షణమ యేను జేసెద ననుడున్.

7_2_162 ఆ. ఆ భవుఁ డిట్టు లనియె నఖిల సృష్టీ క్రియా కర్త వగుట నీవ కలుగఁ జేయఁ గలిగి భూతకోటి యెలమిఁ బొందఁగఁ గోప మెత్తి రూపుమాప నేల యిపుడు.

7_2_163 వ. నాకుం గా లోకంబుల గరుణాలోకంబున నావరింపు మనిన విని యంబుజాసనుండు నా యందుఁ గోపంబును గామంబును లేవు వినుము ప్రజాభార పీడిత యైన భూమిదేవి దన డప్పి యెఱింగించినం దదీయ హితంబు సేయంబూని సంహారంబు గావించు వాఁడ నై దానికి నుపాయంబు విచారించి యెద్దియుం గాన నైతి నది గారణంబుగా నన్నుఁ గ్రోధంబు వొందె ననవుడు భూతనాథుండు.

7_2_164 చ. అనఘ విచార నీ వరయు మన్నఁ దగం గడు నిష్ఠ లోకపా లన మొనరింతుఁ గాన యనలం బయి నీదగు నల్క లోక ము న్మును మిడి కాల్పఁ జొచ్చినఁ గనుంగొని యేఁ గృప వుట్టి చెప్పెదం జనునె మహోగ్ర కోప వివశత్వము నీకుఁ ద్రిలోక నాయకా.

7_2_165 వ. చరాచరంబు లన్నియు నొక్కపెట్ట భస్మీభూతంబులు సేయ నేల ధరణీ భారంబు వాయుటకై యుచిత సంహారంబు గలుగునట్లుగ నొండుదెఱంగు దలంపుము కోపం బుపసంహరింపు మివ్వరంబు నాకొసంగు మనవుడు నిహత పాప కళంకుండైన యా శంకరు పలుకులకు నతం డయ్యలుక నడంచిన నయ్యనలం బాఱుటయును భువనంబులు ప్రమోదంబు నొంది యా శంకర శతానందుల నభినందించె నట్లు క్రోధాపశమనం బాచరించు సమయంబున.

7_2_166 సీ. కమలాసనుని యింద్రియముల రక్తాస్యయు సనితాంగియును నరుణాంబరయును నగు నింతి జనియించి యల్లన నగుచుఁ గెంజాయ రంజిల్లు లోచనము లలర నా జగన్నాథుల నలవోక వోలెఁ గన్గొని దక్షిణమునకుఁ జనవజుండు మొలుపుతో మృత్యువ మృత్యువ యెట వోయె దని పలుమాఱు సాంత్వనము దోఁపఁ

తే. బిలిచి సంహార బుద్ధి నా కొలయఁ బొడము కనలునం దుద్భవించితి గాన నీవు దొడగి వాసి లే లెల్ల జంతువుల సంహ రింపు నా పంపుమై నీకుఁ బెంపు గలదు.

7_2_167 వ. అనిన విని మృత్యు దేవత దుఃఖిత యయినం గన్నీరు దొరంగె నయ్యశ్రు బిందువులు పద్మజుండు పాణీపుటంబునం బట్టి లోక హితార్థంబుగా ననేక భంగుల ననునయించిన నక్కాంత గాడ్పున నల్లాడు తీఁగ తెఱంగునం జలించి యంజలి ఘటించి యవ్విరించి కిట్లనియె.

7_2_168 తే. నీవు సృజియించి తటె నన్ను దేవదేవ యేను గ్రూర కర్మమునకు నెట్టు లోర్తు బంధు మరణ శోకార్తు లై పనపు జనుల వివిధ భంగుల యెలుఁగులు వినఁగఁ జాల.

7_2_169 వ. ఈ యధర్మంబునకు వెఱతు నీవు నాఁ మీద గృప సేయు మిట్లు నన్నుం బనుపక తపశ్చరణంబునకుం బనుప వలయు నివ్వరం బిమ్ము భవదనుజ్ఞ వడసి ధేనుకాశ్రమంబునకుం జనియెద నని పలికినం బరమేష్ఠి యన్నీరజాక్షి నిరీక్షించి.

7_2_170 సీ. నినుఁ బ్రజా సంహారమునకు నై కల్పించినాఁడఁ గావున నీ మనంబు నందుఁ బొడము విచారంబు నుడిగింపు మిట్లు గాఁ గలయది యైన యిక్కార్యమునకు నన్యథాత్వం బేల యగుఁ బ్రజా సంహరణము ననిందిత సమయముగఁ జేయు మీ నవశ్యంబును నావుడుఁ గడు భయంబున నప్పటికి నియ్యకొని మృగాక్షి

తే. నలువ వదనంబు సూచుచు నిలిచె నతఁడు ప్రీతుఁ డై లోకములఁ గృప పెపుతోడి దృష్టిఁ గనుఁగొని నవి పరితుష్టిఁ బొందెఁ జంద్రమౌళియుఁ దనయిచ్చఁ జనియెఁ బ్రీతి.

7_2_171 వ. మృత్య దేవియుం బరమేష్ఠికిం బ్రణమిల్లి.

7_2_172 తే. అచటు వాసి రయంబున నరిగి ధేను కాశ్రమంబున నియమంబు లాచరించి నంద కౌశికి యనియెడు నదులఁ బెక్కు వ్రతము లొనరించి మఱియుఁ దీర్థముల నెల్ల.

7_2_173 వ. అద్దేవు నుద్దేశించి పెద్దకాలం బనేక విధంబుల దుష్కరంబు లగు తపంబులు సేయుచుం బోయి హిమశైల శిఖరంబున సంయతాత్మ యై యున్నఁ జతురాననుం డమ్మానినికిం బొడసూపి మృత్యువ నీ వత్యంత నిష్ఠుర నిష్ఠా నియమంబు లేల యనుష్ఠించెద వనిన నయ్యంగన సమాధానంబున నున్న ప్రజల మెడలు నులిచి చంపంజాల నన్ను నీ పనికిం బంపకు మధర్మ భయంబున నిన్నాశ్రయించెద నార్త నైన నాకు శరణంబ వగు మని ప్రణమిల్లిన నతం డిట్లనియె.

7_2_174 ఆ. ఇంతి నీ కధర్మ మేల యయ్యెడు నాదు పనుపు సేయ నిన్ను బరమ ధర్మ మొందు విమల కీర్తియును జెందు నట్లుగా వరము లిత్తు మేను హరుఁడు నీకు.

7_2_175 వ. ఏ మను సంధించిన పనికి నీకు భయం బేల చతుర్విధ భూత కోట్ల నుపసంహరింపు మనిన నత్తన్వి దేవా దేవర యజ్ఞ దలమోచి చేయు దానం గాక యొక్క విన్నపం బవధరింపుము లోభంబును గ్రోధంబును నీర్ష్యయు నసూయయు కలిగించి జంతువుల శరీరంబుల వికృతిం బొందింప వలయు ననవుడు నతండట్ల యయ్యెడు నదియునుం గాక నీ యశ్రు బిందువు లెన్ని యన్నియు రోగంబు లై జనంబులం జావం జేయం గలయవి దానం జేసి యధర్మంబు నిన్నుం బొరయ నేరదు ప్రాణి మారణంబు నీకుం బరమ ధర్మం బగు బవదీయ శుభం బేను గోరెద నీవు ధర్మ స్వరూపంబు నీ విశ్వంబునకు నీశ్వరి వట్లు గావునఁ బ్రాణ సంయమనంబు భవదధీనంబు సర్వజీవుల యెడం గామ రోషంబు లుడిగి జీవంబుల నాకర్షింపుము తత్ప్రకారంబు ధర్మ తత్వంబు నీకు భయం బేమి మిథ్యా వర్తనుల నధర్మంబ సమయించుఁ బొమ్మనిన నమ్మానిని శాప భీతిని దన్ను నధర్మంబు వొంద దను మాటను దన్నియోగం బంగీకరించె నవ్విరించి వచనంబుల తెఱంగున నాధివ్యాధులు గాత్రహానిం జేయ నా మృత్యుదేవత ప్రాణాపహారిణి యగుటం బ్రాణంబులు దేహంబులం బాసి దేవాది భావంబుల బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు.

7_2_176 తే. భీమ నాదుండడు భీముఁ డుద్దాముఁ డప్ర తర్క్యతేజో మయుఁడు జగత్ప్రాణుఁ డొడలు మనుపఁ జెఱుపంగ నొడయండు సనుట మగుడ నరుగు దెంచుట వింత గా దతని కెందు.

7_2_177 క. నరు లమరు లగుదు రమరులు నరు లగుదురు గాన నీదు నందనునకు భూ వర వగవ నేల యతనికిఁ జిరవీర స్వర్గ సుఖము సేకుఱి యుండున్.

7_2_178 క. అగణిత దుఃఖాత్మక మి జ్జగ మాతఁడు దీని దొఱఁగి సౌఖ్యాత్మక మై పగ చెంతలఁ జేరనియ జ్జగమునఁ బుణ్యాత్మ పురుష సంగతి నడసెన్.

7_2_179 వ. నీకు వగవఁ బని లేదు బ్రహ్మకల్పితం బైన యీ నిశ్చయంబు నిరూపించి ధీరులు దెగిన వారలకు వగవ రని చెప్పిన నారదునకు నయ్యకంపనుం డిట్లనియె.

7_2_180 క. మునినాథ నీవు సెప్పఁగ ననఘం బగు నీ సమంచితాఖ్యానం బే విని గత శోకుఁడ నైతిని మనము ప్రియం బందె నతి సమాధనమునన్.


http://www.volamsite.com