ఆలోచన చౌర్యాన్ని అరికట్టడం

Awadewit, Elcobbola, Jbmurray, Kablammo, Moonriddengirl మరియు Tony1 13 ఏప్రిల్ 2009 న రూపొందించిన చేపుస్తకానికి తెలుగు అనువాదం.


ఆంగ్ల వికీపీడియాలో గల వ్యాసం ప్రకారం గ్రంథచౌర్యం (Plagiarism) "వేరే ఎవరో రచయిత కూర్పును, భావాలని, భాషాశైలిని వాడుకొని లేదా దగ్గరగా అనుకరించి తన సొంత రచనగా చూపడం." సున్నితమైన మాటలలో చెప్పాలంటే మరొకరి మేధస్సును తన సొంతదిగా చెప్పుకోడం, పచ్చిగా చెప్పాలంటే దొంగతనం. రోబిన్ లెవిన్ పెన్స్లర్ తన రిసెర్చ్ ఎథిక్స్ : కేసెస్ అండ్ మెటీరియల్స్ (పరిశోధన మార్గదర్శకాలు : ఉదాహరణలు, వనరులు) లో చెప్పిన ప్రకారం "గ్రంథచౌర్యానికి పాల్పడిన వ్యక్తికిచ్చే అసలైన శిక్ష మేధో వర్గం నుండి వచ్చే అసహ్యభావం, ప్రతికూలత." గ్రంథచౌర్యం వికీ సముదాయానికి అప్రతిష్ఠను తేవచ్చు. వికీపీడియాకు తోడ్పడే ప్రతి వికీపీడియను సొంతంగానే వ్యాసాలను వ్రాయాలి, ఇతరుల రచనలను నేరుగా నకలు చేయ రాదు. ఇది చెప్పడానికి సులువే అయినా, గ్రంథచౌర్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం—ఇది ఒక లోతైన అంశం. మనకు తెలీకుండానే చాలా మంది వికీపీడియన్లము ఈ గ్రంథ చౌర్యానికి పాల్పడతాము. గ్రంథచౌర్యాన్ని అరికట్టడానికి మేలైన మార్గం గ్రంథచౌర్యం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం, ఎలా అరికట్టవచ్చో, ఒకవేళ మనకు గ్రంథచౌర్యం జరిగిన వ్యాసాలు ఎదురవుతే ఏమి చేయాలో అన్న విషయాలు తెలుసుకోవడమే!

గ్రంథచౌర్యాన్ని అర్థం చేసుకోవడం

వికీపీడియా ప్రాథమిక మూలం కాదు, ఇందులో మూల పరిశోధనలకు స్థానం లేదు; అందువలన వికీపీడియా వ్యాసాలలో ప్రతి విషయం కూడా ఒక నమ్మదగిన మూలంలో ప్రచురించినదై ఉండాలి. గ్రంథచౌర్యం వల్ల సమస్య ఇతరుల ఆలోచనలనో, భాషా శైలినో కాపీ కొట్టడం మాత్రమే కాదు, ఆయా ఆలోచనలని, భావాలను సదరు రచయిత చెప్పిన భావానికి విరుద్ధంగా చూపించడం - "ముఖ్యంగా అవి వికీపీడియన్ యొక్క సొంత రచన" గా ఆపాదించబడడం. ఒకవేళ విధిగా మూలాన్ని సూచిస్తూ వేరే వారి రచనలోని వ్యాఖ్యలను తీసుకొని వికీలో చూపించినా, కొటేషన్ మార్కులో పెట్టి (" లేదా ' లేదా ఇటాలిక్స్ లో) యథావిధిగా మూలంలో ఉన్న పదాలను చూపించక పోతే అది గ్రంథచౌర్యంగా పరిగణించబడుతుంది. మూలాలనేవి విశ్వవ్యాప్తంగా సమాచారానికి మూలంగా పరిగణిస్తారే తప్ప అసలు రచనలో వాడిన భాషాశైలినో, పదాలనో కాపీ కొట్టడానికి కాదు.

మూడు విధాలుగా గ్రంథచౌర్యం జరుగుతుంది : ౧. ఒక రచన నుండి అరువు తీసుకున్న పదబంధాలను, ఆలోచనలను వాడుతూ ఆ రచనని మూలంగా చూపించకపోవడం. ౨. రచన నుండి నేరుగా తీసుకున్న పదాలని/ఆలోచనలని కొటేషన్ మార్కుల్లో పెట్టి విడిగా చూపించకపోవడం.

౩. మూలం నుండి తెచ్చుకున్న పాఠ్యాన్ని సారాంశంగా వికీపీడియన్ సొంత భాషాశైలిలో కాకుండా మూలరచనలో ఉన్న వాక్యాలను యథాతథం గా వాడెయ్యటం.

విషయసేకరణ (ప్లాగియారిజం) కాపీరైట్ ఉల్లంఘనా ఒకటి కాదు. విషయసేకరణ కాపీరైట్ చేయబడిన రచనల నుండి మరియు ప్రజాసమర్పిత (కామన్ డోమియన్) రచనల ఆధారాల నుండి చేయబడుతుంది. వికీపీడియా మీద ఆరోపించబడిన విషయసేకరణ గురించిన ఆరోపణ గురించిన ఒక నివేదిక " వికీపీడియా సంపాదకులు పలు విషయసేకరిత వ్యాసాలను చేర్చుతున్నారు. అది సరే కాపీ చేయబడిన సమాచారం ప్రజాసమర్పిత సమాచారం నుండి సేకరించబడుతుంది ". వికీపీడియా సంపాదకుల ప్రతిస్పందన వాస్తవమైతే వారు దానిని వివరించడంలో పొరపాటు చేస్తున్నారు. జానే అస్టెన్ ప్రఖ్యాతి చెందిన నవల " ప్రైడ్ అండ్ ప్రీజ్యుడీస్" (1814) ప్రారంభవాఖ్యం " విశ్వజజీనమైన నిజం ఇది. వ్యక్తిగతంగా ఒకరు అదృష్టం స్వంతంసేసుకోవడం భార్యను కోరుకోవడంలోనే ఉంది". ఈ నవలా వాఖ్యం 1911 నాటి ఎంసిక్లోపీడియా బ్రిటానికా ప్రజాసమర్పిత సమాచారంలో చేర్చబడింది. ఇవి ఆస్టెన్ పదాలు. ఎవరికీ దీనిమీద అధికారం లేదన్నది వాస్తవం. అయినప్పటికీ మనం ఆవాఖ్య ఆమెది అని వివరించడం అవసరం. ఈ వాఖ్యని కోటేషన్స్ లేకుండా వ్యాసంలో చేర్చినట్లైతే వికీపీడియా ఆస్టెన్ వాఖ్యని విషయచౌర్యం చేసినట్లే. అదికాకుండా వాక్యనిర్మాణ ప్రయోజనాన్ని ఆమెకు చెందేలా వీకీపీడియన్లు పరిశోధకులలా వాఖ్యకు ఆధారం చూపుతూ రచయిత పేరును పేర్కొనడమే కాక ఆధారగ్రంథం మరియు పుస్తకం పుట సంఖ్యను కూడా తెలియజేయాలి.

వికీపీడియా వ్యాసాలలో విషయచౌర్యం (కాపీరైట్ ఉల్లంఘన) గురించి అధికంగా వివరించబడింది. అయినప్పటికీ విషయసేకరణ (ప్లాగియారిజం) గురించి వివరించలేదు. ఈ అంశం గురించి మార్గదర్శకాల మీద 2008 లో మాత్రమే దృష్టి సారించబడింది. 2005లో వికీపీడియా కో ఫౌండర్ జిమ్మీవేల్స్ ఈ విషయం మీద స్పష్టమైన అభిప్రాయాలు వెలువరించాడు: నన్ను కొంచం స్థిరంగా చెప్పనివ్వండి. చట్టపరమైన వివాదాలు(విషయసేకరణ సంబంధిత) ప్రధానమైనవి. అయినప్పటికీ ధర్మపరమైన వివాదాలు కూడా చాలా చాలా చాలా ప్రధానమైనవి. మనం వికీపీడియా విషయంలో వాటిని ఎదుర్కొనడానికి అవసరమైన శక్తిని సమీకరించుకోవాలి.

"" కామన్ నాలెడ్జ్ మినహాయింపును ఎలా చూడాలి ? "" వికీపీడియాలోని వ్యాసాలలోని అన్ని సమాచారాలకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే సమాచారం కామన్ నాలెడ్జ్ నుండి సేకరించబడుతుందో ... అది సాధారణంగా తెలిపేదేమిటంటే ... వికీపీడియా సంపాదకుడు సమాచారాన్ని ప్రత్యేకమైన ఆధారం నుండి గ్రహించినా దానిని తిరిగి చేర్చడం వివాదాంశమైన విషయసేకరణ కాదు. ఉదాహరణగా: అవి ఎమిలీ డికింసన్ తన జీవితకాలంలో ప్రచురించిన అతి కొన్ని పద్యాలని తెలిసినట్లైతే. అవి పలు ఆధారాలలో లభించినట్లైతే ప్రత్యేకంగా జనరల్ రిఫరెంస్ ఆధారాలలో లభించినవి మరియు సులభంగా సేకరించగలిగినవి అయితే వాటిని కామన్ నాలెడ్జ్‌గా భావించవచ్చు. వాటిని ఒక చలన చిత్రంలోని నటీనటుల అక్షారానుసారా పట్టికవంటి సృజనాత్మకారహిత జాబితాలలోని ఆధారభూతమైన సమాచారంగా తిరిగి అందించడాన్ని అనుమతించవచ్చు. వికీపీడియా పరిశీలనాత్మకత విధానం అలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది. అది సమాచార చౌర్యం కాదని నిరూపించడంలో విఫలతచెందడం సమస్యగా పరిణమిస్తుంది.

కామన్ నాలెడ్జ్ మరియు సృజనాత్మకారహిత మొదలైన సమాచారం మూలాధారాలు కావు. వీటికి సమాచారచౌర్యం అపాదించడం తగదు. తక్కువగా ప్రచారంలో ఉన్న సమాచారం అభిప్రాయాలు సృజనాత్మక సమాచారం తిరిగి అందించడం సమాచారచౌర్యంగా పరిగణించబడుతుంది కనుక దీనిని నివారించాలి. సంపాదకులు వీటిని అందించడంలో కడుజాగరూకత వహించాలి. సృజనాత్మక రచనలోని వాక్యాలను తిరిగి అందించిన సమయంలో వికీసంపాదకునికి దానిమీద సృజనాత్మక హక్కులు ఉండవు. అయినప్పటికీ ఇది కాపీరైట్ ఉల్లంఘన అని నిరూపించడానికి అవకాశం పరిమితం. యునైటెడ్ స్టేట్స్ కాఫీ రైట్ చట్టం అనుసరించి యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ " వికీపీడియా కాఫీరైట్ విషయాలు " వాస్తవికత కలిగినవి, వినయవిధేయతతో అందిచినవి లేక అస్పష్టమైనవి అయిన సృజనాత్మక రచనలు కలిగిన విషయాలను సులువుగా వర్గీకరించవచ్చు. అత్యధికమైన సృజనాత్మకత కలిగిన రచనలను సమాచారసేకరణ విధులను అనుసరిస్తూ అందించవచ్చు. " డికిన్సన్ 1830 డిసెంబర్ 14 జన్మించాడు" అనేవాక్యాన్ని కొటేషన్లు లేకుండా అందించవచ్చు. అయినా ఆరచన అంతా సృజనాత్మకమైనది ఔనా కాదా గ్రహించడంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ మార్గంలో మొత్తం రచనను తిరిగి అందించకూడదు. కామన్ నాలెడ్జ్ మరియు సృజనాత్మకారహితం అన్నది సమాచార నిడివిని అనుసరించి నిర్ణయించబడుతుంది. మంచి సంపాదకులు అది ఎక్కడ మొదలైనది అని గ్రహించగలుగుతారు.

సృజనాత్మక రచనలు కోటేషన్ల మధ్య సరైన పద్ధతిలో అందించాలి. సమాచారసేకరణ విధులను అనుసరిస్తూ సంఘటనలకు వివరణ ఇవ్వాలి.

" సమాచార చౌర్యాన్ని నివారించడం " వ్యాసాలను నిర్మించే సమయంలో విశ్వసనీయమైన ములాధారాలను చదివి తెలుసుకోవాలి. ఇతరుల ఊహలను మరియు వారి రచనలను సరైన పద్ధతిలో వాడడం తెలుసుకుని ఉండడం అతిప్రధానమైనది. వికీపీడియా సంపాదకులు ఎప్పుడు ఎలా సృజనాత్మకతకు గుర్తింపు ఇవ్వాలి? మరియు ఎలా మూలాధారాలని సేకరించాలి? వాటిని వ్యాసాలలో ఎలా చేర్చాలి కొటేషన్లు ఎప్పుడు ఇవ్వాలి? అన్నవి తెలుసుకుని ఉండాలి.

కొటేషన్

మార్చు

వికీసంపాదకులు సమాచారచౌర్యాన్ని అరికట్టడానికి రచయితల రచనలను యథాతథంగా అందించాలి. కొటేషన్లు వాడాలి. మూల అధారాలలో ఉన్నదానిని అలాగే కొటేషన్ల మద్య అందించాలి. అయినప్పటికీ డైరెక్ట్ కోటేషన్లు అధికంగా వాడకూడదు. ఉచిత ఆధారాలు కాకుంటే అధికమైన వాడకం కాఫీరైట్ ఉల్లంఘన క్రిందకు వచ్చే అవకాశం ఉంది. వికీపీడియా అందిస్తున్న ఉచితంకాని ఆధారాలను ఉపయోగించే విధానాలలో కోటేషన్లు ఎప్పుడు వాడాలి అన్నది వివరిస్తూ కొటేషన్లు అధికంగా వాడడం నిషేధిస్తుంది. ఉచిత ఆధారాలు ఉపయోగిస్తూ వ్యాసాలను వ్రాసేసమయంలో అధికంగా కొటేషన్లు ఉపయోగిస్తే అది కొటేషన్ల సేకరణగా పరిగణించబడితుంది. కొటేషన్లు అధికంగా ఉపయోగిస్తే విభజన స్పష్టంగ ఉండదు. పాఠకులు విషయాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు.

కొటేషన్లు క్రింది సాధారణంగా సందర్భాలలో వాడుతుంటారు.

  • " ఎప్పుడైతే వైవిధ్యమైన భావవ్యక్తీకరణ ఉంటుందో "
  • " సాంకేతిక వివరణకు ఖచ్చితమైన పదాలు ఎప్పుడు అవసరమౌతాయో ".
  • " ఎప్పుడు ఒక విషయమై వాదోపవాదాలు ఉత్పన్నమయ్యాయో. అది యథాతథంగా వివరించాలన్న ఆవశ్యకత కలిగినప్పుడు వారి వారి మాటలలో వివరించడానికి "
  • " వివాదానికి యథాతథమైన మాటలు బలం చేరుస్తాయి అనుకున్న సమయంలో "
  • " మీ చర్చలలో ప్రధానాంశానికి అవసరమైన ఆధారాలు అవసరమైనసమయంలో " == ఆధారాలు స్వీకరించడం: సరళీకరణ మరియు సంక్షేపం==

సాధారణంగా సమాచార ఆధారాలు గ్రహించి సరళీకరణ మరియు సంక్షేపం ఉపయోగిస్తూ వ్యాసాలలో అందించాలి. సాధారణంగా వివరించే సమయంలో ఈ రెండు శైలిలో వైవిధ్యం ఉంటుంది. సాధారణంగా పొడవైన వివరణను తగ్గించడానికి ప్రధానాంశాలను స్వీకరిస్తూ ఉదాహరణలు మరియు వివరణలను విడవడం లేక తక్కువగా తీసుకుంటూ సంక్షేపవిధానం ఉపయోగిస్తారు. సాధారణంగా సంక్షేపం అసలు సమాచార ఆధారం కంటే తక్కువ నిడివి కలిగినదై ఉంటుంది. సరళీకరణ అసలు సమాచార ఆధారానికి సమీపమైన నిడివి కలిగి ఉండడం లేక మరికొంత నిడివి అధికంగా ఉంటుంది.

ఆధారాలు స్వీకరించే సమయంలో సరళీకరణ మరియు సంక్షేపం చేయడం విలువైన నిపుణత కలిగి ఉండడంగా భావించవచ్చు. వికీపీడియా సంపాదకులు సమాచారసేకరణ విధులను అనుసరించడంలో అప్రమత్తులై ఉండాలి. అనేక మంది వికీసంపాదకులు ఇక్కడా అక్కడా కొన్ని పదాలను మార్చడం లేక మూలాధారంలో ఉన్న పలు పదాలను మార్చడం ద్వారా సమాచారచౌర్యాన్ని అరికట్టవచ్చని విశ్వసిస్తారు. ఇది అవసరం లేదు. ఉపవాఖ్యాలు లేక వాఖ్యాలు లేక పారాగ్రాఫ్ మార్చడం సమస్యకు మార్గం కాదు.

" సరళీకరణ చేయడంలో సమస్యలు " ఈ ఉదాహరణలో : వికీపీడియా వ్యాసాలలోని సమాచారం మూలాధారం లోని సమాచారాన్ని సరళీకరణ చేసేప్రయత్నం జరిగింది. మూలాధారంలోని పదాలు, పదక్రమణం మరియు వాక్యనిర్మాణం దాదాపు పూర్తిగా ఉపయోగించబడ్డాయి.

" మూలాధారం " సమాచారం అందుకున్న(రిసీవర్) వారి అంగీకార ప్రకటన: డేలోట్టీకి చెందిన డేవిడ్ కర్సన్ 670 ఉద్యోగులలో 480 మంది తిరిగి నియమించబడ్డారు....కనీసం 100 మంది వాటర్ ఫోర్డ్ ఉద్యోగులు ఈరాత్రి ఫ్యాక్టరీ లోని సందర్శనశాలను (విజిటర్స్ గ్యాలరీ) ని వదిలి వెళ్ళాడానికి నిరాకరిస్తున్నారు. అలాగే అనధికార బైఠాయింపు ప్రదర్శన చేస్తున్నారు. మిస్టర్ కార్సన్‌ను నేరుగా కలిసే వరకు వెళ్ళమని ఉద్యోగులు అంటున్నారు... ఇక్కడ జరిగిన చిన్నపాటి ఘర్షణలో సందర్శనశాల ముఖద్వారం దెబ్బతిన్నది. ప్రాంతీయ సిన్ ఫెయిన్ కౌన్సులర్ సందర్శనశాలను ఆక్రమించుకున్న వారిలో ఒకరైన జో కెల్లీ ఉద్యోగులతో ఇలా అన్నాడు " ఆసక్తి కలిగిన పెట్టుబడిదారులు ఉన్నంత కాలం కంపెనీ మూతపడదు " . రిసీవర్.

వికీపీడియా ఆర్టికల్ : రిసీవర్ ఇచ్చిన వాగ్మూలంలో : డెలోట్టీ డేవిడ్ కార్సన్ 670 ఉద్యోగులలో 480 మంది ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఎదురుచూడని నిర్ణయానికి ఉద్యోగులు ఆగ్రాహానికి గురైయ్యారు. ఆరాత్రి దాదాపు 100 మంది ఉద్యోగులు సందర్శనశాల వద్ద అనధికారిక బైఠాయింపు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉద్యోగులు తాము కార్సన్‌ను కలిసేవరకు వదిలివెళ్ళడానికి నిరాకరిస్తున్నమని సూచించారు. తరువాత అక్కడ జరిగిన చిన్నపాటి ఘర్షణలో సందర్శన కేంద్రం ముఖద్వారం దెబ్బతిన్నది. ఎవరైతే సందర్శనశాలను ఆక్రమించుకున్నారో వారిలో ప్రాంతీయ సిన్ ఫెయిన్ కౌన్సిలర్ జో కెల్లీ ఉన్నాడు" విశ్లేషకులు:

  • రీవర్ వెలువరించిన ఒక వాక్యం: డెలొట్టీ డేవిడ్ కర్సన్. 670 ఉద్యోగులలో 480 మంది ఉద్యోగం నుండి తొలగించబడ్డారని నిర్ధారించాడు. బదులుగా రీసీవర్ నుండి ఒక ప్రకటన : డెలొట్టీ డేవిడ్ కర్సన్ 670 ఉద్యోగులలో 480 మంది ఉద్యోగం నుండి తొలగించబడవచ్చని నిర్ధారించాడు. వికీపీడియా ప్రకటన నిర్మాణం ప్రధానంగా ములాధారానికి యథాతథంగా ఉంటుంది. చిన్న పదం మార్చడం మరియు కొత్త క్రమానుసార విధానంలో మార్పులు చేయడం

సమన్వయ వివరణకు చాలవు.

  • వారు కర్సన్‌ను కలిసే వరకు వదిలి వెళ్ళడానికి వారు నిరాకరించారు. బదులుగా. ఉద్యోగులు

కర్సన్‌ను కలిసేవరకు తాము వదిలి వెళ్ళేది లేదని చెప్పారు . ఈ వాక్యనిర్మాణం ఒకేలా ఉంది.

  • అక్కడ జరిగిన చిన్నపాటి ఘర్షణలో సందర్శనాకేంద్రం ముఖద్వారం దెబ్బతిన్నది. బదులుగా ఒక పాయింట్ వద్ద ఘర్షణ జరిగింది మరియు సందర్శనాకేంద్రం ముఖద్వారం దెబ్బతిన్నది. రెండు వాక్యాల నిర్మాణం మరియు భాష ఒకటిగానే ఉంది.
  1. లోకల్ సిన్ ఫెయిన్ కౌన్సిలర్ జో కెల్లీ సందర్శనశాలను ఆక్రమించారో వారిలో ఒకడుగా ఉన్నాడు. బదులుగా లోకల్ సిన్ ఫెయిన్ కౌన్సిలర్ జో కెల్లీ ప్రస్తుతం ఎవరైతే సందర్శనశాలను ఆక్రమించారో వారిలో ఒకడుగా ఉన్నాడు. ఈ స్వల్పమైన మార్పులు వాస్తవ సంఘటనను మార్చదు. సమాచారంలో అంతర్లీనంగా ఉన్న నిర్మాణం మరియు భాష దాదాపు ఒకటే. వారిలో ఒకడుగా మరియు ఆక్రమించిన ...> ప్రస్తుతం ఆక్రమించిన ... > వంటి స్వల్పమైన మార్పులు మాత్రమే చేయబడ్డాయి. అయినా ములాఫ్హారాన్ని తిరిగి వ్రాయడానికి ఇది చాలదు.

" మంచి స్వీకరణ అభ్యసించడం " సమాచార సేకరణ మరియు సమాచార చౌర్యం విధానాలు రచయిత కాని రచయిత్రి కాని సృష్టించిన సృజనాత్మక రచన మీద రచయితకు అధికారం ఉంటుంది. అయినప్పటికీ సృజనాత్మక సృష్టిని అందించడానికి వ్యాసంలో పొందుపరచడానికి అవకాశాలు మితంగా ఉంటాయి. సమాచారచౌర్యం లేనిది సమాచారసేకరణా విధానాలలో అది కామన్ నాలెడ్జ్‌లో లేకుంటే రచయితకు సృజనాత్మక రచన మీద స్వాధీనత మరియు అభ్యంతర పెట్టడానికి అవకాశం ఉంటుంది. సమాచారసేకరణ అంటే పూర్తిగా ములాధారాన్ని మార్చివ్రాయాలి.

ఈ వివరణలో భాష మరియు నిర్మాణం గణనీయంగా మార్చబడింది. ములాధార ఊహలను ప్రతిబింబించేలా ఉంది. ఉహలు రచయితకు తగినంత గుర్తింపు ఇవ్వబడింది.

మూలాధారం:

ఆరంభకాలంలో సమాచారం మీద పర్యవేక్షణ పరిమితంగా ఉంది. పర్యవేక్షకుడు మొదటగా పరిశీలించి నమోదు చేస్తాడు. కంప్యూటర్ కాలంలో పర్యవేక్షణ వెనువెంటనే, స్పష్టంగా, చౌకగా మరియు ప్రధానంగా సులువుగా చేయడానికి వీలుపడుతుంది. వివరణ:

" పరిశీలకుడు కార్ల్ బోతన్ మరుయు మిహేలా వొర్వోరియాను పర్యవేక్షణ చేస్తున్న ప్రదేశ సహజ స్థితిలో మార్పులు సంభవించాయని వాదించారు. కంప్యూటర్ రాకముందు అధికారులు వారి ఉద్యోగుల గురించి వారు చూసినది మరియు విన్నదాని మీద ఆధారపడి కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే సేకరించగలిగారు. అందువలన ఉద్యోగుల పనిప్రదేశ సాంకేతికస్థితిని కంప్యూటర్లు నిర్ణయిస్తున్నాయి. అధికారులు ఉద్యోగుల సామర్థ్యం వివరంగా గ్రహించగలుగుతున్నారు. "

థోమస్ ఈకిన్స్ " స్విమ్మింగ్ హోల్ " నుండి వ్రాసిన వ్యాసం నుండి స్వీకరించిన సమాచారం అభిప్రాయ ప్రకటన మరియు కోటేషన్లు మరియు వివరణ సమ్మిశ్రితగా అందించబడింది.

ది స్విమ్మింగ్ హోల్ ఈకిన్స్ సాంకేతికత మరియు విద్యావిధానాల గురించి పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి ప్రాతినిధ్యం వహించింది ఆయన తనకు ఆసక్తికలిగిన మానవత్వ రూపం (హ్యూమన్ ఫాం) వ్యక్తం చేయడానికి జీవన అధ్యయనం, తత్వం, వాక్స్ స్టడీస్ మరియు ప్రకృతి దృశ్యాల రేఖాచిత్రాలు ఆధారం చేసుకుని వివరించాడు. లాయ్డ్ గుడ్ రిచ్ (1897-1997) ఈ రచన ద్వారా ఈకిన్స్ " రూపరహిత ఉపయోగం అత్యంత నైపుణ్యంగా " ఇచ్చాడని. దృఢమైన ఊహతో రూపాలను ప్రకృతి దృశ్యంలో ఖచ్చితంగా మిశ్రితం చేసాడని విశ్వసించాడు. ఆయన " సూక్ష్మ టోనల్ నిర్మాణం మరియు ఒక కళాకారుడు " చిత్రం అత్యంత విలువైనదని భావించాడు. మరొక ఆత్మకథా రచయిత విలియం ఇన్నెస్ హోమర్ (బి 1929) అత్యంత రక్షితమైనది రూపాల భంగిమ దృఢమైన విద్యావిలువలు కలిగి ఉన్నాయని వివరించాడు. హోమర్ చిత్రం నాణ్యత అస్థిరమైనదని మరియు వాతావరణ ప్రభావానికి లోనైందని, పూర్వీకత మరియు సహజత్వ సమన్వయం సాధించడంలో ఈ చిత్రం విఫలమైనదని భావించాడు. నగ్నరూపాలు అమాంతం స్టూడియో నుండి చిత్రంలో తరలించబడ్డాయని " భావించాడు.

దురదృష్టకరంగా సమాచారచౌర్యం నివారించడానికి (అవసరమైన) (దృఢమైన)కఠినమైన మరియు వేగవంతమైన (షరతులు) నిబంధనలు లేవు. కాఫీరైట్ చింతనల విలువకట్టడానికి యునైటెడ్ స్టేట్స్ కోర్టులు స్వీకరించిన " గణనీయమైన పోలికలు " పరీక్షలో రెండు రచనల మద్య విబేధాల కంటే రెండు రచనలని సాధారణ పరిశోధకుడు పరిశీలించిన కోణంలో రెండు రచనల మధ్య శైలి మరియు క్రమం మరియు రచనా సౌందర్యం ఒకేలా ఉన్నాయా పోల్చి చూడడం జరుగుతుంది. భాషను కూడా పరిశీలించి కోర్ట్ " కాంప్రహెన్సివ్ నాన్ - లిటరల్ సిమిలారిటీ " అనుసరించి ఒకవేళ రెండు రచనల శైలి మరియు క్రమం ఒకేలా ఉంటే కాఫీరైట్ ఉల్లంఘనగా నిర్ణయిస్తారు. విషయసేకరణ నిరూపితమైతే పాఠకులు రెండు రచనలు ఒకే అంశం కలిగి ఉన్నాయా లేక మరొక దాని మీద అధికంగా ఆధారపడి (ఉందా)ఉన్నాయా అని పరిశీలిస్తారు.

వికీ సంపాదకులు చివరిగా, వారి రచనలను, వారు తమ రచనలను చేయడానికి తీసుకున్న మూల రచనలతో (ఆధారాలతో) పోల్చి చూసుకుని రెండూ (ప్రమాదవశాత్తు) పొరబాటున కూడా భాషా మరియు వాక్య నిర్మాణంలో రెండింటికి (సమీపంలో) సామీప్యత లేదని నిర్ధారించుకుని, అవసరమైన సందర్భాలలో రచయితకు గుర్తింపు ఇవ్వబడిందా లేదా అని కూడ నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది. వికీసంపాదకులు సమాచారాన్ని కాఫీ మరియు పేస్ట్ చేయకుండా సంక్షిప్తరూపం తయారు చేసుకుని తమ రచనలలో అందిచడం సురక్షితమైన ఒక మార్గం. సంపాదకులు వారి నోట్స్ తయారు చేసుకుని అందించాలి. అది వారి స్వంత దస్తూరీతో కాని ఎలెక్ట్రానిక్ పరికరాలతో కాని తయారుచేసుకోవాలి. సంపాదకులు ఆధారాలను చదివి పరిశీలించి సమాచారాన్ని గ్రహించి వారి స్వంత పదాలను ఉపయోగించి ప్రధానాంశాన్ని వ్యాసరూపంలో అందించాలి. ఈ వ్యాసాలు సంపాదకులు స్వంత నిర్వహణా సామర్థ్యంతో నిర్మించుకోవాలి. ప్రధానాంశాలను నిర్వహించడానికి పలు మార్గాలు ఉన్నాయి : సంపాదకులు ములాధారాన్ని అనుసరించి మొత్తం నిర్వహణ, వాక్యాలు మరియు ఒక్కొక విభాగంలోని పారగ్రాఫ్‌ల క్రమానుసరణ వ్యాసంలో గ్రుడ్డిగా చేర్చకూడదు. ఈ విధానం ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకరిస్తాయి.

అదే సమయం మూలాధరం నుండి నోట్స్ వారి స్వంత ఉపయోగానికి సేకరించి యథాతథంగా అందించడం ఉపయోగకరమైనదని సంపాదకులు గ్రహించాలి. మూలాధారాన్ని అందించడానికి వీలు లేకుంటే వైవిధ్యంగా భాషను ఉపయోగించి నోట్స్ తయారు చేసుకోవాలి. సంపాదకులు లేక సంపాదకురాలు వ్యాసనిర్మాణంలో రచయిత స్వంత పదాలు ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా సమస్యను నివారించవచ్చు.

వీలైతే పలు మూలాధారాలను ఉపయోగించాలి. ఆ సమాచారం ఒకే ములాధారం నుండి గ్రహించిందని తెలుసుకోవడం కష్టం. మూలాధరం నుండి కొంతసారం మాత్రమే గ్రహించబడుతుంది. ఒక మూలాధారం నుండి అధిక సమాచారం సేకరించినట్లైతే సమాచారసేకరణ మరియు సమాచారచౌర్యం నిరూపించడానికి శ్రమపడవలసిన అవసరం లేదు.

"నోట్స్"

  1. లెయిట్ డేవిడ్ (1999)" ప్లాగియారిజం ఆస్ మెటాఫర్ " ఇన్ బ్యురానెన్ లైస్ అండ్ రాయ్ అలైస్ మేయర్ పర్స్పెక్టివ్స్ ఆన్ ప్లాగియారిజం మరియు ఇంటెలెక్చ్యుయల్ ప్రాపర్టీ పోస్ట్ మోడర్న్ వరల్డ్. బఫెల్లో: సునీ ప్రెస్ పి.221. ఐ.ఎస్.బి.ఎన్ 0791440796.
  2. పెంస్లర్ రాబిన్ లెవిన్ (1995) రీసెర్చ్ ఎథిక్స్: కేసెస్ అండ్ మెటీరియల్స్ బ్లూమింగ్టన్: ఇండియానా యూనివర్శిటీ ప్రెస్ : పి 148 ఐ.ఎస్.బి.ఎన్. 0253209064.
  3. హాకర్ డైనా ఈ ప్యాకెట్ స్టైల్ మాన్యుయల్(5 ఇ.డి) బోస్టన్: బెడ్‌ఫోర్డ్ స్ట్రీట్: మార్టింస్: పి 107: ఐ.ఎస్.బి.ఎన్. 0312559933.
  4. ఫిష్‌మెన్ స్టీఫెన్(2008). పబ్లిక్ డోమియన్: హౌ టు ఫైండ్ & యూస్ కాఫీ రైట్ ఫ్రీ, రైటింగ్స్, మ్యూజిక్, ఆర్ట్ & మోర్ (4వ ఇల్లస్ట్రేటెడ్ రివైస్డ్ ఇ.డి) నొలొ పి. 35. ఐ.ఎస్.బి.ఎన్. 01413308589. టు అవాయ్డ్ ప్లాగియారిజం ఆథర్స్ ఆఫ్ స్కాలరీ వర్క్స్... ఆల్వేస్ గివ్ ప్రాపర్ క్రెడిట్ టుది సౌర్స్ ఆఫ్ దేర్ ఐడియాస్ అండ్ ఫాక్ట్స్, యాజ్ వెల్ యాజ్ ఎనీ వర్క్ దే బారో. థిస్ ఇస్ సో ఈవెన్ ఇఫ్ ది వర్క్ బారోడ్ ఫ్రం పబ్లిక్ డోమియన్.
  5. జెస్డనన్ అనిక్ (4 నవంబర్ 2006) " వికీపీడియా క్రిటిక్ ఫైండ్స్ కాఫీడ్ పాసేజెస్." సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్.అసోసియేటెడ్ ప్రెస్ .
  6. అస్టిన్ జానె (1945) [ఫస్ట్ పబ్లిష్డ్ 1813]. ప్రైడ్ అండ్ ప్రీజ్యుడీస్. చికాగో: చార్లెస్ స్క్రిబ్నర్స్ సన్స్ పి. 1.
  7. ది రిక్వైర్మెంట్ ఫర్ ది యూజ్ ఆఫ్ కొటేషన్ మార్క్స్ ఆన్ ది వికీపీడియా. టు డూప్లికేట్ పబ్లిక్ డోమియన్ టెక్స్ట్. వేర్ అట్రిబ్యూషన్ ఇస్ అబ్వియస్. ఇస్ డిస్ప్యూటెడ్ సీ వికీపీడియా టాక్.
  8. వేల్స్ జిమ్మీ (25 డిసెంబర్ 2005) " కామెంట్" వికీపీడియా.
  9. హాకర్ ఆఫర్స్ దిస్ ఈజ్ ఏజ్ ఏన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కామన్ నాలెడ్జ్ (పి 107)
  10. ఫెయిస్ట్ పబ్లికేషంస్ వి రూరల్ టెలిఫోన్ సర్వీస్ 499 యు.ఎస్. 340 యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్1991).
  11. ట్రస్ లిన్నే (2004) ఈట్స్ షూట్స్ అండ్ లీవ్స్ జీరో టెఫోన్ అప్రోచ్ టు పంక్చ్యుయేషన్.

న్యూయార్క్ గోతం పి.పి 151-52. ఐ.ఎస్.బి.ఎన్ 01592400876.

  1. హాకర్ పి. 110
  2. హాకర్ పి. 109.
  3. స్వెల్ డారెల్ కాథరిన్ ఎ ఫోస్టర్ ఫిలడెల్ఫియా. మ్యూజియం ఆఫ్ ఆర్ట్ డీ' ఓర్సె. మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(2001). థోమస్ ఈకిన్స్. న్యూ హెవెన్ ఏల్ యూనివర్శిటీ. ప్రెస్ పి 100. ఐ.ఎస్.బి.ఎన్. 0300091117.
  4. గుడ్‌రిచ్ లాయ్డ్ (1982) థోమస్ ఈకింస్. వాల్యూం 1: కేంబ్రిడ్జ్: హార్వర్డ్: యూనివర్శిటీ: ప్రెస్ పి.పి. 239-40.ఐ.ఎస్.బి.ఎన్ 0674884906.
  5. హోమర్ విలియం ఇన్స్ (1992) థోమస్ ఈకింస్: హీజ్ లైఫ్ అండ్ హీస్ వర్క్ న్యూ యార్క్:

అబ్బెవిల్లె. పి 116. ఐ.ఎస్.బి.ఎన్. 1-55859-281-4.

  1. పీటర్ పాన్ ఫ్యాబ్రిక్స్ ఐ.ఎన్.సి. వి.మారిన్ వీనర్: కార్పొరేషన్- 274ఎఫ్.2డి.487, 489(2డి సర్కిల్ 1960)
  2. అరికా వి పాల్మర్ 970, ఎఫ్.2డి. 106 (2డి సర్కిల్ 1992).