రామరాజు

కృష్ణదేవరాయల మరణానంతర మాతనిసవతితల్లి కుమారుడగు నచ్యుతదేవరాయలు విద్యానగర సామ్రాజ్యధిపతియై క్రీ.శ. 1530-1542 వఱకు రాజ్యము పాలించెను. భోగలాలసుడగు నీనృపాలుని కాలమున విజాపురమునవాబు దండయాత్రయొనరించి ముదిగల్లు, రాయచూరు దుర్గముల దీసికొనెను. రాజ్యములోని భాగములుగూడ దోచెను. తనసుఖమున కేమిభంగము వాటిల్లునోయని అచ్యుతరాయలు నవాబుతో సంధి గావించుకొనెనేగాని సంగరమున కెన్నడును యత్నముగావించి యెఱుంగడు. అచ్యుతరాయల రాజ్యమున కాతనిబావమఱది సలకము తిమ్మయ ముఖ్యమంత్రిగ నుండెను. అచ్యుతరాయలమరణానంతర మతనికుమారుడగు వెంకటపతిరాయలు రాజై కొంతకాలము రాజ్యమును బాలించెను. సలకము తిమ్మయ్య మాయోపాయములచే వేంకటపతిరాయలను జంపించి తానె విద్యానగర సామ్రాజ్యమునకు బ్రభువయ్యెను. సేనాధిపతులు పౌరులు సలకము తిమ్మయ్యకు దిరుగబడి కృష్ణదేవరాయల యల్లుడగు రామరాజునకు వర్తమానమంపి సామ్రాజ్యోద్ధరణము గావింపుమని కోరిరి. పెనుగొండ నుండి రామరాజు సైన్యముతో విద్యానగరమునకువచ్చి యధికారుల గూడగట్టుకొని సలకము తిమ్మయ్యను బంధించి యచ్యుతరాయల యనుజుడగు సదాశివరాయలను రాజును జేయ గృషి యొనరించెను.

ఈఫరిస్థితులను సలకము తిమ్మయ గమనించి యుపేక్షించిన దనకే యపాయము ప్రాప్తించునని యాదిల్‌షాహను రహస్యముగరప్పించి విద్యానగరరాజ్యము నాతని యధీనముగావించెను. రామరాజాదులు చేయునదిలేక సలకము తిమ్మయ్య యొద్దకుబోయి మేము నీకు లోబడి యిచ్చవచ్చినచొప్పున జరించెదము. నవాబు నెటులేని పంపుమని కోరిరి. వారిమాటలు నమ్మి సలకము తిమ్మయ్య నవాబున కమితధనము కొన్నిమణులపరాధముక్రింద నొసంగి పంపివేసెను. రామరాజాదులు నవాబుపోయిన వెంటనే తిరుగబడి తిమ్మయ్యను జంపయత్నించుచుండిరి. ఇకబ్రదుకుట యసాధ్యమని తిమ్మయ్యభాండాగారము కొల్లగొట్టి గుఱ్ఱముల తోకలు చెవులు గోయించి రత్నములన్నియు దిరుగళ్ళలో విసరించి చేతనైనంతవఱకు సామ్రాజ్యసంపదల బాడుజేసి తానాత్మహత్య గావించుకొనెను.

రామరాజు సదాశివరాయలను విద్యానగర సంస్థానమునకు నామమాత్రమున నధీశ్వరుని గావించి తానె సామ్రాజ్యమును బాలించుచుండెను. రామరాజు నరపతి వంశజుడు. బసవేశ్వరునిచే జంపబడిన బిజ్జలు డీవంశమునకు గూటస్థుడు. తరువాత నీవంశజులు చిరకాల మార్వీటిలోనుంటచే నార్వీటి వారసబడిరి. రామరాజు పూర్వము కృష్ణరాయల హస్తగతమై


రామరాజు యున్న రాజ్యమునంతయు మరల వశపఱచికొని విద్యానగర సామ్రాజ్యమును మహోన్నతదశకు దెచ్చెను. అంతియగాక కృష్ణదేవరాయల జీవితములో నెరవేర్పబడని మహమ్మదీయ సంస్థానాధీశులను లోగొనుట రామరాజు నెరవేర్ప యత్నించెను. ఈసందర్భమున దురుష్క సంస్థానములగూర్చి కొంచెము చెప్పవలసియున్నది.

విజాపురరాజ్యము ఆదిల్‌షాహ స్వాధీనమునందుండెను. అహమ్మద్ నగరరాజ్యము బుర్‌హడ్‌నిజాంశాహ స్వాధీనమునను, గోలుకొండరాజ్యము జమ్‌షిద్ కుతుబ్‌శాహ స్వాధీనమునను, బీడర్‌రాజ్యము ఆలీబేరీదు స్వాధీనమునందును నుండెను. ఈనాలుగురాజ్యములు విద్యానగరమునకు నుత్తర దిశయం దుండెను. తక్కినమువ్వురు నవాబులు రామరాజునకు నిష్టులుగా నుండిరి. ఆదిల్‌షాహ చిరకాలమునుండి విద్యానగరసంస్థానమునకు ద్వేషిగాన రామరాజునకు నటులె శత్రుగణములలోని వాడయ్యెను. రామరాజు సహాయము జాతగాగొని తక్కినమూడురాజ్యముల నేలు నవాబులు ముగ్గురు ఆదిల్‌షాహమీదికి యుద్ధమున కేగిరి. రామరాజు తనసోదరుడగు వేంకటాద్రిని కృష్ణా, తుంగభద్రా నదుల మధ్యనున్న అంతర్వేదిని, అచ్యుతరాయలు కోల్పోయిన రాయచూరును సాధింపుమని పంచెను. ఇందఱిధాటి కాగజాలక ఆదిల్‌షాహ తనదుర్బలస్థితిని కాలపరిస్థితులను గమనించి రామరాయలతో సంధిగావించికొని విద్యానగర సంస్థానవినాశనమునకు మార్గము లన్వేషించుచు గాలము గడుపుచుండెను.

ఆకాలమున పోర్చుగీసువారు విస్తార సైనికబలముతో రేవుపట్టణముల నాశ్రయించికొని వ్యాపారము చేయుచుండిరి. రామరాజు వారును సంధిగావించుకొని తురుష్కసంస్థానముల కెట్టి సహాయము చేయకుండునటుల గట్టుదిట్టములు గావించుకొనిరి. రామరాజు సహజముగ దురుష్కద్వేషి కాడుకావున దురుష్క రాజ్యమున నుండజాలక వచ్చు తురకవారలకందఱకు నొకవీధి గట్టించి యిచ్చెను. వారికొక మసీదుగూడ గట్టించి తనరాజ్యమున వారలకుద్యోగము లొసంగెను. ఇబ్రహిం తన యన్నయగు జమ్‌షీదు కుతుబుషాహ తనను జంపునేమోయని రామరాజును శరణు గోరెను. ఒకగ్రామము నొసంగి యతని మిగుల బ్రేమతో రామరాజును చూచి క్రీ.శ. 1550 లో ఇబ్రహిం కుతుబ్‌శాహ నామముతో నాతనిని గోలకొండ రాజ్యాధిపతిగ నొనరించెను. నిజాముషా రామరాజునకు గానుకలుబంపెను. అదివిని ఆదిల్‌షాహకోపించి దురుసుమాటలాడి విద్యానగర సంబంధులగు రాయబారులను ఆదిల్‌షాహ పరాభవించి వెడలనడచెను. ఈసంగతి రామరాజు విని కోపించి నిజాముషాహను ఆదిల్‌శాహమీదికి బ్రోత్సహించి దండయాత్రకు బంపెను. ఆదిల్‌శాహ, నిజాముశాహదుర్గమునాక్రమించుకొనెను. క్రీ.శ. 1551 లో రామరాజు తన నాల్గవ కుమారుడగు చిన తమ్మరాజును వెంటగొని రాయచూరు ముదిగల్లు క్షేత్రములను సాదించెను. రామరాజుతో బగగొనిన బ్రదుకుట దుస్తరమని గ్రహించి ఆదిల్‌షాహ విధేయుడుగ నుందునని వాగ్దానము గావించెను. సైపు అయిస్ ఉల్‌ముల్కు అను సరదారు తిరుగబడి విజాపురమునవాబునోడించి రాజ్యమును హరించెను. రామరాజు కనికరించి తనతమ్ముడగు వేంకటాద్రిచేనాతనినిజంపించి పూర్వరాజ్యముయధావిధి ఆదిల్‌షాహకు దిరుగనిప్పించెను. ఇంకననేక పర్యాయములు రామరాజుసహాయముతో ఆదిల్‌షాహ తాను గోల్పోయిన తన రాజ్యమును మరల సంపాదించుకొన గలిగెను.

విజాపురము నవాబగు ఇబ్రహీం ఆదిల్‌షాహ క్రీ.శ. 1557 లో మరణించెను. అతని జ్వేష్ఠసుతుడు ఆలీఆదిల్‌షాహ విజాపుర రాజ్యమునకు నవాబయ్యెను. ఇటులుండ రామరాజు కుమారుడు మరణించెను. ఈ యవకాశము జూచికొని రామరాజు స్నేహమును సంపాదింపవచ్చునని ఆలీఆదిల్‌షాహ స్వల్పబలముతో విద్యానగరముజేరి రామరాజును బరామర్శించి చనిపోయిన కుమారునకు మాఱు నన్ను జూచుకొండని ప్రార్థించెను. రామరాజు ఆతనిభార్యయు నాబాలునిపుత్రవాత్సల్యముతో దిలకించుచుండిరి. రామరాజును నతనిభార్యను నతడు దండ్రివరుసతో దల్లివరుసతో బిలుచుచుండ వారిరువు రీతని కుమారుని బిలుచునటుల హృదయపూర్వకముగు ప్రేమతో బిలుచు చుండిరి. విద్యానగర సామ్రాజ్యమును రూపుమాపుటకు రామరాయలను దల్లికోట యుద్ధములో ఘోరమృత్యువు పాల్పఱచుటకు నీ ప్రేమాస్పదుడగు కుమారుడె కారణమయ్యెను. ఎన్నివిధముల హృదయమిచ్చి రామరాజు వానిభార్యప్రేమించినను సహజక్రూరభావము నాదంపతులయెడ ఆలీఆదిల్ షాహ విడనాడజాలక సమయము వచ్చినపు డీప్రేమను సాధనముగాగొని జయింప యోజించి తనరాజ్యమునకు వెడలిపోయెను.

తనపూర్వులవలన గైకొన్న కల్యాణి, షోలాపురము నగరములు తన కిచ్చివేయ వలసినదిగా ఆలిఆదిల్ షాహ నిజాంషాహకు వర్తమాన మంపెను. నిజాముశాహ దూతను బరాభవించి పంపెను. ఆలిఆదిల్ శాహ రామరాజును గలసి అహమ్మదునగరు మీదికి దండెత్తిపోయి యారాజ్యము నందలి పెక్కు గ్రామములు రూపుమాపిరి. ఆసమయమున హిందూ సైనికులు మసీదులు కూలద్రోసి ఖురాను గ్రంథములను జింపిపాఱవేసి తురుష్కస్త్రీలను బరాభవించిరి. రామరాజు సైన్యమొనరించిన దురంతములకు లోన గోపించియు ఆలిఆదిల్ షాహ బయటికి దగిన ప్రతిక్రియ గావించితిమని యానందించెను. నిజాముశాహ రామరాజుతో సంధిగావించుకొని కల్యాణనగరము కోల్పోయినందుల కెంతయు బరితపించుచు ఇబ్రహింకుతుబ్ షాహతో సంధి గావించుకొని కళ్యాణనగరము ముట్టడింప బిలుచు కొనివచ్చెను. విజాపురపు నవాబు, రామరాజు, వారల నెదిరింప నమితబల 108

సహాయముతో నేగిరి. ప్రతిఘటించిన దనకపాయ...
ఇబ్రహీం కుతుబ్ షాహా రామ రాజుతో గలిసె .....
నీమువ్వురు సేనతో బైబడ జేయునది లేక నిజాము....
రాజధానికి బోయి తల దాచికొనెను. మువ్వురు రా.....
షాహను వెంటనంటి అహమ్మదు నగరమును ముట్టడించ,
గోలు కొండనవాబు లోలోన నిజాం శాహకు సహాయ
పడెను. ఈ సహాయము వల్ల అహమ్మదు నగరము వర్ష...
వారికి వశముకాక పోవుటచే మరియొక మారు మ....
యెవరి త్రోవని వారు తమతమ రాజ్యముల కేగిరి......
ముగూడ రామరాజు సైనికులు రాజ్యము లోని.....
హింసించుచు దురుష్కాంగనల నవమానించుచు......
ల ద్రోయుచు నెన్నియో దురంతములు గావించి విజ
యోత్సాహమును బ్రకటింప సాగిరి. పరస్పర భి.....
లగు నవాబులందఱు హిందువులు గావించు విప్లవ....
విజయనగర సామ్రాజ్యము పై లోలోన బగను.....
వేశ పరవశులగు తురుష్కులు రామ రాజు పై ......
లదీర్చు కొందుమాయని లోలోన యోజించుచు ......
రాజీయంశమును నిర్లక్ష్యభావముతో గమనింప.....
చిక్కినపుడెల్ల తురుష్క రాజ్యములోని భాగము ....
తనరాజ్యమును నభివృద్ధి చేయు చుండెను. బల .....
వృద్ధి యగు కొలది రామ రాజు తురుష్కుల యెడ

తో వారిదూతల బరాభవించుచు దనయాజ్ఞలేనిది తనతో వచ్చు తురుష్కుడు ఆశ్వము నెక్కరాదని నిబంధన చేసెను. ఇది నవాబు లాలకించి "తమలో దాము భిన్నాభిప్రాయముగనుండుటచేతనే రామరాజిటుల మహమ్మదీయులను బరాభవించు చున్నాడు. రామరాజు రాజ్యమును హరింపకున్న తురుష్కరాజ్యము నశించుట నిశ్చయమని తమలో దాము కూడ బలికికొని యైకమత్యముతో వర్తించుచుండిరి. రామరాజు నెదిరించుటలో మహమ్మదీయులందఱు నేకాభిప్రాయులైరి. సంబంధములు గలసినగాని పూర్వవైరము లడుగంటి స్వాభిమాన మతిశయింపదని ఆదిల్ షాహకు నిజాముషాహ తన కూతురగు చాందుబీబీ నొసంగి వివాహము గావించెను. ఆదిల్ షాహ చెల్లెలిని నిజాముషా కుమారుడగు మూర్తిజా పెండ్లాడెను. గోలకొండనవాబు, బెదర్‌నవాబు, బరీదుషాహ వీరలతో గలిసిరి.

ఆదిల్ షాహ బయటికి మంచివానివలె నటించుచు దురుష్కులుచేయు దుండగములలో దా నేకీభవించుట లేదనియు నెటులో మిత్రభేధ మొనరించి వారలను మీకుబట్టి యొసంగుటకే వారితో గలిసియుంటినిగాని వేఱుకారణము కాదనియు రామరాజుకు వర్తమానమంపెను. పుత్రవాత్సల్యవిధియగు రామరాజావంచకుని వాక్యములను విశ్వసించెను. తరువాత నవాబులు నలువురేకమై ఆకస్మికముగా నొకదినమున విజాపురము చెంతగల మైదానమున సైన్యమునుంచిరి. యుద్ధకారణము గావలయునుగాన ఆలి ఆదిల్ షాహ రామరాజునకు దన పూర్వులనుండి గైకొన్న రాయచూరు, ముదిగల్లు దుర్గము లీయవలయునని వర్తమాన మంపెను. రామ రాజా వర్తమానము విని ఆదిల్ షాహ దుర్మార్గమునకు గృతఘ్నతకు మిగుల గినిసి యా రాయబారి నిట్టి సందేశములు తేకుండ బ్రదుకుమని శిక్షించి పంపెను. ఇదియ యాధారముగ గొని నవాబులందఱు విద్యానగర సామ్రాజ్యము ముట్టడించుటకు దృణకాష్ట జల సమృద్ధిగల ద్రోణనదీ తీరమున నివసించిరి. రామరాజు తురుష్కులంద ఱేకమై దనపైకి వచ్చుచున్నారని విని తోక త్రొక్కిన పామువలె నదరిపడి మహమ్మదీయ రాజ్యముల నిర్మూలనము గావింపక మాన నని ప్రతిజ్ఞావాక్యములు పలికి విరోధులు కృష్ణదాటి రాకుండ కొంతసైన్యమును నాటంకపరచుటకు బంపెను. రామరాజు తన రాజ్యమునందలి యన్నిభాగములనుండి సైన్యమును రప్పించెను.ఆఱులక్షల కాల్బలము లక్ష ఆశ్వికబలము సమకూర్చెను. తిరుమలరాయనికి లక్ష కాల్బలము, ఇరువదియైదువేల యాశ్వికదళము, ఐదువందల యేనుంగులు నొసంగి తురుష్కుల నెదిరింపబంపెను. అపరిమితసైన్యముతో నాతని వెనువెంట మరియొకసోదరు డగు వేంకటాద్రిని బంపెను. రామరాజు మిగిలిన సేనతో సమయమునాటికి రామరాజు తొంబదియాఱు సంవత్సరముల వృద్ధుడని చరిత్రకారులు కొందఱు వ్రాసియున్నారు. తురుష్కులు కృష్ణానదిదాటిపైకి రానిశ్చయించుచుండ బ్రవాహమును దాటి రాకుండ రామరాజుబల మాటంకము గలుగ జేసెను. వా రేరేవునకువచ్చిన నారేవున కాటంకము గలుగు చుండెను. ఇట్లున్నలాభములేదని తురుష్కులు తమసైన్యమును రెండుచీలికలు చేసి కృష్ణదాటునటుల నటించి యొకతీరమున జేరిరి. రామరాజు బలమంతయు నా తీరమున కెదురు నిల్చి యాటంకపఱచుచుండెను. ఇంతలో మిగిలిన తురుష్కసైన్యము క్షణములో కృష్ణానదిదాటి యీవల కేతెంచి వ్యూహముల బన్నిరి. రామరాజుసైనికులు తురుష్కులు కృష్ణదాటి యెటుల రాగలిగిరో యని యాశ్చర్యపడుచు వారి నెదిరింపబోవుసరికి మిగిలినసైన్యము కృష్ణదాటి రాగల్గెను.

తురుష్కులు తమసైన్యమునకు మధ్యభాగమునందు మూడువరుసలుగా నాఱువందల ఫిరంగులను బెట్టిరి. ముందు వరుసలో మిక్కిలి పెద్దఫిరంగుల జేర్చిరి. వానివెనుక తుపాకుల జేర్చిరి. ప్రతిపక్షుల కీ నిర్మాణము కానరాకుండునటుల రెండువేల కాల్బలమును ముందుంచిరి. కొంతసేపటికి హిందూమహమ్మదీయ సైన్యములు సంగరమునకు దలపడెను. తురుష్కసైనికులు ధారాళముగా శరవర్షమును రామరాజు సైన్యముపై గురిపించిరి. రామరాజు సైనికులకు బ్రోత్సాహవాక్యముల బలికి తురుష్క దళమును బంధింప నాజ్ఞాపించెను. హైందవసైన్యము శరవేగమున దురుష్కదళముపై బడెను. తురుష్కసైనికు లీసమయము గుర్తించి యీవలావలకునొత్తిగిలిరి. చాటుననున్న సరదారులు ఫిరంగులు తుపాకులు నొక్కమాఱుపేల్చిరి. ఆకస్మికముగా హిందూసైన్యము సంగరరంగమున మాడిపోయెను. ఈఘోరకృత్యము కనులార గాంచియు రామరాజు నిరుత్సాహపడక రెండువైపుల నిరపాయముగ నున్నసైన్యమును సంగరమునకు బురికొల్పెను. హైందవసైనికు లుత్సాహముతో ముందునకు నడువసాగిరి. హిందువులధాటి కాగజాలక తురుష్కులు వెనుకడగు వేయుచుండిరి. రామరాజు తనసైన్య విజృంభణమునకు మిగుల నానందించి వ్యూహమును బన్ని తురుష్క సైన్యమును జుట్టుముట్టిన విజయము క్షణములో సాధ్యమగునని నిశ్చయించి తానొక యున్నతమైన పీఠము వేయించుకొని వజ్రములు రత్నములు వరహాలు రాశిపోయించి జయప్రదముగా బోరాడిన సైనికులను సత్కరించుచు బ్రోత్సాహించుచుండెను. హిందువులు తురుష్కులఫిరంగుల బట్టుకొనుటకు మిక్కిలిసాహసముతో ముందునకేగిరి. అంతకుమున్నె యవి మందుచే నింపబడి యుండుటచే తురుష్కులాకస్మికముగా బేల్చిరి. అయిదువేలమంది మేటిశూరులు మరణించిరి. హైందవ సైన్యము నడిభాగమిటుల బలుమాఱు నశించుటజూచి రామరాజు తాను స్వయముగా సైన్యము నడిపిన ఫిరంగులు సులభముగా జేతికి జిక్కవచ్చునని సైన్యమధ్యభాగమునకు మేనాయెక్కి బయలు దేరెను. దురదృష్టవశమున రామరాజింతకు మున్నెక్కివచ్చిన యేనుగు బెదరి మేనామీద బడెను. వాహకులు భయవశమున నొడలెఱుగక మేనా విడిచి పారిపోయిరి. రామరాజు క్రిందబడియు దెప్పరిల్లి చెంతనేయున్న యున్నతాశ్వమునెక్కబోవ నిజాముషా సైనికులు రామరాజును బంధించి జయజయ ధ్వనులు గావించుచు నిజాముషాహయొద్దకు గొనిపోయిరి, వెంటనే నిజాముషాహ తన ఖడ్గమును బెరికి రామరాజు తల ఖండించి బల్లెము కొనకుగ్రుచ్చి హైందవసైన్యమునకు జూపించెను. తమరాజు మరణించుటకు హైందవసేన మిగుల జింతించి రణరంగమున దమకు విజయము దుస్తరమని పారిపోవుచుండ దురుష్కులు లక్షమంది ఆంధ్రసైనికులను అరటిచెట్టుల నఱికినటుల నఱికిరి. హిందూసైన్యము సర్వవిధముల నాశనమయ్యెను. చిరకాలమునుండి యభివృద్ధినొంది మహోన్నతదశకు వచ్చిన విద్యానగర సామ్రాజ్యము దైవవశమున నిటుల నాశ మొందెను. ఆంధ్రవీరులలో సుప్రసిద్ధుడును శూరవతంసుడునగు రామరాజు మరణముతో నాంధ్రుల సమగ్రసౌభాగ్యాతిశయము అదృశ్యమయ్యెను. రామరాజుతో నాంధ్రులస్వాతంత్ర్యేచ్చ యంతరించెను.

హైందూసైనికు లీవిధముగ బరాజయమునొంది తురుష్కులబారినుండి బ్రదుక దలచి విద్యానగరమునకు జేరి ధన 114

ధాన్యాదులు ఆలు బిడ్డలను గొని తమ తమ యిరవులకు.... వెడలిపోయిరి. రామరాజు సోదరుడగు వెంకటాద్రి సంగ్రామమున మరణించెను. తిరుమల దేవ రాయలు ప్రాణభయ చేత విద్యానగరము చేరి సదాశివ రాయలను ధనకనక వస్తు వాహన ములను వెంటగొని పెనుగొండకు బారి పోయెను. సర్వతీ ద్విభాసురమై సురక్షితముగా నున్న విద్యానగరమునందకు పౌరులందఱు దిక్కుమాలిన వారై యెటుబోవ దరిగానక గడగడ లాడుచుండిరి. చుట్టుపట్టుల నన్ని వైపుల మహమ్మదీయ సైన్యము నిండిపోయెను. ఈ యదను గ్రహించి చుట్టుప్రక్కల నున్న యాటవికులు పలుమాఱు విద్యానగరమున బ్రవేశించి ప్రజలను హింసించి వారి ధనములను యధేచ్ఛముగా దోచుకొనిరి. పురములో నున్న పౌరులీపాట్లు పడజాలక రాజ్యము విడచి యెందో పోయిరి. కొంతకాలమునకు దురుష్క సైన్యము మరల విద్యానగరమున బ్రవేశించి యెనరించిన దురంతములకు అంతములేదు. నిరపరాధులగు పౌరుల నెందరనో చంపిరి. అవ మానముల పాలుచేసిరి. రాజ మందిరములు, దేవాలయ అంగడి వీధులు, పగులగొట్టి కాల్చి, మాడ్చి, నేలమట్టము గావించిరి. కొంతకాలమునకు విధ్యానగరమను జరిత్రలో దేనినేని గాంచి గుర్తింప రాని విధమున వినాశమొనర్చిరి. .......ద్ర సైనికుడు విద్యానగర ధనమును ఒంటెలతో నెక్కించి మోయించుకొని తమ రాజ్యనకు గొంపోయి యందు భాగ్యవంతుడయ్యెను. ఆంధ్రరాజులచే బరిపాలింపబడి యాంధ్రకవితకు నాటపట్టై శాశ్వతస్థాయిగా నాంధ్రచరిత్రములకు నాదర్శప్రాయముగా నుండదగు విద్యానగర సామ్రాజ్యముతో బాటుగా నాంధ్రుల యదృష్టముగూడ నంతరించెను.

రామరాజు భట్టుమూర్తిని గౌరవించి పెక్కు కావ్యములంకితము నొందెను. రాయలవారు సాధింపజాలని తురుష్క రాజ్యములను సాధించెను. ఆంధ్రుల పరాక్రమమునకు బ్రాణభిక్షపెట్టి యాంధ్రులు పరాధీనత గాంచకమున్నె యంతరించెను. తురుష్కుల దండయాత్రలచే నాంధ్రసామ్రాజ్యములు రెండును నశించెను. మొదటిది కాకతీయ సామ్రాజ్యము, రెండవది విద్యానగర సామ్రాజ్యము. ఈ యుభయ రాజన్యులు ఆంధ్రజాతీయతా సంరక్షణార్థము జనించిరి. జాతీయత నుద్ధరించి కృతార్థులైరి. దేశీయుల దురదృష్టవశమున వారు గడించిన యౌన్నత్యము భాగ్యభోగ్యములు, ఐశ్వర్యజీవనము వారితోడనే కాలగర్భమ నం దదృశ్యమయ్యెను. వీరారాధనమను నాచారముగల యాంధ్రకుమారులు రామరాజు దివ్యనామము మఱునకుందురేని కృతార్థులు కాకపోరు.

రామరాజు మరణించిన దినము క్రీ.శ. 1565 సం. జనవరి 23 వ తేది మంగళవారమని చరిత్రగారులు నిర్ణయించినారు. ఆదినమె యాంధ్రవికాసమున కంత్యదినము. నాడె ప్రళయ కాలాంబుదము లావరించి విజయనగర సామ్రాజ్యమును రూపుమాపెను.

_______