ఆధునిక రాజ్యాంగ సంస్థలు/ప్రథమ ప్రకరణము

ఆధునిక రాజ్యాంగ సంస్థలు.

ప్రథమ ప్రకరణము.

పందొమ్మిదవశతాబ్దారంభమునుండియు, ప్రపంచము నందలి రాజ్యములలో నే రాజ్యాంగమునందైన సంస్కరణలు సాధ్యమైనచో, ఆసంస్కరణలద్వారా, క్రమక్రమముగా ప్రజాస్వామ్యము హెచ్చగుటకే ప్రయత్నములు జరుగుచుండెను. నిరంకుశ రాజ్య పాలనకు లోబడిన, రషియా, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రియా, హంగరీ దేశములందును, చైనా, పర్షియా దేశములందును, దక్షిణ అమెరికా రాష్ట్రములందును, బాధ్యతాయుతమగు ప్రజాప్రతినిధిసంయుతమగు సంస్థలే, రాజ్యాంగములందు ప్రాముఖ్యతకు వచ్చుచుండెను. తుదకు, ఈశతాబ్దపుప్రపంచయుద్ధానంతరము, మేర్పడిన స్వతంత్రరాజ్యము లన్నిటియందును, ప్రజాస్వామికరాజ్యాంగ విధానములే స్థాపించబడినవి. మొన్నమొన్ననే (అనగా 1932 జూను, జూలై మాసములందు) "రక్తరహిత విప్లవము" ద్వారా జావాదేశమునకు గూడ ప్రజా స్వామిక రాజ్యాంగ విధాన మేర్పడినది. మనదేశమందలి స్వదేశ సంస్థానపు ప్రభువులుకూడ, క్రమముగా, ప్రజాప్రతినిధిసభలను స్థాపించి ప్రజలకు తమ ప్రభుత్వముపై, కొంచెము కొంచెముగా, స్వామికమును ప్రసాదించుచున్నారు. కీ|| శే|| మాంటాగూ గారు, మనదేశమునకు ప్రసాదించిన రాజ్యాంగసంస్కరణ చట్టముద్వారా మన భావికాలరాజ్యాంగవిధానమునకు రూపురేఖలు యేర్పరచెను. వానిననుసరించియే భారతావనికిని ప్రజాస్వామిక రాజ్యాంగమే స్థాపితము కానైయున్నది. రౌండు టేబిలు కాన్ఫరెన్సుప్రణాళిక ప్రకారముగను, కాంగ్రెసు యొక్కప్రణాళిక చొప్పునను బాధ్యతాయుత ప్రజాస్వామిక రాజ్యంగమే మనకు తగియున్నట్లు సూచింపబడుచున్నది. ఇప్పటికప్పుడే స్థానిక సంస్థలయందు మనప్రజ లీబాధ్యతాయుత ప్రజాప్రతినిధిసంస్థలకు అలవాటు జెందియున్నారు. మనవలెనే ప్రపంచమందంతట, ప్రజాసామాన్యమేకాక, రాచకీయజ్ఞులును, ప్రజాస్వామిక రాజ్యాంగమే అత్యుత్తమమైనదని యభిప్రాయపడుచుండ, వివిధదేశములందు ఇదివరకున్న నిరంకుశ రాజ్యాంగవిధానముల విడనాడి, ప్రజాస్వామిక రాజ్యాంగ విధానముల స్థాపించుచుండ, ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదము కాదని, బాధ్యతాయుత ప్రభుత్వసంస్థలు కల్గి యున్న దేశీయులు కొందరు వాదించుచున్నారు. దాదాపు అరువదివత్సరముల పర్యంతము బాధ్యతాయుతప్రభుత్వమును బొందియుండిన ఇటలీదేశము, నిరంకుశరాజ్య పాలనమును స్వీకరించియున్నది. స్పెయినురాజ్యమునుండి స్వతంత్రతబొందిన పిమ్మట, దక్షిణామెరికాఖండమం దేర్పడిన, రిపబ్లికులన్నియు, తమ ప్రజాప్రతినిధిసంయుతమగు బాధ్యతాయుత రాజ్యాంగముల ననేక మారులు పోగొట్టుకొని, తుదకు, (డిక్టేటరు) 'నిరంకుశనియంత' ల పెత్తనము నంగీకరించుచున్నవి. యుద్ధానంతరము స్థాపించబడిన పోలండు, హంగరీరాజ్యము లందును, ప్రజాస్వామిక రాజ్యాంగమును, ఆవలద్రోచి "నిరంకుశనాయకు" లే రాజ్యపరిపాలనను జరుపుచున్నారు. అటులనే, బల్గేరియా యందును, శ్రీకేరొల్ ప్రభువు నిరంకుశ రాజ్యాంగము నేర్పరచినాడు. టర్కీయందు, రిపబ్లికు యేర్పడినను, శ్రీ ముస్తాఫాకెమాల్‌గారే, రాజ్యాంగమునకు ప్రెసిడెంటుగను, మంత్రాంగసభ కధ్యక్షుడుగను, పార్లమెంటు నందలి అధికసంఖ్యాకులకు నాయకుడుగను వ్యవహరించుచూ, నిరంకుశుడై యున్నాడు. రషియాదేశమునందు, రిపబ్లికు స్థాపించబడినను, బోల్షివిక్కుపార్టీవారు కార్మికులతరపున తమ నిరంకుశ పాలనమును నిలబెట్టుచున్నారు. రిపబ్లికునుబొంది, ప్రజాస్వామిక రాజ్యము ననుభవించుచున్న జర్మనీ దేశమునందే నిరంకుశపాలనమును స్థాపించ నుత్సుకులౌ ""నాజీ" పార్టీవారు క్రమక్రమాభివృద్ధినొంది శ్రీహిట్లరుగారు సంపూర్ణాధికారమును బొందిరి. అన్ని దేశములందును, నాయకులు, రాచకీయజ్ఞులు, కర్మాగారాధిపతులు కొందరు, ప్రజా స్వామిక పాలనము జయప్రదము కాజాలదనియు, నిరంకుశ పాలనమే, ఆధునిక కాలమందు ప్రజలకు శరణ్యమనియు వాదించ ప్రారంభించుచున్నారు. ప్రజాస్వామికము బొందిన దేశములు తిరిగి నిరంకుశపాలనమునకు లోబడుటయే, ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదము కాజాలదని నిరూపించు చున్నదనియు అట్టిదేశములందు నిరంకుశపాలన మేర్పడుట వలన శాంతిస్థాపనయై, ఆర్థికాభివృద్ధికలిగి సాంఘిక సౌష్టత యేర్పడుచున్నదనియు, వారు వాదించుచున్నారు.

కాని అచ్చటచ్చట నపజయ మందినంతమాత్రమున ప్రజాస్వామిక రాజ్యమును నిరాకరింపదగునా? ప్రజాస్వామికమగు దేశములందుకంటె తదితరప్రభుత్వ విధానముల బొందిన దేశములందు హెచ్చు శాంతి, భద్రత, అభివృద్ధి, ప్రజాక్షేమము కల్గుచున్నదని చెప్పగలమా? అచ్చటచ్చట, అప్పుడప్పుడు, అదృష్టవశాత్తు, అప్రతిమాన ప్రతిభావంతుడగు నిరంకుశాధికారి పెత్తనమున కొంతలాభము కల్గిన కలుగవచ్చును. కాని అట్టి అసమానప్రజ్ఞావంతులు, ఎల్లప్పుడు రాజ్యాధికారము వహింప లభ్యపడుదురని ఏరు చెప్పగలరు? ఇటలీదేశమును క్రిందటి పదివత్సరములనుండి నిరంకుశముగా పాలించుచున్న శ్రీముస్సోలినీగారు తనపిమ్మట నెవరా? యని సంశయాకులితచిత్తుడై మ్రగ్గుచున్నాడు! నాల్గువత్సరములపాటు నిరంకుశముగా, స్పెయినుదేశమును పాలించిన ఈ పేజి వ్రాయబడియున్నది.pdf/15 కార్యక్రమమును సమగ్రముగా విచారించుచుయున్న యెడల సకాలమున ప్రభుత్వకార్యక్రమమును అమలునందు బెట్టుట దుస్తరమని వివిధరాచకీయకక్షల సమ్మేళనము నేర్పరచి (Coalition Government) దానితరపున, మంత్రాంగవర్గమును, పార్లమెంటునాయకులు సాగించి, దేశసేవ చేసిరి. దాదాపు ఆరువత్సరములకాలము శ్రీలాయడుజార్జిగారు, నిరంకుశుడై, పాలనమొనర్చెను. కాని, జర్మనుచక్రవర్తియు, శ్రీముస్సోలినీగారును ప్రజలకు బాధ్యులుకారు గాని, శ్రీలాయడుజార్జిగారు పార్లమెంటునకు, ఆపార్లమెంటు ప్రజలకు బాధ్యులై యుండకతప్పినదికాదు. అటులనే, ఆర్థికసంక్షోభము కలుగనున్నదను భయోత్పాతము 1931 వ సంవత్సరమున కలుగగా, శ్రీరామ్సేమాక్డనాల్డుగారి నాయకత్వముక్రింద, వివిధరాజకీయ పక్షములనాయకులు, "జాతీయప్రభుత్వము" నేర్పరచిరి. ఈజాతీయప్రభుత్వమునే ప్రజలు, క్రొత్తయెన్నికలయందు బలపరచిరి. ఇప్పటిపార్లమెంటు జరుగునంతకాలము (5 వత్సరములు) జాతీయప్రభుత్వము వారు తమకుదేశోపకారముగా దోచిన పద్ధతిని, రాజ్యముచేయుట కర్హులై యున్నారు. ఈవిధముగనే ఆర్థికమోక్షము కల్గించుటకై, ఫ్రాన్సుదేశమందు శ్రీపాయింకేరేగారు "జాతీయప్రభుత్వమును" 1922 లో మూడువత్సరముల పర్యంతమునడపిరి. కాన ప్రజాస్వామిక రాజ్యాంగములందును, తాత్కాలికావసరము లననుసరించి, నిరంకుశపుపెత్తన మగత్యమగుచో, నద్దానిని ప్రజలకు బాధ్యతబొందురీతిగనే స్థాపించుటకు సాధ్యముకాగలదు. "శ్రీముస్సోలినీగారిపిమ్మట, ఎవ్వరు?" అను ప్రశ్నకు ఇటలీదేశస్థులు సమాధానమీయజాలకున్నారు. కాని ఇంగ్లీషువారికి, శ్రీరామ్సేమాక్డనాల్డుగారి పిమ్మట, ఎవ్వరు?" అనుప్రశ్నకు సమాధానము కడుసులభముగా దొరకును. ప్రతియింగ్లీషు పౌరుడును "తిరిగి పార్టీ ప్రభుత్వము నేర్పరతు" మని చెప్పగలడు.

ప్రజాస్వామిక మపజయమందిన దృష్టాంతముల విమర్శించుచో, ఆయాదేశములందలి ప్రజలు తమమధ్య ఏక చ్ఛత్రాధిపత్యముకాని, అల్పసంఖ్యాకుల వశంగతమగు పెత్తనముగాని, అసహనపరులగు యేయొక్కమతస్థులో, లేక సంఘీయులో ప్రభుత్వాధి కారమును వశపరచుకొనుటగాని కారణములని తేలుచున్నది. ఇటలీయందు భూస్వాములు, ధనాధికులు ఫాసిస్టుపార్టీని బలపరచి, శ్రీ ముస్సోలినీగారి పెత్తనము దెచ్చి పెట్టుచుండ, ప్రజలు చేతులు మోడ్చు కొని యూరకుండిరి. ఇప్పుడు జర్మనీయం దీవిధముగనే "నాజీ" పార్టీ వారు ప్రజాస్వామికమును వినాశన మొనర్పబ్రయత్నించు చుండ, ప్రజ లుదాసీనులైయున్నారు. దక్షిణమెరికాఖండ మందలి రిపబ్లికులందు, తమప్రజాస్వామిక సంస్థల నిరాకరించి, ప్రజానాయకులు నిరంకుశులగుచుండ ప్రజలు ముగ్ధులైయుం డిరి పోలండు, యూగోస్లావియా దేశములందును, బల్గేరియా యందును, ప్రజాస్వామికమును రక్షించుటకై ప్రజలు తగు ప్రయత్నము చేయకున్నారు.

ప్రజాస్వామిక రాజ్యాంగము కల్పధేనువు కాదు. చక్రాయుధమునుకాదు. రౌతుకొద్ది గుఱ్ఱమనునట్లు అయ్యదియు ప్రజల ప్రతిభావిశేషముల ననుసరించియే, సుఫలితములగాని, దుష్పలితములగాని ప్రసాదించును. బాలకుని హస్తమందలి ఆయుధమువలె, నిరర్ధకులగుప్రజలమధ్య ప్రజాస్వామిక రాజ్యాంగము స్వవినాశనకరము కావచ్చును. మహావీరుని యొరయందలి నిశితకరవాలముభంగి నయ్యది, విజ్ఞానులును సమర్థులును సంఘసేవానిరతులునగు, స్వార్ధత్యాగపరుల వశమందున్న, కామధేనువువలె కోరినకోర్కెలనెల్ల నీడేర్చును. ఏకచ్ఛత్రాధిపత్యమువలన యేదోషములు జాతికి ఆపాదితమగునో, వానినే యనుభవించుటకు బ్రజలు ప్రయత్నించుచో ప్రజాస్వామికము వమ్ముకాకమానునా? అల్పసంఖ్యాకుల యసహన, యసాంఘికపాలనమునే ప్రజలు ప్రేమించుచో, ప్రజాస్వామికము ఖిన్నత నొందదా? పాలనుపిండుటకు మారు రక్తమును పిండుటకే పట్టుదలవహించు ప్రజలకు ప్రజాస్వామికమను కామధేనువు జీవనాధారమగు అమృతవృష్టిని ప్రసాదించకలదా? తదితరరాజ్యాంగవిధానములవలెగాక, ప్రజాస్వామిక రాజ్యాంగము కాలమహిమవలనకాని, తన్నుపయోగించుకొను ప్రజలకష్టనిష్ఠూరములవలన కాని, తనయందు కల్గుచుండు అవగుణముల, ననారోగ్యమును రూపుమాపుకొను శక్తిసామర్థ్యముల బొందియున్నది. మనుజుడెట్లు, తనకు సంభవించు సాధారణమైనజబ్బుల మందుమాకులు సేవించుటద్వారా పోగొట్టుకొని తిరిగి ఆరోగ్యము బొందగలడో, అటులనే, ప్రజాస్వామిక రాజ్యాంగముకూడ, స్వరక్షణశక్తిని బొందియున్నది. తనకుతానై తెచ్చుకొన్నగాని, దురదృష్టవశాత్తుకల్గినగాని జబ్బులు మితిమించి తనపైకొచ్చినచో, మనుజుడెట్టు స్వరక్షణశక్తిన్రుక్కి అసహాయుడగునో, అటులనే ప్రజాస్వామికముకూడ, అసాధారణపరిస్థితులందు తన అంగములగు, తనయధికారులగు ప్రజల కర్మ పరిపాకమువలన తెన్నుదిగమ్రింగువ్యాధులకు లోనగుచో రూపు మార్పు జెందక తప్పదు. సాధారణపరిస్థితులందు మాత్రము స్వపోషణ, స్వరక్షణాశక్తి దానికికలవని, అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా యుదంతములు తెల్పుచున్నవి. దేశాంతర్గత యుద్ధమునందు (1864-1868) అమెరికా ప్రజాస్వామిక రాజ్యాంగము చెక్కు చెదరకుండా జయమందినది. వివిధసభ్య రాష్ట్రములందు, ప్రజాప్రతినిధి సంస్థలు అపనిందపాలైనను, తగురీతి ఋజుమార్గమున సంస్కరింపబడుచున్నవి. అటులనే ఇంగ్లండునందును, అల్పసంఖ్యాకులకే చెందియున్న పార్ల మెంటు ప్రజలెల్లరవశంగతమైనది. "మైనారిటీ" పక్షీయులగు లేబరుపార్టీవారు రెండుమారులు మంత్రివర్గముల నేర్పరుప గల్గిరి. ఆస్ట్రేలియాయందు, శాసనధిక్కారమునందు నమ్మిక గల్గిన లేబరుపార్టీ వారు, శాసనబద్ధముగా నాల్గుమారులు మంత్రివర్గము నేర్పరచి రాజ్యాంగమునకు సేవచేసిరి. తన్ను తాసంస్కరించుకొన్నకొలది, తనప్రజలకు క్రమముగా హెచ్చుచున్నయధికారము, పట్టుదల తనపైకల్గించుకొన్నకొలది, ప్రజాస్వామికము బలిష్టమగుచుండును. కాని ఏకచ్ఛత్రాధిపత్యము, అల్పసంఖ్యుల రాజ్యాధికారము బలహీనమగును. ప్రజాస్వామ్యపు రాజ్యాంగమునకు ప్రజలు బంధువులు. తదితర రాజ్యాంగవిధానములకు ప్రజలజూచిన భయోత్పాతముకల్గును. ఏశక్తి (Ability to amend itself) తన్ను రక్షించుకొనుటకై, తన్ను వృద్ధిపరచుకొనుటకై యుపయోగపడగలదో అయ్యదియే ప్రజాస్వామికమునకు స్వవినాశనకరము గాగూడ పరిణమించుటయు దుస్సాధ్యముకాజాలదు. కనుకనే ప్రజాస్వామిక రాజ్యాంగముయొక్క వృద్ధినాశనములు, దానికి ప్రాణసమానమగు ప్రజల చిత్తవృత్తులపై, నీతినియమములపై సంపూర్ణముగా నాధారపడియున్నవి. ప్రజలే తమప్రజాస్వామిక రాజ్యాంగముద్వారా, అమృతపృష్టినైనబొంది సకల సౌభాగ్యములబొందనగును. వారే, అద్దానివలననె స్వవినాశనకరమగు, జీవనవిధ్వంసకమగు, అరాచక, అమానుషపాలన మును బొందవచ్చును. కనుక ప్రజాస్వామిక రాజ్యాంగము అన్నియెడల, ఎల్లకాలములందు వివిధనాగరికతాసోపానము లందలరారుచుండుప్రజల కొకేవిధమగు సుఖసౌఖ్యముల ప్రసాదింపజాలదు. ప్రజలబట్టియు, వారి వంశక్రమానుగతముగా అనుభవ ప్రాప్తమగు బుద్ధిఫొకడల నడతల బట్టియు వారివారి దేశముల సాంఘికార్ధిక పరిస్థితులననుసరించియు తన శక్తిసామర్థ్యముల ప్రజాస్వామిక రాజ్యాంగము జూపెట్టకల్గును. అయ్యది ఆదిశక్తివంటిది. రక్తపిసాసులగు అడవిజాతుల వారికి భీకరాకృతమై, రక్తమునుపీల్చి జీవించు మహాకాళివలె ప్రత్యక్షమగును. కాని, అహింసాపరులై మానవకళ్యాణము గోరు శాంత హృదయులైన పుణ్యాత్ములకు ప్రేమావతారమగు, లోకకళ్యాణప్రదమగు, శాంతిదాయకమగు, లోకమాతవలె, శక్తిమూర్తియై ప్రత్యక్షమగును. ప్రజలందరిని స్వవృద్ధికాక్షించువారిగను, మానవాభ్యుదయతత్పరులగనుజేసి మానవులందంతర్గర్భితమగు ఈశ్వరుని ప్రీత్యర్థమై కళాప్రపూర్ణులుగా, తేజోమయులుగా జేయుటకై ప్రజాస్వామిక రాజ్యాంగము తదితర రాజ్యాంగ విధానములకంటె యుపయోగపడుననియే రాచకీయజ్ఞులయొక్కయు, తత్వవేత్తలయొక్కయు విశ్వాసమైయున్నది. ఈనమ్మిక ప్రపంచమందలి ప్రజాసామాన్యము నావహించుటవలననే ప్రజాస్వామ్యపు రాజ్యాంగము లెల్లడ నంగీకరించబడుచుండెను. కాని, ఈరాజ్యాంగము ప్రజలయీప్సితార్ధముల నీడేర్పవల యునన్నచో భగవంతునిసేవకై భక్తులుశుచి నెట్లు బొందవలయునో అటులనే ప్రజలును తగుశిక్షణమును, జాగ్రత్తను, స్వరక్షణసూత్రజ్ఞానమును ఎల్లప్పుడును పొందవలసి యున్నది. అప్పుడే ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదమగును. అప్పుడే దానివలన ప్రజలందరకు సౌభాగ్యసంసిద్ధియగును. ప్రజలు రాజమాన్యులగుటయేకాక, రాజాంశ సంభూతులగుటయేకాక రాజత్వమును సంపూర్ణముగా బొందగలరు.

దాస్యము
కూడదు

ప్రజలు తమ రాజ్యమును సంతృప్తికరముగా తమక్రమాభివృద్ధికొరకై నడపుకొనుశక్తి బొందవలయునన్న ప్రథమమున వారిలో నెవ్వరును మనుష్యమాత్రులకగత్యమగు స్వతంత్ర బాసి, బానిసలై యుండరాదు. (2) వారందరు భానిసత్వమునకు దూరులై స్వతంత్రులైయున్నను, సాంఘికదాస్యమునకు, మతదాస్యమునకు, ఆర్ధికదాస్యమునకు లోబడకుండ నుండవలయును. మనపంచములు, అమెరికావారి నీగ్రోలు, దక్షిణాఫ్రికావారినీగ్రోలు, భారతీయులు, తమ యిప్పటి దుస్థితి యందు మ్రగ్గుచుండుట తప్పు. (3) సాంఘీకార్ధికమతస్వాతంత్ర్యము సాధారణవిషయములయందు సంప్రాప్తించినను, ప్రజలెల్లరు తమయనుదిన జీవనాధారమునకు వలయు ధనసంపాదశక్తిని బొందియుండు టగత్యము. "రేపటికెట్లోగదా జీవించుట" యను విచారమునకు ప్రజలు లోనగునంతవరకు, "యజమాని కోపించిన నిరుద్యోగప్రాప్తి యగునేమో" యని భయోత్పాదులగునంతవరకు, "మన యిష్టమువచ్చినటుల రాజ్యాంగవ్యవహారముల చర్చించిన రాచకీయ పెత్తనము కోరినచో, దారిద్ర్యప్రాప్తి యగునేమో" యను సంశయము సంభవించునంతవరకు సాధారణార్ధిక స్వాతంత్ర్యము ప్రజలకు సంప్రాప్తించదు. కనుకనే ఇంగ్లండు, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడాదేశములందు ప్రతి కార్మికునకు యుద్యోగప్రాప్తి కల్గించి, నిరుద్యోగులైనవారికి పోషణకల్గించి, వృద్ధులైనను, అవిటివారైన అనాధలగుప్రజలకు జీవనోపాధి యేర్పాటుచేసి, అనారోగ్యులకు మందుమాకుల నుచితముగా నొసంగి, చూలాలులగు స్త్రీలకు భత్యమిచ్చి, స్వరక్షణార్ధమై కార్మికులకు తమ తమ సంఘముల స్థాపించుకొను యర్హతకల్గించి, ప్రభుత్వమునకు సంబంధించినంతవరకు కార్మికులను వారియజమానులతో సమానులుగా పరిగణించి ఆదేశముల ప్రభుత్వములు సాధారణప్రజలందరకు ఆర్ధికదాస్యముబాపి, ఆర్ధికస్వాతంత్ర్యము కల్గించుచున్నవి. ప్రజలయందు ప్రచారితమైయున్న ప్రస్తుతపు భాగ్యవిభజనపద్ధతిని సక్రమమగు, శాంతియుతమగు, శాసనబద్ధమగు రాచకీయాందోళనద్వారా తగురీతి మార్పుజేసి, ప్రజలందరిమధ్య దేశసౌభాగ్యము దాదాపుగా సమానముగా పంచిపెట్టబడుటకు రాజ్యాంగవిధానము అవకాశముల నొసంగు టగత్యము. కాని ప్రపంచమునం దీయుగమున ప్రచారితమైయున్న భాగ్యవిభజనపద్ధతి ప్రజాసామాన్యమునకు అసంతృప్తికరముగా నుండుటచే ఆపద్దతిని విప్లవము ద్వారానే రూపుమాపుటకు, రషియా దేశపు బోల్షి విక్కుల ననుకరింపగోరు సమిష్టివాదు లుత్సాహపడుచుండుటచే అనేకదేశములందు ప్రజాస్వామిక రాజ్యాంగమున కాపద తటస్థించుచున్నది. ఈసమిష్టివాదుల ప్రాపకమును, వారిచే ప్రచారితమగుచున్న విప్లవమును ఆపుటకై జాతీయవాదులు ఫాసిస్టులను పేరున ఇటలీయందును, నాజీలను పేర జర్మనీ యందును నిరంకుశరాజ్యపాలన మేర్పరుప పట్టుదల కలిగి యున్నారు.

మతసామ
రస్యము

4. ప్రజలయందు మతసంబంధమగు ప్రబలతరమైన వివాదములున్నను, ప్రజాస్వామికము భంగమొందవచ్చును. రోమను కేథలిక్కులు ప్రోబస్టెంటు మతస్థుల జూచిగాని, మహమ్మదీయులు హిందువుల జూచిగాని సహనముబొందకున్నచో, చీటికిమాటికి వివాదములు తటస్థించును. ఈమతసంబంధమగు అసహనత తీవ్రరూపముదాల్చుచో, విప్లవములు కల్గుటదుస్తరము కాదు. ఐరిషుఫ్రీస్టేటునందు, రోమను కాథలిక్కులు ప్రోటస్టెంటు మతస్థుల ననేకరీతుల విసిగించుచుండుట రాజకీయశాంతికి సానుకూల్యము కాజాలదు. మన దేశమం దిప్పటివలెనే, హిందూ-మహమ్మదీయులు, పరస్పరముగా ద్వేషించుకొనుచున్నంత 15

కాలము, ప్రజాస్వామికమేర్పడినను, చిరస్థాయియై యుండునని చెప్పతరము కాదు. బాల్కనురాష్ట్రమునందిప్పటికిని రాజకీయాందోళన భయంకరరూపముదాల్చుచుండుటకు ముఖ్య కారణములలో నొక్కటి యీమతకలహములే! నూతనభావోదయయుగమునుండి యిప్పటివరకు, ప్రజాస్వామిక రాజ్యాంగము పొందగల్గిన ప్రతిప్రధానదేశమందును, సర్వమతసామరస్యమును ఏర్పరచుటకు రాజకీయజ్ఞులు ప్రయత్నించి, జయప్రదులగుచున్నారు.

సమానమగు
హక్కు
బాధ్యతలు

5. మతసామరస్యమువలెనే, సంఘసామరస్యము నెలకొనుటవసరము. దక్షిణ అమెరికాదేశమందు, నీగ్రోలను తెల్లవారు హింసించురీతియు, దక్షిణ ఆఫ్రికాఖండమందువలె ఆఫ్రికాయంతట తెల్లవారు నీగ్రోవారిని సంఘ బాహ్యులుగ పరిగణించుటయు, మనదేశమందు ప్రజలలో ఆరవవంతు వారి నంటరాని వారుగా జూచుటయు, రాజకీయశాంతికి, ప్రజాస్వామికముయొక్క భద్రతకు దోహదముకాజాలదు. ఫ్రెంచివారివలె వివిధజాతులపై ఆదరణకల్గియుండుట, భారతీయులవలె వివిధజాతుల నైతిక బాగ్యమును సురక్షితపరచుట, రాజకీయ శాంతికి లాభకరము. వివిధజాతులకుజెందిన, వివిధభాషలకుజెందిన, వివిధనైతిక సాంప్రదాయముల కలవాటుపడిన ప్రజలయందు కల్గుచున్న, అంతస్థులవారీ భేదముతగ్గించి, అందరు కొంతవఱ 16

కైన సమాననైతిక సాంఘికసాంప్రదాయముల బొందుటకు వలయు విద్యాప్రదానమొనర్చుట శాంతిరక్షణకు పయోగము. స్విట్జర్లండునందు, ఇటాలియను, జర్మను, ఫ్రెంచిజాతులకు జెంది, ఆయాభాషలనేకల్గి, ఆయాసాంప్రదాయములనే అనుభవించుచు ప్రజలున్నను, ఆదేశపు రాజ్యవిధానము ద్వారా వారెల్లరు, తప్పనిసరిగా కొంతసమానమగు విజ్ఞానమును, నైతికాచారములను, రాజకీయనైపుణ్యతనుబొంది, పరస్పరముగా సోదరభావమును పెంపొందించుకొనుచున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రములందిట్లే ఎన్నోజాతులకు జెందిన ప్రజలున్నను, వారికందరి కొకేవిధమగు సామాన్యరాజకీయ లక్షణముల కల్గించు విద్యావ్యాసంగము కల్గించక, ఎల్లప్పుడు అశాంతిప్రజలయందు ప్రబలుచున్నది. బాల్కను రాష్ట్రములందలి యీ విభేదములు ప్రజాస్వామికమునకు -----ములగునను భయము నానాజాతిసమితివారికి కట్టుబడి, ఆరాజ్యములకు ప్రజాస్వామిక స్వాతంత్ర్యము ప్రసాదించునప్పుడే అచ్చటి అల్పసంఖ్యాకులగు మతస్థులకు, జాతీయులకు, భాషల ముచ్చటించువారికి, తదితరులతోపాటు సమానరాజకీయ సాంఘికనైతికహక్కులు, సావకాశములు సంప్రాప్తమగుటకై "అల్పసంఖ్యాకుల రక్షణపు టొడంబడిక" లేర్పరచబడెను. 17

6. ప్రజాస్వామిక రాజ్యాంగము ప్రసిద్ధిబొంది ప్రజలందరి క్షేమమునకే యుపయోగపడ వలెనన్న, ప్రజలెల్లరు తమరాజ్యాధికారము యొక్క విలువను గ్రహించి తమ రాజ్యము

విద్య:-

జయప్రదముగా పరిణమించవలెనని కుతూహలపడుచుండవలెను. ఇందులకు తగుశిక్షణ నిచ్చుట రాజ్యాంగముయొక్క ఎధయై యున్నది. శ్రీప్లేటో గారు, పిమ్మట శ్రీఅరిస్టాటిలుగారు వాదించినట్లు అజ్ఞానులగువారు, అశ్రద్ధులగువారును, స్వతంత్రాలోచనము చేయజాలని వారును అందుల కవకాశము లేని వారును తమరాజ్యాధికారమును, దుర్వినియోగము జేయుట తధ్యమని ఈకాలపు ప్రజాస్వామిక రాజ్యాంగముల యుదంతములు చెప్పుచునే యున్నవి. ఈ రహస్యము నెల్లరీ కాలమున తగినంతగా గ్రహించకపోవుట విచారకరము. ప్రాధమికవిద్యను ఎల్లరకు ప్రసాదించినంత మాత్రమున చాలదనియు, యౌవనులకు ఉన్నత రాజకీయ విద్యకల్గించుట గత్యమనియు వోటరులైన వారికి ఎల్లప్పుడు రాజ్యాంగపు మంచి చెడ్డలగురించి సత్యస్వరూపము నారాధించు వారిపాలన బోధజేయించు టవసరమనియు, ఈనాటికిని ప్రజాసామాన్యము గ్రహించకుండుట ప్రజాస్వామికమునకు నష్టదాయకముగా నున్నది. జర్మను దేశమునందువలెనే ప్రతివిద్యార్థికి వారిదేశపు రాజ్యాంగ చట్టపు ప్రతినొసంగవలెను. అంతియేకాక నానా జాతి సమితియొక్క చట్టపు ప్రతికూడ ప్రతివిద్యార్థికి నొసం గవలెను. పాఠశాలలన్నిటియందును, రాజ్యాంగ సూత్రముల గురించి, పౌరుల హక్కు బాధ్యతలగూర్చి తగినంత బోధచేయవలెను. వోటుపొందు ప్రతివారికి పౌరసత్వపు హక్కు, బాధ్యతలగూర్చి బోధచేయవలెను.

స్థానిక స్వపరి
పాలనము

రాజకీయ సంస్థలద్వారా, ప్రజలచే స్వరక్షణాబివృద్ధికై యేర్పరుపబడు సంస్థలద్వారా ప్రజలకు రాచకీయానుభవము కల్గించుట ప్రజాస్వామిక రాజ్యాంగాభివృద్ధికారకమని ఇంకను అనేకులు గ్రహించుట లేదు. ఫ్రాన్సునందు స్త్రీలకు వోటుహక్కు --------డుటయేకాక స్థానికస్వపరిపాలనా సంస్థలను నిస్సారములై యుండుట విషాదకరము. అమెరికాయందు స్థానిక స్వపరిపాలనాసంస్థలు పార్టీనాయకులచే నిరుపయోగ మొదించుండుటయు, జర్మనీ, ఇటలీదేశములందలి యధికారశూన్యములై యుండుటయు నష్టదాయకము. ఇంగ్లండునం దీనివయమున చాలవరకు సంతృప్తికరముగా ప్రజలకు రాచకీయానుభవము సంపాద్యమగుట కవకాశములు కల్గింపబడుచున్నవి.

రాజకీయ
పార్టీలు

ఇన్ని యున్నను ప్రజలయందు ప్రబలియుండు రాచకీయ కక్షలు అపరిమితమైయున్న గాని, వానినాయకులు తాముపట్టిన కుందేలునకు మూడే కాళ్లను మొండివారలైన కాని ఒక్కరితో నొక్కరు వివిధపక్షీయులు సామరస్యత వహించి స్నేహభావముననే తమ తమ రాచకీయ ప్రణాళికల ప్రాపకమునకై వివాదపడుటకు సంసిద్ధులు కానిచో రాచకీయశాంతి లభ్యముకాదు. రాచకీయకక్షలు సత్యమార్గమున ప్రజాశ్రేయమునకై సాధ్యముకాదగు సంస్కరణలనిమిత్తమై ప్రజాస్వామిక రాజ్యాంగముయొక్క క్షేమము నపేక్షించుచు తమధర్మమును నిర్వర్తించుచుండవలెను. ఈ కక్షలయొక్క నాయకులు పరస్పరముగా తమయొక్క దేశప్రేమ ప్రజాసేవాభిలాష, స్వార్థరాహిత్యత శక్తిసామర్థ్యములగురించి సందేహపడు దుస్థితికి రాకూడదు. రాచకీయకక్షలు తమశక్తియుక్తుల నన్నిటి ప్రజలందరికి రాచకీయవిజ్ఞానము గల్గించుటకు, రాజకీయసమర్ధతను హెచ్చుచేయుటకు, యుక్తాయుక్తవిచక్షణముల పెంపొందించుటకు యుపయోగించవలయును. కాని అమెరికాయందలి పార్టీలవలన హెచ్చుగా ప్రజలు తప్పుదారులు ద్రొక్కుచుండుటయు, జర్మనీయందు ప్రజలు విప్లవకారులగుటకు కమ్యూనిస్టులు నాజీలు ప్రోత్సహించుచుండుటయు, ఇటలీయందు ఫాసిస్టులు నిరంకుశపాలనమును ప్రేమించుటయు, తదితరదేశములందు, ప్రజలను నైతికరహిత మార్గములందు దింపుచుండుటయు జరుగుచున్నది. రాచకీయకక్ష లిట్లు అక్రమవర్తనమందున్న ప్రజల సత్ప్రవర్తకులజేయనంతకాలము ప్రజాస్వామిక రాజ్యము యొక్క పునాదులు సన్నగిల్లుచుండును. ప్రజానాయకులు తమస్వలాభమును, స్వప్రతిభనే కాంక్షించి ప్రజలవర్తనము గూర్చి శ్రద్ధవహింపనిచో తాము అవనీతిపరులై,

ప్రజానా
యకులు.

మతమందు దేవునియం ద్రశద్ధ వహించి, నైతికప్రవర్తనమును దూరమొనర్చి అక్రమవర్తనులై, ఒకరినొకరు అసభ్యముగా విమర్శించుకొనువారైన ప్రజలు అక్రమవర్తనులగుదురు. విశ్వవిద్యాలయములు, మతప్రవక్తలు, సాంఘిక సేవకులు, ఆటపాటలయోధులు, వివిధసంస్థల కార్యనిర్వహకులు తమ సత్ప్రవర్తనముచేత, తమ ధర్మకార్యచింతనమువలన, ప్రజాక్షేమచింతనముద్వారా రాచకీయనాయకులపై తగు ప్రతిష్టబొంది ప్రజలను, రాచకీయనాయకులను సన్మార్గాను వర్తుల జేయుటగత్యము. రాజకీయనాయకులును సుశిక్షితులై, విజ్ఞానులై, శాంతులై, దాంతులై, తమవర్తనములచే ప్రజల సన్మార్గానువర్తనులజేయు కుతూహలు లైననే ప్రజాస్వామిక రాజ్యము జయప్రదము కాగలదు. అమెరికాయందు ప్రజలెల్లరకు రాజకీయనాయకులన్న అగౌరవము మెండైనది. "యధారాజా, తధాప్రజా" యనునట్లు ప్రజలయందు ఆత్మగౌరవము లోపించుచున్నదన్న ఆశ్చర్యమేమి? రోమనుప్రజాస్వామికము, ఏధన్సుప్రజాస్వామికము తుదకీనాటి ఇటలీప్రజాస్వామికము, దక్షిణఅమెరికా రాష్ట్రములందలి ప్రజాస్వామికములు అపజయమందుటకీ ప్రజానా యకులు అక్రమవర్తనులగుటయే ముఖ్యకారణము. కనుకనే మాహాత్ముడు తనజీవితముద్వారా, తన చర్యలవల్ల బోధించుచున్నట్లు నైతికపద్ధతులమూలముననే, నీతిపరుల నాయకత్వముక్రిందనే, ధర్మచింతగల ప్రజలమధ్యనే, విజ్ఞానులగు పౌరులద్వారా ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదము కాగలదు.

రాజ్యాధికారము ప్రజలకు ప్రసాదించినంతమాత్రమున వారు రాజ్యమును సక్రమముగా నడుపజాలరు. వారెల్లరు విద్యాబుద్ధుల బొందవలెను. స్థానిక స్వపరిపాలనా సంస్థలద్వారా, వివిధప్రజాస్థాపిత సంస్థలద్వారా వారుశ్రద్ధమై రాజాకీయానుభవమును సంపాదించవలెను. ప్రజాక్షేమాభిలాషులగు నాయకులను, ప్రజలశ్రేయమునే కోరు వార్తాపత్రికలను, ప్రజలకు నైతికాభివృద్ధి కల్గింపగల్గు రాచకీయ కక్షలనే వారు ఆదరించి స్వీకరంచిననే వారిరాజ్యాంశపు ప్రతిభ హెచ్చుకాగలదు. తమరాజ్యాధికారమును సక్రమముగా సకాలమున నుపయోగించుటకు ప్రజలు సంసిద్ధులై యుండవలెను. ఈకాలమందిట్లుగాక అనేకప్రజాస్వామిక రాజ్యాంగములందు రాజ్యాధికారపుటనుభవము, ప్రజలకు కల్గుసదుపాయములు లేవు. పార్టీనాయకులు స్వార్ధపరులగుటయేకాక సంకుచితభావులై యున్నారు. ప్రజానాయకులు నైతికప్రవర్తనకు పేరొందుట లేదు. వార్తాపత్రికలు స్వలాభముకై అసత్యప్రచారము జేయుటకు వెనుకంజవేయుట లేదు. తుదకు ప్రజలే ఎన్నికలన్నిటియందు శ్రద్ధవహించుట లేదు. ఆస్ట్రేలియాదేశమందు ఎన్నికలందు పాల్గొనని వోటరులకు శిక్ష విధించు టగత్యమగుచున్నది. అమెరికాయందు స్థానిక సంస్థలకై జరుగు యెన్నికలకు ప్రజాబాహుళ్యము వెల్లుటయే లేదు. ఇంగ్లండునందు స్థానికసంస్థల యెన్నికలలో సగముమందియైన, వోటర్లుతమవోటుల నిచ్చుట లేదు. ప్రజలిట్లు ఉదాసీనత వహించునంత కాలము రాజ్యాంగ శాంతికి భద్రము కాజాలదు.

వార్తాపత్రికలు, ప్రజాక్షేమమును మరువక, సత్య ప్రచారమునే తమధర్మముగా పరిగణించిననే, ప్రజలకురాచకీయ విజ్ఞానము కల్గుట సాధ్యము. ఎప్పటికప్పుడు రాజ్యాంగ వ్యవహారము లెట్టిస్థితియందున్నవో, ఎల్లరకు తెలియునట్లు వార్తాపత్రికలు ప్రకటించిననే ఎన్నికలయందు తగురీతి వోటరులు దుష్టుల శిక్షించి, శిష్టులరక్షించుటకు వీలగును. ఇప్పటి వార్తాపత్రికలు చాల అసంతృప్తికరముగనున్నవి. వానికసత్యమన్న ప్రీతియా యనిపించుచున్నది. విప్లవములు వార్తాపత్రికల దుష్ప్రచారమువలన సాధ్యమగుచుండుట అసత్యము కాదు.

తుదిమాట, రాజ్యాంగవిధానము, ప్రజాస్వామికము జయప్రదముగా, సులభముగా ప్రజలక్షేమాభివృద్ధి కారక ముగా నుండునట్లేర్పరచబడవలెను. దానియొక్కవివిధభాగములు, ప్రజలనీతిపరులుగాజేయుట కుపయోగపడవలెను. ప్రజాసామాన్యపు శక్తియుక్తులననుసరించియే మంత్రుల బ్రజాప్రతినిధుల బాధ్యతాయుతులై యుంచుటకు తగుయవకాశములను రాజ్యాంగవిధానము కల్పించవలెను. ప్రజల కెక్కుడుశ్రమ కల్పించకయే, వారి యధికారము తగు ఋజుమార్గములద్వారా ప్రవహింపజేసి రాజ్యాంగమునంతను సక్రమ పద్ధతుల ననుసరించి నడపుసావకాశముల నయ్యదిసృష్టించవలెను. స్థాపితమగు వివిధరాజ్యాంగసంస్థలు, అమెరికాయందువలె, పరస్పరస్వయం నిర్ణయముజెందక, ఇంగ్లాండునందువలె, పరస్పరసహకారపరంపరంబొంది, ప్రజాభ్యుదయమే తమపరమావధిగా పరిగణించవలెను. ఎన్నికలయందు ప్రజలుతమకు వలయు అభ్యర్థుల సులభముగా తేల్చుకొను యవకాశము కల్గించి, శాసనసభలయొక్క సమావేశములద్వారా, ప్రజలకు రాజ్యాంగపు నిజస్థితిగతులు తెలియు సావకాశముకలుగ జేసి, ప్రజాభిప్రాయము మంత్రులకు సరాసరిజేర్చుటకు సదుపాయములకల్గించి, ప్రజలయొక్క ఆధిపత్యత ప్రతిరాజ్యాంగ సంస్థపై తాండవమాడునట్లు జేయు రాజ్యాంగ విధాన మగత్యము.

చీటికిమాటికిగాక, అగత్యమైనప్పుడెల్ల ప్రజాభిప్రాయముననుసరించి, రాజ్యాంగవిధానమును మార్పుజేయుటకవ కాశము అవసరము. అవసరములననుసరించి శాసనములనిర్మించుశక్తి, ప్రజలకు సరాసరిగాగాని, తమప్రతినిధులద్వారాకాని కల్గించవలెను. ప్రజలయిష్టముననుసరించియే మంత్రాంగ వర్గమేర్పడుటకు, రాజ్యాంగవిధానము అవకాశముకల్గింపవలెను. "రాజ్యాంగవిధానముమాది, రాజ్యాంగపుసంస్థలుమావి, రాజ్యాధికారము మాకున్నది, రాజ్యముజేయుటకు మాకర్హత కలదు, రాజ్యమునుమేము నడుపుచున్నాము" అను అభిమానము ప్రజలకుకల్గిననే ప్రజాస్వామిక రాజ్యము జయప్రదమై, సుస్థిరమై శోభాయమానమగును. అట్టి సదుపాయములుకల్గు వరకు ప్రజాస్వామికము పూర్తిగా యేర్పడలేదనే చెప్పవలెను. ఇంకను ప్రపంచము ప్రజాస్వామికమునకు అర్హతపొందుచునేయున్నది. ఇప్పటికింకను యేదేశమందును, ప్రజాస్వామికము సంపూర్తిగా, సంతృప్తిగా యేర్పడుటకు సదుపాయములు కల్గుటలేదు. ఇట్లనుటవలన ప్రజాస్వామికము ఈకాలపు ప్రజలకు అతీతమై అందరానిదై యుండును కనుక, ఉపయోగరహితమనరాదు. మరి యేయితరప్రభుత్వ విధానమువలననైనను ఇప్పటికి సాధ్యమగు ప్రజాస్వామికముకంటె తక్కువలాభము, హెచ్చునష్టము కల్గునని ప్రపంచానుభవము ఋజువుచేయుచున్నది. మరి యేయితర రాజ్యాంగపద్ధతియు, ఈకాలపు ప్రజలకు ఆధునికపరిస్థితులందు ప్రజాస్వామిక రాజ్యాంగవిధానమువలె సంతృప్తిగల్గించజాలదు. కాని, పూర్ణముగా ప్రజలు ప్రజాస్వామిక రాజ్యాంగమువలన లాభమును పొందవలయునన్న, ఇప్పుడు అచ్చటచ్చట కల్గుచుండు దురవస్థల నుండి విడివడవలయునన్న, పైన పేర్కొనబడిన సావకాశములు కలుగ జేయవలసియున్నది. ఎట్టి పరిస్థితులందు ఈవిధానము సంపూర్ణసంతృప్తికల్గించునో వానిని సృజించుటకు తగు జాగ్రత్తపడక "అదుగో, అచ్చట ప్రజాస్వామికము విచ్ఛినమైనది. ఇదుగో, యిచ్చట నయ్యది అదృశ్యమైన" దన్న అజ్ఞాన సూచకముగాదా?




________________