ఆంధ్ర గుహాలయాలు

భైరవకోన

ప్రాచీన కాలమునుండి హిందూ దేవాలయాల నిర్మాణానికి, పూజా ప్రతిమల రూపణకు వస్తువును ఎన్నుకొనుటలో ఒక ప్రత్యేకత అగుపడును. ఇది ప్రకృతి పరమైన ఆచారము మరియు కొని చిహ్నముల ఆధారముగా మన దేశమున జరుగు చుండెను. దీనిలో కొయ్య మొదట వాడబడినది. ఈ నాటికీ కొన్ని ప్రాంతాలలో దేవతా ప్రతిమల రూపణకు, సనాతనుల గృహోపకరణములకు, సన్యాసుల అవసరాలనేకములకు ఇది వాడబడుట మనము గమనించ వచ్చును. కొయ్య తరువాత ఈ నిర్మాణాలకు ఇటుక, సున్నము లేక మట్టి, కొయ్యతోబాటు వాడుట ప్రారంభమయ్యెను. కానీ వీటి వాడుక వచ్చినప్పటి నుండి ఈ నిర్మాణాలు అపుడపుడు బాగు చేయ వలసి వచ్చుటే గాక కొయ్య ప్రతిమలు పాతబడుటచే వాటి స్థానమున కొత్తవి స్థాపించ వలసి వచ్చెను. ఇట్టి సాంప్రదాయము ఈ నాటికి మనకు ఒరిస్సాలోని పూరి జగన్నాథ దేవాలయములో అగుపడును. ఇచటి దేవ గృహం అనగా గర్భ గృహము లోని కృష్ణ, బలభద్ర, సుభద్ర ప్రతిమలు శిల్ప శాస్త్ర ప్రకారము ప్రతి పన్నేండేళ్ళకు (Jupiter's siderial period with reference to the sun)మార్చ బడును (renewed ritually). తమిళ ప్రాంతమున కూడ కాంచీపురము దగ్గరలోని ఉత్తిరమేరూర్ లోని పల్లవుల సుందర వరద దేవాలయమందు కూడ కొయ్య ప్రతిమ వాడకము ఈ నాటికీ యున్నది. ( ఈ దేవాలయమందే క్రీ.శ. 914 లోనే ఓటు పద్దతిలో ఎన్నికలు జరిగెడి విధానమును తెలిపెడి ఒక శాసనము చోళ రాజైన ఒకటవ పరాంతకునికి చెందినది గలదు). శాస్త్ర సిద్ధాంతాల ప్రకారము కొయ్య లేక స్టక్కోతో చేయ బడిన దేవతా ప్రతిమ వున్న దేవాలయము కూడ ఇటుక, సున్నము లేక మట్టి లతోనే నిర్మింపబడవలెను. ఇట్టి దేవాలయాలు పునర్నిర్మాణము జరిగి శిలతో నిర్మింప బడినచో ఇందలి దేవతా ప్రతిమ కూడా శిలతో రూపొందింపబడు చుండెను. ఇట్టి ఉదాహరణలలో కాంచీ పుర మందలి వరద రాజ స్వామి దేవాలయము ముఖ్యమైనది. ఈ దేవాలయము మొదట ఇటుకతో నిర్మింప బడినది. కాని క్రీ.శ. 13 వ శతాబ్దమున శిలతో పునర్నిర్మింప బడినది. ఇందలి కొయ్య ప్రతిమ భద్ర పరచబడినది. ఈ కొయ్య ప్రతిమనే అత్తివరద అందురు. ఇది ప్రతి పన్నెండేళ్ళ కొక సారి ఒక ప్రత్యేక ఉత్సవ కాలమున బయల్పరచ బడును. స్టక్కో ప్రతిమలకు కూడ అపుడపుడు 'పునుగు చట్టం' అను సున్నము మొదలగు వాటితో రూపొందింపబడిన పదార్థముతో శాస్త్ర ప్రకారము పూత వేయబడును.

ఇటుక, సున్నము, మట్టి, కొయ్యతో రూపొందింపబడిన నిర్మాణములతో బాటు దేవాలయానికి శాశ్వితత్వమును, నిర్మాతకు గౌరవము గలిగించెడి పెద్ద ఏక శిలా ఖండములలో గుహల రూపమున గాని (Cut in or scooped). ఆలయ రూపమున గాని (cut-out or monolithic) ఆలయాలను రూపొందించుట ప్రారంభమయ్యెను. అనేక రాజ వంశాలు అనేక కాలలలో వీటిని రూపొందించినవి. ఇవి పల్లవులు, పాండ్యులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, యాదవులు, విజయనగర రాజులు, నాయక వంశ రాజులచే మహాబలిపురము, కళుగుమలై, బాదామి, ఎల్లోరా, పన్హలె - కాజి, ధమ్నేర్, దౌలతా బాద్ మొదలగు ప్రాంతాలలో దాదాపు క్రీ.శ. 16 శతాబ్దము వరకు నిర్మించుట సాగెను. వీరి ఏక శిలా ఆలయ నిర్మాణాలు పశ్చిమ దక్కన్ లో యుండిన బౌద్ధ నిర్మాణాల ప్రభావముతో రూపొందింపబడినవని తెలియు చున్నది. కానీ బౌద్ధ నిర్మాణాలు చాల వరకు వ్యాపార వాణిజ్య సంస్థల పోషణలో రూపొందింప బడగా హిందూ నిర్మాణాలు రాజులచే పోషింఫబడినవి. కాని శిల్పి బౌద్ధ, హైంద్వ, ఇస్లాం , క్రైస్తవ మతాలన్నిటికీ ఒకడే. In his invitations to Indian architecture K.V. Soundra Rajan says: Here are two facts of Indian art ... one for Universal humanism which was the guiding light of Gauthama, the Buddha ad universal divine imminence which causes and orders the phenomenal world, which is the substratum faith of Hinduism, and these together unfold a complementary but evocative psyche of the Indian mind in its relationship with the material world around and the paradise beyond, dwelt in by Gods in their empyrean. The organization of Buddhist art by influential tradesmen and that of Hindu art by royal dynasties of kings is a dichotomy of Indian art spectrum but was drawing from the same aesthetic ideals and the craft pool. The same crafts men in medieval times placed their genius add ingenuity at the hands of even Islamic rulers to enrich magnificent edifices to suit their own religious presentations. It only shows how the mind and hand of the artist cannot be held captive in the cage of time, ad would find self expression to suit any environment with a spiritual plant to enthuse them. they were less concerned with material possession, riches, pedigree and could subvert any political power by the persuasive eloquence of their art modulations and bring glory to the land, in the eventuality, and immorality for themselves. Long after the kings are gone, it is the artists and craftsmen who live for ever, to receive their mead of tribute from the entire world.

The study of Indian religious art is attractive because one is at ease at once with its many splendorous formulations; one finds its study a stint in liberal education of the arts, crafts and though of the land: and one is stimulated by its naturally exultant stature and stamina. Its majestic layout, with a little understanding. can yet be facile; its formal elaboration, with a modicum of analysis, can still be rational. It is indeed an exercise in exactitude, in symmertry, in organized elegance and disciplined exuberance. (K.V.Soundera rajan: Invitation to Indian Architecture, 1984, New Delhi, Anrold Heinemann Publishers. pp. 27,. 13)

గుహాలయాలు, స్థూపములు, విహారములు, దేవాలయాలు మొదలగు వాటి వాస్తు నిర్మాణ రీతి పరిణామాలు పురావస్తు శాస్త్రమున ఒక ముఖ్య అంశము. ప్రతిమ రూపమున దేవుని ఆరాధించుట, ఆ ప్రతిమను ఆలయ నిర్మాణము చేయుటలోని ప్రాచీనత గూర్చి మనకు స్పష్టముగా తెలియుట లేదు. ఇది బౌద్ధ యుగ కాల పూర్వమునకు చెందిన సాంప్రదాయమై యుండవచ్చును. శుల్బసూత్ర గ్రంథమున బలి వేదికల నిర్మాణ ప్రసక్తి వుంది. కానీ ఇవి దేవాలయాలుగా చెప్పడానికి వీలు లేదు. ఇంతే గాక వాటి ఉపయోగము పరిమితము మాత్రమే.

దీని తరువాతి నిర్మాణ దశ క్రీ.శ 3 లేక 4 వ శతాబ్దము వరకు వెలసినదిగాను బౌద్ధ యుగానికి చెందినదిగాను చెప్పవచ్చును. కానీ ఈ రెండు దశలలోను మట్టి లేక సున్నముతో సులభ రీతిలో నిర్మించుటకు వీలైన ఇటుక ప్రధానముగా వాడబడినది. ఈ దశలోనే స్థూపములు, చైత్య గృహాలు, విహార నిర్మాణాలు జరిగినవి. కాని కొలది కాలమునకు ఇటుక స్థానములో శిల వాడుట సాంచి, అమరావతి వంటి ప్రాంతాలలో ప్రారంభమగుటతో వాస్తు నిర్మాణరీతులలో కొన్ని మార్పులు జరిగినవి.

మూడవ దశలో బౌద్ధ హిందూ గుహాలయాల నిర్మాణాలు జరిగినవి. ఈ కాలముననే భవిష్యత్తులో జరిగిన దేవాలయాల నిర్మాణాలకు కావలసిన వాస్తు, శిల్ప రీతులు రూపు దిద్దుకొనుట జరిగినది.

ఆంధ్రుల హిందూ గుహాలయాలకు సంబంధించి విజయవాడ, మొగల్ రాజ పురము, ఉండవల్లి, భైరవకోనల లోనివి ముఖ్య మైనవిగా చెప్పవచ్చును. కాని ఈ గుహాలయాల కాలము, నిర్మాతల విషయములలో నేటికిని భిన్నాభిప్రాయములు కొనసాగుచునే యున్నవి. కాని పురాణాలు మొదలగు ప్రాచీన గ్రంథాల నుండి తీసుకొనిన పల్లవ గుహాలయ వాస్తు శిల్ప రీతులు ప్రభావము వీటి ద్వారపాలకులు, పూర్ణఘట మొదలగు చిహ్నములలో మనకగుపడును.

ఆంధ్రుల చరిత్ర చాల ప్రాచీనమైనది. వేద యుగానంతర కాలమున రచింప బడిన ఐతరేయ బ్రాహ్మణ గ్రంథమున వింధ్యకు దక్షిణాన గల ఆర్య సరిహద్దుకు అవతల గల భూభాగముల గూర్చి, అచటి తెగల గూర్చి, తెలుప బడి యున్నది. అట్టి తెగలలో ఆంధ్రులొకరనెడి విషయము గూర్చి కూడా, ఇందు మొట్టమొదట ప్రస్తావించబడి యున్నది. సూత్ర సాహిత్యము మరింత స్పష్టముగా దక్షిణాపథము, దక్షిణాత్యుల గూర్చి తెలుపుతున్నది. కానీ ప్రాచీన బౌద్ధ మత గ్రంథాలు ఈ ప్రాంతమందలి అష్మాక, ములక, అంధక (అనగా ఆంధ్ర) జాతుల గూర్చి పూర్తిగా స్పష్టము చేయుచున్నది. శాసనాలలో ఆంధ్రుల గూర్చి అశోకుని శాసనాలలోనే మొదట తెలుపబడి యున్నది. తొలి చారిత్రక కాలానికి చెందిన శాతవాహనుల కాలముననే ఆంధ్రులు శక్తి వంతమైన విశాల రాజ్య స్థాపన, ప్రాభవములు జరిగి వాస్తు శిల్ప రంగమున ప్రాథమిక మేళిక ( substantial) ఘన కార్యములు సాదించబడినవి.

దక్కన్ ప్రాంతముననే మత పరమైన వాస్తు అభివృద్ధి అధికముగా సాగినది. బౌద్ధమతం గంగా మైదాన ప్రాంతమున పుట్టినప్పటికి, ఈ మత గుహాలయాలు అశోకుని కాలాన బీహారులో బరాబర్, నాగార్జుని, సితామర్హి ప్రాంతాన రూపొందించబడినప్పటికి, ఈ మత తొలి శిల్ప వాస్తు నిర్మాణాలు అధ్భుతముగా బార్ హుత్, సాంచి వంటి ప్రాంతాలలో మధ్య దేశముననే జరిగినవి. ఈ స్థితివలన ఒక వైపు శిలా గుహాలయాలు మరొక వైపు తొలి వేద కాలమునుండి కొనసాగుచున్న ఇటుక ఆలయ నిర్మాణాలు వాస్తు రీతిలో కొనసాగినవి. దక్కన్ లో శాతవాహనులు వారి తరువాతి వారైన ఇక్ష్వాకులు అమరావతి, నాగార్జున కొండ, గోలి, ఘంటసాల మొదలగు ప్రాంతాలలో ఇటుకతో నిర్మాణాలను (శిలా గుహాలయాల నిర్మాణాల అంతిమ కాలమున) ప్రారంభించిరి. అనువైన ప్రాంతాలలో శిలా గుహాలయాలను గూడ ఈ రాజులు నిర్మించ సాగిరి. కాని శిలా ఖండములు లభించని ప్రాంతాలలో ఇటుకతో నిర్మించ బడిన బౌద్ధ, హిందూ నిర్మాణాలు విస్తృతముగా ఇదే సమయమున వ్యాప్తి చెంద సాగెను. ఈ వ్యాప్తి దశకు చెందినవే ఉత్తరాన గంగా తీరమందలి తొలి గుప్త దేవాలయాలు. దక్కన్ లోని నాగార్జున కొండ, నాచ్ నకుథార బితర్గాన్ లందలి తొలి దేవాలయాలు.

కట్టడ నిర్మాణాలలో ఇటుక బదులు శిల వాడకము ప్రారంభమగుటకు మునుపే ఏక శిలా గుహాలయాలు రూపొందించుట తిరిగి ప్రారంభమైనది. కే.వి. సౌందర రాజన్ అన్నట్లు..... before brick could be replaced entirely by stone, the vogue had changed again transiently in favor of bock cut architecture , primarily due to the fact that the rock cut enterprise is not only more awe inspiring but also inevitably committed the labors and religious fervour of whole communities in the task and produced far reaching results in ethical and religious harmony. ప్రాంతీయ ఇటుక కొయ్యల నుపయోగించి నిర్మించిన వాస్తు శిల్పములు ఏక శిలలో వికసించుట మనకు ఈ దశలో అగుపడును. ఉదయగిరి (గ్వాలియర్), అజంతా, తొలి ఎల్లోరా, బాదామి , మహాబలిపురం, గుంటుపల్లి, శంకరం గుహాలయాలు ఈ తెగకు చెందినవే. ఏకశిలా నిర్మాణాలపై గల మోజును ఏక శిలతో నిర్మింప బడినవైన ఎల్లోరా కైలాస దేవాలయం, మహాబలిపుర పంచ పాడవ రధాలు, కలుగుమలై ఆలయములు తెలుపుచున్నవి. కైలాస దేవాలయము ఒక అద్భుతమైనది. " the first of which (kailasa temple) is by any standard an exceptional effort on a challenging medium (stone)" కానీ ఇదే కాలమున ఏక శిలా నిర్మాణములతో బాటు కొన్ని ప్రాంతలలో శిల నుపయోగించి దేవాలయలను కట్టెడి విధానము ప్ర్రారంభించుట కూడా జరిగినది. ఐహోలె (కర్ణాటక), నాచ్ న (మధ్య ప్రదేశ్) దేవోఘర్ (గ్వాలియర్) మొదలగు ప్రాంతాలలో క్రీ.శ. 6 వ శతాబ్దమునను, కాంచీపురము, బాదామి, పట్టడకల్, ఐహోలె, అలంపూర్ లలో క్రీ.శ. 7 వ శతాబ్దము ఆఖరు లోను, క్రీ.శ. 8 వ శతాబ్దము తొలి దశలోను జరిగిన దేవాలయ కట్టడాలు ఈ కట్టడ దేవాలయాల వాస్తు రీతి పునః ప్ర్రారంభ దశను తెలుపు చున్నది. వీటిలో అలంపూర్ దేవాలయాలు, ఐహోలె దేవాలయాలు, గుప్తానంతర మధ్యదేశ దేవాలయాలు, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో గల 'రోడ ' యందలి దేవాలయాలు, మార్వార్ లోని ఓసియన్ లోని 'ప్రతిహారుల ' దేవాలయాలు, 'ముఖలింగ ' మందలి గాంగ రాజుల దేవాలయాల వలె పరిణామ దశను గాక పరిణతి దశ నిర్మాణ రీతిని తెలుపు చున్నవి. ఈ పరిణతి దశ కొలది కాలమునకు దేదీప్యమానము (magnificience) మరియు అతివ్వయము (extravagence) నకు (దేవాలయ కట్టడాలలో)దారి తీసినది. దీని ఉదాహరణగా ఆంధ్రలోని సింహాచలం, పాలంపేట మొదలగు దేవాలయాలను చెప్పవచ్చును.

కానీ మలిదశ దేవాలయ కట్టడాలలో అనుకరణకు, నాణ్యత (quality) కన్నా క్వాంటిటీకి ప్రాధాన్యత అగుపడును. శిల్పమందు కూడ ముతుక దనము(coarseness) మరియు కాఠిన్యము (rigidity) అగుపడును.

ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాలు తొలినుండి కూడ దేశమున నిర్మింప బడియున్న అనేక వాస్తు శిల్ప నిర్మాణ రీతుల ప్రభావమునకు లోనగుచు ఒక నూతన మిశ్రమ తరహా వాస్తు శిల్ప రీతికి అవకాశ మిచ్చినవి. క్రింది వాక్యములలో ఇది మనకగుపడును.. The temples of Andhra pradesh, from their adolescence to decay, were constantly subjected to influence of architectural and art impulses from the center of early art endeavor and were thus, to certain extent, amalgams in structural mode. The elegance of the nagara sikhara profile and its typical wall decorative motifs as from Central India, the stamina of the Deccani, clarity of ground plan and sumptuous yet suave figure sculpture as from Aiholi, the almost effeminate grade of the Orissan art and architectural trends, the prodigious industry and craft superiority of the later Chalukyan temples of the Deccan and Karnataka the majestic stature and solid strength of the southern Dravidian temple forms and profiles, all seeped into the Andhra mound and enlarged its mass appeal and enriched the artistic vision. the innate acumen of the Andhra craftsmen who had had an unbroken tradition of art endeavour right from the time of the imperial Satavahanas, and whose Canvas had an enviable with of geographical horizan enveloping the western and the eastern seas., and the Ganga and the Pennar plains responded to their adventitious central location for receiving and harmonising these traditions of their near and distant neighbors. In sum, the sweeping panorama of the" "architectural creations of Andhra pradesh from the early historic up to early medieval times was composite to a large extent, and electric to the core. The fertile plains of the Godvari and the Krishna had this spirit of assimilation operating in spheres religious as well as temporal (K.v.Soundara Rajan)