ఆకాశవాణి మాసపత్రిక/సంపుటము 1/సెప్టెంబరు 1912/ద్రౌపదీదేవి చరిత్రము

ముఖచిత్రం

ద్రౌపదీదేవి చరిత్రము.

మనము నివసించుచున్న యీధరతఖండమున గల యజేక దేశములలో నొకటియై యజేక నదులు ప్రనిహించుటచేత సారసంతమై ఫలవంతమై వెలయు పాంచాల దేశము ప్రస్తుత కాలమునందున లెనే దేశభక్తుల చేతను ధర్మాత్ములచేతను సత్యనిరతుల చేతను భారతయుద్ధకాలమునను చాల ప్రసిద్ధిగాంచి యుండెను. ఆకాలమున కాంపిల్యనగరము రాజధానిగా దుపచుడను నొక మహారాజు ప్రజారంజకముగాను ప్రజానుమతము గాను పరిపాలన చేయుచుండెను. దుపదమహారాజు పరాక్రమవంతుడు, మరియాదగలవాడు. ఆకాలపురాజులలో గొప్పవారిలో నొకడై గణుతి కెక్కి యుండెను.

మహారాజైన తరువాత సంపనల కేమి కొదున? సౌఖ్యమునకేమి తక్కువ? ఆవిషయమున చెప్పనక్క రయేలేదు కాని యెంతవారికై నను నీశ్వరానుగ్రహము లేనియెడల సుఖముండదు. సంతోషముండను. ఎల్లభాగ్యములు కొల్లలుగాగల యాజునకు సంతానభాగ్యము లేదు. ఎన్ని పై భనములున్నను కన్నబిడ్డలు లేనినాడు శోభించదుకదా ! ద్రుపదుని రాణీ పేరు కోకిలా దేవి. ఆమె యతిబుద్ధిమంతురాలు. పతివ్రత. పతిపదచింతతోడకూడ నాయిల్లాలికి సంతాన చింతకూడ నధిక మయ్యెను. భార్యని చారము చూచినను సరిసాటివారి బిష్ణుకుమాదినను దుపదుని దిత్త ముకూడ ద్రుపదు దిక్త ముకూడ విచారమగ్న మగుచుండెను.

పిమ్మట రాజసంపతులు పురోహితుని బంధువుల కోరిక బల్లను పుత్ర కాంక్ష యనుమతిచల్లను పండితుల యాజ్ఞ నల్లను లేచుట ల్లను పుత్రకామేష్టి యను యాగము నోకదాని నతినిష్టతోను యధావిధిగాను చేసెను. తదనంతరమున నొక పుత్రుడును పుత్రికయు వారికి కలిగిరి. పుతునకు ధృష్టద్యుమ్నుడనియు పుతికకు కృష్ణయనియు దుపదుని కూతురగుటచే ద్రౌపదీయనియు యజ్ఞ ముసలన న్భువించుటచే యాజ్ఞ సేనియనియు పాంచాల రాజకుమారిక యగుటచేత పాంచాలియనియు కృష్ణకు పేరులు వచ్చెను. ఈపరిక్త్రమునకు నాయిక యాదౌపదియే యని చదువరు నామములుంచిది. తెఱింగియే యంందుకు. ధృష్టద్యుమ్నుడు పరాక మవంతుడై ధనుర్విద్య మొదలగు విద్యల వెల్ల వభ్యసించు చుండెను. ద్రౌపదీయు నన్నతో సమముగా సకలవిద్యలను గ్రహించుచుండెను. ఆ చిన్నది బహుబుద్ధిమంతురాలు, గుణవతి. సౌందర్యవతి. ఆమె తనరూపగుణ సంపదల చే తనను కన్న వారిని నానండపరుచుచుండెను. ఆమెను విన్న రాకుమారులెల్ల తమకు భాగ్య యైన బాగుండునని తలంచి యుఖ్వళ్ళూరుచుండిరి. క్రమముగా నామెకు నెల్ల విద్యల తోడను యౌవనము కూడ వచ్చెను. ఆమె రూపముద్విగుణమయ్యెను. వినయము నయము మొదలగు సుగుణపుంజమును హెచ్చెను. కోకిలయు ద్రుపదుడును కుమార్తె వివాహము నిమిత్త మై యాలోచింపసాగిఖీ. దుపదుడు శాతవంతుడు. రాజకులభూ పణుడు. యోధాగేపరుడు. కోకిలమ్మయు గుణవంతురాలు. గలది. అందుల్ల నిరువురును చాల నాలోచించి యుక్త మక్షత్రియ పుత్రుడై వీరాధి వీరుడైన రాకుమారునకిచ్చి వివాహము చేయవలయునని నిశ్చయించిరి. మంచియాలోచన

అంతకు పూర్వమే యొక నాడు పాండవులలో నొకడైన యర్జునుండు గురుని యానతి చొప్పున దుపదుని మీదికి దండెత్తి వచ్చి యాతని నోడించి పరాభవపరచెను. ఆసమయమున దుపదునకు నర్జునునిశక్తియు శాగ్యమును బాహుబలమును బుద్ధికుశలతయు తేట తెల్లములయ్యెను. ద్రుపదుడు పార్థుని సంక్రమమును చవిచూచిననాట నుండియు నాశ్చర్యమునొందుచు నకనియందు వైరము కలిగియుండుటకు మారుగా పేసుకలిగి యుండెను. అర్జునునిగుణము లనేక పర్యాయములు భార్యవర్ధను మిత్రులవద్దను పొగడుచు ముచ్చటపడుచుండెను. యోగ్యులగువారికి లక్షణమిదియేకదా! ధనంజయుని విజయవి శేషంబులు వినుచున్న కొలందిని కోకిలాంఒకును సరనికే తనకూతు నీయవలయునని కోరిక లుకముందుమఁ డెను. దౌపరియు నట్టి జగ పెట్టి తన్ను చేపట్టు భాగ్యము కలుగునాయని యున్వీశులూరుచుండెను. ధృష్టద్యుమ్నునకును నిదియే యిష్టముగా కానీ యని నెరవేరక వారిమనంబులకు వ్యాకులము కలిగెను.

ఇప్పుడు ఢిల్లీయని పిలువబడు హస్తి నాపురమును కురువంశ రాజు లాకాలమున పాలించుచుండిరి. ఆరాజ్యమున కధికారియగు ధృతరాష్ట్రమహారాజునకు పాండు రాజు విదురుడు ననుసోదరు లిరువురు కలరు. ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారీ దేవి. ఆమె మహాపతివ్రాత. ఆదంపతులకు దుర్యోధనాదులు నూరుగురు కుమారులును దుస్సలయను కూతురును గలిగెE. పాండురాజునకు కుంతి, మాది యను నిద్దరు భార్యలు. కుంతి


యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు నను మువ్వురు పుత్రులును మాద్రియందు నకు లుడు, సహదేవుడు నను కవల పిల్లలును పాండు రాజున కైదుగురు బిడ్డలుండిరి. పొండు రాజు మరణించెను. మాద్రి సహగమనము చేసెను. కుంతి బిడ్డలను పోషించుటకయి బ్రతికి యుండెను, పాండు రాజుఫుత్రుల నంచరిని పాండవులనియు దృశరాష్ట్రపుత్రులనుకౌరవులనియుం వాడుచుండురు. కౌరవులు బలము, పరాక్రమము, సాహసము మొదలగుగుణములు కలవారైనను నీతి, న్యాయము, ధర్మము, దయ, సత్యము, మొదలగు గుణలేని వారు. పాండ పులకు బలపరాక్ర మాదులకు తగినట్టు సత్య శౌచములు,నీతి న్యాయములు, దయాదర్మము, శాంత్యా దార్యయములు గలవు. లోకము మంచి వారిని "ప్రేమించుటయు చెడ్డవాని నసహ్యించుటయు సహజము కదా" ! ఎల్లరును పాండవులుసదర్ములని వారి మేలు కోరుచుందురు, ధనద్రవ్యముల కాపేక్షించువారును నుపకారములకోరువారును మాత్రము కౌరవుల మైత్రిని చేయుచుందురు. తనపుత్రులకన్న ధర్మరాజు బుద్ధిమంతుడనియు తగినవాడనియు యోచించి ధృతరాష్ట్రుడనిని యువరాజుగజేసి తండ్రి లేని లోటు లేకుండ పొండవుల నాదరించుచుండెను.

దుర్యోధనునకు ధర్మరాజు యువ రాజగుట యెంతమాము నిష్టము లేకుండెను. కౌరవులందరును నొకటేయాలోచన కలవారైరి. వారందరును క్రూరులే కావున పాండవుల నేయుపాయము చేకనైన వంచించి పరాభవించు యేకాక రహస్యముగ చంపించు టకుకూడ ప్రయత్నము చేయుచ్పుడిరి. అయినను పొందవులు పరాక్రమము చేతను బలము చేతను బుద్ధి చేతను నీతి వలనను కూడ కౌరవులకన్న నధికులు కనుక వారి మాయోపొయముల చే చిక్కక తప్పించుకొనుచుండిరి. దుర్యోధనుడు తండ్రితో "మొర పెట్టుకొని పొంచవులు హస్తీ నాపురమున నుండకుండ వారణావతమున కంపునట్లు చేసెను.కౌరవులున్న చోటనే పొండవులున్న యెడల వారి బుద్ధివి శేషములకును బలప రాక్రములకునువీరు చాలని వారగుటచే లోకులీ సంగతి నెరింగిన తమకు గౌరవము రాదని యూహించిదుర్యోధను డిట్లు చేసెను,


అంతటితోసుయోధనుని యీర్ష్యతగ్గ లేదు. పాండవుల మరణముకోరి యాత డెన్నియో యుపాయములను పన్ను చుండెను, పాండవులుండుటకు వింతయైన లక్క యింటి నొక దానిని కట్టించి వారితో కపట స్నేహమును చేయుచు వారందు కాపురము చేయుచుండగా నొ నాడు రాత్రి వేళ దానికి నిప్పు పెట్టించెను. ధర్మమును నమ్మియున్న పుట:Akasavani vol 1 sept 1912.pdf/38 పుట:Akasavani vol 1 sept 1912.pdf/39 పుట:Akasavani vol 1 sept 1912.pdf/40 పుట:Akasavani vol 1 sept 1912.pdf/41 పుట:Akasavani vol 1 sept 1912.pdf/42