ఆ భా 3 4 031 to 3 4 060
వోలం సురేష్ కుమార్
3_4_031 క. మఱియు నీ యక్షరాక్షస బలంబును వాని చేతి నిహతుహగుదు రిద్దిరితంబు దద్దర్శనం బాయు ననియెం గావున నిట్టి శాప ఫలంబునకు నీ యనుజుండు నిమిత్తం బయ్యెనని చెప్పి వెండియు నిట్లనియె ధృతియును దాక్ష్యంబును దేశకాలంబులును బరాక్రమంబును మంత్ర విధానంబు నను పంచ విధాంగంబు నెఱింగిన క్షత్త్రియుండు ధర్మవిదుండై ధరణీ చక్రంబు నిర్వక్రంబుగా రక్షించి పుణ్యలోకంబు వడయుఁ గర్మ విశేషంబు లెఱుంగక వృథారంభుండై సాహసంబున వర్తల్లు వానికి బాతకం బగుట నిశ్చయంబు.
3_4_032 క. కావున నిరతమ్ము మరు ద్దేవాత్మజు సాహసైకధృతి గాకుండన్ భూవల్లభ శిక్షింపుము నీ విమలజ్ఞాన ధర్మ నిష్ఠిత బుద్ధిన్.
3_4_033 వ. నిన్నును నీ తమ్ములను ధర్మానిలశక్రాశ్వినులు రక్షించునట్లు యేనెప్పుడు రక్షింతు నానియోగంబున మత్పరిచారకులు మీకు నిత్యంబును నన్నపానాదులు దెచ్చి యిచ్చుచుండ నార్ష్టకాశ్రమంబున నొక్క పక్షంబు వసియించునది.
3_4_034 సీ. మానితయశుఁడు భీమానుజుం డర్జునుం డమరులచేత దివ్యాస్త్రతతులు వడసి దేవేశ్వరు కడ నున్నవాఁ డతం డుపకారి యయ్యె దేవోత్తమునకు సప్తమేధాధ్వర ప్రాప్తపుణ్యుఁడు ధర్మమతి భవత్పితామహుఁడు ఘనుఁడు శంతనుఁ డతనిచే సంతర్పితుండయ్యె గుఱుకొని మీదైన కుశల మడిగె
ఆ. నరుగుదెంచు నింత కయ్యర్జునుండు మీ కభిమతార్థసిద్ధి యగును సిద్ధ మని యెఱుంగఁ జెప్పి యలకాధినాథుండు యక్షగణముతోడ నరిగె నంత.
3_4_035 వ. ఇట్లు ధర్మరాజు కుబేరునాదేశంబున నార్ష్టిషేణాశ్రమంబున నున్న నాతనికి నొక్కనాఁడు ధౌమ్యుండు నిజాంగుళి నుత్తరదిగ్భాగంబు సూపుచు నిట్లనియె.
3_4_036
క. అది మందరనగ మక్కడ
నది మేరు గిరీంద్ర మమ్మహాశైలమునె
న్మిది దిక్కుల వసియింతురు
త్రిదశేశ్వరు దొట్టి యష్టదిక్పాలవరుల్.
3_4_037 చ. కనకగిరిం బ్రదక్షిణముగా శశిభాస్కర తారకాగణం బనవరతంబుఁ ద్రిమ్మరు మహాముని సప్తక మండలంబుతో ననఘ తదీయతుంగ శఖరాగ్రమునందుఁ బయోరుహాసన త్రినయనవిష్ణులుండుదురు దేవగణంబులు గొల్చుచుండఁగన్.
3_4_038 వ. అని చెప్పుచుండఁ బాండవు లం దొక్కమాసంబు నివాసంబు సేసి రంత.
3_4_039 ఉ. అంబర మాత్మదీప్తి నివహంబున నొప్పఁగ మాతలిప్రయు క్తంబగు దివ్యకాంచన రథంబు లసచ్చ పలాంశుపుంజర మ్యంబగు దాని నెక్కి ధృతిమందరుఁ డింద్రసుతుండు నాకలో కంబుననుండి వచ్చెఁ బ్రవికాశిత తేజుఁ డిన ప్రకాశుఁడై.
3_4_040 వ. ఇట్లు చనుదెంచి ధనంజయుండు రోమశ ధౌమ్య ధర్మజ భీమసేనుల పాదంబులకుం బరమ భక్తి మ్రొక్కి వినయావనతు లయిన కవల నెత్తి కౌఁగిలించుకొని ద్రౌపదీ హృదయ నయనానంబుజంబుల కానందంబు సేయు చున్నంత నందఱు సంతసిల్లి మాతలి నతిప్రీతిఁ బూజించిన నతండును దివ్యరథంబు గొని దివంబున కరిగె నట్టి యవసరంబున.
3_4_041 క. దిననాథుఁ డస్తగిరిఁ బొం దినఁ జీఁకటి బాచి యాత్మ తేజమున దిగం గనల విభూషించుచు రజ ని నాథ కలహంస గగననిమ్నగ నొప్పెన్.
3_4_042 వ. ఆ రాత్రి యర్జునుం డనుజుల నందఱ నొద్దఁ బెట్టుకొని యిష్టపూర్వకథలు సెప్పుచు శయనించె నంతఁ బ్రభాతంబగుడు సిద్ధముని గణంబులయు రోమశు ధౌమ్యులయుఁ దమ్మలయుఁదోడ ధర్మతనయుండు సఖోపవిష్టుండై యున్నంత.
-ఇంద్రుఁడు పాండవుల యొద్దకు వచ్చుట - సం. 3-162-5
3_4_043 సీ. బోరన సుర దుందుభుల నినాదంబులు గిన్నర గంధర్వ గీతరవము లెసఁగ సహస్ర సూర్యేందు మండలములు వోలె విమానము ల్బొలిచి వెలుఁగఁ బాండవాలోకన పరుఁడై సహస్రాక్షుఁ డమర గణంబుతో నమ్మహాద్రి కేతెంచెఁ బ్రీతి నయ్యింద్రున కందఱు నంత నభ్యుద్గతులైరి పాండ
ఆ. వాగ్రజుండు దాను ననుజులు నింద్రుపా దాంబుజముల కెరఁగి యధికభక్తి శాస్త్రదృష్ట వివిధ సత్కార విథులఁ బూ జించె నమర ఖచర సిద్ధ పూజ్యు.
3_4_044 వ. ఇంద్రుండును వారల నందఱ నతి మధుర వచనంబుల నభినందించుచుఁ దదంతికస్థితు నధిక తపోయుక్తు ధనంజయుం జూపి ధర్మజున కిట్లనియె.
3_4_045 క. ఘనుఁ డీ పార్థుఁజు నా వల నన దివ్యాస్త్ర ప్రయోగ నయనిపుణుండై దనుజుల నివాతకవచుల ననిఁ జంపి సురావలికిఁ బ్రియం బొనరించెన్.
3_4_046 క. ఈతఁడు పరాక్రమమున న రాతుల వధియించి యిద్ధరా రాజ్యము వి ఖ్యాతముగ నిచ్చు నీకు మ హా తేజుఁ డజేయవీర్యుఁ డని నెవ్వరికిన్.
3_4_047 క. అని చెప్పి యనిమిష ప్రభుఁ డనిమిష నివహంబుతోడ నమరావతికిం జనియె నిజాలోకసమున కనఘులు పాండవులు హర్షమందుచు నుండన్.
3_4_048 మధ్యాక్కర. ఘనముగ ధనరేంద్ర పాండుసుతసమాగమ మొక్క యేఁడు దనరంగ బ్రహ్మచర్య వ్రతస్థులై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములును జదివిన వారు విభుత నూఱేండ్లు నొనర జీవింతు రత్యంతమగు కాంతియుక్తులై ధరణి.
3_4_049 వ. ఇట్లు సురేంద్రుం డరిగిన ధర్మతనయుం డర్జునుం జూచి పరమానంద భరిత హృదయుండై యిట్లనియె.
3_4_050 సీ. హరుఁ డాదిగాఁ గల యమర గణంబుచేఁ బడసి దివ్యాస్త్రముల్ పరమమైన యుపకార మమరుల కొనరించె నీ పార్థుఁడని నాకుఁ జెప్పె వృత్రాంతకుండు దివ్యాస్త్రలాభమ్ము దేవేంద్రునకుఁ బ్రీతిగా వేల్పులకు నుపకారి వైన విధమును మాకిప్డు విన వేడ్క యైనది యని తన్ను నడిగిన నగ్రజునకుఁ
ఆ. నగ్ర జన్మ పూజ్యులగు ధౌమ్యరోమశ భ్రాతృవరుల యొద్దఁ బాండవేయుఁ డసదృశ ప్రభావుఁ డతివీరుఁ డర్జునుఁ డాత్మచరిత మిట్టు లనుచుఁ జెప్పె.
3_4_051 వ. ఏను భవదాదిష్ట విద్యా ప్రకారంబున తపోనియుక్తుండనై హిమవంతంబునకుం జని యందు నా ముందట వృద్ధ బ్రాహ్మణుండై యున్న వృద్ధశ్రవుం గని తదుపదేశంబున నీశ్వరుఁ గుఱించి యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు గిరాత రూప ధరుండై నాతోడ నతిఘోర యుద్ధంబు సేసి నాకుఁ బ్రసన్నుఁడై నిజరూపంబుఁ జూపి పాశుపతాస్త్రంబుఁ బ్రసాదించె ననంతరంబ యింద్రాది దేవతల వలన నైంద్రాగ్నేయ యాన్యు రాక్షస వారుణ వాయవ్య కౌబేర గాంధర్వ పైశాచ బ్రాహ్మ్యంబు లనంబరగు దివ్యాస్త్రంబులు వడసి మహేంద్రాను గృహీతుండనై మాతలి ప్రయుక్తంబైన దివ్యరథంబెక్కి యీ శరీరంబుతోడన యమరావతి కరిగి యం దమరేంద్రు నాచర్యుఁగా వరించి తత్ప్రసాదంబున దివ్యాస్త్రంబులు వడసి తత్ప్రయోగంబులును నుపసంహారంబులును నివర్తనంబులునుఁ బ్రాయశ్చత్తంబులును బ్రతిఘాతంబులును నేర్చిన నాకు సంతసిల్లి సురేంద్రుం డిట్లనియె.
3_4_052 క. నీ వఖిలాస్త్రవిదుండవు గావున నిన్నాజి నోర్వఁగా నోప రొరుల్ దేవతలకు బ్రాహ్మణులకుఁ గావింపు హితంబు దీనఁ గడు సిద్ధి యగున్.
3_4_053 క. నాకు గురుదక్షిణార్థము నాకహితార్థంబుగా జనస్తుత బుద్ధిం జేకొని నా పనిచిన పనిఁ బ్రాకటముగఁ జేయు మహిత భంజన శక్తిన్.
3_4_054 తే. జలధికుక్షిలో నుండి వీరులు నివాత కవచు లను మూఁడు కోట్ల దానవులు బలిమిఁ ద్రిదశులకు బాధసేయు చుండుదురు వారు నిహతు లగుదురు నీచేత మహితకీర్తి.
3_4_055 వ. అని తన తొడగిన దివ్యభూషణంబుల మణికిరీటంబున నన్ను విభూషితుం జేసి స్పర్శరూపం బైన యభేద్యకుచంబు నిచ్చి యజగర సన్నభం బయిన యిగ్గొనయంబు గాండీవంబునం దానయోజించి పదివేల హంగ మయూర వర్ణ మాననీయ హయంబుల బూనిన రథంబు మాతర ప్రయుక్తం బైన దాని నెక్కం బనిచి నివాత కవచవధార్థం బరుగు మని నియోగించిన నింద్రు వీడ్కొని చనుచున్న నాకు దేవత లిట్లనిరి.
3_4_056 ఉ. ఈ రథ మెక్కి తొల్లి యమరేంద్రుఁ డనేక సహస్ర సంఖ్య దే వారుల వృత్ర శంబర బలాదుల నుద్ధతులన్ జయించె వీ రారివిభేది నీవును బలాఢ్యుఁడవై వధియింపు ముగ్రమా యారతులన్ నివాత కవచా సురులన్ సమరాంతరంబునన్.
3_4_057 వ. అని నాకు దేవదత్తం బను శంఖం బిచ్చిన నేనును మాతలి సహితంబుగా రథం బెక్కి యతి త్వరిత గతి నరిగి.
- అర్జునుఁడు నివాతకవచు లను రాక్షసుల జయించిన కథ - సం. 3-166-1
3_4_058 క. ఫేనవదూర్మిచయంబుల నానా విధ మీన కూప్మనక్రంబుల శై లానుకృతి నొప్పుచున్న మ హానీరథిఁ గంటి నేను నమ్మాతలియున్.
3_4_059 వ. ఆ సముద్రోదరంబున విశాలాట్టాలక ప్రతోళికాలంకృతంబైన పురంబుఁ గని తద్ద్వారంబున శంఖధ్వానంబు సేసిన నది సకలదిఙ్మహీధర గుహా కుహరంబుల యందు బ్రతిశబ్ద జనకం బయిన దాని విని యలిగి దానవులు నానా విధాయుధ సన్నద్ధు లయి నిజకాయ కాళిమతమోభూతభువన లగుచు వచ్చి నా రథంబుఁ బరివేష్టించి.
3_4_060 క. ఉరు శస్త్ర వృష్టి నాపైఁ గురిసినఁ దత్క్షణమె యొక్కొకొనిపయి నేనున్ వరుసం బదేసి బాణము లరుదుగ నేసితి మహా భయంకర భంగిన్.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com