అశోకుడు/ఏడవ ప్రకరణము
ఏడవ ప్రకరణము
23
నప్పు డాతఁడు గ్రహింపఁగలిగెను. తానింతవఱకును సందే హించిన సంగతి వట్టి భ్రమ యని నిశ్చయించుకొనియెను—— బిందుసారుఁ డా బ్రాహ్మణకుమారీ రామణీయక విలాసములం బ్రత్యక్షముగఁ గన్ను లాఱఁ గనుంగొనియెను.
ఏడవ ప్రకరణము
పుత్రలాభము
మహారాజగు బిందుసారున కేఁబదిమంది రాణులు కలరు. ఇంత కాలమువఱకు వారిలో ధర్మాదేవి యొక్క తయే సార్వభౌమునకుఁ బ్రధానమహిషి యైయుండెను. మఱియు నామెయువ రాజగు సుషీమకుమారుని గన్నతల్లి – అందుచే నామె రాణులకందఱకు నధికారిణియై యుండెను. మహారాజు కూడనా మెమాటకు జవ దాట లేదు. ఈవిధముగఁజాల
దినములు గడచినవి. బిందుసారుఁడు సుభద్రాంగిం జూచిన తరువాతనుండి యీ విషయమునం దించుక వ్యతిక్రమము గానవచ్చుచుండెను. రాజానుగ్రహము తీవ్రము గలనదీ ప్రవాహమువంటిది. అదియొకప్పు డొక తీరము నొఱసి భంగించు చున్నప్పుడు మఱియొక తీరమును బలపఱుచుచుండును. ఇప్పుడు మహారాజీ మణియగు ధర్మాదేవి తల తిరిగిపోవుచుండెను. క్రమక్రమముగా నిప్పుడామె ప్రభావ ప్రతిపత్తి తగ్గిపోవుచున్నది. 24
అ శో కుఁ డు
రాణియగు సుభద్రాంగి కిప్పుడు మంచి కాలము వచ్చినది. ఆమెయిప్పుడు రాజాధి రాజగుబిందుసారునకు రాణులలో నెల్లఁ బ్రియుతమురాలై యుండెను. సుభద్రాంగికిఁ గష్టసమ యము గడచిపోయినది; సుఖ సమయము వచ్చినది. అదియునుగడచిపోవుచున్నది; దినము, యామిని, మాసము, వత్సరము, శిశిరమ, వసంతము మొదలగునవి యన్నియు జక్రావర్త న్యాయమునఁ దీవ్ర వేగముతో వచ్చుచుఁ బోవు చుండును.
వానితోగూడఁ గోరుకొనఁదగిన సుఖ సమయమునందలి నూతనత్వముకూడ జరగిపోవుచున్నది. ఇప్పుడామెహృదయమింకను నట్టినూతనత్వముకొఱకు వ్యాకు లపడుచుండెను. అనూతనశ్వమునందలి మనోహరత్వముం గూర్చి తెలుపుచు యమున యామెకోరికలను మఱింత వర్ధిల్లఁ జేయుచుండెను. సుభద్రాంగిసపత్ను లందఱును బుత్రవతులై యుండిరి. ఆ మెకుమాత్రమింకను బుత్రముఖ సందర్శన సుఖలాభము కలుగ లేదు. ఆ కారణము చేఁ దన పై మహా రాజున కించుక యనాదరము కలుగునేమో యను విచారమామె హృదయ మును వేధింపసాగెను.
రాణి యగుసుభద్రాంగి సంపూర్ణయౌవనవతియై యుండెను. ఆమె హృదయమున నిరాశాచ్ఛాయలించుకించుక ప్రసరించుచుండుటచే నా మెరూపయౌవన విలాసకాంతులించు ఏడవ ప్రకరణము
25
కించుకమ్లానములు కాఁజొచ్చెను. కాని, యా రాజ్ఞీ మణి కట్టి యవస్థ యెన్నియోదినమ లవఱకు నిలిచియుండ లేదు. ఆమె కిప్పు డించుక యస్వస్థతగా నున్నట్లు తోచుచుండెను. హంస తూలికా తల్పమున శయనించుటకూడ నామెకుఁ గష్టముగా నుండెను; సుఖాద్యములుకూడ నన పేక్షితము లైపోయెను; అమృతమునందును నరుచి యుదయించెను—మట్టి దిన వలయునని మనసయ్యెను అప్పుడు సుభద్రాంగి యమునతోఁ దనశరీర పీడం గూర్చి యంతయును జెప్పెను. ఆ మాటల నాలించి యమున పరమానందముతో. “అమ్మా! ఇవియన్నియును బీడా లక్షణములు కావు —— సర్వమును శుభలక్షణములే" అని బోధి చెను.
క్రమముగా నీ సంగతి యతఃపురమునందంతటను వ్యాపించెను. నూత్న రాజ్ఞీ మణి కూడ సంతానవతి యగునని యందఱు ననుకొనుచుండిరి. గర్భస్థ శిశువు దిన దినము నెట్లు వరిల్లు చుండెనో యట్లే సుభద్రాంగి సపత్నుల యీర్ష్యాసలము కూడ వర్ధిల్లఁ జొచ్చెను. అప్పుడు రాఱులలో గొందఱు “మంచిది, సుభద్రాంగి గర్భవతి యైనది. అదృష్టవంతురాలు! మంచిసం తాన మే కలుగును. "కాని, రాకరాక గర్భము వచ్చినది. ఇంతవయసులోఁ
దొలుచూలు ! నిరపాయముగఁ బ్రసవిఁప వలయును గద!ఏమో! ఏనాటి కెట్లు వచ్చునో యెవ్వరికిఁ దెలియును” అనియనుకొనుచుండిరి. కోటయం దంతటను నామె 26
అ శో కుఁ డు
గర్భముంగూర్చినమాటలే. ఆగర్భమే యామె జీవితమార్గమును నిష్కంటక ముగఁ జేసి వైచెను; ఇదియే యామెరాజ్ఞీ స్థానమును దేవతా స్థానముగఁ బరిణమింపఁ జేసెను!!
దేవత లెల్లప్పుడు నందఱ ప్రార్థనములను — అన్ని ప్రార్ధనములను సంపూర్ణముగ సిద్ధింపఁ జేయరు. సుభద్రాంగిసపత్నుల మనోగత ప్రార్థనములు సంపూర్ణముగ ఫలియింప లేదు. రాణియగుసుభ ద్రాంగి యొక శుభమూహూర్తమునం దొక కుమారుని గనియెను. కొత్త రాణి పుత్రవతి యయ్యెను. ప్రసనసమయమునందామె కెట్టి కష్టమును గలుగ లేదు, ఆ కారణముచే గుమారున కశోకుఁ డని నామకరణము గావింపఁబడియెను.
ఎనిమిదవ ప్రకరణము
అశోకుని శైశవము
రాజ్ఞీ రత్న మగు సుభద్రాంగిపుత్రముఖసందర్శనమున బరమానంద భరితహృదయ యయ్యెను. మహా రాజుకూడఁ దనవ లె నేయానవ కుమారసందర్శనమునఁ బరమానందరస నిమగ్నుఁడగు నని యామె యనుకొనియెను. కాని యామెకోరిక యీ విధముగ ఫలియింప లేదు. మహారాజు యధా సమయమునందే పుత్రముఖావలో కనముంగావించెను. కాని