ఆంధ్ర కవిత్వ చరిత్రము/షష్ఠప్రకరణము

షష్ఠ ప్రకరణము.

1. శైలివిషయము.

ఈ కావ్యము రసాత్మకమనియు, రసము భాఏనుభూతియే యనియు, నట్టి భావానుభూతి భోపనాశక్తియను నైంద్ర జాల ప్రభావముచే జనించుననియు నింతవరకుఁ దెలిసికొంటిమి. కావ్యాత్మ యగు రసమును గూర్చియు, ప్రాణమగు భావనాశక్తిని గూర్చియు విచారించితిమి. ఇప్పు డాకావ్యాత్మయుఁ, గౌవ్య ప్రాణమును నెట్టి స్వరూపము దాల్చునో సూచించెదము, అనఁగా, కావ్యముయొక్క బాహ్యస్వరూప 'మెట్లుండవలెనో యను సం గతిని విచారిం చెదము. కావ్యపదార్థ మనందగు భావముల కును వాని స్వరూపమనందగు శైలికినీ సంబంధ మేమి కలదో విచారింతము,

పదార్థమునకు స్వరూపమునకుఁ గల సంబంధము.

రసస్వరూపచర్చ యను ప్రకరణమున నీవిషయమును గొంతవఱకుఁ జర్చించీయే యుంటిని. అచ్చట వస్తువునకును గుణవి శేషణములకును నభిన్నత్వమును నవినాభావ సంబంధమును వర్తించునని సోదాహరణముగ నిరూపించితిని. కాని యఁట చర్చనీయాంశము వస్తువు యొక్క గుణవి శేషములు మానవ కల్పితములా, లేక వస్తువునం దంతర్గర్భితములా? యనునదియగు ఆంధ్ర కవిత్వ--16 ________________


టచేఁ జర్చఫలితము వేజురూపముఁ దాల్చినది. ఇచ్చట నావిష యము నే వేఱుదృష్టితో నవలోకించి చర్చిం చెదము. పదార్థమును దానియొక్క స్వరూపమును భిన్న ములుగా వనియు, నేక మేయని యు వస్తువున్నపుడు దానికిఁ బ్రత్యేకస్వరూప ముండియే తీరవల యుననియు, వస్తువునకును స్వరూపమునకు నవినాభావ సంబంధ మున్న దనియు నట్లు ప్రతివస్తువునకు నుండు ప్రత్యేకస్వరూప మును కనుంగొని వర్ణించువాఁడే నిజమగు కవియనియు నిచ్చటఁ దెలుపుచున్నాము. ఒక చిన్న యుదాహరణము నిచ్చెదను. ఒక రాలగుట్టను గాంచుఁడు. అం దెన్నేని రాళ్లుండునుకదా? ఒకజాతికిని నింకొక జాతికిని సంపూర్ణమగు పోలికయు,స్వరూప మునందు సంపూర్ణమగు నైక్యమును నుండదుకదా? ఒక్కొక్క రాతికి నొక్కొక్క ప్రత్యేకస్వరూప ముండును, ఆప్రత్యేక స్వరూపము కన్ను లఁగాంచిన ప్రతివానికిని గోచరింపకమానదు. మనము చూచినను జూడకపోయినను నేజాతియొక్క స్వరూప మారాతికి నుండ నేయున్నది. మనము ఏదో ప్రసక్తి వలన దానిని గాంచుటయు, దాని స్వరూపమును గుర్తెఱుంగుటయు, దానిని వర్ణించుటయు సంభవించుచున్నది, వస్తువు యొక్క స్వరూప మును గుణవిశేషములను వర్ణించుటకొఱకు మనము నిమిత్త మాత్రుల మగుచున్నాము, శాస్త్ర కారుఁడు వస్తువున కుండు ప్రత్యేకస్వరూపమును బ్రధానముగా వర్ణింపక ముఖ్యములగు గుణవి శేషములను మాత్రమే పేర్కొనును. శిల్పియన్ననో, రసి కుఁడు నన్ననో, వస్తువు యొక్క ప్రత్యేక స్వరూపమును బ్రధాన ముగ గ్రహించి వర్ణించును, వస్తువును దాని స్వరూపమును నభిన్న ములని తిరిగి హెచ్చరించుచున్నాను. ఎట్లనఁగా, జాతి యందున్న పదార్థమగు సణుసముదాయము ఏదోయొక యా శృతినే యున్న దిగాని, నిరాకారముగ లేదు. పదార్ధ మున్నచో నాకారము తప్పక యుండితీరవలయును. ఆకృతి లేని పదార్థములును, పదార్థము లేని యాకృతులును బ్రకృతియందు దుర్లభములు. నిరాకారత ఒక్క వాయువునకును నద్వైతపర బ్రహ భావమునకును వర్తించును. తుట్టతువకు వాయువులకుగూడ నొకవిధమయిన రంగున్న టులఁ బ్రకృతిశాస్త్రజ్ఞులు కన్నులకు దార్కాణముగఁ జూపించుచున్నారు. పర బ్రహముపంగతి కొంచెము వాగతీతము. ఏలనన, భగవంతుఁడు నిరాకారుఁడని సమ్మువారు కొందఱును, సాకారుఁడని కొందఱును నమ్ము చుందురు గావున నీవిషయమును గూడ నీదమిత్థమని తేల్చుటకు వలనుపడదు. కావునఁ దేలినవిషయ మేమనఁగాఁ, బ్రతివిషయ మునకును బ్రత్యేకమగు నాకృతి యుండుననియే, అయ్యది గ్రహించి వర్ణించుటయే కవియొక్క కృత్యము.

భావములయొక్క ప్ర త్యేకస్వరూప మే పదజాలము.

ఇట్లే ప్రతిభావమునకును బ్రత్యేక స్వరూప ముండునని మామతను. భావములకుఁ బ్రత్యేక స్వరూపము పదము లేయని యెఱుంగునది. ఎట్లనఁగా పేరు లేని వస్తువుండ నేరదు. 'పిల్లి' యను పదమువలనఁ బిల్లియను పదార్థమునకు సంబంధించిన భావ మును బిల్లియను బదార్థమును 'రెండును స్మరణకు వచ్చు చున్నది. కావునఁ బదము విషయమునకును, విషయసంబంధి భావమునకును సుజారూపమున నున్నది. ఈసంజ్ఞలు విషయ పరిజ్ఞానము సులభముగ నలపడుటకును, శాశ్వతముగ నుండుటకును, సర్వత్ర వ్యాప్తి గాంచుటకును మానవుని చేర బ్రప్రథమమున నేర్పఱుపంబడి దేశకాలపొ త్రాదుల సను సరించి భిన్న దశల నొంది యనేక భాషలుగఁ బాదుకొనిపోయి నది. ఇట్టి భాషలలోఁ గొన్ని ప్రాంతఁగలవిగను, గొన్ని ప్రాంత లేక వాజ్మాత్ర వ్యవహారము గలవిగను నున్నవి. ఈవిషయ మిట్లుండె. ప్రకృతము మనకుఁ గావలసిన విషయ మేమనఁగాఁ బతిమాటయుఁ బైన వివరింపఁబడిన కారణము ననుసరించి యొక యర్థమునకును బదార్థమునకును సంజ్ఞా రూపముగ నుండు ననియే. కావునఁ బ్రతిమాటయు నొక్కొక్క యర్థము నొసఁగ సమర్థమై యుండును. ఏతావతా ప్రత్యర్థమును బదములవలన సూచింపఁబడవలేననియే స్పష్టమగు చున్నది. మాటల చే సూచింపంబడని యర్థమును, నర్థమును సూచింపని మాటలును మృగ్యములు. కాని కుశాగ్రబుద్ధులు వేదొక ప్రశ్నను నడుగుదురు.


-అనుకరణముల విషయము.

అర్థము నొసంగని మాట "లేదందు రే! అనుకరణముల సంగతి యేమి? అని ప్రశ్నింతురు. 'కొక్కొరుకో' యనుమాట, కర్ణ మేమి? బౌ బౌ బౌ 'అనుట కర్ణమేమి? కజకజగజగజు. ఉహుహూ అహహా మొదలగు సనుకరణముల సంగతి యే మందురు ? వాని 'కేమియర్లము నీయఁగలరు? అని ప్రశ్నము గల్గుచున్నది, దానికి సమాధానముఁ దెల్పెదను. ఈయనుకర ణములు మిగిలిన పదములవలననే యర్థమునకు సంజ్ఞారూపము గనే యున్నది. మానవ వ్యవహారమున వీనికి రూఢియగు ప్రసక్తి కల్పించేంబడియే యున్నది. 'కొక్కొరొకో యను కూఁత ఒక్క కోడివిషయమున నే వాడుచున్నా రేమి? మానవ వ్యవహారమునఁ గొక్కొరొకోయను ననుకరణము కోడివిషయ ముననే రూఢిగ వాడఁబడు చున్నది. "ఉహూహూ" యని చలిచే వడఁకునప్పుడే యందుముగాని, యెండ వేడిమిచేఁ దపించు చున్నపు డందుమా? 'అహహా' యని యాశ్చర్యము కలిగిన వేళ లనే, గొంచెముహాయి జనించిన వేళలనే యనుకొందుముగాని, యితర సమయముల ననుకొందుమా! కర కర, గజగజ యను ననుకరణములను గఱకుతనము సూచించుటకే పొడుదుము గాని మార్దవము సూచించుపట్ల పొడుదుమా? వెన్నను,మంచి నీళ్లను, పొలను కఱకఱ-గఱగఱ నమలువారుగాని, నమలుదురని చెప్పువారుగాని లేరుగదా! కావున సనుకరణములకు స్వభావమును మానవవ్యవహారమును ననుసరించి రూఢియగు సంజ్ఞార్థము గలదని యెఱుంగునది. అందువలనఁ బ్రతిమాటయు సర్జము జూలుననియుఁ, బ్రత్యర్థమును మాటలకు వశమై యుండుననియు, సర్గమును దత్సంజ్ఞారూపళమగు పదమును, తొయియును దత్స్వరూపమునుంబలే నేకవ్యక్తి గలవై యవినాభావసంబంధముతో వర్తించుచుండును. ఈరహస్యము శై లీవిషయమున నవశ్య గ్రహణీయము. ఎట్లనఁగాఁ బ్రతిమా టయు నొక్కొక్క యర్థము నీజాలినపుడు ఒక్క మాటను మార్చి వేఱొకమాటను వాడినచో నర్థము వేరగుట దప్పదు.

పర్యాయసమానార్థకపదముల విషయము. -
-

ఈసందర్భమును మన దేశములోని భాషా సాంప్రదాయ మును బండిత సమయములును నొక్కింత యాక్షేపింప నవసర మొదవు చున్నది. మన దేశమున సమానార్థకము లను పేరఁ జాల పదముల నడ్డు దిడ్డముగ నుపయోగించుట యాచార మగు చున్నది. దానికి గారణము మనవారు విషయపరిజ్ఞాన మల వడుటకుఁ బూర్వమే యమరకోశ, ఆంధ్రనామ సంగ్రహాది. నిఘంటువులను గ్రుడ్డిపాఠముగ వల్లె వేయుటయే. ఈ నిఘంటుల యందుఁ బదములచే సూచితములగు ప్రత్యే కార్థముల విషయము మఱుఁగుపరచి నిఘంటుకారులు ఒక్కొక్క యర్థము సకు ననేక పదముల సంజ్ఞా రూపకములుగఁ బేర్కొనినారు. ఆ నిఘంటువుల గుడ్డిపాఠముఁ గావించువారు భాషా రహస్య మును గ్రహింపలేక యొకయర్థము నే పలుమాట లీయఁగలవని భ్రమసి యొకమాట కింకొకటి పర్యాయపదములుగ నుండఁ గలదనియు నోకమాటకు బదులు నిఘంటువునఁ బర్యాయపద ములుగఁ జేర్కొనఁబడిన మాటలలో దేనినైనను నుపయో గించినఁ దప్పు లేదనియు, నందువలన నర్థము భేదింపదనియుఁ దప్పఁదలఁచుచున్నారు. ఒక్క స్త్రీయను 'సరమునకుఁ బర్యాయ పదములుగ మనవా 'రెన్ని పదములను వాడుట లేదు. ఈ పర్యాయపదముల ఘోష శ్రషణకఠోరముగఁ బరిణమించు చున్న ది. ఒక్కొక్క యర్థమున కే పలుమాటల వాడుటవలన నాయర్థము యొక్క సొంపు చెడుటయేకాక యాపర్యాయపద ముల కుండు ప్రత్యే కార్థమునకుఁగూడ నా భాసత్వము గలుగు చున్నది. కావున భాష యనఁగా అర్థద్యోతకశబ్దసముదాయమని గ్రహించునది. పైన నొకవస్తువునకును వేవొకవస్తువునకును. సంపూర్ణమగు రూఢసొమ్యమును, పూర్తయైన పోలికయు సుండుట యసంభవమనియు, నేవ స్తువురూప మావస్తువున, కెట్లు ప్రత్యేకముగ నుండునో, అట్లేయేమాట యొక్క ప్రత్యే కార్థ మామాటకే యుండుననియు, ' రెండుమాటలకు నర్థము విషయమున సంపూర్ణైక్యభావ ముండుట యబద్ధమనియు, బదముల ప్రత్యేకార్థములను గ్రహింపకుండ వానిని వాడుట రసాభాసత్వ హేతువనియుఁ జెప్పియుంటిమి. కావున నిప్పుడు ప్రత్యేకించి తెల్పెడి దేమనఁగా నేమాట యర్ల మామాట కెట్లు సిద్ధమును రూఢియో యభై యేభావముయొక్క పద జాల మాభాపమునకు రూఢిగనే యుండును. అట్టి రూఢ్యర్థ ములను రూఢిపదజాలములను వదలి పై పై మెఱుఁగుల కాస పడి పర్యాయపదము లను వేరిట పదముల విచ్చలవిడిగఁ బ్రయో గించుట పొసఁగని పద్దతీయని సూచించును. కావున భావము యొక్క స్వరూపమును దర్శించి యనుభవింప నియట్టివాడు దానినిఁ బదముల వర్ణింపఁజాలఁడు, భోపము యొక్క ప్రత్యేక స్వరూపమును గుర్తెఱుంగక యిచ్చవచ్చి నట్లు పదజాలంబు నుపయోగించిన స్ఫుటమును, రుచిరమును, రూఢియైనవియు నగు నర్థముఁగాని భావస్వరూపముఁగాని సిద్ధింపక యేమియుఁ డెలియని బాలురు పిచ్చిగీతల గీయ వానివలన నెట్టి పరిస్ఫుట సుందరాకృతులు వెలువడునో యట్టి విలక్షణ శూన్యములగు నాకృతులే వెలువడఁగలవు.

ఏభావమున కాశై లియే. ఒకభావముయొక్క శైలి మార్చి వేటీక శైలినివర్ణించుట. రెండు లోపములను జేయుట. అని యేవన. ఒకటి భావములును శైలి (అనఁగఁ బదజాలము) యును సేకపస్తువుగాక రెండు భిన్న వస్తువులని భ్రమించి, , భాపములకును భాషకునుఁ గల యభేదమును గ్రహింపక పోవుట; రెండు వస్తువునకుఁ గల ప్రత్యేకస్వరూపముఁబోలి భావమునకు బ్రత్యేకస్వరూప మనందగు ప్రత్యేక శైలిని అనఁగా ప్రత్యేక పదజాలమును గుర్తింప లేకపోవుట. కావున భావములును శైలియు నేకవస్తువే, రెండు కావు. ఏభావమున శాశైలియేగాని ఒక భావమునకే రెండు శైలు లుండవు. శైలి మారనపుడెల్ల భావములు మారుచు నేయుండుననియు, ఒకని శైలిని మార్చి మనము వేఱు శైలిలో నతని భావమును జెప్పఁ జూచుట యసంభవమగు మాటయనియు మనపండితులు గ్రహించిన పరుల గ్రంథములలోని పదముల నిచ్చవచ్చినట్లు దిద్దుచు, వాని యర్థమును జెడఁగొట్టుచు, సొంత 'కపిత్తము'ల నందు దూర్చుచు, “అహోమూలచ్చేదీ తప పొండిత్య ప్రకర్ష?' అనుమాటలకు లక్ష్యమగుటకో యన్నట్లు మూలము యొక్క యర్థమును భ్రం శముఁ జేయుచుఁ, దమయొక్క తెలివిమాలినతనమును భాషా రహస్య జ్ఞానముయొక్క లేమియు వెల్ల డింపకుందురుగాక. -

ఈలోపమే యచ్చటచ్చటఁ గొన్ని విమర్శనములసైతము గానవచ్చుచున్న ది.“ఈ గ్రంథమున భావములు బాగుగ నున్నవి. శైలి మాత్రము బాగుగ లేదు. ఇది మంచి శైలి, ఇది చెడ్డ శైలి” యను విమర్శనారత్నముల నప్పుడప్పుడు మనము తిలకించుచునే యున్నాము. భావములు బాగుగనున్న నాభావముల సంజ్ఞా రూపకమగు శైలి (పదజాలము) ఎట్లు బాగుండదు? శైలి బాగుగ లేకున్న భావముమాత్ర, మెట్లు బాగుండఁగలదు? ప్రతిపదమును నర్థమునే సూచించు నప్పుడు పదజాలము బాగుండనిచో నర్థమును బాగుండదు కదా? అట్లే భావము బాగుగ ననుభూతమైనచో దానియొక్క ప్రత్యేక సంజ్ఞా రూపక మగు శైలీయు బాగుండియే తీరునుగదా! కావున నిట శైలి బాగుగ లేదన్న భావములు బాగుగ ననుభూతము కాలేదన్న' మాట. ఇంక భావములు బాగుగ లేవు కానీ, శైలి మాత్రము చాలబాగుగ నున్నదని యనుదాని భావమును నిట్లే. భావములు బాగుగ నుండక శైలిబాగుగ నున్న దనుమాటలవలన అర్థమున కును పదములకు మైత్రి లేదనియైన చెప్పవలెను; లేక యర్థము తెలియకుండ కవి పదములను పిచ్చిపిచ్చిగా వాడినాఁడనియైనం జెప్పవలెను.ఇట్లే నను భావ మనుభూతము రాలేదనియుఁ,గవి గుడ్డి వానివలెఁ గన్నులుగల ప్రయోజనము ననుభవింపనివాఁడై, పిచ్చివాని రీతి నసంబద్ధ ప్రలాపములను జేయుచున్నాఁడనియు సిద్ధాంతముఁ జేయవచ్చును. ఈభావమునే పాశ్చాత్య లాక్షణి కులు “There is nothing like a good style or fad style but there is only style." అనుపలుకుల వివరించియున్నారు.

-శైలి కవిస్వభావసూచకము. -

భావములు మానవుని చిత్తవృత్తుల నాశ్రయించి కొని వానీ ననుసరించి వర్తించుచుండునని భాసముల గూర్చి ప్రశంసఁ జేసినపుడు దెలిసికొంటిమి, మానవుని యొక్క అనఁగా కవి యొక్క, చిత్తవృత్తి ప్రకారము భావములు జనించుచుండు నని యు, నట్టి చిత్తన్నత్తి మాఱిన భావములును వేఱురూపముఁ దాల్చుననియునిదివజకే తెలిసికొంటిమి. ఒక్కొక్క కవియొక్క చిత్తవృత్తి యొక్కొకతీఱున నుండును. అందువలన నొక్కొక కవియొక్క భావము లొక్కొకరూపముఁ గలవిగ నుండును. మానవుని చిత్తవృత్తులు శరీరస్థితుల ననుసరించి యనేకవిధము లుగ నుండుననియు, నందువలన భావము లనంతవిధము లైన వనియుఁగూడ నెజింగితిమి, అట్టిభావములలో నొకదాని నొకటి సంపూర్ణముగఁ బోలియుంట యసంభవమనియు, 'నేభావము యొక్క ప్రత్యేకస్వరూప మాభావమునకే చెల్లుచు నాభావ మునే సూచించునుగాని, వేఱుభావములకు వర్తించి వేఱు భాపముల సూచింపదు. అట్లే ఒకమనుష్యుని చిత్తవృత్తి. యింకోకని చిత్తవృత్తిని సంపూర్ణముగఁ బోలియుండదు. ఏమ నుష్యు నిచిత్తవృత్తియు స్వభావమును నా మసుష్యునకే ప్రత్యేకముగ వర్తించుచు నితరులకుఁ జెల్లకయుండును. చిత్తవృత్తు, లును, స్వభావమును నొకమ నుష్యునకును వేవొకమనుష్యు నకును గల భేదమును సూచించును. ఏమనుష్యుని యొక్క స్వభావ మామనుష్యు నియొక్క విలక్షుణత్వమును ప్రత్యేక వ్యక్తిని సూచించును.

ఇక శైలి స్వభావము నెట్లు సూచించు సందురా,, సమాధానముఁ జె ప్పెదను, భావములయొక్క సముదాయమే స్వభావ మగును. ఏల ననఁగా భావములు చిత్తవృత్తుల నాశ్రయించుకొని యుండునని మన మిదివట కేజింగితిమిగనుక ఒక్కొకమనుష్యుఁడు వెలివుచ్చు భావములనుబట్టియే యాతని, స్వభావమును గుర్తెఱుంగవచ్చును.

ముఖపరీక్షా శాస్త్రము (Physiogromy)

- ముఖలక్షణముఁబట్టి సాధారణముగ మనుజునియొక్క స్వభావము నూహింపఁజూచుట' మానవసహజమే. ఎప్పుడును మొగము ముడుచుకొనియుండువానిని జూచిన నతఁడు గోష స్వభావముఁ గలవాఁడని మన మూహింతుము. ఎప్పుడును కల కలలాడు నగు మొగముఁ గలవానిని జూచిన నతఁడు సంతుష్టు స్వభావము గలవాడును,మంచి వాఁడును నానంద మయుఁడును నని యూహింతుము. ఇట్లే సాధారణముగ వివిధముఖలక్షణ ములఁబట్టి మానవుని మనోభావముల నెఱుంగు శాస్త్రము కూడఁ గలదు. దాని నింగ్లీషు భాషయందు *Physiognomy" యందురు. అట్లే భావములవలసను మనుజుని స్వభావము బయల్పడు చుండును. చెడుస్వభావముఁ గలవాఁ డెప్పుడును. చెడు తలంపులను తలంచుచుఁ, జెడుకోరికలఁ గోరుచుఁ, జెడు. మాటల మాటలాడుచునే యుండును. కొందఱు పైకి నొక తీరునఁ గన్పడుచు లోపల నొక తీరుగ నుండుచుఁ బయోముఖ విషకుంభములు బోలియుందు రదియు గొంతవజుకు సత్యమే. అందుకనియే Physiognomy అను ముఖపరీక్షా శాస్త్రమునకు సంపూర్ణమగు ప్రామాణ్యము లేదు. కాని భావముల విషయ: మన్ననో అట్లు కాదు. ఏలనన మానవుఁడు భావముల సను, భవింపకుండ నొక్క నిముసమైన నుండఁజాలఁడు, ఎప్పుడును. 'నేదోయొక భావ మతని నా వేశించియే యుండును. నిద్ర.. పోవునప్పుడుఁగూడ నతని భావములు స్వప్న రూపముగ నతని నావేశించి యుండుననియుఁ గూడ కొందటి సిద్ధాంతము. జూగ్ర ద వస్థయందున్న ప్రతిమనుజుఁడును భావములకు వశుఁడై యుండును. భావములకును మానవుని మనస్సునకును సభిన్న అవినా భావసంబంధము కలదు. భావముల ననుభవింపని మన స్సుండదు. మనస్సు చే ననుభూతములు కానట్టి భావము లుండఁ. జాలవు. ఈభావము లన్నియు నేటి యొకరీతిని గలసి మెలసి. వర్తించు చుండినచో సదియే స్వభావ మగుసు. -

శైలి కవియొక్క ప్రత్యేకస్వభావమును సూచించును

అట్టి స్వభావము ప్రతి మనుష్యునుకును ప్రత్యేకముగా నుండును. ఎవ్వని స్వభావము వానిదే, ఒకని స్వభావము 'పూర్ణముగ నింకొకని స్వభావమును బోలియుండదు. ప్రతి మనుష్యుని స్వభావమునుకును బ్రత్యేకమగువ్య క్తియు, విల క్షణమును, స్వరూపమమును నుండును. అట్టి విలతుణత్వమును, ప్రత్యేక వ్యక్తిని, ప్రత్యేక స్వరూపమును శైలి యెట్లు చూపింపఁ గలదు? శైలి యనఁగాఁ బదజాలమును బదముల కూర్పును నని యిదివరకు దెల్పితిమి. అట్టిపదములలో బ్రతిదియు నే దేనొక యర్థము నొసఁగుననియు, "నే దేనొక భావమునకు సంజ్ఞారూపముగ నుండుననియు, నాభావముయొక్క ప్రత్యేక స్వరూపమును బ్రదర్శించుననియు నిదివర కే దెల్పితిమి. భావ ముల సముదాయమే స్వభావమయినప్పుడు భావములయొక్క సంజ్ఞా రూపమును భాహ్యస్వరూపమును ననఁదగు పదముల కూర్పు(శైలి) భావములయొక్క సముదాయమగు స్వభావము నెట్లు సూచింపకుండును? సూచించియే తీరునని యెఱుంగునది. అట్టి స్వభావమును సూచించుటలో శైలి స్వభావముయొక్క “సర్వములను లక్షణములను, విలక్షణములను, ప్రత్యేకత్వమును, సర్వమును పూర్ణముగ వ్యక్తములఁ గావించును. అందుకనియే శైలి స్వభావసూచక మని తెల్పుట. మానవుని స్వభావము యొక్క వాగ్రూపమే శైలి. మానవుని స్వభావము ఏమనుష్యున శామనుష్యునకుఁ బ్రత్యేకముగ నుండునుగాన తద్వా గ్రూప మగు శైలియుఁ దత్ ప్రత్యేకత్వమును జూపించును. అందు కనియే ఆంగ్లేయ విమర్శకులు "The style is the man" అని, పల్కుట, (శైలియే మనుష్యుఁడని పైమాటల భావము.)

ఒక నిశైలిని, వ్రాయ నింకొకనికి సాధ్యముకాదు.

శైలి మానవుని ప్రత్యేకస్వభావమును సూచించునది యగుటచే నొకని శైలి యింకోకనికి రాదు. ఇంకొకని శైలిలో వ్రాయవలెననిన నాతఁడై పుట్టి, యాతని భావముల నను భవించి, యాభావములఁ బ్రత్యేక స్వరూపమగు శైలిలో వ్రాయ వలెనుగాని వేఱువిధమునఁ గాదు. తిక్కనవలె వ్రాయవలె నన్నను, కాళిదాసునిపలె వ్రాయవ లెనన్నను, షేక్స్పియరువలె వ్రాయవ లెనన్న ను, తిక్కనయవతారమునుగాని, కాళిదాసు సవతారమునుగాని, షేక్స్పియరు నవతారమునుగాని, తాల్చి వ్రాయవలెను. వెనుకటికి, పులినిజూచి నక్క వాఁతఁచెట్టు కొనిన నక్క, పులి యయ్యేనా? కాలేదు. ఒడలుమాత్ర మే కాలెను, నక్క పులి కొవలెనన్న పులియొక్క బలము, శౌర్యము, పౌరుషము మొదలగు పులిలక్షణము లన్ని యు నలవడవలయు నేగాని చారలు కనుపించున ట్లొడలు కాల్చుకొన్నంతమాత్ర ముననే నక్క పులి యగునా? అట్లే తిక్కనయొక్క పదముల కూర్పుల నేవో కొన్నింటిని, కాళిదాసుని యుపమల నేవో కొన్నింటిని 'షేక్స్పియరుయొక్క మాటల నేవోకొన్నింటిని దొంగిలించి కానీ యనుకరించినంతమాత్రమున నెవ్వఁడై నను తిక్కనగాని, కాళిదాసుగాని, షేక్స్పియరుగాని యగునా?' క్కాడు. అట్టిపోని వ్రాతలయందుఁ దిక్కనశైలిగాని, కాళిదా సుని శైలిగాని, షేక్స్పియరుని శైలిగాని కనుపింపదు. ఇంకఁ గనుపించున దేమి? అట్టి వ్రాతకాని యజ్ఞతయు, బుద్ధిహీన తయుఁ, బ్రతిభాశూన్యతయు, భావశూన్యతయుమాత్రమే. ఇట్టివారినే కాళిదాసమహాకవి పరప్రత్యయ నేయబుద్ధులని నిరసించెను.

-అనుకరణ మాత్మహత్యయే యగును.

-

అనుకరణ మాత్మహత్య యనఁదగునని యాంగ్లేయులు 'పల్కుదురు. “Imitation is Suicide." ఇం దెంత సత్య మున్నది? -సంపృతిభ శూన్యమగుటయు, పరుని ప్రతిభ లబ్దము గాకుండు -టయుఁ దక్క శైలివిషయమున నితరుల ననుకరించుట వలన నన్య ప్రయోజనములు సిద్ధింపవు, ఆత్మ ప్రతిభను మనము చేతు లారఁ జంపికొనుచు నితరుల సనుకరించుచుందుము గనుకనే యనుకరణ మాత్మహత్య యగునని చెప్పుట, కావునఁ బ్రతిభాశాలురు పరుల నసుకరించుటలో తమ శక్తిని ప్రతిభను నాశనముఁ గావించికొని “అనుకరణ మాత్మహత్య యే) “మూఢఃపర . ప్రత్యయ నేయబు:” అనువచనములకు లక్ష్యములు కాకుండు టకుఁ బ్రార్థించెదను.

ఉదాహరణములు.


శైలి మానవస్వభావ సూచక మనుట కుడాహరణములఁ గోరుట, ముం జేతి కంకణముఁ జూచుట కద్దము కావలెనని కోరుట వంటిదియే యగును. ఇట్టి శుద్ధసత్యమున కుదాహరణము లనవసరములు. ఏదీ, తిక్కన వర్ణించినట్లు యుద్ధమును శౌర్య ' వీర్య గాంభీర్యా దిరసముల వర్ణించిన యాంధ్ర కవి నింకొక్కని ' జూపుడు. ఏకీ, భవభూతి వర్ణించినట్లు కరుణరసము వర్ణించిన కవిని వేవొకనిని జూపుఁడు. శౌర్య రాశియై, మనుమసిద్ధి నృపొ లుని మం త్రియై, వీరా గ్రేసరుఁడై ఖడ్గతిక్కన మహాయోధునకు సోదరుఁడై వీరయుగమున జనించి, మనుమసిద్దికిని కాటమ రాజునకును పంచలింగాల క్షేత్రమున జరిగిన మహాయుద్దమును, బ్రహ్మరుద్రయ్య పద్మనాయ కాది వీరాగ్రేసరు లెదిరిషక్షమున నిలిచిపోరు చుండ వీరాధి వీరుఁడును సోదరుఁడును నగు ఖడ్గతిక్కనతోఁ గూడి కదనమున పాల్గొనిన తిక్కనకవి యోధ వీరరస మును వర్ణింపవ లెఁగాక తక్కొరులకుఁ జేతనగు నే! నాటకమున శృంగార వీరరసముల దక్క నన్యముఁ బ్రథానరసముగ వర్ణింప దగదని శాసించిన లాక్షణికనియమమును బూరికిఁగొనక స్వచ్చందరస ప్రవృత్తిని నిరోధింపక, “ఏకో రసః కరుణ ఏవ" యనిసమ్మి,సమకాలిక పండి తాపహాసములకు వెఱఁగొంద క " కాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ" యని ఘోషించిస్వాతంత్ర్య ప్రతిభఁ గనఁబఱచి "ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే | యను నార్యోక్తిచే శాశ్వతస్థాయిగాల కీర్తింపఁబడిన భవభూతికే శ్రీ రాముని కరుణరస భరితమగు చరిత్రమును నాటకమును వర్ణించుటకుఁ జెల్లెనుగానీ తక్కోరులకుం జెల్లేనే శృంగారరస మూర్తియై, రసిక శిఖామణియై, సరస్వతీ దేవ్యవతార మై వాక్సిద్ది కలిగిన కాళిదాసకవికిఁ గాక యన్యులకు శృంగారరసము నంత చక్కగా వర్ణింప సాధ్యమయ్యె నే! ఒక చేత నగ్నిహోత్రమును నింకొక చేత మంచుగడ్డను బట్టిన మనుజునిరీతి "ఇదం బ్రాహ్య మిదం ఔత్రం" అని పల్కిన పరశురాముని రీతి హాస్యరసమును విషాదరసమును నొక్కరీతి నొకదాని వెంబడి రెండవదానిని వర్ణించి, హాస్యరస భరితనాటకములను, విషాదాంతనాటకము లనుగూడ రచించి కీర్తింబడయుట యొక్క షేక్స్పియరునకు . గాక యన్యుల కెల్లరకుం జెల్లె నే? కావున నుదాహరణము లనవసరములని విన్నవించుట, నీళ్లు ఎట్లు పల్ల మెఱింగి పొరు చుండునో అట్లే వివిధ రసములును వాని కనుగుణములగు కవి హృదయములఁ బాఱుచుండును. చవిటి నేల నెంత బలము చేసినను నెన్ని రకముల యెరువులఁ గట్టినను పంట పండునే? దుర్గంధమును, క్రిమికీటకాదులును జన్మించునుగాక. అంతియే. అట్టి రసములు ఆయారసముల కనుకూలము కాని హృదయమున ప్రవహింప నేరవు. అట్టి హృదయ క్షేత్రము లెన్ని కావ్యముల పఠనమువలననై సను, ఎన్ని లక్షణ గ్రంథముల పఠనమువలననే నను రసవంతములగు కావ్యఫలముల నీఁజాలవు. ముసిఁడి పండ్లు వోలె జూచుట కింపై నోటఁ బెట్టుకొన్న విషప్రాయములుగ నుండు ప్రబంధముల నీజాలు నేమో! -

కౌవ్యమున శయ్యా రీతు లప్ర ధానములు.

-

ఈ రసరహస్యము నెఱుఁగని లాక్షణికులు కొందఱు “రీతి రాత్మా కావ్యస్య"యనియు, “అదౌషా, సగుణ్, సాలం కారౌ, శబ్దార్థౌ, కావ్యమ్” అనియు వచించి యున్నారు. తత్ఫ లితముగ రీతులును, వృత్తులును, నలం శారములును కావ్యముల మిక్కిలియైనవి. శయ్యారీతులును, రసవృత్తులును, నలంకారము లును నున్న యంతనే రసవంతమగు కావ్య ముద్భవించునే ? "అంగడిలో సన్నియు నున్నవి.అల్లుని నోటశనియున్న "దన్నట్లు, రీతులు, వృత్తులు, అలంకారము. లాదిగాఁగల బాహ్యచిహ్న ములే మిగిలి, కావ్యాత్తయగు రసము మాయమై పోయినది. అగుఁగాక, రస మిట్టి పై పై వన్నె లుపచరించుట వలనఁ గలు గునే! ఆయ్యది కవిహృదయాంతర్గతభావోద్రేకమువలన జనింప వలెను. అట్టి భావోద్రేకము ప్రతిభా శాలురకే జనించునుగాని నీచులకును, ద్రోహాత్తులకును గలుగనేరదు. “He who would not be frustrate of his hope to write well hereafter in laudablo

things, ought himself to be a true poem; that is, a Composition and patters of the best and honourable things; not presuming to sing high praises of heroic men or famous cities, unless he have in himself the experience and the practice of all that which is praiseworthy".

పై వాక్యముల రచించిన . (Milton) మిల్టన్ కవి. యుత్తమకావ్యరచనకుఁ గడంగునతఁ డుత్తమగుణాఢ్యుండై యుండఁదగు ననియు, మహాద్విషయములఁ గూర్చి వ్రాయువాఁ డట్టి మహత్త్వము ననుభవించి ' మహత్త్వము గలిగినవాఁడై యుండవ లేననీయు నిరూపించిన వాక్యములయం దెంత సత్య మున్నది! భావగాంభీర్యమును, హృదయవి కాసమును లేక యూరక లక్షణ గ్రంథములలోని రీతులు, వృత్తులు, ఆలంకారములు మొదలగు కావ్యవిషయములఁ గూర్చి చదివి, వానినౌచి త్యమును, ప్రతిభయును లేకుండ . వర్ణించి నంతమాత్రమునఁ గవులగుదురా? నగలును, నాణెములును, చీని చీనాంబరము లును తగిలించి యలంకరించిన రాతిబొమ్మను గౌఁగలించి కొనిన నేంత కామోద్దీపకమగునో; రసానుభవము లేనిదియు, వట్టి యలంకారాదికములు మిక్కుటముగ గలదియు నగు కావ్యమును నంతే యానందజనక మగును. ఏలక్షణనియమముల ననుసరించుటవలనఁ గాళదాస-తిక్కనాది మహామహులు కవి శేఖరు లైరి ! "క్రియాసిద్ధిస్సత్త్వ భవతిమహతాం నోష కర్మ :.” అను నార్యోక్తి యెంతయు సత్యమ కదా! క్రియా సిద్దిగల మహాసత్త్యులకు నుపకరణము లక్కఱయే లేదుగదా! అట్టి మహాసత్వమును క్రియాసిన్దియును లేనివారు వట్టి యుప కరణము లే శరణ్యములని నమి పరమార్థమును గోలుపోవు. చున్నారు. ఆంధ్ర కవిత్వ-17

అలంకారము లవసరములా! రామలింగా రెడ్డి గారివాదము.

రీతుల సంగతి యటుండనిచ్చి యలంకారముల సంగతి కొంచెము విచారిం చెదము. అలంకారము లన నేమి? అవి యెన్ని విధములు? అవి యవసరములా? అనవసరములా? ఏవి ముఖ్యములు, ఏవి ముఖ్యములు కొవు? అను నీవిషయములకు సమాధానము నరయుదము. మనుజునకు నగలు నాణేములు వస్త్రము లావిగాఁగలయవి యెట్లు అలంకారములై యంద మొసఁగునో, అట్లే కావ్యమునకును కొన్ని యలంకారము లుండునని చెప్పఁబడుచున్నది. అట్టి యలం కారములు 'కావ్య మునకు భూషణముల వంటివై యందమును గూర్చును. కావు ననే వాని నలం కౌరములనీ లాక్షణికులు నిర్వచించి యున్నారు. అట్టి కావ్యాలంకారములు ద్వివిధములు---అర్థాలంకారములు శబ్దాలంకారములు నని. అలంకారము లవసరములా, అనవసర ములా? అర్థాలంకారములు ముఖ్యములా, శబ్దాలంకారములు ముఖ్యములా? అనువిషయమును గూర్చి చాల వివాదము చెల రేఁగినది! అర్థాలంకారము లనఁగ, నర్థమునకు సంబంధించిన యలంకారములు; ఉపమోత్ప్రేక్షాదులు. శబ్దాలంకారము లనఁగ యమకాను ప్రాసాదులు. శ్రీయుత రామలింగా రెడ్డిగారు మన యాంధ్ర భాషలో నీయలంకారములఁ గూర్చి విమర్శించి సహజముగ, న ప్రయత్నముగ వచ్చు నలం కారములను మిత ముగ వాడవచ్చుననియు, నట్టి యర్థాలంకారములను కవి తాను వర్ణించునప్పుడొక్కింతయెక్కువగ వాడినను దోషము లేదనియు నాటకపు పట్టుల యందును, రసాస్పదములగు పట్టుల యందును ననఁగా కథలోని స్త్రీ పురుషులు మాటాడునప్పుడు పాత్రోచిత ములైన కొన్నింటమాత్ర ముపయోగింపఁ దగుననియు, కాని భావములు మహోజ్వలములుగ రేఁగునపుడు ప్రకృతమునం దే యవధాన ముంచుట మంచిదనియు, నట్టితరుణముల సలంకార ములు సాధారణముగ నసంబద్ధ ప్రలాపము లే యనియు, శబ్దా లంకారము లంతగా ముఖ్యములు కావనియు శ్రీ రెడ్డి గారి మతము, కుయుక్తుల చేతను, దీర్ఘాలోచనము చేతను, శేషాదుల సాయము చేతను బలవంతముగ నీడ్చి తెచ్చిన యలంకారములను విసర్జించిన 'నేంతయో బాగనియు, నట్టి విపరీతాలంకారరచనకుఁ బ్రేరేపకము భావశూన్యతయే యనియు, హృదయము భావ పూరితమై యున్నప్పుడు సాదృశ్యములపై కి దృష్టి చనదనియు శ్రీ రెడ్డి గారు సోదాహరణముగ నిరూపించిరి.

వీరి సిద్ధాంతమును బూర్వపక్షము సేయుటకై మన్మిత్రులగు శ్రీ కురుగంటి సీతారామయ్య గారు “అలం కార తత్త్వవిచారము” అను గ్రంథమున నలంకౌరము లావశ్యకములని సిద్దాం తముఁ జేయఁజూచిరి. ఆగ్రంథమును విమర్శించుచు శ్రీ రాయ ప్రోలు సుబ్బారావుగారు శ్రీ సీతారామయ్యగారి వాదము నాక్షేపించి శ్రీ రామలింగా రెడ్డి మతమునే సమర్థించిరి

శబ్దార్థాలంకారముల తారతమ్యము. పూర్వలాక్షణికమతము.

కాని, యిచ్చట నొక చిన్న తమాషా యున్నది. అది యేమనఁగా - అలంకారము లావశ్యకము లనినచో , శబ్దా లంకారములను కూడ నొప్పికొనవలసివచ్చుచున్న దనియు, నట్టి శబ్దాలంకారములను మనలాక్షణికుల ప్రథానములని నిరసించిరి కావున వానికి' మనము ప్రాధాన్యము నొసఁగఁదగదనియు, నందుచే నలం కారము లనావశ్యకములన్న చో శబ్దాలంకార ముల సంగతి చల్లఁగా దాఁట వేసి మఱుఁగు పఱచవచ్చుననియు, సహజములును, నప్రయత్నముగ వచ్చునవియు నగు నర్గా లంకారములకు మాత్రము తావుండియే తీఱుననియు, అందుచే నలంకారము లనావశ్యకములని, 'చెప్పుట సులువైన మతమని వీరు భ్రమించు చున్నారు. దీనికిఁ దార్కాణముగ శ్రీ రాయ ప్రోలు సుబ్బారావు గారు మమ్మట పండితరాయ లిరువుర యొక్క కావ్యవి భజనము నాధారముగఁ గొని, ధ్వని ప్రధాన కావ్యము లుత్తమోత్తమము లనియు, ధ్వనికన్న వాచ్యమగు నర్థమే ప్రధానముగఁ గల కావ్యములు ద్వితీయములనియు, నర్థ చమత్కృతి ప్రధానముగఁగల కావ్యము లధమములనియు, శబ్దచమత్కృతి ప్రధానముగఁ గల కావ్యములు కావ్యములు కానే కావనియు. నట్టి వరమాదమములనియు బండితరాయలు. శాసించెను. మమ్మటాచార్యులు ఆర్థచమత్కృతి ప్రధాన ముగాఁ గల కావ్యములను శబ్దచమత్కృతి ప్రధానముగాఁ గల కావ్యములను నేక గౌరవారములుగ భావించి రెంటిని నధమములని నిరసించెను.

అలంకారము లనావశ్యకములు. శబ్దార్థాలంకారములు సమాన గౌరవార్హములే.

మామతము మమ్మటాచార్యుని మతమే. ఏలననఁగా:-- అలంకారము లనునవి యనావశ్యకములు గనుకను, సహజ. సుందరమగు నాకృతు లలం శారములు లేక నే భాసిల్లును గను కను, కావ్య విషయమునఁ గూడ నలం కారము లనావశ్యకము లనీయు, సహజ మాధుర్యమును సహజ సౌందర్యవర్ల నాపటిమ గల కావ్యముల నలం కారములకు నవసరములే యనియు సిద్ధాంత మగుచున్నది. కావ్యమునకు సహజ మాధుర్యమును, స్వభావన్సౌందర్యమును నాపాదించు శక్తియు లక్షణమును నెది? ఆను విషయమును తరువాత జర్చించెదను, ప్రస్తుత మనావళ్యకములగు నలంకారములలోఁ గొన్నిటి నంగీకరించి కొన్నింటి సంగీకరింపకపోవుటకుఁ దగిన కారణము లేవియో నిరూపించి నాకుఁ దోఁచిన యభిప్రాయము నొసంగెదను. *పండ్లూడఁగొట్టుకొనుట కేరాయియైన నేమి' అన్నట్లు స్వార స్యముఁ జెడఁగొట్టుట కర్థాలంకార మైన నేమి, శబ్దాలంకార మైన నేమి? ఒకటి మేనత్తమామల బిడ్డయై వేదొకటి కా లేదా? రసమున కాభాసము గల్గునట్లు వర్ణింపఁబడిన రెండును రోఁత జనింపఁ జేయును. ఇఁక రసమును బెంపొందించుటకు మితముగ వాడినయెడల రెండును బనికివచ్చును.

శబ్దాలంకారములకుఁ గొన్ని యుదాహరణములు. -


చూడుఁడు. పోతనామాత్యుని భాగవతము బహుళ సంఖ్యాకములగు శబ్దాలంకారములచే నిండియుండినను నంత నింపు నింపుచున్న దేల? భాగవతమున విష్ణు స్తోత్రముఁ జేయుచోట్ల పొరవశ్యమున పోతన యెన్ని శబ్దాలం కారముల వాడ లేదు? ఆపద్యములు మనకు నిరంతరము సంతోషమును, ఆనందమును గూర్చుట లేదా? నిసర్గముగ నర్థాలంకారము చేసికొన్న మహా పుణ్యమును లేదు, శబ్దాలంకారము గావించిన మహా పాపమును లేదు. రెండును పాపపుణ్యముల విషయమున సమానము లే. శబ్దాలంకారములు రసమును పోషించిన వనుటకు భక్తగీతము పన్ను లనఁదగు రామకర్ణామృత-కృష్ణకర్ణామృత గీతగోవింద భాగవత కావ్యముల నుండియుఁదుదకు భారతమునుండియుఁ గూడ నెన్నేని యుదాహరణములఁ జూపింప వచ్చును. చూడుఁడు! గజేంద్ర, మోక్షణమున గజేంద్రుని మొఱ నాలకించి భక్తునిఁ గాచుటకై యేరికిం జెప్పక యేఁగు శ్రీవిష్ణుమూర్తిని గాంచి లక్ష్మీ దేవి,

 “అడిగెద నని కడుపడిఁ జను
నడిగిన దను మగుడ నుడువఁ డని నడయుడుఁగు౯
వెడవెడ జిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడల౯."

అని పోతన వర్ణించిన పద్యపు నడకయందునను, యమకమను. శబ్దాలంకారమువలనను శ్రీలక్ష్మీ దేవి యొక్క మనస్సులోని, తత్తరమును, నలజడియు, సౌందోళనమును, నింక నితరము లగు భావములును నెట్లు సందడించుచున్నవో! ఏదీ ఈపద్య, భావమును మార్చి యాశబ్దాలంకారము దీనివైచి యద్దాని భావమును పూర్తిగ వేఱుపదములఁ జెప్పి మెప్పింపుఁడు. భారతమున సభిమన్యుని మృతి కై జాలిఁ జెందుచు సర్జునుఁడు,

ఉ. హాయను ధర్మ రాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁ ;
న్నేయనుఁ దల్లి నేపఁజను నే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటిబోవఁ దగవే యను నేగతిఁ బోవువాఁడ 'నే
నోయభిమన్యుండాయనుఁ బ్రియోక్తుల నుత్తరం దేర్పవేయనున్.

అని విలాపించిన పద్యమునందలి శబ్దాలంఠారము 'వెగటుపుట్టిం చుచున్న దా? సంస్కృత భ క్తిగీతములనుండి యుదాహరణములు


నెన్నేని యీయవచ్చును, గ్రంథవిస్తరభీతిచే స్థాలీపులాకన్యా యమునే ,యనుసరించితిని. కావున మితముగను, నౌచిత్య మున కనుగుణముగను, వాడిన శబ్దాలంకారములును నర్థాలం కారములును గూడ సమానముగ రసమునకు దోహద మొన గూర్పఁగలవు. మితమును, నౌచిత్యమును గుర్తెఱుఁగక పిచ్చిగా వాడిన రెండును రోత జనింపఁ జేసియే తీఱును. కావున శబ్దాలంకారముల విషయమున మనవా రీయన్యా యముఁ గావించుట తప్పని నావిజ్ఞప్తి, వెనుకటి కొక యమ్మ “అల్లునితలకు నెయ్యి లేదు, అల్లునితో వచ్చినయతని తలకు నూనెయు లే”దనఁగఁ జమత్కారియగు నాయల్లుని స్నేహి తుఁ డాపెను "ఆమ్మా, ఆరునెలలనుండి యుబ్బసమురోగము తోఁ జచ్చిపోవుచున్నాను. లేదనుకాడికి నాకును నెయ్యియే లే దనవమ్మా" అని బ్రతిమాలి పరిహసిం చెనఁట, ఆపరిహాస మును రసీకు లీ సందర్భమున యథోచితముగ నన్వయించికొందు రుగాక. '

ధ్వనివిషయము,

“అనలంకృతీ పునః క్వా పి"అను మమ్మటుని పల్కుల నాధారముగఁ గొని కావ్యము లేయలం కారములు లేకున్నను సహజసౌందర్యముపల్లను, భావభరమువల్లను, రసబంధు రత్వమువల్లను నింపు నింపుననియు సోదాహరణముగ సిద్ధాంతముఁ జేయవచ్చును. అనలంకృతములై, శాకుంతలము లోని శ్లోకచతుష్టయము, భవభూతియొక్క, కరుణరస ప్రధాన ములగు శ్లోకములును, తిక్కనయొక్క రసబంధురపద్యసహ ప్రంబులును రసికుల చిత్తముల రంజింపఁ జేయుట లేదే? ఉదా హరణముల సాహితీపరిచయులే వెదకికొందురుగాక, ఇంక ధ్వనివిషయము కొంచెము సూచించెదను.

రాజుగారి పెద్దభార్య పతివ్రత యనఁగ నే రాజుగారి చిన్న భార్య లంజ యను నర్థ మెట్లు స్ఫురించుచున్నదో ఆతీరే ధ్వని యందురు. అనఁగా మాటలవలన ప్రత్యేకముగఁ జెప్పల బడక పోయినను వానిచే సూక్ష్మముగ సూచింపఁబడు భావమే ధ్వని యగుచున్నది. ఎట్లన మనము రాజుగారి చిన్న భార్య లంజయని ప్రత్యేకించి చెప్పకపోయినను అట్టియర్ధము స్ఫురించు చునేయున్నది. ఉదహరణము కొంచెము మోటుగ నున్నను భావమును సులభముగను, గొట్టవచ్చినంత ప్రత్యక్షముగను దెల్పున దగుటచే గ్రహింపబడినది. పాఠకులు మన్నింతురు గాక. ఈధ్వనికి వ్యంజన యను నామాంతరముగూడ వ్యవహారమున నున్నది.

- ధ్వని త్రివిధము ౧. శబ్దధ్వని

ఇట్టిధ్వని త్రివిధము. శబ్దధ్వని, అర్థధ్వని, భావధ్వని యని శబ్దమువలన నే అనఁగా శబ్దముల కూర్పువలననే వాని యొక్క నాదమువల్ల నే యర్థము స్ఫురించిన చో నయ్యది శబ్దధ్వని యనఁబరఁగును. చూడుఁడు. పెద్దన మనుచరిత్రలోని హిమవత్పర్వతవర్ణనమున,. . .

చ. అట జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజరీ
పటల ముహుర్తుహుర్లుఠ దభంగ తరంగమృదంగ నిస్వన
స్ఫుటనటనాను రూపపరిఫుల్ల కలాపికలా పజాలమున్
గటకచరత్క రేణుకరకంపితసాలము శీతశైలమున్.”

అనుపద్యమున' "అంబరచుంబి శిరస్సరజరీపటల ముహుర్ముకు TOP ________________

ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వసస్ఫుటనటనానురూప పరిఫుల్లక లాపికలాపజాలమున్” అనుపదముల కూర్పుననే వాని యక్షర ధ్వనివలననే గంగాతరంగ సంఘట్టసకోలాహలము ధ్వనింపఁ జేసి నాఁడు.

2. అర్థధ్వ ని.

ఇంక అర్ధధ్వని యనఁగా నొకయర్థమువలనఁ బ్రత్యేకముగ వాచ్యము కాని వేరర్దములు స్పరించుటయే. ఈయర్ల ధ్వనియే మన కావ్యముల విరివిగ వాడఁబడుచున్నది. కావున దీని కుదాహరణములను వెదకుపని పాఠకులకే వదలివేయు చున్నాను.

3. భావధ్వ ని

.

ఇంక భావధ్వని సంగతి కొంచెము సోదారణముగఁ దెల్పె దను. ప్రత్యేకముగ శబ్దము చేతనుగాని, అర్థము చేతనుగాని సూచింపఁబడని వేఱు అర్ధము భావము చేత మొత్తముమీఁద సూచింపఁబడిన నయ్యది భావధ్వని యందురు. ఇట నొక భావము వాచ్యముగ నుండి వేరొకభావమును "మొత్తము మీఁద ధ్వనింపఁ జేయును. చూడుఁడు. ఈ క్రింది భావగీతమున నీ భావధ్వని యెట్లున్నదో!

“వీణెచేజారిపడిపోవు వ్రేళ్లు శ్రుతుల
నింపుగా మీటి రాగ మొప్పింపకుండె
గొంతు బొంగురుపోయెడు నెంత ఛించు
కొంచుఁ బాడిన నీవు గాన్పించవేమి?
హాయిలో ముంగి మాయమైపోయినావా,
పరవశత నొంది భక్తుని మజచినావో

దేవ! సోకింక నెపుడు నీదివ్యదర్శ నమ్ము
నిచ్చెదు? నాపాట కంత మెపుడు?

ఇచట భావ మేమన, భక్తుఁడు వీణ వాయించి వాయించి గొంతు బొంగురుపోవునట్లు పాడిపాడి, భగవంతుఁడు ప్రత్వ క్షము గామికి వగచుచున్నాఁడు. ధ్వనితమగు వేరొక భావము భక్తుని హృదయము భగవంతుని దర్శనమునకై తపించి తపించి, ప్రార్ధన గావించి కౌవించి, భగవద్దర్శనమును బొందఁజాలక పోవుటయే. వాచ్యమగు భావము పాటకుఁడును, వైణికుఁడును నగు భక్తునికి స్థూలముగ పర్తించును. వ్యంగ్యముగ ధ్వనించు భావము పాట తోడను, వీణె తోడను సంబంధము లేని భక్తుని హృదయార్తికి సూక్ష్మముగ వర్తించును.

ఇట్టి త్రివిధమగు ధ్వనియే 'కావ్యమునకుఁ బ్రాణమని మన లాక్షణికులలో రసిక వర్గమువా రంగీకరించిరి. ధ్వనియొక్క ప్రాధాన్యమును మనవారిలో మొట్ట మొదట నుద్దేషించినది “ధ్వన్యాలోకన" కర్తయగు నానందవర్ధనుఁడను రాజరసికుఁడే తరువాత నెల్లరు నతని వాక్యములఁ బ్రమాణములుగ నంగీక రించిరి. పాశ్చాత్యులలోఁగూడ Suggestion ధ్వన్ని ప్రధానమని మ్యాలర్మే, పోల్ వెర్లెయిన్ మొదలగు రసజ్ఞు లొప్పికొనిరి. కవులును ధ్వనిని మిక్కిలిగ పాటించియే యున్నారు.

శైలిగుణములు. అరవిందుని మతము... తుష్టి,

అరవిందయోగి కావ్య మాధ్యాత్మికశక్తి ప్రదర్శక మనియుఁ గావ్యానందము బ్రహ్మానందమే యనియు, నట్టి బ్రహానంద మలవడుటకు పూర్వము కావ్యము వివిధ పరిణామముల నందు ననియు, నట్టి కావ్య పరిణామములు బుద్ధి, అంతగకరణ, చిత్తము, ఆత్త, మొదలగు వానిని, వానివానియొక్క శక్తిని, అధికార మును ననుసరించి రంజింపఁజేయుననియు, నట్టికావ్యానంద పరిణామముల ననుసరించి శైలియు చతుర్విధములుగ నుండి కావ్యమును బోషింపుచు శబ్దసిద్దిగఁ బరిణమించుననియు, నట్టి కావ్య శైలి తుష్టిఁ గూర్చునదియుఁ, బుష్టిఁ గూర్చునదియుఁ, గాంతి గూర్చు నదియు, బ్రహ్మానందముఁ గూర్చునదియు నను నాలుగు తరగతులుగ ప్రయుక్తమగు చుండుననియుఁ దెల్పి శైలివిషయ మున తుష్టి, పుష్టి, కాంతి, బ్రహ్మానందము లనుపదముల కర్ణ మేమో సోదాహరణముగఁ జర్చించియున్నాడు. ఆభావములను నాంధ్ర పద్యోదాహరణములతోడ వివరించెదను.

శైలితుష్టి" యనఁగా అర్థమునకు మాటకును గల సాధారణమైత్రి యే. ఇందు విషయసాక్షాత్కారముగాని, పద సాక్షాత్కారముగాని యుండక, పదములకును నర్ణములకును పచనమునఁబలె సామాన్య మైత్రి మాత్రమేయుండి విశేషోత్తేజకమగు ప్రభావమేమియు లేకుండును. ఇయ్యది బుద్ధినిమాత్ర, మే రంజించును. ఉదాహరణము.

 కోపము సుబ్బును గర్వము
నాపోవని యునికియును దురభిమానంబును ని
ర్వ్యాపారాత్వము ననునివి
కాపురుషగుణంబు లండు కౌరవనాథా! (భారతము)

క. కరయుగములు చరణంబులు
నురము లలాటస్థలంబు నున్న తభుజముల్
సరిధరణి 'మోపి మొక్కినం
బరువడి సాష్టాంగమండ్రు, బరమమునీంద్రుల్',

2.పుష్టి

“శైలిపుష్టి" యనఁగా భావమును గంభీరముగను, సొలం కారముగను, శక్తియుతముగను వర్ణించుట. ఇచ్చటను గూడ సాత్కార బలిమి తక్కువగనే యుండును. కాని పదగుంభ నము, అలంకారములు, శబ్దధ్వని మొదలగునవి భావ మునకుఁ బుష్టియు, బలమును నొసంగి యహంకారమును రంజించును. ఉదాహరణములు .

ఉ. ఊహకలంగి జీవనఫుటోలమునన్బడి పోరుచుజా మహా
మోహలతానిబద్ధపదము విడిపించుకొనంగ లేక సం
దేహము నొందు దేహీ క్రియ దీనదళణ గజ ముండె భీషణ
గ్రాహదురంత దంతపరిఘట్టితపొదఖురాగ్ర శల్య మై..

'సీ, కడు బెట్టిదంబగు గాలిఁ దూలిన
కమనీయసాలభూరుహముప్కో
బ్రబలకి రాతమార్గణములఁ దెళ్లిన
'రాజితవస్య పోరణముమాడ్కి
గల్పాంత వాయుసఖస్ఫురణంబున
నివిరిపోయిన మహార్ణవముకరణి
గాలపర్యయమునఁ దూలి మేదిని మీఁదఁ
బడిన పూర్ణేందుబింబంబుపగిది

ధరణిఁ బడియుండియును నొప్పుందఱుగకున్న
యన్న రేశ్వరుఁ గనుఁగొని యడలు నెడుల
తోడమేనులుదూలఁగఁ దొలువడుచుఁ
జేరియాతనిచుట్టు నాసీను లైరి. (భారతము శల్యపర్వము)

3. కాంతి.-

"శైలిశాంతి” ! భావసాక్షాత్కారమును 'మెఱుఁగుఁ గాంచినయ ట్లనుభవించి, తత్సాక్షాత్కారలబ్దమగు భావమును. స్తరణము వలనను, భావనాబలమునను మనసు రంజించునట్లు వర్ణించిన నాశైలి కాంతిఁగల దగును. ఇట సాక్షాత్కార మున్నది కాని కవియొక్క వ్యక్తి పూర్తిగ లీనమై విస్మృతము కాలేదు. ఉదాహరణము.

.

"ఓలిశృంగంబు లెత్తిన కేలుగాఁగ
నిర్ఘ రంబుల పెను మ్రోత నిగిడి బారయ
గిరులు జనక రాజాత్మతజ పరిభవంబు
జగము లెఱుఁగ నా క్రోశించుపగిదిఁ దోఁచె.”
(భాస్కర రామాయణము.).

“కూటికడవను బుజముపై నిడు
పాట మదియొక మురువుగులకఁగ
పాటపాడెను పాటలాధరి
చెట్లు చామలకె
పాటపాదడెను చెట్లుచామలు
కోటి చెవులను గోయలరఁగ
తాటివనముననాగిచంద్రుడు
తాను చెవియొగ్గన్."

గురజాడ అప్పారావు లవణ రాజుకల.};

ఇట్టియపూర్వకాంతి విలసితములగు పద్యములు భారత భాగవతముల నెన్నే నీఁ గలవు. కావున వానినుండి యుదాహ రింప లేదు.

ఇక బ్రహ్మానంద జనకత్వము. - ఇఁక బ్రహానందము నిచ్చు శైలి యెట్టిదనఁగా? భాష సాక్షాత్కారముఁ గలిగి భావమున లనుఁడై పోయిన కవినోట యమృతమువో లే, శివుని శిరముననుండి భువికి దిగు గంగా నిర్ఘరిణివోలె నప్రయత్నముగ, నిరలంకారముగ, ప్రకృతి మధురముగఁ, దనంతటఁదానే, కవి యసునతఁడు లేనట్టిరీతినే, వెలువడు పదజాలమే, భావమే, యిట్టి బ్రహానందమే యాత్మను గురించి పవిత్రముఁ జేయును. ఇట్టి బ్రహ్మానంద జనకములగు పద్య ములు. భారత భాగవతములఁ బెక్కుచోట్ల నున్నవి. కాని, యీ బ్రహ్మానందముఁ దిరముగ నేకస్థాయిని నుండుట యరుదు. సాధారణముగఁ గాంతి, పుష్టి మొదలగు కావ్యశైలి గుణములతోఁ గలసి మెలసి వర్తించును. సర్వస్వతంత్ర భావనా శక్తిని గూర్చియుఁ గవియొక్క.. దివ్య దృష్టిని పరకాయ ప్రవేశ ప్రభావమును సూచించు పద్యములఁ గొన్నిటిని గత ప్రకరణ మున సుదాహరించితినే, అవియన్నియు నీ బ్రహానంద జనక శైలి కుదాహరణములే యని యెఱుంగునది. ఇంక రెండు మూఁ డుదాహరణముల నొసంగెద:....

సీ కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ
సురికిన నోర్వక యుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచురయమునం
బై నున్న పచ్చనిపటము జార

 నమ్మితి నాలావు నగుఁబాటునేయకు
మన్నింపుమని క్రీడి మరలదిగువం
గరికి లంఘించు సింహంబుకరణి మెరసి,
నేఁడు భీషుని జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జునయంచు మద్విశీ ఖదృష్టిఁ
దెఱులి చను దెంచు దేవుండు దిక్కు నాకు.
(భాగవతము.)

మ. అల లేలే, కతిశాంతమై విమలమై యంతంతకుం జూడఁగాం,
తులకిల్లైమెఱుఁగారు నాసరసి నేదో దూదిపాన్పుం దు ము,
ద్దులమూటై పవళించుచొంటి నటు లెందుకా బోదువానీల రే,
వెలుఁగా కన్ను లమ్రోల సట్టె దిగిరావే పట్టి ముద్దాడెదన్. (పాటిబండ అప్పారావు.)

3. చూడఁజూడ నీరూపము
సుందరమై యొప్పు దేవ!
సొక్కి సొక్కి. నీవలపున
సోలి పరవశత్వగందును!
వినఁగవినంగ నీనామము
వీనులవిందౌను నాథ!
చనఁగచనఁగ నీజాఁడల
సౌఖ్యముమునుముందె తోఁచుఁ
దలఁపఁదలఁప నీలీలలం
దనువు పులకరించు స్వామి!
వలచివలచి దేవ! నిన్నె
వంత లెల్ల మఱచిపోతి.

4. ఆడవె! ఆడవె!
అన్ను లమిన్నా'
ఆడవె లేనడు
మల్లలనాడ ఆడేడు నీనడు మందముఁగాంచిన
నల్లాడవే ప్రేమను లోకంబుల్,
పొడవె! పొడవె! .
భామామణిరో
పాటలాధరము
బాగులుఁగుల్కఁగ
వలపుఁజిల్కు- నీపాటల విన్నన్
బరవళగా దే ప్రకృతి యెల్లన్.
చూడవె! చూడవె!
సుందరవదనా
సోఁగకన్నులన్
సోలఁగఁ బ్రేమము.
సొంపులొల్కు నికో జూచినంతనే
చుక్కలుపై తముసోలవె ప్రేమన్.

ధ్వని ప్రధానములగు నుత్తమోత్తమ కావ్యముల నిట్టి యుదాహరణము లెన్నేనిఁ గలవు. ఇచ్చినకొలఁది, నుదాహర ణములు కావలేననియే యుండును. “Asif increase of appetite grows by what it feeds on" తిన్న కొలఁదిని యాఁకలి యెక్కువ

యగుచుండును. అని షేక్స్పియరు పలికిన పలుకులయం దెంత సత్యము కలదు? భావసాక్షాత్కారమును, శబ్దసిద్ధియును, నిట నభిన్నములై, యభేదములై, యవినాభావసంబంధము కల వియై యేకార్థ ప్రతిపాదకములై, బ్రహ నంద జనకములై యిట్టి నిరలంకృతధ్వని ప్రధానసహజ మధురపద్యములు జన్మించుట కవకాశము నొసఁగుచున్నవి.

సారాంశము.


కావున శైలియొక్క, సౌందర్యమును పోషించునది యలంకారములుగాక సౌక్షాత్కారబల మనియు, సట్టి సాక్షాత్కారబలముఁ గలిగిన వారికి క్రి యాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకర ణైః” అన్నట్లుగ నలం కారములును, రీతులును, వృత్తు లును ననవసరములనియు, నట్టి సాక్షాత్కా రము లేనివా రెన్ని యలం కారములఁ గూర్చి వ్రాసినను వారి కవిత యెరువుసొమ్ములు పెట్టుకొన్న 'పేరంటాలువోలే, గంతలబొంతలఁ దగిలించికొన్న గంగి టెద్దునో లె, సకలభూషణాలంకృతమైన రాతిబొమ్మవోలె, హాస్యాస్పదముగను, రసాభాసకరముగను, నిర్జీవముగను మాత్ర మే యుండును. శైలియొక్క స్వభావమును నడిపించెడునది కవియొక్క చిత్తవృత్తియుఁ, జిత్తసంస్కారమును, రసభావమును, సాక్షాత్కారమును, శబ్దసిద్దియు నేగాని, వట్టి పై పై మెఱుఁగులగు నుపమోత్ప్రేక్షాద్య లంకారములు కావనియు, రసమే, కవియొక్క ప్రతిభయే, శైలిపై సధికారు లనియుఁ దిరిగి యొకమాఱు పాఠకులకు హెచ్చరించి యీ ప్రశంసను ముగించుచున్నాను.

ఆంధ్ర కవిత్వ-18

2.చందోవిషయములు

కావ్యము రసాత్మకము. రసము భావానుభూతియే. భావములు శబ్దసూచితంబులు. శబ్దము లక్షరసముదాయములు. అశురములలో ప్రతి దానికిని నాదము, ధ్వని కలదు. కావున తర్కరీత్యా, నాదము నొసఁగు నశురముల కలయిక యగుటచే శబ్దమునకును నాదము కలదు. శబ్దముల సముదాయమే భావ మగుట చేత శబ్దములకు ధ్వని యుండుటవలన శబ్దసముదాయ మగు భావమునకును ధ్వని కలదు. భావమే రసమగుట చేతను, రసమే కావ్యమగుట చేతను రసమునకును రసముద్వా రా కావ్య మునకును నాసము, ధ్వనియు నుండి తీఱును, అక్షరములను, అర్థములను, భావములను నాశ్రయించినచగుట చే నీనాదము శుద్దసంగీత నాదమంత నిశితముగ నుండడు. కాని, యంతకన్న నెక్కుడు విచిత్ర విశాల వ్యాప్తి గలదిగను, వైవిధ్యము గలదిగను నుండును.

కావ్యమునకుఁ బద్య మవసరమా?

ఈఅక్షర, భావార్థముల నాశ్రయించికొనిన నాదము యొక్క గతియే, నడకయే ఛందస్సు. ఈచంధస్సుయొక్క నియమబద్దస్వరూపమే పద్యము. కావునఁ బద్యమును ఛంద స్సును కావ్యమున సవసరములని చెప్పకతప్పదు. ఈఛందస్సు నియమ సహితమా? అట్లైన సనీయమము లేట్లు కల్పింపఁబడినవి? ఆనియమము లవసరముగ నసుష్ఠింపఁదగినవా! అట్టి నియమముల తత్త్వమును పరమార్గమును సెట్టిది? ఛందోనియమములు పరిమిత సంఖ్యాకములా? . ఆను ప్రశ్నల నీసందర్భమున విచారింప పలేను. ఒక్కొక ప్రశ్నమున కెంతయైన వ్యాప్తి యున్నది. కాన సమాధానముల నూరక సూచిం చెదను, ఛంపస్సు నియ మసహితమనియు, నాదము నియమసహితము కానిచో గందర గోళముగ నుండుననియు, సృష్టి యంతయు నియతికృతనియమ బద్దమయినట్లే ఛందస్సుఁగూడ నియమబద్దమై యుండుననియు, నట్టి ఛందములు ప్రస్తార భేదముల సనుసరించి యనంతములుగ నుండుననియు సంస్కృత లాక్షణికుల మతను. ఇందులకుఁ దార్కాణముగ వాల్మీకివదనమునుండి శోకము ఛందోబద్ద మగు నసుష్టుప్ శ్లోకరూపమున నప్రయత్నముగ వెలువడే ననియు, నట్టి యనుష్టుప్ ఛందముయొక్క ప్రస్తారము లేయనం తములగు ఛందము లగుననియుఁ జెప్పుదురు. కానీ వారిలోనే కొందఱు ఛందోబద్దముగ నున్నను, లేకపోయినను సరే, రసాత్మకముగ నున్న గద్యయైనను సరే కావ్యమగుననియుఁ, గవిత్వము గద్య కవిత్వము పద్యకవిత్వము సని ద్వివిధములుగ నుంట చే కావ్యమునకు పద్యము ముఖ్యమును నవసరమును కాదనియు రసము మాత్రమే ముఖ్యమనియుఁ జెప్పుచున్నారు.

పాశ్చాత్య విమర్శకుల మతము, వాట్సుడంటర్ 1 పండితుని సిద్ధాంతములు.


పాశ్చాత్య విమర్శకులలో నీ ఛందోవిషయమగు చర్చ చాలమంది చేఁ జేయఁబడినది. ఆరిష్టాటిల్, వర్డ్సుపర్తు మొన లగువారు పద్యము శావ్యమునకు ముఖ్యము కాననియు, అలంకౌరమాత్రమే యనియు వాదించిరి. జాన్సన్ కాలరెడ్డి, షెల్లీ, వాట్సుడంటన్, సెయింట్సుబరీ మొదలగు వాకు పద్యము ముఖ్యమనియుఁ గావ్యమునకు ప్రత్యేకవై లక్షుణ్యము నాపా దించు గుణములలో పద్యమును ఛందస్సును ప్రధానములును నవసరములు నని వాదించిరి. వాట్పుడంటన్ పండితుఁడు “కవిత్వ” మనువ్యాసమున కవికల్పితపద్య ఛందోగతి కతీతమగు ప్రకృతి ఛందోగతి (Rhythm of Nature) యున్న దనియు, నయ్యది పిట్టల కలకలమునందును, సముద్ర తరంగములధ్వని యందును, వాయు నాదముల యార్బాటములందునను ధ్వనించు చుండుననియు నట్టి ప్రకృతి ఛందోగతి పద్యమునకును, గద్య మునకునుగూడ కలదని వాదించిన యీ వాక్యములు సరసులకు గ్రాహ్యములు:-- Perbaps it may be said that deeper than all rhythms of art is that rhythm which art would fain catch the rhythm of nature; for the rhythm of nature is the rhythm of life itselfThis rhythm can be caught by prose as well as by poetry, such prose, for instance, as that of the English 'Bibler Certainly the rhythm of verse as its highest, such, for instance, as that of Sbakespear's greatest writings, is nothing more and nothing less than the metre of the energy of the spirit which surges withid the boson of him, who speaks, whether he speaks in verse or in impassioned prose. Being rhythm, it is of course governed by law, but it is a law which transcends in subtlety the conscious' art of the metricist and is only caught by the poet in his most inspired moods, a law, which being part of nature's own. Sanctions, can of course never be form mulated but only expressed as it is expressed in the melody of the bird, or in the inscrutable harmony of the entire birdchorus of a thicket, in the wbisper of the leaves of the tree and in the song or wail of wind and sea. Now is not this rhythm of nature represented by that "Sense rhythm" whic prose can catch as well as poetry ? అట్లయ్యుఁ బద్య ఛందమునకును ప్రకృతి ఛందస్సు నాధారముఁ జేసికొన్న గద్య ఛందమునకును నిసర్గమగు భేదము కలదనియు, గద్య ఛందమున వ్రాయునతఁడు. పద్య ఛందము వ్రాయఁబోయి రెంటికిం జెడినవాఁ డగుననియు వాదించినాఁడు వాట్సుడంటను పండితుఁడు.

కాని, ప్రపంచసౌహిత్యమును విచారించితి మేని ఎల్ల దేశములను పద్యము ముందు పుట్టి గద్యము తరువాతఁ బుట్టి నట్లు స్పష్టమగు చున్నది. హృదయభావము నిశితముగ నున్న పుడు ఆక్రందనమునకు నీడువచ్చు పచ్యమే మొదట వెలుపడు ననియుఁ, బిమ్మట నాలోచన ముదిరిన తరువాత గద్యము వెలువడుననియు సర్వసాహత్యముల చరిత్రములును వ్యక్తముఁ జేయుచున్నవి. ఈభావమునే వాట్పుడంటన్ పండితుఁడు జన్మతః కవియగు వానికి సొదరూప నాదభరితమగు Emphasis of Sound) పద్యమే ముందు స్పురించుననియు, సట్లు కానియతనికి అర్థభారయుతమగు(Emphasis of sense)గద్య మే స్ఫురించు ననియుఁ గవియైన వాడెప్పుడును పద్యముననే వ్రాయు ననియుఁ జెప్పినాఁడు. ప్రపంచమున ఛందస్సు లేకుండ కావ్య ముల వ్రాసినవా రెవ్వరును నింతవరకు లేరు. ఆ మెరికా దేశ స్థుఁడగు పొట్టువిటన్ (Walt Whitman) అనునతఁడుమాత్ర, మీందులకు మినహాయింపు, గద్యరచయితలను కవులని పిలుచుట యాదరభావముననేగాని, సత్యము విచారించి యట్లు పిలుచుట దగునని నమ్ముటవలనఁ గాదు. గద్యము గద్యమే, పద్యము పద్య మే, దీని సొంపు దానిదే, దేని గౌరవము దానిదే. ఒక దానిలో నొకదాని నిరికించుట పొసఁగని మతము. ________________

అక్షరమా త్రాచ్ఛందములకుఁ గల సంబంధమును, తారతమ్యమును. 

ఛందోరూపము లమితసంఖ్యాకములని యిదివరకే తెల్పియుంటిని. ఛందస్సునకు బీజము నాదమే. అట్టినాదము ద్వివిధావస్థలతో నొప్పుచున్నది. అక్షరములను శబ్దములను నాశ్రయించి కొనిన ఛంద స్సశురఛంద స్సగుచున్నది. అయ్యది గురులఘు భేదములపై నా ధారపడియున్నది. ఇఁక సంగీతమునకు సంబంధించిన ఛందస్సు మాత్రలయెుక్క సంఖ్యపై నాధార పడియున్నది. గురులఘువుల భేదము మన దేశమున విద్యార్థులకు, సైతము తెలియునుగాన దానిని గూర్చి చర్చించను. ఇంక మాత్ర యనఁగా నిమేష కాలమును తెప్పపాటు కాలమున నుచ్చరింప వీలగు నాదపరిమితీయే. కాన కవితయం దీ మా త్రాఛందస్సుపయోగింపఁబడు చున్నది. మా గ్రా ఛంశస్సునకును, ఆక్షర ఛందస్సునకును నొకరకమగు సమన్వయముఁ జేసి మా త్రా చ్చందస్సును కావ్యమున జొప్పించి యంగీకరింప వచ్చును. ఒక్కొక గురువునకు రెండు లఘువులు సరివచ్చును. లఘువొక్కమాత్ర సరియగును. కావున గురువునకు రెండుమాత్ర లగును. మనవారు గణమన మూడక్షరముల సముదాయ మనుచున్నారు. అట్టిగణములు మూఁడు లఘువు' లకుఁ దక్కువగాకుండను, మూఁడు గురువుల కెక్కువగా కుండను నుండును. అందుచే గణము మూఁడు మాత్రలకు తక్కువ గాకుండను, ఆఱుమాత్రల కెక్కువ గాకుండను నుండును. కావున మాత్రల సంఖ్యనుబట్టి ప్రాయికముగ మూఁడు తరగతుల గణము.లేర్పడును. అవి యెట్టివన------ రూపక.

జంపె చాపుతాళగణములు, రూపకరణమునకు మూఁడుమాత్ర, లుండును. “చాపు" గణమునకు. నాలుగుమాత్ర లుండును. “చాపు” గణమున కైదుమాత్ర లుండును. "త్రిపుట” గణము రూపక-చాపుగణములు వరుసగానున్న వాని యొక్క కూడికయగును. అనఁగ నేడుమార లుండును. కాని మొదట రూపకరణమును, తరువాత చాపు గణమును నుండవలెను. మూఁడు గురువులు గల మగణము రెండు రూపకగణము లగును. ఈప ద్దతి ననుసరించియే మసపూర్వు లిట్టిమాత్రా ప్రధానము లగు ' ఛందోరీతులను రూపకము, జంపె, త్రిపుట, చాపు మొదలగు పేర్ల నే పిలుచుచుండిరి. అట్టి రూపకము నే పగడాల దండ యనియు, త్రిపుటనే ముత్యాల సరమనియు, జం పెనే ద్విపదయనియు, చాపునే జయ దేవ వృత్తమనియుఁ గొందరు పిలుచుచున్నారు. ఇంద్ర, సూర్య, చంద్రగణములకును నను గుణములగు మాత్రా, ప్రధానములైన ఛందోరీతు లున్నవి. పై ఛందోరీతుల యొక్క ప్రస్తారములును నమితములుగ నుండును. ఇట్టి మాత్రాఛందములు పద్యముయొక్కయు, పాటయొక్కయు లక్షణములనుగూడఁ గలిగియుండును. అందువలన పద్యముల సొమ్మగు నర్ణవ్యాప్తియు, వైవిధ్యమును, పాట సొమ్మగు గతి వైభవమును, నడక సొంపును, హాయియును, నీగాన కవితల లభ్యమగును, ఔచిత్యము నెఱింగి, యేఛందోరీతి నుపయోగించినను శాప్యమున నంగీకరింప వచ్చును. కొన్ని యుదాహరణముల నొసఁగి ముగిం చెదను.

1. రూపకము. చిన్న వోయె ముద్దు మోము కన్ను లంట నీఱుగారు


వన్నె తరిగి వాడె మేను
కన్నె యేలనే? ,


చాపు, చిలుకలు కొజికిన పందొక్కటి నా
చేతులఁ బడె నో దేవా తెలియునెట్లు తీయనిదో విసమో?
తినకుండఁగ నో దేవా!

3. త్రిపుట. చల్లగాలులు సాగియలలుగ
జల్లుజల్లున రాల్చే పూవుల
సుల్ల మల రెను ఆఁకలొక్కటే
బడబవ లెనడ లెన్

4. జంపె. పాడవే కోకిలా
పొడవే యింపుగా ప్రాణము ల్హాయిచే
పరవశ మొందఁగా పాటఁబాడవె తీయంగా
గోకిలా పాటఁటాడవె తీయఁగా,

మిగిలిన ప్రస్తారభేదము లన్నింటి కుదాహరణముల నొసంగుట పాఠకుల బుద్ధిచాకచక్యము నసుమానించుటయే యగును. కావున నట్టిపనిని మానెదను.

సారాంశము.

కావున నింత దీర్ఘ చర్చ చేఁ దేలిన దేమనఁగా, కావ్యము రసాత్మకమనియు, రసము భావానుభూతియే యనియు, భావము లనంతములగుట చే రసము లనంతములనియు, భావము యొక్క స్వరూపములగు శైలు లనంతములనియు, భావము యొక్క నాదరూపమగు పద్యరీతి శావ్యమునకు ముఖ్య మనియు, నట్టి పద్య రీతు లనంతము లనియును గ్రంథవిస్తర భీతి చే సుదాహరణముల మెండుగ నీయనందులకు పాఠకులు మన్నించి యాలోపమును దామే సపరించుకొందురుగాక.

- పద్యము ముందా? గద్యము ముందా? -

పద్యము ముందా? గద్యము ముందా? అను విషయమును విచారించి నిర్ధారించుటకు ముందు పద్యరచనకును గద్యరచన కును బ్రేరకములగు మానవస్వభావ విలక్షణములను పరిశీలింప వలయును. పద్యరచనను బ్రేరేపించునది భావౌత్సుక్య మనియే యిదివఱకు నిరూపించి యుంటిమి. భౌభౌత్సుక్యము గలవారు 'కామార్తులఁ బోలి ప్రకృతికృపణు లగుట చే దీర్ఘ విచారములఁ బొద్దుపుచ్చక, మీమాంసల పొంతఁ బోళ, దుర్గమతర్క సిద్ధాంత మహారణ్య ప్ర దేశంబులఁ జొజక, పౌర్వా పర్యముల విచారింపక కొండోకయెడఁ జేతనా చేతననిషయజ్ఞానశూన్యు లగుచుఁ గూడ నోటికి వచ్చినయట్లు, బుద్ధికి దోఁచినట్లు, కలము పోవునటులఁ బద్యము లల్లుచుఁ దమ హృదయ తాపమును శమింపఁ జేసికొందురు. కవికి జనాంతర సంస్కారము ముఖ్యమని గత ప్రకరణముల విన్నవించి యుంటిమి. అట్టి ప్రాక్తన సంచిత కవిత్వశక్తిగల కవి ప్రకృతిని జూచిన నొక నిముసమేనియు సూరక యుండఁలఁడు. ఏదేని యొక విషయముపై నాతని మనసు తగులకపోదు. అట్లు మనసు దగిలిన విషయము నాతఁడు ముందు పద్యమున వర్ణించునా? లేక గద్యమున వర్ణిం చునా? అనునదియే విచారణీయాంశము. కవియొక్క మాన సికావస్థకును, గద్యరచయిత మానసికా వస్థకును జాల భేదము గలదు. ఆ కారణముననే పద్య స్వభావమునకును గద్వస్వభావ మునకును ఎం తేని 'భేదము కలదు. ఆ భేదమును దన్మూలకారణ మగు మానసికావవి శేషములను కొంచెము విచారింతము.

సహజకవిస్వభావలక్షణములు.

-

కవియన నెట్టివాఁడు? ప్రపంచ మాతని కనుల "కెట్లు గోచరించును? ఈ ప్రశ్నకు యుగయుగములను, తరతరములను, దత్కాలస్వభావమువల్లను, అప్పటి కవుల సంస్కారవిశేషమువల్లను, పరిణతమగు నన్వయమే సమకూర్పఁ బడుచున్నది. కొన్ని యుగములఁ గవి సర్వశాస్త్ర పారంగతుఁడగు పండితుఁడని భావించిరి. కొన్ని యుగముల సొతఁడు శాస్త్ర పరిచయము లేక సహజముగ స్వతస్సిద్ధముగ నాకసమునఁ దిరుగాడుచుఁ బుష్పశాఖల నెక్కి మధురముగ గానముచేయు ,పక్షికులము బోలెఁ గవిత్వముఁ జెప్పునని భావించుచుండిరి. మామతమునఁ గవియనఁగ సహజకవియే యగుటచే సహజకవితా ప్రేరకమగు మానసికావస్థనే వర్ణించెదను.

1, స్వాతంత్య్రము పోతనకవి.-

సహజకవికిఁ బ్రపంచము సర్వము విశుద్ధముగను అద్బు తముగను భగవన్షయ ముగను గన్పించుచునే యుండును. సహజకవి మనము వెన్నవలె మెత్తనై యుండును. సహజకవి ఆడంబర రహితుఁడై వినయ సంపన్నుఁడై నిజమనోరథము నందే లక్ష్యము గలవాఁడై యుండును. చూడుఁడు. 'హాలికులా' యని

శ్రీనాథునిచేఁ బరిహసింపఁబడిన పోతనామాత్యుఁ డొసఁగిన ప్రత్యుత్తరమును.

 ఉ. బాలరసాలసాలనవపల్ల పకోమల కావ్యకన్యకం,
గూళల కిచ్చియప్పడుపుఁగూడు భుజించుటకన్న సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైననేమి? నిజదారసుతోదరపోషణార్థమై.

సత్కవిత్వసిద్ధియనఁ బరమార్థమునే లక్ష్యముగాఁ గలిగిన వారు 'బాలరసాలసాలనవపల్లవకోమల కావ్య కన్యకం, గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భజింప' నొల్లక నిజదారసుతోదర పోషణార్థము హాలికులును గందమూల కౌద్దాలికులును నగు. టకుఁగూడ సంశయింపరు. ఏయవస్థయం దున్నను వారికి గావ్యపరమార్దమే లక్ష్యముగా నెప్పుడును గన్ను లఁగట్టుచుండును. నిరంతర కావ్యపరమార్థసన్నీధిని గలిగిన కవులు దూషణ భూషణతిరస్కారంబులకును, రాజసత్కారంబులకును,సంపదలకును ఆశించి కావ్య పరమార్గమును ద్యజింపనొల్లరు చూడుఁడు! భారతీసాంత్వనముఁ గావించుచుఁ బోతనామాత్యుఁడు దెల్పిన, వాక్యములు,

ఉ. కాటుకకంటినీరు చనుఁగట్టుపయింబడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్ధనుని గాదిలికోడల యోమదంబ! యో
హాటకగర్భురాణి! నీసునాఁకటికిం గొనిపోయి యల్ల క
నాట కిరాట కీచకుల కమ్మ ద్రిశుద్ధిగా నమ్ము భారతీ.

అంతియేగాక పోతన పలికిన యీవాక్యములనుగూడ గమనింపుఁడు...

ఉ. ఇమనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరమువాసి కాలుచే
సమ్లెటవ్రేఁటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోత రా జొకఁడు భాగవతంబు జగ్మతంబుగ౯.

కావుననే పోతన యెడ 'సహజపాండిత్వ' బిరుదము 'అన్వర్ణమయినది. సహజకవి యాడంబరరహితుఁ డగుట చే నితర ప్రయోజనముల నర్జింపక కావ్య పరమార్ధమునందే లక్ష్య ముంచి మనోగతభావమును వెల్లడించును. \

2. ప్రాపంచి కాద్భుత పరిజ్ఞానము. వాట్పుడంట! పండితుని మతము.

సహజకవి ప్రపంచము సర్వమును భగవనయముగ. నద్బుత తేజో విలసితముగ - నవూర్వముగ - ననంతశ క్తియుత ముగా - మానసోత్తేజకముగఁ గనుంగొనును. నిజముకూడ నం తేకదా ! ప్రపంచమున నున్న ప్రతిజీవికిని ఈ జీవిత మహానాటక మొక విచిత్ర ప్రదర్శనముగఁ గాన్పించును. పుట్టుక రహస్యము, గిట్టుట రహస్యము, ఏరికిని దురవగా హము. యుగయుగముల నుండి ఎడ తెగక పాఱుచువచ్చు చుండిన యీమహాకాల ప్రవాహము వలె మన 'మేతీరమున నుండి కొట్టుకొని వచ్చి యేతీరమును బట్టి తుద కేతీరమునకుఁ గొట్టుకొని పోయేదమో యేరికిని దెలియదుగదా? అట్లయ్యును జీవిత మహానాటక మెల్లరకును విచిత్రముగను అద్భుతానంద జనకముగను నుండు చునే యున్నది. మానవ సహజములగు నవ 'స్థాని శేషమ్ములునుఁ దత్సంబంధములగు నను రాగ బంధములును, జీవయాత్ర కడనఱకుఁ గొనసా గించుటకుఁ గారణము లగు

చున్నవి. ఈ ప్రపంచ వై చిత్ర్యములు, ఈ సంఘ నియమములు, ఈ . యాచారములు జీవితవ్యవహార వైచిత్ర్యములు ప్రకృతిశోభా విశేషములు మృగ చేష్టావి శేషములుఁ గాలస్వభావము మొదలగునవి యన్నియుఁ జక్కఁగఁ బరిశీలించు వానికిని ఏమియుం దెలియని వానికిని గూడ నద్భుతము జనింపఁ జేయును. సర్వముఁ. దెలిసినవాఁ డీయద్భుతమును గని ప్రపంచ బంధము లస్థిర ములు, మిథ్యలును అని భావించి, శ్రీ మేణ వానిని వదలించు. కొని యోగసిద్ధి నొందును. ఏమియుఁ దెలియనివాఁ డీయదు, తమును గని స్తంభితుఁడై భగవల్లీలావిశేషంబుల కచ్చెరుపడి యనేకవిధములఁ బలువరించును. ఇట్టి పలువరింతలే ఏనివాని. జనాంతర సంచిత్ర సంస్కార సంతప్తములై నిప్పుల నుండి వెలువడి' ప్రకాశించు బంగారు కణికలట్ల సత్కావ్వములగును. ఈ యద్భుతము నే తియోడర్ వాట్సడంట పండితుఁడు “Aylwin . or the Renaiscence of wonder” ఏయిల్విన్ అను నవలయందు నను,అద్భుత పరిజ్ఞానమను వ్యాసము నండునను విమర్శించి సహ జకవికిఁ బ్రపంచము అద్భుతముగ నుండుననియు, ఇట్టి ప్రపం చాద్భుత మే సహజక విత్వమునకుఁ బ్రేరక మనియు, ఇట్టి ప్రపం చాద్భుతత్వ పరిజ్ఞానము వలన నే కవి స్థూలదృష్టికినగోచరము లును అతీతములును నగు విశేషణముల నవలోకింపఁగలఁడని యుఁ దెల్పెను. ఈ భావమునే మనవారు రవి గాననిచోఁ గవి గానకుండు నే? అను వాక్యమును దెల్పియున్నారు. కవియొక్క యద్భుతశక్తిని మనవారు ఆలౌకికమని భావించిరి. అనఁగా లోకాతీతమయి సృష్టియందలి మమములను భేదించుకొని పోయి సత్యమును గ్రహించి యితరులకుఁ బ్రదర్శింపఁగల దనియే పయినూటల తాత్పర్యము. ఇట్టి యద్భుతశక్తి కవిని ,

వశముఁగొని యుఱూత లూఁగించునపుడు ఆతఁడు పద్యరూప మునఁ బలువరించునో? గద్యరూపమున విచారణసేయునో? అని తర్కింపంచరు. కవియొక్క స్వభావము కల్మషర హితమును నిష్కపటమును నగుట చే శిశుస్వభావమును బోలినదై యుండును. సహజకవి యందు శిశులక్షణము లెన్నేనియుఁ గాననగును. శిశువు అద్భుతమగు విషయము నేదేని గాంచినతోడనే కెవ్వున కేక వేయును; కలకలనవ్వును; కొండొకయెడ వలవల నేడ్చును. కవియు నట్లే కొన్ని యెడల ఆశ్చర్యవిభ్రమాన్వితుఁడై హాహా కారము సలుపును. కొండొకయెడ మందహాసముఁ గావించును. ఇంక నొకప్పుడు విచారపూరిత హృదయుఁడై కస్నుల నీరునించి పలవించును. కవిమనము నావహించుకోన్న ఆశ్చర్య భావము యొక్క ప్రస్తార భేదములు పద్యమున వ్య క్తమగునంత స్ఫుట ముగ గద్యమున వ్య క్తములు గావు,

పద్యగద్యరచనలయందుఁ గల భేదము.-

ఇందులకుఁ గారణము విచారింతము. పద్యరచనను ప్రేరేపించునది యొక దివ్య శక్తియని యెఱుంగునది. అది సామాన్యబు కతీత మైనది. ఆలోచన కందనివీ, తర్కమునకు లొంగనిది, మీమాంసచేఁ దేలనిది, శాస్త్ర శృంఖలలచేఁ గట్టు పడనిది, అయ్యది యొక యలౌకిక ప్రతిభ. ఇట్టి, యలౌకిక ప్రతిభ గల కవియొక్క మనస్సు వెన్నవోలె మెత్తనిదియు, శిశువు యొక్క మనస్సువోలె నిష్కల్మషమును నగుటచే విషయమును జూచు తోడనే వేఁడి తాఁకిడిని గరంగిపోవు వెన్నవోలె గరంగి శిశువు యొక్క మనస్సువోలె, అద్భుతాశ్చర్యములచే కల్లోలిత మగును. తోడనే కవికి మనస్సు వికసించును. కవి యొక్క గాత్రము విశ్వ వీణానాదములో మిళితమై మనోహర రాగాలాపమును గావించును. అట్టి మనోహర రాగాలాపన మే పద్యమగును. అట్టి రాగాలాపనము విశ్వవీణానాదమును జెవు లార విననివానికి సాధ్యము కాదు. అట్టి విశ్వవీణానాద శ్రవణము మనస్సు వికసించిన యనంతరము గాని కవికి లబ్దము కాదు. అట్టి మనోవికాసము కవియొక్క మనోనైర్మల్యము ననుసరించి యుండును. కావున పద్యరచనను బ్రేరేపునది భావౌత్సుక్యమును విశ్వవీణానాద శ్రవణమును, మనోనైర్మల్యమును నని యెఱుంగునది. వచన మన్ననో యట్లు గాదు. వచన మెంత వరకును వ్యాకరణ జ్ఞానమును, ఆలోచనను, పద ప్రయోజనమును, పూర్వోత్తర సందర్భమును,తర్కమును నా ధారము జేసికొనును. ఇందులకు పద్యము యొక్క గతికిని, వచనము యొక్క గతికినిగల భేదమే తార్కాణము, పద్యము భావము యొక్క గతి ననుస రించునది యగుట చే పదములు కర్తృకర్మ, క్రియల వరుసల దప్ప కుండునట్లుగ రావు. భావోత్సుకతనలన నేపదము ముందు దట్టిన నాపదమే, అయ్యది కర్తయైనను సరే, కర్మయైనను సరే, క్రియ యైనను సరే, విశేషణమైనను సరే, కడకు ప్రత్యయమైనను సరే ఆపదమే ముందు ప్రయోగింపఁబడును. ప్రయోగింప బడు నను మాటయే తప్పు. నిజముగఁ బ్రయోగించువాఁ డొక్కడున్నాఁడా? ఛాయాగ్రహణ యంత్రమున నద్దముపై మానవుని ప్రతిబింబ మెట్లు దిగునో అట్లే ఆపదము తనంత తానే దిగును. వచనమున నట్లు గాదు. వచన రచయిత పూర్వోత్తర సందర్భములఁ జక్కఁగ విమర్శించి యాలోచనా బలమున నే మాట ముందు రాఁదగునో, యేమాట వెనుక రాఁదగునో విచారించి వ్యాకరణ నియమములు దప్పకుండ,కర్తృకర్మ క్రియల వరుస దప్పకుండ వాక్యమును రచించును. వచన రచయిత భావౌత్సుక్యమును ప్రధానముగాఁ గొనఁడు. అర్థ సందర్భమునే లక్ష్యముగా గ్రహించును. కావున పద్య రచయితకును, గద్వ రచయితకును గల భేదమును సూచించితని. ఒక్కడు సిద్ధపురు. షుఁడు; తన హస్త బలిమిని తన దివ్య ప్రజ్ఞను గుర్తింప నేరక దివ్యశక్తిచేఁ బట్టిన దెల్ల బంగారు గావింపఁగల యమేయ ప్రతిభాశాలి. వేరొకఁడు ఆలోచనా బలమును జ్ఞాన సంపత్తియును గలిగి చేజిక్కిన పరికరములతో జ్ఞాన సౌధము నిర్మింపఁజూచు వాఁడు ఒకని వాగ్దాటియు దివ్య గానమును ఆకాశగంగా ప్రవాహముయొక్క థాటిని మజపింప శక్తిఁగల్గి యుండును. వేవొకని వారణి శిష్యునికి విద్యఁగఱపు గురుని వాగ్విశేష మునుఁ బోలియుండును. ఒకని శక్తి యలౌకికము. ఇంకొకని.” శ. ! 'పౌరుషేయము. ..

పద్యమే ముందు పుట్టెననుటకుఁ గారణములు. . 1 . మానవజీవితచరిత్ర రహస్యము,

పద్య రచయితకును గద్య రచయితకును గల భేదమును! గ్రహించిన మనకుఁ బ్రపంచసాహిత్య చరిత్రము నందుఁ బద్వము, ముందు పుట్టినదా? గద్యము ముందు పుట్టినదా? అను ప్రశ్నకు సమాధానము వెంటనే స్ఫురింపఁగలదు. చరిత్రను బట్టి చూచిన మానవులు మొట్ట మొదట ఆలోచ నాబలము తక్కువ గలిగి యుండిడనియు, భావౌత్సుక్యమునే యెక్కువ గలిగి యుండి రనియుఁ దెలియు చున్నది. జాతులయొక్క పరస్పర సంఘట్టనము పలన విజ్ఞాన మభివృద్ధి నొంది, యాలోచనా శకి యతిశయించి, భావమునకు స్థానభ్రంశము సంభవించు చున్నది. పురా

తనకాలమునం దన్ననో మానవులు పవిత్ర భావోద్రేక పూరితులై, నిర్మల మానసులై, సృష్టి సర్వమును భగవన్మయ ముగనే భావించి, భక్తియుతులై జీవిత పరమార్గమును గ్రహీం పగలిగిరి. ఈ వాక్యములకు ప్రాచీన మానవసంఘములలో నెల్ల నగ్రస్థానము వహించిన భారతీయార్యుల చరిత్రయే తార్కాణము. భారతీయ విజ్ఞాన నిధియును భారతీయ నాగరక తా పేటిక యును నని చెప్పఁదగిన వేదములును పురాణములును నిందులకుం దార్కాణములు, వానియం దెచ్చటఁ జూచినను నాలో చన కందని యపూర్వగాథలును, తర్కమునకు వశముగాని, యద్భుత ప్రాపంచిక రహస్యములును, సామాన్య మనుష్యానుభవ మునకు విపరీతముగఁ దోచు గాథలును, సామాన్య మానవ బుద్ధికి దోఁపని వింతవింత యూహలును; నతిశయోక్తులును మిక్కుటముగఁ గన్పించును. దీని కంతటికిని కారణము ప్రాచీన, భారతీయుల యాత్మ నైర్మల్యమే, శైశపస్వభావమే, ప్రొపంచి కాద్భుత పరిజ్ఞాన మే, పంచ భూతాత్మకమగు నీ ప్రపంచము కల్ల కపట మిసుమంతయు నేఱుంగని ప్రాచీన భారతీయులకు నద్భుత జనకమును దివ్య తేజః ప్రదర్శకమును, భగవన్మయముగను. గన్పించెను. తోడనే వారు మంత్ర గానము సల్పిరి. "ఆమంత్ర గానము మొట్ట మొదట ఛందో బద్ధమగు ఋక్కులరూపముసc 'జేయఁబడెను. అయ్యది పోనుపోను | పద్యవృత్తరూపములం బరిణమిం చెను; వేదము యొక్క షడంగములలో, ఛందస్సు ఒక టిగా గ్రహింపఁబడుటయే పై యూహలకు నిశ్చితమగుదార్కా ణము, ఇంతియేగాక భారతీయులలో నెల్ల నాదికవి యనఁడగు వాల్మీకి హ్యధనిహతమైన, క్రౌంచమును గాంచిన తోడనే శ్లోక రూపమునఁ దనశోకమును వెలిపుచ్చినవిధమే పై సిద్ధాంతమును

ఆంధ్రకవిత్వ-19 మఱింత దృఢపజచు చున్నది. ప్రపంచమున నన్ని జాతుల సాహిత్య చరిత్రము నందును పై సత్యమే నిర్ధారిత మగుచున్నది. సాధారణముగఁ బ్రపంచమున మానవులెల్లరు ననాగరకస్థితి నుండి నాగరకస్థితికి వచ్చుచున్నారని సిద్ధాంతము కలదు. ఆసిద్ధాంతమును బురస్కరించుకొని యనాగరకజాతుల సాహిత్యమును బరిశీలించితి మేని ఛందోబద్దములగు పాటలును పద ములును నెక్కువగఁ గన్పించుచున్నవి. అనాగరకజనులు సాధారణముగ సంస్కారమూన్యు లగుటచే నాలోచనమును తర్కమును పూర్వాపర విమర్శనమును నెక్కు-పగఁ జేయఁజాలరు. వారికి నాగరికులకుంబలె తలలు మార్చునూహలును, కొంపలుఁ దీయు తెలుపులును నరుదు; సత్యమునందు వారి కభిలాష మెండు. హత్యం జేసిన వాడు సాధారణముగఁ దన నేరమును తత్తణ మొప్పికొని దానికింగల కారణమును నిర్భయముగఁ జెప్పి న్యాయాధిపతి తీర్పునకు వెఱవథ నిర్బీక చేతస్కుఁడై ,దైవముఖముఁ జూచి, సత్యముపై నాధారపడి, కర్మఫలము నను భవింప సంసిద్ధుఁడై యుండును. ఇప్పటివా రన్ననో, చేసిన నేరముఁ గప్పిపుచ్చుటకై న్యాయవాదుల నుపయోగించి, నోటికి రాని యసత్యముల నెన్ని యేని ప్రమాణ పూర్వకముగఁ జెప్ప వెనుతీయరు. అనాగరకులకు ప్రపంచమునఁ గల యద్భుతముల యెడను విపరీతముల యెడను భక్తి మెండు. ఇందులకు దయ్యముల యందును, భూతముల యందును,శక్తుల యందును, మంత్ర, శాస్త్రముల యందును, వారికి గల భ క్తయే ప్రబలతార్కా జము. అట్టిభ క్తిని మాననవనాగరకులు.. మూఢభక్తి'యని నిర సించిన నిరసింతురుగాక! అయ్యదియే వారి పవిత్రతకును సౌశీల్యమునకును, సద్గుణసంపత్తికిని, ముఖ్య కారణమును నాట పట్టును, నని భావింపఁదగును. కన్ను లఁ జూచినదే సత్వ మనియు, దృష్టి గోచరములుగాని వన్నియు ససత్యములనియుఁ బల్కు మన నవనాగరక సిద్ధాంతులు, తమ యజ్ఞానమును దెలిసి కొనఁజూలగున్నారు, భగవంతుఁడు అనంత శక్తియుతుఁడనియు భగవచ్చక్తికి లోనుగాని విషయమును, వస్తువును, బ్రపంచమున "నేవీయును నుండఁ జూలదనియు, పరిమిత జ్ఞానులగు వీరికిం దట్టుట లేదు.

-2. షేక్స్పియరుకనియభిప్రాయము.

ఈ సందర్భమున ఆంగ్లకవి శేఖరుఁడగు షేక్స్పియరు 'హ్యామ్లెట్ నాటకమున హ్యామ్లెట్ రాకుమారునిచే నతని మిత్రుఁ డును హేతువాదియును నగు హోరేషియో యనునతనికి జెప్పించిన యీ క్రిందిపలుకుల గంభీరభావమును అపూర్వరహ స్యమును గహింతురుగాక!

.

"There are more things in heaven and earth Horatio, Than are dreamt of in your philosophy."

"హొ రేషియో, స్వర్గమర్త్యలోకముల నీతర్క సిద్ధాంత ములకుఁ గలలోనైన సంగని విశేషము లేన్ని యేనియుంగలవు. *సుమా' అని పై మాటల యర్థము. ఇట్టి ఆశ్చర్య భావముఁ గలవా రగుట చేత నే యనాగరకులు తర్క సింద్దాంతములకు వశులు గాక, భావోద్రేక పూరితులై, తమకుఁ 'దోఁచిన సంగతులను తమకుఁ దట్టిన యూహలను తము నావేశించికొనిన భావములను పద్వ రూపముననే, ఛందోబద్దములగు గానరూపనమునే వెల్లడించి, ఎన్నటికిని ఏరికిని మరువరానంత శాశ్వతమునఁ దమ కీర్తిని ప్రతిష్ఠించి సాహితీ సేవకులకఁ గృతజ్ఞ తాపాత్రు లైరి ప్రపంచమున నేచ్చటఁ జూచినను పద్యమే ముందు రచింప బడినది, నాగరతయు విజ్ఞానమును సభివృద్ధి నొందినదొలఁది వచనరచన యతిశయించి "పద్యమునకుఁ బ భ్రంశము సంభ వించినది. కావునఁ బచ్య మే ముందు గాని, గద్యము కాదు!

చమత్కారజనకమగు నీంకొక సిద్ధాంతము.

కాని, ఆంగ్లేయ భాషలో “Poetry begins where prose ends" అను సిద్ధాంతము కలదు. ఆసిద్దాంతము ప్రకారము వచన సాహిత్యాంతమున పద్యకవిత్వ ముద్భబవించునని తేలుచున్నది. కాని, పై రెండు సిద్దాంతములకును గల విరోథాభాసత్వము నామమాత్రముననే గాని, నిజముగ లేదనియు విచారణానంతరము తెలియఁగలదు. Poetry begins where prose ends (పచన సాహిత్యాంతమున పద్య కవిత్వ ముద్భవించును.) అను సిద్ధాంత ముయొక్క భావ మేమనఁగా; పచన సోహీత్వ పరమావధీజనోప దేశ మే, జానోపదేశముఁ గావించిన తోడనే వచన సాహిత్యపర మార్థము సిద్ధించిన దగును. భావోద్రేకము కలిగించుట కావ్య ముయొక్క 'పని, భావోద్రేకము గలిగించుటయే కవిత్వము యొక్క ముఖ్య కర్తవ్యము. కవిత్వమున జ్ఞానోపదేశ మంత ప్రథాన విషయము కాదు. వచన సాహిత్య మేవిషయము ప్రధాసముగా గ్రహించునో పద్య కవిత్వము దానిన ప్రధానమని లోని పుచ్చును. పద్య కవిత్వమే విషయము ప్రధానమని భావించునో దానిని వచన సాహిత్యము తగిన రీతిని నిర్వహింప సమర్థము కాదు. వచన సాహిత్యము నిర్వహింపఁ జూలక వదలిన పనిని పద్య కవిత్వము అవలీలగ నిర్వహింపఁ గలుగును. పద్య కవిత్వము వచన సాహిత్యముకన్న నెక్కుడు భావోద్దీపకమును, ఆత్మవశీ కరణమును ననియే పై సిద్ధాంతము యొక్క భావము "జాని, వచన సాహిత్యము ముందు పుట్టి పద్యకవిత్వము తరువాత పుట్టినదని కాదు. ప్రపంచ సాహిత్య చరిత్రలయం జెల్లెడలను పద్యకవి త్వమే ముందు ప్రభవిల్లి ప్రజల వశీకరణము గావించికొని తప్తముఁ జేసిన పిదపనే వచన సాహిత్య ముద్బవించి జ్ఞానోపదేశ మునకుఁ గడంగెనని తెలియుచున్నది. కావున నెన్ని" చెప్పినను పద్యమే ముందు కాని, గద్యము కాదు.

భాషాతత్త్వము.

జీవద్భాషలకును పురాతన భాషలకును గలసంబంధము.

భాష యనఁగా నేమి? అర్థము నొసఁగు మాటల కూర్పు. అర్ధమే భాష మనఁబడును. భావమునకును భాషకును నవినాభావసంబంధము కలదు. అర్థము నీయని మాటయు, మాటల కలవిగాని యర్థమును గగనారవిందము లనియు, అనుకరణము లకుంగూడ వ్యవహారము ననుసరించి నిశ్చితార్థముండుననియు, నీది వఱకు గ్రహించియే యుంటిమి. అర్థద్యోతకళబ్దసముదాయమే భాష.

జీవద్భాషాస్వభావము.

భాషయన నేమో తెలిసినది, జీవద్భాషయనఁగ నేమో యింక నెఱుంగవలెను, మానవుని చే నిత్య వ్యవహారముల నుప 'యోగింపఁబడుచుండు తన జీవించునదియే జీవద్భాషయగును. జీవద్భాష మానవుని జీవితమును, దానియొక్క పరిణామ భేదములను, జీవితర హస్యములను, మానవుల యాచారవ్యవ హారములకు సంబంధించిన విశేషములను, వారికుండు నాగరకతా లక్ష్యములును సర్వము నద్దమునందు వలె బ్రతిఫలింపఁ జేయును. అద్దమున 'మన మొగములు మనము చూచుకొని యెన్నెన్ని విధములఁ ద్రిప్పికొనుచుఁ, జిట్లించుకొనుచు, దిద్ది కొనుచు, మార్పులను జెందుచుండ నట్టి మార్పులన్నియుఁ బ్రతి ఫలించుచుండునో, యట్లే మానప జీవితమునందుఁ గల్గు మార్పు లన్నీ యుఁ, బరిణామ భేదము లన్నియు, విశేషములుసు వికారములు నన్నియు జీవద్భాషయందుఁ బ్రతిబింబితములగు చుండును. కావున జీవద్భాష ప్రజా జీవిత దర్పణమని గ్రహింప నొప్పును.

-పురాతన భాషల మృతభాష లనఁ జెల్లదు...

జీవద్భాషలకును బురాతన భాషలకును నెట్టిసంబంధమని, ప్రశ్న ముదయింప వచ్చును. కొన్ని భాషలు జీవద్భాషలనియు,, మణికొన్ని మృత భాషలనియు నాగరక సాహిత్యవేత్తలు పల్కు చున్నారు. మృతభాష లనఁగాఁ బ్రస్తుతము నిత్య వ్యవహారము లేక గ్రంథస్థములుగ మాత్ర, మున్న భాషలనియే వీరి యభి ప్రాయము. ఈయభిప్రాయ మెంతయుఁ దప్పని మాతలంపు. ఏలనన నీత్వవ్వవహారములకుఁ గాలపరిమితియు, రూఢియు లేవు.ఎన్ని వేల సంవత్సరములు భాషకు జీవిత పరిమితిగ నిర్ణయింపఁ దగునో యెవ్వరును జెప్పఁజాలరు. 'కాలో హ్యయం నిరవధి?" అని భవభూతి యుద్దేషించుచుండ భాషా వితమునకుఁ బరిమితిఁ గల్పింప జూచుట సాహసమే యగుంగాని యన్యము కానేరదు. అనేక వేలయేండ్లు వ్యవహారమున నుండి, విశ్రుత 'వాఙ్మయము గలిగియుండి, నేఁటికిని సహృదయ హృదయానం దముఁ గూర్పఁగల సంస్కృతము, గ్రీక్, ల్యాట్ మొదలగు భాషలను మృతభాష లగుటకంటెఁ బొరపాటు వేఱిఁకేదియు నుండదు. అదియునుంగాక వ్యవహారమునకు రూఢన్ని నిర్ణ యింపంజాలము, పండిత జనులవలనీ వ్యవహారమా? పామరుల పలని వ్యవహారమా? సాహిత్యము నందలి వ్యవహారమా? లేక నిత్య జీవితము నందలి వ్యవహారమా! అనుప్రశ్నమునకు సమాధాన మిచ్చుట మిగులఁ గష్టము. కావునం బూర్వకాలము వ్యవహారముల నుండి విశ్రుతవాజ్మయముఁ గల్గి నేఁడును పండితజనులచే వ్యవహరింపఁ బడుచున్న సంస్కృతాది భాషలను మృతభాష లనుటకన్నఁ బురాతనభాష లనుట సమంజసము. వ్యవహారమును వాఙ్మయమును లేక బొత్తుగా నశించిపోయిన మాగధీపై కాచాది భాషలకే మృతభాషలను నామము సెల్ల - దగు. సంస్కృతాది భాషలు పురాతనభాష లే యగు. పురాతనభాషలు సలక్షణములై యవస్థాభేదములకు లోనుగాక, మహా పర్వతములుం బోలె నచలములై, యేకస్థాయి నేలోపము లును జెందక, ఱాతఁ జెక్కఁబడిన బొమ్మల ట్లాకల్పాంతచిరస్థాయి త్వము నొందును.

జీవద్భాషలు జీవసూత్ర బద్ధములై కించిల్లో పసహితమగు నవత చే వీలసిల్లుచుండును.

జీవద్భాష లన్న నో జీవసూత్ర బద్ధములు. జీవి యెట్లు బాల్య యావన కౌమార వార్డక్యాద్యవస్థాభేదములకు లోనగు. చుండునో, అట్లే జీవసూత్ర బద్దమగు 'సజీవద్భాషయు ననేక విధములగు నవభేదములకు లోనగుచుండును. ఇందుల కుదాహరణము... _వివిధజనులచే నుపయోగింపఁబడు భాష వివిధ రీతుల నుండి సంస్కోర విషయమున ననేక భేదములు కల్లి యుండుటేయని యెఱుంగందగు. పసిపిల్లలు పలుకు ముద్దు మాటలకును, బాలురు పల్కు జిలిబిలిపల్కులకును, విద్యా

గంధము లేని సొమాన్యజను లాడు మోటమాటలకును, సాహిత్య సంస్కారముఁ గలిగి పదిమందిలోఁ దిరుగ నేర్చిన పండి తులు వాడు ప్రౌఢపద ప్రయోగములకును, పండ్లూడి నోట మాట తిన్నఁగ నుచ్చరింపఁజాలక పల్కు ముదుసలిపల్కుల కును సంస్కారమున నెంత యంతరమును వ్యత్యాసమును గలవో సహృదయులకే యెఱుక. జీవద్భాషయం దిట్టిసంస్కార విభేదసూచకములగు విశేషము లెన్ని యేనియుం గన్పట్టుట కవకాశము గలదు. మఱియు జీవద్భాష జీవసూత్రముల నను సరించి లోప సహితయై యుండును. "వెలుంగునతుఁ జీఁకటియుం బోలె, నెండకు నీడయుంబోలె గుణమునకుఁ గించిల్లోపమును దోడుగ వర్తించునని జీవరహస్యవేత్తలకు విదితము. లోప రాహిత్య మొక్క పరమేశ్వరుని విషయముననే చెల్లఁదగిన దగుటచే, మానపు లెల్లరును లోపసహితులే యగుటచే లోప సహితములగు మానవులచే వ్యవహరింపంబడు జీవద్భాష, లోప రహితముగాక లోపసహిత మే యగు. జీవద్భాష వివిధతరు లతాశోభితమై నవనవకుసుమాలంకారభూషితమై నానావిధ ఫల సమృద్ధమై నిత్యశోభఁ గలిగి 'వెలుఁగువనముంబోలె నొప్పా ఱుచు, మానవుని జీవితమునందు నిత్యమును బొడకట్టు విశేష ములతోడను, నద్భుతములతోడను, రస ప్రవృత్తులతోడను నెంతయు విలసిల్లును. అందువలననే జీవద్భాష కఠిననీయమ" ములకు లోనుగాక యథేచ్చముగ నడచుచుండును. కావున బురాతనభాషల ట్లాకల్పాంతస్థాయిత్వము జీవద్భాషలకలవడుట యసంభవము. ప్రాణికోట్ల కెట్లు జీవచ్యుతి కలుగునో యట్లే జీవ ద్భాషలకును గొన్ని యెడలఁ జ్యుతి కల్గుట సహజము, జీవద్బా షలు జీవితసూత్రము ననుసరించి దినదినాభివృద్ధి గాంచు

చుండును. నవనవాలం కారశోభల విలసిల్లు చుండును! నవతయే జీవద్భాషలకు ముఖ్య లక్షణము; నవతయే ప్రాణికింగూడ ముఖ్య లక్షణము. ప్రొణికి దినమున కొక కొత్తశోభ యెట్ల మరునో యట్లే జీవద్భాషకును దరతరములకును శతశతాబ్దములకును నూతనశోభ లలవడును.

పురాతనభాషలకు చిరస్థాయిత్వమే ముఖ్యలక్షణము.

పురాతనభాషల కన్న నో, యట్లుగాక యన భేదము లకును, నవతకును నెడమీయని చిరస్థాయిత్వమే ముఖ్యలక్షణ మగుచుండును. కావున, నింతవఱకుఁ దేలిన దేమనఁగా... పురాతనభాషలు లోపరహితములై యాకల్పాంతచిరస్థాయి త్వము నందును. జీవద్భాషలు నవతతో నొప్పొఱుచుఁ గించి ల్లో పసహితముగఁగూడ నుండును-పురాతనభాషలయొక్క సౌందర్యము లోపరాహిత్యమునందును నేకాగ్రతయందును వ్యక్తమగుచున్నది. జీవద్భాషల సౌందర్యము నవతయందును బ్రాణిసహజమగు జీవకళయందును వ్యక్త మగుచున్నది. పురా తనాధునాతనభాష లన్ని (టికిని సౌందర్య ప్రతిపాదన మే పరమా వధి. కాని పానిచే నవలంబితములగు పద్దతులందు మాత్రము భేదము కన్పట్టును .

పాశ్చాత్య సాహిత్య విమర్శనమునందలి క్లాసికల్ రోమాంటిక్ మతసిద్దాంతములు.

ఈవిషయమునే పాశ్చాత్య సాహిత్య విశారదులు క్లాసి కల్, రోమాంటిక్ అను సాహిత్య పద్ధతుల తారతమ్మ చర్చ యందు విపులముగఁ దర్కించియున్నారు. క్లాసికల్ అను పద మునకుఁ బురాతనము అని యర్థము. రోమాంటిక్ అనుపద


మునకు నవ్వమనియే యర్థము. వారి మత ప్ర కారము క్లాసికలో రోమాంటిక్ పద్దతుల "రెంటికిని సౌందర్య ప్రతిపాదన మే పరమా వధి. కాని క్లాసికల్ పద్దతి లోపం హత్యమును, నియమమును. నాశ్రయించుకొని 'సౌందర్యము నాకల్పాంతస్థాయిగా నొనర్పఁ బ్రయత్నించును. రోమాంటిక్ పద్దతి జీవసూత్రము నాధార ముగఁ గొని యథేచ్చముగ సంచరించుచు, నీయమబద్దముగాళ, జీవకళతో నవతతో 'నొప్పుచుండును. దేని యందము దానిది. ఈవిషయమును గ్రంథాదిని లాక్షణికం "మణీయక కొవ్వవిమ ర్శనవి భేదములఁ జర్చించుపట్టున విపులముగ విశదీకరించితిమి. కాపున నేతద్విషయముపైఁ బునర్విమర్శనము చర్వితచర్వణం బగు.

సంస్కృతముస్వాతంత్య్రమును సవతను నిషేధింప లేదు. భవభూతి కాళిదాసుల మతము.

పురాతనభాషయగు సంస్కృత భాషకును జీవద్భాష యగు నాంధ్రమునకును నట్టిదియే సంబంధము. సంస్కృత మున లక్షణమునకును లోపరాహిత్యమునకును నెక్కువ ప్రాధాన్య మొసఁగఁబడినదనుటకు ఛందోవ్యాకరణాదులు వేదమున కుపాంగములుగ గ్రహింపఁబడుటయే యిందులకు దార్కాణము, కొనియట్టి ఛందోవ్యాకరణాది నియమబద్ద. మగు సంస్కృతముపై తము కాలక్రమానుగతములగు మా ర్పుల నంది కొన్ని యెడల నియమములు మీరియథేచ్ఛముగ సంచరించుచు-.భవభూతి.

 శ్లో.. యే నామ కేచిదిహ నః ప్రథయంత్యపజ్నాం
జూనంతి తే కిమపి తా౯ ప్రతి నైష యత్నః, <

, ________________



ఉత్పత్స్యతే స్తి మమ గో౽పి సమానధర్మా
కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ.

అనుశ్లోకమునఁ జెప్పినరీతిని 'నిరంకుశాః కవయః' యను. సాహిత్యసూత్రమున నిర్వచింపఁబడురీతిని స్వాతంత్ర్యపథమునే తొక్కెను, నవత నిసర్గదూష్యము గాదనుటకుఁ గాళిదాసు మాళవికాగ్ని మిత్రమున

 శ్లో. పురాణమి త్యేవ న సాధు సర్వం
న చాపి కావ్యం నవమిత్య వద్యం
సంతః పరీ డ్యాన్యతరత్ భజంతే
మూఢః వర ప్రత్యయ నేయబుద్ధిః.

అని చెప్పిన శ్లోకమే ప్రబలమయిన తార్కా ణము; "కవికుల తిలకుండగు కాళిదాసుని మత మేమనఁ 'గావ్య, మున బుద్ధిమంతులు గుణదోషములనే విమర్శించి గ్రహింపు దగుఁగానీ, 'యిది కొత్త, యిది ప్రాత' యను తర్కము చేయం దగ దనియే. అట్లనుటలోఁ గావ్వముయొక్క నవత నిసర్గ దూష్యము గా నేరక యతరగుణములతోడి సాంగత్యమువలన గుణముగనో లోపముగనో పరిణమిం చును.

ఆంధ్ర పండితుల విపరీత వాదము.

ఈవిషయమయియే చెప్పవలసివచ్చిన దనఁగా, కొందఱు సాహిత్య విమర్శకులు 'రసము యావత్తు సౌందర్యముయావత్తు,, సంస్క.. తాదిపురాతనభాషల యంద కలదుగాని యిప్పటి భాష లలో నేమున్నడయ్యా!" అందురు. వీరి యభిప్రాయము • సంస్కృతాదిపురాతనభాషలయం దే రసమునకుఁ దావు గల దనియు, నాంధ్ర మాదిగాఁగల భాషలకు గౌరవమును రస.


ప్రతిపాదనశక్తియు లేవనియు నట్టి శక్తి యలవడవలయునన్న నీ భాషలు సంస్కృతమునే యాశ్రయింపవలయుననియు, నందుచే సంస్కృతసాహిత్య నియమములును సంస్కృత కవిసమయము లును నాంధ్ర భాషయందు సర్వత్ర ప్రభుత వహించుననియు నయియున్నది. ఇందు సత్యము కొంచెమున్నను నసత్యము' మెండుగ నున్నది. సంస్కృతమునకుఁ గల గౌరవము అందలి కావ్యముల గుణాతిశయమువలనను, భాషా ప్రాశస్త్యమువల నను, గల్గినదిగాని కేవల ప్రాచీనతవలనఁ గల్గినది గాదు. అది 'యునుంగాక సంస్కృతమున నున్న కావ్యములు సర్వమును గుణవంతము లనియు, నేలోపమును లేనివనియుఁ జెప్ప నెంతటి "వెఱయయినను సాహసింపఁడు. దేశ కాలపాత్రముల వలనను, రాజుపోషణములవలనను ఈ రెండింటికన్న ను వేయి ముడుంగు లేక్కువగం గవుల నిస్తంద్ర స్వతంత్ర ప్రతిభావి శేష ములవలనను, సంస్కృత సాహిత్యము పేరును, వాసియుఁ గాంచినది. కాని క్రలగ్ర మేణ సంస్కృతమును క్షీణించి కుక పుల నాశ్రయించి యాలంకారికనియమశృంఖలాబద్దమయి స్వచ్ఛందసంచార మొనర్పంజూలక సూర్యుని వెలుఁగుఁ జూడఁజూలక రాత్రులమాత్రము సూక్ష్మ దృష్టిఁ గలిగి సంచ రించు మార్జాలాదులభంగా స్వాతంత్ర్య తేజమును గని వెఱఁ గందుచు నాలంకారికకల్పిత కారాగారముల నంధ కారముతో బైబిలాడుచుఁ దృప్తినొంది, క్షీణించి క్షీణించి, కరికరిభిద్దిరిగిరి భిత్కరిభిద్దిరిభి త్తనునట్లు చిత్ర కవిత్వపు మిణువురుల మెఱుంగు లకుఁ గనులు పెదటి కవిసమయములను జీవన ప్రాయములుగ గ్రహించి బ్రదుకుచు శల్యావశిష్టమయినది. నవకవితాప్రా చుర్యమున సొంపుమిగులు సంస్కృతకావ్యపథూటిని మన


వారు పాణిగ్రహణముఁ జేసికొనజూలక శృంఖలాబద్దయు , శల్యావశిష్టయు నగు నీయర్వాచీనసంస్కృత కావ్య జీవచ్ఛవము లను పలచి, తత్సాంగత్యమునఁ జొక్కి మత్తిల్లి, సలక్షణముగ సంస్కృత సాహిత్యమును జదివి తధ్ర సమును సౌందర్యమును ననుభవిం చెదమనియు, నట్టి యనుభవమంతయు సాంధ మునఁ జొన్పించి యాంధ్ర భాషను సంస్కృతమంత దానిని జేతు మనియుఁ బల్కు. మన పండితుల పల్కులు ' ప్రగల్భమాత్ర, ములై యున్నవి.

ఆంధ్ర సాహిత్యమున 'స్వాతంత్య్రమును సాంధ్ర త్వమును నభ్యర్ధనీయములుగాని సంస్కృతపారతంత్య్రము కాదు.

ప్రపంచమున స్వాతం త్రేచ్ఛ పేర్లు వెల్లువగ వ్యాపించు చున్న యిక్కాలమున సంస్కృతపొరతంత్య్రమును సాంధ్ర... భాషాభిమానులు ఇచ్చగింపజాలరు. ఆంధ్ర భాషకుస్వాతంత్ర్య. మును బ్రత్యేకజీవనమును గలవనియు, నాంధ్ర భాషకుఁగల విల తణతయే యాంధ్ర కవుల కావ్యకల్పనల ధారభూతమనియు, నూరక సంస్కృతపద్దతుల ననుకరించుట బానిసలకు సహజ మగు పారతంతమును వెలికిఁ జూపించుటయే యగుంగానీ తన్మాత్రమున నాంధ్ర భాషకు స్వతస్సిద్ధముగ లేని గౌరవము రాజాలదు. ఎవరియింట వారు నివసించుచుఁ జుట్టపక్కముల భాతి రాకపోకలు సల్పుచున్నప్పుడే చుట్టఱకపు పెంపు. సొంపునింపుఁగాని యూరక యొకయింటివారు వేరొకరియింట దేఱతిండిఁ దినుచు , సూడిగము చేయుచు నుండ నీట్టి చుట్టరి కము ముచ్చటగను సౌఖ్య ప్రదముగను నుండఁజాలదుగదా! ఆట్లే ఆంధ్ర భాషయు స్వతంత్రశక్తిఁ గలిగి ప్రత్యేకవిలక్షణము లతో సహజసౌందర్యములో నొప్పిన నొప్పగుఁగాని యూరక సంస్కృతమున కూడిగము సలుపుచు నామె యొసఁగు దాన ములనుగాని, యెరవు సొమ్ములనుగాని, ధరించి కులికినచో సట్టి యెరవు సొములన్నియు బరువు చేటే యగుంగాని యాంధ్రము నకు వన్నెయు వాసియుఁ దేఁజూలవు. ఆంధ్రమునకుఁ బ్రత్యేక విలక్షణత గలదు. ఆంధ్రులకుఁ బ్రత్యేకచరిత్ర గలదు. ప్రత్యేక నాగరికమును గలదు. భారతీయ యువతులలో సాంధ్ర,యువతి ప్రత్యేకసౌందర్యముతోను, ప్రత్యే కాలంకరములతోను శోభి ల్లుచుండును. ఆంధ్రవీరుల కార్యోత్సాహమును పరాక్రమ మును స్వాతంతానురక్తియు జగత్ప్రసిద్ధములు. ఇఁక నాంధ్ర దేశమునందలి పుణ్యతీర్ణములును, దివ్యస్థలములును, బ్రకృతి . శోభావి శేషంబులును, నాంద్ర నగరముల వైభవమును, ఖండాం తరవాసుల పొగడ్తలఁ గూడ నందినవి. అట్టిచో నిన్నింటఁ బ్రాశస్త్యము వహించిన యాంధ్రుల భాష మాత్రము పార తంత్ర్యావస్థ యేల ననుభవింపవలయునో దురూహ్య మవు చున్నది. భారత దేశమం దున్న వివిధజాతులకుఁ బరస్పరసం బంధమును, సంయోగమును గూచ్చుచున్నది సంస్కృత భాషయే యగుంగాక! ప్రాచీన భారతీయ నాగరికత యెల్ల సంస్కృతము నంద యిమిడియుండుంగాక, అంతమాత్రముననే యాంధ్రత్వము నశింపవలయు ననుట పొసంగని మతము. ఆంధ్రుల సహజ ప్రతిభ నేడు భాషాముఖమున వ్యాప్తి నందుట యెల్లర కును నభ్యర్థనీయమే. ఈ భావమును బురస్కరించుకొనియే - “అనఁగా నాంధ్ర కావ్యములందలి యాంధ్రత్వమును బట్టియే 'యాంధ్ర సాహిత్యము యొక్క. బాగోగులను విమర్శింతము.

త్రివిధాంధ్ర కవులు 1. స్వతం త్రాంధ్రకవులు.

ఆంధ్ర కవులు ముత్తెగలకుం జేరుదురు ఎట్లనఁగా భావ ముల విషయమునను, భావ విషయమునను సంస్కృత పారతం త్ర్యము సంగీకరించుట కొల్లక సంపూర్ణాంధ్ర విలక్షణత్వమునే ప్రతిపాదింపఁ జేసిన యాంధ్ర కవులును, భావముల విషయ మునను, భాషావిషయమునను, సంపూర్ణముగ సంస్కృతపొర తంత్ర్యము నంగీకరించి యాంధ్రస్వాతంత్ర్యము 'నాఁకటికిం గొనిపోయి" కర్ణాటకిరాటకీచకుల కమ్మినవారును, భాషావిషయ "మునఁగాని భావముల విషయమునఁగాని యే దేని యొకవిషయ మున నాంధ్ర త్వమును బోషించుచు వేవొకవిషయమున సంస్కృతసాహాయ్యము నంగీకరించి సమాన ప్రతిపత్తి గల బంధువులభాతి సాంధ్రమునకును 'సంస్కృతమునకును బాంధ ప్యముల గల్పించిన వారును నను మూఁడు తెగలకుం 'జెంది 'యున్నారు. యక్షగానములను జంగముకథలను పదములను ఏలపాటలును మొదలగు ప్రత్యేకాంధ్ర విలక్షణతను సూచించు కావ్యముల రచించినకవులు మన 'కెంతయు వంద్యులు. వీరి వలననే యాంధ్రత్వము నేటివఱకును జీవించి నశింపక, యేక థారగాఁ బ్రవహించుచు దినదినాభివృద్ధి. గాంచుచున్నది. నేఁటివఱకును బొబ్బిలికథయును, కాంభోజ రాజుకథయును, బాలనాగమ్మకథయును, పలనాఁటివీరచరిత్రమును, ధర్మాంగదచరి త్రమును, కామమ్మకథయును మొదలగునవి యాంధ్ర జనుల హృదయముల వశముఁ గావించుకొ సురీతిని గావ్య ప్రబంధ నాటకాదులు గావించుకొనఁజాలవు. నేఁటివఱకును యక్ష గానములును వీథి భాగవతములును ఆంధ్ర జనులకు నమితా

సందాద్భుతరసములఁ గూర్చును. ఆంధ్రులకుఁ గల ప్రత్యేక నాగరకతాచిహ్నము లన్నియు జాతివిలక్షణము లన్నియు నీ కథలయందును, వీధినాటకములయందును, ఏలపాటలయందును, భక్తగీతములయందును, పడవవాండ్ర పోకిరిపదములయందును, కోలాటపు బాటలయందును, వినోదక ఖావళులందును వ్యక్తమగు రీతిని సంస్కృతసాహిత్య మ్యూదల సనుసరించి రచియింపఁబడిన 'కావ్య ప్రబంధాదులయందు వ్యక్తము గాదు. పై గ్రంథములయందుఁ బెక్కెడల సంసొరచ్యుతిఁ గల్లెడు. గాక, లోపము లుండుఁగాక, ఛందోభంగ మొద వెడుఁగాక, అట్టి లోపము లన్నియు, సంస్కారచ్యుతి యెల్ల ను, ఛందో భంగము లెల్లను,గుణాధిక్యము క్రింద దీపము క్రింది నీడయుం బోలె, వంకరతలపాఁగఁ జుట్టుకొని ముదుకబట్టలు కట్టుకొని సంస్కారరహీతములగు సంభాషణములు కొవించుచు 'మోటు మానిసిచందమున నరుగు దెంచు 'రెడ్డివీరుని హృదయాంతరాళ మున నడఁగి రగులుచుండు ప్రతాపాగ్ని యుంబోలె, జాల గుట్టలయొక్క తీఱు 'తెన్ను లేని సుందరాకారముంబోలె, శ్రుతీయు, లయయు, రాగమును లేకపోయినను నవ్య క్తమధుర మయిన పతులకలకలనినాదమునుంబో లె, నవ్యాజూనందమును గూర్పంజాలును.

సంస్కృత స్నేహాభిలాషులు.

.ఇఁకఁ బురాణాది గ్రంథరచయితలును గొందఱు కాన్య రచయితలును భాషా విషయముననో లేక భాపముల విషయము సనోయే దేనియొక్క విషయమున నే సంస్కృత సాహాయ్యమును గొని యాంధ్రమునకును సంస్కృతమునకును సరిసమాన ప్రతి.


పత్తింగలసంబంధ బాంధవ్యములను గల్పించి యాంధ్రమునకు నలువురితో రాకపోకలు నేర్పఱచిరి. ఇందులకు భారతమును రామాయణమును, భాగవతమును మిగిలిన పురాణాదులును, జక్కని యాంధ్ర భాషను ననువదించిన తిక్కన భాస్కరయెఱఱ నపోతనాదులును, దమ ప్రబంధముల సచ్చటచ్చట నాంధ్ర, నాగరక ఆవాసనలఁ జొప్పించి యాంధ్రత్వమును బోషించిన జక్కననా రాయణామాత్య పెద్దనతిమ్మనరామకృష్ణాదులును మన వందనములకుం బాత్రులు. వీరు కొండొకయెడ నాంధ్ర దేశ మునకు సంబంధించిన కథలనుగాని యాంధ్ర భాషామర్యాదల సూచించు నానుడులగాని చక్కఁగాఁ గావ్యముల ననువదించి స్తుతిపాత్రు లయిరి.

3. సంస్కృత దాసులు. 

మూఁడవ తెగకుం జేరిన ప్ర బంధకవులు ఆంధ్ర సామ్రా, జ్య క్షీణదశయందుఁ గావ్యరచనకుఁ గడంగినవా రగుటచే స్వాతంత్య్ర బీజము లన్నియు నశించినకతనఁ బారతంత్య్రమునే శరణ్యముగఁగని బ్రదుకుచు సాహిత్యమునుగూడ సంస్కృత కావ్య నియమములను కవిసమయములను సంస్కృత భాషా, మర్యాదలను సనువదించి నే నాంధ్రుడ నని చెప్పుకొనుట గౌరవలోపమని భావించినకతన నేమోగాని యాంధ్రత్వమును నాంధ్ర జాతిలక్షణములను నాంధ్రులు . నాగరకతావై లక్షణ: మును గావ్యములఁ బొందుపఱుపక క్షీణదశనొందిన సంస్కృత వాజ్ఞ్మయమునందలి . యస్వతం త్రాధమళావ్యములనే లక్ష్యము లుగఁ గయికొని, జోంగియు జోడియు రాంచికొని బూది రాల్చి'నటుల . నీరస కావ్యములను మహా ప్రబంధము అను పేరిట ఆంధ్ర కవిత్వ-20


గుప్పలుతెప్పలుగ సాంధ్ర సాహిత్యసీమను వెదఁజల్లి నారు. అని రేగుకంపలుంబోలె నాంధ్ర సాహిత్య సీమల నల్లుకొని ఆంధ్ర భాషావ్యవసాయమును జేసి కావ్య ఫలములఁ గామించనెంచు వారికి తీఱ రానీ కష్టములఁ గల్గించు చున్నవి.

ఆంధ్ర త్వమే యాంధ్ర సాహిత్యమునకు జీవమును గౌరవమును నొసంగును.

కావునఁ బ్రస్తుత మాంధ్ర, సాహితీ శ్రేయోభిలాషు లకు ముఖ్య కర్తవ్య మేమనఁ దరతరములనుండియు శత శతాబ్దములనుండియు నిరంతర ధారగఁ బ్రవహించుచున్న యాంధ్ర నాగరకతా స్రవంతిని నాంధ్ర సాహిత్యసీమను బ్రవ హింపఁ జేసి తత్ప్రవాహజలసాహాయ్యమున నాంధ్ర సాహిత్య సీమను జక్కగ వ్యవసాయముఁ గావించి యాంధ్రులకు బుష్టియఁ దుష్టియు, శాంతియు, దాంతియు, పన్నె యు, వాసీయుఁ దెచ్చు: "కావ్యఫలములఁ 'గాయించుటయే యగును. ఆంధ్ర సాహిత్యసీమను నాటుకొని 'పెరిగి పెద్దవిగాఁగల విజూ తీయకావ్య తరుల తాదుల నాటించి వానిచే సజాతీయ జాతీయ సారసమృద్ధములగు కావ్యఫలములఁ గాయం చుటయును మేలగును. ఇందులకు నన్యభాషాసంస్కారమును నన్య సాహిత్య పరిచయమును నవసరములే యగును. కాని యట్టిది యెల్లను నాంధ్రత్వమునకు 'వైరుధ్యమును, మూల ఛ్ఛేదమును, వినాశ మును, నాపాదింపక, మీఁదుమిక్కిలి యాంధ్ర త్వముసుబోషించి యాంధ్ర సాహిత్యమునకు నిఖిలసాహిత్య ప్రపంచమున నితర సాహిత్యములతో బాటు సమానస్థానముఁగూర్చి యాంధ్రులకు నలుగురితో సంబంధ బాంధవ్యములను రాకపోకలను గల్పింహా


దగును. అట్టిసంబంధ బాంధవ్వములును రాకపోకలును ఆంధ్రులుసు ఆంధ్ర సాహిత్యమును దమ స్వాతంత్ర్యముఁ బోషించు కోను నంత కాలమును బ్రవర్దిల్లునేగాని, సొరతం త్యావస్థను వర్దిల్ల నేరవు. కావున నాంధ్రత్వమే యాంధ్రసాహిత్యమునకు జీవగఱ వంటిది. అట్టి జీవగఱ నూతఁగాఁ గొనక నడచు నాంధ్ర, సాహిత్యము కాలానుగతములుగ సంప్రాప్తించు నొడిదుడు కులకును నెగుడుదిగుడులకును తల మొగ్గుచుఁ గాలోగ్గుచు నడచుచు సహజమగు రాజఠీవిని, నొయారంపు నడలం గోల్పో యి వక్రగతిని కుంటి ముదుసలిరీతిఁ జరింపవలసివచ్చును. ఆంధ్ర త్వమే ప్రధానలక్షణముగాఁ గల యాంధ్ర సాహిత్య వధూటి నిజవై లక్షీణ్యముతో సహజసౌందర్యముతో సచ్చంపు దీవితో యథేచ్చముగ సంచరించుచు నిఖిలసాహితీకల్యాణమంటప మున నుచిత స్థానము నలంకరించును గావుత!!! ఓం తత్సత్.


- చెన్న పురి: 'వావిళ్ల 'ప్రెస్సున ముద్రితము, 1991.