అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/4

సంపాదక హృదయం

సంపుటి: 6 సంచిక ; 4

అమ్మనుడి

సెస్టెంబరు 2020

జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపు?

ఆగస్టు సంచిక అచ్చుకు వెళ్లేందుకు సిద్ధమైన దశలో జులై 29న నూతన జాతీయ విద్యావిధానం విడుద లయింది. వెంటనే దానిపై సంపాదకీయంలోనూ దానితోపాటే 'జాతీయ విద్యావిధానం-2020: మంచీ చెడూ ' వ్యాసంలోనూ మా అభిప్రాయాలను కొంతవరకు వెలిబుచ్చాము. గడిచిన నెల రోజులుగా పత్రికల్లో, ప్రసారమాధ్యమాల్తో, వలగూడు (ఇంటర్‌నెట్‌ సమావేశాల్లోనూ ఎన్నో అభిప్రాయాలు, చర్చలు వెలుగుచూశాయి. ఇంకా విస్తారంగా ఈ పని జరిగుండవచ్చుగాని, ఇప్పుడున్న కోవిడ్‌ గందరగోళం వల్ల అదంతా కుదించుకు పోయింది.

ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వపాలననూ, విధానాలనూ మనం గమనిస్తున్నాం. దేశం మొత్తం మీద రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థించే లేదా తటస్థంగా ఉండే జనాఖిప్రాయమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. వామపక్ష పార్టీలు, ఇతర (ప్రతిపక్షాలూ రాజకీయంగా బలమైన వ్యతిరేకతను కూడగట్టి, ఉద్యమంచగల సమైక్యశక్తిని

జాతీయ ఐక్యతా, ప్రగతీ లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నామంటున్న పాలక పార్టీ, అందుకై అనుసరిస్తున్న విధానాల పట్ల శంకలున్నవారూ, ఖిన్నాభిప్రాయాలున్నవారూ ఆ పార్టీ సానుభూతిపరుల్లో కూడా చాలా మంది ఉన్నారు. కాని, వారికి ప్రతిపక్షాల చిత్తశుద్ధిపై గాని, సమర్థతపై గాని నమ్మకంలేదు. ఈ పరిస్థితే ఇప్పుడు జాతీయ విద్యావిధానం పైన కూడా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో కొంతవరకు అడ్డుగోడగా నిలిచింది. విద్యా భాషారంగాల్లో దేశీ విదేశీ పెట్టుబడిదారీ శక్తులు ప్రభుత్వాలనే గాక, ప్రతిపక్షాలను కూడా నియంత్రించగలుగుతున్నాయి. అందువల్ల విద్యా, భాషారంగాల్లోని నైతికశక్తులు ఒంటరివైపోయి, ప్రజలపైనా ప్రభుత్వాలపైనా అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయదలచుకొన్నా ఎదురులేకుండాపోతున్నది. కొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించెముండు రామ్ర్రాలను కూడా కలుపుకురావాలనే ముఖ్యవిషయాన్ని అంతగా పట్టించుకోలేదు (రాజ్యాంగంలో విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడీ జాబితాలోని అంశమన్న సంగతి తెలిసిందే!).

కొత్త విద్యావిధానంలోని వివిధ పాలనాంశాల అమలుకై పలు చట్టాలను తేవలసి ఉంది. ఆ సందర్భంగా చట్టసభల్లో చర్చకు ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఎవరు ఎంతవరకు కీలకాంశాలను తెరపైకి తేగలరో చివరకు ఆ చట్టాలు ఎలా బయటకువస్తాయో చూడాలి. ఆ చట్టాల అమలు ఎంత ఖచ్చితంగా జరగగలదో, ప్రకటిత ఆశయాదర్చాలు, లక్ష్యాలు ఎంతవరకు నెరవేరతాయో కూడా మనం వేచి చూడాల్సిందే.

కొన్ని ముఖ్య అంశాల గురించి మాట్లాడుకొందాం. విద్యాప్రణాళికలోనూ పాఠ్యప్రణాళికలోనూ చాలా మార్సులు తెస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన “సుస్థిర అభివృద్ధి” లక్ష్యాల ప్రకటనలో మనదేశం కూడా సంతకం చేసింది. దాని ప్రకారం విద్యను సమస్త అవసరాలకు, శాస్తసాంకేతికరంగ మార్చులకు తగ్గవిధంగా రూపొందించుకోవాలి. దీనికనుగుణంగా మన జా.వి.వి.ని సిద్ధంచేయడంతో పాటు దాని ముందున్న మరొక ప్రధాన బాధ్యత- ప్రభుత్వం ఆశిస్తున్న భాషాసాంస్మతిక అంశాలను, విధానాలను పొందుపరచడం. అందువల్ల దృఢమైన భారత జాతీయతను తీర్చిదిద్దేందుకై మన భాషల్లోనూ, సాంస్కృతికతలోనూ ఉన్న వైవిధ్యాలను గుర్తించకుండా సంస్కృతాన్ని హిందీని సమున్నతంగా నిలబెట్టే లక్ష్యంతో జా.వి.వి.ని రూపొందించారు. ప్రపంచంలోనే సంఖ్యలోనూ, ప్రాచీనతలోనూ తొలి వరుసలో ఉండే తెలుగు వంటి ద్రావిడభాషల ప్రత్యేకతను పక్మనపెడుతున్నారు. ఎంతో తెలివిగా సూచించిన మార్గదర్శకాల్లో ఈ కుట్రపూరిత ధోరణి అర్థమవుతూనే వుంది. దీనిపై చర్చ జరగాలి. ఇదేవీధంగా జనసంఖ్యలో తక్కువగా ఉన్న గిరిజన భాషల విషయంలోనూ బాధ్యతను ప్రకటించలేదు.

సాంస్కృతికంగా కూడా మన దేశంలో ఉన్న నైవిధ్యాన్ని (ప్రేమించి, అందరినీ కలుపుకొచ్చే విధంగా “సమైక్యతను సాధించాలి తప్ప, 'ఏకత' కోసం ఆరాటపడకూడదు. సామాజిక, వ్యక్తిగత ఆచారాలు కూడా చాలా సందర్భాల్లో ఆచరణలో వారి మతాచారాలతో కలిసిపోయి ఉంటాయి. పరస్పరం వాటిని గౌరవీంచుకోవాలి. అధ్యాత్మికతకూ, వేదాంతానికీ, మతాలకూ ఉన్న సున్సితమైన భేదాల్లాంటివే ఇవి. వీటిని మన్నించే సమాజాన్ని నిర్మించడం కోసం తగిన విద్యావిభానాలను రూపొందించాలి. విద్యార్థిదశలోనే ఇలాంటి ప్రాతిపదికలను ఏర్పరచాలి.

అన్నిటికంటే ముఖ్యమైన సంగతి-కిందినుండి పై స్థాయి వరకూ విద్యారంగ నిర్వహణ ఎవరిచేతుల్లో ఉండబోతున్నదనేది. దాదాపుగా గడచిన నలఖై ఏళ్ళుగా మెల్లమెల్లగా మన ప్రభుత్వాలు విద్యారంగంలో తమ బాధ్యతలకు నీళ్లాదులుతున్నాయి. కొద్దికొద్దిగా మొదలైన ఈ ధోరణి పెరిగి పెరిగి “ప్రపంచీకరణ విధానాలు” ఊపందుకున్న గత రెండు దశాబ్దాలకు పైగా మొత్తం విద్యావ్యవస్థ పెట్టుబడిదారుల, విద్యావ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాజకీయనాయకులు ఈ వ్యాపారంలోకి చేరడమో ఇందులోని వారే రాజకీయాల్లోకి చేరి ఉన్నత పదవుల్లో పెత్తనం చేయడమో జరిగిపోతూనే వుంది. ఇదొక ప్రత్యేకమైన 'మాఫియా' లక్షణాలను సంతరించుకొంటున్నది. ఈ పరిస్థితులు కొత్త విధానం వల్ల మారుతాయా అంటే అందుకు ఏమాత్రం అవకాశం లేదనే అనిపిస్తున్నది. కొత్త విద్యావిధానాన్ని నిశితంగా పరీక్షిస్తే ఈ అంశం స్పష్టమవుతుంది.

కొత్త విధానం ప్రకారం నిర్వచించిన 5+3+3 వరకైనా - అంటే పానశాల విద్యను పూర్తిగా ప్రభుత్వం చేపట్టి బాధ్యతతో నిర్వహించాలి. అ పై విద్యలో ఆర్థికానికి సంబంధించి ఏం చేస్తారన్నది వేరే అంశం. పరిశ్రమలు తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్లు వెచ్చించి మౌలిక వసతుల పేర సమస్త సౌకర్యాలనూ కలుగజేస్తున్న ప్రభుత్వాలు, మన బిడ్డలను-భావిపౌరులను-సమానంగా అభివృద్ధి చేసేండుకు కావలసిన మౌలిక విద్యను కనీసం పాఠశాల విద్యను అందరికీ ఒక రాజ్యాంగ హక్షుగా ఉచితంగా సమకూర్చవద్దా? ఇందుకు అవసరమైన చట్టాలను, అవసరమైతే రాజ్యాంగసవరణలనూ చేసి ముండుకు సాగాలి. ప్రపంచంలో అనేక దేశాలు విద్యారంగానికై స్థూలజాతీయోత్పత్తిలో 10 శాతం వరకూ కేటాయిస్తుంటే మనం అందుకోసం వెచ్చిస్తున్నది 4 శాతంలోపు! ఇప్పుడు దీనిని 6 శాతం వరకు పెంచాలనే ప్రతిపాదనను జా.వి.వి. సూచిస్తున్నా ఇదెంతవరకు జరుగుతుందో నమ్మకం కుదరడం లేదు.

దేశంలోని సామాజిక అసమానతల దౌర్భాగ్యం నుండి, అర్థిక దోపిడీ నుండి కనీసం పాఠశాల విద్యావ్యవస్థను విముక్తం చేయాలి. ఇందుకు పూనిక వహించని విభానాలు ప్రజల మేలుకొరేవి కావు.

పాఠశాల విద్యలో కనీసం ప్రాథమిక విద్య వరకూ, అమ్మనుడుల్లో జోధన జరగాలని, వీలైతే 8 వరకూ అలా ఉండాలని జా.వి.వి. అంటున్నది. మరి ఈ అంశాన్ని దేశమంతా ఒకేరీతిలో ఆచరణలోకితెచ్చేటట్లు కేంద్రం బాధ్యత వహించగలదా? అవసరమైన చట్టాల సవరణలు లేదా రాజ్యాంగ సవరణలు చేసి దీనిని తప్పనిసరి చేసేండుకు కేంద్రప్రభుత్వం పూనుకొంటుందా? (అమ్మనుడి జనవరి 2020 సంపాదకీయం చూడండి). ఇందుకు తగ్గ నిర్ణయాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించగలదా? పాఠశాల విద్య (కనీసం 5+3+3 వరకు) నుండి అన్నిరకాలైన (ప్రయివేటు విద్యాసంస్థలను తొలగించి, ప్రభుత్వమే వాటి నిర్మాణాన్ని నిర్వహణను చేపట్టి అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడానికి సిద్ధపడుతుందా? ఈ రెండు అంశాలు ఆచరణలోకి రాకుండా, జా.వి.వి. ఏమీ చెప్పినా, ప్రభుత్వం ఏంచెయ్యబోతున్నా వాటిని నమ్మడానికి వీల్లేదు.

ఈ విద్యావిధానం వల్ల ప్రాథమిక విద్య వరకూ తెలుగుకు పట్టం కట్టబోతున్నారని కొందరు భ్రమపడుతున్నారు. వారు దయచేసి శ్రద్ధగా జా.వి.వి.ని మళ్లీ పరిశీలించాలి. ఎక్కడా, తప్పనిసరి అనిగాని, అందుకవసరమైన చర్యలు చేపడతాం అనిగాని చెప్పలేదు. విధ్యార్థులకు స్వేచ్చనిస్తున్నామని, రామ్ష్రాలకు స్వేచ్చ ఉందనీ నీతులు పలుకుతున్నారు. ఈ సందుల్లోంచి మన రాష్ట్రప్రభుత్వాల్లోని స్వార్ధశక్తులు ఎన్ని అవకాశాలను వెతికి తీస్తాయో చూడండి.

ఇక ఇంగ్రీష్‌ సంగతి- ఎక్కడా దాని ఆధిపత్యాన్ని కట్టడి చేసే చర్యలను జా.వి.వి.లో ప్రస్తావించలేదు. పైగా-త్రిభాషాసూత్రంలో రెండు దేశీయ భాషలుండే సంగతి ఎట్లావున్నాా మరో భాషగా- ఇంగ్షీషు స్థానం దేశమంతా భద్రంగా ఉంటుంది. చట్టాలను అమోదించడం నుండి పరిపాలనలో అన్ని దశల్లోను, కోర్టుల్లోనూ దాని న్థానం మరింత పదిలం అవుతూనే ఉంటుంది. దానితో పాటు హింది, సంస్కృతాలకూ మంచి భవిష్యత్తే. ఎటుతిరిగీ తక్మిన జాతీయ ప్రజల భాషలకు కలిగే ముప్పుకు జా.వి.వి అడ్డుకట్ట వెయ్యడం లేదు! రాజకీయ, ఆర్థిక, సామాజిక దోపిడీకి, ఆధిపత్యానికి మనం లొంగిపోవలసిందేనా?

తేదీ : ౩1-8-2020 సామల రమేష్ బాబు