వోలం సురేష్ కుమార్


3_5_421 మహాస్రగ్ధర. ఘనకోదఁడోగ్ర మౌర్వీక్వణ మఖిల నభోగహ్వ రాభోగభాగం బున నాపూర్ణంబుగా నుబ్బునఁ గవలు మరుత్పుత్త్రుఁడుం దీవ్ర నారీ చ నితాంతా పాతలీలా సర భసగతులై శత్రు వీర ప్రజంబుం దనుమం దచ్ఛోశితంబుల్ దొఱిఁగి మడువులై తొట్టె నయ్యుద్ధ భూమిన్.

3_5_422 వ. ఇట్లు కౌంతేయులచేతం బీడితులై గంధర్వులు దుర్యోధనాదుల జెఱలేమఱక కొనుచు గగనంబునకు నెగసి త్రోచిపొవ నుంకించిన నెఱింగి సవ్యసాచి రయంబున నతి నిబిడ బాణ జాలంబులం జేసి దిఙ్నభోమార్గంబులు నీరంధ్రంబులుగాఁ గప్పిన నగ్గగన చరులు వలలోనం జిక్కిన పులుగులుం బోలెఁ బోవ నేరక శర పంజరంబునం జిక్కియు నుక్కు సెడక యన్నలు వురమీఁద వివిధాయుధ ప్రకరంబులు ప్రయోగించిన.

3_5_423 మ. అని యెల్లం దునుమాడి క్రీడి ఘనరోషాభీలుఁడై శాత భ ల్లవితానం బడరించిన దలలు డొల్లం గాయముల్ మింటనుం డి వడిం గుంభినిఁ గూలఁగా రుధిరవృష్టిం గాలువల్ వాఱఁగా దివి గంధర్వుల క్రం దడంగె జగ ముద్వేగంబునం బొందఁగన్.

3_5_424 వ. మఱియు నర్జున ప్రయుక్తం బయిన యాగ్నేయాస్త్రంబు దావాగ్ని నీరవ విపినంబు దహించు తెఱంగున గంధర్వ నివహంబు నీఱు సేయం దొడంగినం గినిసి చిత్రసేనుండు భీమసేనానుజు మీఁదం బటుగదా దండంబు వైచిన నతండు దాని నేడు దునియలుగా నేయుటయు గంధర్వరాజు మాయా బలంబున నంతర్హితుండై.

3_5_425 క. నలువురు పార్థుల నత్యు జ్జ్వల శర వర్షముల ముంచి జలధరముక్రియం బెలుచన గర్జిల్లుచు మొ క్కలుఁ డయు నత విక్రమంబుఁ గడఁగయుఁ జూపెన్.

3_5_426 క. దాని నుఱక యింద్రసూనుండు గాండీవి శబ్దభేదు లయిన సాయకములఁ జిత్రసేను సర్వగాత్రంబు భేదించి యొక్క మాత్రలోన నుడిపెఁ గడఁక.

3_5_427 వ. ఇట్లు నొచ్చి గంధర్వ నాయకుండు రణ సంరంభంబు విడిచి యర్జునుం జేరం జని తన పొడసూపి నిలిచిన నవ్వీరుండును నాత్మసఖుం డయిన ఖేచరపతి తెఱంగు సూచి సంహృతాస్త్రుం డయ్యె వృకోదరాదులును సమర విరామంబు నొందిరి వార లందఱు దమతమ రథంబుల మీఁదన యుండి యొండొరులఁ గుశలంబు లడిగి రప్పు డర్జునుండు చిత్రసేనున కిట్లనియె.

3_5_428 క. వీరోత్తమ నీ కిమ్మెయి వైరము దగునయ్య కౌరవ ప్రకరముతోఁ గౌరవపతి విడువుము త ద్దారానుజ సుత సమన్వితంబుగ నెమ్మిన్.

3_5_429 వ. అనిన నతం డర్జునున కిట్లనియె.

3_5_430 సీ. ఈ దురాత్ముఁడు మిమ్ము నివ్వనంబున నితాంతాయాస పీడితులైన వారిఁ బరమ ధర్మాత్ముల భార్యా సమేతుల నపహసింపఁ దలంచి యరుగుదెంచె నింతయు నెఱిఁగి సురేంద్రుండు గలుషించి యనుజ వధూ సహాయాన్వితముగఁ బాపవర్తను వీనిఁ బట్టి తెమ్మని నన్నుఁ బనిచిన వచ్చితిఁ బార్థ వినవె

తే. శక్రుపాలికి నిదె కొని చనుచు నున్న వాఁడ నీవింక నొండన వలదు వినుము మత్సఖుండవు గావున మత్సరంబు నలుకయును తేదు నీ దెస ననఘ నాకు.

3_5_431 తే. అనిన నర్జునుఁ డతని కిట్లనియె నీ సు యోధనుఁడు మాకు వినుము సహోదరుండు గాన యీతని విడుచుట గర్జ మిదియ ధర్మజున కెంతయును బ్రమోదంబు సేఁత.

3_5_432 చ. అమర వరేణ్యు పన్పయిన నావల నెయ్యది యైన నిప్డు ధ ర్మమహితుఁ డైన ధర్మజు సమక్షమునం దెఱిఁగించి యాతఁ డే క్రమమున నెద్ది సెప్పె నది గైకొని చేయుము నీవు మత్ప్రియా ర్థము చనుదెమ్ము నావుడును దాని కొడంబడి చిత్రసేనుఁడున్.

- చిత్రసేనుఁడు ధర్మరాజు నొద్దకు వచ్చి దుర్యోధను విడిచి పెట్టి పోవుట – సం. 3-235-11

3_5_433 వ. వారలం దాను ధర్మజు కడకుం జనిన నయ్యజాత శత్రుండు చిత్రసేను నతి ప్రియంబునం బూజించి మహాత్మా యీ సుయోధనుండు సానుజైమాత్యుం డయి మీ చేత వధియింపబడ కునికి మే లయ్యె మీ కారణంబున మా వంశంబునకు కొండొక హాని వొంద దయ్యె వీఁ డెట్టి యపరాధంబు సేసినను నది యంతయు సహించి మాకుంగా వీని విడువ వలయు నని ప్రార్థించిన నతం డట్లకాక యని దుర్యోధనాతుల నందఱ విడిచి పాండు పుత్త్రుల నామంత్రణంబు సేసి దివంబున కరిగి తత్ప్రకారంబు సకలంబును నింద్రునకు నివేదించిన నింద్రుండును సమర నిహతు లయిన గంధర్వుల నమృత వృష్టిం జేసి బ్రదికించె నిట యుధిష్ఠిరుండును ధార్తరాష్ట్రునకు బంధ మోక్షణంబు గావించి వాని కిట్లనియె.

3_5_434 ఉ. ఎన్నఁడు నిట్టి సాహసము లింక నొనర్పకు మయ్య దుర్జనుం డన్నువ సారస క్రియనయందుఁ గడంగి నశించు గావునం గ్రన్నన తమ్ములన్ దొరలఁ గైకొని యిమ్ములఁ బొమ్ము వీటికిన్ సన్నుత దీని కొండొక విషాదముఁ బొందకు మీ మనంబునన్.

3_5_435 వ. అని బుద్ధి సెప్పి వీడ్కొలిపిన నతండును దీనాసనుం డగుచుం జనియె ననజ సహితుం డయిన ధర్మతనయు ధార్మకత్వంబు ధౌమ్యాది భూసురులును దదాశ్రమ వాసులయిన మహామునులును బహు విధంబులఁ బ్రస్తుతించిరని వైశంపాయన వర్ణితం బయిన కథా విశేషంబు సవిస్తరంబుగా.

3_5_436 క. రాజ కుల తిలక భువన వి రాజిత సితకీర్తి దివిజ రాజ విభవ ని ర్వ్యాజ పరాక్రమ సకల ధ రాజన సంపూజ్య ధర్మ రక్షణక్షా.

3_5_437 స్రగ్విణి. సర్వలోకాశ్రయా సౌమ్య భావోదయా నిర్వికారాకృతీ నిత్యసత్యోన్నతీ గర్వితోద్యద్భుజాకల్ప కల్పోల్ల స త్సర్వ సర్వం సహా చక్ర చక్రాయుధా.

గద్యము. ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహా భారతంబునం దారణ్య పర్వంబునఁ బతివ్రతా చరిత్రంబును ధర్మవ్యాధుండు గౌశికునకుఁ బరమ ధర్మం బెఱింగించుటయు నగ్ని వంశాను కీక్తనంబును గుమారోత్పత్తియు సత్యా ద్రౌపదీ సంవాదంబును బాండవులు ద్వైత వనంబునకుం జనుటయు ధృతరాష్ట్ర వాక్యంబులును దుర్యోధనాదులు దుర్మంత్రంబున ఘోష యాత్రయుఁ గౌరవ గంధర్వ యుద్ధంబును దుర్యోధనాదులు గంధర్వుల చేతం బట్టువడుటయు నర్జునుండు వారల విడిపించుటయు నన్ని పంచమాశ్వాసము.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com