ఆ భా 7 1 91 to 7 2 120
--ప్రకాశ్ స్వామినాథన్ 10:15, 24 జూన్ 2006 (UTC)
7_1_91
ఆ. గురుఁడు వడినయపుడ కురుసైన్యములఁ గల
వారణాశ్వసుభడవర్గములును
బడుయెఁ గాక యేల వడకుండు నాధర్మ
పుత్త్రుభాగ్య మలఁతిఁ బోవు నెట్లు.
7_1_92
చ. నడిఁకెడువాఁడు గాఁడు గురునందనుఁ డక్కట
ప్పుడు మొగ తప్పి యొండుగడఁ బోరుచు నుండెనొ యడ్డపాటు క
వ్వడికతన్ ఫలింపమి నవారణ నాద్రుపదాత్మజుండు బె
ట్టడరి వధింపఁగా వికలుఁడై దురపిల్లుచుఁ జూచుచుండెనో.
7_1_93
ఆ. అని సనవి వనట నలఁదురి
నిను నెద్దియు నడుగ నాకు నీ వేమియుఁ జె
ప్పును వలవదు సంజయ మఱి
వినియెద మది గలఁగె ననుచు వివశాత్మకుఁ డై.
7_1_94
వ. తనకొడుకులగెలుపునెడ నాసమాలుటం జేసి.
7_1_95
అ. సొమ్ము వోయి పడిన సుదత్తు లాక్రందన
రవముతోడ సత్వరముగ నెత్తి
యానృపాలు సెజ్జయం దిడి మెలుపున
శిశిరవిధులు సేయ సేద తేఱి.
7_1_96
వ. ఆసీనుండై యాతండు సూతసుతునకిట్లనియె నరనారాయణులు రథి
సారథులైనయారథం బెందు సిద్దమనోరథం బగుఁ గవలు గడిందిమగలు
సాత్యకిసత్యపరాక్రముండు పాంచాలోత్తముండగునుత్తమౌజుండుదాత్త
బలుండు శిశుపాలతనయుండగు ధృష్టకేతుండు ధీరుండు భీష్మపాతనహేతు
వయినశిఖండి యఖండపరాక్రముండు సౌభద్రుండు రెండవరుద్రుండు
యాదవశ్రేష్ఠుండగుచేకితానుండు మానధనుండు ద్రౌపదేయ లజేయులు
గేకయు లేవురు వేవురపెట్టు యయుత్సుండు బహుళమత్సరుండు ద్రోణ
వధంబ పనిగాఁ బుట్టినధృష్టద్యుమ్నుండు భుజసారద్యుమ్నుండు ఘటో
త్కచుండు ఘనఘోరమూర్తి కృష్ణాశ్రితంబైనవృష్ణికుమారలోకం బలోక
మాన్యం బన మిగిలిన బిరుదుతనంబునం బేర్చినయది భీమగదాభీషణుం
డైన భీమసేనుం డెవ్వరికి నలవిగాక యుండుఁ బాండవసేనం గావను
గౌరవసైన్యంబు సమయింపను దాన చాలు నట్టిపరికరంబును గల దను
కొలంది గాదు కార్యవివేకశౌర్యోద్రేకధుర్యుండు ధర్మదేవతకొడుకు
ధార్మికత్వ సత్యాది మహాగుణగరిష్ఠుండు యుధిష్ఠిరుం డతని గెలువ దేవ
తలకు నశక్యంబు మఱియు నొక్కవిశేషంబు సెప్పెద నాకర్ణింపుము.
7_1_97
మ. యదువంశంబున లోకరక్షణపరుండై పుట్టి వ్రేపల్లెను
న్మదబాల్యంబు నటించి కంసముఖనానాదైత్యులం ద్రుంచి బ
ల్లిదుఁ డాయింద్రునిపారిజాత మిలకున్ లీలాగతిం దెచ్చి శి
ష్టదయాళుత్వము వూని యున్నహరి నిష్ఠం జెంది రప్పాండవుల్.
7_1_98
వ. కావున వారల గెలుచు టరిది యట్లుం గాక.
7_1_99
క. హరియూత్మ యర్జునున కా
హరికర్జునుఁ డాత్మ హరియు నర్జునుఁడును నా
నిరువు రగుట క్రీడార్థం
బరయఁగ నది యొక్కవెలుఁగ యతులం బెందున్.
7_1_100
క. ఆవెలుఁగు గనువెలుంగు గ
దా వెలసినపుణ్యమూర్తి ధర్మసుతుం డే
లా వెఱచు రణమునకు నా
చే వచ్చెం గౌరవులుకు జే టేమందున్.
7_1_101
వ. అని వెచ్చనూర్చి యూర కుండి వెండియు.
7_1_102
చ. గురుఁడును భీష్ముఁడుం గలనఁ గూలుదు రట్టె కిరీటి కింక నె
వ్వ రెదురు కౌరవక్షయ మవశ్యము నయ్యెడు వార్త లేమిగా
బురుపురఁ బొక్కుచున్ వినఁగ బుద్ధిఁ దలంచెననైన ద్రోణుసం
గరపరిపాటి యెల్ల వినఁగా వలతున్ వివరించి చెప్పుమా.
7_1_103
తే. అనిన సంజయుఁ డి ట్లను నాంబికేయు
తోడ నేను దెల్లంబుగ ద్రోణుసమర
మెఱిఁగి వచ్చితిఁ జెప్పెద నెల్లఁ దెలియ
వినుము దిర మయి మాటలు వేయు నేల.
-: ద్రోణుఁడు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టి యిచ్చునట్లు వరం బిచ్చుట :-
7_1_104
వ. అట్లు సేనాధిపత్యంబు పూని కుంభసంభవుండు ముదితమనస్కుండై
గారవంబునం గౌరవేంద్రునకు నరేంద్రులు విన నిట్లనియె.
7_1_105
క. నను భీష్మునిపిదప బలం
బున కెల్లను ముఖ్యుఁ జేసి పూజించితి వీ
వినుతాచరణఫలంబును
గనువాఁడవు వరము గోరు కౌరవనాథా.
7_1_106
వ. అనిన విని యతండు కర్ణదుశ్శాసనాదిసుహృజ్జనంబులతో నాలోచనంబు
సేసి సవినయంబుగా గురున కి ట్లనియె.
7_1_107
క. వర మిచ్చెదేనిఁ గోరెదఁ
బరమహితము ధర్మపుత్త్రుఁ బ్రాణముతోడన్
దురమునఁ బట్టి భుజాభీ
కర కొని రావలయు మత్సకాశంబునకున్.
7_1_108
వ. అని కోరుటయు భారద్వాజుండు నీకొడుకువదనం బవలోకించి.
7_1_109
చ. అకట యజాతశత్రుఁ డనునప్పలు కిప్పుడు నిక్క మయ్యె వా
నికిఁ గురునాథ యిట్టు లతనిం దెగఁ జూచుట గోర కాజిఁ బ
ట్టికొనుట గోరి తివ్విధము డెప్పర మెంతయు నిత్తెఱంగుగో
ర్కికిఁ గత మేమి పాండవుల గెల్చి ధరన్ సగ మీఁ దలంచితే.
7_1_110
వ. నీదునిశ్చయం బెట్టిది యతనిం బట్టి తెచ్చిన నేమి సేయం గలవాఁడ వని
యడిగిన నమ్మనుజవరుం డుప్పొంగి తనమనంబున నున్నకార్యం బాచార్యు
నకుం దక్కటిదొరలకుం దేటపడ ని ట్లనియె.
7_1_111
సీ. ఆధర్మసూనుఁ గయ్యంబునఁ జంపిన గోపించి గాండీవి కురు బలంబు
సమయించు మన మోపి పర్వపాండవులను జంపితిమేనిఁ బ్రచండచక్ర
ధారఁ గౌరవకోటితల లేఱి రాజ్యంబు నందుఁ డీకున్నె గొంతి కయినఁ
గాన యుధిష్ఠిరుఁ గాయంబు నొంపక తె జూదం బాడు తెఱఁ గొనర్చి
తే. మగుడ నడవికి ననిచినఁ దగిలి యతని
తోడఁ దమ్ములుఁ బో నంతతోన యెల్ల
దొసఁగు మాలు నప్రతిహతదోర్విభూతిఁ
బెద్దకాల మే నేలుదుఁ బృధివి యెల్ల.
7_1_112
వ. అనిన విని కుటిలం బగునతని యభిప్రాయంబునకు రోసి యస్త్రగురుం డవ్వ
రంబునకు నేమేనియు నెడవెట్టి యిచ్చువాఁడుగా నూహించి యెక్క
తెఱంగుఁ గాంచి యన్నరవాథున కి ట్లనియె.
7_1_113
చ. నరుఁ డెడ సొచ్చెనేని విను నా కది దుష్కర మే నొకండనే
సురగణమైన వ్రేలఁ గొని చూపఁగఁ జాలరు వాఁడు లేనిచోఁ
దిర మయి పోర నిల్చిన యుధిష్ఠిరు ద్రౌపదిపుట్టినింటివే
వురు వెఱఁగంది చూడ నలవుం జలముం జెడఁ బట్టి తెచ్చెదన్.
7_1_114
తే. అనుడు బాలిశూలైననీతనయు లెల్ల
ధర్మజుఁడు పట్టువడునకాఁ దలఁచి రపుడు
పాండుసుతులకు మొగమోడకుండ గురుని
ప్రతిన యెల్లెడఁ జాటించె రాజరాజు.
7_1_115
వ. ఇట్లు శిబిరంబునను సేనాస్థానంబునను గలయ నాఘోషణంబు సేయిం
చినం జెలంగి సకలసైనికులును సింహనాదంబులు సేయ శంఖభేరీరవంబు
లుల్లసిల్లం గౌరవసైన్యంబు వొంగె నది యంతయుం గౌంతేయాగ్ర
జుండు దనచారులచేత విని యనుజులం గూర్చి వినిపించి వివ్వచ్చు నాలోకించి.
7_1_116
ఆ. గురునిప్రతిన వింటె వెరవున లావునఁ
జేసి దీని బొంకు సేయవలయు
నెఱుఁగు నతఁడు నిన్ను నెడ వెట్టి పలికిన
వాఁడు గానఁ జెప్పవలసె నీకు.
7_1_117
క. నాయున్నచోట నెప్పుడుఁ
బాయక కనుగలిగి నిలిచి భండనము దగం
జేయంగవలయు నక్కురు
నాయకు కోరికి ఫలంబునకు విముఖముగన్.
-: అర్జునుండు ధర్మరాజుతో ద్రోణునిప్రతిజ్ఞకు వెఱవకుండునట్లు సెప్పుట :-
7_1_118
వ. అనుటయు నరునుం డతని కిట్లనియె.
7_1_119
క. గురుని వధించుటయు భూ
వర నీ వని నొవ్వు నొండువలను సనుటయుం
బరికింప నొక్క రూ పవి
దురితంబులు వీనిఁ జేయుదునె యే నెందున్.
7_1_120
క. క్షోణీవల్లభ విను మేఁ
బ్రీణముతో నుండ నిన్నుఁ బట్టికొనఁగ నా
ద్రోణునక కాదు సగణ
స్ధణున కైనను వశంబె తలఁ కేమిటికన్.