ఆంధ్ర గుహాలయాలు/ముందు మాట

ముందు మాట

Foreword

కావలి జవహర్ భారతి కళాశాల అధ్యాపకులు శ్రీ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి గారు రచించిన "ఆంధ్ర గుహాలయాలు " అనెడి గ్రంధానికి ముందు మాట వ్రాస్తున్నందుకు నాకు చాల సంతోషంగావున్నది. శ్రీ రెడ్డి గారు రచించిన ఈ గ్రంథం ప్రాముఖ్యాన్ని సంతరించుకొని యున్నది. ఇది ఆంధ్ర లోని గుహాలయాల వాస్తు శిల్పాలను లోతుగా పరిశీలన చేసి రచించిన విశిష్ట గ్రంథము. అంతే గాక ఆంధ్ర గుహాలయాలపై వివరణాత్మకంగా విమర్శనాత్మకంగా రచింప బడిన తొలి గ్రంథము. ఇందు ఆంధ్ర గుహాలయాలు, వాటిలోని శిల్పాలను ఇతర ప్రాంతాల వాస్తు శిల్పాలతో పోల్చి సామ్యాలు, భేదాలు వివరింప బడి యున్నవి. ఈ శిల్పాలను ఇతర ప్రాంతాల వాస్తు శిల్పాలతో పోల్చి సామాన్యులు, భేదాలు వివరింప బడియున్నవి. ఈ శిల్పాలు ఏ శిల్ప శాస్త్రాల నియమాలకు అనుగుణంగా ఉన్నవో కూడ తెలుప బడి యున్నది. ఈ వివరాల వలన ఆయా ప్రాంతాల గుహాలయాల నిర్మాణ కాలాలు, నిర్మాతల గూర్చి కూడ వాస్తు శిల్పాల రీత్యా తెలుసుకొనుటకు వీలగు చున్నది. అంతే గాక ఇది భారత దేశ మందలి ముఖ్యంగా దక్షిణ భారత దేశ గుహాలయాలను కూడ క్లుప్తముగా ప్రస్తావించి దేశ మందలి గుహాలయాల వాస్తు శిల్పాల మనోదర్శనాన్ని కల్పించు చున్నది. ఇట్టి పరిశోధనా విధానాలు రచనలో అనుసరించపడి యున్నందున ఈ గ్రంథము ఒక ఉత్తమ మైనదిగా చెప్ప వచ్చును. పరిశోధకులకు, సామాన్యులకు కూడ చక్కగా అర్థ మయ్యే రీతిలో, సులభ శైలిలో రూపొందిన ఈ గ్రంథము వాస్తు శిల్ప శాస్త్ర ప్రాచుర్యానికి ఎంతో దోహదము చేయునని నా నమ్మకము. ఇందలి అనేకచిత్ర పటాలు గ్రంథము యొక్క శోభను, వివరాల గ్రహింపును కల్గించు చున్నది.

సూపరింటెండింగ్ అర్కియాలజిస్ట్
అర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
టెంపుల్ సర్వే ప్రాజెక్ట్
ఫోర్ట్ సెయింట్ జార్జ్, మద్రాసు. 6000069

కె.కృష్ణమూర్తి.