అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం

అమ్మనుడితోనే

జె.డి.ప్రభాకర్

అందలం

8500227185


'దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం'

తెలుగు భాషవాడుక: సామాజిక భాషాశాస్త్ర అధ్యయనం

సామాజిక జీవనంలో నుండి జనీంచిందే భాష ఆది నుండి నేటి శాస్త్ర సాంకేతికతతో అభివృద్ది చెందుతూ ఆధునిక కాలం వరకు మనిషి సృజనాత్మతకు ముఖ్య ఉపకరణంగా భాష ఉంది. నాటి రాతి యుగం మనిషి నేటి రాకెట్టు ప్రయోగాల వరకు చేరుకున్నాడంటే తాను ప్రకృతిలోని విషయాలను, దాని జ్ఞానాన్ని సంగ్రహించి, అవనరాలకు అనుగుణంగా వస్తు ఉత్పత్తి చేస్తుండటమే కారణం. ఈ క్రమంలో, తాను సంగ్రహించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడంలో భాష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ అభివృద్ది క్రమంలో సమాచార మార్పిడిలో భాష ఎంతగానో ఉపకరించింది అన్నది సుస్పష్టం. అంతేకాకుండా, వ్యక్తి శ్రమనూ సమయాన్నీ తగ్గించడంలో మాతృభాష తోడ్పాటునందిస్తుంది. జ్ఞానవాహినీగా, జ్ఞాన సృష్టికి మూలంగా పరిగణింపబడుతున్న భాష, ప్రతీ యుగంలోనూ మానవుడిని ప్రగతిదారిలో నడిపిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మాతృభాషని ఒక ప్రత్యేక దృక్కొణంలో ఆర్జికసామర్ద్యాన్ని కలిగించే పనిముట్టుగానూ ఒక సామాజిక శక్తిగానూ పరిగణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది (ఉమామహేశ్వరరావు, 2016).

మార్షాక్‌ (1965) భాషకు ఆర్థిక వ్యవహారాల సంబంధాన్నీ గుర్తిస్తూ, ఒక భాష మరొక భాష కంటే ఎందుకు ఎక్కువగా పరిగణించబడుతుంది? భాషా వ్యవహారం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? గతంలోలేక ప్రస్తుతం భాషల స్థితిగతులకు గల కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతూ భాషకు ఉన్న శక్తియుక్తులను ఆర్థిక కోణాన్నుంచి పరిశీలించాడు. సమాజ అభివృద్దికి కీలకమైన నిర్దాయక కారకాలలో భాష ముఖ్య భూమిక పోషిస్తుంది(ప్రభాకర్‌, 2016). ఉత్పత్తి కారకంగా ఉన్న భాష, శ్హ్రామికుల మాతృభాష అయితే అది అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. ఈ పరిశోధనా పత్రం, ఉత్పత్తిలో భాష పాత్రను వివరిస్తూ, భాషకున్న విలువను తెలియజేన్తుంది. మాతృభాష ఆర్జిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తుందనీ చూపించడానీకి పనిస్థలాల్లో నుండి సమాచారాన్ని సేకరించడమైనది. 'శ్రమ-భాషా పెట్టుబడీ:

భాషను ఆర్దికవేత్తలు ఒక మానవ మూలధనంగా పరిగణిస్తారు (రేనాల్స్‌ మరియు మారియన్‌, 1972). ఈ సందర్భంలోనే "భాషలు సమాజంలోని ఆర్దిక లావాదేవీలను ప్రభావితం చేయటమేగాక, సమాజవు ఆర్జిత వ్యవస్థకు భాషే పునాది” అవుతుందని ఉమామహేశ్వరరావు(2017)అర్ధిక గణాంకాల ద్వారా నిరూపించారు. ఉత్పత్తికై పెట్టిన పెట్టుబడుల్లో భాష వాడుక కూడా పెట్టుబడిలో భాగమే. డబ్బూ యంత్రాలూ, వివిధ పనిముట్లూ వాటి శక్తిసామర్వాలూ పెట్టుబడిగా పెట్టిన తీరూ వీటికైన ప్రణాళికా భాషతోనే చేకూరుతాయి. ఏ భాష అయితే ఉత్పత్తికి తక్కువ సమయాన్ని తీసుకుంటుందో, పనికి కావలనీన మెరుగైన అవగాహన కల్పిస్తుందో ఆ భాషనే వాడటం సాధారణ సాంప్రదాయమే కాదు అవసరం కూడా. ఆ భాషనే ఒక సమాజపు శ్రమశక్తుల (కార్మికుల) భాషగా గుర్తించి భాషా ప్రణాళికను రూపొందించాలి. ఆ భాషనే పాఠశాల స్థాయినుండి శిక్షణా కేంద్రాల వరకు విద్యా మాధ్యమంగా వాడుతుండాలి.

మార్షాక్‌, (1965) ఒక భాష-విలువ, ప్రయోజనం, ఖర్చులూ ఇంకా లాభాలను కలిగి ఉంటుందని గుర్తించాడు. మానవ మూలధన సిద్దాంతం (Human Capital Theory) కార్మిక ఉత్పాదక శక్తిని సూచిస్తుంది, ఇది ఇతర భౌతిక పెట్టుబడుల నుండి వేరుగా ఉంటుంది. ఇది ఆదాయంలో వ్యత్యాసాలను వివరించడానికి అతి ముఖ్యమైన పరికరంగా పనిచేస్తుంది. (బెకర్‌, 1975: రైడర్‌ -పోన్స్‌-రైడ్లర్‌, 1986:రాబిన్సన్‌, 1988). శ్రామికులు పనిస్థలాల్లో పని చేసినప్పుడు, వారు విషయావగాహన కొరకూ, పనిస్థానాలలో తోటివారితో సంభాషించడానికీ భాషని ఉపయోగిస్తారు. వ్యక్తి ఖర్చుచేసే సమయం, వాడుతున్న భాష, ఉపయోగించే శక్తి కలిగివున్న నైపుణ్యాలను వినియోగించటం మానవ మూలథనంగా పరిగణింపబడుతుంది (ప్రభాకర్‌ 2016). రేనాల్డ్‌ ఇంకా మారియన్‌ (1972) ఆర్ధికవేత్తలు భాషనీ మానవ మూలధనంగా గుర్తించారు. ఈ పద్ధతిలో భాషాజ్ఞానం కూడా విద్య వలన వచ్చే ఫలితాలను రాబడుతుంది. తర్వాత ఇదే ఆలోచనా ధోరణి బైటన్‌ మరియ మిస్పోకోవ్న్కి (1975)చే కొనసాగించబడి, భాషా సమూహాల మధ్య నైపుణ్యాల తేడాను, వాటిపై ఉన్న సామాజిక ఆర్ధిక ప్రభావాలను చూపిస్తూ మాతృభాష విశిష్టతను చూపించడం జరిగింది. వివిధ ఆర్థిక సంబంధాలలో భాష కావాల్చిన ఇతర నైపుణ్యాలను పెంచుతుంది. అందువలన, భాష మానవ మూలధనంలో భాగమవుతుంది. కొంతమంది పరిశోధకులు (బ్రెటన్‌, 1978:వాలియన్మోర్డ్‌, 1980: గ్రైనియర్‌, 1982)ఒక భాష నేర్చుకోవడం అనేది మానవ మూలధనం యొక్క పెట్టుబడిలో భాగంగా పరిగణించారు. భాషలకు వాణిజ్యపరమైన సామర్థ్యం వుంటుంది. అంటే నమాజంలో స్థానిక, వాణిజ్య శక్తులు బలపడడానికి స్థానిక భాషల ఆర్థిక స్థాయి పెరగాలి. స్థానిక భాషల ఆర్థిక స్థాయిలొ పెరుగుదల ఆ సమాజపు ఆర్జిక శక్తికి నిదర్శనం (ఉమామహేశ్వరరావు, 2017).

ఉత్పత్తిలో మాత్చభాష పాత్ర:

భాష, సమాజంలోని సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం. జ్ఞానానికి మూలం సంస్కృతి అయితే, దానిని అందించే మాధ్యమం భాష. మనిషి చేస్తున్న ప్రతీ పనికీ వెనక ఆ పనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి అందివ్వబడుతూ సమాజ ఆర్థికోన్నతికి సహకరిస్తుంది. కొన్నిసమయాల్లో జ్ఞాన సృష్టికి దారితీసి సమాజాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తుంది. జ్ఞాన సృష్టికీ, దాన్ని తదుపరి తరాలకు అందివ్వడానికి భాషే ఆధారం. ఈ ప్రక్రియను మాతృభాష సమర్థవంతంగా జరిపిస్తుంది. పనికి సంబంధించిన అవగాహనా పరిధిని మాతృభాష 'పెంచుతుంది.

వ్యక్తి సంపద సమృద్దిగా ఉంటేనే దేశసంపద సమ్మద్దిగా వుంటుంది. వ్యక్తి పనిచేయడానికి కావలసిన శక్తి సామర్ధ్యాలు, భాష నైపుణ్యం అన్నీమానవ మూలధనంగా పరిగణించబడతాయి. ఒక దేశ అభివృద్ది ఆ దేశ వ్యవసాయ, ఉత్పత్తి, సేవా రంగాలపై ఆధారపడి ఉంటుంది. వస్తూత్పత్తి విధానం ద్వారా మానవ జీవనం సరళీకృతం అయింది. ఉత్పత్తి జరగడానికి ముందు ఆలోచన, అది కార్యరూపం దాల్చడానికి కావలనీన ప్రణాళిక అన్నీ భాష ద్వారా సమకూరుతాయి. ఏ భాష అయితే ఈ క్రమానికి అడ్డంకిగా ఉండదో, ఆ భాష వాడుక వల్ల అధిక ఉత్పత్తిని రాబట్టవచ్చు. మాతృభాషే మనిషికి స్వాస్థ్యం. ప్రతి మనిషికీ ధనిక, పేద, జాతి, మత, కుల, లింగ వర్గాల భేదం లేకుండా సమాన వనరుగా ఉంటున్నది మాతృభాష మాత్రమే. ప్రతీ ఒక్కరి సృజనాత్మకతకూ, దానీ సాధనలో ఉండే కష్ట నష్టాలలో మార్గాన్ని మాతృభాష సుగమం చేస్తుంది.

ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తి సమాచారాన్ని 2003 నుండి 2010 వరకు ప్రపంచ బ్యాంకు భాషల ఆధారంగా విడుదల చేసింది. అంతర్జాలంలో భాషల వాడకాన్ని బట్టి సేకరించిన గణాంకాల ప్రకారం, స్థానిక భాషలు ఇంగ్లీష్‌ కంటే ప్రపంచ స్గూల జాతీయోత్పత్తికి ఎక్కువ మొత్తంలో దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది.

భారతదేశ స్థూల జాతీయోత్పత్తి సమాచారాన్ని ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ సమాచారం భారతదేశపు జనాభా గణనకు లేదా ఎథ్నోలాగ్‌ వంటి ఇతర వనరులకు అనుబంధంగా ఉంది. ఈ సమాచారం ప్రకారం భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి భాషల ఆధారంగా క్రింది విధంగా విభజించబడింది: హిందీ 40.22%, బెంగాలీ 8.30%, తెలుగు 7.87%, మరాఠీ 7.45%, తమిళ భాష 6.32% ఉర్దూ 5.18%, గుజరాతీ 4.85%, కన్నడ 3.90%. ఇది కేవలం ప్రాంతాలవారిగా జనాభా మీద ఆధారం చేసుకొన్నదికానీ, శ్రామికుల పని స్థలాల్లో భాషావ్యవహారాన్ని శాస్రీయ పద్దతిలో అధ్యయనం చేసిన సమాచారం కాదు. పైన చెప్పిన విషయాలను శ్రామిక - ఉత్పత్తి సంబంధాలలో ఎలా


వాడుతున్నారో పరిశోధించి చూపించే దిశగా ఈ కింది విధంగా విశ్లేషించాం.

సమాచారం -శ్రమ-విశ్లేషణ:

భాషకీ ఆదాయానికీ మధ్య సంబంధాన్ని నెలకొల్పేందుకు ఆధారభూతమైన సమాచారం సేకరించడం జరిగింది. ఈ సమాచార సేకరణ కొరకు హైదరాబాదు పరిసర ప్రాంతాలైన మెదక్‌, మహబూబ్ న్గగర్‌ జిల్లాల్లోని ఐదు పని స్థలాలను సందర్శించడమ్హైనది. ఎక్కడైతే మనుష్యులు తమ భాషను పనిస్టలాల్లో ఉపయోగిస్తూ పనిచేస్తారో అక్కడ భాష సంపదను ప్రభావితం చేసే చోటు అవుతుంది. ఒక వ్యక్తి తన పనిలో తోటి పనివారితో మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష పనీకి కావలసిన అవగాహనను కల్పిస్తుంది, సాంకేతిక ఉపయోగంలో వాడే భాష ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఆర్థిక లాభనష్టాలకు కారణమవుతుంది. కాబట్టి, సమాచార 'సేకరణకి పనిన్టలాలు సరైనవిగా భావించి వాటిని ఎన్నుకోవడం జరిగింది.

సమాచార సేకరణకై ఇచ్చిన 'ప్రశ్నావళిలో మొత్తం 20 ప్రశ్నలు పొందుపరచడం జరిగింది. ఇందులో మొదటి ఆరు ప్రశ్నలు వ్యక్తిగత వివరాలను సేకరించడానికై ఏర్పాటు చేయబడినవి, మిగతా ప్రశ్నలు భాష వాడుకను గూర్చిరూపొందించబడినవి. ప్రశ్నావళి ద్విభాషి తెలుగూ, ఇంగ్లీషూ రెండు భాషల్లో తయారు చేయబడింది. స్థానికంగా పనిచేసే వారి మాతృభాష తెలుగు కాబట్టి సమాచార సేకరణకు అనువైనది. ఇంగ్లీషు, ఇతర ప్రాంతాల నుండి పనికోసం వలస వచ్చిన వారికోసం ఉపయోగించడమైనది.

ఎంపిక చేసుకున్న ఐదు పనిస్థలాల్లో 1800 ఉద్యోగస్థుల నుండి సమాచార సేకరణ జరిగింది. పని స్థలాల్లో తమ తమ పనుల ఆధారంగా వారందరినీ మూడు విభాగాలుగా వర్గీకరించడమ్దైనది. ఈ పని స్థలాలో అధికారులైన ముఖ్య కార్యనిర్వాహణాధికారి, కార్య నిర్వాహకుడు, మానవ వనరుల అధికారి మొదలైనవారిని ఎగువ తరగతివారుగానూ, ఇంజినీర్లు పర్యవేక్షకులు, నిర్వాహకుడు మొదలైన వారినిమధ్య తరగతివారు గానూ, ఫిట్టర్లు సర్వీసింగ్‌, వెల్డర్లు, సహాయకులు, బీడి కూలీలు, వ్యవసాయ కూలీలు మొదలగువారినీ దిగువ తరగతివారుగానూ వర్గీకరించడమైనది.

ఎగువ తరగతివారి సంఖ్య మిగిలిన రెండు వర్షాలతో పోల్చితే చాల తక్కువ. పనిస్థలాల్లో మొత్తం పనివారి సంఖ్యలో వీరు 12.8 శాతం మట్టుకే ఉంటారు. వీరు ఇంగ్లీషు మాధ్యమంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినవారు. పనిస్థలాల్లో వీరి చొరవ చాలా తక్కువ. వీరు క్రింది వర్షాలవారిపై అజమాయిషీ చేస్తూ ఉంటారు. క్రింది వర్గాలతో పోల్చితే వీరి భాషా వాడుక తక్కువగా ఉంటుంది. వారి సంభాషణలు ఎక్కువగా మధ్య తరగతి వారితోనే, చాలా వరకు ఇంగ్లీషు భాషలో ఉంటాయి.

1. మధ్య తరగతి వారు 37.8 శాతం ఉంటారు. వీరందరూ గ్రాడ్యుయేట్సే: వృత్తి పరమ్హైన కోర్సులు చేసినవారు. పనికి సంబంధించిన ప్రణాళికను తయారు చేయడం, ఆ ప్రకారంగా పనిస్టలాల్లో పనిచేయించడం వీరి విధి. వీరు దిగువ వర్గం వారితో తెలుగు భాషలోనే సంభాషిస్తారు.

2. దిగువ తరగతి వారు పై రెండు వర్గాల వారికంటే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. పనిస్టలాల్లో వీరు 49.4 శాతం ఉంటారు. ఇందులో వృత్తిపరమైన కోర్సులు, డిప్లామా, ఇంటర్మీడియేట్‌, పదవ తరగతి మరియు చాల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరందరూ తెలుగు మాధ్యమంలో చదివినవారు.మాతృభాష అయిన తెలుగులో వ్యవహరిస్తారు. ఉత్పత్తి అధిక భాగం దిగువ తరగతి వారి నుండే వస్తుంది. మాతృభాషనే వీరు విరివిగా వాడతారు. పని సంబంధిత సూచనలూ, హెచ్చరికలూ ఉత్పత్తిలో భాగమైనవారందరికి తెలుగులోఉండడమే సహజం మధ్యతరగతివారు దిగువ తరగతివారితో జరిపే సంభాషణలూ, సూచనలూ, దిగువ తరగతివారు ఒకరితో ఒకరు వ్యవహరించడం, పరిశ్రమలు పొందుపరచిన పని సంబంధిత సమాచార పుస్తకాలు తెలుగులోనే ఉంటాయి. ఇంగ్లీషు వ్యవహారం ఉన్నతవర్గం వారికి మాత్రమే. పరిమితమ్హై కేవలం 12 శాతానికే పనిస్థలాల్లో వ్యవహరించ బడుతుంది. ఎంపిక గావింవబడ్డ పనిన్టలాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి, హైదరాబాదు పరిసర ప్రాంతాలు కాబట్టి హిందీ, ఉర్లూ 'ప్రభావితమైనవి కాబట్టి కొంతవరకూ హిందీ, ఉర్దూ వ్యవహారంలో వాడబడుతుంది. వీటితో పాటు తమిళం, ఒడియా భాషలు కూడా పని కోసం వలస వచ్చిన కొందరిచే వ్యవహరించ బడుతున్నాయి.

3. ఎంపిక చేయబడ్డ అన్ని పనిస్థలాల్లో శ్రామికులందరూ భారతీయభాషలని 89% శాతం, మరి ముఖ్యంగా వారి మాతృభాష తెలుగుని 80% శాతంమంది వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు మాతృభాషలోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. సంపద సృష్టికి మాతృభాష మూలంగా కనిపిస్తోంది. ఇలా సృష్టింపబడిన సంపద అంతా దేశ సంపదలో పాలిభాగం అవుతుంది. స్థూల జాతీయోత్పత్తి(GOP)లో ప్రాంతీయ భాషలు సింహభాగం అందిస్తూ, దేశాభ్యున్నతికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. సంపద సృష్టిలో ప్రాంతీయ భాషల వాడకం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని ఈ పరిశోధన వలన స్పష్టమవుతోంది. ప్రాంతీయ భాషల స్థితి ఎంత అరోగ్యంగా ఉంటే దేశ సంపద అంత అరోగ్యంగా ఉంటుంది. దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ భాషలను వచ్చే తరాలవారికి సమర్ధవంతంగా అందివ్వడానికి కంకణం కట్టుకోవాలి. ప్రాంతీయ భాషలు కాకుండా ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగాలొస్తాయని జనం అపోహలో తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో చదివిస్తున్నారు. కాని ఈ పరిశోధన వల్ల ఇంగ్లీషు కేవలం 11% శాతానికే పనిస్థలాల్లో పరిమితమైనదని, దాన్ని మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువనీ సేకరించబడిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇంగ్లీషు నిరాయకంగా వాగ్దానం జేసే ఉద్యోగాలు కొన్ని మాత్రమేనని గుర్తించడమైనది. ఇంగ్లీషే అన్ని సమస్యలనూ నయంచేసే సంజీవని అని నమ్మే ప్రజలకి అది అపోహ అని ఈ పరిశోధన ద్వారా నిరూపించడమైంది ఈ వ్యాస రచయిత పరిశోధక విద్యార్థి, హైదరాబాదు విశ్వవిద్యా'యం

14 వ పుట తరువాయి.......

మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ 'సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?

ఉంటుంది (NCERT 2006a:21). ఈ బదిలీ పిల్లల మొదటి భాషలో ఉన్నత స్థాయి నైపుణ్యం అభివృద్దిపై ఆధారపడి ఉంటుంది. అడ్డదార్లు అవసరంలేదు. పరివర్తనాలను క్రమంగా సాధారణంగా పాఠశాలలో నాలుగైదు సంవత్సరాల తరువాత ప్రణాళిక చేసుకోవాలి. బహుభాషా విద్యకు మద్దతు ఇవ్వడం సమాజానికి మంచిది. ఎందుకంటే ఇది అన్ని భాషలూ సంస్క్పృతుల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మహారాష్టలోని సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల అనుభవం ద్వారా నిరూపించబడినట్లుగా, ఈ విధానం వ్యక్తిగతంగా విద్యార్థులను ఇంగ్లీష్‌ కోసం వారి ఆశయ లక్ష్యాలలో ఏ విధంగానూ వైకల్యాన్ని కలిగించదని మనం ప్రజల నమ్మకాన్ని పెంచాలి. ప్రాధమిక విద్య మాతృభాషా మాధ్యమంలో ఉండాలని చాలా మంది నిపుణుల అనుభవం ద్వారా కూడా తెలుస్తోంది. ఏకభాషాదృష్టి బలంగా ఉంది. అది “పూర్తి ఇంగ్లీష్‌ మాధ్యమానికి పాఠశాలలనునెట్టివేస్తుంది. దీనికి ఉన్నత వర్గాల మద్దతు ఉంది. వీళ్లు దీన్ని రెండోరకం ఎంపికగా చూస్తారు. ఈ విరుద్ధమైన అభ్నిప్రాయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల కోసం ఆచరణీయ కార్యాచరణ ప్రణాళిక వైపు వెళ్ళాలి. వాడడం ఇంగ్లీషు వైవ్లు పరివర్తనలను విశ్వననీయం పద్ధతిలో నిర్వహించగలగాలి. అప్పుడే అకాంక్ష్మ కోరికలను తీర్చగల ప్రజల నమ్మకాన్ని సృష్టించవచ్చు. సామూహిక విద్యలో ఈ విశ్వసనీయ మార్గాలు లేకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీన్తుంది.మహారాష్ట్రలోని సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల అనుభవం మధ్యేమార్గంగా ఒక ఉదాహరణను అందిస్తోంది. మనం ద్వేషభావాన్ని వీడి పాఠశాలల కోసం తెలివైన విధానానికీ విశ్వసనీయమైన అచరణకూ మధ్య అంతరాన్ని దాటేందుకు వంతెన అవసరం...

larger“సొంత భాషలో చదువు మెదలు పెట్టటం అత్యంత సులువు. చదువును పిల్లలు హాయిగా, కష్టం లేకుండా,

larger