ఆంధ్ర రచయితలు/పూండ్ల రామకృష్ణయ్య

పూండ్ల రామకృష్ణయ్య

1860 - 1904

ఆరువేలనియోగి బ్రాహ్మణుడు. జన్మస్థానము: దువ్వూరు (నెల్లూరు మండలము). జననము 14 జూలై 1860 సం|| నిధనము: 1 సెప్టెంబరు 1904 సం|| ప్రచురణలు: ఆముద్రితగ్రంథచింతామణి పత్రిక. మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారి జీవితసంగ్రహము. గ్రంథపీఠికలు - మున్నగునవి.

పూండ్ల రామకృష్ణయ్యగారివంటి తెలుగుపండితు లెందఱో కలరు. కాని వారివంటి విమర్శకులు తక్కువ. వీరిది మొగమోటమి లేని విమర్శనము. ఆంధ్రమున వీరిపాండితి నిరూడము. ఈయన బహుశ్రద్దతో వెలువరించిన 'అముద్రితగ్రంథ చింతామణి' పత్రికలలోని ప్రతిపత్రమును వేలకొలది విలువ కలది. ఈపత్రిక 1885 ఒడయారు బీరనాగయ్యగారి సహాయసంపాదకతతో శ్రీరామకృష్ణయ్యగా రారంభించిరి. 1888 లో వీరనాగయ్యగా రీయుద్యమమునుండి తప్పుకొనిరి. శ్రీ వేంకటగిరిమహారాజా శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు వారు దీనికి బోషకులు. ఇక లోటేమి? వీరనాగయ్యగారు విరమించుకోని--, రామకృష్ణయ్యగారు తమ నిర్యాణపర్యంతము 1904 వఱకు నముద్రితగ్రంథచింతామణి నపూర్వపద్ధతులతో వెలువరించిరి. శ్రీరామకృష్ణపండితుని విమర్శ------------నీచింతామణియే నికషో---వీరేశలింగము పంతులుగారి వివేకవర్ధనియు, శ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారి కలావతియు బ్రచురింపబడుచుండునాళ్ళవి. ఎన్నిపత్రిక-----------విషయమున నముద్రితగ్రంథచింతామణిదే యగ్ర----------------గ్రంథములు ప్రకటింపబడినవి.------------------------


(ఈఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) జతనము మీఱంగ నము

ద్రితసద్గ్రంథముల సేకరించి కడు బరి

ష్కృతములు గావించి యథా

మతి బత్త్రిక గూర్చెదము క్రమంబుగ వానిన్.


తోరపు నూలుదారములతో బదిలంబుగ గట్టి పెట్టియం

బేరుప నందు జీర్ణదశ జెంది మొగిం గ్రిమికీటకచ్ఛటా

పూరితమైవృథాసెడు సముద్రితపుస్తకపంక్తి నెంత యుం

గూరిమి మీఱ నచ్చునను గూర్చుట సెల్లదె పత్త్రికాకృతిన్.

ఆముద్రిత గ్రంథప్రకటనము, వ్యాకరణచ్ఛందోవిషయవిమర్శనము నీపత్రిక ప్రధానోద్దేశములు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, వేదము వేంకటరాయశాస్త్రి ప్రభృతులపాండిత్యశక్తి నీపత్రికయే చాటినది. రామకృష్ణయ్య గారి విమర్శకతి 'మయూఖము' లలో వెల్లివిరిసినది. శ్యమంతక, శబ్దవిచారము, పటుశబ్దప్రయోగము, పరిఖా పరిఘ శబ్దద్వయసాధుత్వము బిలేశ్వరీయకృతి విమర్శనము ఇత్యాదులు రామకృష్ణయ్యగారికి విమర్శ కాగ్రేసర బిరుదము నీయగల వ్యాసములు. వీరి విమర్శనము కేవలశాబ్దికమే కాదు. నాటకాదులలో గ్రామ్యభాషాప్రయోగము చేయవచ్చునా? ఇత్యాదివిషయములుకూడ వీరి నిశితవిమర్శకు విషయములైనవి. వేదము వేంకటరాయశాస్త్రిగారి 'నాగానందము' లోని పాత్రోచితభాషను వీరు చక్కగ సప్రమాణముగ సమర్థించిరి. నాడు వీరివ్రాత పండితులకు శాసనము.

అ.గ్ర. చింతామణిలో వెలువరించిన గ్రంథము లివి: 1 ప్రబంధరాజ వేంకటేశ్వరవిజయవిలాసము. (గణపవరపు వేంకటకవి) 2.హరిశ్చంద్రవలోపాఖ్యానము. (రామరాజభూషణుడు) 3. మిత్త విందా పరిణయము (కుందుర్తి వేంకటాచలకవి) 4. చంద్రాంగదచరిత్రము (పైడిమఱ్ఱి వేంకటపతి) 6. యాదవరాఘవపాండవీయము (నెల్లూరి వీర రాఘవకవి) వైజయంతీవిలాసము (సారంగు తమ్మయ) ఇవి ప్రాచీనములగు ప్రబంధములు. ఆధునికకృతులుకూడ నిందు బ్రచురితములు. ఓగిరాల రంగనాథకవిగారి 'ద్విరేఫదర్పణము' మండపాక పార్వతీశ్వరకవిగారి శ్రీకృష్ణభ్యుదయము మున్నగునవి.

సహజముగ నీయన చిన్ననత్తికలవాడని, కాని పద్యములు మధురకంఠమున జదువునపు డానందముగ నుండెడిదని చెప్పుకొనుట.

రామకృష్ణయ్యగా రొనరించిన భాషాసేవ చిరస్మరణీయము. ఈయన గతకాలములో స్మృతిదప్పి పడియున్నప్పుడు వేంకటగిరి ప్రభువు వీరికి కొంతధనము పంపి వారిచెవికడ 'వేంకటగిరిరాజు పంపె' నని గట్టిగా కేకవేయించి యిచ్చుటకాజ్ఞ పెట్టెనట. ఆమహారాజున కీయనపై నంతయభిమానము.


                               ________