అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పదనిష్పాదనకళ

మాటల నిర్మాణం

వాచస్పతి

(గత సంచిక తరువాయి...)

పదనిష్పాదనకళ

3

The joy of coining new words!

వ్యావహారికం అంటే అర్ధం - ఆంగ్ల మాధ్యమ జనాల సంకుచిత అవగాహనకి అనుగుణంగా యావత్తు తెలుగుభాషనీ అంతం చేయడం కాదు. ఈమాత్రం ఆంగ్ల మాధ్యమం గిడుగువారి కాలంలో కూడా ఉంది. జనానికి అర్థం కావడం అంటే కొత్తపదాల్ని సృష్టించకూడదని కాదు. అర్ధమవుతున్న భాషలోనే కొత్త పరిభాసనల్నీ తత్సంబంధిత పదాల్ని మిశ్రమం చేయడమని !

ఇంకో కోణం : అచ్చతెలుగువాదం

ఇదిలా ఉండగా, ఆర్య-ద్రావిడ జాతివాదాల్ని గ్రుడ్డిగా నమ్మేవారు కొందణున్నారు. అలా నమ్ముతూ, వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు శాస్త్రీయ చింతనాధారని పరిపుష్టం కావించిన సంన్కృతాన్ని వారు పరాయిభాషగా పరిగణిస్తారు. ప్రతిదీ అచ్చతెలుగులోనో, తెలుగు మాండలికాల్లోనో, వచ్చి వ్యావహారికం లోనో ఉండాలని వారంటారు. ఈ వాదాన్ని కూడా యథాతథంగా ఆమోదించడం కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా నడిచిన చరిత్రని రద్దుచేసి పారెయ్యలేం. ఇప్పటికే భాష లోకి వచ్చిన పదాల్ని సంప్రదాయాల్ని వెళ్ళగొట్టలేం. ఎట్టి పరిస్థితుల్లోను కాలం వెనక్కి నడవదు. భాషను అభివృద్ధి చేసుకోవాలి. తప్పదు. కానీ ఆ క్రమంలో ఇలాంటి హఠాన్‌ నాటకీయ పరిణామాలు మట్టుకు ఎంతమాత్రమూ పనికిరావు. అలాంటి వాటికి దిగితే మనం యావత్తు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్నీ తరువాతీ తరాలకు అర్థం కాకుండా చేసిన వారమౌతాం. పాత తెలుగు పుస్తకాలూ, పాటలూ, పద్యాలూ కథలూ తరువాతి తరాలకు అర్ధం కావాలి. అలా అర్ధమయ్యేలా మన విద్యావిధానమూ మనం రూపొందించే పదాలూ ఉండాలి. మన విద్యావిధానం గతానీకీ భవిష్యానీకి వారధిగా పనిచేయాలి. సంస్కృతాన్ని పరాయిభాషగా చూసే ధోరణి సమీచీనం కాదు. అది పూర్తి అవాస్తవికమైనది. దాన్నొక ఊహాలోకంగా అభివర్షించదానికి నేను సంకోచించను. సంస్కృతం తెలుక్కి కన్నతల్లి కాకపోవచ్చు గాని పెంపుడుతల్లి మాత్రం అవును. సవతితల్లి మట్టుకు కానే కాదు. మన జనాభాలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు. ముస్లిములకి అరబ్బీ ఎంతటి పవిత్రభాషో హిందువులకు సంస్కృతం కూడా అలాంటిదే. వారికి సంస్కృత సంపర్మం అత్యంత సహజమైనది. వారికి ఆ భాషతో దైనందిన అవసరాలు ఉన్నాయని మరువరాదు.

1. “అర్ధం కావడం" ఒక్కటే మన కృషికి కొలబద్ద కాకూడదు. భాషా సాహిత్యాలనేవి ఏ యుగంలోనూ ఆ కొలబద్ద ననుసరించి వర్టిల్లినవి కావు. ఇంగ్లీషులో సైతం నూటికి 99 పదాలు అది మాతృభాషగా గలవారికూడా అర్దం కావు. అంత మాత్రాన ఆ భాషలో కొత్త పదాల సృష్టి ఆగిపోలేదు. ప్రతీ కొత్త ప్రచురణ నాటికీ ఆంగ్ష నిఘంటువుల రాశి పెఱక్కుండా పూర్వపరిమాణం దగ్గరే స్తంభించిపోవట్లేదు. ఇప్పుడు అర్ధమౌతున్న పదాలు కూడా గాల్లో తేలునో, కలలోనో జనం దగ్గణికి రాలేదు. ఈ అర్ధం కావడం వెనుక కొంత ప్రయత్నం ఉంది. కొంత శిక్షణ ఉంది. కొంత ప్రచార ప్రక్రియ ఉంది. ఉండాలి కూదా.

2. అర్థం కావడం అనేది - ఒకణు ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చారు? ఏ వృత్తి, వ్యాపార రంగానికి చెందిన వారు ?ఎంతవణకు చదువుకున్నారు? ఏ విధమైన అభిరుచి గలవారు? మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందుచేత అర్థం కాకపోవడం అనేది ఆ అర్థం కానివారి లోపమే తప్ప పదప్రయోగంలోని లోపం కాదు.

3. కొత్త పదాలు కల్సించదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కొత్త పదాలు నేర్చుకోమని కూడా ప్రోత్సహించాలి.

4. భాషలో పదాలు ఎల్లప్పుడూ అంతకు ముందున్న పదాల నుంచే పరిణామం చెందుతాయి. లేనిది ఎక్కణ్డుంచీ రాదు. పదం మీద పదం పేఱుకుంటూ (pile up) పోతుంది. అయిజే పేర్చేవారు కావాలి. అ పేర్చేవారికి అంతకు ముందు పేర్చబడ్ల పదాలూ అవి పేఱుకున్న విధానం తెలిసి ఉందాలి. అలా తెలిసినవారు ఎంత ఎక్కువమంది ఉంటే అంత తొందఅగా భాష అభివృద్ధి చెందుతుంది.

5. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న సాంకేతిక పదాలు కూడా మొదట్లో వాడినప్పుడు ఎవణికీ అర్దం కాని పదాలే. వ్యకాలు (వ్యక్తిగత కలనయంత్రాలు అంటే PC లు) జనం చేతుల్లోకి రాకముందు ఒక పాతికేళ్ళ క్రితం Hard Disk అనేది సాధారణ ఆంగ్లేయులక్కూడా హాస్యాస్పదమ్హైాన పదమే. మనం కోరుతున్నదల్లా “తెలుగు అనువాదాలన్నీ హాస్యాస్సదమై నవే అనే ఈ మూఢ విశ్వాసం నుంచి బయటపడమనీ, తెలుగుపదాల్ని కూడా ఇంగ్లీషులాగానే ప్రేమించమనీ ! కొత్త తెలుగుపదాల్ని వాడుతున్న కొద్దీ నవ్వురావడం మానేసి గౌరవభావం కలగడం మొదలవుతుంది. సృష్టిస్తున్నకొద్దీ, వాడుతున్న కొద్దీ తెలుగు పదాల క్రమబద్ధతనీ, నిర్మాణాన్నీ జనం అస్వాదించడం మొదలుపెడతారు. తెలుగులో కూడా గౌరవనీయమైన పదజాలం (ocabulary) విస్తారంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. భాష యొక్క మౌలిక స్వభావాన్నీ స్వాతంత్రాన్ని నిలబెట్టాలి. మన భావదారిద్రానికీ మాతృభాషా పరమైన అజ్ఞానానికీ ఇంగ్లీషు పదాలతో అతుకు వేసుకున్నంత మాత్రాన గౌరవం ఫొందుతామనుకోవడం ఒక బ్రమ. ఆ సదరు “గౌరవనీయ పదాలు” కూడా మళ్ళీ మళ్ళీ అందఱూ వాడడం మూలాన కేవలం ఒక్క తరంలోనే అగౌరవనీయాలవుతాయి. అప్పుడు మళ్ళీ మన గౌరవనీయ పదాల వేట యథామామూలే. గతంలో ఎన్నోసార్లు అలా జఱిగింది.

6. స్వకీయత (Originality) ద్వారానే ఏ జాతైనా గౌరవాన్ని పొందుతుంది. అంగ్ల పదాలు ఆంగ్లేయుల స్వకీయతకి నిదర్శనం. మరి ఒక స్వతంత్ర, విభిన్నజాతిగా మన స్వకీయత సంగతేంటి? భావాలతోపాటు పదాల్ని కూడా అనుకరించి తీఱాల్సిందేనా? అలా అనుకొని ప్రత్యామ్నాయ తెలుగుపదాల్ని సృష్టించకుండా కేవలం ఇంగ్లీషు పదాలతోనే లాగిద్దామనుకుంటే కొన్ని పంక్తులు వ్రాసేసరికి “దీని బదులు నేరుగా ఇంగ్లీషులోనే వ్రాయడం నయం” అనిపిస్తుంది. ఇక తెలుగెందుకు ? “తెలుగు పదాలు అవసరం లేదు” అనే వాదన ఇంకా ముందుకెళ్ళి “అసలు తెలుగే అవసరం లేదు" అనే వాదనకి దారితీస్తుంది. ఇప్పుడు జఱుగుతున్నది అదే.

7. ఈత అన్నాక నీళ్ళలోకి దూకి నేర్చుకోవలసిందే. భాష సర్వాంగసుందరంగా అభివృద్ధి చెందాకనే అందులో సాాంకేతికాంశాలు రాస్తానంటే కుదఱదు. ముందు రాస్తూ రాస్తూ, ఆ క్రమంలో కొత్త పదాల్ని కనిపెడుతూ వాడుకలోకి తెస్తూంటేనే భాష అభివృద్ధి చెందుతుంది. సాహిత్యభాష సాంకేతిక భాషగా పరిణామం చెందుతుంది. ఇంగ్లీషు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

మఱో కోణం : తెలుగులో పదాలు లేవనే వాదన

“తెలుగులో పదాలు లేవు. లేదా తెలుగులోకి అనువదించలేం” ఇది సరైన అభిప్రాయమా ? లేక “మనకు తెలుగు భాషలో సరైన శిక్షణ లేదు, ఇంగ్లీషులో ఉన్నంత “ఇది సరైనదా ? ఇంగ్లీషు భాషలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇంగ్లీషు పదాలన్నీ ఆ భాష పుట్టినప్పటి నుంచే అందులో ఉన్నాయా? మధ్యలో ఆ పదజాలాన్ని పెంచడానికి ఆంగ్ల మేధావులు చేసిన మానవ ప్రయత్నమేమీ లేదా? ఆ పదాలు హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడ్డాయా ?

మనకి తెలుగులో ఉన్న పూర్వశిక్షణ మనచేత ఈ భాష గొప్పదనాన్ని ప్రశంసింపజేయదానికి సరిపోవడం లేదు. కొత్త తెలుగుపదాల్ని కల్పించడానికి చాలడం లేదు. ఇంగ్లీషుని అనువదించను సహాయపడలేకపోతోంది. మనకి పాఠశాలల్లో తెలుగు నేర్పుతున్న విధానం- మనం పదో తరగతిలో భాషాపరంగా ఏ స్థాయిలో ఉన్నామొ అ స్థాయిలోనే జీవితాంతం మనల్ని ఉంచుతోంది. తెలుగు పాఠ్యాల బొధనలో ఏ విధమైన కొత్త పద్దతులూ చోటుచేసుకోవడం లేదు. ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎలాంటి పాఠ్యాలూ పాఠ్యక్రమమూ, బోధనా పద్ధతీ, మూల్యాంకన విధానమూ ఉండేవో సరిగ్గా వాటినే ఏ మార్పూ లేకుందా కొనసాగిస్తున్నారు. తతిమ్మా అన్ని సబ్లెక్టులలోనూ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. అథవా, తెలుగు సబ్జెక్టులో ఏమైనా మార్పులు తెచ్చినా అవి ఈ భాషని నాశనం చేసే దిశలో ఉంటున్నాయి తప్ప బాగుచేసే దిశలో ఉండట్లేదు. మనం ఈ భాషాపరమైన స్తబ్దత (linguistic stagnation) కి అలవాటుపడి “ఓహో తెలుగంటే ఇదే, ఇంకేమీ లే"దనుకుంటున్నాం. తెలుగు సాహిత్య పఠనం పేరుతో మనం అనంతర జీవితదశాకాలంలో చదివేదంతా వ్యావహారికం, లేకపోతే పచ్చివ్యావహారికం.

ఒకపక్క ఇలా తెలుగులో స్తబ్దం (stagnate) అయిపోయిన మనం మఱోపక్క మన ఆంగ్లపరిజ్ఞానాన్నీ మాత్రం రోజు రోజుకూ పెంచుకుంటున్నాం, ప్రయత్నపూర్వకంగా! మన బహుభాషా పరిజ్ఞానం మన భాషనీ ఉద్ధరించడాని క్కాక దాన్ని కించపఱచడానికి దుర్వినియోగమవుతోంది. కొన్ని కొన్ని ప్రారంభిక తభావతులు చోటు చేసుకున్నప్పటికీ 'ప్రయోగశీలతని సాదరంగా ఆహ్వానించాల్సి ఉంది. ప్రయోగాలు చేస్తూ చేస్తూ పోగా వాటిల్లోంచి కొంత మంచి పుట్టే అవకాశం ఉంది. ఒక కొత్త ప్రయోగం నచ్చకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచించే స్వేచ్చ మనకెప్పుడూ ఉంది. అసలు ప్రయోగాలే చేయొద్దనఢం సరైన ధోరణి కాదు.

జీవితం ఒక నిరంతర అభ్యసనా ప్రక్రియ (constant learning process). కొత్త పదాలు సృష్టి అవుతున్నకొద్దీ వాటిని మన పదజాల పరిజ్ఞానంలో భాగంగా చేసుకోక తప్పుదు. అది తెలుగైనా, ఇంగ్లీప్తెనా! అయితే ఇక్కడ ఆచరణాలో జఱుగుతున్నది ఏంటంటే-ఆ అభ్యసన ప్రక్రియలో ఇంగ్లీషు ఉండొచ్చుగానీ తెలుగు ఉండకూడదు అని వాదించడం. తెలుగు మాత్రం స్తబ్దం అవ్వాలి, ఎందుకంటే మనం స్తబ్దం అయ్యాం కనుక !

ఇహపోతే అర్ధం కావడం. ఏ పదానికీ స్వతహాగా సహ్యణ స్ఫోరకత(spot understandability) లేదు, తెలుసుకుని, పలికి, అలవాటు పడితే తప్ప! వాడుతూ ఉంటే అంతా వ్యావహారికమే. వాడకపోతే అన్నీ గ్రాంధికమే. మాతృభాష కానటువంటి ఇంగ్లీషులో ఏ కొత్తపదం వచ్చినా ఆబగా అందిపుచ్చుకోవదానికి సిద్దంగా ఉన్న మనం తెలుగు దగ్గణికొచ్చేసరికి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది తెలుగు తప్పా? మన తప్పా? ఆలోచించాల్సి ఉంది. ఏ కారణాన్నో ఇక్కడ చాలా ప్రతిఘటన (resistence) ఉన్నది, కొత్త పదాల్ని కల్పించుకోవడం పట్ల, వాటిని వాడడం పట్ల ! ఇంగ్లీషు పదాల్ని ఉన్నదున్నట్లు దిగుమతి చేసుకోవడాన్ని అభ్యుదయంగా భ్రమించే వాతావరణం ఉంది.

అదాన అనువాదాల పట్ల అపోహలు

ఆంగ్ల పదాల ద్వారా వ్యక్తమయ్యే భావాన్ని తెలుగుపదాలతోఅనువదించి వాడుతూంటే “మక్కికి మక్కి అని, “True translation” అని పేర్లు పెట్టి వెక్కిరించడం కనిపిస్తోంది. ఈ వెక్కిరింపులకి పాల్చడుతున్నది తెలుగువారే, ఇతరులు కారు. ఆ విధంగా తెలుగులో నూతనవద నిష్పాదకుల్నీ పద ప్రయోక్తల్నీ మానసికంగా క్రుంగదీయాలనే ప్రయత్నమూ, నిరుత్సాహపరచాలనే వ్యూాహమూ, అలా తెలుగుపై ఇంగ్లీషు పదాల బాహుళ్యాన్ని శాశ్వతంగా వ్యవస్థాపించాలనే అకాంక్షా వెల్లడవుతున్నాయి. అనువాదాల రూపంలోనైనా సరే తెలుగు బతికి బట్టగట్టడం వారికి ఇష్టం లేదు.

ఇలా అవహేళనలకి దిగేవారి. ఉద్దేశంలో - “ఆ తెలుగు ప్రత్యామ్నాయాలు ఒరిజినల్‌ కావు. అవి నకీలీ. కాబట్టి వెకిలి. ఒరిజినల్‌ ఇంగ్లీష్‌ ఐడియాస్‌ ని ఇలా అనువాదాల రూపంలో దొంగిలించి ఆ ఐడియాస్‌ కి మూలపురుషులైన ఇంగ్లీషువారి గొప్పదనాన్ని తెలుగువారు తెలుసుకోకుండా చేసి కప్పిపుచ్చదమూ, అవేవో తెలుగువారి ఒరిజినల్‌ ఐడియాస్‌ అయినట్లు ప్రచారమైపోవడమూ ఘోర అన్వాయం, అక్రమం. దురాగతం. తెలుగు తెలివితక్కువ, వెనకబడ్డవాళ్ళ భాష. ఇందులో తెలివైన వ్యక్తీకరణలెలా ఉంటాయి? మా లెక్క ప్రకారం ఉండకూడదు. తెలివైన, నాగరికమైన వ్యక్తీకరణ ఏదైనా ఉంటే దానికి ఇంగ్లీషు ముద్ర ఉండాలి. అదే ఆధునికత.అదే అభివృద్ధి. అదే గౌరవనీయత. అదే విజ్ఞానానికీ, నాగరికతకీ, అభ్యుదయ దృక్పథానికి అసలైన చిహ్నం. మేము సాక్షాత్తూ ఒరిజినల్‌ ఇంగ్లీషే తెలిసినవాళ్ళం. ఈ నకిలీ (తెలుగు) పదాలతో మాకేం పని?”

గ్రహించగలిగితే, ఇంతుంది ఈ ఎగతాళ్ళ వెనక !

అయితే, ఓ విషయం. ఇలా అనుకుంటున్నది, ఇంగ్లీషు అఱకొఱగా నేర్చుకుని తలలెగరేస్తున్న ఒక వర్గం మాత్రమే. ఇంగ్లీషు తెలియని అంధులు అనువాద పదాల్ని సాదరణంగా ఆహ్వానిస్తున్నారు. ఆంగ్లపదాల బదులు అవే వాడుతున్నారు. ఎందుకంటే వారివణకూ వాటికి (తెలుగుపదాలకి) ప్రత్యామ్నాయం లేదు.

కానీ ఆంగ్ల విద్యావంతులైన ఆంధ్రులవఱకూ ప్రత్యామ్నాయం (ఇంగ్లీషు) ఉంది. తెలుగంటే ఉన్న చిళాకువల్ల అనవసరమైన మూలవిధేయతని కౌగలించుకుంటున్నారు. కాబట్టి తెలుగు వారికి ఒక ప్రత్యామ్నాయభాషని చూపించినప్పుడు వారు తెలుగుని వదిలేయడమే కాకుందా దాన్నీ కించపలుస్తారనీ సూచించబడుతోంది. అందువల్ల భాషాపరమైన మానసిక పరిణతి విషయమై ఇంకా ఎన్నో మైళ్ళు ప్రయాణించాల్సి ఉన్న ఈ జాతికి ఇంత విస్తృతంగా విదేశీ ఖాషా శిక్షణ ఇవ్వడం భస్మాసుర హస్తంలాంటిది కావచ్చుననీపిస్తోంది. ఆంగ్ల విద్యావంతుల విషయానికొస్తే, తాము ఒరిజినల్‌ ఇంగ్లీష్‌ బడియాన్‌ అనుకొని వాడుతున్న అనేక పదాలు, వాస్తవానికి ఇతరభాషల నుంచి ఆంగ్లేయులు మక్షికి మక్కి అనువదించుకొని వాదుకున్నవనీ ఈ బడాయి తెగ ఆంధ్రులకి తెలియదు. మచ్చుకు ఈ క్రింది జాబీతా పరికించండి :

అంగ్లేయులు ఇతర భాషల నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని :

వైనీయభాష నుంచి

ఆదాన అనువావపవం దానీ మూలపదం

౧4100108 0౦8 204 806.

6811421118 ౧౮6 ౧౬౦

[00[%-366 0౦౫జ(669 68111౬0

1036 1206 614 1॥2

౯2061 1061 201 12006 వరాసుభాష (ఫెంచి) నుంచి

ఆదాన అనువావవదం దానీ మూలపదం

శిరడ09 &0016 ౧00౧౧౧6 ర6శరజ

66931101 6921 ఇగ౬గ166 66 0009236 6641-౧౮16 ఆ౦౪6[6-౧౧661 6/11641(0! 0₹ 0౫ [6జి 0 ౧౬ 0441 (౦6౪61[01-6౧618! ఉఇంఠట6[1664! 6౧6184! ౯/96 6/36 ౪613 1016

016 4810 1616 జ66 (116 ౧౧0౪1

36౧10 168106౧193 01 ౧౧౫౦౧6 24౫ ౧6౦౦౪౩ ౧౧౬1886 66 ౦0[౧౪6|| 4106 ౬866

116 ౧168 ౧౫ గ61 [1/౬1/1806 01 00[01/6116గ06 గ6౪/ 11/ఖ6 (జ1910 ౧9/1006)

1111163106 0౬111006 66 ౧౧|| “౧౧16 ౧90018” ౨518102896 ౪/1 1! 6౩౧11 66 [6902416 1౧4 [069 ౪/110041 ౩ఖగగ6 0618 ౪౬ ౩94౧9 616 ౯0111 01 194 ౧0111 6౮9 ౪6

ఒలందుభాష (డచ్చి) నుంచి ఆదాన అనువావ పదం దానీ మూలపవం [/216101 606 ౧౧66916314 [ [1౧680016 0416166౩ ౧1౧8006 5406[000640101 01101 ౪40 6861616612

శార్మణ్యభాష (జర్మన్‌) నుంచి

ఆదాన అనువావపపం దానీ మూలపపం శీ111006/ 2111601061 54! 1901010108 [6486910112 6661! 8466౧ 61684161 0౦౧౦౪గ౫౧౧౭౩161 [0[126[10919319!

౯12౧౧911[0౪7/69! ౯120౧10౧90 ౮4/69గ691

| తెలుగుజాతి పత్రిక అువ్నునుడి అ నవంబరు-2020 |

[౯019౪/016 0౧4011 119010 160 [1916601900 [10౧0693101 6993 [1610౪4/611 111611186౧06 6460116111 11161106[26401611 [081 1419181011 [6100[06[9626[1$8 [02&[4/016 [611114/0[1 ౧౧౪|౦౮౧/6610910/8! ౭౧00! 12000 అ౮౪6019110616 20011200 6 [/0100%/8/ శీ[1002811 ౪౮౪౧౧౬౧ &గ6 96061౧౧4) ౮06/౧6౧౪౦| (0౪/6! ౧౦01110 [/20111001114 141౧10[691 [168601౪/2106 5141600101 (00101 01 44/) 5120600601 51061880 ౮06101 5011111000 6193 4100160061 5401101%241 ౪౧16[300౪/61118 11068111 అ(థ 6110601 ఇ66౫1[6610 అుఖ 61016౧1 1/46/3166 11 ఇ896[30[16106 1/01 6/1984/ 1/9112%30[1248460౧8 1గ/0/16 ౪౫ 10611666 యూదీయభాష (హీబ్రూ) నుంచి ఆదాన అనువాదపదం దానీ మూలపదం

౨0౬4088081 ౨5|| (42౬261) (4 6604108 [08 రోముకభాష (ల్యాటిన్‌) నుంచి

ఆదాన అనువాదపపం దానీ మూలపదం

10069 ౦0౧1౧64౧19 &ర6/0021419 6128001

66౧9౩ 9౬016111౬6

అ౦౧౧౫౧౫౦|౧|&06 ౧౪౮/౩ &20/002416 1గ/1960౧) 1001

[/11110000/2/ ఇగ & 1౬016౬ ౧6౨1 1% ౧౪౭4౦6 [6616169041 1౫ [806 1% & ౧౮191161 11 ౧౮౦6

శ్చానిష్‌ నుంచి ఆదానఅనువావవవం దానీ మూలపదం 68146-010061 981016 8226

61! ౧౦౧౫౪౧10 66 18 ౪౪16౬6 మది ఇతరభాషల నుంచి

[/0016111 01 11411

ఆదానఅనువావపదం దానీ మూలపదం (౦0306! ఆ౫18611011 (80006 ౧౪న) (616960 [1016013 ౪జ0[6ఈ0/800014&1 (6ంజ16118జ4౬01)

ఇంగ్లీషే కాదు, అన్నీ భాషల్లోనూ ఆదాన అనువాదాలు మామూలే. అవి లేని భాషే ప్రపంచంలో లేదు. అలాంటప్పుడు కేవలం తెలుగులోనే దాన్నెందుకు తప్పుగా చూడాలో అగమ్యగోచరం. మనం పదాలనీ అనుకుంటున్నవన్నీ నీజానీకి పరిభావనలే. కొన్ని పరిఖావనలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితుల మధ్య, ప్రత్యేక వాతావరణాల్లో కవితాత్మకంగా అంకురిస్తాయి. జనం వ్యక్తీకరణ అవసరాల్ని పురస్మరించుకొని వాటిని తమ మాతృభాషకి చెందిన కొత్త పదాల్లోనూ, పదబంధాల్త్లోనూ వెలిబుచ్చుతారు. అవే సందర్భాలూ, పరిస్థితులూ, వాతావరణాలూ తారసిల్లనివారు, లేదా తార సిల్లినప్పటికీ వాటి గుతించి కవితాత్మక ఊహలు తట్టనివారు ఆ కవితాత్మకత తమకి నచ్చినప్పుడు వాటిని తమ భాషలోకి అనువదించుకోవడం తప్పుకాదు. ఆలోచనల్ని వ్యక్తీకరించనంతవణకే అవి వ్యక్తివి. ఒకసారి వ్యక్తీకరించడమంటూ జతిగాక అవి సమాజానీవీ, దేశానివీ, పప్రపంచానివీ, యావన్న్మానవజాతివి కూడా! ఇది వ్యక్తులకే కాదు, భాషలకూడా వర్తిస్తుంది.

ప్రతికూల వాతావరణం

తెలుగువారి ఈ మాతృభాషావ్యతిరేక మనస్తత్త్వమూలాలు చాలా లోతైనవి. ఈ సందర్భంలో వాటిని టూకీగానైనా గుర్తు చేసుకోకుండా ఉండలేం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా మనం భాషాపరంగా సంపూర్ణ బానిసత్వంలోనే కానసాగుతున్నాం. నోటిమాటగా ప్రజాస్వామ్యం అంటూ ఊదరగొడుతున్నాా వాస్తవంగా ప్రజాభాషైన తెలుక్కి ఏ విధమైన రాజకీయ, ఆధికారిక హోదా లేకపోవడం వల్ల ఈ భాష పట్ల విస్తారంగా వ్యాపించిన చిన్నచూపూ, హీనభావన చివఱికి ఈ భాషాప్రజలు తమ మాతృభాషాపదాల్ని తాము వాడుకోవడాన్ని కూడా ఓ అప్రాచ్యప్పనిగా, అవహేళనగా, ఎగతాళిగా ఒక రహస్య నిషిద్ధ కార్యకలాపంగా మార్చాయి. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్న ప్రతి తెలుగువాడూ తన జాతీయతా మూలాలు మర్చిపోయి “తానో పుట్టు అమెరికన్‌” అన్నట్లు ప్రవర్తిస్తూ తెలుగుని బహిరంగంగా కించపఱచదానీకి వెనకాడ్డం లేదు. నిజంగా అమెరికన్‌లై పుట్టినవాళ్ళు కూడా ఇలా చేయరు. ఆంధ్రప్రభుత్వం తెలుగుని ఏ మాత్రమూ పట్టించుకోకపోవడంతో “మొగుడు ముండా అంటే ముష్టివాడు కూడా ముండా అన్నా” డన్నట్లు తయారయింది పరిస్థితి. అలాంటి వాళ్ళు అలా కించపఱుస్తూంటే “అది తప్పు. మన మాతృభాషని మనం అలా అనకూడ"దని ఎలుగెత్తి ఖండించే వాళ్ళు కూడా లేకుండాపోయిన దౌర్భాగ్య పరిస్థితుల మధ్య ఈ జాతి జీవిస్తోంది. దేశపౌరుల్ని విదేశాలకీ, విరాష్ట్రాలకీ సామూహికంగా ఎగుమతి చేయడానికి, ఆ విధంగా వారిని శాశ్వతంగా ఇక్యణ్ణించి లేవగొట్టి వలసపంపడానికి మాత్రమే ఉద్దేశించిన మన విద్యావ్యవస్థ మాతృభూమి, మాతృభాష, స్వజాతి అనే భావనల్ని మనవారిలో లోతుగా నాటడంలో విఫలమవుతోంది. జాతిపరమైైన స్వాఖిమానమూ, ఆత్మ గౌరవమూ లేకుండా ప్రవర్తించడమే ఆధునికతగా, విశాలహృదయంగా మన మధ్య ప్రచారంలోకి వచ్చేసింది.

దీనికి తోడు పెక్కు అంతర్జాతీయ ప్రసార సంస్థలూ, జాలగూళ్ళూ (websites) తెలుగుని తమ భాషల జాబితాలో చేర్చవు. కానీ ఆ జాబితాలో తమిళం, హిందీ, బెంగాలీ మాత్రం ఉంటాయి. కొన్నిసార్లు ఉర్దూ, గుజరాతీ, పంజాబీ కూడా ఉంటాయి. దీనిక్కారణం, తమిళమూ, హిందీ, బెంగాలీ ఏదో ఒక స్వతంత్ర దేశానికి జాతీయభాషలూ, అధికార భాషలై ఉండడం. తమిళం శ్రీలంక, సింగపూర్‌, మలేషియా అనే స్వతంత్ర దేశాల్లో (సహ) అధికారభాషగా ఉంది. హిందీ ఇండియాకి అధికార భాషగా ఉంది. బెంగాలీ బాంగ్లాదేశ్‌కి అధికారభాషగా ఉంది. కానీ టోకున పన్నెండుకోట్లమంది తెలుగు భాషులూ, 2000 సంవత్సరాల చరిత్రా, అనేక దేశాలకంటే సువిశాలతరమైన ఒక పెద్దరాష్టమూ ఉన్నప్పటికీ, తెలుగు ఏ దేశానికి జాతీయభాష గానీ, అధికారభాష గానీ కాకపోవడంతో ప్రపంచభాషల జాబితాలోకి ఎక్కలేని, ప్రపంచానికి పరిచితం కాలేని విచిత్ర నిస్సహాయ పరిస్థితిలో పడిపోయింది.

“పిచ్చి ముదిరింది, రొకలి తలకు చుట్ట"మన్నట్లు ఈ పరిస్థితికి భాషాశాస్త్రవేత్తలమని చెప్పుకునేవారు కొందణు తోడయ్యారు. భాషని సరిగా నేర్చడం, కాపాడడం, దాన్నీ భవిష్యత్తరాలకి భద్రంగా అందించడం -ఇలాంటివాటిమీద సుతరామూ నమ్మకం లేనివారు వీరు. భాషాపరంగా పక్కా శూన్యవాదులూ, భాషానాస్తికులు. భాషావేదాంతులు. వీరు తమ ఆయుర్దాయంలో అనేక సంవత్సరాలు వెచ్చించి చివరికి నేర్చుకున్నది, “భాష శాశ్వతం కాదు. భాష నశించిపోతూంటే మనం గుర్లు మిటకరిస్తూ చూస్తూ కూర్చోవాలి. ఏ భాషైనా ఒకటే. ఏ పదమైనా ఒకటే” అని! నిజానికి ఇలా ప్రసంగించే వారు భాషా శత్రువులే తప్ప శ్రేయో.... ఖిలాషులు కారు. కానీ దురదృష్టవశాత్తూ, తెలుగుమీద మాట్లాడడానికి ఈ రోజున ఇలాంటివారే గొప్ప ప్రామాణిక విద్వాంసులై కూర్చున్నారు. వీరి వైరాగ్యపూరితమైన దుర్చోధల ఫలితంగా నిజమైన భాషాఖిమానులూ, భాష మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న కార్యశూరులు కూడా తప్పుదోవ పడుతున్నారు, నిరుత్సాహం చెందుతున్నారు. మనం ఒక జాతిలో జన్మించాక దాని భాషా, మత, సంస్కృతుల పట్ల తటస్థంగా ఉండే హక్కుని కోల్పోతాం. ఎందుకంటే ఆ సంస్కృతికి మనం తప్ప వేఱే దిక్కులేదు.

మానసిక అవరోధాల్ని అధిగమించాలి

నా దృష్టిలో ఇది తెలుగు-ఇంగ్లీష్‌ గొడవ కాదు. ఇది ఒక మానవ కల్పిత మానసిక అవరోధానికి (mental barrier కి) సంబంధించిన విషయం. నిజానికి తెలుగుపదాలూ మన సృష్టి కాదు. ఇంగ్లీషు పదాలూ మన సృష్టి కాదు. ఈ రెండూ కూడా ఎవఱో,ఎప్పుడో, ఎక్కడో కల్పించగా మనం నేర్చుకుని వాడుకున్నవే. మనకి ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయాధికారమూ (judgement) లేదు. కానీ మనం అలా తీర్చు తీర్చబూనుకుంటున్నాం. ఇంగ్లీషుని అందుకోవడానికి సిద్దంగా మనం మన మనస్సుల్ని కార్యక్రమించాం. తెలుగు విషయంలో అలాంటి కార్యక్రమణం (programming) జఱగలేదు.

అర్ధం కావడమనేది ఒక ఉత్తరోత్తర ప్రక్రియ (incremental process). మనకి పదేళ్ళప్పుడు అర్థం కానివి ఇఱువ య్యేళ్ళప్పుడు అర్థమవుతాయి. ఇఱవయ్యేళ్ళప్పుడు అర్థం కానివి నలభయ్యేళ్ళప్పుడు అర్థమవుతాయి. “జీవితం ఒక నిరంతర అభ్యసనా ప్రక్రియ” అని ఇందుకనే చెప్పుకున్నాం కదా! అలా కాదు, అన్నీ విన్నవెంటనే అర్థమైపోవాలని పట్టుపట్టితే అది అపరిణతి అవుతుంది. భాష యొక్క ప్రయోజనం అర్థం కావడమొక్కటే కాదు. ఇంకా చాలా పనులు(functions) ఉన్నాయి దానికి! భాష ఒక జాతి యొక్క దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది. అది ఒక జాతిని సృష్టిస్తుంది కూడా. గతానికీ, వర్తమానికి వారధిగా నిలుస్తుంది. అలాగే వర్తమానానికీ, భవిష్యత్తుకీ మథ్య కూదా వారధిగా నిలుస్తుంది. అది విజ్ఞానాన్ని అందిస్తుంది. వినోదింపజేస్తుంది. అది సంగీతాది కళలకి ఆలంబన. ఆధ్యాత్మికతకి తొలిమెట్టు. అది ఒక సమాజాన్ని కలుపుతుంది. తెలిసిన పరిభావనల నుంచి తెలియని పరిభావనలకి అది మనల్ని తీసుకెళుతుంది.

వచ్చే సంచికలో... తెలుగులో అనేక భాషాపదాలున్నప్పుడు ఇంగ్లీషు పదాలు ఎందుకు ఉండకూడదు ?

“సొంత భాషలో చదువుపల్ల పిల్లల్లో వ్యక్తిగా, సామాజికంగా, సాంస్క్రృతికంగా గుర్తింపు కలిగి ఉండే విశ్వాసాన్ని ఎదగనిస్తుంది”