ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కొఱవి సత్యనారన

కొఱవి సత్యనారన


ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు; ఆపస్తంభ సూత్రుడు హరితస గోత్రుడు. అమరేశ్వరమంత్రి పౌత్రుఁడు. సింగయ, గంగమల పుత్రుఁడు. సింహాసన ద్వాత్రింశతికమ రచించిన కొఱవి గోపరాజునకుఁ బినతాత. ఇతనికి భీమన యను నామాంతరమున్నట్లును. ఇతడు రామాయణమును రచించినట్లను

          క. రామాయణకృతి కృతియై
             తామెఱయుచు నంధ్ర కవిపితామహుఁడనఁగా
             భూమిని మించిన భీమన
             నామంబునఁ బరఁగె సత్యనారన ఘనుఁడై.

అను గోవరాజు పద్యమువలనఁ దెలియు చున్నది; ఇతడు 14-వ శతాబ్ది యందుత్తరార్ధమున నుండి యుండునని "ఆంధ్రకవితరంగిణి" లోనున్నది. (నాల్గవ సంపుటము. పుట 152)