11
ఉ|| పిక్కపిఱుందులం దఱచుపీఁకుడుగానము మానవాళి. నా

ఒక్కనికోసమే ద్రుహిణుఁ డోపికతోడ సృజింపఁబోలు. అ

మ్మక్క! భిషక్కు లొక్కరును వ్యాధ్యభిధానము చెప్పలేకయే

ప్రక్కలుచూతురొక్కొ యిది ప్రాతయలంతయెయైన భాస్కరా!

ఉ|| దగ్గఱ వైద్యు లెవ్వరును దానిస్వరూప మెఱుంగరైరి. ఇం

కగ్గిరిరావొ రాను గబురంపుచునుండు ప్రసాదరావొ తా

మిగ్గదముం గుదుర్తురని యెంతయు నమ్మకముండె. వారల౯

డగ్గర నెంతకుం దెఱపి నాకుఁ దటస్థముగాదు భాస్కరా! ౭౧

ఉ|| చన్నవి రెణ్నెలల్. పనులు సాఁగ వొకించుకగూడ. అప్డునా

కున్నయసాధ్యమైనపని యొక్కఁడె. అయ్యది యెద్దియన్న నా

అన్నకొమాళ్ళపాలఁ గలయప్పుపరిష్కృతి. అద్ది యెన్నినా

ళ్ళున్నన్ను దీరదయ్యె. అదియు౯ మదదృష్టముకాదె భాస్కరా!

ఉ|| తీరియుఁ దీరకుండఁగ నె తిరిక యించుక నాకుఁజిక్కుడు౯

దూరగతామలాపురముత్రోవను బోవక యంతకన్నను౯

చెరువయైన బందరును జేరఁగఁబో గిరిరావుగారు న౯

గౌరవబుద్ధిఁ జూచి యొసఁగందగువాని నొసంగె భాస్కరా!

చం|| నలువది యేండ్లప్రాంతమున నాకుఁ దదర్పితముల్ సులోచనం

బులు. పదునాలుగేడు లవి పుస్తకము ల్చదివించె. వానితో

కలపని లేకపోయె నిఁక. గ్రంథము లెవియు లేకె చూడఁగ౯

కలిగితిఁగావి దూరగము గంగొనఁజాలఁగనైతి భాస్కరా!

ఉ|| తద్దయు దూరదృష్టి యటుతగ్గుతయు౯ గిరిరావునొద్ద నీ

అద్దములు౯ లభించుననునాస మఱెవ్వియుఁ బెట్టుకోకయే

ప్రొద్దులుపుచ్చఁబుచ్చ నటుపోవుట నాఁటికి సంభవించె నా.

కద్ది వచింప నాతఁ డపు డక్షుల నద్దము లుంచె భాస్కరా!

ఉ|| చెప్పితిఁ బిక్కలాగు. డది చిన్నయలంతయకాఁ దలంచుచు౯

చప్పున నెదొ యీఁగడఁగె. చన్నవి కొన్నిదినంబు. లెంతకు౯

నొప్పి శమింప.దస్మదురునోదన మూత్రపరీక్షచేసి తా

అప్పుడు ధాతుపాతమును నాతఁడెఱుంగఁగఁగల్గె భాస్కరా! ౭౬
12
శా|| ఆయోజఃక్షతి ము౯ గ్రహించినఘనుం డాతండె. ఎన్నాళ్లనాఁ

డో యైయుండినకార్యమౌట మఱచె౯. యోజించె న పెంతయు

ంధీయుక్తిం గటిజంఘలెంతయును నార్తింజేఁతకుం గారణం

బీయోజగక్షితియే యటం చెఱిఁగె. మందిచ్చెంగృప౯ భాస్కరా!

చ|| ఇరువది వాసరంబులకు నిచ్చుచ్చు మందును గొదుమన్న మే

మఱక భుజించుచుండుఁ డిఁక మాపుల నంచనిచెప్పిపుచ్చ నే

నరిగి యదెప్రకారముహ నన్నము మందును దింటిఁగాని నా

పిఱుఁదును బిక్క చక్కనయి పెంపువహింప వదేమొ భాస్కరా!

శా|| గోధూమోదనఖాదనంబుననొ తద్గుర్వౌషధప్రాశన

ప్రాధాన్యంబుననో నిరంతరకృతాభ్యాసంబునంజేసియో

బాధ౯ సైఁచుచు దూరమేనియు గమింపంజాలి తస్వార్త నే

నాధీమంతునిగూర్చి వ్రాసితిఁజుమీ హర్షంబున౯ భాస్కరా!

శా|| నే మున్నిచ్చినమందె విల్చి యదియు౯ నెమంబున౯ రాత్రి గో

ధూమాన్నంబును దించుఁ గొంతవడి యెందుంబోక స్వాగారవి

శ్రామంబుం గయికోఁ గ్రమంబుగ భవజ్జమ్ఘామయం బాగునం

చామిత్రుండు జవాబువ్రాసె నపుడే యత్యాదృతి౯ భాస్కరా!

మ|| ఎవ రేవ్రాఁతలు వ్రాసిన౯ నలువ మున్నేవ్రాఁత దా వ్రాసెనో

అవు నామాదిరిగాను గాన నిఁక నెట్లామందుఁ దెప్పింతు? మ

ద్భవనంబంద యెటు ల్వసింతు? నిలిపె౯ భ్రాత్రీయకార్యంబె న

న్నివలం గాలిడకుండ నాల్గునెల లింకేముండుదు౯ భాస్కరా!

మ|| ధనమా చాలినయంతలేదు. మఱియు౯ ధర్మప్రచారార్థమై

మును స్థాపించినమాసపత్రిక నెటో పోషించుచుండన్వలె౯.

మను ముద్రాక్షరశాలలోన ఋణ మేమాసార్థ మామాస మీ

యను లేకుంట. ఇఁకెట్టు లుందు నొకచో నానందినై భాస్కరా!

ఉ|| అర్థసమృద్ధి లేదు మొద లందుల కట్టిటు పోయిరాక యే

అర్థము నిర్వహించుకొనునర్హత లేక తపించుచుండునీ

వ్యర్థున కంఘ్రిలాగుడున కావల నప్పులలాగు డెక్కుడై

అర్థన కన్యదేశముల కన్పె. ఇఁకేమనువాఁడ భాస్కరా! ౮౩
13
చం|| అరిగి నిజాముదేశమున యానము లెవ్వి లభింపనట్టికా

సరణులఁ బిక్కలాగుడును సైఁచుచుఁ గాల్నడయే పొనర్చి రా

తిరులను గోదుమన్నమును దించుఁ గ్రమంబుగఁ బత్రికాభృతుల్

తిరిగి వసూలుచేయునెడ దేహముడస్సెఁ గరంబు భాస్కరా! ౮౪

డ|| డస్సినయట్టిదేహము హఠంబున వచ్చి జ్వరంబు సొచ్చుడు౯

భిస్స రుచింప కర్హమగుభేషజ మిచ్చెడివా ర్లభింప కే

నుస్సురటంచు స్వీయమగు నూరును జేరితిఁగాని యెంతకు౯

లెస్స వహింపలేక శకలీకృతచిత్తుఁడ నైతి భాస్కరా! ౮౫

మ|| జ్వరముక్తుండనుగాక కొన్నియహముల్ స్వాద్వన్న పానంబులం

దరుచిం గొన్నిదినంబు లభ్యవహృతం బౌనన్న పానీయముల్

త్వర జీర్నింపక కొన్నినాళ్లు మలనిర్బంధంబునం గొన్నినా

ళ్లరికట్టంబడియున్నవాఁడ నిటులే యార్మాసముల్ భాస్కరా! ౮౬

ఉ|| బొత్తిగ లేవలేకయును పూని పదంబులు పెట్టలేకయు౯

రిత్తగ నున్నదంతయును రెండెనెలల్. తరువాత వెండియు౯

క్రొత్తకవిత్వము౯ నడచె. కొల్లగ వ్యాసముల౯ లిఖించితి౯

విత్తముపొంటె నూళ్లపయి వెళ్లి చరించుచునుంటి భాస్కరా! ౮౭

ఉ|| ఏకవనంబు గూరుపకె యేబలువ్యాసముల౯ లిఖింపకే

ఏకడ కేగిరాకె మఱియె ట్లిఁకనాగరఖండముఖ్యగ్రం

థాకరమై మనీషిహృదయంగమమై యలరారుపత్రిక౯

సాఁకఁగలాఁడ? ధర్మమును జాతఁగలాఁడను నేను భాస్కరా

శా|| సారాంవీతపురాణధర్మనిజ భాషావ్యాపనోరుస్పృహ౯

ధీరంమన్యవిచారదూరజనతాధిక్కారకృత్యాదృతి౯

ప్రారబ్ధార్థము సాఁగుచుండవలెన౯ భావస్థమౌపూంకిని

ట్లారాటంపడుచుంటిఁగాని యగునే సారోగ్యత౯ భాస్కరా! ౮౯

ఉ|| పిక్కపిఱుందులందుఁ గలపీఁకుడడంగదు. నోటి కన్నము౯

మిక్కిలి పోదు. పోయినది నిత్తికి దీటయి పొట్ట యంతయు౯

నొక్కు. శకృత్తు వెల్వడదు. నోటియసహ్యత తీఱ. దొక్కనా

ఉక్కును లేమియుం గతములూఱటలేక చరింప భాస్కరా! ౯౦
14
చ|| గదమును రూపుమాపుటకు గట్టిప్రయత్నము చేయకుండనే

అది యిది తించు మూఱడిల కట్టిటు బిట్టుభ్రమించుచుండుడు౯

మెదు కొకయింతయు౯ రసనమీఁదికిఁ బోబక మై యసారమై

పదిలముగాను లేచుటకె పాల్పడదయ్యె నిఁకేమి భాస్కరా!

మ|| అలగుంటూర్పురి నప్డె నాకుఁ గడువ్రేఁగౌ పత్రికాకాత్యమే

ఒలయంబోవుట సంభవించి ఘనవైద్యుం డ౯ యశశ్శ్రీకిఁ దా

పలమౌ సత్కవితాంవయాబ్ధిశశి సుబ్రగ్మణ్యులోగింటిలో

పలఁ గాల్వెట్టుడు నాతఁడాదృతి నిడెం బాద్యంబు ము౯ భాస్కరా!

శా|| హిందూవైద్యులఁ జూచుమూత్రమునఁ జేయింజూపునార్తప్రజా

బృందంబుంబలె వ్యాధిపీడితుఁడనౌ నే౯ నాదు చైఁజూపుడు౯

కందమ్ము ల్ముకుళించి యాతఁడు మదిం గావించి ధ్యానంబు నా

చందం బేరు వచింపకుండ నుడివె౯ సర్వంబును౯ భాస్కరా!

శా|| దత్తాతిథ్యత నింటనుంచుకొని యాతం డౌషధం బీయ న

ట్లాత్తం బగ్నికుమారము౯ మెసవి మధ్యాయాతమౌ వ్యాధి కిం

చిత్తు౯ లేక నశించినట్లగుడు దానింగూర్చి తర్వాత నే

ఎత్తు౯ లేక యథాప్రకారముగనే యేనుండితి౯ భాస్కరా!

శా|| జంఘాశ్రోణిశిరాళి గుంజు టది యీషన్మాత్రముం దగ్గ కిం

కం ఘీంకారముసేయుచున్నది కడు౯. కాయంబు నిస్సార. మీ

సంఘర్షంబుననుం జికిత్స కవకాశం బబ్బ దేమందు మ

జ్జంఘాలత్వవినాశ కాలమది సంప్రాప్తంబుకా భాస్కరా! ౯౫

ఉ|| కావున నన్న మిష్టమయి ఖాదితమైనది జీర్ణ మౌటకుం

జేవ యొకింత యేరుపడి చిన్నగఁ గుంటినడ౯ గమింప నే౯

త్రోవలు సాఁగుచుండుటకుఁ దుష్టిని జెందుచునుంటిఁగాని నా

భావిమహాపద౯ మదిని భావనసేయఁగనైతి భాస్కరా!

మ|| జ్వర మంతర్గతమౌ టెఱుంగ కెటొ కాల్సాఁగుంగదా యంచునే

మరలంబోతి నిజాముదేశమున కార్మాసంబు లౌమీఁదత౯.

తిరుగంజాలితి నొక్కమాస. మటుపై దేహస్థమైయున్న యా

జ్వరమే శ్రీముఖవత్సరాది సరిగం బైకుబ్బెఁ దా భాస్కరా! ౯౭
15
ఉ|| ఆ జ్వరబాధతోడ నలయాడవరంబును జేరఁబోవుడు౯

యజ్వవిపశ్చిదాదివిపులామరపూరితమౌ స్వగేహమం

దుజ్వలదుగ్రతేజుఁడయి యొప్పుపరాంకుశరాట్టు దానిఁ దా

రజ్వవరుద్ధమైనపసిరాణ నొనర్చె రయంబ భాస్కరా! ౯౮

శా|| ఓనారాయణ! రామ! కృష్ణ! హరి! అం చుచ్చైర్నినాదంబుతో

నే నత్యంతము బాధనొందుటను దా నీక్షింపఁగా లేక యా

క్ష్మానాథుండు స్వవైద్యతల్లజులతో సంధించి యోజించియు౯

క్వైనాచేత జేరంబు గట్టివయిచె౯ వైళంబుగా భాస్కరా!

శా|| బద్ధంబైనజ్వరంబు నన్ను మిగుల౯ బాధింపలేకుండుట౯

శ్రద్ధం దన్నృపురాణి సత్య తనదౌ జైమీఁదుగాఁ బథ్యము౯

సిద్ధంబుం బొనరించి పెట్టుటను గించిత్కించి దారోగ్యసం

సిద్ధింగాంచుచు నుంటి మాస మచట౯ క్షేమంబుగా భాస్కరా!

చ|| దొర దొరసాని యాదరముతో ననుఁజూచుచు మత్సపర్యల౯

జరుపుచునుండి రంవహము. సంతసపెట్టుచు నుండి. రైనను౯

జ్వరము సమూలమై చనదు. పంపరు న౯ స్వహృహంబునుండి వార్.

హరహర! కూపకూర్మమయి యట్లె వసించితి నింక భాస్కరా!

చ|| జ్వరము సుసూక్ష్మమౌటఁ గడుసంకటపెట్టదు. పథ్యపానముల్

సరిగ సమర్పఁగాఁబడెడి. జాయువు వేళకు భక్ష్యమాణ. మీ

కరణిని లేదు లోప మెట. కాని శిరస్థ్సితమైనకార్యపు౯

భరమె త్వరంబొనర్చుటయుఁ బైనముసేయఁగనయ్యె భాస్కరా!

శా|| చందా ల్చాలవసూలు కావలయు. ఆచందా ల్వసూల్చేసి ము౯

ముందే సార్థశతంబురూపికలు తన్ముద్రాక్షరాగారమం

దందింప౯వలె. అంగిరోబ్దముది యాయ. ప్పద్ది యీకుండ నే

క్రిందుల్చూచినఁ బత్రిక౯ మరల ముద్రింపింత్రె వార్ భాస్కరా!

ఉ|| పత్రికయే మదీయమగు ప్రప్రథమాత్మజ. నాకుఁ బుత్రికా

పుత్రులు పుట్టులోపలనె పుట్టిన. దిర్వదినాలుగేం. డ్లిహా

ముత్రము లాకె నాకు. అదె మూలముగం బ్రతిమాస మేను ద

త్పత్రిక సాఁకుచుండవలె దండివ్రతం బది నాకు భాస్కరా!
16
ఉ|| చైత్రము వెళ్లవచ్చుటను జయ్యన సార్ధశతార్థమేని త

ద్గోత్రను బత్రికాభృతులు తొల్త వసూలొనరించి వేళకు౯

పత్రిక వెళ్లడించుటకె పైనము యాడవరంబునుండి. ఆ

యాత్ర పరాంకుశప్రభునియా త్మ కభీష్టముగాదు భాస్కరా!

ఉ|| ఇంక జ్వరాంకురంబు నశియింపనె లేదు. గమిష్యదధ్వముల్

పొంకములేక కాల్నడనె పోవఁగఁదగ్గవి. అట్లుగాన ని

శ్శంకగ నిప్పు డేగునెడ సారె జ్వరార్తి ఘటించునంచు నా

టంకముపెట్టె నాతఁడు. హఠంబున లేచితి నైన భాస్కరా!

ఉ|| ఆదొర చెప్పినట్లె యొకయామడ నడ్చుటయు౯ సికిందరా

బాదునఁ బైకిఁబొంగె మఱిపాడుజ్వరంబు. మదూహలన్నియు౯

బూదిని బోయునేయి యయిపోయె. ఒడ ల్కడుమండఁజొచ్చె. ఆ

బాదకుఁ దాళమిం డ్రెయినుపైఁ బడనయ్యె ద్రుతంబ భాస్కరా!

చ|| పడి పడి నిల్లుఁజేరితిని. భార్యను బుత్రులఁ జూచుకొంటి. వె

న్నడికొనువ్యాధినుండి పలునాళులు చేడ్పడితి౯. క్రమంబుగా

సుడివడి యన్నపుంగడిని జూచుటకేనియు నోచుకోక పె

ల్లుడికితి. అన్నిటం జెడి యలోయని మూల్గుచునుంటి భాస్కరా!

మ|| అఱకా ల్దగ్గఱనుంచి నెత్తివఱ కాహా! నాదుదై నిప్పుల౯

పొరలింపంబడినట్టు లయ్యెడిది. ప్రేవు ల్వెళ్ళిరా దగ్గి వే

మఱు నాయాసపడంగ నయ్యెడిది. ప్బల్మంచంబుపైనుండి చె

చ్చెర డిగ్గంగ నశక్యమయ్యెడిది. ఇస్సీ! ఏమన౯ భాస్కరా! ౧౦౯

ఉ|| పిక్కపిఱుందులందుఁ గల పీఁకుటటుండఁగ నూతనంబుగ౯

తక్కుశరీర మంతటను దద్ద్యుఁ బీఁకఁదొడంగె రేబవల్.

కక్కుడుకూఁతల౯ సతము లప్పెఁడులప్పెఁడు కళ్ల వెళ్లి నల్

ప్రక్క లసహ్యము౯ సలిపె. రాచె గళంబు కరంబు భాస్కరా!

చం|| ప్రతిదినము౯ విరేచనము బాగుగఁగామిని విష్ఠచేతఁ బూ

రిత మగుకుక్షినుండి పులిత్రేన్పులు పుల్లనికంపులు౯ విని

ర్గతమయి యేవముంగొలుపు. గర్భము బర్వగుచు౯ వికారపు౯

గతుల మదింగలంచు. తొలకర్మవిధం బది యేమొ భాస్కరా! (3)
17


చ|| నడికొని మాత్రవేసికొనునాఁడె విరేచన. మల్లనాఁడు వెం

బడిఁబడి పెక్కు వారములు పంపు బహిస్థ్సితి కన్నిసారులు౯

నడువఁగలేక చావవలె. నల్ల రవంతయులేక యెంతయు౯

మిడికెడి పాదరోగి కది మిక్కిలికష్టముగాదె భాస్కరా! ౧౧౨

మ|| ఘనవైద్యుం డొకఁడేని యప్పటికి మాగ్రామంబున౯ లేనెలేఁ.

డనఘుండైన ప్రసాదరావు మదిలో నాసీనుఁడై యున్నవాఁ.

డనివార్యంబయి పిక్క చక్కపఱుప౯ యానంబు తత్సీమ కుం

డెను. కాన౯ మఱి రుక్ప్రతిక్రియకుఁగా నేఁబూనఁజూ భాస్కరా!.

ఉ|| అట్లని పెక్కురోగముల కాకరమయ్యును దజ్జ్వరంపుఁ బె

న్ర్వేట్లొకకొంత తగ్గుపయి నిర్గతిసేయఁదలంచి బాధ నె

ట్లెట్లొ సహించుకొంచు నటులే నివసించితి మాసయుగ్మ. మ

ప్పట్లను గొంత చల్లఁబడె వర్ష్మము వర్షపురాక భాస్కరా! ౧౧౪

చ|| తనువొకకొంత చల్లబడఁ దగ్గెను మంటలు. నోటిచేఁదును౯

తనుతవహించె. ఓగిరము నాల్క కొకింత రుచించె. కాని యా

తినినది వేగ జీర్ణమయి దేహముఁ వర్వదు. పుష్టినీదు. పా

సనమునుగా. దిఁ వ్విధము స్వాస్థ్యమునొందివసింతు భాస్కరా!

ఉ|| దానను దీన నించుకయు దార్ఢ్యములేకయుఁ గురుచున్న త

త్థ్సానమునుండి లేచుటకె శక్యముగాకయు సంజుగూడ గ

ర్భానఁ బ్రవిష్టమయ్యెనని భ్రాంతుఁడనౌ తరువాత లేచితి౯

నేను బ్రసాదరావుమనునేలనుగూరిచి యేగ భాస్కరా! ౧౧౬

ఉ|| తక్కు తెగుళ్ళ నన్నిటిని దత్తదహస్సుల కర్హభంగిగా

ఎక్కడొ యేదొ మందుతిని యే శమియింపఁగఁజేసికొంచు నీ

ఒక్కటి పిక్కనొప్పి యటు లుంచినవాఁడఁ బ్రసాదరావుచే

ఉక్కడగింప. కాని మఱి హుమ్మని యన్నియుఁగ్రమ్మె భాస్కరా!

ఉ|| అన్నియు నన్నుఁ జుట్టుకొని యారుజ లెంతయు బాధపెట్ట న

న్నన్నయటంచు మూలుగుచు నప్పుడులేచి ప్రసాదరావు స

త్సన్నిధిఁజేరినాఁడ. మఱి సర్వమును౯ వినిపించినాఁడ. ఆ

ఉన్నతుఁడంతయు౯ విని యహోయని యార్చినవాఁడు భాస్కరా!
18
ఉ|| ఊరిచి యూరడించి తనయోకమునందె ప్రవేశపెట్టి పె

ల్లోరిమి స్నానపానశయనోదనముఖ్య సుఖోపచారముల్

దారసుతానుజాదికుల ద్వారమున౯ జరిపించు చోషధీ

సార మిడం గడంగె ధుతసారుఁడనైమను నాకు భాస్కరా!

మ|| అగదంకారజనప్రకాండుఁ డితఁడే యౌనాఁ బురాణజ్వరం

బు గుదిర్చె౯ మొద లద్ది నాదుమెయిలో మూఁడేండ్ల నాఁడే భృశం

బుగఁ దాఁ జొచ్చి వసించుచున్నయది. ఎప్డు౯ వీడిపోఁజూడ కా

కుగదం బెంతయు నేఁచుచున్నయది న౯ గూఢంబుగా భాస్కరా!

ఉ|| గూఢముగాఁగ నుంచు మెయిఁ గొన్నిదినంబులు పైకివచ్చి న౯

గాఢముగానె యేఁచెడిని. కళ్ళ విశేషము వెళ్ళుటాదిగా

రూఢములౌచువర్తిలెడి రోగములన్నియు దానిభృత్యు. లే

మూఢత నప్డె పోయెనని బుద్ధిఁ దలంచుచునుంటి భాస్కరా!

శాం|| పిక్కం దుంటి సతంబుఁ జేడ్పఱచు నా పెంవ్యాధికంటెం గడు౯

ప్రాక్కాలీనమె యీజ్వరంబనియు నీరక్షస్సె మూలంబు తా

దృక్క్రూరామయరాజిరాక కనియుం దెల్లంబుగం దెల్పి ముం

దక్కుల్యుండు తదత్యయంబు సలిపె౯ యత్నంబున౯ భాస్కరా!

చ|| ఇరువదియేండ్లవాఁడనయి యే మనుచుండిననాఁటినుండియు౯

పరఁగెడిమూత్రదోషము క్రమంబుగ న౯ బలహీనుఁజేసె. ప

ల్మఱును బలంబురాకకయి మందులు తింటినిగాని యవ్వియ

త్తఱి బలకారులయ్యును బదంపడి వ్యర్థములయ్యె భాస్కరా!

మ|| చెలువౌ గాత్రమునందు వర్తిలు రసాసృజ్మాంసమేదోస్థిమ

జ్జలును౯ శుక్రము సప్తధాతువులు. తత్సారంబె యోజస్సు. త

జ్జ్వలదోజస్సె కతంబు దేహబలసంప్రాప్తిన్. తదోజస్సు ని

చ్చలు మూత్రంబునఁ బో బలంబిడునె భైషజ్యంబు లోభాస్కరా!

శా|| ప్రస్తావంబున సప్తధాతువుల సారంబైన యోజస్సిఁకా

జస్తంబుం జనకుండ నిల్పఁగల భైషజ్యంబె భక్షింపనౌ

విస్రంభంబున నట్లుచెసినపుడే వేగ౯ బలం బబ్బు. లే

కస్రుల్ గార్చును నెంతయేడిచినను౯ వ్యర్థంబెకా భాస్కరా!
19
శా|| స్వగ్రామంబుననుండి వచ్చునెడఁడ్రై౯ సామీప్యమందేనియు౯

చే గ్రంథంబుల పేటి పట్టుకొని కించిత్తు౯ గమింపంగలే

కుగ్రంబౌ బ్రిడిజీల నెక్కి దిగలే కుచ్ఛ్వాసముల్ విడ్చుచు౯

వ్యగ్రస్వాంతుఁడనైన నాదు బలనూ వర్ణ్యం బిఁక౯ భాస్కరా!

ఉ|| ఎత్తునఁగట్టఁబడ్డ తమయింటఁజెలంగెడ మెట్టులెక్కనే

సత్తువలేని నాదుస్థితి చక్కనెఱింగి ప్రసాదరావు తా

అత్తఱిఁ గొన్నినాళ్ళవఱ కౌషధమిచ్చి మదంగమందున౯

నెత్తురు కొంతపెట్టుటయు నిల్పినవాఁడిఁకదాని భాస్కరా!

శా|| ఓజస్సంక్షయము౯గుఱించి యది వోకుండం బ్రసాదించెఁ దా

రాజద్భేషజ మింకొకండు సరుజారాధ్యుం డతం. డద్దినే

నోజ౯ వింశతిఘస్రము ల్శెసవుపై నుద్దండమైయుండు నా

ఓజోనాశనరూపమైన గద మెట్లో నాసిలె౯ భాస్కరా! ౧౨౮

చ|| క్రమముగ బాల్యమాదిగను గాల్మడిలోఁ జనుసప్తధాతుసా

రమును బ్రసాదరావు తన ప్రాజ్ఞతపేరిమి నాఁపినాఁడు. పూ

ర్వము గతమైనసారమును గ్రమ్మఱఁ బూరణసేయ నియ్యెడ౯

తమి నిడుచున్నవాఁడు బహుధా యగదబులు నాకు భాస్కరా!

చ|| నలువది యేండ్లనుండియును నష్టినిబొందుచునుండు సప్తధా

తుల బలుసారము౯ మరలఁ దోడనె కూర్చు టసాధ్యమంట. వృ

ద్ధుల కిఁక నేమిచేసినను దొంటిబలం బొడగూడదంట. నీ

అలఘుతరప్రసాదమున నాప్యముగానిది యున్నె భాస్కరా! ౧౩౦

ఉ|| గోడలుదూఁక నాదుమది గోరుటలేదు. బజారులందు బల్

ప్రోడనటంచుఁ బర్వులిడఁబోయి చరించెడు వాంఛలేదు. రో

చేడెలఁగూడి యాడుటకుఁ జిత్తమునందుఁ దలంపులేదు. నా

ఈడునకర్హమైనబల మిచ్చినఁజాలును నాకు భాస్కరా! ౧౩౧

చ|| ఇఁకఁ బదియేండ్ల మందునని యెందఱొ చెప్పుచునున్నవార. లా

త్మకుఁ దమిలేని యాబ్రదుకు తద్దయు వ్యర్థముకానఁ బత్రికా

ప్రకటనఁజేసికొంచుఁ బసిబాలురఁ బెండ్లము నేలుకొంచు నే

సుకముగనుండఁగందగిన శుద్ధబలం బిడుఁ జాలు భాస్కరా! ౧౩౨
20
ఉ|| ఒక్క బలప్రదానమున నూఱడిలం జుమి నేను. ఎక్కుడౌ

పిక్కబలంబులేక యిఁక భీమబలంబును బొందిమాత్ర మే

అక్కఱఁదీర్పఁగాఁగలను. అందునఁ బిక్కపిఱుందులందుఁ బెం

పెక్కుచునున్న లాగుడు క్షయింపవలెం బ్రథమంబు భాస్కరా!

ఉ|| పిక్కపిఱుందులందుఁగల పీఁకుడుపోకకుఁగూడఁ దానె యీఁ

డొక్కొ ప్రసాదరావు కృప నుత్తమభేషజముల్. ఫలింపదా

ఉక్కలుయత్న మింతవఱ కోజ శరీరబలంబొసంగి ము౯

తక్కటి పిక్కచక్కిరహిఁ దార్కొన నుండె నతండు భాస్కరా!

ఉ|| పిక్కబలంబె ప్రస్తుతము పేరునకేనియు లేదుకాని నా

తక్కుశరీరము దలఁతి దార్ఢ్యముగల్గెను. దానఁజెసియే

ఎక్కుడుభక్తి నిన్ను నుతియించుచు నల్లిన పద్దియంబు లి

ట్లొక్కెడఁగూరుచుండి కర మోపిక వ్రాయుచునుంటి భాస్కరా!

ఉ|| యుష్మదనుగ్రహంబుమెయి నుండవలె౯ బల మింత కాని యా

ముష్మికమో యిఁ కైహికమొ పూని లిఖింపక యూరకున్నె య

ర్చిష్మదదకరాంబుజము. చిత్తము కాల్పనికత్వపుంగ్రియ౯

భీష్మజనన్యమోఘఝరిపెల్లునఁ బోవకయున్నె భాస్కరా! ౧౩౬

మ|| క్రియమాణంబులు కూరుచుండి యొకచోఁ గేల్దోయిచేఁ జేయు న

య్యయిచైదంబులు. కాని తక్కుఁగల యయ్యంఘ్రిద్వయిం జేయనౌ

వయనంబాది సమస్త కార్యములునుం బాడయ్యెడిం గావున౯

దయమానుండవు నీవు కావలయుఁ దత్సంసిద్ధికి౯ భాస్కరా!

శా|| కాలుం జేయియు నాడునంతవఱ కీకల్యాణిఁ బోషింతునం

చాలోచింఅక పత్రికావిషయమం దన్నాఁడ మున్నేను. నా

కేలే యాడెడిఁగాని కాలి కకటా! కీడ్పాటు వాటిల్లె. ఇం

కేలా పత్రికనడ్పుదు౯ ? ప్రతిన యిం కెట్లేలుదు౯ భాస్కరా!

చ|| రథకృ దధఃకృ దుద్ధురతరవ్యవహారుఁడ నైనయప్పుడు౯

వృథులతరజ్వరాదిపరిపీడితకాయుఁడ నైనయప్పుడు౯

ప్రథమకళత్రపుత్రు లిలఁబాసి దివంగతులైనయప్పుడు౯

శిథిలతలేని పత్రికకుఁ జేటొనగూర్చెదె నేఁడు భాస్కరా! ౧౩౯