ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/ఎఱ్ఱన

26. ఎఱ్ఱన

ఈకవి కొక్కోకమును, సకలనీతికథానిధానమును తెనుగున బద్యకావ్యములగా రచియించెను. కొక్కోకమునకు రతిరహస్యమని నామాంతరము. దీని కవిత్వము హృద్యముగానేయున్నను నీతిమంతులు చదువ దగినగ్రంథముకాదు. ఈగ్రంథము కుంటముక్కల మల్లయామాత్యుల కంకితము చేయబడినది. శైలిని జూపుటకయి కొక్కోకములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను-


చ. పెనిమిటిభాగ్యరేఖ గుణబృందము లేనరు లైన ముందటన్

వినుతులు చేయ సౌఖ్య మొదవించును నాథునియందు మిత్రులం

గనుగొని సంతసిల్లు గలకంఠిగుణంబులుచూడ జూచి చ

య్యన దెలియంగవచ్చు మదనాంకురభావము జూడకుండినన్. [ఆ.1]


చ. తరుణులు పుష్పకోమలులు తత్తఱపాటున నేమిచేసినన్

విరసము పుట్టు గావున వివేకమునం బురుషుండు తత్సఖీ

పరచితభంగి రాగరసబంధురుడై యెట నేప్రయోజనం

బురమణి కిష్టమౌనదియె పూర్వముగా గెడబాటుచేయుచున్. [ఆ.2]


ఈకవి యుండిన కాలమువిషయమై మన మిప్పుడు కొంచెము విచారింపవలసి యున్నది. కవి కృతిపతియగు భైరవమల్లామాత్యుని వర్ణించుచు-


సీ. హరిపదధ్యానతత్పరుడు చండలమహాలక్ష్మీప్రసాదై కలబ్ధవరుడు

రహి గజపతిమహారాయ లిచ్చినసమంచితమహాపాత్రప్రసిద్ధయశుడు

నాజమాఖానరాయనిచేతనొడయుడై వినుకొండదుర్గ మేలినఘనుండు

కృతివననిక్షేపపృథుతటాకాలయతనయాదిసప్తసంతానఘనుడు మునిపరాశరగోత్రసంజనితు డార్య

సేవ్యతిరువేంగళాచార్యశిష్యు డనఘ

మంత్రి పెరుమాళ్ళకొమ్మయమనుమయోబ

మంత్రి తెలగయ భైరవమల్లమంత్రి.


అని యతడు జమాఖానునిచేత బ్రభువుగా జేయబడినట్లు చెప్పియున్నాడు. ఈ జమాఖాను పదునాఱవ శతాబ్దమధ్యమునం దుండినట్లు తెలియవచ్చుచున్నది. కవికాలమును నిర్ణయించుట కీగ్రంథములో నింకొకయాధారముకూడ గానవచ్చుచున్నది. ఇతడు పూర్వకవులను వర్ణించుచు,


సీ. ........ .......... ...........

............. ............ ...............


ఆ. "రావిపాటి తిప్పరాజాదిముఖ్యశృం

గారకవుల నెల్ల గారవించి"

అని రావిపాటి తిప్పరాజును బేర్కొనియున్నాడు. ఈరావిపాటి తిప్పరాజు-

మ. సరిబేసై రిపు డేల భాస్కరులు భాషానాథపుత్రా వసుం

ధరయం దొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయామాత్యభా

స్కరుడా యౌ నతడే సహస్రకరశాఖ ల్లే వవే యున్నవే

తిరమై దానము జేయుచో రిపుల హేతి న్వ్రేయుచో వ్రాయుచో.


పయిపద్యమును రామయామాత్యభాస్కరునిమీద జెప్పినట్లప్పకవీయములో నుదాహరింపబడియున్నది. ఈరామయభాస్కరు డచ్యుతదేవరాయని కాలములో నుండినట్లు కొండవీటిలోని గోపినాథస్వామివారి దేవాలయద్వారశాఖయందు వ్రాయబడియున్న యీక్రింది పద్యమువలన స్పష్టముగా దెలియవచ్చుచున్నదిసీ. నిర్మించె నేమంత్రి నిరుపమప్రాకారనవకంబుగా గోపినాధపురమును

గెలిచినా డేమంత్రి లలితవిక్రమమమునబ్రబలుడై యవనులబలము

నిలిపినా డేమంత్రి నియత వైభవమున గోపికావల్లభు గూర్మివెలయ

బాలించె నేమంత్రి ప్రకటధర్మఖ్యాతి మహిమమీఱగ నాంధ్ర దేశ మందు.


నతడు భూపాలమంత్రీంద్రసతతవినుత

ధీవిశారదు డచ్యుతదేవరాయ

మాన్యహితవర్తనుడు శౌర్యమహితయశుడు

భానుతేజుండు రామయభాస్కరుండు.


దీనినిబట్టి రావిపాటి తిప్పరాజు1540 వ సంవత్సరప్రాంతమున యందుండెననుట స్పష్టము. ఈరావిపాటి తిప్పరాజును స్తోత్రమ-- యెఱ్ఱనకవి యాతని కాలమునందో తరువాతనో యుండియుండవచ్చును. కొక్కోకమును రచించిన కొన్ని సంవత్సరముల కీయెఱ్ఱనకవి సకల నీతి కథావిధానమును రచించి కొక్కోక కృతిపతియైన మల్లామాత్యుని యన్నకొడుకగు కుంటముక్కల పినభైరవామాత్యున కంకితము చేసి నందున గవి 1560-70 సంవత్సరప్రాంతములయం దుండెనని చెప్ప వచ్చును. సకలనీతికథా నిధానములో గృతిపతి కవినిగూర్చి చెప్పినట్లున్న యీక్రింది పద్యములు పయియంశమును తెలుపుడు---చున్నవి.


సీ. శ్రీవత్సగోత్రవారిధిపూర్ణశీతాంశు డగుకూచమంత్రికి నాత్మజుండు

వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌడి బూర్వకవీంద్రుల బోలిన

వఖిలపురాణేతిహాసకావ్యస్మృతిచయము రచించినచారుమతి

మాపినతండ్రియౌమల్లమంత్రికిని గొక్కోకంబు చెప్పినకోవిదుండు

రసికు లభిమతిచేత బురాణసార | మనుపమంబుగ నాకిచ్చి

వట్లుగావున నొకటి నిన్నడుగదలచి|యిచ్చటికి బిల్వబంచితినెఱ్ఱనామాత్యుని క. భావమున దోచె గలియుగ| పావనభూపాలకథలు బంధురకావ్య

శ్రీ వెలయ నాంధ్రభాషను|గావింపగవలయు సుప్రకాశత నాకున్.


పయిపద్యములనుబట్టి యితడు పురాణసారమను గ్రంథమును గూడ రచించినట్లు కనబడుచున్నదిగాని యా గ్రంథము దొరకలేదు.


చ. వినుతియొనర్తు నాంధ్రసుకవీంద్రుల నన్నయభట్టు దిక్కయ

జ్వను నమరేశ్వరుం జెదలువాడమహాత్ముని మారనార్యు నా

చనసుతసోము భాస్కరుని జక్కయనుం గవిసార్వభౌమునిన్

వనరుహపుత్రసన్నిభుల వర్ణితకావ్యకళానిధిజ్ఞలన్.


అని కవి తన సకలనీతికథానిధానములో శ్రీనాథుని వఱకును గల కవులనేస్తుతించి యున్నాడు. "చంద్ర శేఖర క్రియాశక్తి రాయలయొద్ద బాదుకొల్పితి సార్వభౌమ బిరుద" మని యుండుటనుబట్టి యీ పద్యమునందు బేర్కొనబడిన కవిసార్వభౌముడు శ్రీనాథుడనుటకు సందేహము లేదు. ఇంచుమించుగా సమకాలికులగుటచే గాబోలు నల్లసాని పెద్దనాదుల నితడిందు బేర్కొనలేదు.


సీ.ప్రభవించె నేవీట బర్వతాగ్రంబున నరిగెరీశ్వరుడు శ్రీనాయకుండు

వసియించె నేవీట వర్ణితసాలాంతరమున మూలస్థానరాజమౌళి

యుదయించె నేవీట నుత్తరాశాతటభూషణీకృతనింబ పుట్టలాంబ

వరియించె నేవీట వలదిశాకోణంబునందు గుబ్బటలమైలారమూర్తి

వినుతిగాంచె నేవీటను విప్రరాజ| వైశ్యశూద్రాదిబహువిథవర్ణ సమితి

యట్టి పురరత్న మొప్పుభవ్యాంబుజాత|మండితామరతరువల్లికొండపల్లి


క.ఇటువంటి కొండపల్లీ | పుట భేదన మంత్రిమకుట భూషణ మరిరా
ట్కటకవి భేదన ఘటనో | ద్భటుండు కుంటముకుల పిన భైరవుడొప్పున్.

ఇత్యాది పద్యములను బట్టి సకల నీతి కధా నిదాన కృతిపతి కొండపల్లి కధికారియైనట్టు కనబడు చున్నాడు. ఇట్లొక కృతి పతి వినుకొండకును మఱియొక కృతిపతి కొండస్ పల్లికిని ప్రభువగుట చేత నీ కవి కృష్ణా మండములోని కొండ వీటి సీమ వాడయినట్లు స్పష్ట పడుచున్నది. కొకోకమునందు కవి తన్ను గూర్చి యిట్లు వ్రాసికొని యున్నాడు.


సీ. శ్రీవత్స గోత్ర ప్రసిడ్ఢ సంభూతి నాపస్థంబ సూత్రప్రశస్తఘనుడ
గురుదయానిధి మైన కూచన మంత్రికి నంగనామణి ముత్తమాం
దనయుండ సత్కవీంద్రసుమాన్య చరితుండ శివ కృపాసుజ్ఞాన శే
నారూఢ విద్యా చలానంద యోగిండ్ర శిష్ట ప్రచార విశిష్ట ఘనుడ


నెఱ్ఱ నామాత్య పుత్రుడ సత్కవీంద్ర హితుడ
గలితవాక్ప్రౌఢి కొక్కోక కవివరుండడ
జతురమతితోడ రతి కళాశాస్త్రవ్ మిదియు
గెనుగు గావింతు రసికులు వినుతి చేయ.


శా. ధారాపట్టణ మేలు భోజుడు మహోదారుండు వాహ్యాళికై
నారణ్యంబున కేగి వచ్చునెడ బ్రహ్మప్రాప్తభూయావనా
శారంభ స్థలి చేరువం జనగ సైన్య వ్రాతముం జూచి య
ప్పాఱు డిట్లనె జొన్న చొచ్చి వలెనా బక్షింపుడీ బియ్యము


ఉ. ఊరక యేలయుండ మన మోశుకరత్నమ యస్మదీయసం
చార వినోదము ల్కలిసి సల్పుదమన్న దొలంగు చేద కో
కీరమ పూరుషు ల్బహుళ కిల్బిషచారు లసత్య భాషణుల్
క్రూరులు వారితోడ నొడగూడి మనంగలరే వధూమణుల్