వోలం సురేష్ కుమార్


3_6_211 ఉ. ధర్మజు కూర్మితమ్ముఁడును దత్ప్రియ శిష్యుఁడు నైన వాఁడు స త్కర్ముఁడు వాఁడె చూడుము ప్రగాఢ వికీర్ణ జితైంద్రియుండు దు ష్కర్ములఁ గన్న సైఁపఁడు నికామ భయంకర విక్రమ క్రియా నిర్మథితారి ఫల్గునుఁడు నిర్మల తేజుఁ డజేయుఁ డేరికిన్.

3_6_212 క. అవశగతిఁ గామ రోషా ది వికారము లొందినను మదిని ధర్మపథ ప్రవిహతి గానీఁ డతఁ డా దివిజేంద్ర తనూజుఁ డద్వితీయుఁడు పేర్మిన్.

3_6_213 చ. అయన సంగ్రహుండు వినయవ్యవసాయి భయార్తలోక సం శ్రయుఁడు గృతాస్త్రుఁ డాహవ విశారద శౌర్యుఁడు శిష్ట బాంధవ ప్రియుఁ డసమాన సుందర గంభీర శుభాకృతి యల్లపుణ్యుఁ డా రయ నకులుండు పాండుసుత రత్నము భాసుర కీర్తి యిమ్మహిన్.

3_6_214 ఉ. వీరుఁడు చిత్రయోధి దృఢ వేధి గృతాస్త్రుఁడు భూరి బుద్ధి వి స్ఫారుఁడు వాగ్విశారదుఁడు పార్థుల కూరిమి తమ్ముఁ డుజ్జ్వలా కారుఁడు ధర్మదక్షుఁ డవికారుఁడు ప్రౌఢపతంగ తేజుఁ డ ద్ధీరుఁడు పాండవుండు సహదేవుఁడు దైవనిభుండు పెంపునన్.

3_6_215 తే. కొడుకులం దెల్లఁ గూర్చు కొంతి యితని కిమ్మహాత్ముఁడు మహి చలియించెనేని నగ్ని చల్లన యయ్యె నేనాత్మఁ దాను ధర్మ నిష్ఠుఁడై సత్యంబు దప్పఁ డెపుడు.

3_6_216 వ. వీరేవురు నత్యంత దుర్వారులు వీరి బారింబడిన వారాశి నడుమ నుగ్ర మకరాహతంబై యనియు పేరోడయుం బోలె నీ సైన్యంబు వికలంబగు నీవునుం బ్రాణం బొండె మానం బొందిఁ గోల్పోడి మెయిమెయిం బో నేర్చెదవే యనియె నప్పుడు కౌంతేయులు సైంధవ సేనం దలపడి దిఙ్ముఖం బున నెల్లం జీకట్లు గవియునట్లుగా బాణ పటలంబులు పఱఁగింపం దొడంగిన.

3_6_217 క. తొలఁగకుఁడు పొదుపుఁ డేయుఁడు నిలువుఁడు వడిఁ బొడువుఁ డనుచు నిజ యోధులఁ దాఁ గలయఁ బరికొల్పి సైంధవు డలఘు పరాక్రముఁడు నినిచె నా హవ భూమిన్.

3_6_218 వ. ఇట్లు త్రిగర్త శిబి సింధు సైన్యంబులతో ననేక నరపతి పరివృతుం డై నిలిచిన జయద్రథుం జూచి భీమసేనుండు క్రోధారుణ లోచనుండై రథంబు డిగ్గి హేమ బంధ బంధురంబును నయోమయంబును నగు గదా దండంబు ద్రిప్పుచు వాని పయిం గనిసిన నడ్డపడి కోటికాస్యుండు నిజ సైన్య సంఘంబుతో నమ్మాహా వీరుం బొదువుటయు నతండు.

3_6_219 క. మద గజముల రథ యోధులఁ బదాతులను దురగములను బలువిడిఁ గలయం జదుపుచు దుర్వారగతిన్ విదిత బలుడు ఘన గదా ప్రవీణత మెఱసెన్.

3_6_220 వ. ఇట్లు విహరించి యహిత సైన్యంబు నిహతం బగుటయుఁ జెలంగి సింహనాదంబు సేసి యతండు సారథి సముపనీతం బైన రథంబు సాదరంబుగా నెక్కి గృహీత శరాసనుం డై విక్రమించె మఱియును.

3_6_221 క. అలిగి యుధిష్ఠిరుఁడును న గ్గలికం బ్రతి వీరు లడరఁ గార్ముక విద్యా విలసనము మిగుల సౌవీ రుల నూర్వుర రథిక వరుల రూ పడఁగించెన్.

3_6_222 క. నకులుఁడు నిశాతసాయక నికరంబుల సమర ధారణీతల మెల్లం బ్రకట పరవీర వరమ స్తక బంధురముగ నొనర్చె ధారుణ బంగిన్.

3_6_223 క. నారాచపాతముల దు ర్వారుఁడు సహదేవుఁ డాహవముఖంబున న శ్వారోహకులం గూల్చుచు వీర విహారంబు సలిపె వేడ్క యెలర్పన్.

3_6_224 ఆ. సింధు రాజ సైన్య సింధు పూరము నందు మహిత ఫల్గనాఖ్య మంథనగము దిరిగి కలఁపఁ దొడఁగెఁ బర నృపాలక మహా జలచర ప్రజంబు సంచలింప.

3_6_225 సీ. వారణ కోటి దదారోహకుల తోన వివశమై యొఱలుచు నవనిఁ ద్రెళ్లె సూత హయ ధ్వజ పాత పూర్వకముగ రథములు దుము రయ్యె రథుల తోన వెస రావుతుల తోన వస మఱి హయములు గెడసి యెల్లెడలను బుడమిఁ గప్పె దందడి దెరలుచు సందడి పెల్లుగాఁ గాలు బలంబులు గూలెఁ గలయఁ

ఆ. దుముల మధిక మయ్యె సమర తలంబున ఘోర రుథిర వారిపూర మెసఁగె జిత విరోథి బలుఁడు శత మశ సూనుండు చాప నైపుణ్యంబు సూపునపుడు.

3_6_226 తే. సవ్యకరము నందును నపసవ్యకరము నందుఁ బర్యాయ సంగత మగుచుఁ జూడఁ గొఱవి ద్రిప్పిన యొప్పున మెఱసెఁ బార్థు గాండివము వాలుఁ దూపుల గనియనంగ.

3_6_227 వ. అట్టియెడం ద్రిగర్తపతి యైన సుధన్వుండు గదా హస్తుండై రథంబు డిగ్గి చని ధర్మ తనయు రథ్యంబులఁ గూల సేసిన నతండు నిశిత సాయకంబున వానియురంబు వ్రచ్చి విగద జీవుం గావించి సత్వరంబుగాఁ జని సహదేవు నరదం బెక్కె మఱియును ద్రిగర్తుల లోన మహా ముఖ క్షేమంగరు లనువారు నకులుం బొదివి ఘన శరాసారంబు గురిసి బజధరంబులుం బోలె గర్జిల్లిన నమ్మాద్రీసూనుండు వారి నిద్ధఱఁ బెక్కమ్ముల నొప్పించె నంతఁ దదీయా గ్రడుం గడు సురథుండు.

3_6_228 చ. కరి నికరంబుతోఁ దొడరి గర్వితుఁడై తన వారణేంద్రు న క్కురు కుల వీరు మీఁద నెసఁ గొల్పినఁ దద్రథఘోటకంబుల బరుషతఁ జంపు నగ్గజము వాయక వాఁ డసిచర్మ హస్తుఁడై ధరణికి దాఁటుచో నది మదంబున వెండియుఁ బైఁ గడంగినన్.

3_6_229 చ. తొలఁగక యమ్మహాబలుఁడు దోర్బల మొప్పఁ గృపాణపాత భం గలుఁ గరినాథు కేలు నిరుగొమ్ములతో బెరయంగఁ ద్రుంప బె ట్టిలకు విచేష్టమై నొఱగు నేనుఁగు పై నతి మాత్ర భీతి వి హ్వలుఁ డగు శత్రు నుద్ధతిఁ గృతాంత విధేయునిఁ జేసె వ్రేల్మిడిన్.

3_6_230 క. వైరులు దలఁకఁగ నిమ్మై దారుణ పౌరుష విశేష దక్షుం డై య వ్వీరుఁడు రయమున నరిగి స మీర తనయు నరద మెక్కి మెఱసెం బోరన్.

3_6_231 చ. ఘనుఁడు వృకోదరుండు దనుఁ గట్టలుకం దల పడ్డ కోటికా స్యుని తురగంబులం దునిమి సూతుని కంఠంబు ద్రుంచివైచి తీ వ్ర నిశిత మైన ప్రాసమున వాని యురంబు వగిల్చి చంపినం గనుకనిఁ బాఱె భీతిఁ యెసఁగంగఁ దదీయ చమూ సమూహముల్.

- అర్జునుఁడు సౌవిర కుమారులం బన్నిద్దఁఱ జంపుట – సం. 3-255-27

3_6_232 వ. అంత నంగారకుండును గుంజరుండును సృంజయుండును సుప్తకుండును శత్రుంజయుండును సుప్రబుద్ధుండును శుభంకురుండును భ్రమంకరుండును శూరుండును రథియును గుహకుండును బలాఢ్యుండును నను సౌవీర కుమారులు పన్నిరువురు నిక్ష్వాకు శిబి సైంధవ త్రిగర్త సైన్యంబులం గూడి క్రీడి మార్కొని పటు బాణ జాలంబులం గప్పిన.

3_6_233 మ. అతుల క్రోధ విఘూర్ణ మాన హృదయుండై చండ గాండీవ ని ర్గత భల్లౌఘములం దదస్త్ర వితతుల్ ఖండించి సౌనీర సం తతిఁ బన్నిద్దఱ విండ్లులం దునిమి దోర్దర్పంబు మీఱంగ స స్మితుఁడై యాతఁడు దచ్ఛిరః ప్రకర విచ్ఛేదంబు సేసెన్ వెసన్.


3_6_234 క. ఆకలుముగ శైబ్యుల ని క్ష్వాకుల సైంధవులనుం ద్రిగర్తులనుం బో నీక పొదివి రయమున న స్తోక పరాక్రముఁడు దునిమి తూఁటాడె వడిన్.

3_6_235 వ. అప్పుడు రణ భూమి యంతయు శవమయం బయ్యె నంబరం బంతయుం గబంధమయం బయ్యెఁ జరు కేయూర వీరాంక విభూషితంబు లైన బాహు చరణ చ్ఛేదంబులును గార్ముక తూణీర కాండ ఖండంబులు నక్షకూబర రథాంగ కేతన త్రివేణు కశకలంబులును బుండరీక వ్యజనచామర భంగంబులుం గరవాల పరిఘ శక్తి గదా ముసల పట్టిన ప్రాస లేశంబులు నెక్కటఁ జూచిన రాసులై యుండెఁ గీలాలపూరంబును మాంస పంకంబును గేశ శైవాలంబును నైన యపూర్వ నదీ ప్రవాహంబునందు బహు విధ క్రవ్యాద గణంబు లన గాహంబు సేయుచుఁ బ్రకట కోలాహల వ్యాకులం బగు చుండె నవ్విధంబున.

3_6_236 క. గాండివ పవన ప్రేరిత చండాంబక ఘోర శిఖల శత మఖ తనయో ద్ధండ దహనుఁ డొక మాత్రన ఖండిత సౌవీర సైన్య కానన మేర్చెన్.

3_6_237 వ. అట్టి క్రందున జయద్రథుండు ద్రౌపదిని దిగ విడిచి రథంబు దోలుకొని పఱచె నంత ధర్మజుండు ధౌమ్య సమన్వితయై యున్న పాంచాలిం గని నిజ రథంబు పై నిడికొనియె సైంధవు పలాయనం బెఱింగి యర్జునుండు శత్రుసేనా హనన సంరంభంబున నున్న భీమసేనున కిట్లనియె.

3_6_238 తే. వీతలజ్జుఁడై పఱచె సౌవీర విభుఁడు బొనుఁగు ప్రజ నేల యాఱడి దునిమి వైవ నద్దురాత్ముని వెనుకొని యసువు లిపుడు గొనఁగ వలయు లేలెమ్ము సద్వినుత శౌర్య.

3_6_239 వ. అనిన నతండు గయ్యంబు సాలించి ధర్మతనయుం జూచి.

3_6_240 క. జన నాథ ద్రుపద సుతఁ దో డ్కొని ధౌమ్యుఁడు నీవుఁ గవలుఁ గుఱుకొని మగుడం జనుఁ డాశ్రమంబునకు నే మును సైంధవు వెనుకఁ గూడ ముట్టెదము వెసన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com