అలిగితే భగ్య మాయె


అలిగితే భగ్య మాయె (రాగం: ) (తాళం : )

అలిగితే భగ్య మాయె మరేమి వాడలగితే భాగ్యమాయె ||

తలిరు బోణిరో వాని దండించ గలన వా
అర సొంపు మాట లాడే వానికినే
తరుణిరో మంచి దాన నయ్యేనా
సరసకు రాడాయె సఖియరో నామోము
తిరిగి చూడడేమో దేవుడున్నాడు వా||డలి ||

బాళి లేదింక నేల నాతో పొందు
చాలు కాబోలు సంతోష మాయె
నీలాగునె వాని కితవు కాదేమో
నీల వేని రో నాటి నెనరించుక లేక వా ||డలి ||

బాల ప్రాయము నాడె భ్రమియించి నన్ను వా
డేలిన సుద్దు లెన్నెన్నో కలవు
చాల నాతో బాసలు చేసినాడే యో
బలరో మువ్వ గోపాలు డిప్పుడు వా||డలి ||


aligitE bhagya mAye (Raagam: ) (Taalam: )

aligitE bhagya mAye marEmi vADalagitE bhAgyamAye ||

taliru bONirO vAni danDincha galana vA
ara sompu mATa lADE vAnikinE
taruNirO manchi dAna nayyEnA
sarasaku rADAye sakhiyarO nAmOmu
tirigi chooDaDEmO dEvuDunnADu vA||Dali ||

bALi lEdinka nEla nAtO pondu
chAlu kAbOlu santOsha mAye
neelAgune vAni kitavu kAdEmO
neela vEni rO nATi nenarinchuka lEka vA ||Dali ||

bAla prAyamu nADe bhramiyinchi nannu vA
DElina suddu lennennO kalavu
chAla nAtO bAsalu chEsinADE yO
balarO muvva gOpAlu DippuDu vA||Dali ||

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.