ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/చిత్రకవి పెద్దన్న

41. చిత్రకవి పెద్దన్న


ఇత డాఱువేలనియోగి; భారద్వాజగోత్రుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దుండినవాడు. ఇతని కొడుకైన యనంతకవి యిందుమతీ పరిణయమును, మనుమడైన రమణకవి సాంబవిలాసమును రచించిరి. ఇతడు సర్వలక్షణసారసంగ్రహమను నామాంతరముగల లక్షణసారసంగ్రహమును రచించినట్లు,


సీ. * * *లక్షణసారసంగ్ర

హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతుడగు చిత్రకవి పెద్దనార్యసుతుడ"

అని యీతనికుమారుడైన యనంతకవియు,


సీ. "సర్వలక్షణసారసంగ్రహం బొనరించి తనరెమితాత పెత్దనకవీంద్రు"

డని యీతని పౌత్రు డైన రమణకవియు చెప్పియున్నారు. ఈలక్షణసారసంగ్రహము నాకు లభింపకపోయినను యప్పకవీయమున గ్రహింపబడిన రెండుపద్యముల నిచ్చట ఉదాహరించుచున్నాను.


గీ. మహిమ నెక్కటివళులన మరవఱలలు
   రహిని దమతమ కయి యేగు రమ్యచరిత
   వనధిగంభీర సద్గుణవాసయనగ
   భంజితాసురసముదాయ యాంజనేయ.


చ. ఎఱుగవుగాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి
   త్తఱి నుడివోవకుండ నుచితంబుగ జక్కవదోయి బోలి క్రి
   క్కిఱిసినచిన్ని చన్ను గవ యింపెసలారంగ నాదుచిత్తమన్
   వఱలుసరోవరంబున నవారణ గేళి యొనర్చు కోమలీ.

42. యాదవామాత్యకవి

ఇతడు చంద్రహాసవిలాస మను కావ్యమును పూర్వోత్తర భాగములుగా రచియించెను. ఈతనికాల మెప్పుడో తెలియలేదుగాని లక్షణ శిరోమణి యనునామాంతరము గల యాదవామాత్యఛందములోని,

సీ. రగణము శంఖమనగనొప్పుమూడవజామునబవడపు జాయకుజుడు
   గ్రహముగావేల్పు హిరణ్యరేతుడుగాగ దార కృత్తికగాగ దగరురాశి
   గా మేషయోనిగా గణమాసురంబుగా శృంగారరసముగా స్థిరఫలంబు
   భయముగా గౌశికభద్రగోత్రమున నెఱ్ఱనిమేన నృపకులమున జనించె


   బంధుజనగేయ సత్కవిభాగధేయ
   రమ్యచారిత్ర వేంకటరాజపౌత్ర
   వర్ణితోదార బాపన్నవరకుమార
   మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఇత్యాదిపద్యములనేకములు సులక్షణసారములో నుదాహరింపబడి యుండుటచేత నీయాదవామాత్యకవి 1620 వ సంవత్సరమునకు బూర్వపువాడనిమాత్రము నిశ్చయముగా జెప్పవచ్చును. ఇష్టదైవము తన్నుద్దేశించి పలికినట్లుగా గవి చంద్రహాసవిలాసములో నిట్లు వ్రాసి కొనియున్నాడు. <poem>

సీ. ఇట్లనిపల్కె మహీసురాన్వయమున వాసి కెక్కినభరద్వాజమౌని

  గోత్రసంభవులందు గొమరొప్పుభానప్పవంశంబునకు జాలవన్నె తెచ్చి
  నట్టి తిమ్మకవీంద్రు నన్వయంబునబుట్టి మహి మించు నారపమంత్రి పుత్రుం
  డగువేంకటాద్రి కిల్లాలైన కొండాంబతనయు డాబాపన్న తమ్ములైన