అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు-ఆఫ్రికా నేర్పే గుణపాఠాలు
సంవ్రదాయం - సాధికారత
డా॥ పి.శివరామకృష్ణ 'శక్తి 9441427977
కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు-ఆఫ్రికా నేర్పే గుణపాఠాలు
అమ్మనుడిలో ఎదుగుతున్న నుడికారం, పదసంపద.
లెక్కల మాస్టారి కోణాలు, డిగ్రీల పాఠం (గిరిజన) విద్యార్ధికి ఎక్కలేదు. గిరిజనుడి విల్లు కోణమానిని లాగా 180 డిగ్రీలలో ఉంటుంది. బాణం లంబకోణంలో 90 డిగ్రీలలో సంధిస్తాడు. సూర్యుడు నడినెత్తికి వస్తే లంబకోణం. ఇదే తాపీ మేస్త్రీ కుటుంబం నుండి వచ్చే పిల్లవాడికి, మూలమట్టం, సారామట్టం, వడబంలతో పోలిస్తే అర్జమోతుంది. ఇలాగే ప్రతి వృత్తికి లెక్కలు, కొలతలు, పరికరాలు ఉన్నాయి.. పనివాళ్ళందరూ లీవర్ (మోప్తుతో బరువు లేపటం), ట్రిగ్గర్ (అల్లెతాడు) సాగదీసి బాణం వేయటం, అదికూడా రెండు రకాలు బారతీపు- లాంగ్ షాట్ బొక్కతీపు- కట్ కొట్టటం) తరణి పట్టటం (చక్రం), గాలి తిత్తి(బ్లొయర్) టెక్సిక్స్ వాడుతుంటారు. వాటి మీద రూపొందిన వాయిద్యాలు కూడా ఉన్నాయి. సులువుకు సహకరించేలయగల పాటలు, హైలెస్సా, జంబయ్ జో జోదు లంగరు పాడుతుంటారు. ఆ లయకు పురిపెట్టే ఆటలు ఉన్నాయి. ఇవన్నీ తరతరాలుగా వస్తున్నవే. ఎద్దు, ఏనుగు, గుర్రం, ఇంధనం, ఇలా శక్తి మారుతుంది. కొత్త కొత్త పనిముట్లు దిగుమతి అవుతాయి. వీటికి తగ్గట్లు పదాలు కూడా అతుకు వేసుకుంటున్నారు.
కుట్టు మిషన్, మిషన్ కుట్టు; రుబ్బింగ్ మిషన్, వాషింగ్ మిషన్ వాయల్ చీర, సిల్కుచీర రవ్వల నెక్లెస్, కలవర్ నెక్లెస్,అపోలో నెక్లెస్;
వ్యవసాయంలో దుక్కి మసాలా దుక్కి ఎరువు, దుక్కి పిండి. దుక్కి మందు డబల్ కాట్ మంచం, రైస్ అన్నం, బ్యాండ్ మేళం, స్టారు బియ్యం, నూనె మిల్టు రైస్ మిల్టు,పెద్ద సారు, డౌట్ అనుమానం,చివరాఖరు, ఆడ లేడిస్ గ్యాస్ బండ,గ్యాస్ లైటు, ఇంగ్లీష్ వైద్యం, మిషన్ ఆస్పత్రి, ధర్మాసుపత్రి, పెద్ద ఆపరేషన్, రైలుబండి, పాలవాన్, పాల కేన్ పాల మీటరు, డాల్డా నెయ్యి. నూనె మిల్లు, బెండకాయ స్విచ్, గొడుగు లైటు, బిళ్ళ బంట్రొతు, బుగ్గకారు, పొగాకు బారన్, లైను పిల్ల స్టోరుబియ్యం. మిరపకాయ టపా, అప్పుల తహసిల్డార్, గుద్దుల బ్యాంకు,ట్రైబల్ కలెక్టర్, ఏజెంట్ కోర్టు, కూపీ గుమస్తా ఉప్మా బడి (అంగన్ వాడి), ఆశ్రమ స్మూలు, జంగల్ పట్టీ, లావని పట్టా చెకింగ్ కాటా. ఉపాధి కూలి, లైటు కొట్టటం, లైనేయటం, ఎక్రాస్, వర్త్ పెట్టటం, షాక్ కొట్టటం,
ప్రజల నుదికారం సమిష్టి చేతనను మీటి ఉత్సాహాన్ని పెంచటానికి ఉద్యమం కావటానికి ఉత్తరాంధ్రలో 'భీల, తంపర'భూములు థర్మల్ పవర్ స్టేషన్‌కు అప్పచెప్పటాన్ని ఎదిరించటం ఉదాహరణ. జీవ వైవిధ్యచట్టం ఈ భూముల పర్యావరణ ప్రాముఖ్యం గుర్తించి వాటిని ఫ్యాక్టరీకి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది.
సరిహద్దులు, కొండగుర్తులు, ఇరుగు పొరుగు వాళ్ళు వీటితో స్థలాలను, పొలాలను చెపుతారు. ఇటువంటి సంప్రదాయ పద్దతిలో పటంగీసి పట్టాకోసం దరఖాస్తు చేయవలసిందిగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం చెపుతుంది. సర్వేక్షణ పటాలలో, జి.ఐ.యస్‌లో ఉహాజనితమైన అక్షాంశ రేఖాంశాలను కర్కాటక, మకర రేఖలలో గుర్తిస్తే, జనం స్థలవాచకాలతో గుర్తిస్తారు. ప్రతీ వనరుకు ఒక ఉహాజనితమైన అధిదేవత ఉంటుంది.
ఇలా స్థలవాచకాలు, వనరులు, బుతువులు, పనిముట్లు, అవి వాడే ప్రజల సాహిత్యం సనాతనం. ఉన్నది కాగ్నిషన్, దాన్ని గుర్తించటం రికగ్నిషన్. విద్యార్థి, అతడి కుటుంబ వృత్తి నేపథ్యం కాగ్నిషన్. దాన్ని గుర్తించటం రికగ్నిషన్. కొత్త వస్తువులను పాతపదాలకు జోడించి/అంటుగట్టి ప్రజలు వాడుకలోకి తెస్తారు. ఈ సృజనాత్మకత ఉన్న సమాజం, మార్పుకు తగ్గట్టు తనను మార్పుకోగల సమాజం బతికి ఉంటుంది. ఈ శక్తి క్షీణిస్తున్న సమాజం బానిసత్వంలోకి పోతుంది. కొత్త వస్తువులు, శాస్త్రం జనసామాన్యం సొంతం చేసుకుంటున్న పద్ధతి గుర్తించకుండా, కొత్తవి సృష్టించాలి అంటూ శిష్టులు ఉన్నవాటిని కనుమరుగు చేస్తున్నారు. అటువంటి అతితెలివిని ఎండగట్టాలి. తెల్లవాళ్ళతో పాటు, వాళ్ళ చదువు,వాళ్ళ సాహిత్య రూపాలను ఈ శిష్టులు ఒడిసి పట్టుకున్నారు. గుర్తింపు పొందసాగారు. భావదాస్యపు బానిస ధోరణులను బలపరిచారు. అందుకు దారితీసిన చరిత్రను ఒకసారి గుర్తుచేయటం అవసరం.
సాహిత్యంలో ఉత్పత్తి సంబంధాలు-గిరిజన రైజాంగ పోరాటాలు
తెల్లవాళ్ళకు, తూర్పుతీరంలో రాజులు లొంగారు కాని, వారితో రకరకాల చుట్టరికాలుగల తూర్పుకనుమలలో గిరిజనులు లొంగలేదు. గిరిజనులు, పితూరీ మీద పితూరీ చేస్తుంటే ఎదురుదెబ్బలు తిన్న తెల్లవాళ్ళు, నరబలి మాన్సించటం పేర సాయుధ సంస్మరణలకు పూనుకున్నారు.
ఈ సంస్కరణల కోసం అనాదిగా మనపద్ధతిలో మనం ప్రయత్నం చేస్తూనే వచ్చాము. నరబలి బదులు, దున్నపోతులు, గుమ్మడి కాయలు మోదకొండమ్మ వంటి దేవతల కధాగానం విధవా వివాహాన్నీ ఆచరణలో చూపిస్తూ వేదాలు పదుగురి కోసం తెలుగుచేసి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి వంటివారు పరితపిస్తే, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో కొందరు తెల్లప్రభుత్వం అండదండలతో ఈ మార్పును వేగిరపరచవచ్చుననీ భావించారు.
తెల్లవారి బలప్రయోగానీకి, క్రమంగా వాళ్ళు తెస్తున్నమార్పులకు 'కల్లలాడరు ఇంగిరీజులు అంటూ వారినీ “సంఘసంస్కరణ పతాకలు” గా. కీర్తించే గురజాడ వంటి బుద్దిజీవుల మద్దతుకూడా దొరికింది. ఈ మద్దతు వెనుక విజయనగరం సంస్థానం ఆధిపత్య ధోరణులకు ఎదురుతిరుగుతున్న గిరిజనుల మీద, వారి సంస్కృతి మీద, వారి పాలకుల మీద తిరస్కారభావం కూడా ఉండవచ్చు. అప్పటి నుండి గిరిజనులను అజ్ఞానులుగా అడవి మనుషులుగా చిత్రిస్తూ, జాలి ఒలకబొయ సాగారు. ఇలా వలస ప్రభుత్వం మనను బానిసత్వపు బందిలిదొడ్డిలోకి తోలటం వల్ల వస్తున్న దుష్పరిణామాలను, చిలకమర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ప్రకాశం పంతులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
తెల్లవాడి పరిచయంతో వాళ్ళ లిఖిత సాహిత్య ప్రక్రియలు నవల, కధ కవితల వంటి కొత్త ప్రక్రియల ఉత్పత్తి అక్షరాస్యత పెరిగిన కొద్దీ పాఠకులు పెరిగారు. సమాజం చదువుకొన్న లేని వాళ్ళుగా విడిపోయింది. ఇటువంటి తరుణంలో గిడుగు సవరలను అర్జం చేసుకోడానికి ప్రయత్నించారుకాని, ఒరిస్సా రాష్ట్ర విభజనకు బాధపడిన ఆయన రాజమహేంద్రికి తరలి పోవటంతో అటువంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. ఆయన వ్యావహారిక భాషోద్యమం,మాండలికాన్ని తోసిరాజని లిఖిత సాహిత్యానీకి ప్రోత్సాహమిచ్చింది. ఒక మిధ్యాప్రామాణిక భాష బలపడింది.
ఒక పక్క శిష్టవర్గం కవిత్వం పిచ్చి పెంచుతుంటే ,ప్రజలు మరింత అజ్ఞానంలో కూరుకుపోసాగారు. గురజాడ, రావిశాస్త్రి, కారా, చాసో వంగపండు, గద్దర్ వీళ్ళంతా ఇలా చదువుకున్న వాళ్ళను, జన సామాన్యానికి కావలసిన చదువు, వ్యవహార జ్ఞానం నుండి కవిత్వం, కళల వైపు మళ్ళించారు. మసాలా, ఉద్యమ సాహిత్యాలు "పెరిగిపోయాయి. సంఘాలు పెట్టుకుని సిండికేట్ అయ్యారు. రావిశాస్త్రి మరో వెన్నెలకంటి రాఘవయ్య కాలేకపోయారు సరే. న్యాయవాది అయిన ఆయన వ్యవహార జ్ఞానం లోపించిన రచనలను గాడిలో పెట్టలేక పోయారు.
ఇక, గిరిజన ప్రాంతాలలో పనిచేసి “నెల నెలా వెన్నెల 'సంతోష చంద్రశాలలు “చదువు కొత్తలు” నడిపిన శిష్ట సాహిత్యవేత్తల యాత్రా సాహిత్యాలలో, రచనలలో జపాన్ హైకూలు, బషో కవిత్వాలు తప్ప, అక్కడ వెన్నెల బయళ్ళలో చూడదగిన చుక్కలు, ఆటలు, పాటలు కనిపించవు. గిరిజన ప్రాంతంలోని తన స్వగ్రామంలో అమ్మ కొలిచే దేవత జాకరమ్మ గుర్తుందిగాని (కోకిల ప్రవేశించే కాలం) , తమ అభిమాన రచన ఒడియా నవల అనువాదం 'అమృత సంతానంలో ప్రతీ అధ్యాయంలో వచ్చే ఆ దేవత, ఆ దేవతకు చేసే కొర్రకొత్త పండుగ సందడిని వర్ణించిన రచన 'ఆదివాసీ పండుగలు (పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ)లో వివరాలు, తాను నడిచిన దారులలో గిరిజనుల దేశకాలాలు వారి చరిత్ర జాడలు తెలుసుకోవాలని తోచలేదు.
ప్రజలు తమ సాహిత్యాన్ని తాము అల్లుకోకుందా, రచయితల వైపు చూడసాగారు. తమ విత్తనాలు, ఎరువులు, తాము తయారు చేసుకోకుండా, కంపెనీల మీద ఆధారపడసాగారు.
కెన్యాలో, 1960లలో, తన ముందే చోటుచేసుకున్న ఇటువంటి పరిణామాలను ప్రసిద్ద రచయిత గూగీ వా ధియాంగో “బందీ” (స్వేచ్భా సాహితి) లొ ఇలా వర్ణిస్తాడు. స్థిరపడిన వలసవాదులు ఉత్పత్తి చేసిందేమీలేదు. కళలేదు. సాహిత్యం లేదు. సంస్మృతి లేదు. గిలికింది యాత్రా గైడ్‌లు మాత్రమే ..... పేర్లు మెరిసే అట్టలు తప్ప వాటిలో ఉన్నదంతా శూన్వమే...వాళ్ళ నాటకరంగం.... మోటు అనుకరణ తప్ప మరేమీ కాదు. ఒక చిన్న సామాజ్యాన్ని తయారు చేసుకున్నారు” (పుట57) వీటిని ఎండగడుతూ అతడు తన మాతృభాష '“గికుయు”లో రాసి వేయించిన నాటకం వల్ల అతడు జైలు పాలవుతాడు. కాని, క్రమంగా ఆ ఉద్యమం ప్రజల భాష నోర్చుకోండి- మీ సంస్రుృతిలో ఉత్తమమైన దానిని ప్రబోధించండి. అభ్రీకన్ నంస్కుతిలో ఉత్తమమైన దానిని నేర్చుకోండి. ఇదే మన విముక్తి మార్గం. ఇందులోనే మనకు గమ్యం ఉంది(140) అని 1951లోనే ఉద్బోధించిన భారత జాతీయుడు మాకెన్ సింగ్ నుండి స్ఫూర్తి పొందింది. క్రమంగా ప్రపంచం కీర్తించే రచయితలు, కళాకారులు, క్రీదాకారులు ఆఫ్రికానించి వస్తుంటే మనవాళ్ళు రిజర్వేషన్లతో తృప్తిపడుతున్నారు. మన ఇంగ్లీష్ పంతుళ్ళు, ఆఫ్రికన్ రచయితలు చినువా అచ్చే, సోలె వోయింకా, గూగీ, చిమమండ రచనలు మనకు ఏం గుణపాఠాలు నేర్చుతాయో చూడకుండా ఉన్నది ఉన్నట్లు అప్పచెప్పుతున్నారు. మన వేధావులు యధాతథంగా అనువదిస్తున్నారు. సంతోష
తరువాయి 34 వ పుటలో.......