ఆనందరంగరాట్ఛందము/తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసము
| 1 |
గీ. | అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార | 2 |
సీ. | ఆదిమకవిభీమనార్యముఖ్యులు పల్కుఛందమ్ములను గల్గుచందములును | |
తే. | సకలజనముల కుపకారసరణి గాఁగఁ, జెలఁగి వివరించెదను వేడ్కఁ జిత్తగింపు | 3 |
క. | క్షితిఁ గవిత యనుచుఁ జెప్పిన, యతులును బ్రాసములు వలయు నన్నిటి కవి నే | 4 |
వ. | తద్విధం బెట్లనిన నాదిమకవిభీమనచ్ఛందంబులును, గవిరాక్షసచ్ఛందంబును, నథర్వ | 5 |
సీ. | అయహలకును గియ్యలగును కచటతపవర్గుల నాల్గేసివర్ణములుగ | |
తే. | పుఫుబుభులకు ముకారంబుఁ బూన్పవచ్చు | 6 |
తా. | అకారయకారహకారములును, గియ్యముడికలయక్షరములు నొండొంటికి యతి చెల్లును. కఖగఘ, చఛజఝ, టఠడఢ, తథదధ, పఫబభ యీయైదువర్గములలో నాయావర్గములోని నాల్గక్షరము లొండొంటికి యతిఁ జెల్లును. చఛజఝుశషసక్ష యీ యెనిమిదియక్షరములు నొండొంటికి యతి చెల్లును. క్షకారము కవర్గముతోఁ జెల్లును. లకారమును, ళకారమును, వెలుపల గిలకగలయక్షరములును, క్రారవడిగలయక్షరములు నొండొంటికి యతి చెప్పవచ్చును. పఫబభవ యీయైదక్షరములు నొకటికొకటి యతి చెల్లును. నకారణకారములును, నకారపొల్లు గలిగినయక్షరములును నొకటికొకటి యతి చెల్లును. పఫబభ యీనాల్గక్షరములకు దాఁపలసున్న లుండినచో మకారమునకు యతి చెల్లును. పుఫుబుభు యీ నాల్గక్షరములును ముకారమును బరస్పరము యతి చెల్లును. స్వరములలోని ఋకారమునకును రేఫకును యతి చెల్లును. ఇదియంతయుఁ జాల వాడుకగా బహుజనులు చెప్పెదరు కావున నివియు, మహాకవిరాజులు, ప్రబంధములయందుఁ బ్రయోగించుయతులును, బ్రాసభేదములును వివరించెద. | |
క. | భాసురము లగుచు సుకర, ప్రాసానుప్రాసదుష్కరప్రాసాంత్య | 7 |
క. | సమనామప్రాసము ప్ర్రా, సమైత్రి ఋత్రియును బ్రాదిసమలఘువు విక | 8 |
తా. | అని యివ్విధంబున సుకరస్రాసము, దుష్కరప్రానము, అంత్యప్రాసము, అనుప్రాసము, ద్విప్రాసము, త్రిప్రాసము, చతుష్ప్రాసము, సమనామప్రాసము, ప్రాసమైత్రి, ఋప్రాసము, త్రివిధప్రాసము, ప్రాదిప్రాసము, వికల్పప్రాసము, బిందుప్రాసము, అర్ధబిందుప్రాసము, ఉభయప్రాసము, సంయుక్తప్రాసము, సంధిగతప్రాసము, సమలఘుప్రాసము అనగా 19 విధముల ప్రాసములు వివరించినారు. | |
క. | స్వరవర్గాఖండప్ర్రా, ద్యురుబిందుప్లుతములును బ్రయుక్తాక్షరముల్ | 9 |
| అని పది యతులున్ను, | |
గీ. | యతులు స్వరవర్గసరసగుణితవిభాగ | 10 |
| అని పదాఱుయతులున్ను జెప్పి ఉన్నది. మఱిన్ని, | |
సీ. | స్వరయతుల్ ప్లుతయతుల్ సంయుక్తయతులును వర్గయతులు బిందువడి యఖండ | |
తే. | యతులు భిన్నయతులును గుణితయతులును | 11 |
| అని యతులు 29 విధములుగాఁ జెప్పి ఉన్నది. మఱిన్ని, | |
శా. | శ్రీదైతాయతు లిర్వదొక్కటియగున్ ఋప్రాదినిత్యజ్ఞ కా | 12 |
| అని 21 విధములుగా చెప్పివున్నది. మఱియు, | |
మ. | స్వరవర్గప్లుతముల్ శకంధుగణఋత్వప్రాద్యభేదోర్వను | |
| సరసాదేశవిభాగవృద్ధులునుమాసంయుక్త వైకల్పముల్ | 13 |
వ. | అని 27విధములుగా జెప్పివున్నవి. ఇది గాక జయదేవచ్ఛందంబున తొమ్మిదియతులున్ను, | 14 |
సుకరప్రాసలక్షణము
క. | సుకుమారము శ్రుతిసుఖదము, నక లంకము నైనవర్ణ మాద్యక్షరసృ | 15 |
తా. | లలితమై చెవి కింపుగానుండే అక్షరము ప్రాసస్థానమునం దుంచితే అది సుకరప్రాసము. | |
క. | పరకవులపాలిపెన్నిధి, సరసుం దానందరంగజనపతి గాకన్ | 16 |
క. | పరమోపకార ధరణీ, సురవరసురభూజ సుగుణసుందర తరుణీ | 17 |
దుష్కరప్రాసము
క. | పరువడిఁ బాదాదుల ను, చ్చరణాసహ్యాక్షరముల సమకూర్చిన దు | 18 |
తా. | చెవికింపుగాక, నోట మెదుగక, దుస్తరముగా నుండే అక్షరములు ప్రాస చెప్పితే నది దుష్కరప్రాస మనబడును. | |
క. | నిష్కపటజనులకెల్లను, నిష్కపటంబులను రంగనృపమణి యెంతో | 19 |
క. | దోఃకీలితమణికటక యు, రఃకలితరమావినోద రంజితసుజనాం | 20 |
అంత్యప్రాసము
క. | మొదలిచరణంబుకడ శుభ, పద మయ్యెడివ్రాయి యన్నిపాదంబులకున్ | 21 |
తా. | మొదటిచరణముకడపట నున్నయక్షర మేదో ఆఅక్షరము చొప్పుగానే నాల్గుచరణాలయందు నంతమున నుండఁ జెప్పిన నది యంత్యప్రాస మగును. ఆనియమమునఁ బద్యమునకుఁ బ్రాసాక్షర మెద్దియో యదియ యంత్యమందుండునట్లు చెప్పిన మఱియు లెస్సఁగా నుండు ననియందురు. | |
క. | శ్రీజయకీర్తిసమాజా, రాజిలు నానందరంగరాయబిడౌజా | 22 |
క. | జననుతభీమతనూజా!, మనయార్జితవిభవతేజ సుభగమనోజా, | 23 |
ద్వంద్వత్రిప్రాసములు
క. | క్రమమునఁ బాదాదుల యం, దమలము లై రెండుమూఁడు నక్కరములు చె | 24 |
తా. | చరణాదిని మొదటి అక్షరముగాక అవతలి రెండక్షరములు చెప్పిన అక్షరములే నాలుగు చరణాలకు ప్రాసములు వస్తే అది ద్వంద్వప్రాస మగును ఆరీతిగా మూఁడేసి అక్షరములు వస్తే అది త్రిప్రాస మగును. | |
క. | శ్రీరంగరమణసేవా, పారంగతుఁ డైనరంగపార్థివమణి యా | 25 |
క. | దోసంబు లేక వస్తుని, వాసం బై పరగఁ జెప్పవలయును ద్వంద్వ | 26 |
క. | కొమ్మనెరా బాళిని నిను, రమ్మనెరా తనదుమేను రంగాధిప! నీ | 27 |
క. | దానమున సత్యమున నభి, మానమునం బోల్ప నీసమానము ధరణిన్ | 28 |
చతుష్ప్రాసము
గీ. | మొదటివ్రాయి గాక కొదువ నాల్గక్షర, ములును నాల్గుచరణములను గలుగ | 29 |
తా. | చరణమున మొదటియక్షరము గాక తక్కిననాల్గక్షరములు చరణచరణానకు జెప్పితే అది చతుష్ప్రాసము. | |
క. | నిరతనముచిహ్న(ఘ్న)విభవత, నెరతనమును గాంచి రంగనృపమణి యెవరీ | 30 |
క. | వారణవరద నిశాటవి, దారణ వీరావతార ధరణీవలయో | 31 |
తా. | ఈయాఱువిధము లగుప్రాసములు నిండావాడుక అయినందుచేత లక్ష్యాలు ప్రబంధాదులనుండేవి యెత్తివ్రాయలేదు. తక్కిన ప్రాసములకు వ్రాయవలెను గనుక వ్రాస్తున్నాను. | |
ఋకారప్రాసము
క. | అరయ రేఫలు మూఁడు ఋ, కార మొకటి ప్రాసముగను గదియించినచో | 32 |
తా. | స్వరములలో ఉండే ఋకారము 1, రేఫలు 3 గాని, ఋకారములు 3, రేఫ 1 గాని కూర్చి నాలుగు చరణములకు ప్ర్రాసములుగా వుంచుకొని పద్యము చెప్పవచ్చును. | |
క. | అరయ స్వరగణ మయ్యు ఋ, కారము ఋప్ర్రాస మగుచుఁ గదియును రేఫన్ | 33 |
క. | ఆఋషికొమరుఁడు గట్టిన, చీరలు మృదులములు నవ్యచిత్రములు మనో | 34 |
ప్రాది ప్రాసము
గీ. | ప్రాది యైననకారశబ్దములు మూఁటి, కొకనకారంబు రేఫసంయుక్త మగు న | 35 |
తా. | ప్ర అనే ఉపసర్గయాదిగా గలనకారశబ్దము "ప్రాణ” అనుశబ్ద మయ్యెను గనుక ఆశబ్దములు మూఁటికి ఒక నకార ప్ర్రాసము చెల్లును. నకారములు మూఁటికి రేఫతో చేరిన ణకార మొకటి చెల్లును. | |
గీ. | 36 |
క. | పో నుద్యోగము చేసిన, ప్ర్రాణంబా యిదియె నీకుఁ బాథేయం బా | 37 |
క. | శ్రీ నారాయణ నిన్నున్, బ్రాణముగాఁ జూచుకొని... | 38 |
| అని వున్నది గనుక తెలియవ్రాసినాను. | |
బిందుప్రాసము
గీ. | రహిని బ్రాసాక్షరాదివర్ణంబు గిలుక, నమరియుండిన నది బిందు వగుచు బిందు | 39 |
తా. | మూఁడుచరణముల ప్రాసాక్షరములకు మొదటియక్షరములకు సున్నలుండి ఒక యక్షరానకు వలపలిగిలక వుంటే అదిన్ని సున్నగలయక్షరమై ప్రాసము చెల్లును. | |
గీ. | 40 |
క. | కన్ దోయి చల్ల గా నిటు, కందోయి నృపాలు లెస్సగా నింకొకమా | 41 |
క. | అంబరము వగుల నార్చి ప్ర, లంబాసురుఁ డాగ్రహము వెలయఁ గదిరిన వే | 42 |
మత్త. | అమ్మునీంద్రునివాసశక్తిఁ దదంగరాజ్యములందు మే | |
| దమ్ముగాఁ బ్రచలద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టిఁ జే | 43 |
లయగ్రాహి. | కమ్మనిలతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ము... | 44 |
| అని వున్నది గనుక జాడ తెలుసుకోగలది. | |
అర్ధబిందుప్రాసము
గీ. | సార్ధ బిందువులై తేలినట్టిటపల, కరయఁ బ్రాసంబు నిర్బిందువైనఁ జెల్లు | 45 |
గీ. | ఒకటి కరసున్న గలిగి మూఁటి కవి లేక | 46 |
తా. | కచటకప వర్గాక్షరములలో అరసున్న గలయక్షరములు మూఁడు, సున్న లేనియక్షర మొకటిగాని, సున్న లేనియక్షరములు మూఁడు, అరసున్న గలయక్షర మొకటిగాని వున్నట్టయితే ప్ర్రాసము చెల్లును. | |
గీ. | వీఁక నానందరంగమహీకళత్రుఁ, డాటల విధంబు రిపులను వేఁటలాడి | 47 |
క. | నాకొఱఁతఁ దీర్చి వచ్చితి, నీకొఱఁతయె యింక సూతునిం దెగఁజూడన్ | 48 |
క. | ఆపన్నగముఖ్యులఁ దనవీఁపునఁ బెట్టుకొని పఱచి విపినములు మహా | 49 |
క. | మేటు లగురథికులను నొక, నాఁటికి వేవుర వధింతు వరుశరములునో | 50 |
క. | ఆచింతామణి ముని తన, పీచమణఁచుదాఁక నీక పృథులోభముచే | 51 |
వ. | అని వున్నది గనుక సూచనగా వ్రాసినాను. | |
అభేదప్రాసము
క. | లళలకు లడలకు నొకటొక, టలవుగఁ బ్రాసంబు యతియు నౌ వపలకు న | 52 |
క. | లడలు లళలు నొండొంటికి, వడి ప్రాసము చెల్లు రలలు వపలును దడలున్ | 53 |
తా. | లకారడకారములకు, లకారళకారములకుఁ బ్రాసములు యతులు చెప్పవచ్చును. వకారమునకు పవర్గమునకున్ను, దకారడకారములకున్ను, రకారలకారములకున్ను యతిమాత్రము చెప్పవచ్చును. ప్ర్రాసము లుండవు. | |
క. | వ్రీడావతు లలసగతిన్, వేడుక నానందరంగవిభుసముఖమునన్ | 54 |
క. | దాడింబబీజముల మగ, రాలన్ గురువిందములను రహి వరుసగ నా | 55 |
సీ. | ఈళాపు నీలంపు గోడను దను వింత, దనుపట్టు తీవంచు కంబములను... | 56 |
క. | తాలాంకుతుములసమర, క్రీడకుఁ దాళగలవాఁడు క్షితిలోపల నె | 57 |
సీ. | చూడు మంచును సప్తతాళముల్ దెగవ్రేయ, వీక్షించి రవిపట్టి విస్తువోయె... | 58 |
క. | వ్రీడావతు లయ్యెడ నీ, లీలన్ బుష్పాపచయకలితఘనకేళిన్ | 59 |
వ. | అని యిట్లు బహుప్రబంధములయం దున్నది గనుక తెలియగలది. | 60 |
వర్గ ప్రాసము
గీ. | కనఁదవర్గద్వితీయథకారమునకుఁ, బ్రాస మొకచోఁ జతుర్థధవర్ణమైన | 61 |
క. | తిలకింపఁ దవర్గములో, పలినలువర్ణము ద్వితీయవర్ణ మదియుఁ గా | 62 |
తా. | తవర్గథకారమునకును ధకారమునకును దకారమునకును ధకారమునకును బ్రాసము చెల్లును. | |
గీ. | ప్రోది నానందరంగభూనాథుకీర్తి, యీధరిత్రి స్థిరంబుగాఁ బాదుకొనియె | 63 |
క. | గాధేయోక్తపురాతన, గాథానిరవద్యపద్యగద్యగ్రహణా | 64 |
క. | ఆదశరథసూనుండు ప, యోధిజలం బింకఁజేసి యొకశరమునఁ గ్ర | 65 |
క. | ఆదేవోత్తముఁడు సుధాం, బోధి వటైకాగ్రిమదళమున బాలుండై | 66 |
ఉ. | కాదన కిట్టిపాటియపకారము తక్షకుఁ డేకవిప్రసం | |
| పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా | 67 |
| అని యున్నది గాన జాడ తెలియునది. | |
త్రివర్ణప్రాసము
గీ. | కృతులఁ ద్రత్వత్రయమును దత్వ మొకటి, యటులు గాక తవర్ణత్రయముఁ ద్రకార | 68 |
గీ. | [12]సంధిఁబల్కు త్రికారంబు చనుఁ దకార, సదృశ మైత్రికారప్రాససంజ్ఞఁ గలిగి | 69 |
తా. | త్రకారములుగావుండే అక్షరములు మూఁటికిన్ని ఒక్కతకారమైనా, తకారములు మూఁటికిన్ని ఒక్కత్రకారమైనా ప్రాసములుగా వుంచి చెప్పవచ్చును. | |
క. | దాతలదాత యనంగా, రీతిగ నానందరంగనృపమణి గనె వి | 70 |
క. | క్షత్రియధర్మంబున మాం, ధాతృఁడు రాజ్యంబు నీతిఁ దగఁ బాలించెన్ | 71 |
[13]శా. | నాతో మార్కొనలేరు నిర్జరమరున్నాగేంద్రబృందారకా | 72 |
సీ. | ఆత్రినేత్రుఁడు వనజాతదళాక్షుని, గూరిచి తపముఁ గైకొనినచోటు... | 73 |
వ. | అని యీరీతి ఆయాప్రబంధములం దున్నది గనుక దెలియఁ గలదు. | 74 |
సంధిగతప్రాసము
క. | ధృవముగ సంధిజనితరూ, పవిశేషప్రాస మగుచుఁ బరగుఁ బకారం | |
| బవిరళవకార మగు న, య్య [14]పదాఱవపే రెఱుంగు ననఁగ ముకుందా. | 75 |
గీ. | అరయఁ గన్గవ చన్గవ యనెడి రెండు, నుడులపొల్లులు బిందుతను గని ప్రాస | 76 |
క. | [15]ప్రథమాంతవిభక్తులపై, కథితము లగుకచటతపలు గసడదవ లగున్ | 77 |
తా. | ప్రథమాంతవిభక్తిగావుండే తెనుఁగుశబ్దముమీద కచటతప ఈ 5 అక్షరములు ఆదినుండే శబ్దములు నిలిచినట్టయితే కకారము గకారమగును. చకారము సకారమగును. టకారము డకారమగును. తకారము దకారమగును. పకారము వకారమగును. మఱియొకప్పు డాచకారము జకారమగును. పకారము బకారమగును. ఈగజడదబలు వలపలిగిలక కలిగినయక్షరములతోఁ జేరివుంటే ఆవలపలిగిలకలు సున్న లగును. | |
గీ. | అవని భవదీయకీర్తిలక్ష్మి పరమేశు, నిం గదిసి మించి యతనితురంగ మతని | 78 |
క. | కావలియై సురరాజ్య, శ్రీ వాలింపం దగున్......... | 79 |
మ. | వివిధోర్వీపతులన్ జగన్నుతుల మున్ వీక్షింపమో వారిపెం | 80 |
శా. | సింగం బాఁకటితో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మా | 81 |
శా. | గంగానందనుఁ గూల్చి ద్రోణుపని చక్కం జేసి [16]ఘోరారి శౌ | 82 |
క. | సంజయ మురభంజనుని ధ, నంజయునిం జీరికింగొనఁడు కర్ణుం డిం | 83 |
వ. | అని మహాకవులప్రయోగము లున్నవి గనుక జాడ తెలుసుకొనేది. | 84 |
ప్రాస మైత్రి
గీ. | లళలు రెండును నొండొంటిఁ గలసి వచ్చు, నమరు నన్యోన్యముగ ఋయుతాయుతములు | 85 |
గీ. | తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ | 86 |
తా. | లకారరకారములు ప్రాసములున్నా వట్రువసుడి లేనియక్షరము ప్రాసమున్నా నున్నలుగలిగినబకారము మకారము ప్ర్రాసములున్నా అది ప్రాసమైత్రి. | |
గీ. | లాలితానందరంగరాణ్మౌళి చాల, నెమ్మితో రాయసింహాసనంబు నెక్కి | 87 |
గీ. | నీలవర్ణగర్భగోళంబునందు లో, కంబులెల్ల నుండు నెమ్మితోడ | 88 |
క. | భాతృస్నేహము గలిగి య, రాతులు భయమందఁగా ధరారాజ్యము సం | 89 |
శా. | లోకత్రాణరతిన్ దదాదిమమహీలోకప్రవేశోత్కభా | 90 |
క. | నా కింకను దిక్కెవ్వరు, శోకాంబుధిఁ గడచుటెట్లు శూరతమై భూ | 91 |
క. | అకృతాస్త్రుఁడ బాలుఁడఁ గా, ర్ముకవిద్యాప్రౌఢిమై నిరూఢు లయినయా | 92 |
| అని వున్నది. దీనినే కొందఱు సమలఘుప్రాస మందురు. | |
గీ. | ఓలి రేఫతోఁ గూడియు నూఁదఁబడక, తేలి తెనుఁగునఁ దమయట్టివ్రాలతోన | 93 |
వ. | అని యున్నది గనుక జాడ తెలిసికొనునది. | 94 |
లాటానుప్రాసము
క. | పాటిగఁ జెప్పిన శబ్దమె, చాటుగతిన్ సొరిదిఁ బల్కు చక్కటి నర్థా | 95 |
తా. | అనుకరణముగా చెప్పినశబ్దమే యర్థము వేఱువేఱుగా వుంటే అది లాటానుప్రాసము. | |
క. | రంగలరంగల దానికు, రంగటఁ జేరంగఁ దగునె రంగ నృపతి పా | 96 |
క. | నినుఁ గనుకన్నులు కన్నులు, నినుఁ బేర్కొనుపలుకు పలుకు నీపుణ్యకథల్ | 97 |
క. | కందర్పదర్పదము లగు, సుందరదరహాసరుచుల సుందరిచందం | 98 |
తృతీయాశ్వాసము.
క. | విత్రస్తాఘపవిత్రచ, రిత్ర జితత్రిదశవర ధరిత్రీసుతస | 99 |
వ. | అని యున్నది గనుక కొందఱు ఇదే ఛేకానుప్రాసమనిన్ని లాటానుప్రాసమనిన్ని | 100 |
శకారప్రాసలక్షణము
క. | తొలుత శకారమ్ములు తిగ, గలిగి సకార మొకటైన గాక సకార | 101 |
తా. | శకారములు మూఁడు ఒకసకారమయినా సకారములు మూఁడు ఒకశవర్ణమయినా ప్ర్రాసము లుంచి పద్యములు చెప్పవచ్చు ననుట. | |
క. | వసునగసమధీరుం డై, పొసఁగిన యానందరంగభూపతి సభ నిం | 102 |
క. | ఆసరసిజాక్షి కౌనుకు, గా సరి యొక్కింతపోలుకతమునఁ గద యా | 103 |
క. | పసలేని పనికిఁ బోయిన, రసభంగము గాక మేలు రానేర్చునె యెం | 104 |
క. | ఆశీర్వదించి శుకుఁ డుచి, తాసీనుం డగుచు రాజు నంద నునిచి యా | 105 |
ఉ. | వ్ర్రేసియుఁ జీరియున్ బొడిచి వ్రేచియుఁ గ్రుచ్చియుఁ జించి త్రుంచి చి | 106 |
మ. | కసుమాలం బగుదేహి పుట్టువు(ను)ల నీకష్టంబులం బాపి ది | 107 |
వ. | ఈరీతిని అనేకకవులు చెప్పినారు గనుక తెలియగలదు. | 108 |
వికల్పప్రాసము
గీ. | [20]సానునాసికతనువర్గహల్లులని తృ, తీయలుగ వికల్పప్రాసమై యెలర్చు | 109 |
తా. | అనునాసికసంయోగ మైనయక్షరములు సమానసంధిచేత వికల్పమవును. ప్ర్రాక్ + ముఖము = ప్రాఙ్ముఖము. ఈ ప్రాఙ్ముఖశబ్దము 'గ్మ' ప్రాసమునకు చెప్పవచ్చును. దిక్ + ముఖము = దిఙ్ముఖము, ఈదిఙ్ముఖళబ్దము, 'గ్మ' ప్ర్రాసమునకు చెప్పవచ్చును. ఉద్యత్ + మోదము = ఉద్యన్మోదము. ఈ ఉద్యన్మోదశబ్దము 'ద్మ' ప్ర్రాసమునకు చెప్పవచ్చును. | |
[21]క. | పద్మాసమాన యగుమన, పద్మావతిఁ జూచి ధరణిపాలకసుతుఁ డు | 110 |
గీ. | తిగ్మదీధితి వెలిఁగించు దిఙ్ముఖముల, దిఙ్మహీతలనాథుండు వాగ్మి యనఁగ... | 111 |
వ. | అని యివ్విధంబున మహాకవిప్రయోగము లుదాహరణము లున్నవి గనుక సూచన | 112 |
ఇక యతి ప్రకరణము
క. | స్వరగణము కకారాద్య, క్షరములతో సంధిచేసి కదియించినఁ ద | 113 |
క. | ఆఅ లై ఔలకు మఱి, ఇఈలు ఋకారసహిత మెఏలకు నౌ | 114 |
వ. | ఈరెండు నొకటొకటికి యతి చెల్లును. ఇది స్వరము లైనఅచ్చులకున్ను వ్యంజన | 115 |
గీ. | అమితధీరత్వమునఁ గనకాద్రిఁ గేరి, యుజ్జ్వలాకృతి మాధవు నోహటించి | 116 |
గీ. | అవని ధర్మజుఁ బోలు నిత్యార్యచర్య, నాదిరాజులఁ దొరయు నిత్యైంద్రభూతి | 117 |
వ. | అని వున్నది గనుక ఈజాడను అన్నిటికీ తెలుసుకొనేది. | 118 |
గూఢస్వరయతి
గీ. | అరయ నన్యోన్యశబ్దపరోక్షములకు, న్యోరువర్ణంబు లగు నుర్వి నుతచరిత్ర | 119 |
తా. | అన్యోన్య పరోక్ష దాసో౽హ శబ్దములయందు గూఢస్వరము లుండుటచేత నవి యచ్చులకు హల్లులకు యతులు చెల్లును. | |
గీ. | ఒనర వైభవవిజితబిడౌజ నీకు, నహితనికరంబు మ్రొక్కు దాసో౽హ మనుచు | 120 |
గీ. | స్వరముతుద నుండు లుప్తవిసర్గ కోత్వ, మైన గూఢస్వరయతి దాసో౽హ మనఁగ | 121 |
వ. | అని వున్నది గనుక తక్కిన అన్నింటికిని తెలియగలది. | 122 |
కాకుస్వరయతి
క. | కాకుస్వరయతి దగు నితఁ, డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ [24]బు | 123 |
తా. | చరణము మొదటీయక్షరమయినా విశ్రమస్థానాక్షరమైనా స్వరముండఁజెప్పి యందుకు విశ్రమాక్షరము హల్లువుంచితే అది కాకుస్వరయతిగాఁ జెప్పుట. | |
క. | వసుమతి రసికాగ్రణి యై, యెసఁగిన నానందరంగఁడే ప్రోచు సుధీ | 124 |
ఉ. | చూచుచుఁ జేరి వ్రేల్మిడుచుచుం దలయూఁచుచు నిర్విదగ్ధయై | 125 |
క. | నీచెప్పెడి పెద్దలు ద్రో, ణాచార్యులు మొదలుగాఁగ ననికొల్లనివా | 126 |
ఉ. | అక్కట! గంధవాహ! తగవా హరిణాంకునిఁ గూడి పాంథులన్, బొక్కఁగఁజేయ... | 127 |
క. | ఓనారీమణి! యీమెక, మే నిప్పుడు తెచ్చియుంతునే నీమ్రోలన్ | 128 |
వ. | అని యున్నది గనుక ఈజాడను అన్నీ తెలుసుకొనేది. | |
ప్లుతయతి
క. | 129 |
వ. | అని భీమనచ్ఛందంబున నున్నది (చూ. సంజ్ఞ. 70) గనుక ప్లుతయతులు నాలుగు | |
ఆహ్వానప్లుతము
[28]క. | ఆయతిఁ ద్రిపురాంతక దే, వా యనిపిల్చుటయు నధిక మంతయు వినంగా.... | 130 |
[29]చ. | గ్రహగతు లేమి సేయు.... | 131 |
క. | ఆనందరంగపతిమో, వానంజూచెదవు దొరకునా నీకు వధూ | 132 |
చ. | ...ఇదె చను దెంచి వత్తుననుమీ శతమన్యునితోడ సంయమీ! | 133 |
శా. | .... ఏలా! నాపయి దక్షిణానిలము పక్షీ సేయు దాక్షిణ్యమున్. | 134 |
క. | ........ గా కాకోదరనగోదయస్థపతంగా! | 135 |
| అని యున్నది. | |
రోదనఫ్లుతము
ఉ. | ఏ జనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్యఁ జుం | 136 |
మ. | అకటా! యేమని దూరుదాన మిము నాథా! వేగుజామయ్యె... | 137 |
సీ. | రోషంబునను గావరో మునీశ్వరులార యనిపల్కు వనవీథి నరుగువేళ... | 138 |
| అని యున్నది. | |
సంశయప్లుతము
ఉ. | ...ఉల్లమ నీకు నిట్లు తగునో తగదో పరికించి చూడుమా! | 139 |
ఉ. | ... ఎక్కినపార్థుపైఁ గవిసెనే పసి నాతఁడు గ్రమ్మరింపఁగాన్. | 140 |
గీ. | అన్న నీవు బుద్ధు లన్నకుఁ జెప్పుచు, నున్నమాట లెల్ల విన్న గోలెఁ | 141 |
శా. | ఈపాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా | 142 |
ఉ. | హింసయ నీకు వేడ్క యగునేని కృపాశ్రయ మైనయీసరో | 143 |
చ. | ...హరిహయుఁ డేమియయ్యెనొ కదా మదనానలతాపవేదనన్. | 144 |
క. | సభ నీకయి యేఁ బలికితి, నిభపురమున మాట పుట్టదే నీవు ననున్... | 145 |
ఉ. | ఆరఘువీరుతోడఁ బగ యందుట యల్పమె తద్వధూటి మా | 146 |
వృద్ధియతి
క. | ఏకైకపదమ్మునకున్, నాకౌకశ్శబ్దమునకు నచ్చులు వడిగాఁ | 147 |
గీ. | కృతులలో శబ్దశాస్త్రజ్ఞమతముచేత, వృద్ధియెందును రూఢిగా నెసఁగియుండె | 148 |
తా. | ఏకైక, నాకౌక, రసైక, అక్షోహిణీ మొదలయినశబ్దములయందలి అచ్చులకు హల్లులకు రెంటికీ యతి చెల్లుననుట. | |
గీ. | అనఘ! యానందరంగ లోకైకమిత్ర, యెలమి నీసూక్తి యమృతరసైక మయ్యె | 149 |
గీ. | హరియె పరమాత్ముఁడును ద్రిలోకైకనాథుఁ, డిందిరాదేవి సకలలోకైకజనని | 150 |
క. | ఉర్వీశతిలక నాపే, రూర్వశి నొకపనికిఁగా దివౌకులమహిమల్ | 151 |
ఉ. | ఆకమలాక్షిరూపమహిమాతిశయంబు మనోహరంబు భో | 152 |
శా. | నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబు లం | 153 |
క. | ......ర, సైకము నెమ్మొగము దీనిమృదుమధురోక్తుల్. | 154 |
వ. | ఇట్లు అనేకప్రబంధాలలో ఉన్నది గనుక తెలియదగినది. | 155 |
నఞ్ సమానయతి
క. | నసమాసనఞ్ సమాసము, లసమమ్ముగ నచ్చుహల్లులన్ యతితగుఁ దా | 156 |
తా. | అనుపమ, అనంత, అనేక, అనన్వయ, అనవద్య మొదలైన నఞ్ సమాసశబ్దములయందలియచ్చులకును యతి చెల్లుననుట. | |
గీ. | ఇలఁ గుటుంబప్రతిష్ఠ లనేకములు న, నంతగుణనిధి యైనయానందరంగఁ | 157 |
ఉ. | ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ నీషివిమ | 158 |
ఉ. | మ్రొగ్గెడు వాహనంబులును మోములు ద్రిప్పక పాఱుదంతులున్ | 159 |
వ. | అని మఱిన్ని బహుప్రబంధములయందు చెప్పియున్నది గనుక జాడ తెలుసుకోగలది. | 160 |
భిన్నయతి
.గీ. | అట ఇకారాంతపదముమీఁదటిదికార, మది యనంగ నవ్వలిభిన్నయతికిఁ జెల్లు | 161 |
క. | అంచితతిలకము శౌరి ధ, రించె ననఁగ జగణమధ్యరేఫవిరతి యౌ | 162 |
తా. | ధరించె-ధరియించె, వరించె-వరియించె, భరించె - భరియించె, అను నీమొదలైనశబ్దములున్ను; చేతిది-చేతియది, వానిది-వానియది, ఊరిది-ఊరియది, ఆను నీమొదలయినశబ్దములున్ను మధ్యాక్షరవిరళములగును గనుక అచ్చుకు హల్లుకు యతి చెల్లుననుట. | |
క. | ఆనందరంగనృపతి య, హీనధరాభార[33]మున్ భరించుటచే ని | 163 |
క. | ...ముంచుకొనుఱాలజడికి భ, రించెద గోవర్ధనాద్రి యెలచేఁ గృష్ణా. | 164 |
ఉ. | చొచ్చినఁ బోకు పోకు మనుచు న్నృసకేసరి తేరు డిగ్గి నీ | |
| బచ్చడి సేయువాఁడ నని ఫాలనటద్భ్రుకుటీకరాళుఁ డై | 165 |
క. | తెంపరియై మది యింత చ, లింపక ననిలోనఁ దెగియె నెవ్వఁ డతఁడు నై | 166 |
క. | వంచనయు మాయయు మదిఁ గు, ఱించి పరాక్రాంతి వయ్యు మేశాస్త్రమునన్ | 167 |
వ. | అని యిట్లు బహుప్రబంధములయందు నున్నది గనుక జాడ తెలియగలదు. | 168 |
నిత్యసమాసయతి
గీ. | ఏని యనుపదమ్ముతో నాదిపదమూది, సంధి నిత్యయతులు జరుగు రెంట | 169 |
క. | చను నాపోశన వాతా, యనము లల రసాయనము పరాయణ నారా | 170 |
తా. | “ఏని” యను తెనుఁగుపదము నిత్యసమాసపద మైనపుడు 'కనెనేని, వినెనేని, ఎవ్వఁడేని' యని బహువిధములుగా విస్తరిల్లినది కావున వానియందచ్చుకు హల్లుకు రెంటికి యతిచెల్లును. మఱియు సంస్కృతమున ఆపోశన వాతాయన రసాయన పరాయణ నారాయణ శుద్ధాంతైకాంతాది నిత్యసమాసశబ్దముల నచ్చునకు హల్లునకుఁ గూడ చెల్లు ననుట. | |
క. | ఆనందరంగరాయమ, హీనాయకచంద్రుఁ డెన్నఁడేని దురాశల్ | 171 |
గీ. | సరసచిత్రాన్నములును రసాయనములు, భత్యములు నూరుఁబిండ్లును బాలుజున్ను....... | 172 |
సీ. | అంబుధిశయన నారాయణ విగ్రహ యంబుజనాభ వేదాంతవేద్య.... | 173 |
ఉ. | ఇంతలు......................................యే | 174 |
క. | కాంతాలలామ నీ కే, కాంతంబునఁ బల్కరింతుఁ గల్గినకార్యం | 175 |
గీ. | .... తత్తరమున నాపోశన మెత్తఁబోయి, భూసురుం డెత్తె నుత్తరాపోశనంబు. | 176 |
గీ. | కామభోగములకును నేకాంతగృహము, పొలుపుమీఱిన ధర్మార్థములకు నిదియె | 177 |
వ. | అని మఱిన్ని అనేకప్రబంధముల నున్నది గనుక జాడ తెలియునది. | 178 |
దేశ్యయతి
చ. | 179 |
గీ. | దేశ్య తెలుఁగులందుఁ దెలియ నొక్కొకచోట, హల్లులోన నచ్చు లణఁగియుండు | 180 |
తా. | తెమ్మెర, ఓలమాస, క్రచ్చఱ, ఆఱడి, వీఱిఁడి, క్రిక్కిఱిసి అనునీమొదలుగాఁగల దేశ్య తెనుఁగుశబ్దములయందు హల్లులలో నచ్చులైన స్వరము లిమిడియుండుటచేత ఆచ్చుకు హల్లుకు ఆయక్షరమునే యతిగా జెప్పనగు ననుట. | |
క. | దొరలదొర యనఁగ విని గ్ర, చ్చఱ విజయానందరంగ హంవీరునియ | 181 |
క. | అతిథి నిను వచ్చి వేఁడిన, మతిఁ గింకిరి పడక యోలమాసగొనక స, మ్మతితో... | 182 |
క. | తెఱవా తరువాతను గ్ర, చ్చఱ నీనాయకుడు వశ్యుఁ డగు నెట్లంటే | 183 |
క. | ముఱిముఱి చీఁకటియప్పుడు, నఱిముఱి సుభటులు గడంగి యని సేయంగా | 184 |
వ. | అని మఱిన్ని అనేకప్రబంధములయం దున్నది గనుక తెలుసుకోగలది. | 185 |
మకారయతి
గీ. | యరలవశషసహార్ణము లాదిబిందు, యుతము లై మవర్ణవిరామయుక్తి నలరు | 186 |
క. | సున్న యనంగ మకారము, పన్నుగ శషసహలమీఁదఁ బ్రభవించిన యా | 187 |
తా. | యరలవశషసహలకు దాపలసున్నలు కలిగి మకారమునకు యతిగాఁ జెప్పవచ్చును. ఎటువలెనంటే సంయమి, సంవాసము, సంవాసము, సంశయము, సంసారము, సంహరణము ఇవి మొదలయినశబ్దములయందలి దాఁపలసున్న గలయక్షరములు | |
గీ. | మహితభక్తవత్సలత సంయములఁ బ్రోచు, మాధవునివలె విగతసంశయతశ్రితుల | 188 |
చ. | గరళపుముద్దలోహ మన గాఢమహాశనికోట్లు సమ్మెటల్ | 189 |
క. | ఓ సంయమిశేఖర! సం, వాసమ్మునకు భవదాశ్రమము లెస్స యనం | 190 |
క. | జయ మగుటకు నీమది సం, శయ మేటికి వినుమనుచు సమంచితకరుణా | 191 |
వ. | అని తరుచుగాఁ బ్రబంధములలో వ్రాసి ఉన్నది గనుక జాడ తెలుసుకోగలది. | 192 |
వికల్పయతి
గీ. | నలినఁగకారహ ల్లితరానునాసికాఖ్యఁ, గదిని తత్పంచమముగా వికల్పవిరతి | 193 |
గీ. | హయుతవర్గహల్లు వికల్పయతికిఁ జెల్లు, దేవకీనందనుఁడు జగద్ధితుఁ డనంగ | 194 |
తా. | వాక్ఛబ్ధము, కకుప్ఛబ్దము, దిక్ఛబ్దము, దృక్ఛబ్దము, జగచ్ఛబ్దము యీమొదలైనశబ్దములు సమాససంధిచేత వికల్పము లగును. గనుక వాటికి యతి చెప్పితే వికల్పయతి అని పేరు. | |
గీ. | అవని భవదీయవిక్రమోద్ధతికి వెఱచి, దెసలకును బాఱె విద్విషన్నికర మెల్లఁ | 195 |
మ. | ఒకనాఁ డిందుధరుండుఁ బార్వతియు లీలోద్యానకేళీసరి | 196 |
శా. | చోరాగ్రాహ్యగజాంకుశంబు నలిసి శుంభన్మదేభంబు ది | 197 |
సీ. | అరివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప దురమునఁ గదిసి తద్ద్రోహుఁ దునిమి... | 198 |
మ. | అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్టశా | 199 |
వ. | అని యిట్లు పెక్కుప్రబంధముల నున్నది గనుకఁ దెలియునది. | 200 |
బిందుయతి
గీ. | టతపవర్గాక్షరములకు దాపలించి, యొనరనూఁదిన బిందువు లుండెనేని | 201 |
తా. | టఠడఢ తథదధ పఫబభ యీపండ్రెండక్షరములకు దాపల సున్నలుంటే ణకారనకారమకారములకు వరుసగా యతులు చెల్లును. ఇదిగాక యేయక్షరము వలపలగిలఁకతో గూడియున్నదో ఆయక్షరములన్నీ నకారణకారములకు యతి చెల్లును. | |
గీ. | మహిఁ గుబేరునివంటి సంపదలఁ బొదలి, నిఖిలదిక్కులఁ గీర్తిచంద్రిక లవార | 202 |
శా. | శీలంబున్ గులమున్ ........... | 203 |
శా. | చెండ్లా గుబ్బలు ..................యీజవ్వనిన్ | 204 |
మ. | అకలంకౌషధ................................... మంచుకొం | 205 |
మ. | ధరఁ బాలించెఁ బురూరవున్ సగరునిన్ ద్రైశంకునిన్ హైహయున్ | 206 |
ఉ. | కావునఁ జంద్రుఁ గింద్రుఁ జిలుకన్ గిలుకన్ బికమున్ గికంబునుం | 207 |
క. | తలిరాకుఁబోఁడినిడుక, న్గెలఁకులఁ గర్ణాగ్రపాళి నీలాంబురుహం | 208 |
చ. | అనుమతి యింక వేఱె పడయన్ గత మెయ్యది కౌరవేంద్ర నన్ | 209 |
వ. | అని యున్నది గనుక నీజాడఁ దెలిసి యతులు చెప్పవచ్చును. | 210 |
ప్రాదియతి
గీ. | ప్రాదినిత్యసమాసశబ్దములు గాక, పెఱపదంబులపై యచ్చు బెరసినప్పు | |
తా. | సాష్టాంగము, సాహంకారము, సాంబశివుఁడు, సాంగోపాంగము, సాటోపము యివిమొదలైనవానియందు అద్యక్షరహల్లుతో అచ్చుకూడి ఉన్నందున హల్లునకైనను, అచ్చునకైనను యతియుండ జెప్పితే ప్రాదియతి యగును గనుక రెంటికి లక్ష్యము. | |
గీ. | అమలభక్తితోడ సాష్టాంగముగఁ బూని, సాంబమూర్తి దివ్యచరణములకు | 212 |
గీ. | జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెఱఁగిన, నావిభుండు వాని లేవనెత్తి | 213 |
క. | శంబరవైరివిభంజన, సాంబశివా యంధకప్రశాసక గజచ | 214 |
క. | అంగీకరించు మనుజుఁడు, సాంగోపాంగాధ్వరక్రియాఫలము వియ | 215 |
శా. | సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిం బయిం బంచినన్ | 216 |
గీ. | అనవరతమును బూజించి సాంబశివుని | 217 |
వ. | అని యనేకప్రబంధములయందుఁ చాలా చెప్పియున్నది గనుక సూచన వ్రాసినాను. | 218 |
ఆదేశయతి
గీ. | ద్వీప నా కాంతరీప ప్రతీపశబ్ద, ములకు నచ్చుహల్లులకు యతులు చెలంగు | 219 |
తా. | ద్వీప నాక అంతరీప ప్రతీప ఈశబ్దముల హల్లులలో అచ్చు లిమిడియుండుటచేత రెంటికిని యతులు చెల్లును. | |
గీ. | ఎలమి సత్కీర్తి జాంబవద్వీపమునకు, భర్త యగుపాదుషాచేతఁ బ్రణుతులంది | 220 |
ఉ. | ద్వీపులఁ ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ | 221 |
క. | నీకరవాలముపాలై, నాకంబున కేఁగి రాజి నారాయణ యా | 222 |
క. | నాకులజుఁ డైన రాముఁడు, శ్రీకంఠునివిల్లు విఱిచి సీతను ప్రేమన్ | 223 |
ద్వి. | నాకీశ మొదలమున్నాఁడఁ బల్కితివి. | 224 |
వ. | అని చాలాదిక్కుల నుదాహరణము లున్నవి గనుక సూచన తెలుసుకోగలది. | 225 |
ప్రభునామాఖండయతి
గీ. | ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక, ద్వివిధమగుఁ బ్రభునామాంతవిరమణంబు | 226 |
క. | తెనుఁగున నామాంతరములఁ, గనుపట్టెడి స్వరముఁ జెప్పఁగాఁ దగుహల్లున్ | 227 |
తా. | రామన, రామయ, సీతక, సీతమ అని యొకరిపేరితో కూడి తేలికగా బలుకఁబడిన శబ్దముల యచ్చులకు హల్లులకు యతి చెల్లును. | |
గీ. | అవనిలో నలమేలుమంగమకు సాటి, యాదిలక్ష్మి యానందరంగనకు సాటి | 228 |
మ. | అనవేమాధిపురాజ్యభారభరణవ్యాపారదక్షుండుఁ బె | 229 |
చ. | నగినగియేనియున్ విను జనార్దన యెన్నఁడు బొంకు వల్క మ | 230 |
వ. | అని యనేకప్రబంధములయం దున్నది. | |
ఘఞ్ యతి
గీ. | అచ్చు హల్లును లాపశబ్దాదివర్ణ, ములకుఁ జెప్పిన ఘఞ్ యతు లనఁగఁ దనరు | 232 |
తా. | అలాపశబ్దమధ్యవర్ణ మగులకారమునందు స్వరముకూడా గలసియుండుటచేత ఆ లకారము యతివచ్చుతావున అచ్చుకు హల్లుకు యతి చెల్లును. | |
క. | శ్రీ పరిఢవిల్ల సత్యా, లాపవిలాసి యగుకృష్ణు నటువలె రంగ | 233 |
క. | కోపాటోపంబున ధర, ణీపాలకచంద్రముఁడు మునిశిఖామణులన్ | 234 |
ఉ. | గోపురకందరాళికడకున్ శశిపుష్కరిణీకణార్ద్రపం | 235 |
సీ. | రమ్యతరాదినారాయణవిగ్రహహారివైణికకలాలాపహృదయ.... | 236 |
గీ. | అగ్రజన్మ నాతోమృషాలాప మిప్పు, డాడినందుకు ఫలము జిహ్వాంచలంబుఁ | 237 |
వ. | అని యచ్చు లైనస్వరముల కుండఁజెప్పినది కాన హల్లుకు నిస్సంశయ మని తెలియఁగలది. | 238 |
శకంధుయతి
గీ. | స్వాంత వేదండ మార్తాండ శబ్దములకు | 239 |
తా. | “క్షుబ్దస్వాంతధ్వాంత' అనేసూత్రాన నిపాతయైనప్పటికిన్ని లింగాభట్టీయమున భిన్నముగా వ్యాఖ్యానము చేసినందువల్లనున్ను, పూర్వమహాకవి ప్రయోగసరణిచేతనున్ను శకంధు, కర్కంధు, కులటా, సీమంత, మనీషా, హలీషా, లాంగలీషా, పతంజలి, సారంగ శబ్దములకు నచ్చు హల్లు ఈరెండుయతులు చెల్లును. | |
గీ. | అనఘ యానందరంగ! మార్తాండతేజ, యవుర నీశౌర్యమునకు వేదండవైరి | 240 |
మత్త. | దండితాహితవీర సూరినిదాన దానవినోద కో | 241 |
ఉ. | పాండునృపాలనందనుల పావని మున్నుగ నేచి యప్డు భీ | 242 |
ఉ. | స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాఁగ శంక యా | 243 |
గీ. | అధికరోషకషాయితస్వాంతుఁ డైన, నరపతికి విన్నవించకు నాయవస్థ... | 244 |
మ. | ధరణీచక్రము దిద్దిరం దిరిగె మార్తాండుండు కుంఠీభవ | 245 |
ఉ. | ...సారంగధరా యనన్ గువలయప్రమదం బగు.... | 246 |
ఉ. | ఇందఱి మించి పల్కెదు మనీషివె... | 247 |
వ. | అని యీరీతి వారువారు మహాకవులు చెప్పిరి గనుక లెస్సఁగాఁ దెలియగలది. | 248 |
సంయుక్తయతి
క. | వెలయఁగ సంయుక్తాక్షర, ములలో నెద్దాని నైన మునుకొని వడిగా | 249 |
తా. | అక్షరానికి సావత్తు, పావత్తు, మావత్తు, వలపలిగిలుక, కొరవడి యివిమొదలైనవర్ణము లేవి కూడియుండినా ఆజాతియక్షరములకు కూడా యతులు చెప్పవచ్చును. | |
గీ. | ప్రకటమతి విజయానందరంగనృపతి, క్షణములోఁ దృణమును మేరుసమము చేయు | 250 |
గీ. | ఆతఁ డఘమర్షణస్నాన మమ్మరుద్ధ్ర, దాంబువుల నాడి మాధ్యాహ్నికంబు దీర్చి | 251 |
క. | మానవనాథుఁడు గంగా, స్నానానంతరము సకలదానములు మహా | 252 |
వ. | దీనినే కొందఱు తకారయతి యందురు. కడమ సంయుక్తయతులు నిట్లే యని | 253 |
విభాగయతి
గీ. | సంఖ్యకును బరిణామసంజ్ఞకుఁ దనర్చు | 254 |
తా. | రెండవది, మూఁడవది, నాలవది యనిపలుకఁబడు సంఖ్యాపరమైనశబ్దములకున్ను గంపెఁడేసి, మోపెఁడేసి, చేరిఁడేసి, పట్టెఁడేసి యనిపలుకఁబడు ప్రమాణమైనశబ్దములకును అచ్చుహల్లులకు రెంటికిని యతి చెల్లును. | |
గీ. | అతులవైభవపటిమ రెండవసురేంద్రు, డీతఁడే యనఁ దగి పెట్టెఁడేసి సొమ్ము | 255 |
సీ. | ఆయంబునందు నాలవభాగ మొండె మూఁ, డవభాగ మొండెఁ దదర్థ మొండె... | 256 |
మ. | గవిలో..........రెం | 257 |
మ. | ... రెండవకైలాసముఁబోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్ | 258 |
గీ. | కృష్ణుఁ డిచ్చె నాలుగేసికోకలు కూర్మి, యింతులకును నాలుగేసిమణులు | 259 |
వ. | అని వున్నది గనుక సూచన తెలియ వ్రాసినాను. | 260 |
చక్కటియతి
గీ. | పుఫుబుభులకు ముకారంబు పూర్వమునను | 261 |
తా. | పు, ఫు, బు, భు యీ నాలుగక్షరములు ముందుగావున్నా వెనుకనున్నా యతి చెల్లును. | |
గీ. | మొనసి యానందరంగభూభుజునికీర్తి, భువనముల నాక్రమించిన మురహరుండుఁ | 262 |
మ. | అనుచున్ జేరఁగ వచ్చి లక్ష్మణ వృధాయాసంబు నీకేల వే | 263 |
క. | అనుటయు నాగంధర్వుఁడు, మునివర! శ్రీకృష్ణుఁ డఖిలభూతావళియం | 264 |
| భూతేశుఁ డప్పుడు ముష్టిని బొడిచె. | 265 |
వ. | అని యిట్లున్నది గనుక తెలియఁదగినది. | 266 |
సరసయతి
క. | వెలయఁగ వర్గువు శషసలు, గలసిన సరసవడి యండ్రు కవివరు లెల్లన్ | 267 |
క. | అయహలు చఛజఝశషసలు, నయసన్నుతనణలురేచవాసరసగుణా | 268 |
తా. | అకారయకారహకారములకున్ను నకారణకారములకున్ను చఛజఝశషస యీ7 అక్షరములకున్ను ఒకటొకటికి యతులు చెప్పితే అది సరసయతి యనఁబడును. | |
గీ. | సరసకవిచకోరములకు శశివి నీవె, జగతిలో నెన్న నీశ్వరాంశజుడ వీవె | 269 |
సీ. | గంభీరవేదిలక్షణలక్షితంబు లై... | 270 |
వ. | అని యీరీతి సకలకవులు విస్తారముగా చెప్పుటచేతను ఇందుకు పూర్వకవిప్రయో | 271 |
అభేదయతి
గీ. | రహిగ లళలకు లడలకుఁ బ్రాసయతు లొ, నరుప నవి యభేదప్రాసవిరతు లగును | 272 |
తా. | లకారళకారములకున్ను లకారడకారములకున్ను ప్రాసములు యతులు చెల్లును. ఱకారరేఫలకు లకారమునకున్ను దకారడకారములకున్ను యతులు మాత్రము చెల్లును. | |
గీ. | రంగనరపాల విష్ణుకళావిలాస, దీనజనపారిజాత పాటించి నిన్ను | 273 |
సీ. | శాశ్వతవిశ్వవిశ్వంభరాచక్ర మీ, రాజకుమారుఁ డేలంగఁ గలఁడు | 274 |
శా. | నీకుం గాక కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీఁదెత్తితిన్ | 275 |
ఉ. | ఏపునఁ గృష్ణరాయజగతీశ్వరుఖడ్గము మింటిమార్గమున్ | 276 |
క. | అభిముఖసరివృత్తము లగు, నిభతురగస్యందనంబు లిలఁ గూలఁగ సం | 277 |
చ. | ఒకపలువాతఁ గొన్నకిటియుం దలలో నిడుకూర్మభర్త నా | 278 |
క. | దానవసుందరు లత్తఱి, జానకి నందలముమీఁద సమ్మద మొదవం | 279 |
రగడ. | లలిత మగులవలీకుడుంగముల లుంగమాల... | 280 |
ఉ. | గొబ్బున నానతిమ్ము రఘుకుంజర! నీకరుణాసముద్ధతిన్ | 281 |
శా. | డాచే యంకతలంబుఁ జేర్చి వలచేతన్ మాలికన్ దాల్చి... | 282 |
శా. | డిండీరోత్తరవీచులం దరసి యుద్రేకించి కూలంకషల్ | 283 |
చ. | ఇలఁగలవస్తుసంతతుల నెల్లను గెల్చెడుమత్స్యజాతపా | 284 |
క. | వపయోరభేద మనియెడు, నెపమునఁ బఫబభలు వాకు నిలిచినయెడలం | 285 |
తా. | పఫబభ యీ నాలుగక్షరములకు వకారమునకు యతి చెల్లును. | |
క. | తురగము తురగము కరి కరి, నరుఁడు నరుఁడు తేరు తేరు నలిఁ దాఁకినయ | 286 |
క. | వీరుం డగునరుఁ డేయున, పారశరావళుల నడుమ వారింపంగా | 287 |
చ. | నుతజలపూరితంబు లగునూతులు నూఱిటికన్న సూనృత | 288 |
ఎక్కటియతి
క. | ధర ఙఞ అనునీరెండ, క్షరములు విన్నయది లేదు శబ్దము మొదలన్ | 289 |
క. | ధర నెక్కటివ ళ్లై చను, లరమఱవలు వానిలోఁ దొలంగక ళాకున్ | 290 |
తా. | మకారమునకు మకారమున్ను, రేఫకు రేఫయున్ను, వకారమునకు వకారమున్ను, లకారమునకు లకారళకారమున్ను ఱాకు ఱాయున్ను యతిగా నుండునట్లు చెప్పిన నెక్కటియతి యగును. | |
వ. | వీనికి బ్రయోగములు సముద్రతరంగములవలెఁ బ్రబంధాదులయందు గలవు గనుక | 291 |
ఋయతి
గీ. | క్షితి ఋకారరూపస్వరయతులు పరఁగు, ఋగ్యజుస్సామవినుతుండు కృష్ణుఁడనఁగ | |
తా. | స్వరములలోని ఋకారమునకు హల్లులతోఁ గూడినఋకార మగువట్రువసుడికిని, ఇకారరూప మైనక్రారవడికిని, రేఫ చెప్పితే అది ఋయతి యగును. | |
క. | క్షితి ధనదుమించుకలిమియు, ఋతురాజును మించురూపరేఖావిభవో | 293 |
శా. | తృష్ణాతంతునిబద్ధబుద్ధు లగురాధేయాదులున్ గూడి శ్రీ | 294 |
క. | కావున మీరు రచించిన శ్రీవారాహంబు మంచికృతి నాపేరన్ | 295 |
సీ. | ప్రతిఘటించుచిగుళ్లపై నెఱ్ఱవారిన, రీతి నున్నవి వీనిమృదుపదములు... | 296 |
వ. | అని యిట్లు బహుప్రబంధములయందుఁ జెప్పఁబడి యున్నది గానఁ దెలియునది. | 297 |
ప్రాకృతాదేశయతి
గీ. | తొలుతఁ బ్రాకృతసూత్రంబువలన జ్ఞాకు నార్ణ మాదేశముగ వచ్చి యమరుకతనఁ | 298 |
గీ. | యజ్ఞమునకు జన్న మాజ్ఞప్తి కానతి, యాజ్ఞ కాన సంజ్ఞ కరయ సన్న | 299 |
తా. | జ్ఞాకు దద్భవపదముగా నకారము వచ్చును గనుక నారెంటికి యతి చెప్పితే అది యాదేశయతి యనఁబడును. | |
మ. | ......నాకూర్మినం, దనమే లాత్మఁ దలంచి దేవరకు విజ్ఞాపింప నేనచ్చితిన్. | 300 |
ఉ. | ...సత్యభారతీ, జ్ఞానులు పద్మగర్భువదనంబులు నాలుగు... | 301 |
సీ. | తావకనగజలస్త్నాతపాపహరాయ నతిమాత్రసాధన జ్ఞాయదాయ... | 302 |
వ. | అని వున్నది గనుక తెలియునది. | 303 |
పోలికయతి
క. | పోలున్ పుఫుబుభులకు మూ, పోలికవడి శీలముల్లమున కెన యనఁగా | 304 |
తా. | శీలము, శీలంబు; లోకము, లోకంబు; చిత్తము, చిత్తంబు; కరము, కరంబు; అని రెండువిధములుగా పలుకఁబడిన ముకారము తుదనుండేశబ్దములకు పుఫుబుభులు యతి చెప్పవచ్చును. | |
క. | ఆనందరంగనరపతి, భూనుతగుణశాలి లోకమున నతనికి సా | 305 |
క. | దారుణకల్పాంతమరు, త్ప్రేరితహవ్యవహశిఖలపె ల్లిది యన బృం | 306 |
వ. | అని బహుప్రబంధాదుల విస్తరించి చెప్పియుండుటచేత నుదాహరణములు మెం | 307 |
అఖండయతి
ఉ. | మానుగ విశ్రమాక్షరసమన్వితమై స్వర మూఁదినన్ దదీ | |
| భానుసహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్ధయుక్తమై | 308 |
తా. | హల్లుగా నిల్చియున్నవిశ్రమాక్షరమందు స్వరము కూడియున్నను నాయక్షరముచే యతిగాఁ జెప్పినఠ్లైతే అది యఖండయతి యనఁబడును. | |
క. | ఆనందరంగనృపతి జ, నానందత సేయు నొక్కనాఁటిసెలవు పా | 309 |
క. | నీవును దల్లులు బంధుజ, నావళి పురజనులు హస్తినాపురమునకున్ | 310 |
ఉ. | తేరులయొప్పు మోటువడఁ దేకువ దప్పి పదాతికోటి ను | 311 |
క. | నావచనమున నపత్యముఁ, గావించున్ గుంతి నీకుఁ గడు నెయ్యముతో | 312 |
క. | తమతండ్రి భంగి నీకును, సముచితముగ భక్తిఁ జేసి సజ్జననుత మా | 313 |
ద్వి. | ఉన్నాఁడు తడవుగా నున్నాఁ డతండు, మన్నాఁడు మమ్ముఁ దెమ్మ న్నాఁ డటన్న. | 314 |
వ. | ఋషిపర్యాయమున అచ్చు కద్దని పూర్వకవిప్రయోగము గలదు. | 315 |
ద్వి. | ఎక్కడ గురుఁడని యెఱుఁగనినీకు, నక్కటా! గురుఁడు విశ్వామిత్రుఁ డయ్యె. | |
క. | శఠకోపయతికి ఖలతరు, కుఠారరూపమతికి శఠగురుమతహృత్క | 317 |
క. | రమణీయరత్నములరుచి, నమరెడునది పంక్తికంకునగరు నృపాలో | 318 |
వ. | దీనిని గొంద ఱాదేశయతికి ఉదాహరణమందురు. అది కాదు. | 319 |
ఉ. | అన్నవు తండ్రియట్ల విను మంతియగా దటుమీఁద రాజ నే | 320 |
చ. | వనిత యొకర్తు మున్కొని గవాక్షతలంబున నిల్చి యుండుటన్ | 321 |
గీ. | గళితహరికుంజరశతాంగముల ధరిత్రి, గప్పుచు యథామనోరథగతిఁ జరించె | 322 |
వ. | అని యి ట్లనేకప్రబంధములయందు విస్తారముగా నుదాహరణయోగ్యముగా లక్షణ | 323 |
ప్రాదియతులు
క. | ప్రపరాపసమనుసుప్ర, త్యపినిర్దురధిన్యుపాభ్యుదాఙ్న్యత్యవప | 324 |
తా. | ప్ర, పర, అప, సం, అను, సు, ప్రతి, అపి, నిః, దుః, అధి, ని, ఉప, అభి, ఉత్, ఙ్, ని, అతి, అవ, పరి అని ఇరువదివిధముల యుపసర్గములు కలవు. వీనికి స్వరము లున్నచో నచ్చులకును, హల్లులకును యతి చెల్లుననుట. ఇందొక్కొక్కదానికిఁ బ్రత్యేకముగాఁ బూర్వకవిప్రయోగములు వ్రాయుచున్నాఁడను. | |
శా. | ప్రారంభం బగుశక్తి కుట్మలితహస్తాంభోజ యై యి ట్లనున్. | 325 |
శా. | ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహమౌ నంచు నో... | 326 |
క. | పరమ మిది యొకరహస్యం, బరవిందజ వినుము మత్పరాయణు లెందున్ | 327 |
చ. | అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదుయోధవ | 328 |
క. | నాయంగముల నెల్ల, బాయస మతిభక్తిఁ బూసి పాదతలమునన్ | 329 |
క. | భారతవంశాచార్యుఁడు, భారద్వాజుండు నా కపాయము సేసెన్ | 330 |
చ. | అమరఁగ రాజధర్మము సమాశ్రయ మై నడపున్ ద్రివర్గమున్... | 331 |
క. | చల్లని దక్షిణమారుత, మల్లన వీతెంచి తగిలె నాలలనాధ | 332 |
క. | నయమును ధర్మము గలయ, న్వయమున జనియించినాఁడ వక్కట ధర్మ | 333 |
సీ. | నృపవరాగ్రణి విను మిఁక మీఁదఁ దానకాన్వయమున సారసనాభుఁ డుదయమంది దుష్టాత్ముల నణఁచు... | 334 |
చ. | వదనభుజోరుపాదయుగవర్ణచతుష్టయమున్ యుగాదియం | 335 |
ఉ. | కప్పినయాదురాగ్రహము గర్వము ముంచుకొనంగ నాకు మున్ | 336 |
సీ. గీ. | ఉల్లసిల్లుచు మేలిమి యొప్పునప్పు, డబ్జగర్భునిమ్రోలఁ బ్రత్యక్షమయ్యె. | 337 |
క. | దక్షమఖక్షయకరు నిట, లాక్షజహుతవహనభక్షితానంగు విరూ | 338 |
క. | శయధృతఫణివలయ భవా, వ్యయ విహితవిశుద్ధసంవిదాత్మక మాయా | 339 |
క. | జయవిజయవినుత జన్యా, వ్యయ దూరానందరూపభాసురదత్తా | 340 |
ఉ. | సాహసికాగ్రగామి నృపసత్తముఁ డట్లు తదీయఘోరమా | 341 |
సీ. | రామానుజుండు నిరంతరము పదాఱువేల నూ టెనమండ్రువెలఁదు లతని... | 342 |
ఉ. | అంత నిరంతరంబును దురంతసమున్నతిమంత మయ్యె హే | 343 |
క. | ఎంతయును దుస్తరంబు దు, రంతర సంసారవారిరాశి యది వెసన్ | 344 |
సీ. | అగ్రజుచేత నధ్యాత్మరామాయణం బొకపరి విన జనులకును గలుగు... | 345 |
క. | భువిలో మిత్రుం డగువాఁ, డవిరతమును వేఱులేక యాత్మీయమహో | 346 |
క. | భూతలపతి మదిలోపల, నీతముఁ బాలించి యమ్మెయిన్ విప్రగురు | 347 |
గీ. | నిఖిలజనములు గనుఁగొన నీబలంబు. | 348 |
ఉ. | అఱ్ఱున వింటినారి బిగియం దగిలించి విరోధిమోముఁ గ | 349 |
ఉ. | ఆమగధేశమాళవధరాధిపు లెక్కటిఁబోరి రాజిలోఁ | 350 |
గీ. | అఖిలపారికాంక్షికాశ్రయపర్ణశా, లోపకంఠమునకు లోకకర్త | 351 |
గీ. | ఇప్పు డేనుదలఁచినయభీష్ట మెల్లఁ, జేకుర నొనర్చి నీవు రక్షింపవయ్య. | 352 |
ఉ. | అల్లనఁ దొండ మెత్తి శివు నౌదలయేటిజలంబుఁ బుచ్చి సం | |
| జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణ సేయునట్లు శో | 353 |
క. | కాంచి తదీయవిచిత్రో, దంచితసౌభాగ్యమహిమ కచ్చెరువడి య | 354 |
చ. | పటువిశిఖంబులం ద్రిదళపాలతనూజుఁడు పంది నేసెఁ దా | 355 |
క. | బాలరసాలకిసాలముఁ, గ్రోలుచుఁ బలికెడిపికం బకో యనఁ జాలా | 356 |
క. | మౌనితిలక! సజ్జనసం, తానమహీరుహ! భవత్సుధాలాపము నా | 357 |
మ. | అతఁ డావాతపరంపరాపరిమళవ్యాపారలీలన్. | 358 |
క. | ఉపగతశుద్ధులు పాప, వ్యపగతబుద్ధులు వినీతివంతు లసములన్ | 359 |
చ. | ఇనసమతేజు లై ధరణి నెన్న నధర్మపథంబుచక్కిఁ ద్రొ | 360 |
మ. | సమదేభాళి తలంకి పైకురికినన్ శంకించి భూపాలుఁ డా | 361 |
సీ. | నరనాథ! యతని దానమ్ములచేత నవాప్తకాములు గానియగ్రజన్ము(లు) | 362 |
సీ. | వనమాలి గొల్చినజనములం దెన్న నవాప్తకాములు గానివారు లేరు. | 363 |
ఉ. | ఆయెడ దేహదీప్తు లఖిలావనిభాగము లాపరింప నా | 364 |
సీ. | రాజులకును విపర్యాసబుద్ధి జనింప నాసీమప్రజకెల్ల హానిగాదె? | 365 |
తా. | ఇట్లు బ్రాదియతుల కనేకప్రబంధముల నుదాహరణములు గలవు. గ్రంథవిస్తరభీతిచే నిట సూచనగా వ్రాయబడినవి. ఇట యతిప్రాసలక్షణలక్ష్యప్రకరణం | |
ఆశ్వాసాంతము
చ. | ధృతమహిభార! భారవిసదృక్కవిరాజసమాజసన్నుతా | 366 |
పంచ. | త్వరాసదృగ్విధీయమానదానతోయశోషితాం | 367 |
మాలిని. | విమలజలధికన్యా విస్ఫుటాగారధన్యా | 368 |
గద్యము. | ఇది శ్రీమదుమామహేశ్వర కరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చ | |
- ↑ కావ్యాలంకారచూడామణి
- ↑ పాదాంగచూడా; వాదాంగచూడా.
- ↑ సరసలు నాఁ బదియు వళ్లు చను నిద్ధాత్రిన్.
- ↑ నయతత్వనిధీ ; నయవినయనిధీ
- ↑ హారము లాతని; హారితము లతని
- ↑ యనశబ్దంబు
- ↑ వేర్వేఱఁ బ్రాసమయ్యె
- ↑ బృందాననసారంబున (ఈపద్యము అప్పకవీయములో మధుసేవనమునందు అని ఇచ్చి ఉన్నది)
- ↑ బిందువగుట
- ↑ మీఁద నున్నధకారంబు నూఁదఁ బ్రాస
- ↑ ప్రబంధరాజవిజయవెంకటేశ్వరవిలాసము
- ↑ సంఖ్యఁ
- ↑ ఈ పద్యము హరివంశమునఁ గానరాదు గాని అప్పకవీయములో కూడా ఉదాహృతము. (చూ. 3-320)
- ↑ నదాఱవపాలె
- ↑ ఈపద్యము అనంతచ్ఛందములో గ్రంథకర్త పద్యమువలె ఉన్నది. (చూ. 1–61)
- ↑ కౌరవ్యవీ
రాంగమ్ముల్ నుఱుమాడి తత్ప్రబలసైన్యంబెల్ల మాయించి యి
త్తుం - ↑ వ్రాతప్రతులలో ఇది ఉత్తమగండచ్ఛందములోని దని ఉన్నది.
- ↑ బ్రాసమైత్రి యిట్లు పరఁగుఁ గృష్ణ.
- ↑ బందముఁ గూరఁగ శంకర
- ↑ ఈపద్యము అనంతచ్ఛందమున గ్రంథకర్త పద్యముగా ఇచ్చివున్నది. (1-50).
- ↑ ఇది అనంతచ్ఛందమున కనబడదు.
- ↑ బాహుదండాగ్ర్యమునను
- ↑ ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడే చెప్పినట్లున్నది (1.95). అప్పకవీయములో అనంతచ్ఛందమునందు అని ఉన్నది (8-94).
- ↑ ప్ర,శ్నాకలిత (అనంతచ్ఛందములోను, అప్పకవీయములోను ఉన్నది.)
- ↑ చేరనివారిం గొని
- ↑ జేరువఁదగ నాద్యచ్చుల; జేరువతో-జేరుపఁ దగునాద్యచ్చుల
- ↑ నారూఢిగఁ బ్లుతమువడి మహత్త్వము మీఱున్; తో రూఢిన్ బ్లుతమువడి యెదుర్కొని నిలుచున్
- ↑ కొన్నిప్రతులలో లేదు.
- ↑ కొన్నిప్రతులలో లేదు.
- ↑ ఈ పద్యము వేదము వేంకటరాయశాస్త్రిగారు సంప్రతించిన కావ్యాలంకారచూడామణిప్రతిలో కొంచెము భిన్నముగా ఉన్నది.
- ↑ వ్రాతప్రతులలో సుభద్రాపరిణయ మని ఉన్నది. విజయవిలాసమునకు అది రెండవపేరు.
- ↑ ఇది అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పిన పద్యముగా ఉన్నది. (చూ1-122)
- ↑ ముద్ధరించు
- ↑ ప్రల్లదంబు
- ↑ రులుల్లుఱుకులాడెడి
- ↑ ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పినట్లున్నది (చూ.1-117). అప్పకవీయములో అనంతునిఛందమునందు అని ఉన్నది (చూ. 8-77). సులక్షణసారములో పెద్దిరాట్ ఛందమున అని ఉన్నది.
- ↑ ప్రతులలో ఇట్లే ఉన్నది గాని ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పినట్లున్నది (చూ. 1-92).
- ↑ కడుముదమున
- ↑ ప్రబంధరాజవిజయవేంకటేశ్వరవిలాసము
- ↑ ఈ పద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పిన ట్లున్నది. (1-121).
- ↑ ఈపద్యము అనంతచ్ఛందమున లేదు. అప్పకవీయములో కావ్యచింతామణియందు అని ఉన్నది (చూ.3-220).
- ↑ ఈపద్యము కొన్నిప్రతులయందుఁ గాన్పింపదు.
- ↑ హేమపీతాంబరుఁడు దేవవృషభుఁ డనఁగ