ఆబ్రహాము లింకను చరిత్ర/ఇరువదియవ ప్రకరణము

ములనుండి సెలవు గైకొనినను నతడు చేసిన దాస్యవిమోచనమును దాసులకై యత దోనర్చిన మేలును లోకమెప్పటికిని మఱవకుండు ననుటకు సందేహము లదు.

ఇరువదియవ ప్రకరణము

ద్వితీయ నిర్వచనము, యుద్ధసమాప్తి.

లింకను దేశాధ్యక్షత వహించి నాలుగుసంవత్సరములు గావచ్చెను. ఆ పదవికి మరల నతనినే యనేకులు పేర్కొనుచువచ్చిరి. కొందఱు పౌరు లడ్డువలుక జూచిరిగాని వారిమొఱ్ఱ లరణ్యరోదనము లయ్యె. బాల్టిమోరునందు దేశీయ మహాసభ జరుగుటయు లింకనె తమపాలకు డౌ గాతమను నిత్సుకుల సంఖ్య వీచికలపై వీచికలువోలె బొరలి ప్రతికూల శేషమునట్టె నెట్టి దట్టమగు నోటుగుట్టతిట్టల బట్టించె. యుద్ధరంగమునుండి లింకననుంగులు దమ యయ్య నెయ్యంబున మరల దేశాధ్యక్షుడై తమ్మధ్యక్షింపివలసిన దని తెల్లముగ వెల్లడించిరి. కాన దేశీయ మహాసభలయం దొక్కసీమవారు దక్క దక్కినవారెల్ల నొక్కపట్టున దమ సమ్మతుల లింకనున కచ్చుపడ నిచ్చుటయు నవ్వారును నివ్వెఱం దమ సమ్మతుల నతనికె క్రమ్మఱించిరి. ఇవ్విధమున నతడాసభవా రందఱచే బేర్కొనబడియెను. పేర్కొనబడిన రెండుమాసములకు లింక నేబదిలక్షల సైనికుల నప్పటిసేనకు జేర్ప సమకట్టి తన యుద్దేశముం బ్రకటింప నుద్యమించెను. యుద్ధమనిన జనులు వేసరి యుండుట విశదముగ గాంచి యాలోచన సభ్యులు లింకను మరల నిర్వచింపబడకపోవుట కయ్యది కారణం బగునేమోయని జడిసి దాని నాపివేయ బ్రయత్నించిరి. వారు నుడువున దెల్ల సావధానముగ విని లింక నెప్పటివలె స్థైర్యంబూని "నేను మరల దేశాధ్యక్షత వహించు టావశ్యకము గాదు. ధైర్యమున యుద్ధ సీమ బోరాడు నాకుఱ్ఱలకు సాయం బొసంగుటయు దేశము నపాయమునుండి సంరక్షించుటయు గర్తవ్యంబులు. నే నేబది లక్షల సైనికుల జేర్చియే తీరెద. అందులకై యపజయం బందవలసివచ్చిన గౌరవమున నందెదనుగాక" యని తన దలచినకార్యముం జేసెను. దైవ మతని పరిశ్రమల సఫలంబు సేసె. అతని కపజయము దలంచిన శత్రువు లడగిపోయిరి. అదివఱ కెన్నడును నేరికిని జేరనన్నిసమ్మతు లతని కాతఱి జేరెను. ఆ జయమున కనేకు లలరి తమ సంతసము బహిరంగముగ నతనికి దెలియ జేసిరి. లింకను దనయందు వారికి గల నమ్మకమునకు గృతజ్ఞత సూచించి యెవ్వరియెడను దన కసూయ యొడమనందున తన గెలుపునంజేసి యాత్మవిజయంబును నరి పరాజయంబును గల్గెనని ముదమందుట లేదనియు నితరులకు దుష్టచింతన లారోపించుట దన స్వభావములోనిది గాదనియు జనులు స్వాతంత్ర్యపరమున నుండ వారిచే నాపనిని జేయించి నందులకు సర్వనియామకుం డగు నా సర్వేశ్వరునకు నతు లొనర్చుననియు బ్రత్యుత్తర మిచ్చెను.

1865 వ సంవత్సరము మార్చినెల 5 వ తేది లింకను రెండవమాఱు దేశాధ్యక్షత వహించెను. నాటిదినము ననే కోత్సవములు జరిగెను. దేశమంతట సంతోషచిహ్నములు గాననయ్యె. అతని యుపన్యాసము మిక్కిలి చక్కగ నుండెను. అం దతడు గడచిన నాలుగుసంవత్సరములలో జరిగిన వృత్తాంతముల సంగ్రహముగ వర్ణించి తాము ప్రారంభించిన పని నెవరిమీదను గ్రౌర్యమూనక న్యాయముదప్పక దేశక్షేమముపై దృష్టియుంచి చిరమగు నెమ్మది గలుగ జేయువిధమున నెరవేర్ప దైవము దోడ్పడుగాక యని ప్రార్థించి ముగించెను.

రాజకీయోద్యోగముల గుఱించి లింకను మొదట తీర్మానింపవలసి వచ్చెను. అప్పటివఱకేగక్షవారు ప్రబలులైన నాగక్షకు జేరనివారి దీసివేయుచుంట యాచారముగ నుండెను. మాటికిమాటికి నేర్పాటులు సేయుటలో గాలహరణ మొక్కటియెగాక తమపక్షము పేరుకొఱకు నన్యాయముగ సమర్థుల గూడ నొక్కొకమాఱు తఱిమివేయవలసి వచ్చుచుండును. ఇంతియకాక యొక్కస్థానమునుండి యొక్కరుని దీసివైచిన దాని కిరువదిగురు పెనంగుటయు, నేరో యొక్క డేర్పడినతరువాత నితరులు పందొమ్మిదిగురు గారణము లేకయె దేశాధ్యక్షునిపై గోప మూనుటయు దటస్థించుచుండును. ఈ విషయముల నెల్ల గమనించి లింకను దనప్రభుత్వమున దప్పులేక నేరినిం దీయగూడదనియు, సమర్థులకు బ్రోత్సాహ మొసంగవలసిన దనియు గట్టుచేసి నడిపించెను.

రెండవమాఱు లింకను దేశాధ్యక్షత వహించుటె సంయోగసైన్యమునకు స్వాతంత్ర్యపక్షమున న్యాయపు గక్షకు నేబదిలక్షల సైనికుల జేర్చినంతటిబలం బొసంగెను. తిరుగుబాటుసీమల కంతకంతకు దూరమగుచుండిన జయఘటన దృష్టిపథంబున నుండియె తొలంగిపోయెను. వారికి బరాజయమే సంప్రాప్త మగుచువచ్చెను.

లింకను రెండవమా ఱధికారము పూనిన మూడువారములకు దేహారోగ్యము నిమిత్తమును దన 'కుఱ్ఱలకు' దగ్గర నుండు నిమిత్తమును సిట్టిపాయింటుకు దరలెను. అప్పుడ దానికి గొంచెము దూరమున మహా యుద్ధం బొండు జరిగె. తిరుగు బాటు సేన లోటువడి తమ యాధీనమందలి రిచ్మండు కోటలో దాగుకొనియె. సంయోగపు సేన లాపట్టణము ముట్టడించెను. సంగ్రామం బతియుగ్ర మయ్యెను. లింక నద్దానిని మిక్కిలి జాగరూకుడై గమనించి యుద్ధకార్యదర్శికి దెలియ జేయు చుండెను. మూడు దినములమీదట నాపురము లోబడియెను. శత్రువులు చెల్లాచెద రైరి. పట్టువడిన ప్రదేశము నాం గెలిచినవారు వందిహారావములతో జయభేరులు మ్రోయించుచు వందిమాగధబృందపరీవృతు లై యట్టహాసనమున జేరుచుందురు. లింకను మాత్రము సర్వసాధారణముగ వీథులంబడి నడచి మన:పూర్వకముగ లోబడియుండిన డేవిసు కార్యస్థానముంజేరి యా పురముం గొనెను. అత డింత సాహసమున శత్రువుల యూరుసొచ్చి స్వామిద్రోహి వదలిపోయి యుండినగృహముననె రెండుదినము లుండెను. దేశ భక్తు లంద ఱత డేమి యగునో గదా యని కంప మందుచుండిరి. అనేకు లతడు మూర్ఖ సాహసమున నాకార్య మొనర్చె నని తెగడిరి. అతడు మరలివచ్చి వాషింగ్టను చేరె నని వినిన వెంటనె యెల్లరును హర్షం బందిరి.

రిచ్మండు లోబడెనని సంతసమున దేశమంతయు బండుగ లనుభవించిరి. ఉపన్యాసములును, సంగీతములును, ఘంటా రావములును, బాణసంచులును, దీపావళులును, లోకుల యానందంబును వెల్లడించెను. ప్రతిచోటను జనులు లింకనును స్మరించి యతనిబుద్ధిని, దేశభక్తిని, కార్యనిర్వాహకత్వమును వేనోళ్ల బొగడిరి.

ఈ యుత్సవములు జరుగుచుండగనే రిచ్మండు పట్టువడిన వారము కాలమునకు 'దిరిగుబాటు' నాయకుడు లీ పరా జితుడయి రాజ్యాంగపు దండుకు జిక్కెనను వార్త దేశముపై బర్వి యాహ్లాదముం బదిరెట్లు హెచ్చించెను.

యుద్ధము పరిసమాప్తి నొందెను. స్వాతంత్ర్యము జయ మందెను. వాషింగ్టనుపురపు రాజ్యభవనమున

"దైవమునందును, జనులయందును, రాజ్యాంగమునందును నమ్మక ముంచుటచే నీసంయోగము నిలచిన దని" యొక చోటను,

"ఈశ్వరు డీవిధమున నొనర్చియున్నాడు. అతని కృత్యములు మహాద్భుతములని" రెండవపట్టునను లిఖించి యచ్చోటుల జయధ్వజము లెత్తిరి. అమెరికాకు మహోత్సవ కాలమిదె యేతెంచెను.

ఆనందకరం బగు నెమ్మదిసమయము ప్రాప్తించెననువార్త విద్యుల్లతాగమనంబున దేశమంతట వ్యాపించెను; సముద్ర మధ్యమున బఱచి దేశ దేశములకుం జేరి స్వాతంత్ర్యంబు జయమొందె ననిచాటి జనులెల్లర హర్ష వీచికల దేల్చెను.

యునైటెడ్ స్టేట్సు రాష్ట్రపు బ్రజలు గనుపఱచిన సంతోషమునకు మేరయే లేదు. లీ పట్టువడెననువార్త చెవి సోకినంతనె యనేకు లనేకవిధముల దమ ముదమును వెల్లడించిరి. కొందఱు దేవాలయములందలి (అనగా చర్చీలయందలి) గంటల మ్రోయించిరి; కొందఱు ఫిరంగుల బేల్చిరి; కొందఱు తమతమ స్నేహితుల గౌగిలించిరి; కొమ ఱశ్రువులు రాల్చిరి; మఱికొందఱు నవ్వనారంభించిరి; అందఱు దమతమ రీతి సంతసంబును వెలిబుచ్చిరి. ఇప్పట్టున నమెరికాయందు దమ యారావములచే నింగిముంచు సంఖ్యాతీతము లగు గంట మ్రోగుడులును, దమ గంభీరధ్వానములచే దిశ లవియజేయు ఫిరంగిమొత్తముల యుద్రేకములును, దమ యల్ల కల్లోలముచే బరాజితశత్రువుల గల గుండువడ జేయు జయనినదములును, సంతోష తరంగముల విచ్చలవిడి వాయుమండలమున బ్రసరింపజేయు మంగళ వాద్యములును, దాస్యాంధకారము వాపి యిదె స్వాతంత్ర్యభానుండు వెడలెను. గనుడని ప్రకటించు జ్యోతులయు బాణసంచులయు వెలుంగులును, మిక్కుటముగ బిక్క టిలి యంతటి సుదినము లాదేశము నకట మున్నెపుడును గలుగలేదనుట ననూన మార్గంబున నగుపఱచెను.

లింకను దా దన పరిపాలనమున జేయ సమకట్టిన మహాకార్యము నెరవేర్చెను. తిరుగుబాటును మొదలంటి నశింప జేసి సంయోగము నుద్ధరించెను. అమెరికనులును వారి పరిపాలకులును నొక్కరు దప్పక యెల్లరును నతనిని గొనియాడుచు దమచే నగు విధమున గృతజ్ఞత సూపుచున్నారు. * ఎప్పుడును నతనిని యునైటెడ్ రాష్ట్రపు దండ్రియగు ______________________________________________________________

  • మొన్న మొన్న (ననగా 1903 వ సంవత్సర ప్రాంతముల) లింకను వాషింగ్టనునకు సమానుడుగ సమ్మానించుచున్నారు. * వీరిరువురును మహాకష్టదినముల రాజ్యాంగమును నడపి సంరక్షించి జయప్రదముగ నిక్కట్టులనుండి తప్పించి స్వాతంత్ర్యమున మెలగుట గలుగ జేసిరి.
_______

ఇరువదియొకటవ ప్రకరణము

ఘోరహత్య ; అంత్యము.

లింకను దేశాధ్యక్షత వహించినదిమొద లెవ్వ రతని పైబడి యెఫ్ఫుడు వధించెదరొ గదా యనుభయ మందఱకు నుండె ననువిషయ మిదివఱకే తెలుపబడెను. అతనికిగూడ నట్టి యంతము దనకు వేచియున్నదేమో యనిశంకించుటకు దగినంత సూచనలు పొడసూపెను. అధికారము వహిం ______________________________________________________________ పైగారవముసూప నాతనిసతికి నిచ్చుభరణమును రాజ్యాంగమువారు మిక్కిలి యౌదార్యము గనుపఱచుచు హెచ్చించి యున్నారు.

  • రాజ్యభవనమున నొకప్రక్కన జాతీయ స్వాతంత్ర్యముం గలుగ జేసిన వాషింగ్టను జ్ఞాపకార్థ మతనిపేర నొక శాసన మొప్పచుండెను. యుద్ధముముగిసినతోడనె దానికి సమానముగ మఱియొక ప్రక్కన సంయోగపు స్థైర్యమునకును స్వాతంత్ర్యోద్ధరణమునకు గారణభూతు డగు లింకనుజ్ఞాపకార్థము మఱొండు శాసనము నిలిపి యాస్థానము నలంకరించిరి.