ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/శేషము వేంకటపతి
శేషము వేంకటపతి
ఇతడు శశాంకవిజయ మనెడి యైదాశ్వాసముల శృంగారప్రబంధమును చేసి వంగలసీనయార్యున కంకితము చేసెను. శశాంకవిజయమునకు తారాశశాంక మని నామాంతరము గలదు. ఇందు జంద్రుడు బృహస్పతివద్ద విద్యాభ్యాసమునకయి చేరి గురుపత్ని యగు తార నింటినుండ లేవదీసిన కథ మిక్కిలి పచ్చిగా వర్ణింపబడినది. ఈ శేషము వేంకటపతి నియోగి బ్రాహ్మణుడని తోచుచున్నది. ఇతడు కందాళ రామానుజాచార్యుని శిష్యుడు; కృష్ణయార్యుని కుమారుడు. కృతినాయకుడు తన్ను బిలిపించి పలికినట్లు చెప్పబడిన ఈక్రింది పద్యములలో కృతిపరంపరలు చేసినట్టు కవి చెప్పుకొనుటయేకాని యొక్క గ్రంథమునైనను బేర్కొనియుండలేదు.--పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/30 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/31 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/32
కూచిమంచి తిమ్మకవి.
ఈకవి యనర్గళ మయిన కవితాధార గలవాడు; బహుగ్రంథములను రచియించినవాడు ; ఇన్ని గ్రంథములను సలక్షణ మయిన మృదుమధురపాకమున రచియించిన కవి యాధునికులలో మఱియెవ్వడును లేడు. ఈకవి యాఱువేలనియోగి బ్రాహ్మణు