అలుక దీరెనా నేడైన
అలుక దీరెనా నేడైన నీ అలుక దీరెనా ||
పలుకు లాడు కుంటిరా మువ్వ గో
పాలుడు నీవు ముద్దుల గుమ్మ మీ
చక్కెర బొమ్మ మీ ఇద్దరి మనసు చల్ల నాయెనా
నిక్క మానతీయవే నేడు మీ నెంజిలి దీరెనా
మక్కువ తో నేడైన మీకు మంచి దిన మాయెనా
అక్కడికక్కడ విభుడు నీవు నుసురుసు రని యుంటిరె చెలియ మీ ||
సుదతి రో ఒకరి కొకరు మోములు చూచు కొంటిరా
పెదవులాని తియ్యని ముద్దులు పెట్టు కొంటిరా
అదుముకొని కౌగిళ్ళ నిద్దరు గల్సి యుంటిరా
పదరి వానికి నీకున్ బోయ పగల వలెనే యుండె నే చెలియ మీ ||
బాలరో నేడైన ఏక సయ్య మీద పవళించితిరా
మేలు మేలని ఇద్దరి వలపులు మెచ్చు కొంటిరా
చాల వేడుక తో మువ్వ గోపాలుడు నీవు కూడితిరా
వేళ వేళల చాడి మాటలు వింటి రను కొంటిరి కదవే మీ ||
aluka deerenA nEDaina nee aluka deerenA ||
paluku lADu kunTirA muvva gO
pAluDu neevu muddula gumma mee
chakkera bomma mee iddari manasu challa nAyenA
nikka mAnateeyavE nEDu mee nenjili deerenA
makkuva tO nEDaina meeku manchi dina mAyenA
akkaDikakkaDa vibhuDu neevu nusurusu rani yunTire cheliya mee ||
sudati rO okari kokaru mOmulu choochu konTirA
pedavulAni tiyyani muddulu peTTu konTirA
adumukoni kougiLLa niddaru galsi yunTirA
padari vAniki neekun bOya pagala valenE yunDe nE cheliya mee ||
bAlarO nEDaina Eka sayya meeda pavaLinchitirA
mElu mElani iddari valapulu mechchu konTirA
chAla vEDuka tO muvva gOpAluDu neevu kooDitirA
vELa vELala chADi mATalu vinTi ranu konTiri kadavE mee ||
బయటి లింకులు
మార్చుThis work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.