అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/ఆమె లేఖలు
యాత్రాసాహిత్యం
మూల రచన : జూలియా చార్లోటి
అనువాదం : కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ
డా.కాళిదాసు పురుషోత్తం 9000642079
“ఆమె లేఖలు”
(గత సంచిక తర్గువాయి...) 14వ లేఖ
తెల్లదొరల ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడ్డారు.
మద్రాసుకు ఆరువందల మైళ్లలో ఒక కొత్త గిరిజన జాతి ఈ తిరుగుబాటును లేవనెత్తింది. ఇంగ్లీషువారిలో కలవరం రేకెత్తించిన ఈ తిరుగుబాటును ప్రభుత్వం త్వరలోనే అణఛివేయడంతో అంతా సద్దుమణిగింది.
డిసెంబరు 15వ తేదినాటి ఉత్తరం ముగింపులో ఆమె ఈ తిరుగుబాటును ప్రస్తావించింది. తిరుగుబాటును గురించి పత్రికల్లో చదివి, మీరు భయపడిపోయారా ? అని ఇంగ్లండు నుంచి వచ్చిన ఉత్తరంలో చదివి, దానికి సమాధానంగా ఆమె ఈ విషయం ప్రస్తావించింది. 'పెన్నివిజిల్ రాజాగారింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఒక కొత్త అతిధి వచ్చి ఉన్నాడు. అనుకోని అతిథి, అయినా అతన్ని జదంపతులు బాగానే యిష్టపడ్డారు.
అతను తిరుగుబాటును అణచడంలో ప్రభుత్వానికి తోడ్పడ్దాడు. ఇంతవరకూ ఎవరికీ తెలియని ఒక కొత్త కొండజాతివాళ్లు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. వాళ్లు చక్మగా, ధీరంగా, భయంకరంగా ఉంటారు. దేహదారుడ్యంలోను, అలవాట్లలోనూ వాళ్ళు యూదుజాతివాళ్లను పోలివుంటారట. వాళ్లు కంటికి కనబడని దేవుళ్లను, చెట్టుమీద వుండే ఒక భూతాన్ని ఆరాధిస్తారట! దాన్ని దయ్యాంగా భావించి శాంతింప చెయ్యడానికి పూజలు కూడా చేస్తారట. ఇళ్లు చెక్కతో కట్టుకాంటారు. నేల, గోడలు, కప్పు అంతా దేవదారు కలపతో వేస్తారట - ఆ ఆగంతకుడు వివరించాడు.
ఈ జాబులో ద్రాక్షారామం 'పెన్నీ విజిల్ ' రాజాగారి ఆతిథ్యం విషయాలు ఆమె వివరంగా వర్ణించింది. ఆ ప్రయాణం అంతకష్టం అని తెలిసుంటే తల పెట్టి వుండేదాన్ని కాదు. దూరం పదిహేను మైళ్లని విని, సాయంకాలం ఐదున్నరకు బయళ్టేరి రాత్రి పది గంటలకు చేరుకోవచ్చని భావించింది. తీరాచూస్తే 30 మైళ్లు రోడ్డు లేదు. దారిలో కుండపోతగా వాన. పల్లకీ మోసే బోయీలు పాడేపాట కూడా వినరానంత కుంభవృష్టి. పైగా కటిక చీకటి. రాత్రంతా మోళాలుబంటి నీళ్లతో పత్తి తోటలను దాటుకొంటూ, పన్నెండు గంటలు ప్రయాణం చేసి ద్రాక్షారామం చేరారు. బండికంటే పల్లకీ ప్రయాణమే సులభమని ఆమె భావించింది.
ద్రాక్షారామంలో బాటసారుల కోసం కట్టిన ఒక సత్రంలో జదంపతులకు బస ఏర్పాటయింది. పాత తివాచీలు పరిచి అలంకరించారు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తర్వాత,
జదంపతులు రాజాగారి భవనానికి బయలుదేరారు. పెద్ద హంగామాతో స్వాగతం పలికారు. ముందు మేళతాళాలతో ఒక బృందం. ఆ సంగీతం మన Rossinni ని అనుకరిస్తున్నట్లుంటుంది. తర్వాత థ్వజాలు, ఖడ్గాలు వెండి బెత్తాలు, పతాకాలు ధరించినవారి ప్రదర్శన. అటు తర్వాత అతిథులకు రకరకాల బిరుదులు ప్రకటించారు. ఆ బిరుదులేవీ ఆమెకు ఒక్క మాట కూడా అర్ధం
కాలేదు. తర్వాత నాట్యగత్తెలు ముందుకొచ్చి, మడిమలలోతు బురదలో వికారంగా చేతులు తిప్పుతూ నాట్యం మొదలు పెట్టారు.
ఎ— మొదట్లో కాస్త సిగ్గుపడ్డాడేమోకాని, తర్వాత ఆ నృత్యం చూస్తూ ఆమెతో పాటు నవ్వడం మొదలు పెట్టాడు.
జదంవతులు రాజభవనం సింహద్వారం వద్దకు చేరగానే ఒక ఏనుగుచేత వారికి పూలమాలలు వేయించారు. రాజాగారి దర్బారు జనంతో కిటకిటలాడుతోంది. యాబై మందికి పైగా నాట్యగత్తెలను తెప్పించారు. అందరూ వంగివంగి సలాములు చేస్తుంటే జదంపతులు మెల్లగా రాజాగారి మందిరం ప్రవేశించారు. రాజుగారు వారిపై పావుగంట సేపు ఉపన్యాసం చేసి స్వాగతం పలికారు. అతిథుల కోసం ప్రత్యేకించిన గదుల్లోకి రాజాగారే స్వయంగా తీసుకొనిపోయి, వారితో కాసేపు ముచ్చటించి వెళ్లారు.
రాజాగారి భవనంలో చాలా గదులున్నాయి. అంతా బురదే! వాటిలో నడవడం కష్టం. ఐతే, చుట్టూ సన్నటి దారి వుంది. ఇది గట్టినేల కావడంతో, గోడలు పట్టుకాని జారిఫోకుండా అడుగులో అడుగువేస్తూ నడిచారు. వాళ్లకోసం ఏర్పాటైన గదులు కూడా అలాంటివే. ఒక వైపు మకాంనే వాళ్లు హాల్ అంటారు. దాన్నీ దానికి అనుబంధంగా వున్న గదుల్ని ఆ దంపతు లుండడానికి ఏర్పాటు చేశారు. అందులోంచి దర్చారుకు దారి వుంది. తలుపులు, కిటికీలు లేవు. పెద్దగది చివర వో చిన్నగది, నౌకర్లకు కాస్త స్థలం. మిగతా మూడు వైపుల నుంచి కూడా దర్బారుకు దారులున్నాయి. వాటిలో ఒకటి రాజుగారి మందిరానికి వెళ్తుంది. మాగది, వసారా మధ్య వీధి వైపుకి ఒక చెక్కమంటపం వుంది. అందులో రాజాగారు ఒంటరిగా కూచొని చుట్టకాలుస్తారట! గదిలో టేబిల్, తివాచీ, నాలుగు కుర్చీలు, రెండు పేము సోఫాలు, కాళ్లకిందికొక స్టూలు వున్నాయి. గోడలకు స్థానిక చిత్రకారులు వేసిన దేవుళ్ల పటాలు వున్నాయి. చక్మని ఫ్రేములున్న రెండుఫ్రెంచి అద్దాలను అప్పుడే తెరిచి ప్యాకింగ్ కేసులతోనే గోడలకు వేలాడదీశారు. మరో రెండు షేవింగ్ అద్దాలు కూడా వున్నాయి. “పెన్నివిజిల్” గారికి బొమ్మలంటే చాలా యిష్టం, మాకు చూపించడానికి మరికొన్ని గుర్రాలు, నక్కల వర్ణచిత్రాలు తెప్పించారు. అవి రాజాగారికి చాలా కాలం క్రితం ఎవరో ఇంగ్లీషువారు ఇచ్చినవి. అక్కడక్కడ రంగు వెలిసిపోయి వుంటే వాట్ని బాగు చేస్తానన్నాను.
అందుకు రాజాగారు చాలా సంతోషపడిపోయారు. ఓ నక్క బొమ్మలో రంగులు సరిచేస్తుంటే, ఆయన అక్కడే నిల్బొని 'ఆహా ఎంత గొప్ప నైపుణ్యం! కొత్త బొమ్మలా తయారు చేశారంటూ ఆశ్చర్యపోయారు. అదే అదను అనుకొని ఎ - స్త్రీలు బాగా చదువుకోడంవల్ల కలిగే లాభాల గురించి తను ఎప్పుడూ చేసే ఉపన్వాసం యిచ్చేశారు. ఆడపిల్లలకు చదువు చెప్పడం మంచిదేనని పెన్నీవిజిల్ కూడా ఒప్పుకొన్నారు కానీ, తన ప్రజలు వట్టి దుర్చలులని, వారికి యిష్టం లేదని, వారికి యిష్టం లేని పని తాను చేపట్టలేనని అన్నారు. “ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత, నిద్రఫోవాలని చెప్పి ఆయన్ని సాగనంపేశారు. “అవును, నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరం” అంటూ ఆయన వెల్లిపోయారు. అలా అనడం మర్యాద. నౌకర్లు కూడా భోజనానికి వెళ్లేముందు “అన్నం తినడం మనీషికి చాలా అవసరం, ఒంటికి మంచిది కూడా” అని చెప్పి సెలవు తీసుకుంటారు.
రాజుగారు భోజనం పంపారు. ఆమె తనకు కావలసిన ప్లేట్లు, ఫోర్కులు, కత్తులు, బెడ్, బీరు తన వెంట తెచ్చుకొన్నది. అవన్నీ తెచ్చుకోవలసినదిగా రాజాగారే కోరారు. భోజనంతోపాటు ఆకులు వేసిన ఇత్తడి పళ్లాలు పంపారు. భోజనానీకి పలావు, ఆవగాయలు, పదిపన్నెండు రకాల పచ్చళ్లు, రకరకాల కాయగూరలు, కేకులు వచ్చాయి. “ఈ రాజాగారి స్థాయికి చెందిన బ్రాహ్మణులు ఎప్పుడూ అరటాకుల్లోనే భోజనం చేస్తారు.”
భోజనానంతరం ఊరు చూద్దానికి అతిథుల్ని తీసుకెళ్లారు, మేళతాళాలతో. జడ్డ్దదంపతులు పల్లకీలో, రాజుగారు సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ఊరేగారు. ఊరు ఊరంతా ఆ ఉత్సవం చూడడానికి తరలివచ్చింది. పల్లకీ తలుపు కాస్త మూసివుండేసరికి, రాజాగారు గబగబా వచ్చి ఆ తలుపు తెరిచి, ప్రజలకు దర్శనమివ్వవలసినదని ఎ-ని ప్రాధేయపడ్డారు.
ఊళ్లో అన్నీ మట్టి యిళ్లే. ఎవో కొన్ని మంచి యిళ్లు తప్ప, వేటికీ వెల్లకూదా వెయ్యలేదు. వీధుల్లో మడిమల్లోతు బురద. అంత మురికిలో కూడా అక్కడక్కడా ఆపాదమస్తకం ఆభరణాలు ధరించిన స్రీలు, కాశ్మీరు శాల్వలు కప్పుకొన్న పురుషులు ఆ మట్టి యిళ్లలోంచి తొంగి చూసే వాళ్లు, ఆడంబరం, పేదరికం పెనవేసుకోపోవడంలా వుండేట్లుంది వాళ్లను చూస్తే!
ఒక దేవాలయానికి తీనుకెళ్లారు. ఆమె ఇది వరకెన్నడూ దేవాలయం చూడలేదు, లోపల ఏముందో చూడాలని ఆసక్తి. “మొదట పెద్ద ఆవరణ, చుట్టూతా ఎత్తైన గోడ. దానికి అన్ని వైపులా పెద్ద పెద్ద ద్వారాలు. గోపురాల్లా ఆ ద్వారాలను చూసి అవే దేవాలయాలను కొనే దాన్ని కానీ అవి ముఖమంటపాలట, ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే విశాలమైన స్థలం చూసి గుడిలోకి వచ్చేశామనుకున్నాను. అదంతా దాటుకొని పోతే లోపల చతురస్రాకారంలో ఒక కట్టడం వుంటుంది. దాని ప్రధాన ద్వారం ఎదుట మండపం - అందులోంచి వెళితే గుడి అదొక అద్భుతమైన స్వప్నమందిరంలా వుంది. బాగా కిందికి వున్న కప్పు, చీకటిలో కలిసిపోయే పెద్ద రాతి స్తంభాలు, గోడలో చక్మని గూళ్లు, అక్కడక్కడా పెద్ద తలపాగాలతో కనిపించే మనుషులు. ఏదో కలగంటున్నట్లు అనిపించే అలాంటి ప్రదేశాన్ని నేనెప్పుడూ చూడలేదు. మధ్యలో గర్భగుడి ముందుకు మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాస్త వంగి చూస్తే, లోపల అంతా కనపడేడేగానీ, అలా వోంగితే విగ్రహం ముందు వంగి మోకరిల్లినట్లు అనుకుంటారేమోననీ మానేశాను.” ఊరు చూడ్డం పూర్తయి, ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. నాట్యగత్తెల నాట్యం, బాణాసంచా పేల్చడం సాగుతోంది. జనం తండోపతండాలుగా వున్నారు. ఆ వేడి, వెలుతురు, ఆ అరుపులు, ఆర్భాటాలకు తట్టుకోలేక, కాసేపటికి దంపతులు తమ గదులకు వెళ్లారు. గదుల్లో అంతా పాశ్చాత్య
పద్దతుల్లో ఏర్పాట్లు చేశారు. మాటీ (Matee) కొవ్వొత్తులు వెలిగించి, టేబిల్ మీద టీ, పుస్తకాలు, డ్రాయింగ్ సరంజామా అంతా చక్కగా
అమర్చాడు. ఒక్క నిమిషంలో దృశ్యం పూర్తిగా యిలా మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే, మర్నాడు అంతా ఎప్పటి మాదిరి.
అంతా స్థానిక పద్దతికి వచ్చేసింది. “ఏనుగు మీద తిప్పండని పంతుల్ని (రాజాగారి అసలు పేరు) అడిగాను. వెంటచే ఏనుగును తెప్పించారు. కానీ దానిపైకి ఎక్కడం కష్టమైంది. పనికిమాలిన నిచ్చెన వేశారు. హోదా కూదా సరిగా లేదు. ఎవరో ఇంగ్లీషువాడు తయారు చేసి యిచ్చాడట. నాసిరకం అంబారీ, దానిమీద ఎక్కి కూర్చోవాలంటే భయం వేసింది. చివరకు ముందు ఏనుగు, దాని వెనక పల్లకీలో కూర్చొని ఆమె రాజాగారి తోట చూడ్డానికి బయలుదేరింది. “దాన్ని రాజాగారు తోట అంటారు. తమలపాకుల తోట, కొబ్బరిచెట్లు,
అంతా బురదబురద, మరేమీ లేదు” అంటుంది.
వనవిహారం పూర్తి చేసుకొని యింటికి రాగానే రాజుగారు తన భార్యను ఆమెకు పరిచయం చేశారు. తనకు ఆమెను చూడాలని ఉన్నా ఆయన ఏమనుకొంటారోనని అడగలేక పోయింది. ఈ విధంగా ఆ కోరిక తీరింది. ఎ-గదిలో లేనపుడు రాజాగారు ఆవిడను వెంటపెట్టుకొని వచ్చి పరిచయం చేశారు. అందమైన యువతి. చక్కని ముఖ వర్చస్సు. బంగారు జరీ అంచు పచ్చని చీరకట్టి ఒంటినిండా నగలు, నడుముకు బంగారు నాణేలు పొదిగిన వడ్డాణం పెట్టుకుంది. వెంట వచ్చిన దాసీజనం ద్వారం వద్దనే నిలిచిపోయారు. రాజాగారి గుమాస్తా మాత్రం ఆవిద వెనక నిల్పొని, ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. జడ్జిగారి జవాన్లలో ఒకడు దుబాసీగా వ్యవహరించాడు. “ఆవిడ వచ్చీరాగానే సిగ్గుతో వంకర్లు తిరిగిపోయి, ఏం చేయాలో తెలియక, నిల్చుండిపోయింది. అప్పుడు గుమాస్తా సలాములు చేసి, కుర్చీలో కూర్చొనవలసిందిగా చెప్పాడు. ఆ తర్వాత నేనూ అలాగే చేశాను. ఒకరి భాష ఒకరికి తెలియదు. రాజుగారి భార్వకైతే ఇంగ్లీషు బొత్తిగారాదు. నాకు జెంటూ (తెలుగు) ఎంతవరకు తెలుసునంటే, మా జవాను మా సంభాషణలను తన యిష్టం వచ్చినట్లు మార్చి, ఒకరినొకరు తెగ పొగిడినట్లు తర్జుమా చేస్తుంటే కనుక్కోగలిగినంత మాత్రం తెలుసు. ఆవిడ బట్టల మీద చాలా ఆసక్తి కనబరచింది. నా టోపీ (Bonnet) చూసి ముచ్చటపడి మునివేళ్లతో తాకింది. ఆవిడకు కొన్ని చిత్రాలు చూపించాను. వాట్ని తల్లకిందులుగా పట్టుకొని చాలా బాగున్నాయని మెచ్చుకొంది. ఎ -గదిలోకి వచ్చేదాకా ఆవిడ చాలా సరదాగా గడిపింది. అనుకోకుండా ఎ - గదిలోకి రాగానే, ఒక్క ఉదుటున లేచి గబుక్కున వెనుదిరిగి గబగబా వెళ్లిపోయింది. అయితే ఎ - ఆవిడను ఇబ్బంది పెట్టడం యిష్టంలేక, నేరుగా లోపలికి వెళ్లిపోవడంతో ఆవిడ మెల్లగా తిరిగొచ్చి, దర్జాగా కూర్చుంటూ ఆయనకు క్క్షమాపణ తెలియజేయమన్నది - “మీరు మా తల్లిదండ్రులతో సమానం” అంటూ కూర్చుంది. అంత కంగారు పడిన ఆవిడ తనవెంట మగనౌకర్లు వుంటే పట్టించుకోలేదని ఆమె ఆశ్చర్యపోయింది.
ఇక్కడ వీళ్లరూ కబుర్లు చెప్పుకొంటుంటే, అవతల గదిలో ఎ -రాజుగారికి మేలుచేసే” విషయాలు బోధించే ప్రయత్నంలో వున్నారు. రాజాగారు అందరు బ్రాహ్మణుల్లా కాకుండా ఎ - చెప్పింది శ్రద్దగా విన్నారని, కొన్ని పుస్తకాలు యిస్తే, తీసుకొన్నారని, ఆమె అంటుంది. డిసెంబరు నెల సంచిక నుండి:....చదవండి.
మా వూరు (నవల) ...అగరం వసంత్
కొద్ది నెలలకు ముందే 'సొతంత్రకాల సదువులు పేరుతో ఒక రచన 'అమ్మనుడిలో వచ్చింది. మరలా ఇప్పుడు “మావురు పేరుతో అగరం వసంత్, హోసూరు తెలుగు బతుకును మన ముందు నిలబెట్టటోతున్నారు. ఆటా మాటా పాటా, కూతా, చేతిరాతా, బడీ గుడీ సాగుబడీ (సంస్కృతి), అన్నీ అంతా తెలుగుమయంగా ఉండిన హోసూరు తాపులో తెలుగుదివ్వె కాడిగట్టి మినుకుమినుకుమని రెప్పారుస్తూ ఉంది. ఈ మెలననంతా మనముందుకు తెస్తున్నాడు వసంత్. ఆ ఎలమినీ............ చదివి పట్టించుకాందాం రండి.
దాంతో మర్నాడు మరికొన్ని పుస్తకాలు పంపామని, మద్రాసు నుంచి తెలుగు బైబిల్ కోసం కూడా రాశామని ఆమె ఉత్తరంలో వివరిస్తూ, "నీకు వీలైనప్పుడు అక్షరాలు రాసివుండే రెండు పెన్నీల “చేతిరుమాళ్ళు " (moral pocket handkerchiets)పంపు. ముఖ్యంగా రాణిగారి బొమ్మలున్నవి పంపు. "అవి ఇక్కడివారికి బాగా నచ్చుతాయి” అని రాస్తుంది. రాజాగారి అఖిరుబికి తగిన చిత్రాలను ఆమె బహూకరిస్తే ఆయన చాలా సంతోషించినట్లు ఆ ఉత్తరంలో రాస్తుంది. మొత్తంమీద యాత్ర బాగా జరిగిందని, తాము క్షేమంగా యిల్లు చేరుకున్నా దీని వల్ల తమకు మంచే జరిగిందని ఆమె సంతోషించింది.
పాఠకులకు విన్నపం
“Letters from Madras” రచయిత్రి జూలియా చార్లోటి, తనపేరు లోకానికి తెలియకుండా అజ్ఞాతంగా ఉండి,“By a Lady" ” అనే మారుపేరుతో ప్రచురించింది. 1836-38 మధ్యకాలంలో ఆమెభర్త జేమ్సు థామస్ రాజమండ్రిలో జడ్జిగా పనిచేశాడు. జూలియాకు ప్రతివిషయం తెలుసుకోవాలనే అభిలాష తను కన్నవీ, విన్నవీ అన్నీ లేఖలరూపంలో ఇంగ్లండులోని తనవారికి తెలియజేసింది. ఆమె ఈ లేఖలను ఎవరికి రాసింది తెలియదు. ఉత్తరాలలో ప్రస్తావనకువచ్చే వ్యక్తుల పేర్లన్నీ ఆమె మరుగుపరచింది.
ఈలేఖల్లో ఆనాటి ఆంధ్రదేశ ప్రజలజీవితం, ఆచారవ్యవహారాలు, విద్యావిధానం, కోర్టులు, న్యాయవాదులు, కోర్టులో సివిల్ క్రిమినల్ దావాలు ప్రయాణాలు, కంపెనీ ఉద్యోగుల విలాసవంతమైన జీవితం ఇట్లా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఆమె తిరిగిన ప్రదేశాలను, చూసిన వ్యక్తులను కళ్ళకు కట్టినట్లు వర్ణించింది. వలస పాలకుల చూపుతో,స్త్రీదృక్సథంనుంచి అన్నిటినీ గమనించింది.
జడ్జి దంపతులను కలుసుకోడానికి విద్యావంతులైన వ్యక్తులు వచ్చినపుడు వారిని ఆమె హిందూమత విషయాలను అడిగి సందేహాలు తీర్చుకొనేది. వారికి కైస్తవ్రమత గ్రంథాలు ఇచ్చి చదవమని ప్రోత్సహించేది. ఆ దంపతులకు మిషనరీ కార్యక్రమాలమీద మక్కువ ఎక్కువ.
మంచి సంగీతం వింటున్న సమయంలో మధ్యలో ఉన్నట్లుండి పాట ఆగిపోయినట్లు జూలియా చంటిబిడ్డకు ఆరోగ్యం బాగలేక పోవడంతో వైద్యుల సలహామేరకు, 1839లో ఇద్దరుబిద్ణలతో ఆమె ఇంగ్లండు వెళ్ళిపోతుంది. ఆమెభర్త థామస్ 1840లో అనారోగ్యంతో చనీపోయిన తర్వాత మూడేళ్ళకు ఆమె మెయిట్లాండ్ అనే మతప్రచారకుణ్ణి పెళ్ళి చేసుకొని తనపేరును జూలియా మెయిట్లాండ్ గా మార్చుకుంది.
నామిత్రులు, సీనియర్ పత్రికా రచయిత స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ మూడు దశాబ్టాలక్రితం ఈలేఖలను తన సౌంతమాటల్లో వివరిస్తూ ముఖ్యమైన విషయాలు “ఆమెలేఖలు” పేరుతో అనువదించారు. ఆతర్వాత దాన్ని అనేక పర్యాయాలు తిరగరాసి, మెరుగులుదిద్ది అచ్చుకు సిద్దంచేస్తున్న సమయంలో అనారోగ్యంతో చనిపోయారు. గోపాలకృష్ణ1986 ప్రాంతాల్లో తను తెలుగు చేసిన 24 ఉత్తరాల రఫ్ గ్రాఫ్ట్ ఫొటొ కాపి నన్ను చదివి అభిప్రాయం తెలియజేయమని పంపించారు. ఈ ప్రతిలో కొన్ని అంశాలు తగ్గించి అమ్మనుడిలో ప్రచురించడానికి పంపించాను. అమ్మనుడి సంపాదకులు ఇప్పటికి 14 లేఖలు ధారావాహికగా ప్రచురించారు.
చాలామంది పాఠకులు ఫోన్ చేసి పుస్తకం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అసక్తిని గమనించిన తరువాత “ఆమె లేఖలు”ను పుస్తక రూపంలో తీసుకుని రావాలని తలపెట్టాను. ఆ విషయాన్ని “అమ్మనుడి” పత్రిక ద్వారా పాఠకులకు విన్నవించుకొంటున్నా త్వరలో పుస్తకం వెలుగు చూడగలదని ఆశిస్తాను. అమ్మనుడి అందించిన సహకారానికి సర్వదా కృతజ్ఞుణ్జి. -డా॥ కాళిదాసు పురుషోత్తం, నెల్లూరు
| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020 |