Printed by

V VENKATESWARA SASTRULU

OF V. RAMASWAMY SASTRULU & SONS,

AT THE 'VAVILLA' PRESS, MADRAS.

 
ఉత్సర్గము,

శ్లో. క్వను మాం త్వదధీనజీవి తాం వినిశీర్య క్షణభిన్న సౌహృదః, సలినీం ఈత నేతుబద్ధనే జలసజ్ఞాత ఇ వాసి విద్రుతః.

ఇహపరములు టికిని సంబంధ మున్నది. అనంబంధముయొక్క జ్ఞాపకార్థము ఈ గ్రంథ వివిధముగా ఉత్సర్గము చేయఁబడియె.

శ్లో. యేతు సర్వాణి కర్మాణి మయి సంసస్య మత్పరాః, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయస్థ ఉపాసతే, తేషా మహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్, భవామి నచీరా త్పార్థ దుయ్యా వేశిత చేతసామ్. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్, అభ్యసయోగేన తతో మ మిచ్ఛాప్తుం ధనజ్జాయ. శ్రీ భగవద్గీతా 12 అధ్యాయము.)

విజ్ఞప్తి

ఈ “ఆనందమఠ" మను గ్రంథమును బంగాళదేశము నందు ప్రసిద్ధోపన్యాసలేఖలకు లని ప్రఖ్యాతిగాంచిన శ్రీ బంకించంద్రచట్టోపాధ్యాయులవారు బంగాళీభాషయందు రచియించిరి. శ్రీ బిపినచంద్రపాలుగారు 1907-వ సంవత్సరమున ఈ రాష్ట్రమున స్వదేశీప్రచారము సాగించుచున్నపుడు రాజమహేంద్రవరమున వారిని కలిసికొంటిని. వారు వెంటనే కలకత్తావెళ్లి బెంగాళీ ఆనందమఠ ప్రతి పుచ్చుకొని తగువారిసహాయముచే నన్ను తెనుగుతర్జుమా చేయమని కోరినందున అట్లే చేసితిని. మరల చెన్నపట్టణము చేరగనే తెలుగుతర్జుమా కాకితముల ఓ. వై. శ్రీ దొరస్వామయ్య కిచ్చి సాఫువ్రాయమని కోరితిని. వారు కర్ణాటకముస శ్రీ బి. వేంకటాచార్యులచే ప్రచురింపఁబడిన ప్రతినికూడ సహాయము పుచ్చుకొని సరిచూచియిచ్చిరి.

కథాసారాంశము.

1. ఈ గ్రంధమునందు బంగాళాదేశమును ఆంగ్లేయు లుద్ధారముచేసినవిషయము లుదాహృతములై యున్నవి.

2. స్త్రీలు, కొన్ని సమయములయందు పురుషులకు సహకారిణులుగ నుందురు. కొన్ని సమయములయందు కారు.

3. సమాజక్షోభము ఆత్మపీడనమాత్రము. రాజవిద్రోహులు ఆత్మఘాతుకులు. ఇది బంగాళీదేశమునందు 1773 - 74 సంవత్సరములందు జరిగిన సన్న్యాసివిద్రోహచరిత్రాధారముచే రచయిత మైనది. సన్న్యాసివిద్రోహ (Sannyasi Rebellion) యథార్థచరిత్రము ఇంగ్లీషు గ్రంథములందు ఉద్ధృతమై యున్నది. పరిశిష్టమును (Appendix) జూచిన వేద్య మగును. ఉపన్యాసమందు వర్ణింపఁబడిన యుద్ధములు వీరభూమియందు జరుగ లేదు. ఉత్తర బంగాళా ప్రదేశమునందు జరిగినవై యున్నవి. ఈ వ్యత్యాసము గ్రంథమునం దుండుటను దోషముగా గ్రహింపకుఁడు, ఏలన, ఉపన్యాసము చరిత్రము కాదు కదా!

బెంగాలువిభజనముసకు ప్రతికూలముగ 1906 - వ సం!! ప్రాంతమున బెంగాలునందేకాక దేశమంతట తీవ్రప్రచారము సాగెను. బెంగాలీలు బారిసాలునందు రాష్ట్రీయకాన్ఫరెన్సు సాగించినపుడు అధికారులు దీనిని చెదరగొట్టి శ్రీసురేంద్రనాథబనర్జీవంటివారినెత్తిని బ్రద్దలు కొట్టిరి. అల్లరికి 'వందేమాతరము' గీతమును పాడుటయే కారణములలో నొకటి యని తెలిసినది కావున యీగీత మున్ననవలను ముద్రించుటలో నేను యెన్నికష్టములకు పాలైతినో చదువరు లూహింపవలెను.

ఇట్లు,

వావిళ్ల వేంకటేశ్వరులు.

శ్రీరస్తు

ఆనందమఠము

ఉపక్రమణిక

అతివిస్తృతం బైనయొకానొక యరణ్యంబునందు అధికాంశము సాలవృక్షంబులును, మఱియు ననేకములగు ఇతరజాతి వృక్షంబులు నుండెను. వృక్షశాఖలు వర్ణంబులతో దట్టంబుగా పెరిఁగి యాకాశము నంటఁబోవుచున్నవో యనునట్లుండెను. వెలుతురు చొరనంత దట్టముగా చెట్లసమూహ ముండెను. అనంత మైన పల్లవసముద్రము బహుదూరము వ్యాపించి యుండెను. గాలిచే వర్ణంబులు తగంగములవలె పైకి లేచిపోవు చుండెను. గాఢాంధకారము. పట్టపగటియందుఁ గూడ స్ఫుటమైన ప్రకాశము లేదు. భయంకరముగా నుండెను. మనుష్య ప్రవేశము లేదు. ఆకుల మర్మరశబ్దమును, వన్యమృగములయు, పక్షిజాతులయు శబ్ధమును తప్ప ఇతరధ్వని లేదు.

ఆ యరణ్యము విస్తారమై అతినిబిడమై అంధతమోమయ మైనది. అందులోను రాత్రికాలము, రాత్రియందును అర్ధరాత్రి, అర్ధరాత్రియందును అతిశయమైన అంధకారము, అరణ్యబాహ్యప్రదేశము నందును అంధకారమే; ఏదియుఁ గనబడదు. . అరణ్యములోపల భూగర్భమునందలి అంధకారము వలె తమోరాశి నిండియుండెను. పశుపక్షులు నిశ్శబ్దముగా నుండెను. కోటానుకోట్లపశుపక్షికీటకాదు లావనమునందు వాసము చేయుచుండెను. అయినను, ఒకదాని శబ్దముకూడ వినఁబడలేదు. శబ్దమయప్రపంచమునం దున్నవారికి, ఆ నిశ్శబ్దభావము ననుభవించుట మహాకష్టము.

తుద మొదలు లేని యా వనమధ్యమందు, ఆసూచ్యభేదమైనట్టి యంధకారమయమైన యర్ధరాత్రియందు, అనను భవనీయమైన నిశ్శబ్దమధ్యమున “నామనోరథము సిద్ధికాదా, ఏమి?” అనెడి శబ్దము వినఁబడెను.

ఈశబ్దమును విన్నతోడనే ఆయరణ్యము మరల నిశ్శబ్దమున మునిఁగిపోయెను. ఇట్టి భయంకరమైన మహారణ్యంబునందు మనుష్యధ్వని వినఁబడు నని యెవ్వరు చెప్పుదురు? కొంచెముసేపటికి అనిస్తబ్దముకు మథించికొని మనుష్యకంఠస్వరముతో “నామనోరథము సిద్ధికాదా, ఏమి? " అను ధ్వనియే మరల వినఁబడెను.

ఇట్లు ముమ్మాఱు ఆయంధకారసముద్రమునందు ధ్వని వినఁబడెను, ఆప్రశ్నకు ఉత్తరముగా “దీనికై నీవు సమర్పించు కానుక యేది ?” అనెడి శబ్దము వినఁబడెను.

దానికి ప్రత్యుత్తరము - 'నాప్రాణమే దీనికి కానుక.'

మరల ప్రతిశబ్దము - 'ప్రాణము కేవలము తుచ్ఛమైనది, అందఱును దానిని ద్యజింపఁగలరు',

“వేఱేమి కావలయును? దేనిని సమర్పింపవలయును?'

దీనికి ఉత్తరము - 'భక్తి.'


__________

"https://te.wikisource.org/w/index.php?title=ఆనందమఠము&oldid=374970" నుండి వెలికితీశారు