ఆ భా 7 1 151 to 7 2 180
--ప్రకాశ్ స్వామినాథన్ 16:20, 30 జూన్ 2006 (UTC)
7_1_151
వ. తదనంతరంబ.
7_1_152
క. నరుఁ డగ్గలికం దఱుముచుఁ
బురికొలిపిన గండు మిగిలి భూరిబలంబుల్
గురునిఁ బొదివె నప్పార్షతు
నరదమునకు మించి రభస మత్యుగ్రముగన్.
7_1_153
క. పొదువటయుం గనుఁగవఁ గెం
పొదవఁగ మెయి వొంగి ద్రోణుఁ డున్మదలీలం
దదనీకములఁ గలంచుచు
ముదకం డయ్యును గుమారమూర్తిం బొలిచెన్.
7_1_154
క. విను మప్పుడునిజశక్తుల
కనురూపము గాఁగ నిలిచి యద్దెసవీరుల్
పెనఁగిరి రథ్యంబులు నా
తనిసూతుని మేను శోణితంబునఁ దోఁగన్.
7_1_155
క. గురుఁ డలిగి పెలుచ నడరినఁ
గరిఘోటకభటనికాయకాయముల సమి
ద్ధరణి వొలిచె నరుణపయో
ధరసంవృత మైనగగనతలము చెలువునన్.
7_1_156
క. అప్పుడు ధృష్టద్యుమ్నుఁడు
నిప్పు లురులుచూపు లడర నిశితాస్త్రములం
గప్పె గురునిఁ దత్సైన్యం
బొప్పిరి తన బెట్టిదంపుటురవడిఁ దెరలన్.
7_1_157
క. ద్రోణుని శరములునిలుపుచు
బాణవితతి సేనమీఁదఁ బరిగించుచు గీ
ర్వాణనుతు లెసఁగ నతఁ డ
క్షీణోద్ధతి నట్లు సమరకేళి సలుపఁగన్.
7_1_158
క. ఏచినరథికవరులు ధను
రాచార్యునియిరుగెలంకులందుఁ దఱిమినం
జూచి వడి సవ్యసాచి శ
రాచితదేహులుగఁ జేసె నందఱఁ గడిమిన్.
7_1_159
వ. ద్రోణుండు పదిబాణములు ద్రుపదసూనుమేనం గీలించినం దూలక యతం
డతనిపై నిశితవిశిఖవర్షంబు గురిసె నయ్యిరువురశరనికరంబు లంబురంబు
గప్పె నట్టియెడఁ బాండవాగ్రజపురోగములగుదొరలు గడంగికుంభసంభవు
దెసకుం దఱిమిన మనవలనిఘనయోధవరులు వారిం దలపడి రందు శకుని
సహదేవుం దాఁకి.
7_1_160
మ. తురగవ్రాతము నొంచి కేతువు వెసం ద్రుంపంగ నాతండు గ్రో
ధరయం బుగ్రము గాక యుండియును గాంధారేశు వీతధ్వజున్
విరథున్ విస్ఫురితాస్త్రమట్టితునిఁ గావింపన్ గదాభీలమూ
ర్తి రథం బుద్ధతి డిగ్గ పాఱి యతఁ డుర్విం గూల్చెఁ దత్సారథిన్.
7_1_161
క. సహదేవుండును గద గొని
మహి కెరఁగినయప్పు డొప్పె మనుజేశ్వర య
మ్మహితసుభటయుగము శిఖిర
సహితమహాశైలయుగ్మసదృశాకృతియై.
7_1_162
క. వింశతిశరముల నేసె వి
వింశతి ననిలజుఁ డతండు వీఁక నగుచుఁ ద
త్ప్రాంశుధనుర్దండము రెం
డంశములుగ నేసె వెడఁదయమ్మనఁ బెలుచున్.
7_1_163
సీ. మనబల మార్చినఁ గినిసి భీమఁడు గద నతనియశ్వంబుల నవనిఁ గూల్చె
భూరిశ్రవుఁడు పొలుపారి ధృష్టద్యుమ్నుఁ గప్పె నస్త్రముల శిఖండి యేచి
యాతని నిలునిలు మని తాఁకి శరవృష్టిఁ బొదివె పిశాచముల్ వూనుతేరు
లెక్కి కప్పారెడు నెలువుచర్మపుఁ గత్తళములతో ఖరనిస్వనములు సెలఁగ
తే. నసురవల్లభు లగునలంబుసఘటోత్క
చులు సముద్ధతిఁ దొడరి మాయలు వొనర్చి
పేర్చి యొ డొరు నొంచుచు బెనఁగి పెనఁగి
తెల్లముగఁ జూడఁ జూడ నదృశ్యులైరి.
7_1_164
వ. అయ్యవసరంబున.
7_1_165
సీ. క్షత్త్రదేవుండు లక్ష్మణుతోడ సమరంబు సేసె నుగ్రంబుగఁ జేకితానుఁ
డనువందుఁ దలపడి యద్భురగతిఁ బోరె శల్యుండు నవ్వుచు శరచయమున
నకులు నొంచినఁ గేనము నాతపత్రంబు వెసఁ ద్రుంచి యాతని విరథుఁ జేసి
శంఖంబు పూరించె శారద్వతునిమీఁద ధృష్టకేతుఁడు సప్తతీప్రదీప్త
తే. విశిఖములు నింప నతఁ డస్త్రవృష్టీ పెల్లు
గురిసె సాత్యకికృతవర్మ యురము నార
సముల నొప్పించి డెబ్బదిసాయకంబు
లేయ డెబ్బదియేడమ్ము లేసె నతఁడు.
7_1_166
క. సేనాపతి యగుద్రుపద
క్ష్మానాథతనూభవుఁడు సుశర్మునిమర్మ
స్థానంబు నొంచె వాతఁ డ
దీనుం డై యతని జత్రుదేశం బేసెన్.
7_1_167
చ. బలమును దాను మత్స్యనరపాలుఁడు గర్ణునిఁ దాఁకి రెండుసే
నలు వినుతింప నుద్భటరణం బొనరించినఁ గంటిక్రేవఁ గెం
పొలయఁగ నీతనూభవుల కుబ్బుగఁ దద్రథదంతిఘోటకం
బుల నుఱుమాడె నారథికపుంగవుఁ డంపరచారు లార్వఁగన్.
7_1_168
క. వేడుకమై దలపడి పో
రాడిరి ద్రుపదభగదత్తు లస్త్రబలము శౌ
ర్యాడంబరమును నెలుఁగలుఁ
జూడను వినఁ జిత్రములుగ శుంభద్భంగిన్.
7_1_169
సీ. పౌరవుం డభిమన్యు బలువిడిఁ దాఁకిబాణాసారమున ముంప నతఁడు గినిసి
యతని ధనుఃకేతనాతపత్రంబులు ద్రుంచి యేనింటఁ దత్తురగములను
సారథి నొప్పించి శరము లేడిట స్రుక్కఁజేసి దర్పంబున శిరము ద్రుంచు
టికు భల్ల మరిఁ బోయుటయుఁ గృతవర్మ రెండమ్ముల విల్లు నయ్యమ్ము దునిమెఁ
తే. బలుకయును వాలుఁ గొని నరుపట్టి గవిసి
పౌరవునిరథ్యముల నేలపాలు సేసి
యఱికి సూతునిఁ బడఁ దన్ని యురగవిభునిఁ
బట్టు గరుడువిక్రియఁ దల వట్టి కొనియె.
7_1_170
వ. ఆలోనసైంధవుండు సంభ్రమంబున శాతకృపాణచర్మంబులు గొని రథంబు
డిగ్గ నుఱికి రయంబున నెయిది యదల్చినం గని జనకద్వేషి యగునతని
వలనిరోషం బగ్గలింప నా పురందరపౌత్రుండు పౌరవుని విడిచి యద్దెసకు
లంఘించి కవిసె నప్పుడు.
7_1_171
తే. వికటవిస్ఫురదసిచర్మవివిధచిత్ర
గతులు చూపఱయెడఁద కద్భుత మొనర్ప
నార్జునియు సింధురాజుఁ బక్షాభిరామ
సింహశార్దూలగతి విలసిల్లి రధిప.
7_1_172
వ. అట్టియెడ.
7_1_173
క. అఱిముఱి వ్రేసినఁ బలకం
గఱచినసైంధవునియలుఁగు గని నరసుతుఁ డే
డ్తెఱ ముఱిసిన నది రూపఱి
విఱుగుటయును వెస నతఁడు వెనుకకు విఱిగెన్.
7_1_174
క. విఱిగినచో నిలువక వెఱ
నుఱికెం దనరథము మీఁది కోడితి పోపో
పిఱికి యని పలికి నుఱుముగ
నఱికెం దత్సేన బార్థనందనుఁడు వడిన్.
7_1_175
క. తెరలిన సైంధవుఁ గని నృప
వరులుపలువు రొక్క పెట్ట వాసవిసుతు పై
నురవడిఁ దఱిమిరి మద్రే
శ్వరుఁడు గదిసి దీప్తశక్తివైచెం బెలుచన్.
7_1_176
క. ఉరగాంగన నలిఁ బట్టెడు
గరుడునిక్రియ శక్తి వట్టి క్రమ్మఱ వైచెన్
నరసుతుఁడు శల్యుసూతునిఁ
బొరివోవఁగ నార్చెఁ బాండుపుత్రబలంబుల్.
7_1_177
వ. అయ్యవసరంబున విరాటుండును ద్రుపదుండును ధష్టకేతుండును యుధిష్ఠి
రుండును పాతంకియును గేకయపతులును భీమసేనుండును ధృష్టద్యుమ్నుం
డును శిఖండియుం గవలును ద్రౌపదేయులును సౌభద్రుం బొగడునెలుం
గులు సింహనాదంబులు నింగిముట్టి నతనికి నుల్లాసంబును నీకొడుకులకు
రోసంబును జనియింప నతనిం బరివేష్టించిన తద్విజయంబు సైరింపక కూడు
కొని నీకొడుకు లతనిపైఁ బటుశరఁబులు గురియ నక్కుమారసంతతికి
సంతసంబుగా శల్యుండు గదగొని యభిమన్యునకభిముఖుండై కవిసెననిన
విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె.
7_1_178
తే. ఎక్కటెక్కటి పెనఁగిన నింతపట్టు
పెనఁకువలు నిట్టు లేచునే వృథివి నింక
జనము లీకురుపాండవసంగరంబు
సెప్పికొండ్రు మనంబు లచ్చెరువు నొంద.
7_1_179
క. అని సొంపు వినియు నాకుం
దనివి సనదు శల్యపార్థతనయులసమరం
బునతెఱఁగు సెప్పు మేర్పడ
ననవుడు సూతసుతుఁ డిట్టు లనుఁ బతితోడన్.
-: భీమసేనశల్యుల గదాయుద్ధము :-
7_1_180
ఉ. అమ్మెయి సూతుఁ డీల్గుటయు నగ్గలికన్ గద వుచ్చికొంచు రౌ
ద్రమ్మున వచ్చుశల్యుఁ గని తానును జండగదావిలాసనో
గ్రమ్ముగ లీల మార్కొనియె ర మ్మిట రమ్మనుచున్ సమస్తసై
న్యమ్ములుఁ బిచ్చలింపఁగ సురాధిపపౌత్రుఁడు దీప్తగాత్రుఁడై.