అశోకుడు/నాలుగవ ప్రకరణము

ఇప్పు డా నదీతీరమునకుఁ జిన్నవియుఁ బెద్దవియుఁగూడ వర్తకనౌకలు వచ్చుచుఁ బోవుచుండెను. అశ్విజమాసము వచ్చినది. బ్రాహ్మణుఁడు నిర్దిష్ట దినమున సుభద్రాంగిని వెంటబెట్టుకొని యావర్తకుని యోడపై నెక్కి రాజధానికిఁ బ్రయాణమయ్యెను.


నాలుగవ ప్రకరణము


పాటలీపుత్రము

మహారాజగు బింబిసారుని కాలమున మగధ రాజ్యమునకు రాజగృహము రాజధానిగనుండెను. రాజగృహమునకు నలుదెసలను పర్వతపంక్తులుండుటచే నా నగరము శత్రుదుర్భేద్యమై యుండెను. రాజులు తమ రాజ్యరక్షణ విషయంబున నెప్పుడును నిర్విచారముగ నుండఁజాలరు; ఎల్లప్పుడును దమ రాజ్యమును విస్తరింపఁ జేయవలయుననియే ప్రయత్నించు చుందురు. బింబిసారుని పుత్రపౌత్రులు తామా రాజగృహమునందే యున్నయెడలఁ దమరాజ్యమును విస్తరింపజేయుటకును, దా మున్నతిం బడయుటకును దగినంత యవకాశ ముండదని తలంపసాగిరి. క్రమముగా బింబిసారుని సంతతివారిదృష్టి పాటలీపుత్రము వైపునకుఁ బ్రసరింపసాగెను.

12

అ శో కుఁ డు

గిరిరాజదుహిత యగు గంగయు, వింధ్యాచల సుతుం డగు హిరణ్య బాహువు,(శోణనదము)ను గలసికొన్న రమణీయ స్థానమునఁ బాటలీపుత్రనగరము నిర్మింపబడియెను. శత్రువులకు దుర్భేద్యముగ నుండుటకును, రాజ్యము విస్తరించుటకును, నగరశోభ యతిశయించుటకును, నాగరకుల సౌకర్య మునకును, వాణిజ్యము వర్ధిల్లుటకునుగూడ నీ నదీనదసంగమ స్థానము సర్వవిధముల ననురూపమైనదని నిరూపింపబడియెను. చంద్రగుప్తుని రాజ్య కాలమునుండియుఁ బాటలీపుత్రనామము దేశవిదేశములఁ బ్రఖ్యాతినందఁదొడంగెను. ఆ కాలమునందుఁ బాటలీపుత్రము గంగా శోణసంగమస్థానమున శోణనదమున కుత్తర తీరమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. కాలవశమున నిప్పటికా పాటలీపుత్రనగర చిహ్నముకూడ మన కగపడుట లేదు. ఉన్నను మనకది దుర్బోధ్యము—

చంద్రగుప్తసార్వభౌముని కాలమునఁ బాటలీపుత్రసౌందర్య సమృద్ధుల కవధియే లేక యుఁడెను. చంద్రగుప్తుని రాజప్రాసాదము దారునిర్మిత మైనది. ప్రాసాద ప్రాచీరములును స్తంభములును సమస్తమును గూడ రమణీయదారునిర్మితము లేయైయుండెను. గృహ స్తంభము లన్ని య ను సువర్ణ రజత

ద్రవములతోఁ జిత్రరూపమునఁ బూఁతలు పెట్టబడియుండెను. విశాలాయతరమణీయో ద్యానమధ్యమునందా రాజమందిరము నిర్మింపఁబడుటచే దాని శోభాసౌందర్యములు శతగుణాధిక విలసితములై యుండెను. ఆ విశాల ప్రాంగణ మధ్యమునం

నాలుగవ ప్రకరణము

13

దచ్చ టచ్చట సరోవరములును, జలయంత్రములును, బుష్పవాటికలును శోభిల్లుచుండెను. రాజధాని దృఢప్రాకార సమన్వితమై, యగాధ పరిఘా వేష్టితమై యుండెను. అసంఖ్యాక సైన్యముచే నా నగరము సర్వదా రక్షింపబడుచుండెను, నగరమునం దంతటను బ్రజల సుఖ స్వాస్థ్యములకై యనేక విధములగు సదుపాయములు చేయఁబడెను. చంద్రగుప్తుని ప్రబల ప్రతాపమును, రాజప్రాసాదశోభాసంప త్తియు, నగర సౌందర్యమును, సంపత్సమృద్ధియు, సకల నియమానుకూల సమీకరణమును, సమాచీన శాసనమును గారణముగ నా పాటలీపుత్ర మా కాలమునం దే కాక తరువాతఁ జాల కాలము వఱకును భారతవర్షము నందును విదేశములందును గూడ విశేషవిఖ్యాతి నంది యుండెను.

చంద్రగుప్తసార్వభౌముని యనంతరము కీ|| పూ! 297 వ సంవత్సరమున నాతని కుమారుఁడగు బిందుసారుఁడు పై తృకంబగు పాటలీపుత్ర సింహాసనము నధిరోహించెను. క్రమముగ మహా రాజగు బిందుసారుని ప్రతాపకీర్తులు సర్వ దేశములయందును బ్రచారితము లయ్యెను.

చంపక నగర దరిద్ర బ్రాహ్మణుఁ డా బిందుసారునికీర్తి ప్రతాపముల నాలకించి విశేషముగ నాశపడి తన కుమారీ రత్నమును వెంటబెట్టుకొని యా పాటలీపుత్ర నగరమునకుఁ బ్రయాణమయ్యెను.