ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2023-24

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

మార్చి 16, 2023


గౌరవనీయ అధ్యక్షా!

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను.

దాదాపు ఒక శతాబ్దం క్రితం, శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా వ్రాశారు.

'నిరంతరం కార్యదీక్షత మరియు విశాల దృక్పథంతో

మదిని మార్గదర్శనం చేసేలా

ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి చేరేలా

నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రీ'


2. ఈ సందేశం ఒక కార్యాచరణ కోసం పిలిచే శక్తివంతమయిన పిలుపు. ఈ సందేశాన్ని మనం అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలం అనే నమ్మకం దృఢపడుతుంది. నాటి భావోద్వేగాలు నేటికీ మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం అనేది మానవుని సహజ స్వభావం. 'నా దేశాన్ని జాగృతం చేయండి' అనే చివరి మాటలను 'ప్రపంచాన్ని జాగృతం చేయండి' అనే మాటలతో భర్తీ చేస్తే సార్వజనీయత గోచరిస్తుంది. ఈ భావన స్ఫూర్తినిచ్చే ఒక అమూల్యమైన సందేశం. ఈ ప్రేరణ అన్ని అసమానతలను అధిగమించగల స్ఫూర్తిని, అపూర్వమైన సవాళ్లపై విజయం సాధించగలమనే సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది.

3. ప్రపంచ వ్యాప్తంగా క్లిష్టమయిన సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొని, సమిష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర మనకు చెబుతుంది. మన రాష్ట్రం ఇందుకు ఒక మహోజ్వల ఉదాహరణగా నిలిచింది. రాష్ట్ర విభజన తరువాత మనము అన్ని రంగాలను 2014 నుండి పునఃప్రారంభించ వలసిన పరిస్థితి ఏర్పడింది. విభజన సవాళ్లతో సతమతమవుతూ కోవిడ్-19 మహమ్మారితో సాహసోపేతమైన పోరాటం చేయవలసి వచ్చింది. అయితే ఒక ప్రక్క ప్రపంచ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, జీవనానికి రక్షణ వలయాన్ని నిర్మించుకుంటూ, మరొక ప్రక్క రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించాము. ఈ సంక్షోభ సమయంలో కూడా ఆరోగ్య సంరక్షణ నుండి సుస్థిరాభివృద్ధి వరకు అన్ని రంగాలలోని ప్రతికూలతలను అధిగమించాం. తద్వారా ఈ సంక్షోభాన్ని కూడా ప్రజల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకొచ్చి యథాస్థితికి చేరుకునే ఒక అవకాశంగా మా ప్రభుత్వం మార్చుకుంది.

4. కోవిడ్ మహమ్మారి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యత పొందిన అంశాలు రెండు. అవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు సుపరిపాలన. ఇవి రెండూ పరస్పర సంబంధం మరియు సార్వత్రిక ఆకాంక్షలు.

5. 'సుస్థిరత' జీవితానికి మార్గదర్శక సూత్రంగా, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (S.D.G. లు) సాధనకు బలమైన రాజకీయ నాయకత్వం, మంచి విధానాలు, సమర్థవంతమైన సంస్థలు మరియు ఫలితాల ఆధారిత పాలనపై ఆధారపడి ఉంటుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. 'సుస్థిర అభివృద్ధి' జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత మరియు సమాన అవకాశాలతో కూడిన సుపరిపాలనకు దారితీస్తుంది. అదేవిధంగా స్థిరమైన అభివృద్ధి సాధించడానికి సుపరిపాలన అవసరం. ఈ లక్ష్యాల నిజమైన అమలుకు బలమైన సంస్థలే పునాది రాళ్ళు. మా ప్రభుత్వం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తోంది.

6. దూరదృష్టి గల నాయకత్వం, సమర్థ పరిపాలన మరియు ఖచ్చితమైన నిర్వహణతో కూడిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కీలకమైనవి. ఈ సందర్భంలో ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్

కిప్లింగ్ రాసిన ప్రసిద్ధ కవిత 'If–' నుండి రెండు పంక్తులను గుర్తుచేస్తున్నాను.

“మీరు ‘విజయం' మరియు 'విపత్తు'లు కలిగిన సందర్భాలను ఒకేలా చూడగలిగితే

జన సమూహం మధ్య మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఔన్నత్యం చెక్కుచెదరదు.

మీరు రాజుల మధ్య నడిచేటప్పుడు కూడా సామాన్యుడి చేతిని విడువరు

మీరు ప్రతిఒక్కరి హృదయాలలో ఎప్పటికి నిలిచి ఉంటారు'

-రుడ్యార్డ్ కిప్లింగ్

7. ఈ వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నిజమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. ఆయన పాలనలో 'కష్టాలు రాకుండా ఎల్లవేళలా నిరోధించలేనప్పటికీ, ఆ కష్టాలను మంచి మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చనే భరోసాను' మనము చూస్తున్నాము. మరో మాటలో చెప్పాలంటే విజయాన్ని పొందినపుడు ఉదారంగా ఉండడం, కష్టాలను ఎదుర్కొనే ప్రతికూల సమయాలలో దృఢంగా ఉండటం ఆయన లక్షణాలు.

8. విధానపరమైన ఆవిష్కరణలు మరియు వినూత్న పాలనా విధానాలు మా ప్రభుత్వం యొక్క విశిష్ట లక్షణాలు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం నవరత్నాలు మరియు మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలు ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక సమ్మిళిత విధానాన్ని మా ప్రభుత్వం అవలంభించింది.

9. మా మ్యానిఫెస్టో యొక్క ముఖ్య లక్షణాలు సుస్థిర అభివృద్ధి మరియు సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనం. మా ప్రభుత్వం, పాలనలో మొదటి సంవత్సరమే ఈ సూత్రాలన్నింటినీ దాదాపుగా అమలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సూత్రాలు అమలులో ఎన్నో అవాంతరాలు ఏర్పడినప్పటికీ, వెనుకంజ వేయకుండా వీటన్నింటినీ సంపూర్ణంగా అమలు చేస్తున్నాము. నిజానికి, మా మేనిఫెస్టోలోని వాగ్దానాలకు మించి మా ప్రభుత్వం పనిచేస్తోంది.

10. వినూత్నమైన పాలనా విధానాల ఫలితంగా నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాటు; 1.34 లక్షల ఉద్యోగుల నియామకం; 2.65 లక్షల మంది వాలంటీర్ల నియామకం; 51,488 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.) ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోనికి తీసుకురావడం; 15,715 పాఠశాలలలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 3,707 వై.ఎస్.ఆర్. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు 461 వై.ఎస్.ఆర్. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం; 30.65 లక్షల ఇంటి స్థలాల పట్టాల పంపిణీ; 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం; జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం; 5.2 లక్షల ఇ-లెర్నింగ్ పరికరాల (ట్యాబ్ ల) పంపిణీ; సి.బి.ఎస్.ఇ. అనుబంధంతో ఇంగ్లీషు మీడియం విద్య, జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 9,249 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్సుమెంట్; వై.ఎస్.ఆర్. ఆసరా పథకం క్రింద స్వయం సహాయక సంఘాలకు ఋణాల రీయింబర్సుమెంట్ నిమిత్తం 19,133 కోట్ల రూపాయలు జమ చేయడం; వై.ఎస్.ఆర్. చేయూత పథకం క్రింద 14,129 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం; జగనన్నతోడు పథకం క్రింద 2,470 కోట్ల రూపాయల ఋణాల మంజూరు; వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం క్రింద 1.41 కోట్ల కుటుంబాలకు వర్తింపు; వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం క్రింద 971 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడం; 56 సామాజిక సంక్షేమ కార్పోరేషన్ల ఏర్పాటు; 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, 104-అంబులెన్స్ల సంఖ్యను పెంచడం; సంక్షేమ పింఛన్లను నెలకు 2,750 రూపాయలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టగలిగాము.

11. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు యంత్రాంగంలో సమూల మార్పులను గమనించవచ్చు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా, ప్రభుత్వం నేరుగా 21 రకాల వివిధ పథకాల క్రింద రాష్ట్రంలోని అర్హులైన లబ్దిదారులందరి బ్యాంకు ఖాతాలలోకి నగదును జమ చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదలీ పథకంను అమలుచేసేందుకు మా ప్రభుత్వం 1.97 లక్షల కోట్ల రూపాయలను ఇంత వరకు విడుదల చేసింది. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ ప్రత్యక్ష నగదు బదిలీ విధానము సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలులో ఒక అద్భుతమైన నమూనాగా నిలిచింది. ఈ విధానం సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను పూర్తిగా నివారించి అర్హులైన వారందరికీ ఎటువంటి అవాంతరాలు లేకుండా,

పారదర్శకంగా మరియు ప్రభావవంతమైన పద్ధతిలో సంక్షేమ చర్యలు అందేలా పని చేస్తుంది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి

12. 2018-19 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధికి సంబంధించి స్థిరమైన ధరలలో మన రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉంది. మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల కారణంగా, పెట్టుబడి మరియు వినియోగం రెండింటినీ అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధిని పొందింది. ఫలితంగా, మన రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను స్థిరమైన ధరలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధి పరంగా దేశంలో 1వ స్థానంలో ఉంటూ గుర్తించదగిన వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మన ప్రభుత్వం అందించిన మద్దతు రాష్ట్ర ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని, గత ఐదేళ్ళలో అత్యధిక వృద్ధిరేటును నమోదు చేయడానికి వీలుకల్పించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితులలో సైతం మా ప్రభుత్వం తన లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధి అవకాశాలకు కూడా ప్రాధాన్యతనిచ్చి పరిరక్షించిందని ఈ గణాంకాలు చూపుతున్నాయి.

13. 2022-23 ఆర్థిక సంవత్సరములో సవరించిన అంచనాల ప్రకారము రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13,17,728 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరములో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14,49,501 కోట్ల రూపాయలతో 10 శాతము వృద్ధిగా అంచనా వేయబడినది.

14. నవరత్నాలు మరియు మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ఏకీభవిస్తున్నాయి. ఇవి (ఎ) జీవనోపాధి, (బి) సామర్థ్య అభివృద్ధి మరియు సాధికారత, (సి) సామాజిక భద్రత మరియు (డి) మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి అనే నాలుగు అంశాల ద్వారా వివరించబడ్డాయి.

15. నేను ఈ నాలుగు అంశాల ద్వారా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానం చేస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంనకు బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

ఎ. జీవనోపాధి

16. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సుమారు 62 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నందున ఈ రంగాన్ని మన ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అందువలననే, వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎమ్.- కిసాన్, డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా-ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, డాక్టర్ వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు, డాక్టర్ వై.ఎస్.ఆర్. పొలం బడి వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువుల మరియు పరికరాలపై రాయితీలు మరియు వ్యవసాయ యాంత్రీకరణ వంటి కార్యక్రమాల ద్వారా ఈ రంగంలో ఉత్పాదకత మరియు ఆదాయాలను పెంపొందించడంపై మా ప్రభుత్వం తిరుగులేని దృష్టి పెట్టింది.

డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎమ్. కిసాన్

భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు.

వీరు అత్యంత శక్తి మంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబద్ధులు

-థామస్ జెఫెర్సన్

అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే ప్రభుత్వం ఇది.

నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే ప్రభుత్వం ఇది.

రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వం ఇది.

17. మే నెలలో వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాలు కొనుగోలు చేయడానికి, అక్టోబర్ నెలలో వారి పంటలను పండించుకోవడానికి మరియు జనవరి నెలలో ఇతర వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడానికి వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎమ్.కిసాన్ పథకం నిధులతో కలిపి మూడు విడతలలో 13,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు సకాలంలో మా ప్రభుత్వం అందజేస్తోంది. వాస్తవ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకుగాను, కౌలుదారులకు మరియు అటవీ హక్కుల క్రింద గుర్తించబడిన భూమిని సేద్యం చేస్తున్న (ఆర్.ఓ.ఎఫ్.ఆర్.) గిరిజన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయంగా 13,500 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా అందించబడుతున్నాయి. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా 27,063 కోట్ల రూపాయలను అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ పథకం క్రింద 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4,020 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ప్రతీ వస్తువును రిటైల్ గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని హోల్సేలే అమ్మేవాడే రైతు' అంటాడు జాన్.ఎఫ్. కెన్నడీ. ఇప్పటికీ ఇది చేదు వాస్తవం.

18. రైతులకు ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే నాణ్యమైన వస్తువులు మరియు పరికరాలు సరఫరా మొదలుకొని గ్రామస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వరకు డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 లక్షల మంది రైతులకు 187 కోట్ల రూపాయల విలువైన సుమారు 7 లక్షల క్వింటాళ్ల నాణ్యత ధృవీకరించబడిన మరియు సబ్సిడీతో కూడిన పంట విత్తనాలు మా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడ్డాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (F.A.O.), నీతి ఆయోగ్ మరియు భారత రిజర్వు బ్యాంకు - ఈ మూడు సంస్థలు మన రైతు భరోసా కేంద్రాల పనితనాన్ని ఎంతో ప్రశంసించి వాటి అవసరాన్ని గుర్తించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను మిగిలిన 7,578 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 40.46 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

19. వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువుల మరియు పరికరాల నాణ్యతా పరీక్షల కోసం 72 వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలను మా ప్రభుత్వం జూలై 8, 2021 న ప్రారంభించింది. ఈ పరీక్షా కేంద్రాలు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను మరియు భూసార పరీక్ష ఫలితాలను రైతులకు సకాలంలో అందజేస్తూ ఉండంవలన వారు తమతమ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంవలన మన రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో మిగిలిన 75 వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు మరియు జిల్లా స్థాయిలో మరో 11 పరీక్షా కేంద్రాలు 2023 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాల కోసం 36.39 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

20. వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడం మా ప్రభుత్వం చేపట్టే పథకాలలో ముఖ్యమైన లక్ష్యం. డాక్టర్ వై.ఎస్.ఆర్. పొలం బడి కార్యక్రమం ద్వారా పర్యావరణ అనుకూల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, సాగు ఖర్చు తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచడం కోసం మా ప్రభుత్వం సమగ్ర పంట నిర్వహణ పద్ధతులతో రైతులకు సాధికారత కల్పిస్తోంది. దీని కోసం 2021-22 ఆర్థిక సం॥లో 16,123 పొలం బడి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వివిధ పంటల విషయంలో సాగు ఖర్చు 21 శాతం తగ్గి మరియు దిగుబడి 23 శాతానికి పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17,000 పొలం బడి కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

21. ఇ-క్రాప్ మరియు ఇ-కె.వై.సి. తర్వాత గుర్తించబడిన ప్రాంతాలలో, గుర్తించబడిన పంటలు పండించే రైతులందరికీ స్వయంచాలకంగా అమలు అయ్యేలా 2019 ఖరీఫ్ కాలం నుండి మా ప్రభుత్వం డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పారదర్శకంగా, విశిష్టంగా మరియు సమర్థవంతంగా అందరికీ వర్తింపు హామీనిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం మాత్రమే కావడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి బీమా పరిహారముగా మొత్తం 6,872 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా 44.55 లక్షల మంది రైతులకు వారి వారి ఖాతాలకు జమచేయడమైనది. వీటిలో గత ప్రభుత్వ బకాయిలు కూడా ఉన్నాయి. 55 లక్షల హెక్టార్ల పై చిలుకు భూమికి సంబంధించి ప్రకటించిన విస్తీర్ణంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డా॥ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకానికి 1,600 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

22. 'వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు' పథకం క్రింద నిర్ధిష్ట సమయంలోపు రుణాలు చెల్లించే రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలను మా ప్రభుత్వం అందజేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి, వడ్డీ రాయితీ పరిహారం మొత్తాన్ని బ్యాంకులకు విడుదల చేయకుండా నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి, గత ప్రభుత్వ బకాయిలతో సహా 1,834 కోట్ల రూపాయలు 73.88 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రత్యక్ష నగదు బదలీ (డి.బి.టి.) విధానం ద్వారా జమ చేయడం జరిగింది. 33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

23. వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వ్యాపారులతో మన రాష్ట్ర రైతులను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫారమ్ అయిన ఇ-ఫార్మార్కెట్ను ఏర్పాటు చేసింది. ఈ ఇ-ప్లాట్ఫారమ్ ను విజయవంతంగా ఉపయోగిస్తున్న రైతులు మరియు వ్యాపారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడం అనేది డిజిటల్ మార్కెటింగ్ అయిన ఈ ఇ-ప్లాట్ఫామ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు 4,000 మందికి పైగా రైతులు మరియు 2,000 మందికి పైగా వ్యాపారులు ప్రయోజనాన్ని పొందారు. అదేవిధంగా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించకుండా కాపాడుతోంది.

24. వ్యవసాయ యాంత్రీకరణ: పెట్టుబడి మరియు నిర్వహణల ఆర్థిక భారం రైతులపై పడకుండా, చిన్న మరియు సన్నకారు రైతులకు అద్దెకు ఇచ్చు పద్ధతి (హైరింగ్ మోడ్ లో, వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం గల ప్రతి గ్రామంలోను 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి.హెచ్.సి.) లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. హార్వెస్టర్ మరియు స్ట్రా బేలర్లు కలిగి ఉన్న సుమారు 6,525 గ్రామ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి.హెచ్.సి.) లు మరియు 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి.హెచ్.సి.) లు వరి పండించే ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటుచేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ కోసం 1,212 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి

'పాడి లేని ఇల్లు పేడలేని చేను ఉండదు' అని నానుడి.

గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని మన రైతులు

సంతానంతో సమాన స్థాయిని పశువులకు ఇస్తూ వుంటారు.

25. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పశువుల పెంపకం ఒక ముఖ్యమైన రంగం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జోడించిన స్థూల విలువలో 11.45 శాతం వాటాను కలిగి ఉంది. 2021-22 ఆర్థిక సం॥లో మన రాష్ట్రం, దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోను ఉంది. స్థాపించబడిన 10,778 రైతు భరోసా కేంద్రాలలో, 9,844 పశుసంవర్ధక సహాయకుల మంజూరుతో పాటు అవసరమైన మందులు, పరికరాలు, పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార సంబంధిత మరియు సాధారణ సేవలు కూడా ఈ కేంద్రాల వద్ద అందించబడుతున్నాయి.

26. రైతులకు పశువుల బీమాను అందించడానికి అభివృద్ధి చెందిన మరియు స్వదేశీ పశువులే కాకుండా ఈ కోవకు చెందని పశువులు కూడా ఈ పథకం క్రిందకు వచ్చేటట్లుగా మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. పశు బీమా పథకాన్ని ప్రారంభించింది.

27. డా॥ వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్య సేవ: పశువుల సంరక్షణ కోసం రైతులు ఇంటి వద్దకే పశు సంబంధిత సేవలను అందించడానికి మా ప్రభుత్వం 340 అత్యవసర సంచార పశు వైద్యశాలలను ప్రారంభించింది. జంతు వ్యాధుల కచ్చితమైన నిర్ధారణకు మరియు జబ్బు పడిన జంతువుల సత్వర చికిత్స కోసం వినియోగించే రైతుల వనరులను ఆదా చేయడానికి డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలతో అనుసంధానం అయ్యేటట్లుగా 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణా కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి.

28. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం క్రింద, చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచింది. చమురుపై సబ్సిడీని లీటరుకు సుమారు 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. అంతేగాక చనిపోయిన ప్రతీ మత్స్యకార కుటుంబానికి ఇచ్చే సత్వర సహాయాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్ష రూపాయలకు పెంచింది. 61,682 రొయ్యలు మరియు చేపల సాగు రైతులకు విద్యుత్ పన్నును యూనిట్ రేటుకు రూ.6.89 పైసల నుండి రూ.1.50 పైసలకు తగ్గించడం జరిగింది.

29. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి 9 చేపలు పట్టే ఓడ రేవుల నిర్మాణాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశ క్రింద ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం మరియు జువ్వలదిన్నె ఓడ రేవులు నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, వోడరేవు మరియు కొత్తపట్నంలలో మిగిలిన 5 చేపలు పట్టే ఓడ రేవులు రెండవ దశలో చేపట్టనున్నాము. అలాగే, మంచినీలపేట, చింతపల్లి, భీమిలి మరియు రాజయ్యపేటలలో బెర్త్ మరియు పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో కూడిన 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం చేపట్టబడింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

30. మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో 4,24,07,705 మంది లబ్దిదారులు ఉన్నారు. ఫిబ్రవరి 2021 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకుల చేరవేతను ప్రవేశపెట్టినప్పటి నుండి లబ్దిదారుల సంఖ్య 84 శాతం నుండి 94 శాతంకి పెరిగింది.

31. దరఖాస్తుచేసిన 21 రోజులలో కొత్త కార్డులను గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటివరకు 48,75,906 దరఖాస్తులు ఈ విధానం ద్వారా పరిష్కరింపబడ్డాయి.

32. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద సార్టెక్స్ విధానం ద్వారా సేకరించబడిన నాణ్యమైన బియ్యాన్ని జనవరి 2021 నుండి పంపిణీ చేయడం ప్రారంభించింది. రక్తహీనత, సూక్ష్మ పోషక లోపాల సమస్యలను పరిష్కరించడానికి మరియు పోషకాహార లోపాల్ని తగ్గించడానికి ఇనుము, విటమిన్ బి-12 మరియు ఫోలిక్ యాసిడ్లతో సమృద్ధిగా ఉన్న బలవర్ధక బియ్యం పంపిణీని మొదటి సారిగా ఏప్రిల్, 2020 నుండి విజయనగరం జిల్లాలో మా ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత ఈ పథకాన్ని జూన్ 2021 నుండి సమగ్ర శిశు అభివృద్ధి పథకం మరియు మధ్యాహ్నం భోజన పథకాలకు కూడా విస్తరింప చేసింది. 2022 ఏప్రిల్ నుండి ఎక్కువ ఆవశ్యకత కలిగిన ఏడు జిల్లాలకు పూర్తిగా ఈ పంపిణీని విస్తరించడం జరిగింది. 2023 ఏప్రిల్ నుండి అన్ని జిల్లాలకు విస్తరింపచేసే విధంగా ప్రణాళిక చేయబడింది.

33. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆహార మరియు పౌర సరఫరాల శాఖకు 3,725 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

బి. మానవ సామర్థ్య పెంపు మరియు సాధికారత

శిశు సంక్షేమం మరియు మహిళా సాధికారత

లూయిస్ పాశ్చర్, ఒక ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు సూక్ష్మ జీవ శాస్త్రవేత్త కూడా. ఇతని పరిశోధనలు టీకాల ఆవిష్కరణకు పునాదులుగా ఉపయోగపడ్డాయి. వీరు ఒకసారి ఇలా అన్నారు.

'నేను ఒక పిల్లవాడిని కదిలించినప్పుడు,

అతను నాలో రెండు భావాలను ప్రేరేపించాడు -

అతను ఎలా ఉన్నాడో దాని పట్ల సున్నితత్వం మరియు

అతను ఎలా మారవచ్చో దానిపట్ల గౌరవం.'

34. మన రాష్ట్రంలో పిల్లలు, మహిళల శ్రేయస్సు మరియు వారి పోషకాహార అవసరాలు తీర్చడం కోసం 257 సమగ్ర శిశు అభివృద్ధి పథకాలకు సంబంధించిన (ఐ.సి.డి.ఎస్.) ప్రాజెక్ట్ లు, 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7,15,000 మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు 6 నెలల నుండి 72 నెలల మధ్య వయస్సు గల 25,76,000 మంది పిల్లలలో

రక్తహీనత మరియు పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం కోసం వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం క్రింద రోజూ ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు పోషకాహార కిట్, పాలు, గుడ్డు అందజేస్తున్నాము. 35. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సమీపంలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని అంగన్వాడీ కేంద్రాలు వై.ఎస్.ఆర్. ప్రారంభ ప్రాథమిక పాఠశాలలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలలో ప్రిపరేటరీ తరగతి, 1వ తరగతి మరియు 2వ తరగతి ఉంటాయి. ఇవి విద్యకు పునాదివేసే పాఠశాలలుగా పిలువబడుతున్నాయి.

ఆరోగ్య సంరక్షణ మరియు పోషకాహారం

36. కోవిడ్ అనంతర ప్రపంచంలో, ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే సంవత్సరాలలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ విషయంలో, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుండి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతోపాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు మరియు శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

37. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద 108 సేవలను, 104-సేవలను మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల క్రింద తగిన కేటాయింపులు చేయబడ్డాయి. మా ప్రభుత్వం వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యలలో భాగంగా మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకు వెళుతోంది. అనారోగ్య సమయాలలో రోగులు ప్రయాణించాల్సిన అవసరం లేదని మరియు తదుపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ OP, అంటు వ్యాధులు కాని వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు మరియు తరువాత సంరక్షణకై మరియు మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వైద్యులు సేవలు అందిస్తారు. ఈ వైద్యులు 104-MMU వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి డాక్టర్ వై.ఎస్.ఆర్. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను (విలేజ్ హెల్త్ క్లినిక్ లను) సందర్శిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు 14 రకాల లేబొరేటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు, ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు.

38. దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స మరియు నివారణ విధానాలను 2,446 నుండి 3,255 కి మా ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే విధంగా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా క్రింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు 5,000 రూపాయలు అందించబడుతుంది.

జగనన్న గోరుముద్ద

'ఆహార దోషము విజ్ఞాన నాశనమునకు మూలము' అని పెద్దలు చెప్పారు.

39. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన మరియు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా, మా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచటం ద్వారా జనవరి 2020 నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం (ఆర్.డి.ఎ.) కంటే కూడా ఎక్కువ పోషక విలువలతో కూడిన ఐదు గుడ్లు, మూడు వేరుశెనగ బెల్లం అచ్చులు మరియు 15 ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు ప్రతీ వారం అందించబడుతున్నాయి. ఇవి సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. మా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేస్తోంది.

40. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 15,882 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

మహిళా సాధికారత

మహిళలు స్ఫూర్తి ప్రదాతలు;

అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు;

ప్రకృతికి మరో రూపాలు;

మహిళలు మహిలో నడయాడే ఆది పరాశక్తులు.

మా ప్రభుత్వ విధానంలో మహిళా సాధికారత ఒక ప్రధాన లక్షణం.

జగనన్న పాల వెల్లువ

41. మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా, మహిళా పాడి రైతులను ఏకీకృతం చేయడానికి అదేవిధంగా వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను (ఎం.డి.ఎస్.ఎస్.) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్ట్ ను అమలులోనికి తీసుకువచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది. దళారులను తొలగించి పాడి రైతుల నుండి నేరుగా సుమారు 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించడం జరిగింది. ఈ విధానం వలన పాడి రైతులకు పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు 5 రూపాయల నుంచి 20 రూపాయలు వరకు మెరుగైన ధర ఇప్పుడు లభిస్తోంది.

వై.ఎస్.ఆర్. ఆసరా

42. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. ఆసరా పథకం క్రింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని 78.74 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 3 విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. ఆసరా పథకం యొక్క 4వ విడత కోసం 6,700 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ

43. సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించబడ్డాయి. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. చేయూత

44. ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

45. మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్ఞావల' మరియు 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవా గృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం క్రింద రాష్ట్ర కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

46. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి మరియు పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

విద్య

'అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది,

సృజనాత్మకత ఆలోచనకు దారి తీస్తుంది,

ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది,

జ్ఞానం నిన్ను గొప్పవానిగా చేస్తుంది'

-ఎ.పి.జె. అబ్దుల్ కలాం

'వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదు; నేర్చుకున్నవారే దాన్ని ఇతరులకు నేర్పించగలరు' అన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం,మా ప్రభుత్వం.

47. మన ప్రభుత్వం మన బడి నాడు నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టి.ఎమ్.ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి (ఎస్.ఎమ్.ఎఫ్) మరియు సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి-విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలలో విద్యను మెరుగుపరచి మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.

48. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్దిష్టమైన తరగతి అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి గాను డిజిటల్ కంటెంట్ ను ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు మరియు విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సి.బి.ఎస్.ఇ.) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసింది.

జగనన్న అమ్మ ఒడి

49. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా మా ప్రభుత్వం చూస్తున్నది. ఈ పథకం క్రింద, 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 44 లక్షల 50 వేల మంది తల్లులకు మరియు 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అమ్మ ఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

50. అదేవిధంగా, మన బడి నాడు నేడు కార్యక్రమం క్రింద, 15,715 పాఠశాలలలో అదనపు తరగతి గదులు, సురక్షిత త్రాగునీరు, పెద్ద మరియు చిన్నచిన్న మరమత్తు పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, పెయింటింగ్, ఫర్నిచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్ లు మరియు వంట శాలలు అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడ్డాయి. ఈ కార్యక్రమము క్రింద మొదటి మరియు రెండవ దశలలో మొత్తము 22,344 పాఠశాలలలో పనులు చేపట్టబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మన బడి నాడు-నేడు

కార్యక్రమం కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న విద్యా కానుక

51. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరచడానికి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, యూనిఫామ్ లు, బూట్లు, సాక్స్లు, పాఠ్య పుస్తకములు, వర్క్ బుక్ లు, స్కూల్ బెల్ట్ మరియు మాస్క్ ల సెట్లతో కూడిన 'టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్' ను విద్యార్థి కిట్ల రూపంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ పథకం క్రింద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూర్చేందుకుగాను మా ప్రభుత్వం ఇప్పటివరకు 2,368 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక పథకం కోసం 560 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

విద్య మాత్రమే మానవాళికి జీవనాడి. విద్య వలన ఆత్మ విశ్వాసం మెరుగుపడుతుంది.

ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుంది అన్నారు.

-స్వామి వివేకానంద

52. పాలిటెక్నిక్, ఐ.టి.ఐ., ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ మరియు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. జగనన్న వసతి దీవెన పథకం క్రింద ఉన్నత విద్యలో స్థూల హాజరు నమోదు నిష్పత్తిని మెరుగుపరిచే లక్ష్యంతో విద్యార్థుల ఆహారం మరియు వసతి గృహాల ఖర్చులను భరిస్తుంది. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, కాపు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల వర్గాల విద్యార్థులందరికీ ఈ పథకాలను అమలు చేస్తున్నాము. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 9,249 కోట్ల రూపాయలను రీయింబర్స్మెంట్ చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన పథకం క్రింద 3,366 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకం నకు 2,841 కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి దీవెన పథకం నకు 2,200 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

53. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం 29,690 కోట్ల రూపాయల మరియు ఉన్నత విద్య కోసం 2,064 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

'భారత దేశ ఆత్మ గ్రామాలలో నివశిస్తుంది.'

-మహాత్మా గాంధీ

54. మా ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (M.G.N.R.E.G.S.) ను అమలు చేస్తోంది. ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భవనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే నిర్మాణాలు, 8,320 భారత్ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు మరియు నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18.39 కోట్ల పని దినాలు కల్పించబడ్డాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేయబడ్డాయి.

55. ఉచితంగా బోరు బావులు త్రవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సన్న, చిన్నకారు రైతుల కోసం వై.ఎస్.ఆర్. జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020 న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు త్రవ్వడం జరిగింది.

56. మా ప్రభుత్వం కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి క్రిందకు తీసుకురాబడతాయి.

57. మా ప్రభుత్వం 250 మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు' ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సం॥లో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసం

58. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పట్టణ అభివృద్ధి

59. 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సుస్థిర నగరాలు మరియు సమాజాల అభివృద్ధి. చక్కగా నిర్వహించబడుతున్న పట్టణ అభివృద్ధి మరియు పౌర కేంద్రీకృత సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వార్డు సచివాలయం మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థల ద్వారా 123 పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోను పట్టణ స్థాయి సేవలు అన్నీ జవాబుదారీగా, పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా అందించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.

60. మంగళగిరి, తాడేపల్లి పురపాలక ప్రాంతాలలో మౌలిక వసతులు, సేవలను మెరుగుపరిచి నమూనా పట్టణాలుగా ఉండేటట్లుగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉన్నది. అదే సమయంలో, ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలలో పురపాలక పాఠశాలల పరివర్తన పథకాన్ని అమలు చేస్తోంది. పురపాలక ప్రాంతాలలో ఉన్న ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం మరియు వ్యర్థాలను పారవేయడం, పరిసరాల గాలి నాణ్యత మరియు త్రాగు నీటిని మెరుగుపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తగిన శ్రద్ధ తీసుకుంటోంది.

61. ఇటీవల జరిగిన ప్రపంచ పెట్టుబడుదారుల సదస్సు తర్వాత, విశాఖపట్నంలో మార్చి 28 మరియు 29 తేదీలలో ఫైనాన్స్ ట్రాక్ క్రింద జి-20 మౌలిక వసతులను ఏర్పాటు చేసే వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు మా ప్రభుత్వం సిద్ధమవుతోంది. రోడ్లు వేయడం, ఫుట్ పాత్ పునరుద్ధరణ, కొత్త బీచ్ స్ట్రెచ్ అభివృద్ధి మరియు బీచ్లను పరిశుభ్రం చేయడం ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడ్డాయి. మౌలిక వసతులను ఒక ఆస్తి విలువగా అభివృద్ధి చేయడం, నాణ్యమైన మౌలిక సదుపాయల మదుపును ప్రోత్సహించడం, ఇన్ఫ్రా-టెక్, మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం మదుపు కొరకు ఆర్థిక వనరులను సమీకరించే వినూత్న సాధనాలను గుర్తించడం వంటి వివిధ అంశాలలో నిమగ్నమవ్వడానికి జి-20 సమావేశం మాకు మరో అవకాశాన్ని అందిస్తుంది.

62. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధికి 9,381 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ

మనం పనిచేస్తున్న విధానానికి;

అదే పనిని చేయగల సామర్థ్యానికి గల తేడాను అధిగమించగలిగితే,

ప్రపంచంలో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించగలము.

-మహాత్మా గాందీ

63. నేటి పోటీ ప్రపంచంలో యువత అభివృద్ధి చెందాలంటే సరైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఎంతో అవసరం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రానికి క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ మోడల్ ను రూపొందించారు. ఈ వ్యవస్థలో రాష్ట్ర స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, జిల్లా స్థాయిలో నైపుణ్య కళాశాలలు మరియు నియోజక వర్గ స్థాయిలో నైపుణ్య కేంద్రాలు ఉంటాయి. ఇవి అభ్యర్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు మరియు ప్రత్యేకతలను అందించడంలో భాగస్వాములుగా ఉంటూ, పాఠ్యాంశాలను రూపొందించడం, నిర్వహించడం మరియు ఉద్యోగ అవకాశాలను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 21 జిల్లాలలో 21 నైపుణ్య కళాశాలలు, 175 అసెంబ్లీ నియోజిక వర్గాలలో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తదితర రంగాలలో 50,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు నైపుణ్యాన్ని కల్పించడం కోసం ఏటా ప్రణాళికలు రూపొందిండం జరిగింది.

64. పారిశ్రామిక విలువల పెంపుదల కోసం నైపుణ్యాలను బలోపేతం చేసే కార్యక్రమం (STRIVE) క్రింద పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ.టి.ఐ.) లలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను కూడా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం రెండు కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆదోని మరియు రాయచోటిలలో స్థాపించబోతున్నాము. 18 రకాల నైపుణ్యాలలో ద్వంద్వ శిక్షణా విధానాన్ని నిర్వహించుకోవడానికి 81 పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు 154 మంది విభిన్న రంగాలకు చెందిన పారిశ్రామిక భాగస్వాముల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల వలన విద్యార్థులు తమ శిక్షణా కాలవ్యవధిలో సగం కాలాన్ని పరిశ్రమలలో ఉద్యోగ శిక్షణ పొందేందుకు వెచ్చించడం వలన విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోగలుగుతారు. 65. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధికి 1,166 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

యువజన అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి

'ఒక దేశం యొక్క యువత తమ భావితరాలకు నిర్ణేతలు.'

- బెంజమిన్ డిప్రెలీ

66. మా ప్రభుత్వం చక్కని క్రీడా సౌకర్యాలను కల్పించడం ద్వారా మన రాష్ట్ర యువతను దేశంలోనే అత్యంత ఆరోగ్యకరంగా, సంతోషకరంగా మరియు పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన వ్యక్తులుగా రూపొందించాలని భావిస్తోంది. ప్రభుత్వం 39 క్రీడా వికాస కేంద్రాలకు సంబంధించిన పనులను పూర్తి చేయగా 67 కేంద్రాలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను.

67. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు క్రీడల కోటా క్రింద, రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య, దంత వైద్య విద్య, ఇంజనీరింగ్ మొదలైన వృత్తిపరమైన కోర్సుల ప్రవేశాలలోను, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలోని నియామకాలలోను మా ప్రభుత్వం రిజర్వేషను అమలు చేస్తోంది.

68. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అభివృద్ధి చోదక శక్తి అయిన పర్యాటక రంగాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో మౌలిక సదుపాయాలైన థీమ్ పార్కులు, వినోద ఉద్యానవనాలు, పర్యాటక సౌకర్యాలు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వసతి సదుపాయాలు, హోటళ్లు మొదలైన వాటిని అభివృద్ధి చేయడం ద్వారా మన రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మార్చడం ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2020-2025 యొక్క లక్ష్యం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు లభించిన విశేష స్పందనే నిదర్శనం. మన రాష్ట్ర పర్యాటక రంగంలో సుమారు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

69. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి చిహ్నంగా స్మృతి వనాన్ని నిర్మిస్తోంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేపట్టింది. ఈ స్మృతి వనంలో 2 వేల మంది కూర్చోగల ఒక ఆడిటోరియం, 500 మంది కూర్చోగల ఒక ఓపెన్ థియేటర్ మరియు ఒక ధ్యాన మందిరం కూడా ఉంటాయి.

70. మన రాష్ట్రం యొక్క గొప్ప వారసత్వం మరియు సంస్కృతిపై అవగాహన కల్పించడం మరియు ప్రచారం చేయడం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రయత్నంలో, రాష్ట్రంలోని మ్యూజియం సందర్శకులకు సుసంపన్నమైన అనుభవాన్ని అందించడానికి అధునాతన డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే టెక్నాలజీలు, వర్చువల్ రియాలిటీ, ప్రేక్షకులను ప్రత్యక్షంగా లీనంచేసే ప్రదర్శనల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడలోని బాపు మ్యూజియంలోను మరియు కొండపల్లి కోటలోను అమలు చేయడం జరిగింది. ఈ అధునాతన డిజిటల్ టెక్నాలజీలను ఏలూరు మరియు అనంతపురం మ్యూజియంలలో కూడా ఇప్పుడు అమలు చేయనున్నాము.

71. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను యువజన అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ కోసం 291 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

సి. సామాజిక భద్రత

"న్యాయమైన సమాజం అంటే, దానిపట్ల గౌరవం పెరగటం మరియు

ధిక్కార భావం తగ్గటం. ఇది కరుణ గల సమాజ నిర్మాణంలో మాత్రమే సాధ్యం.”

- డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్

72. సాంఘిక సంక్షేమంలో ప్రభుత్వ చొరవ అనేది జీవనోపాధిని రక్షిస్తూ మరియు సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి సహాయాన్ని అందిస్తూ ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత మరియు సంక్షేమంపై పెట్టిన ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం శాతం 4.7 మాత్రమే. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి 13 శాతంగా ఉందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. మా ప్రభుత్వం సామాజిక భద్రతా విధానాల ప్రయోజనకరమైన ప్రభావాన్ని పరిశీలిస్తే, మా ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన లబ్దిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్నాము.

73. రాష్ట్రంలోని షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల, అల్పసంఖ్యాక వర్గాల, కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారి పరిపూర్ణ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం వెనుకబడిన తరగతి వర్గాలకు 56 కార్పోరేషన్లు, షెడ్యూలు కులాలకు చెందిన వారికి 3 కార్పోరేషన్లు మరియు షెడ్యూలు తెగలకు చెందిన వారికి 1 కార్పోరేషన్ ను ఏర్పాటు చేసింది.

74. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం అల్పసంఖ్యాక వర్గాల అవసరాలను తీర్చడానికి తగిన కేటాయింపులు జరిగేలా మా ప్రభుత్వం మైనార్టీ కాంపోనెంట్ను అమలు చేస్తుంది. మా ప్రభుత్వం నెలకు, మౌజన్ లకు 5,000 రూపాయలు, ఇమామ్ లకు 10,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలను గౌరవ వేతనంగా చెల్లిస్తుంది. ఈ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం వై.ఎస్.ఆర్. షాదీ తోఫాను అమలు చేస్తోంది. హజ్ యాత్రికులు మరియు జెరూసలేం యాత్రికుల ప్రయాణ ఖర్చులకు మా ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక

75. ప్రమాణ స్వీకారం చేసిన నాడే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి నిర్ణయం ద్వారా అంతకుముందు సుమారు 5 సంవత్సరాలపాటు 1,000 రూపాయలగా ఉన్న పింఛను మొత్తాన్ని 2,250 రూపాయలకు పెంచడం ద్వారా పింఛనుదారులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేటట్లు చేయడం. మేనిఫెస్టోలో చెప్పిన హామీకి అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలోని 64.45 లక్షల మంది పింఛనుదారులకు జనవరి 1, 2023 నుండి ప్రభుత్వం వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుకను నెలకు 2,750 రూపాయలకు పెంచింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మున్ముందు ఈ పింఛన్ను 3,000 రూపాయలకు పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక కోసం 21,434 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. కాపు నేస్తం

76. మా ప్రభుత్వం ఇప్పటివరకు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 నుండి 60 సం॥ల మధ్య వయస్సు గల మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం వై.ఎస్.ఆర్. కాపు నేస్తం పథకం క్రింద ఇప్పటి వరకు 1,997 కోట్ల రూపాయల సహాయం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులైన మహిళా లబ్దిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. కాపు నేస్తం కోసం 550 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. బీమా

77. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు బీమా రక్షణను అందించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జూలై 1, 2021 న వై.ఎస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 1.21 కోట్ల మంది ఈ పథకం క్రింద నమోదు చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. బీమా కోసం 372 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. ఈ.బి.సి. నేస్తం

78. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారి స్వయం ఉపాధికి మార్గాలు కల్పించడం కోసం, మా ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందచేస్తున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. ఈ.బి.సి. నేస్తం కోసం 610 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం

79. చేనేత వృత్తి ప్రపంచంలోని పురాతనమైన వృత్తులలో ఒకటి. మన రాష్ట్రంలోని నేత సంఘాలు శతాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతికూల పరిస్థితులలో కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడి పొందూరు ఖద్దరు, ఉప్పాడ, ధర్మవరం పట్టు, మంగళగిరి కాటన్ మరియు శ్రీకాళహస్తి కలంకారీ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. దీనిని గుర్తిస్తూ మా ప్రభుత్వం ప్రతీ నేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ తద్వారా వారి జీవనోపాధికి భరోసాను కల్పిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం కోసం 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న తోడు

80. ఈ పథకం క్రింద చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, సాంప్రదాయ హస్తకళాకారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది. ఈ పథకం క్రింద 15.31 లక్షల లబ్దిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం క్రింద పంపిణీ చేసిన రుణం మొత్తం సుమారు 2,470 కోట్ల రూపాయలు. జగనన్న తోడు పథకం క్రింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న చేదోడు

81. రజకులు, నాయీ బ్రాహ్మణులు మరియు దర్జీలు సమాజానికి అపారమైన మరియు తిరుగులేని సేవలను అందిస్తున్నారు. అవ్యవస్థీకరమైన అధిక వడ్డీ ఋణాలపై వారు ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వయం ఉపాధి కొనసాగించడం కోసం ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం అందజేస్తోంది. జగనన్న చేదోడు పథకం క్రింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. వాహనమిత్ర

82. సొంత వాహనాన్ని కలిగి ఉన్న టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల సేవలను అభినందిస్తూ వారి వృత్తిలోని సవాళ్ళను ఎదుర్కొనేందుకు సంవత్సరానికి 10 వేల రూపాయల సహాయంను అందజేస్తుంది. ఈ సహాయం వారి వాహన బీమా, మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ ఛార్జీల కోసం ఉపయోగపడుతుందని భావించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. వాహనమిత్ర పథకం క్రింద 275 కోట్ల రూపాయల కేటాయింపును

నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. లా నేస్తం

83. క్రొత్తగా పట్టభద్రులైన న్యాయవాదులకు వారి వృత్తి యొక్క ప్రారంభ కాలంలో ఆర్థిక మద్దతు క్రింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందజేస్తున్నాము. వై.ఎస్.ఆర్. లా నేస్తం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్

84. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూలు కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు, షెడ్యూలు తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

కాపు సామాజిక వర్గం మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం

85. కాపు సామాజిక వర్గానికి వివిధ సంక్షేమ కార్యక్రమాల క్రింద ప్రతి సంవత్సరం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,203 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

డి. మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి

గృహ నిర్మాణం

86. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇండ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది.

87. మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు మరియు మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తోంది. లబ్దిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మరియు ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్ మరియు 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద 5,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు

88. పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు, అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మన రాష్ట్రం యొక్క పటిష్ఠతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్.టి.పి.సి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, భారత్ బయోటెక్, జి.ఎం.ఆర్. గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్, సెంచురీ ప్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, మరియు అనేక ఇతర ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి.

89. ఈ సదస్సులో 48 దేశాల నుండి రాయబారులు, దౌత్యవేత్తలు మరియు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, సింగపూర్ మరియు జపాన్ల నుండి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు మన రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యముపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యు.ఎ.ఇ., నెదర్లాండ్స్, వియత్నాం మరియు పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో మన రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం.

90. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుండి వచ్చిన ఈ విశేష స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి మరియు విశ్వసనీయతకు నిదర్శనము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారులు అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్ గా ఉంటాయి. దీనిలో భాగముగా ఏప్రిల్ 2019 నుండి 36,972 దరఖాస్తులు స్వీకరించబడి, వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి.

91. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి మరియు 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదేవిధంగా, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.

92. మా ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు - క్లస్టర్ అభివృద్ధి (ఎం.ఎస్.ఇ-సి.డి.పి.) ప్రాజెక్టుల క్రింద కేంద్ర ప్రభుత్వం నుండి మా ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోడ్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్ మరియు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వి.సి.ఐ.సి.) క్రింద కడప నోడ్ యొక్క కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది.

93. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వై.ఎస్.ఆర్. జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాము. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని 'వై.ఎస్.ఆర్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్' ను కూడా అభివృద్ధి చేస్తున్నాము. దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని మరియు 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను.

94. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో మన రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

95. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

రవాణా మరియు రహదారుల మౌలిక సదుపాయాలు

96. రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు మరియు జిల్లాలలోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైనది. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరియు అత్యవసర మరమ్మతులను మా ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల మరియు జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని మా ప్రభుత్వం సాధించగలిగింది.

97. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి.

98. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

నీటి వనరులు

'నీరము తప్త లోహమున నిల్చి' అనే భర్తృహరి సుభాషితం ఈ విధంగా చెబుతుంది.

వర్షపు చినుకు యొక్క భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది.

సలసలా కాలుతున్న ఇనుము మీద నీటిచుక్క పడితే అది క్షణాలలో ఆవిరి అవుతుంది.

అదే నీటి బిందువు తామర అకుమీద పడితే తళతళ మెరుస్తుంది.

అదే అల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది.

రైతన్నల పొలాలలో పడితే మొక్కలుగా మొలచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది.

99. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మరియు నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్ మరియు కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెన్నా నది మీద పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు.

100. కర్నూలు మరియు నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు మరియు త్రాగునీరు అందుబాటులోకి వస్తూ ప్రజల చిరకాలస్వప్నం నెరవేరనున్నది.

101. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట మరియు కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి. పునర్నిర్మాణ మరియు పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము.

102. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం క్రింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన త్రాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అనుసంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశ లోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడమైనది.

103. నల్లమల సాగర్ కు నీరందించేందుకుగాను పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికానున్నది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ మరియు రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ యొక్క మొదటి దశను మార్చి 2025 నాటికి మరియు రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైనది.

104. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022 న మరియు కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేయడం జరిగింది. జూలై 31, 2022 న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని గౌరవ సభకు తెలియచేసుకుంటున్నాను.

105. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలను

నేను ప్రతిపాదిస్తున్నాను.

పర్యావరణం మరియు అడవులు

'మనం మొక్కలు నాటడం అంటే, ఆశ మరియు శాంతి అనే విత్తనాలను నాటినట్లే.

మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే'

-వంగారి మాతాయి

106. మన రాష్ట్రం విభిన్న పర్యావరణ వ్యవస్థలను మరియు వివిధ ఆవాసాలను కలిగి ఉంది. పౌరులకు స్థిరమైన నివాస స్థలాన్ని సృష్టించడానికి భౌగోళిక ప్రాంతంలో 33 శాతం వరకు పచ్చదనాన్ని కలిగి ఉండడం దానిని రక్షిస్తూ అభివృద్ధి పరచడం చాలా అవసరమని మా ప్రభుత్వం గుర్తించింది. దీనిని సాధించేందుకు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న పచ్చతోరణం క్రింద అన్ని శాఖలు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో మరియు కాంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (సి.ఎ.యం.పి.ఎ.), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్ర ఇతర అభివృద్ధి పథకాలు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సమకూర్చుకోవడం ద్వారా 3.05 కోట్ల మొక్కలను నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నగర వనం పథకం క్రింద పట్టణ మరియు పట్టణ శివారులలో విరామ సమయాలలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వినోదం మరియు శ్రేయస్సు కోసం పార్కులు మరియు గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని కూడా మా ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వాతావరణాన్ని తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖకు 685 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ఇంధనం

107. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇంధన భద్రత తప్పనిసరి. వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రం రేఖకు దిగువన ఉన్నవారికీ 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనదిశగా సరసమైన, నమ్మదగిన మరియు సమర్థవంతమైన ఇంధన సేవలను 2030 నాటికి సార్వత్రికంగా అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మా ప్రభుత్వం 18.74 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాను, షెడ్యూలు కులాల మరియు తెగల నివాసాలలోని ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది. దీనితో పాటు దోభీఘాట్లకు, దారిద్య్రరేఖకు దిగువనున్న రజక కుంటుంబాలకు, వెనుకబడిన కులాలవారికి, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు విద్యుత్ రాయితీని వర్తింపచేస్తున్నాము.

108. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విద్యుత్ రాయితీని చిన్న గ్రానైట్ యూనిట్లకు ఒక యూనిట్ కి 2 రూపాయలుగా ప్రకటించారు. నాపరాతి యూనిట్లకు కూడా ఇదే విధమైన ప్రయోజనాన్ని వర్తింపజేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

109. మా ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కోసం నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రైతులపై భారం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంధన శాఖకు 6,546 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిపాలన

110. గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం అనేవి వికేంద్రీకృత, పౌర-కేంద్రీకృత, పారదర్శక పాలన యొక్క మరొక విశిష్ట నమూనా. దీనిని మా ప్రభుత్వం ఆగష్టు 15, 2019 నుండి ప్రజలకు అందిస్తోంది. కుల, మత, ప్రాంత, లింగ మరియు వారి వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా, అన్ని సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులైన లబ్దిదారులకు అందించబడుతున్నాయి. పౌరుల అన్ని అవసరాలను తీర్చడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల 'వన్ స్టాప్ సొల్యూషన్' గా మారాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మరియు మన రాష్ట్ర పౌరుల శ్రేయస్సు కోసం సురక్షితమైన, ఆరోగ్యకరమైన, సంపన్న వాతావరణాన్ని నిర్మించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం శాఖకు 3,858 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

111. మహిళల భద్రత కొరకు సత్వరం ప్రతి స్పందించడానికి ఫిబ్రవరి 2020 లో మా ప్రభుత్వం ప్రారంభించిన దిశా యాప్ 1.36 కోట్ల కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితులలో మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి 163 గస్తీ వాహనాలను ఏర్పాటుచేసినారు.

112. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో, పౌరులకు అవసరమైన విధంగా మౌలిక సదుపాయాలు మరియు ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన వివిధ సమస్యలను గౌరవ శాసన సభ్యులకు మరియు ప్రజా ప్రతినిధులకు తెలియజేయడం ద్వారా మా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఎక్కువ ప్రభావాన్ని చూపే మౌలిక సదుపాయాలకు మరియు నిర్వహణ పనులను మంజూరు చేయడానికి మరియు అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అనుమతించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం 532 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

113. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిని గమనించడానికి మా ప్రభుత్వం 475 సూచికలతో కూడిన రాష్ట్ర ముందస్తు పని సూచిక ను అభివృద్ధి చేసింది. నవరత్నాలు సహా అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉద్దేశించిన ఫలితాల ఆధారంగా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఇలా చేయడం ద్వారా, గ్రామ మరియు వార్డు సచివాలయల స్థాయి వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మా ప్రభుత్వం అమలు చేస్తోంది. అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమర్థవంతమైన అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రక్రియలు మరియు ప్రామాణిక నిర్వహణ విధానాలను డాక్యుమెంట్ చేసిన కొన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ఒకటి.

ఆర్థిక వృద్ధి ధోరణుల సమీక్ష

లెక్కలు 2021-22

114. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక ఖాతాలలో రెవెన్యూ లోటు 8,610 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 25,011 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు 0.72 శాతంగాను మరియు ద్రవ్య లోటు 2.08 శాతంగాను ఉన్నాయి.

సవరించిన అంచనాలు 2022-23

115. సవరించిన అంచనాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,05,555 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 16,846 కోట్ల రూపాయలు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 29,107 కోట్ల రూపాయలు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 47,716 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో వరుసగా 2.21 శాతం గాను మరియు 3.62 శాతంగా ఉన్నాయి.

2023-24 బడ్జెట్ అంచనాలు

116. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, నేను 2,79,279 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,28,540 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం అంచనా 31,061 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 22,316 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 54,587 కోట్ల రూపాయలుగా

ఉండవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు 3.77 శాతం గాను మరియు ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉండవచ్చు.

ముగింపు

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయకమైన మాటలతో ముగించాలను కుంటున్నాను.

'కల అంటే నిద్రలో వచ్చేది కాదు

నిద్ర పోకుండా చేసేది.’

117. ఒకసారి కలగంటే అది కల; అదే కలని రెండోసారి కంటే అది కోరిక; మూడవసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం.

118.

పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.

ఈ ధ్యేయాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ ద్వారా సాధించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి పూర్తి నిబద్ధతతో ఉంది.

మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించేలా చేయడమే మా గమ్యం.

సాధికారత పొందిన ప్రజలు, మన రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచానికి తమ సత్తాను చాటాలని మా ప్రభుత్వ ఆకాంక్ష.

ఈ మాటలతో, 2023-24 బడ్జెట్ ను గౌరవ సభ ఆమోదం కోసం నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను.

జై ఆంధ్రప్రదేశ్

జై హింద్.

ANNEXURE-I

SECRETARIET DEPARTMENT WISE BUDGET ALLOCATION

Sl.No DEPARTMENT BE 2022-23 RE 2022-23 BE 2023-24
1 Agriculture Marketing and Co-Operation 11544.1 10460.15 11589.48
2 Animal Husbandry, Dairy Development and Fisheries 1568.83 1375.57 1787.5
3 Backward Classes Welfare 20962.06 20357.71 23508.81
4 Environment, Forest, Science and Technology 685.36 443.72 685.5
5 Higher Education 2014.3 1878.04 2064.71
6 Energy 10131.04 8334.66 6546.21
7 Secondary Education Secretariat 27706.66 25741.52 29690.71
8 Department of Economically Weaker Sections (EWS) Welfare 10201.6 8441.14 11085.54
9 Food and Civil Supplies 3719.24 3729.1 3725.32
10 Finance 58583.61 66359.9 72424.41
11 General Administration 998.55 1046.05 1147.91
12 Gram Volunteers/ Ward Volunteers and Village Secretariats / Ward Secretariats 3396.25 3756.07 3858.34
13 Health, Medical and Family Welfare 15384.26 13298.86 15882.34
14 Home 7586.84 6968.33 8206.57
15 Housing 4791.69 7277.18 6291.7
16 Water Resources 11482.37 10741.2 11908.1
17 Infrastructure and Investment 1292.53 702.16 1295.22
18 Industries and Commerce 2598.76 793.8 2602.13
19 Information Technology, Electronics and Communications 212.13 176.4 215.14
20 Labour, Factories, Boilers and Insurance Medical Services 790.04 497.45 795.8
21 Law 924.03 978.62 1057.66
22 Legislature Secretariat 107.16 106.16 111.05
23 Municipal Administration and Urban Development 8796.33 7431.1 9381.55
24 Minorities Welfare 2063.15 1875.36 2240.09
25 Public Enterprises Secretariat 1.67 1.07 1.67
26 Planning 615.33 782.57 809.46
27 Panchayat Raj and Rural Development 15846.43 9803.76 15873.83
28 Revenue 5306.94 5259.36 5379.9
29 Department of Real Time Governance 52.72 74.27 73.19
30 Department of Skills Development and Training 969.91 743.85 1166.64
31 Social Welfare 12728.26 11790.86 14511.46
32 Transport, Roads and Buildings 8581.25 5413.06 9118.71
33 Women, Children, Differently Abled and Senior Citizens 4322.86 3594.81 3951.29
34 Youth Advancement, Tourism and Culture 290.31 275.44 291.33
Total 256256.57 240509.3 279279.27
ANNEXURE II

Sector Wise Budget Estimates 2023-24

SECTOR BE 2022-23 RE 2022-23 BE 2023-24
ECONOMIC SERVICES
Agriculture & Allied Services 13786.52 12270.61 14043.63
Rural Development 17109.06 13108.7 17531.79
Irrigation & Flood Control 11482.37 10741.2 11908.1
Energy 10131.04 8334.66 6546.21
Industry & Minerals 2598.76 793.8 2602.13
Transport 9767.15 6039.7 10322.57
Science Tech, Environment 11.78 8.84 18.85
General Eco Services 4420.07 4618.48 4617.78
SOCIAL SERVICES
General Education 30077.2 27704.38 32198.39
Sports & Youth Services 140.48 100.47 138
Technical Education 413.5 529.93 512.37
Art and Culture 20.67 28.64 26.34
Medical 15384.26 13298.86 15882.34
Water Supply , Sanitation 2133.63 451.14 2200.39
Housing 4791.69 7277.18 6291.7
Urban Development 8796.33 7431.1 9381.55
I & P 261.65 251.97 294.38
Welfare 45955.07 42465.08 51345.89
Labor and Employment 1033.86 666.07 1051.1
Social Security & Welfare 4331.85 3603.37 3960.51
General Education 30077.2 27704.38 32198.39
Sports & Youth Services 140.48 100.47 138
GENERAL
General Services 73609.63 80785.17 88405.27
Total 256256.57 240509.35 279279.27
DBT SCHEMES
Sl. No Item BE 22-23 RE 2022- 23 BE 2023- 24
1 YSR Pension Kanuka 18002.35 17850.71 21434.72
2 YSR Rythu Bharosa 3900.00 3988.52 4020.00
3 Jagananna Vidya Deevena 2500.00 2841.64 2841.64
4 Jagananna Vasati Deevena (M TF) 2083.32 2083.32 2200.00
5 YSR - PM Fasal Bima Yojana 1802.04 2943.21 1600.00
6 Y.S.R Interest free Loans to Self Help Groups 600.00 600.00 700.00
7 Y.S.R Interest free loans to urban Self Help Groups 200.00 236.10 300.00
8 Y.S.R Interest free Loans to Farmers 500.00 286.34 500.00
9 YSR Kapu Nestham 500.00 536.09 550.00
10 YSR Jagananna Chedodu 300.00 346.08 350.00
11 YSR Vahana Mitra 260.00 270.76 275.00
12 YSR Nethanna Nestham 199.99 199.07 200.00
13 YSR Matsyakara Bharosa 120.49 123.09 125.00
14 Diesel Subsidy to Fishermen Boats 50.00 53.31 50.00
15 Exgratia to Farmers 20.00 20.00 20.00
16 Law Nestham 15.00 15.00 17.00
17 Jagananna Thodu 25.01 31.46 35.00
18 EBC Nestham 590.00 9.43 610.00
19 YSR Kalyanamasthu 0.00 50.00 200.00
20 YSR Aasara 6400.00 4000.00 6700.00
21 YSR Cheyuta 4100.00 5007.26 5000.00
22 Amma Vodi 6500.00 5749.04 6500.00
Total 48668.20 47240.43 54228.36
Welfare Corporations


Corporation / Scheme RE 22-23 BE 23-24
Andhra Pradesh Arya Vysya Welfare and Development Corporation 488.42 686.29
YSR Pension Kanuka 237.71 285.45
YSR Aasara 89.28 149.55
EBC Nestham 0.95 81.12
Amma Vodi 50.94 63.07
Jagananna Vidya Deevena 64.47 56.15
Jagananna Vasati Deevena 43.82 46.27
YSR Jagananna Chedodu 0.31 2.83
Jagananna Thodu 0.49 0.83
Economic Support Backend Subsidy to Mobile Dispensing Units 0.00 0.56
YSR Vahana Mitra 0.45 0.45
YSR Nethanna Nestham 0.00 0.01
Andhra Pradesh EBC Welfare and Development Corporation 630.57 716.99
YSR Pension Kanuka 194.11 233.10
Amma Vodi 139.44 185.01
Jagananna Vidya Deevena 173.11 150.78
Jagananna Vasati Deevena 92.63 97.82
YSR Aasara 10.41 17.43
EBC Nestham 2.39 9.45
YSR Vahana Mitra 7.12 7.20
Jagananna Thodu 4.71 4.71
Economic Support Backend Subsidy to Mobile Dispensing Units 0.00 3.88
YSR Nethanna Nestham 2.32 3.13
YSR Jagananna Chedodu 2.89 2.90
YSR Matsyakara Bharosa 1.44 1.58
Andhra Pradesh Kamma Welfare and Development Corporation 1329.03 1796.38
YSR Pension Kanuka 745.42 895.15
YSR Aasara 190.66 319.35
EBC Nestham 2.72 173.22
Amma Vodi 126.54 158.45
Jagananna Vidya Deevena 171.32 149.22
Jagananna Vasati Deevena 85.06 89.82
YSR Jagananna Chedodu 4.15 6.04
YSR Vahana Mitra 2.47 3.00
Economic Support Backend Subsidy to Mobile Dispensing Units 0.00 1.09
Jagananna Thodu 0.47 0.80
YSR Nethanna Nestham 0.22 0.24
Andhra Pradesh Kshatriya Welfare and Development Corporation 189.57 272.77
YSR Pension Kanuka 116.47 139.86
YSR Aasara 30.44 50.98
Amma Vodi 19.25 32.01
EBC Nestham 0.31 27.65
Jagananna Vidya Deevena 14.41 12.55
Jagananna Vasati Deevena 7.39 7.80
YSR Jagananna Chedodu 0.78 1.00
YSR Vahana Mitra 0.45 0.45
Jagananna Thodu 0.07 0.30
Economic Support Backend Subsidy to Mobile Dispensing Units 0.00 0.17
Andhra Pradesh Reddy Welfare and Development Corporation 1478.37 2287.80
YSR Pension Kanuka 802.46 963.64
YSR Aasara 311.43 521.65
Amma Vodi 165.62 327.50
EBC Nestham 2.33 283.97
Jagananna Vidya Deevena 117.64 102.46
Jagananna Vasati Deevena 60.66 64.06
YSR Jagananna Chedodu 8.99 10.86
YSR Vahana Mitra 6.31 7.49
YSR Nethanna Nestham 2.25 2.48
Jagananna Thodu 0.68 1.90
Economic Support Backend Subsidy to Mobile Dispensing Units 0.00 1.79
Grand Total 4115.96 5760.23
Corporation / Scheme name 2020-21 2021-22 RE 22-23 BE 23-24
AP Scheduled Castes Corporation 6,953.19 5,803.00 7,027.83 8,384.93
YSR Pension Kanuka 2,633.72 2,751.00 3,316.41 3,913.61
Ammavodi 1,231.31 1,169.99 1,350.12
YSR Aasara 1,271.88 1,295.90 805.04 1,348.44
YSR Cheyuta 1,063.34 1,103.79 1,179.44 1,204.44
Jagananna Vasati Deevena 296.00 198.35 266.48 281.40
Jagananna Vidya Deevena 368.00 370.47 192.22 192.22
YSR Vahana Mitra 64.85 59.69 65.80 66.56
YSR Jagananna Chedodu 21.64 21.62 28.02 23.08
YSR Matsyakara Bharosa 0.44 0.57 2.25 2.88
YSR Nethanna Nestham 2.01 1.61 2.18 2.18
AP Scheduled Tribe Corporation 1,855.02 1,490.47 2,091.20 2,428.95
YSR Pension Kanuka 924.04 957.45 1,085.40 1,269.33
Ammavodi 397.89 371.56 437.75
YSR Cheyuta 273.77 283.91 319.11 330.11
YSR Aasara 168.64 174.13 108.16 181.16
Jagananna Vidya Deevena 36.20 29.59 127.08 127.08
Jagananna Vasati Deevena 39.42 31.55 63.81 67.38
YSR Vahana Mitra 10.67 9.91 10.88 10.88
YSR Jagananna Chedodu 3.46 3.07 3.75 3.75
YSR Matsyakara Bharosa 0.29 0.31 0.79 0.85
YSR Nethanna Nestham 0.64 0.55 0.66 0.66
AP State Backward Classes Corporations 18,714.08 16,063.52 19,802.33 22,715.41
YSR Pension Kanuka 7,918.87 8,096.00 8,313.88 9,735.53
YSR Cheyuta 2,791.00 2,869.98 3,364.81 3,378.19
YSR Aasara 3,019.46 3,071.87 1,908.37 3,196.51
Ammavodi 2,908.37 2,996.53 3,127.99
Jagananna Vidya Deevena 611.49 922.43 1,438.00 1,438.00
Jagananna Vasati Deevena 838.00 506.37 1,068.35 1,128.18
YSR Jagananna Chedodu 225.96 210.90 259.75 260.05
YSR Nethanna Nestham 169.49 155.10 184.94 180.89
YSR Vahana Mitra 123.49 134.39 149.18 150.45
YSR Matsyakara Bharosa 107.95 96.48 118.53 119.62
AP State Economically Backward Classes Corporations 5,138.17 5,261.10 4,109.51 6,165.10
YSR Pension Kanuka 2,985.77 3,057.00 2,096.16 2,868.72
YSR Aasara 1,046.41 1,063.59 632.21 1,058.96
Ammavodi 531.03 501.79 766.04
EBC Nestham 556.01 8.69 575.00
Jagananna Vidya Deevena 375.37 422.53 540.95 540.95
Jagananna Vasati Deevena 169.06 144.15 289.55 305.77
YSR Jagananna Chedodu 11.26 2.20 17.12 23.63
YSR Vahana Mitra 15.38 12.50 16.79 18.58
YSR Nethanna Nestham 3.31 2.52 4.80 5.87
YSR Matsyakara Bharosa 0.58 0.60 1.44 1.58
AP KAPU Welfare Corporation 3,164.48 2,562.77 4,064.33 4,887.51
YSR Pension Kanuka 1,068.02 1,083.59 1,959.98 2,353.66
YSR Aasara 653.82 671.04 416.88 698.28
Ammavodi 579.00 541.75 657.10
YSR Kapu Nestham 491.02 459.64 536.00 550.00
Jagananna Vidya Deevena 231.01 204.63 321.48 321.48
Jagananna Vasati Deevena 86.92 96.36 241.22 254.73
YSR Vahana Mitra 31.14 26.40 22.16 22.50
YSR Jagananna Chedodu 16.63 15.47 19.42 20.41
YSR Nethanna Nestham 6.92 5.64 5.44 9.35
AP Christian Welfare Corporation 105.42 86.03 99.13 115.03
YSR Pension Kanuka 40.00 40.00 31.61 37.95
YSR Cheyuta 17.72 17.09 17.37 17.37
Ammavodi 18.10 12.58 15.84
Jagananna Vidya Deevena 7.06 9.61 14.46 14.46
Jagananna Vasati Deevena 7.91 4.41 13.64 14.40
YSR Aasara 13.33 13.76 8.55 14.32
YSR Vahana Mitra 1.06 0.89 0.61 0.62
YSR Nethanna Nestham 0.02 0.02 0.02 0.03
YSR Matsyakara Bharosa 0.03
YSR Jagananna Chedodu 0.22 0.25 0.30 0.01
AP Brahmin Welfare Corporation 123.33 124.30 246.39 346.78
YSR Pension Kanuka 75.07 68.95 137.40 165.00
YSR Aasara 14.93 15.39 38.07 63.77
Ammavodi 26.65 28.75 40.04
EBC Nestham 33.45 0.74 35.00
Jagananna Vidya Deevena 1.00 1.00 26.38 26.38
Jagananna Vasati Deeven 4.68 4.63 14.17 14.96
YSR Jagananna Chedodu 0.40 0.39 0.45 1.21
YSR Vahana Mitra 0.60 0.49 0.42 0.42
AP Minorities Welfare Corporation 2,045.90 1,433.91 1,662.91 1,868.25
YSR Pension Kanuka 667.83 632.79 908.40 1,090.61
Jagananna Vidya Deevena 211.86 117.15 180.99 180.99
YSR Aasara 130.98 133.14 82.72 138.55
Jagananna Vasati Deevena 84.00 64.83 126.12 133.18
Incentives to Imams and Mouzans 50.00 78.85 88.86 126.00
Ammavodi 484.90 126.09 105.12
YSR Cheyuta 354.38 386.19 126.54 69.90
YSR Jagananna Chedodu 18.33 16.64 17.26 17.86
YSR Vahana Mitra 38.46 4.21 4.92 4.98
YSR Nethanna Nestham 5.16 0.11 1.02 1.02
YSR Matsyakara Bharosa 0.04
Grand Total 38,099.59 32,825.10 39,103.63 46,911.96
SC / ST / BC / MINORITY COMPONENTS (EARLIER SUBPLANS)
Item BE 20-21 ACCT 20-21 BE 21-22 ACCT 21-22 BE 22-23 RE 22-23 BE 23-24
SC COMPONENT 15,735.68 13,569.88 13,834.83 14,002.66 18,518.29 15,981.68 20,005.00
ST COMPONENT 5,177.54 4,915.00 5,318.28 4,162.91 6,144.90 4,988.56 6,929.09
BC COMPONENT 25,331 26,456 28,237 28,226 29,143 33,008 38,605
MINORITY COMPONENT 3,110 2,093 3,122 2,564 3,661.84 3,554.92 4,203.18
* Actuals for 2020-21 & 2021-22 and RE 2022-23 includes expenditure incurred through APSDC & APBCL for DBT Schemes

DEPARTMENT-WISE IMPORTANT ALLOCATIONS

DEPARTMENT BE 2023-24
AGC01-Agriculture Marketing and Co-Operation, Secretariat
YSR Rythu Bharosa 4,020
YSR - PM Fasal Bima Yojana 1,600
RKVY - Sub Mission on Agriculture Mechanisation[AP283] 1,212
Y.S.R Interest free Loans to Farmers 500
Price Stabilization Fund 500
RKVY - PMKSY-Per Drop More Crop[AP12] 472
RKVY - PKVY[AP76] 435
District Offices 363
Rashtriya Krushi Vikasa Yojana (RKVY)[AP81] 325
Supply of Seeds to Farmers 200
RKVY - PKVY-Bharatiya Prakritik Krishi Padhati (BPKP)[AP435] 102
Krishionnati Yojana - Integrated Development of Horticulture [AP56] 83
Incentives to Food Processing Industries 76
Aqua Produce Processing (Fish & Shrimp) 70
Krishionnati Yojana - Oil Palm[AP405] 50
Rythu Bharosa Kendralu 42
Storage, interest and other related costs of fertilizer buffers 40
PM FORMALIZATION OF MICRO FOOD PROCESSING ENTERPRISES PM-FME[AP343] 40
YSR - Agri Testing Labs 37
AHF02-Animal Husbandry & Fisheries Departments
Fishing Jetties 300
Livestock Loss Compensation 150
Hospitals and Dispensaries 69
Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) [AP346] 56
Diesel Subsidy to Fishermen Boats 50
Livestock Health and Disease Control Programme [AP397] 30
Infrastructure support to Field Veterinary Institutions 27
Vaccine Production / Purchase / Testing / Diseases Control 26
National Livestock Mission - Livestock Insurance [AP427] 25
Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) -Construction of Fish Landing Centers / Jetties [AP346] 24
Fodder and Feed Development 20
BCW02-Backward Classes Welfare Department
YSR Pension Kanuka to Backward Classes 9,736
SU - BC-D Corporations 4,203
SU - BC-A Corporations 4,120
SU - BC-B Corporations 3,705
SU - BC-E Corporations 1,031
EFS02-Principal Chief Conservator of Forests
Net Present Value of Forest Land 308
Red Sanders Anti Smuggling Task Force 28
Red Sanders Protection 25
Forest Fire Prevention and Management[AP28] 15
Sanctuaries 14
Van Vihari (SMC works) 10
EHE01-Higher Education, Secretariat
Rashtriya Uchhatar Shiksha Abhiyan (RUSA)[AP51] 150
ENE01-Energy
Y.S.R Nine Hours Free Power Supply 4,500
WB & AIIB (World Bank & Asian Infrastructure Investment Bank) - Loans for APTRANSCO for 24X7 Power for all Project 700
Assistance to AP TRANSCO Ltd. for providing subsidy to Aquaculture Farmers 500
Assistance to Andhra Pradesh Transmission Corporation ltd. for servicing of Vidyut Bonds 500
Current Consumption Charges 302
ESE02-School Education Department
Mana Badi - Nadu Nedu : Upgrading Infrastructure in High Schools 3,000
Samagra Shiksha[AP291] 2,500
Jagananna Gorumudda - Mid-Day Meal - PM POSHAN 1,777
Jagananna Vidya Kanuka - Samagra Shiksha - Student Kit 560
NAADU NEDU - Infrastructure Facilities in Schools 500
EWS01-Department of Economically Weaker Sections (EWS) Welfare
Andhra Pradesh Kapu Welfare and Development Corporation 4,894
Andhra Pradesh Reddy Welfare and Development Corporation 2,303
Andhra Pradesh Kamma Welfare and Development Corporation 1,818
Andhra Pradesh EBC Welfare and Development Corporation 749
Andhra Pradesh Arya Vysya Welfare and Development Corporation 695
Andhra Pradesh Brahmin Welfare and Development Corporation 347
Andhra Pradesh Kshatriya Welfare and Development Corporation 275
FCS02-Food and Civil Supplies Department
Subsidy on Rice (Human Resources Development) 3,400
Door Delivery of Rice 200
GWS02-Gram Volunteers/ Ward Volunteers and Village Secretariats / Ward Secretariats Commissionerate
Grama Sachivalayam 2,347
Village Volunteers 1,192
Financial incentives to Village and Ward Volunteers 243
HMF01-Health, Medical and Family Welfare, Secretariat
Assistance to Andhra Pradesh Vaidya Vidhana Parishad 1,013
Upgradation of Andhra Pradesh Vaidya Vidhana Parishad Hospitals(NAADU-NEDU) 300
Sanitaion in APVVP Hospitals 120
Upgradation of Andhra Pradesh Vaidya Vidhana Parishad Hospitals (NAADU-NEDU) 50
Dr. YSR Kanti Velugu 20
HMF02-Medical Education Department
Dr. YSR Aarogyasri Health Care Trust 2,400
Medical Buildings (NAADU-NEDU) 917
Dr YSR Aarogya Aasara - POP 445
Human Resources for Health and Medical Education-Establishment of New Medical Colleges[AP73] 284
Establishment of new Medical College along with Hospital in Plain Areas 220
Andhra Pradesh Emergency Response Services - 108 Ambulance Services 187
Mobile Medical Units (104 Services) 164
Government Contribution for Employees Health Scheme 140
Establishment of Multi Speciality Hospitals in Tribal Areas 120
Advanced Radiology Services 42
Kidney Research Centre, superspeciality hospital at Palasa, Srikakulam District 25
HMF03-Public Health and Family Welfare Department
Primary Health Centres 1,162
NAADU NEEDU - Infrastructure facilities for Hospitals 500
Centralized Purchase of Drugs and Medicines 500
Health Services 286
HMF04-Family Welfare Department
Flexible Pool for RCH & Health System Strengthening, National Health Programme and national urban health Mission [AP115] 2,585
Honorarium to Asha Workers 369
Family Welfare Centres 267
Infrastcture Maintanence[AP390] 250
Public Health Units 141
Conversion of rural PHCs into Health & Wellness Center 131
PRADHAN MANTRI AYUSHMAN BHARAT HEALTH INFRASTRUCTURE MISSION (PM - ABHIM ) 191
Urban Health Wellness Centers 108
Diagnostic Infrastructure facilities in Public Health Centers 62
Diagnostic Infrastructure facilities in Public Health Sub-centers 58
Mission Shakti - SAMARTHYA -Pradhan Mantri Matru Vandana Yojana 47
HOM02-Director General and Inspector General of Police
Modernisation of Police Forces 50
Modernisation of Police Forces - Forensic Science Labs 34
Disha 15
HOU02-Weaker Section Housing
PMAY-URBAN-BLC Scheme 5,300
Pradhan Manthri Awas Yojana (Grameen) 300
Weaker Section Housing Programme 170
IID02-State Ports Directorate
Machilipatnam Port 150
Sagarmala Project[AP322] 100
Ramayapatnam Port 100
Bhavanapadu Port 100
INC01-Industries and Commerce, Secretariat
Kadapa Steel Plant 250
YSR Electronic Manufacturing Cluster (YSR EMC) 100
Development of Secondary Food Processing Units 100
INC02-Industries, Commerce and Export Promotion Department
ADB (Asian Development Bank) - Visakhapatnam-Chennai Industrial Corridor Development Program 761
Incentives for Industrial Promotion for Micro Small and Medium Enterprises (MSMEs) 465
Incentives for Industrial Promotion 412
Incentives to the S.C. Entrepreneurs for Industrial Promotion 175
Industrial Infrastructure Development Scheme 50
Infrastructure Development of Micro Small and Medium enterprises (MSMEs) 30
Development of Clusters in Tiny Sector 25
MAU01-Municipal Administration and Urban Development, Secretariat
Creation of Essential Infrastructure for new Capital City 500
Assistance to Andhra Pradesh Capital Region Development Authority 500
AMRUT2.0 Project Fund -URBAN REJUVENATION MISSION-500 CITIES (AP419) 480
Y.S.R Interest free loans to urban Self Help Groups 300
Swachh Bharat Mission (SBM) - Urban -USED WATER MANAGEMENT(UWM)[AP410] 300
MISSION FOR DEVELOPMENT OF 100 SMART CITIES - AMARAVATI [AP371] 300
Swachh Bharat Mission (SBM) - Urban -Solid Waste Management (SWM)[AP411] 250
Land Pooling for New State Capital 240
Loans to Nellore Municipal Corporation 132
Deendayal Antyodaya Yojana-National Urban Livelihoods Mission (DAY- NULM)[AP239] 120
Mission for Elimination of Poverty in Municipal Areas (Velugu) - Urban 103
Capital Region Social Security Fund 88
MISSION FOR DEVELOPMENT OF 100 SMART CITIES-TIRUPATI[AP374] 50
MISSION FOR DEVELOPMENT OF 100 SMART CITIES -VISAKHAPATNAM[AP372] 50
MISSION FOR DEVELOPMENT OF 100 SMART CITIES - KAKINADA[AP373] 50
MAU02-Municipal Administration Department
Municipal Ward Secretaries 926
Municipal Ward Volunteers 435
AIIB (Asian Infrastructure Investment Bank) - Andhra Pradesh Urban Water Supply and Septage Management Improvement Project 411
Occupational Health Allowance (OHA) to Outsourced Public Health Workers 242
Assistance to New Municipalities / Corporations for Developmental Works 50
MNW03-Minorities Welfare Department
YSR Pension Kanuka 1,091
Andhra Pradesh State Minorities Finance Corporation 715
Andhra Pradesh State Christian Finance Corporation 132
Incentives to Imams and Mouzans 126
PLG01-Planning, Secretariat
Gadapa Gadapaku Mana Prabhutvam 533
Pulivendula Area Development Agency 100
PRR03-Panchayat Raj Engineering Department
AIIB (Asian Infrastructure Investment Bank) - Andhra Pradesh Rural Road Project 731
PRADHAN MANTRI GRAMSADAK YOJNA [AP155] 875
Panchayat Raj Roads 149
PRR05-Rural Development Department
Mahatma Gandhi National Rural Employment Guarantee Programme[AP123] 5,000
Interest Free Loans to DWACRA Women (Vaddileni Runalu) 700
NATIONAL RURAL LIVELIHOOD MISSION [AP168] 425
Bore Wells under YSR Rythu Bharosa 252
INDIRA GANDHI NATIONAL OLD AGE & WIDOW PENSION SCHEME 317
Pradhan Mantri Krishi Sinchayi Yojna-Integrated Watershed Development Program[AP167] 100
PRR06-Rural Water Supply Department
JAL JEEVAN MISSION (JJM)/ NRDWM[AP172] 1,410
Swachh Bharat Mission (Grameen DWS)[AP160] 475
Rural Water Supply Schemes under RIDF 37
REV02-Land Administration Department
YSR Gruha Vasathi 500
REV05-Survey, Settlement and Land Records Department
Re-Survey of Land 321
REV07-Endowments Department
Archakas and other employees salary and remuneration fund 120
REV10-Relief and Disaster Management Commissionerate
Calamity Relief Fund 2,000
SEI01-Department of Skills Development and Training, Secretariat
Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana DDUGKY (NRLM)[AP224] 199
Skill Development Training Programmes 175
SOW02-Social Welfare Department
Andhra Pradesh Scheduled Castes Corporations 4,360
YSR Pension Kanuka 3,914
Providing free power to SC House holds 300
Post-Matric Scholarship to SCs[AP232] 172
PMAJAY - SCA to SCSP [AP193] 150
PMAJAY - Adarsh Gram Yojana [AP304] 53
SMEPCRA-1995 AND PREVENTION OF ATROCITIES ACT 1989 [AP233] 50
Pre-Matric Scholarship to SCs[AP148] 40
SMEPCRA-1995 AND PREVENTION OF ATROCITIES ACT 1989 - SPECIAL COURTS[AP152] 36
SMEPCRA-1995 AND PREVENTION OF ATROCITIES ACT 1989 - INTERCASTE MARRIAGES[AP198] 33
Special Criminal Courts dealing with offences under the Indian Penal Code and Protection of Civil Rights Act, 1955 against Scheduled Castes and Scheduled Tribes 31
Best Available Schools 25
SOW03-Tribal Welfare Department
YSR Pension Kanuka 1,269
POST MATRIC SCHOLARSHIP to STs[AP187] 78
Reimbursement of Electricity Charges 70
Financial Assistance to Public Sector and Other Undertakings 67
Pre- Matric Scholarship for STs [AP215] 50
SPECIAL CENTRAL ASSISTANCE TO TRIBAL SUB-SCHEMES[AP180] 28
DEVELOPMENT OF PARTICULARLY VULNERABLE TRIBAL GROUPS (PVTGs) [AP300] 23
Economic Support Schemes 23
Rejuvenation of Coffee Plantation 20
TRB01-Transport, Roads and Buildings, Secretariat
Assistance to Andhra Pradesh Road Development Corporation (APRDC) 300
Cost sharing with Railways for construction of New Railway Lines (50%) 150
TRB02-Administration, State Roads and Road Safety Works (RSW), ENC (Roads and Buildings)
Upgradation of District & Other Roads 400
Construction of Roads and Bridges under Railway Safety Works 258
District and Other Roads 99
Highways Works 40
TRB03-Transport Department
Road Safety Fund Activities 105
Abhaya Project under Nirbhaya Fund 20
TRB06-Core Network Roads (CRN), Road Development Corporation (RDC) and Public Private Partnership (PPP) Department
Assignment of Road Development Cess to APRDC 600
Upgradation of State Highways 500
Core Network Roads (Works) 102
Lumpsum provision for PPP Projects 100
Kadapa Annuity Projects 95
Road Safety Works 38
TRB07-Rural Roads, ENC (Roads and Buildings)
New Development Bank (NDB) - Andhra Pradesh Roads and Bridges Re-construction Project 616
New Development Bank (NDB) - Andhra Pradesh Mandal Connectivity and Rural Connectivity Improvement Project 616
Construction and Development of Road Works under RIDF 200
PRADHAN MANTRI GRAM SADAK YOJNA - RCP LWE[AP266] 39
TRB13-National Highways and Central Road Funds Department
Subvention From Central Road Fund 400
CENTRAL ROAD INVESTMENT FUND (CRF) [AP221] 400
Amaravathi Ananthapuram National Highway 100
Ordinary Repairs of National Highways 47
WDC02-Women Development and Child Welfare Department
YSR Sampoorna Poshana 872
SAKSHAM ANGANWADI AND POSHAN 2.0 (ICDS - Anganwadi Services)[AP347] 785
Integrated Child Development Service (ICDS) 716
SAKSAM ANGANWADI AND POSHAN 2.0 (Supplementary Nutrition Programme)[AP351] 622
YSR Sampoorna Poshana & Plus 202
SAKSHAM ANGANWADI AND POSHAN 2.0 - CONSTRUCTION OF ANGANWADI CENTER BUILDINGS UNDER MGNREGA[AP360] 160
MISSION VATSALYA (Child Protection Services and Child Welfare Services)[AP353] 118
SAKSHAM ANGANWADI AND POSHAN 2.0 - Supplementary Nutrition Programme [AP350] 104
SAKSHAM ANGANWADI AND POSHAN 2.0 - CONSTRUCTION OF ANGANWADI CENTER BUILDINGS UNDER ICDS/ APIP[AP349] 90
Construction of Buildings for Anganwadi Centres 51
YTC06-Sports Authority of Andhra Pradesh (SAAP)
Assistance to Sports Authority of Andhra Pradesh 50
Construction of Stadia and Modernization of Sports facilities 50
This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.