అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/కొత్తమాటల పుట్టింపు
కొత్తమాట
స.వెం.రమేశ్
కొత్తమాటల పుట్టింపు
“అన్నయ్యా, నిన్ను ఒకమాట అడగాలనుకొంటున్నాను. అయితే నా అడక(ప్రశ్న)కు నీ తిరువు(జవాబు) దురుసుగా ఉంటుందేమో అని జంకుతున్నాను” అన్నాడు నారాయణ. “అదే నారాయణా వద్దనేది. పెరనుడుల మీది తగులం (వ్యామోహం)తో తెలుగును ఈసడించుకొనేది నువ్వ. 'తెలుగు అనే పులుగుకు, సంసుక్రుతం ఇంగ్లీసు అనేవి రెండు రెక్కలు, ఏ రెక్క తక్కువయినా తెలుగు ఎగరలేదు” అనింది నువ్వు. “ఆనిమిమాటల పుట్టింపుకు తెలుగు చేవలేనిదీ చేతకానిదీ అని వెక్కసమాడింది నువ్వు నీ కరకుమాటలకు మారుపలుకుతున్నాడు అన్నయ్య. అవి నీకు దురునుగా అనిపిస్తున్నాయా?” అంటూ గయ్యిమనీ లేచినాడు చిన్నయ్య.
“చిన్నయ్యా, జరిగిపోయిన పెళ్లికి మేళమెందుకు ఊరకుండు. నారాయణా, చిన్నయ్య మాటల్ని పట్టించుకోకు. తెలుగుమీద మాకెంత అక్మరా అనుగూ ఉందో నీకూ అంతే ఉందని నేనెరుగుదును. నువ్వు నడచివచ్చిన దారి వేరు, నేను నడవమంటున్న దారి వేరు. ఈ గజిబిజి నుండి బయటపడుతావులే. ఇంతకీ నువ్వు అడగాలనుకాన్నది ఏమిటో అడుగు” అన్నాను నేను కలిపించుకాంటూ.
"ఏమీ లేదు అన్నయ్యా. తామరపువ్వుకు తెలుగులో, తామర, తమ్మి వంటివి రెండో మూడో పేర్తున్నాయి అంతేకదా! అదే సంసుక్రుతంలో అయితే జోలెడుమాటలు కనబడుతాయి. అంబుజ, అబ్జ, ఉదజ, కంజ, జలజ, తోయజ, నీరజ, పంకజ, పయోజ, వనజ, వారిజ, సరసిజ, సరోజ వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అట్లాంటప్పుడు సంసుక్రుతం కన్నా తెలుగు గొప్పనుడి ఎట్లా అవుతుంది?” అని అడిగినాడు నారాయణ.
“నారాయణా నువ్వు బాగా బాగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, నేను ఎన్నడూ కూడా సంసుక్రుతం కంటే తెలుగు గొప్పది అనలేదు. అట్లాగే తెలుగుకంటే సంసుక్రుతమూ గొప్పది కాదు. దేని గొప్పతనం దానిది. సంసుక్రుతం దాదాపు వెయ్యేళ్లు బారతనాడులో 'పెననుడిగా ఉండేది. పలునుడులు ఉండే నాడుల్లో ఎసిదానిమి (శాస్త్రసాంకేతిక) అక్కరలకు ఒక పెననుడి కానే కావాలి. మన బారతనాడులో పాళీ, సంసుక్రుతం నుడులు ఎక్కువతావుల్లో ఎక్కువతరిలోనూ, పారసీకం తక్కువ తావుల్లో తక్కువ తరిలోనూ పెననుడులుగా ఉన్నాయి. ఇటీవల రెండు మూడు వందలేళ్ల నుండి ఇంగిలీసు మన నాడుకంతా పెననుడిగా ఉంది. ఇంగిలీసు, పారసీక నుడులలో వెలువడిన ఎసుడు(శాస్త్రా )లన్నీ బయట నుండి వచ్చినవే. పాళీ సంసుక్రుతాల్లో వచ్చిన ఎసుడులు అప్పటంగా ఈనేలవి. బారతనాడులో పలునుడులకు చెందిన ఎసిదరులు కనిపెట్టినవన్నీ పెననుడి అయిన సంనుక్రుతంలో వెలువడినాయి. మచ్చుకు మనికిమినుకు(ఆయుర్వేదం)నే తీసుకొందాం. పలునుడుల ఎసిదరులు ఒకచోట కూర్చుని ఒక మొక్క గురించి మాట్లాడుకోవాలి. తమిళంలో దాని పేరు 'తొట్టాచినంగి, తెలుగులో 'అత్తిపత్తి. తెలుగులో కూడా అత్తిపత్తి, సిగ్గురొడ్డ, లజ్జటాలు, ముడుగుతామర అని తావుతావుకూ దాని పేరు మారుతుంది. ఏ పేరుతో ఆ మొక్కను పొడక(రికార్డ్) చేయాలి? అందుకోసమే పెననుడి కావాలి. ఆ పెననుడిని తెలివరులు అందరూ నేర్చుకొంటారు. మననాడులోనే పుట్టిన మనికిమినుకు వంటి ఎసుడులన్నీ సంసుక్రుతంలో ఉండడానికి కతము ఇదే.”
“అన్నయ్యా, నారాయణ అడిగినదానికీ నువ్వు చెబుతున్నదానికి పొంతన కుదరడం లేదు. నారాయణ తామరకు చెప్పిన సంసుక్రుతం మాటలన్నీ ఎసిదానిమి మాటలే అంటావా?” నడుమన దూరినాడు చిన్నయ్య.
“అక్కడికే వస్తున్నాను కాస్త ఆగు చిన్నయ్యా, పెననుడిగా మారిన నుడి ఎసిదినుడిగా మట్టుకే కాదు, ఎన్నువ(కళ)నుడిగా కూడా ఎదుగుతుంది. ఎన్నువకు చెందిన నెన్నొడికూడా అందులో ఏర్పడుతుంది. అల్లిక(రచన) అనేది ఒక ఎన్నువ కదా. పాతతరిలో అల్లికలంతా పడిక(పద్యం} లుగా ఉండేవి. ఆ పాడికలు అల్లడానికి కొలువడి(చందస్సు)ఉందేది. ఆ కొలువడికి తగినట్లుగా మాటలు కావలసి వచ్చేవి. అల్లికరు(రచయిత)లు కొంగొత్త మాటలను ఎన్నో కొలువడికి తగినట్లు పుట్టించేవారు. ఇదంతా సంనుక్రుతంలో పెద్దయెత్తున జరిగింది. అట్లా పుట్టిన మాటలే పైన నారాయణ చెప్పినవి. దానినే పలుకొడమి(పదసంపద) అంటాం. తెలుగులో అల్లిక మొదలయ్యే నాటికి, సంసుక్రుతంలో పలుకొాడమి ఎంతో ఎదిగి ఉండేది. తెలుగు అల్లికరులు ఆ మాటలనే తీసుకొని వాడేసినారు. కొత్త మాటల పుట్టుకకు పూనుకొన్నవారు కొద్దిమందే. వాళ్లు కూడా చాలా పొడవయిన మాటలనే ఎక్కువగా పుట్టించినారు. ఎన్నువ నెన్నొడిని కూడా తెలుగులో పుట్టించి పెంపొందించవచ్చు. ఆ పని కూడా జరుగవలసిందే. ముందు ఎసిది నెన్నాడిని పుట్టించి, వాటిని బడిలో నేర్పుతూ ఉంటే, ఎన్నువమాటలను పుట్టించేవారు వారంతట వస్తారు. సంసుక్రుతంలో “జన్మ” అనే మాటలోని 'జ ' సడికి “పుట్టుక " అనే తెల్లంను కల్సించి ; అంబు, ఉద, జల, కం, తోయ, నీర, పంక, వన, పయ, వారి, సరసి, సరో వంటి కుదురులకు, 'జ 'ను చేర్చుగా చేర్చి బోలెడు ఎన్నువమాటలను పుట్టించినారు కదా. అట్లాగే “కను, కనుబడి, కలిమి” వంటి పుట్టుకకు చెందిన తెలుగుమాటలలోని తొలిసడి అయిన 'క 'ను చేర్పుగా చేర్చి తెలుగులో తామరకు కొంగొత్త ఎన్నువమాటలను పుట్టించవచ్చు. అడుసుక, అవుసుక, ఈరుక, ఊటుక, ఏటిక, కుళంక, కొలకుక, కొలనుక, కొళముక, కొళ్ళుక, కోడుక, చదుకుక, చింకక, చిత్తడిక, చెర్వుక, చెల్మక, జౌకుక, జేడక, టెంకిక, దొనక, దొర్వుక, నీరుక, నీర్క నీళుక పడియక పడ్యక, బురదక, మడుగుక, మడువుక, లట్టుక, లొండుక, వెంచక, వెళ్లక, వెల్లక, రొంపిక, సెలక.... ఇట్ల పుట్టించుకొంటూ వెళ్లవచ్చు. అట్లాగే 'పడయు, పడతి, పడుపు వంటి మాటలలో పుట్టుకకు చెందిన తెల్లం కనబడుతున్నది కదా, వాటిలోని 'ప ' సడిని కూదా చేర్చుకొని తామరకు మరిన్ని మాటలను పుట్టించవచ్చు. 'పుట్టు, పుట్టుక, పుట్టుగు, పుట్టుబడి, పుట్టువ 'లలోని 'పు 'ను తీసుకొని ఇంకొన్ని మాటలను పుట్టించవచ్చు” అని విడమరచినాను.
“ఎందుకనో ఈ మాటలను నేను ఒప్పుకోలేకపోతున్నాను. మాట మొదటి వ్రాత(అక్షరం)ను తీసుకొని దానిని చేర్చు అనడం ఒప్పుదల కాదేమో” అన్నాడు నారాయణ.
“అవునవును, ఎందుకు ఒప్పుదల అవుతుంది? అన్నయ్య చెప్పింది తెలుగుమాటల గురించి కదా! అదే సంసుక్రుతం గురించి అయితే అన్నయ్యేమిటి, నేను చెప్పినా ఒప్పుదల అవుతుంది. “నీవు నేర్పిన చదుయే నీర్పుగంటి” అన్నట్లు, 'జన్మ 'లోని తొలిసడి అయిన 'జ 'ను తీనుకౌని సంనుక్రుతంలో మాటలను పుట్టించినట్లె తెలుగులోనూ చేసినాడు అన్నయ్య. ఇందులో తప్పిదం ఏముంది, ఒప్పుదల కానిది ఏముంది? తాను చేస్తే కాపురం, ఇంకాకర్తి చేస్తే రంకు అన్నదట వెనకటికి ఒకావిడ. అట్లాగుంది నువ్వు చెప్పేది” అని నారాయణను వెక్కసమాడినాడు చిన్నయ్య.
“చిన్నయ్యా ఎంత చక్కచేసినా కుక్కతోక వంకరే అన్నట్లు ఎంత చెప్పినా నీ తెలివి తేటగిల్లడం లేదు. నారాయణ మీద ఎందుకలా విరుచుకుపడుతావు” అని చిన్నయ్యను కసరినాను.
“కుట్టినమ్మ కుదురుగా ఉంది, అరిచినమ్మ తెరువుకెక్కింది అన్నట్లు, తెలుగునీ నిన్నూ అగడుగా మాట్లాడే నారాయణేమో మంచివాడు, నేనే చెడ్దవాడినయ్యాను” నొచ్చుకాంటూ అన్నాడు చిన్నయ్య.
“చిన్నయ్యా, నువ్వు కూడా నొచ్చుకొంటే ఎట్లా? కాత ఉండే మానుకే రాతిదెబ్బలు. నలుగురు మనల్ని తెగడుతున్నారంటే మన దగ్గర ఏదో సరుకు ఉండబట్టే కదా! మనం ఈ పూటకి ఇక ఎన్నువ మాటల్ని వక్కన పెట్టి ఎసిదిమాటలను గురించి ముచ్చటించుకొందాం సదేనా” అన్నాను. -
“చిన్నయ్యా, నన్ను మన్నించు. ఇదివరకటిలాగా కాదు, నేనూ కొంత మారినాను. ఇంకా మారుతాను. నాకు కూడా తెలుగంటే మక్కువే” వేడుకొంటున్నట్లుగా అన్నాడు నారాయణ. ఆ మాటతో చిన్నయ్య హాయిగా నవ్వేసినాడు.
“ఏదయినా ఒకమంచి చేర్చును గురించి చెప్పు అన్నయ్యా” అన్నాడు నారాయణ.
“చెపుతాను వినండి. “అరవ” అనే చేర్చు గురించి మాట్లాడుకొందాం. దీనిని “అరం” అని కూడా రాసుకోవచ్చు. ఈ
- 1 తోలు + అరం = తోలరం డ్రైవింగ్
- 2 నడుపు + అరం = నడుపరం కండక్టింగ్ నిర్వహణ అంటున్నారు.
- ౩ తోము + అరం = తోమరం క్లీనింగ్
- 4 మర + అరం = మరవరం ఇంజనీరింగ్
- 5. నీటి + అరం = నీటరం ష్లంబింగ్
- 6 మిను + అరం = మిన్నరం ఎలక్ట్రికల్ వర్క్
- మిను అంటే ఎలక్షానిక్. మించు అంటే ఎలక్టిసిటీ.
- 7 పసను + అరం = పసనరం పెయింటింగ్
- పసను అంటే రంగు. రంగులు వేయడం.
- 8 పొల్లు + అరం = పొల్లరం టైలరింగ్
- పొల్లు అంటే కుట్టడం.కుట్టరం అని కూడా అనవచ్చు.
- 9 ఉడిగ + అరం = ఉడిగరం సర్వింగ్
- ఉడిగం అంటే సేవ.
- 10. కరవు + అరం = కరపరం టీచింగ్
- కరపు అంటే నేర్పడం.
- 11. జరుపు + అరం = జరుపరం మేనేజింగ్
- దీనిని కూడా నిర్వహణ అంటున్నారు.
- 12. కూర్చు + అరం = _ కూర్చరం. ఎడిటింగ్...
- సంపాదకత్వం అంటున్నారు.
- 13. మార్పు+ అరం = మార్పరం. టాన్స్‌లేషన్..
- అనువాదం అంటున్నారు.
- 14. వళుకు+ అరం = వళుకరం. అద్వొకసీ
- వళుకు అంటే వాగ్వాదం.
- 15. కనుగాపు +అరం = కనుగాపరం సూపర్వైజింగ్
- కనుగాపు అంటే బాగా చూసుకోవడం. పర్యవేక్షణ అంటున్నారు.
చేర్పు వెనుక చాలా మెలన(చరిత్ర) ఉంది. ఇది తెల్లం లేని వట్టి చేర్చు మట్టుకే కాదు. ఇది తెల్లమున్న మాట. తెలుగు నుడిగంటలకు
ఇంకా ఎక్కనిమాట. ఎక్కించుకొని తీరవలసినమాట. అరం అంటే, డ్యూటీ లేదా దర్మం. తమిళ నుడిగంటులలో ఈ మాట కనపడుతుంది. దర్మం అనే సంసుక్రుతపు మాటకు తమిళమాటగా ఉంటుంది. దీనిని చూసిన వెంటనే మన పెద్దలు, ఇది తమిళమాట
అని చాటేస్తారు. నిక్మానికి ఇది తెలుగుమాట. తెలుగునుండే తమిళానికి వెళ్లి ఉండాలి. ఎందుకంటే తెలుగువాళ్లం వాడినంత ఎక్కువగా
తమిళులు ఈ మాటను వాడడం లేదు. వాడుక తమిళంలో ఈ మాట లేనేలేదు. కానీ వాళ్లు నుడిగంటులకు ఎక్కింది, మనం
పట్టించుకోలేదు, అంతే.
బారతనాడులోని అన్ని నుడిగుంవులలో తెలుగువాళ్లే మునుముందుగా కనుబడి (ఉత్పత్తి) మట్టుకు ఎదిగిన వారు అని చెప్పే ఆనవాళ్లలో ఒకటి ఈ అరం. టిండిని వెతుక్కొాంటూ ఎడువుకొాంటూ (సేకరించుకొంటూ) అచ్చోటా ఇచ్చోటా తిరిగే మట్టునుండి, తిండిని పండించుకాంటూ ఒకచోటున కుదురుకొనదాన్నే కనుబడిమట్టు అంటారు. ఈ మట్టులో పని పంపకం జరుగుతుంది. నేర్చరితనంతో కూడిన పనినే అరం అంటాం. ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగేది 'పని* బాగా నేర్చుకొని నెరతనం పొందినాక చేసేది అరం. ఇంగ్లీసులో వర్క్ డ్యూటీ అనే మాటలకు ఉన్న వేరిమే ఈ రెండు తెలుగువూటల నడుమనా ఉంది.
అరంతో కూడిన మాటలు తెలుగులో చాలా ఉన్నాయి. కుమ్మరం, కమ్మరం, మేదరం, నేతరం, కంచరం, వడ్డరం, కాలరం వంటివి వాటిలో కొన్ని. ఇట్ల పలుపనులకు ఒకటే చేర్చుతో మాటలు ఉండడం ఒక్క తెలుగులోనే చూడగలం. అంటే తెలుగువాళ్లు అంత నేటుగా పనులను పంచుకొన్నారు. కనుబడిమట్టుకు తొట్టతొలిగా రావడం వల్లనే ఇటువంటి మాటలు పుడుతాయి. ఇంకొకరిని చూసి నేర్చుకొని కనుబడిలోకి వచ్చినవారిలో ఉమ్మడిచేర్చులతో మాటలు ఉండవు. వేలయేళ్ల కిందటనే తెలుగువాళ్లు కనుబడిమట్టుకు చేరుకొన్నారు అని “అరం” నొక్కి చెపుతూ ఉంది. మనం కూడా అరంతో ఎన్నో కౌంగొత్త ఎసిదానిమి మాటలను పుట్టించవచ్చు” అంటూ మాటల పుట్టింపును మొదలిడిదినాను. “మచ్చుకు ఈ కొద్దిమాటలను చెప్పినాను. మన అక్కరలకు కావలసినన్ని అనిమి మాటలను ఈ 'అరం "తో పుట్టించుకోవచ్చు” అని ముగించినాను.
“నాకొక అరగలి(సందేహం) అన్నయ్యా, కొంగొత్త పనులకు “అరం” చేర్చుతో తెలుగుమాటలను పుట్టించినాం కదా, ఆ పనులతో పాటు పనులను చేసేవారికి కూడా తెలుగుమాటలు ఉండాలి కదా, ఎందుకంటే, నువ్వు డైవింగ్ కు తోలరం అన్నావు. ఆమాటకు తెలివరులు పేరు పెట్టలేదు కానీ, డ్రైవర్ 'కు “చోదకుడు” అని పేరును పెట్టున్నారు మన నుడివరులు” నారాయణను ఓరకంట చూస్తూ అన్నాడు చిన్నయ్య.
చిన్నయ్య మాటలకు నారాయణ నవ్వుతూ, “చిన్నయ్యా, ఇప్పుడిక నీ మాటలకు నేనేమీ ఉడుక్కొనులే” అని చిన్నయ్యతో అని, నావైపు చూసి, “అన్నయ్యా, కుమ్మరం చేసేవాడు కుమ్మరి, మేదరం చేసేవాడు మేదరి, కమ్మరం చేసేవాడు కమ్మరి కదా. ఈ మాటల్లోని “అరి ఇక్కడ చేర్పు అవుతుంది కదా” అన్నాడు.
నాకు ఎంతో ఎలమి (సంతోషం) కలిగింది. “నువ్వు సరిగ్గా తలపోస్తున్నావు నారాయణా. '“అరితో కాత్త మాటలను పుట్టిద్దాం పట్లు” అన్నాను. ముగ్గురమూ కలిసి ఓ పట్టు పట్టినాం.
- 1. తోలు + అరి = తోలరి డ్రైవర్
- 2. నడుపు + అరి = నదుపరి కండక్టర్
- ౩. తోము + అరి = తోమరి క్లీనర్
- 4. విరుగు + అరి = విరుగరి డాక్టర్ విరుగు అంటే చికిత్స.
- 5 మర + అరి = మరవరి ఇంజనీర్ మర అంటే ఇంజిన్.
- 6 వళుకు + అరి = వళుకరి అడ్వొకేట్
- 7 తీర్చు +అరి = తీర్చరి జడ్జ్
- 8 తోడు +అరి = తోడరి హెల్పర్
- 9 నీటి +అరి = నీటరి ప్లంబర్
- 10. పొందు + అరి = పొందరి కన్యామర్ పొందేవాడు. గ్రాహకుడు అని వాడుతున్నారు.
- 11. ఈవి + అరి = ఈవరి సబ్‌పై సైబర్ ఇచ్చేవాడు చందాదారుడు అని వాడుతున్నారు.
- 12. మిను + అరి = మిన్నరి ఎలక్ట్రీషియన్
- 13. పసను + అరి = పసనరి పెయింటర్
- 14 పాట +అరి = పాటరి సింగర్ గాయకుడు అంటున్నారు.
- 15. ఆట + అరి = ఆటరి స్పోర్ట్స్‌మేన్ క్రీడాకారుడు అంటున్నారు.
- 16. ఈదు + అరి = ఈదరి స్విమ్మర్
- 17. పరుగు + అరి = పరుగరి రన్నర్
- 18. ఉరుకు + అరి = ఉరుకరి రేసర్
- 19. పొల్లు + అరి = పొల్లరి టైలర్
- 20. ఉడిగం + అరి = ఉడిగరి సర్వర్
- 21. జరుపు + అరి = జరుపరి మేనేజర్
- 22. చేత + అరి = చేతరి సెక్రెటరీ
- 23. ఉబుసు + అరి = ఉబుసరి మెసెంజర్ ఉబుసు అంటే మెసేజ్
- 24 కరపు + అరి = కరపరి టీచర్ ఉపాద్యాయుడు అంటున్నారు.
- 25. చదువు + అరి = చదువరి రీడర్ పాటకుడు అంటున్నారు.
- 26. కూర్చు + అరి = కూర్పరి ఎడిటర్ సంపాదకుడు అంటున్నారు.
- 27. చనవు + అరి = చనవరి ఆఫీసర్ చనవు అంటే అదికారం. అదికారి అంటున్నారు.
- 28. మార్చు + అరి = మార్చరి ట్రాన్స్‌లేటర్
- 29. కనుగాపు+ అరి = కనుగాపరి సూపర్‌వైజర్ పర్యవేక్షకుడు అంటున్నారు.
- 30. తిరుగు + అరి = తిరుగరి టూరిస్ట్ పర్యాటకుడు అంటున్నారు.
- 31. అనుపు + అరి = అనుపరి కలెక్టర్ అనుపు అంటే పన్ను (టాక్స్). పన్నులను కలెక్ట్ చేసేవాడు. కరగ్రాహి అనే
- పేరును పెట్టినారు.
- 32. అలము + అరి = అలమరి సంచారి అలము అంటే తిరగడం. ఈ మాట చిన్నమార్పుతో అలబరిగా నెల్లూరు తావున :వాడుతున్నారు.
- 33. దొమ్ము + అరి = దొమ్మరి యోదుడు దొమ్ము అంటే కొట్లాట లేదా పోరాటం.
- 34. మాటాట+ అరి = మాటాటరి. లెక్చరర్ మాటాట అంటే ప్రసంగం లేదా లెక్చర్. ఉపన్యాసకుడు అంటున్నారు.
- 35. పలుకు + అరి = పలుకరి స్టూడెంట్ పలుకు అంటే విద్య. విద్వార్తి అంటున్నారు.
"చాలు చాలన్నయ్యా, అబ్బ ఎన్నిమాటలో” అరుదు(ఆశ్చర్యం)పడుతూ అన్నాడు చిన్నయ్య. “మన తెలుగునుడి చేవ అటువంటిది చిన్నయ్యా” అంటూ ముగించినాను నేను.(తరువాయి వచ్చే సంచికలో...)
భాషలు మసకబారినప్పుడు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యం కూడా మసకబారుతుంది.మనవైన అవకాశాలూ సంప్రదాయాలూ చారిత్రిక నైపథ్యం, మనకే సొంతమైన ప్రత్యేక ఆలోచనా సరళీ విలువైన మానవ వనరులూ కనుమరుగైపోతాయి. -యునెస్మో