ఆంధ్రలోకోక్తిచంద్రిక/Telugu proverbs/డ

TELUGU PROVEBBS.

డ.

956. డబ్బు యివ్వనివాడు ముందు పడవ యెక్కినట్టు.

The man that did not pay his fare, got into the boat first.

957. డబ్బులేని వానికి బోగముది తల్లి వరస.

A harlot is as a mother to a man without money.
Something beyond the reach of a man’s means.

958. డొంకలో షరాఫు వున్నాడు, నాణెము చూపుకో వచ్చును.

The banker is in the thicket, you may get him to test the coin.
(See No. 935. )

త.

959. తంగేడు పూచినట్టు.

As the Tangédu blossoms.
(See No. less.)
Tangedu is the Cassia Auriculata.

960. తంటల మారి గుర్రముకు తాటిపట్టె గొరపం.

A vicious horse requires a comb made of Palmyra wood.
Full of splinters.

961. తండ్రి తవ్విన నుయ్యి అని అందులోపడి చావ వచ్చునా.

Will you drown yourself in the well because your father dug it ?

( 173 )