అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశంపై రెండు నాల్కల ధోరణి
సాంకేతికవిద్య
రహ్మానుద్దీన్ షేక్ 94930 35658
ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశంపై రెండు నాల్కల ధోరణి
ప్రాంతీయ భాషల్లోనే మెరుగైన సాంకేతిక విద్య అందుతుంది అని ఒప్పుకుంటూనే, ప్రాంతీయ భాషల్లొ నైపుణ్యం ఉన్న ఆచార్యుల కోసం వెతికితే సాంకెతిక నైపుణ్యంతో రాజీ పడాలని అంటున్న ఐఐటీ డైరెక్టర్లు.
2020లో అమలు లోకి వచ్చిన జాతీయ విద్యా విధాన చట్టంలో ఆంగ్లం-హిందీ భాషల్లో, ఎనిమిది ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యా వనరులు రూపొందించడంతోపాటుగా ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను ప్రవేశపెడతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పలు మార్లు మీడియా ముఖంగా తెలిపారు. నవంబరులో ఈ అంశమై ముందడుగు వేస్తూ దేశంలో సాంకేతిక విద్యకు పేరున్న వివిధ ఐఐటీల, ఎన్‌ఐటీల సంచాలకులతో పలు సమావేశాలు జరిపి మొదటగా ఎంపిక చేసిన కొన్ని ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో హిందీలో మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల బోధనను తదుపరి విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ సమావేశాల పరంపర జరుగుతూండగానే, ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యపై సానుకూలంగా కొందరు, ప్రతికూలంగా కొందరు విద్యావేత్తలు తమ అభిప్రాయాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే, విద్య మాతృభాషలో చదివితేనే మెరుగ్గా అబ్బుతుందన్న నిజాన్ని మాత్రం అందరూ ఒప్పుకొన్నారు.
జవాహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం. జగదీశ్ కుమార్ మాట్లాడుతూ, “గత నాలుగైదు దశాబ్దాలుగా ఆంగ్ల మాధ్యమ బోధన అనేది ఒక వివాదాంశంగా ఉంది. ముఖ్యంగా గ్లొబల్ సౌత్ అని పిలవబడే అభివృద్ది చెందని అన్ని దేశాలలో మూకుమ్మడిగా వారి ప్రాంతీయ భాషలను పక్కన పెట్టి అంగ్లంలో చదువుకోవడం ఒక అభివృద్ది సూచకంగా చూడబడుతోంది. ఇజ్రాయెల్ మినహా మిగతా మధ్యధరా దేశాల్లో జపాన్, చైనా మినహా మిగతా ఆసియా దేశాల్లో, ఆఫ్రికా, మధ్య-దక్షిణ అమెరికా దేశాల్లో ఈ ఆంగ్ల మాథ్యమ మోజు పెరుగుతూ వస్తుంది. ఆంగ్ల మాధ్యమ విద్యా బోధనకు వ్యతిరేకంగా ఆయా దేశాల్లో ఉద్యమాలు నడుస్తున్నా అవి భావోద్వేగాల ఆధారంగానే తప్ప- వైజ్ఞానిక పరిశోధనల మీద ఆధారపడి లేవు. అయితే మాతృభాషా మాధ్యమ బోధన ద్వారా చదువుకున్న విద్యార్థుల్లో జ్ఞానం, గ్రహణశక్తి మెరుగ్గా ఉంటాయనేది ఎన్నో పరిశోధనల్లో బుజునైంది. ఉదాహరణకు హాంగ్‌కాంగ్ లో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మాతృభాషలో ఉత్తీర్ణులై వచ్చిన విద్యార్థులు భౌతిక శాస్త్రంలోని పై స్థాయి విషయాలను ఇట్టే అర్ధం చేసుకోగలిగారు, ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకన్నా మెరుగ్గా. దక్షిణాఫ్రికాలో జరిగిన మరో పరిశోధనలో మాతృభాషలో విజ్ఞానశాస్త్ర, ఇంజనీరింగ్ సంబంధిత అంశాలను చదువుకున్న విద్యార్థులు, ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న విద్యార్జులకన్నా మెరుగ్గా తాము నేర్చుకున్న అంశాలను తిరిగి చెప్పగలిగారు, వారి ఆత్మవిశ్వాసం కూడా మెరుగ్గా ఉందని ఈ అధ్యయనంలో తెలిసింది. లెబనాన్ దేశంలో విద్యార్థులు తమకు మాతృభాషాలో విద్య కావాలని అడుగుతున్నారట. విద్యార్థులకు వారి మాతృభాషల్లో విద్య అందితే వారి సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నెగ్గే నైజం బాగా మెరుగవుతున్నాయని ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధనలోనూ, అధ్యయనంలోనూ తెలుస్తోంది. ప్రాథమిక స్థాయి నుండి ఆపై ఇంజనీరింగ్ విద్యలో సైతం మాతృభాషా బొధనను ప్రవేశపెట్టాలన్న కొత్త విద్వా చట్టం, అందుకు తగ్గట్టు అడుగులు వేస్తున్న ప్రభుత్వ చర్యలు మెచ్చుకోదగ్గవి.” అని జాతీయ విద్వా చట్టాన్ని ఆయన సమర్ధించాడు. తన సుదీర్హ బోధనానుభవంలో ఐఐటీలో ఆంగ్లంలో మాత్రమే కాకుండా, ఆంగ్లం-హిందీ కలిపి మిశ్రమ భాషలో బోధించినపుడు విద్యార్థులు తాను చెప్పిన పాఠాలను మరింత మెరుగ్గా ఆకళింపు చేసుకున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తరగతి గదిలో మరింత ఆసక్తిగా నడుచుకున్నారని, తన స్వీయానుభవం పంచుకున్నాడు. ఐఐటీల్లో మొదటి సంవత్సరాంత పరీక్షల్లో మౌలిక సబ్జెక్టులైన ఫిజిక్స్, గణితంలో గ్రామీణ ప్రాంతాల విద్వార్థులు ఉత్తీర్ణులు కాలేక పోవడానికి ఆంగ్ల మాధ్యమం ఒక అడ్డుగోడగా ఉంటోందని, ఆ గోడని దాటే అదనపు చాకిరీ విద్యార్థులు భరించాల్సి వస్తుందని ఆయన అన్నాడు. ప్రాంతీయ భాషల్లో, లేదా కనీసం ఆంగ్లం కలిపిన మిశ్రమ భాషలో బోధనా, పరీక్షలు చేపట్టి ఈ అడ్డంకిని సమర్ధంగా దాటవచ్చని ఆయన అభిప్రాయ పడ్డాడు.
ఐఐటి హైదరాబాదు ఆచార్యులు శివ్ గోవింద్ సింగ్ తమ అభిప్రాయాన్ని చెబుతూ, మాతృభాషలో భొధనాంశాలు విద్యార్థి తిరిగి చెప్పగలిగినపుడే అతను విషయ పరిజ్ఞానాన్ని మెరుగ్గా కలిగి ఉండే అవకాశాలున్నాయని, తన స్వీయ అనుభవంలో తెలుసుకున్న విషయమిది అని ఆయన చెప్పాడు.
ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ సంచాలకుడు ప్రమోద్ కుమార్ జైన్ మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక అంశాల్లో విషయ పరిజ్ఞానం సమకూర్చాల్సిన బాధ్యత బోధకులదే అని చెప్పాడు. ప్రస్తుతం ఐబటీలలో, ఎన్‌ఐటీలలో ఉపాధ్యాయులు మిశ్రమ భాషలో బోధిస్తున్నారని, అయితే పరీక్షా విధానం కూడా ప్రాంతీయ భాషల్లో ఉంటే విద్యార్థులకు మరింత చేరువగా సాంకేతిక విద్య ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
మరి బయట ప్రపంచంలో అన్ని ఉద్యోగాలలో అంగ్ల భాష అవసరం ఉంటోంది, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న సాంకేతిక విద్యార్థులు ఎలా పోటీని తట్టుకోగలరు? అన్న సంశయానికి అచార్య జగదీశ్ కుమార్ సమాధానమిస్తూ, అంగ్లం కేవలం సంభాషణలకు కావాల్సిన ఒక ఉపకరణమే గానీ, పనికి కావాల్సిన నైపుణ్యత ప్రాంతీయ భాషలో నేర్చుకున్నా ఆంగ్లంలో నేర్చుకున్నా పెద్ద తేడా ఉండదు అని అన్నాడు. పైగా మాతృభాషలో నేర్చుకున్న విద్యార్థి మెరుగైన ఆత్మవిశ్వాసంతో పని చేయగలడని అన్నాడు. ఉదాహరణగా తమిళనాడులోని ఏదైనా ఆటోముబైల్ తయారీ కంపెనీలో ఆంగ్ల భాషా నైపుణ్యం కన్నా ప్రాంతీయ భాషా నైపుణ్యం ఎక్కువ అవసరం అని అక్కడ ఉద్యోగాల్లో చేరిన పూర్వవిద్యార్థులు తెలిపారని ఆయన చెప్పాడు.
ప్రాంతీయ భాషల్లో బోధనలో ఏం చిక్కులున్నాయి?
బోధనకు కావాల్సిన పారిభాషిక పదాలు, బోధనా సామగ్రి, ఉపాధ్యాయుల్లో ప్రాంతీయ భాషా బోధనకు కావాల్సినంత ఆసక్తి ఉండటం మొదటి సవాలు. ఉద్యోగాల కల్చన రెండో సవాలు. పరిశోధనకు పెద్ద పీట వెయ్యాలంటే, పరిశోధనా పత్రాలను ప్రాంతీయ భాషల్లో ప్రచురించే జర్నల్ల సంఖ్య పెరగాలి, పరిశోధనా పత్రాలను సమర్పించే సమావేశాలలో ప్రాంతీయ భాషలలో సమర్చించే పత్రాలకు పెద్ద పీట వేయాలి.
అయితే ఐఐటీ లాంటి జాతీయ సంస్థల్లో ఒక్కో తరగతిలో దేశం నలుమూలల నుండి వచ్చిన ఎన్నో భాషలు మాతృభాషలుగా గల విద్యార్దులుంటారు. ఉపాధ్యాయుడు కూడా ప్రాంతీయ భాష తెలిసిన వాడై ఉండకపోవచ్చు. కానీ మారుతున్న సాంకేతికత వలన ఏ భాషలోనైనా బోధన జరుగుతుంది. ఈ పరిస్థితిని ఎంత సృజనాత్మకంగా అందరికీ ఉపయోగపడేలా మలుచుకోవచ్చోనన్న బాధ్యత ఉపాధ్యాయుడి పై ఉంది. జాతీయ అనువాద, అనుసృజన సంస్ద ఏర్పడ్డాక ఈ విషయమై మరింత స్పష్టత చేకూరుతుంది.
పై అభిప్రాయాలకు విపరీతంగా పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. వారు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యకు వ్యతిరేకత తెలుపున్నందుకు ప్రధాన కారణం, సమయాభావం. అతి తక్కువ కాలంలో, అంటే ఈ రానున్న విద్యా సంవత్సరం నుండే బోధన ప్రాంతీయ భాషల్లో జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వీరిలో సింహభాగం వ్యతిరేకిస్తున్నారు. తగినంత సమయం ఇస్తే, ప్రాంతీయ భాషల్లో బోధనాంశాలు రూపొందించవచ్చని, ప్రాంతీయ భాషల్లో చదివించే ఉపాధ్యాయులను సన్నద్దం చేసుకోవచ్చని వారి
నలభై శాతం తెలుగు ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుగులోనే ఇంజనీరింగ్ కావాలి!
అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికరమైన విషయాలు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ) ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో
ఏఐసీటీఈ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. వారం రోజులపాటు అందుబాటులో ఉన్న ఈ స్వచ్చంద సర్వేలో 83,195 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం పది ప్రశ్నలున్న ఈ సర్వేలో విద్యార్ధులు ప్రస్తుతం ఏ ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఏ కళాశాలలో చదువుతున్నారు, పేరు, స్త్రీ/పురుషుడు, ఇంజనీరింగ్ బ్రాంచ్, మాతృభాష పదవ తరగతి వరకు చదువుకున్న మాధ్యమం, ఇంటర్ లో చదువుకున్న మాధ్యమం, బిటెక్ విద్య ఇంగ్లీష్ కాకుండా మాతృభాషా మాధ్యమంలో ఉండాలా ఒకవేళ మాతృభాషలో ఉంటే, ఏ భాషలో చదవాలనుకుంటున్నారు. అనే అంశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ కళాశాలలన్నిటి పేర్లూ సర్వేలో కనిపించాయి, అంటే ఇక్కడి విద్యార్దులు బాగానే సర్వేలో పాల్టొన్నారు. నాలుగు ఏడాదుల వాళ్ళు సమపాళ్ళలో పాల్గొన్నారు. అత్యధికంగా కంప్వూటర్ సైన్స్ విద్యార్థులు 26% పాల్గొన్నారు. తమిళం మాతృభాష అని చెప్పుకుని 29,683 మంది విద్యార్దులు పాల్గొనగా, తెలుగు వారు 11,531 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 14,730 మంది హిందీ విద్యార్థులు ఈ సర్వే లో పాల్గొన్నారు. సంఖ్యాపరంగా మొత్తం సర్వే లో పాల్గొన్నవారిలో దాదాపు 14% తెలుగు విద్యార్థులున్నారు.
పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం వారు మొత్తం సర్వేలో 79% ఉన్నారు. 15.2% మంది మాతృభాషా మాధ్యమంగా నమోదు చేసుకున్నారు. అయితే ఐచ్చికాలలో ఆంగ్లమా, మాతృభాషా? అని ప్రశ్న ఉన్నా జవాబులో హిందీ, తమిళం, తెలుగు, సెమి-ఇంగ్లీష్ ఇలా ఇతర ఐచ్చికాలు కూడా సర్వేలో పాల్గొన్న విద్యారులు చొప్పించారు. అలా ఒక 50-100 తెలుగు అని సూచించారు. (telugu. Telugu , Telugu medium ఇలా వేరు వేరుగా చొప్పించి)
ఇంటర్లో 81.7% మంది ఆంగ్ల మాధ్యమం అని ఎంచుకోగా, 12.6% మంది మాతృభాషా మాధ్యమమని ఎంచుకున్నారు. ఇక్కడ కూడా బలవంతంగా హిందీ, తమిళం, గుజరాతీ అని చొప్పించిన వారున్నారు.
తొమ్మిదవ ప్రశ్న - ప్రస్తుత ఇంజనీరింగ్ విద్య ఒకవేళ ఆంగ్లంతో పాటుగా మాతృభాషామాధ్యమంలో అందుబాటులో ఉంటే, ఆంగ్ల మాథ్యమమా? మాతృభాషా మాధ్యమమా? అని అడగగా, 56.2% మంది మాతృభాషా మాధ్యమమని, 43.8% మంది ఆంగ్లమాథ్యమం అని జవాబిచ్చారు.
ఇక ఆఖరు ప్రశ్న - మాతృభాషా మాధ్యమమైతే ఏ భాషలో ఉండాలి? అని.
దీనికి జవాబుగా అత్యధికంగా 14,129 మంది తమిళం అని జవాబిచ్చారు. తరువాతి స్థానంలో హిందీ 8,608 మంది విద్యార్థులు అడిగారు. ఆ తరువాత తెలుగు కావాలని 4,646 మంది విద్యార్థులు కోరారు. తరువాతి వరుసలో మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ మొదలగు భాషల్లో ఉండాలని అభ్యర్థన అందింది.
ఈ సర్వేలో తికమక పెట్టే విషయం, మాతృభాష ఏది అని ఆరవ ప్రశ్నగా అడిగి, మళ్ళీ పదవ ప్రశ్నలో మాతృభాషా మాధ్యమ ఇంజనీరింగ్ విద్యలో ఏ భాషను ఎంచుకుంటారు అని అడగడం.
అంటే తమిళమో, తెలుగో మాతృభాష ఉన్నా హిందీ మాధ్యమంలో అడుగుతారని ఏఐసీటీఈ అభిమతం ఏమో?
మాతృభాషలోనే ఇంజనీరింగు కావాలని అడిగిన విద్యార్డులో, భాషలవారిగా : తమిళం-47.5%, హిందీ-58.43% తెలుగు- 40.18%. అంటే 10లో నలుగురు తెలుగు ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుగులోనే ఇంజనీరింగ్ కావాలి.
తెలుగు మాధ్యమం పాఠశాల స్థాయిలో వద్దు అన్న ప్రభుత్వాలకి ఈ గణాంకాలు కనువిప్పు చేస్తే బావుణ్ణు.
-రహ్మానుద్దీన్ షేక్ వాదన.
కొందరు ఆచార్యులు మాత్రం ఈ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యా బోధన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరోగమనానికి నాందిగా, వెనుకబాటుతనం వైపు పోకడగా (a ery regressie and retrograde idea) చెబుతున్నారు.
ఐఐటీ బీహెచ్‌యు ఇప్పటికే మొదటి సంవత్సరం బీటెక్ కోర్సును హిందీలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ అందించే ఐఐటీలు, ఎన్‌ఐటీల జాబితా రూపొందిస్తోంది. ఈ ప్రాంతీయ భాషా తరగతులు ఇంతకు ముందున్న ఆంగ్ల భాషా తరగతులకు అదనంగా చేరుతున్నాయే తప్ప, ఆంగ్ల భాషను తీసివేసి ప్రాంతీయ భాషల్లో కోర్సులు ప్రవేశపెట్టడం లేదు. కొందరు మీడియా ఛానళ్ళ వారు మాత్రం ఆంగ్ల భాషను తీసివేసి ప్రాంతీయ భాషల కోర్సులతో భర్తీ చేస్తున్నట్టుగా దుష్ప్రచారం చేసారు.
ఒకానొక ఐఐటి సంచాలకుడు (చాటుగా, పేరు చెప్పకుండా) ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మొత్తం జోధనా సిబ్బంది విముఖంగా ఉన్నారని, ఇది విద్యను చిన్నచూపు చూడటం అని అతను ఎండకట్టాడు. ఐఐటీలకు ఉన్న ప్రాచుర్యాన్ని పేరు ప్రఖ్యాతులను- ఈ ప్రాంతీయ భాషల కోర్సుల ప్రవేశం నీరుగార్చుతుందని అతడు ఆందోళన వ్యక్తం చేసాడు. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధన అసంభవం అని ఐఐటీ లాంటి జాతీయ సంస్థలో దేశం నలుమూలల నుండి వివిధ భాషలు మాట్లాడే విద్యార్థులు వచ్చి సమర్ధవంతంగా ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారని. ప్రాంతీయ భాషా బోధన విద్యార్థుల్లో అనవసరపు తారతమ్యాలు తెస్తుందని అతడి అభిప్రాయం. ప్రాంతీయ భాషల్లో ఐఐటీల్లో చేరేందుకు ఎంపిక పరీక్షలు ఉండటంలో అభ్యంతరం లేదు కానీ ఒక సారి ఐఐటీలో చేరిన విద్యార్థి ప్రపంచ స్థాయి నైపుణ్యం ఫొందాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరమని అతడి అభిప్రాయం. ఐఐటీల్లో బిటెక్ ప్రాంతీయ భాషల్లో బోధించడం ఒక దుర్ఘటనగా అతడు వర్ణించాడు.
మరొక ఐఐటీ ప్రొఫెసర్ మాట్లాడుతూ, “ఐఐటీల్లో ఇంత హడావుడిగా ప్రాంతీయ భాషల్లో బోధన మొదలుపెట్టాలంటే ఉపాధ్యాయులను సన్నద్దం చేయటం కష్టం! ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో సమర్ధవంతంగా బోధించగల ఆచార్యులను వెతకడమే మూడు చెరువుల నీరు తాగిస్తుంటే, ప్రాంతీయ భాషా బోధకులను ఇప్పటికిప్పుడు చేర్చుకుని, ఐఐటీ స్థాయికి వారు బోధించేలా తీర్చిదిద్దడం నేల విడిచి సాము చేయటం లాంటిది. నేను హిందీ మాధ్యమంలో చదువుకొని, ఆపై ఐఐటీ కాన్సూర్ విద్యార్థినయ్యాను. ఐఐటీలో ఉండగా హిందీపై పట్టు పోయింది. ఇప్పుడు హిందీలో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలు బొధించమంటే, నేను బోధించలేను! నాణ్యమైన ఉపాధ్యాయులను వెతికి మరీ ఐఐటీల్లో జోధనా సిబ్బందిగా అతి కష్టం మీద తీసుకు రాగలుగుతున్నాము. విదేశాల నుండి ఇక్మడకు వచ్చే ఆచార్యులు ఈ రకమైన పరిణామాల వల్ల ఐఐటీల్లో చదివించడానికి సుముఖత చూపకపోవచ్చు.
ప్రపంచంలో వంద ఉత్తమ సాంకేతిక కళాశాలల్లో చేరేందుకు ఉబలాట పడుకున్న భారతీయ ఐఐటీల శ్రమను, ప్రాంతీయ భాషా ఇంజనీరింగ్ బోధన నీరుగాచ్చేన్తుంది. ఐఐటీల ఎంపిక - అది విద్యార్దుల ఎంపికైనా, బోధనా సిబ్బంది ఎంపికైనా - ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విధానం తేవడంతో నాసిరకంగా పరిణమిస్తుంది.”
“గత ఏడాది ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థుల రిజర్వేషన్ వల్ల పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు తరగతి గదులు లేక ఇబ్బంది పడుతుండగా, ఈ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ ఐఐటీల్లో మరిన్ని తరగతుల అవసరాన్ని కల్పిస్తుంది. ఒక్క ఏదాదిలో విద్యార్థులకు తగిన వసతులు ఏర్పాటు చేయటం పెద్ద సమస్యే
ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అనగానే మన వారికి కొత్తగా పాఠ్య పుస్తకాలు రాయాలన్న అవసరం కన్నా ఉన్న ఆంగ్ల పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసెయ్యాలనే తోస్తుంది. ఎందుకంటే ఆ పని సులువు కనుక. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తరగతి గదిలో ప్రామాణిక పాఠ్య పుస్తకాలే కాకుండా, బయటి పుస్తకాలు ఎన్నో చదవాల్సి ఉంటుంది. ప్రధాన పాఠ్యపుస్తకం ఒక్కటి ప్రాంతీయ భాషలో రూపొందించి ఇవ్వటమే కష్టం అయితే, అదనపు రిఫరెన్స్ పుస్తకాలను ప్రాంతీయ భాషలో చదివే విద్యార్థులకు ఎలా అందించగలము? అలా అందించలేనప్పుడు, వారికి అన్యాయం చేస్తున్నట్టే.” అని మరో ప్రొఫెసర్ అన్నారు.
ఒక పేస్‌బుక్ పోస్టులో ఐఐటి ఖరగ్పూర్ సంచాలకుడు వీరేంద్ర కుమార్ తివారీ రాస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించాడు. ప్రతి సాంకేతిక విద్యా సంస్థలో ప్రాంతీయ భాషా హబ్ ఉండాలని. ఈ హబ్ బోధనాంశాలను, ఇతరత్రా విద్యార్థులకు అవసరమయ్యే బోధన సామగ్రిని ప్రాంతీయ భాషల్లో రూపొందించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రత్యేక సంస్థలో వచ్చి చేరే విద్యార్థుల నేపథ్య భాషను అనుసరించి, అందుబాటులో ఉన్న సిబ్బంది సహకారంతో, విద్యార్థులు ముఖ్యంగా ఆంగ్ల భాష బొధనలో ఎదుర్కొన్న అంశాల ప్రాతిపదికన ఈ హబ్ లు పని చేయవచ్చని ఆయన అన్నాడు. ఐఐటీ ఖరగ్పూర్ లో ఇప్పటికే ఇలాంటి ఒక ప్రాంతీయ భాషా హబ్ బెంగాలీ, తెలుగు, హిందీ విద్యార్థులకు ఆసరాగా పని చేస్తోందని. కొన్ని ఎంపిక చేసిన సబ్జెక్టులకు ఈ సహకారం ఒడియా, తమిళంలో కూడా ఉందని ఆయన ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
మన ముందున్న వ్యక్తి ఏ భాషలో మాట్లాడుతున్నా మన భాషలోకి మార్చి వినిపించగల కృత్రిమమేధ సాంకేతికత అండతో మన భాషలో బోధించే సిబ్బంది లేకున్నా చక్కగా తరగతి గదిలో ఆంగ్లంలో చెప్పేదంతా మన మాతృభాషలో వినవచ్చు.
ఇలాంటి సాంకేతిక విష్ణవం వైపు ఇప్పటికే ఐఐటీ ఖరగ్పూర్ పనిచేస్తోందని వీరేంద్ర అన్నాడు.
ఐఐటీ గౌహతి సంచాలకులు గౌతం బరువా మాట్లాడుతూ, దీర్ధ కాలంలో ఇది సాధ్యమేమో కానీ, ఇంత తక్కువ వ్యవధిలో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధన అసాధ్యమని అన్నాడు.
ఐఐటీ దిల్లీ డైరెక్టర్ రాంగోపాల్ రావు మాట్లాడుతూ ఐఐటీల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ అనేది ఐఐటీల నాశనానికి నాంది అని పేర్కొన్నాడు. బొథనా సిబ్బంది ఎంపికకి ప్రస్తుతం కేవలం విషయ పరిజ్ఞానం ఒక ప్రాతిపదిక. ప్రాంతీయ భాషల్లో బోధించే సిబ్బందిని ఎంపిక చేయాలంటే, ఆ భాషలో నైపుణ్యత ఉన్నవారినే ఎంచుకోవాలి. అలాంటి వారిలో విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండదు, అందువల్ల ఐఐటీ బోధనా సిబ్బంది నాణ్యత దెబ్బ తింటుంది. ఆ విధంగా ఈ చర్య ఐఐటీల ముగింపుకి మొదటి అడుగవుతుంది.
ఇంటర్ వరకు పూర్తి తెలుగు మాధ్యమంలో చదివి ఆపై ఐఐటీకి వచ్చిన రావు మాత్రం జేఈఈ(ఐఐటీల్లో చేరేందుకు రాసే అర్హత పరీక్ష) మాతృభాషల్లో ఉండాలని అంటున్నాడు.
ఒకసారి ఐఐటీ లో చేరాక విద్యార్థులు సహాయక జట్టులుగా ఏర్పడి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి అని ఆయన అభిమతం.
“మనం ప్రపంచ స్థాయి ఇంజనీర్లను తయారు చేస్తున్నాం. తమిళనాడు కోసమో, ఆంధ్ర కోసమో కాదు!” అని ఆయన అభిప్రాయం.
“మొదటి ఏడాది, మొదటి సెమెస్టర్ లో కొన్ని సబ్లెక్టులు కావాలంటే ప్రాంతీయ భాషల్లో బొధించవచ్చేమో కానీ, సాంతం బీటెక్, ఎంటెక్ ప్రాంతీయ భాషల్లో బోధించడం కష్టం అని ఆయన అభిప్రాయం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీకి సిద్ధాంతపరంగా వెనుక ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చాలా ఏళ్ళుగా విద్య ప్రాంతీయ భాషల్లో ఉండాలని సైద్ధాంతికంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా సాంకేతిక విద్య భారతీయ భాషల్లో ఉండాలన్నది వీరి సంకల్పం, 2016లో ఆరెసెస్ నేతృత్వంలో ఒక అభ్యర్థన ద్వారా ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య ఉండాలని పట్టుబట్టి అప్పటి మానవవనరులశాఖ(ప్రస్తుతం విద్యా శాఖ) మంత్రి ప్రకాశ్ జావడేకర్ కి వినతిపత్రం ఇచ్చారు. ఐఐటీల్లో ఐఐఎంలలో, ఇంకా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషల్లో విద్య ఉండాలని. విద్యా విధాన చట్టంలో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశం జోడించడంలో ఈ వినతిపత్రం ముఖ్యంగా చెప్పుకోవాలి.
మార్చి 26 నాటికి వివిధ ఉన్నతవిద్యాసంస్థల అభ్మిపాయాలను సేకరించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఆ అభ్యర్థనలలోని కొన్ని విషయాలను బహిర్గతం చేసింది.
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు అనువుగా ఉన్నత విద్యాసంస్థలను సన్నద్ధం చేసేందుకు, వారి అభిప్రాయాలు సేకరించేందుకు రెండు పేనళ్ళను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నియమించింది. ఇందులో మొదటి పేనల్ ఏఐసీటీ ఈ(అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ) నేతృత్వంలో ఉంది. ఈ పేనల్ తన అధీనంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో, సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ. భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అందించేలా మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యకు అనుకూలంగా నడుచుకుంది.
ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అమిత్ ఖరే నేతృత్వంలో ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య సాధ్యాసాధ్యాల బేరీజుకు రెండవ పేనల్ ఏర్పరచబడింది. ఈ పేనల్ ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. ఈ పేనల్ కు ఐఐటీల తరఫు నివేదిక భారతీయ భాషల్లో ఇంజనీరింగ్ అందించడం కష్టమని, అందుకు ఐఐటీలు ఇప్పుడప్పుడే సన్నద్ధంగా లేవని చెప్పింది. అయితే ప్రాంతీయ భాషల్లో చదువుకుని వచ్చే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమ స్థాయిని అందిపుచ్చుకునేలా ఆంగ్ల నైపుణ్య బోధన చేయగలమని ఐఐటీల నివేదిక తెలిపింది. ఇదే పేనల్ కు ఎన్‌ఐటీల తరఫున అందిన నివేదిక ప్రాంతీయ భాషల ఇంజనీరింగ్ విద్యకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఐఐటీ తరఫు నివేదిక సమర్పించిన వారి ప్రకారం ఐఐటీల్లో వచ్చి చేరే విద్యార్దులు వివిధ భాషల వారుంటారు. ఒక ప్రాంతీయ భాషలో బోధన మొదలుపెడితే, మిగితా భాషల వారికి అన్యాయం చేసినట్టు ఔతుందని వారి అభిప్రాయం.
ఐఐటీల్లోలా కాకుండా ఎన్‌ఐటీల్లో 50% ప్రాంతీయ విద్యార్దులు చేరతారు. అందువలన ప్రాంతీయ భాషలో ఇంజనీరింగ్ సబ్జెక్టుల బోధన ఎన్‌ఐటీల్లో పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఎన్‌ఐటీ భోపాల్ అలాహాబాద్, హిమాచల్ ప్రదేశ్, జైపూర్లు ఈ విధానాన్ని స్వాగతిస్తూ ప్రాంతీయ భాషా ఇంజనీరింగ్ బోధనకు తాము సిద్ధమని తెలిపారు.
ఏఐసీటీఈ వారు ఆంగ్లంలోని పాఠ్యాంశాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే పలు యాంత్రిక అనువాద ఉపకరణాలను అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. సంస్ద ఇప్పటికే మొదటి, రెండవ సంవత్సర ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను ఎనిమిది భారతీయ భాషల్లోకి సమర్ధవంతంగా అనువదించి అందుబాటులో ఉంచిందట. కేవలం ఒక 5% మానవ తనిఖీ జరిగితే చాలు, ఇవన్నీ నేరుగా తరగతి గదిలో వాడుకోవచ్చు. ఫార్ములాలు, గణిత, భౌతికశాస్త్ర ఈజ్వేషన్లు ఈ ఉపకరణాల ద్వారా అన్ని భారతీయ భాషల్లోకి తర్షుమా ఐపోతాయట.
ఇప్పటికే ఇంజనీరింగ్ విద్యార్దులకు అందుబాటులో ఉన్న స్వయం మొబైల్ ఆప్ లోని కొన్ని కోర్సులను యాంత్రిక అనువాదం ద్వారా అనువదించి నాణ్యతా పరీక్షలు చేస్తున్నారట.
ఏఐసీటీఈ చెయిర్మన్ అనిల్ సహ(స్రబుద్దె ఈ విషయాలను చెబుతూ, సాంకేతిక విద్య ప్రాంతీయ భాషల్లో బొధించడం కొత్తేం కాదని చాలా ఏళ్ళుగా రాజస్థాన్ లో హిందీలో, తమిళనాడులో తమిళంలో ఇంజనీరింగ్ డిప్లామా ఇస్తున్నారని, స్వాతంత్య్రానికి ముందు ఎన్నో సంస్థల్లో ఉర్జూలో సాంకేతిక విద్య ఉండేదని ఆయన చెప్పాడు.
మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం
విద్యార్థి చదువుకు అడ్డంకిగా మారుతుంది
- “యునెస్మో