అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం పిల్లలకు ఎందుకు ఉపయోగపడడం ల
అరవింద్ సర్దానా
తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం పిల్లలకు ఎందుకు ఉపయోగపడడం లేదు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను పూర్తిగా ఆంగ్రమాధ్యమంలోకి మార్చేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతీ, ఆ తర్వాతి పరిణామాలూ, చివరికిది భారత ఉన్నత న్యాయస్థానం ముందుకు వెళ్లడం- ఇదంతా తెలిసిందే. ఆయితే, ఆంగ్లమాధ్యమం పట్ల మోజుపెరగడంతో మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఆంగ్రమాధ్యమాన్ని ఐచ్చికంగా అమలు చేస్తున్నాయన్న నిజం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మన పొరుగునే ఉన్న తమిళనాడులోనే ప్రభుత్వం ఐచ్చికంగా ఆంగ్రమాధ్యమాన్ని ప్రవేశపెట్టిందనీ, దానివల్ల చేదు అనుభవాలను పొందుతున్నదన్న వాస్తవాన్ని అందరూ గర్తించాలనీ, కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కొన్ని అధ్యయనాల వివరాలతో అరవింద్ సర్జానా వ్రాసిన ఈ వ్యాసాన్ని చదవండి. -సంపాదకుడు
కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ విద్యావైఫల్యానికి ఆంగ్ల మాధ్యమమే విరుగుడుగా భావించాయి. ఆంధ్రప్రదేశ్ అయితే దీనిని అందరూ చేపట్టాలని ఆశిన్తున్నది. తమిళనాడులో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో మాధ్యమంగా ఆంగ్లం ఐచ్చికం.
(ఫైవేటు పాఠశాలలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గిందని తమిళనాడు ప్రభుత్వం గమనించింది. ఈ తగ్గుదల ఆంగ్లం వైపు ప్రజల మొగ్గుకు తార్మాణమని తమిళనాడు (వ్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా తమిళనాడు మంత్రి ఒకరు 2012 లో శాననసభలో చెప్పడం జరిగింది. ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం వల్ల పాఠశాలలు గ్రామీణ పిల్లలకు ఆకర్షణీయంగా తయారవుతాయని ఆయన అన్నారు. అప్పటి నుంచి, ప్రభుత్వ పాఠశాలలోకి దాదాపు 3,00,000 మంది పిల్లలు చేరారు.
తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ వారి 2013-2014 సంవత్సర విధాన పత్రంలో.... ఆంగ్ల మాధ్యమం నవ సంక్షేమ పథకాలలో ఒకటి అని ప్రకటించి, ఉచిత యూనిఫాం, క్రేయాన్లు, జామెట్రీ పెట్టెలు ఇవ్వడం వల్ల , ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ పిల్లలను బాగా ఆకర్షిస్తాయని పేర్మాన్నది.
ఒక వైపు, ప్రభుత్వ విద్యకు కట్టుబడి వుండి, క్షేత్ర స్థాయిలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా ప్రభుత్వం న్పందిన్తున్నట్లు చెప్పవచ్చును. కానీ సమస్య న్వభావం, సమస్య వట్ల సరైన స్పందన... “నాణ్యమైన విద్య” భావనపట్ల ప్రశ్నలను, ఆంగ్లాన్ని మాధ్యమంగా అమలుచేసే ప్రేరణ పట్ల ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
తమిళనాడు ప్రభుత్వం తన విధానాన్ని ఒక “గొప్ప సాధన” గా ప్రకటించి, విద్యార్థుల నమోదు. రాష్ట్ర స్థాయి సాధన సర్వేలో ఆంగ్లం పెరుగుదలను ఉదహరిస్తున్నది. కానీ, ఉపాధ్యాయులు మరోవిధంగా చెప్తున్నారు. చాలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో చలే ఆంగ్లం మాట్లాడ గలరు గనుక, తరగతులు 'ేరులోమాత్రవేం ఇంగ్లీషు మాధ్యమంగా, ఒక బలవంతపు విధానంగా ఉందని వారంటున్నారు.
నిర్బంధ విధానం
కాంచీపురం జిల్లా లో 3-4 తరగతులలో 28 మందికి గానూ, 25 మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. రెండు మూడు నంవత్సరాల కిందట వారు బడికి రావడం ప్రారంభించినప్పుడు, తమిళం మాధ్యమంగా వుండేది. కాన్మీ గత సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ్రారంభించినవుడు, ఓ ముగ్గురు తప్ప అందరూ ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ఆ ముగ్గురు అదే తరగతిలో కొనసాగుతున్నారు.
(ప్రధాన ఉపాధ్యాయురాలు, తమతో తమిళనాడు ప్రభుత్వం ఈ విధాన మార్పు గురించి చర్చించలేదన్నారు. అయినప్పటికీ, ఆంగ్ల మాధ్యమం గురించి తల్లిదండ్రులను నిరుత్సాహవరచలే దన్నారు. 3-4 తరగతులను బోధించే సుప్రియ, పిల్లలకు తమిళమే ఉత్తమం అన్నారు. “ఆ మాటే వారి తల్లిదండ్రులతో చెప్పితే ఎక్కడ పిల్లలు బడి మానేస్తారోనని మేం భయపడుతున్నా” మని ఆమె తెలిపారు.
కార్యాచరణ ఆధారిత బోధనా పద్ధతి
“అక్షరాలు లేదా పదాలు,చిన్న వాక్యాలు నేర్పడం ఉపాధ్యాయులకు పెద్ద సమస్య కాదు, 1వ తరగతి నుంచే ఆంగ్లాన్ని రెండవ భాషగా బోధిస్తూనే వున్నాము! అంటుంది నువ్రియ. నమన్యంతా, ఆంగ్లంలో పదాలను, ఆలోచనలను, భావాలను వివరించలేము. అదీ కూడా, బొమ్మలలో వివరించ లేనప్పుడు. తమిళనాడు ప్రాథమిక పాఠశాలల్లో, ఒకే ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాలు. నేర్పుతారు. భాష, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం....అన్నీ ఒకరే బోధిస్తారు. సుప్రియ కష్టంగా ఆంగ్లంలో మాట్లాడుతుంది. అందువల్ల, అన్ని తరగతులలాగే ఆమె తరగతి లో కూడా ఆంగ్లమాధ్యమం నామమాత్రం. లేదా ఆమే చెప్పినట్లు, “ఆంగ్లం లేదా, తమిళం కాదూ తమిళం, ఆంగ్లం రెండింటిలోనూ బోధించడం మంచిది. విల్లలకు తెలిని, మాట్లాడగలిగిన భాషలోనూ, నేర్చుకుంటున్న భాషలలోనూ నేర్చగలిగి ఉభయ భాషా ప్రావీణ్యం వున్న ఉపాధ్యాయుల ద్విభాషా పాఠశాలల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ సందర్భంలో, ఉపాధ్యాయులు తమిళం, ఆంగ్లం రెండూ బోధిస్తూ, క్రమంగా ఆంగ్లం వైపు మళ్ళాలి. సుప్రియ లాంటివారికి ఆంగ్లంలో (ప్రావీణ్యం లేదు, ధారాళంగా మాట్లాడటం చేత కాదు.కాబట్టి, వారి తరగతులు ద్విభాషా తరగతులు కాదు, కలగాపులగమైన తరగతులు!
బోధనా వద్దతులలో వృరస్కార (గ్రహీతయైన మంగళ, ప్రాథమిక పాఠశాల మాధ్యమంగా ఆంగ్లంలో బోధించడం కష్టమేనని ఒప్పుకుంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ మాతృభాష లో చక్కగా నేర్చుకుంటారు. బోధనా పద్ధతిలో, తెలిసిన భాషలో బోధన పిల్లలకు ఎంత సులువో వివరించడానికి మంగళ తమిళాన్ని ఎంచుకున్నది. దీనివలన, పిల్లలు అర్ధం చేసుకోవ డానికి, నేర్చుకున్నది చేయడానికి, ఇతరులతో మాట్లాడడానికి ఎంతగానో దోహదపడుతోంది, ఎటువంటి గందరగోళం, విసుగు, అనాసక్తి లేకుండా చేస్తుంది. ఎంతో అనుభవం వున్నప్పటికీ, ఆంగ్గంలో మాట్లాడడానికి, మంగళకున్న వ్యవహారిక ఆంగ్ల వరిజ్ఞానం ఏమాత్రం నరిపోదు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరి మాదిరిగానే ఆమె కూడా, పదోన్నతులకోసం కావలసిన, మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్హతలను సాధించింది. మాధ్యమిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుల ఖాళీలున్నాయని ఆంగ్లాన్ని ఎంచుకున్నది.
విల్లల విద్యలో భాష పాత్ర గురించి ఆవె వివరణ పరిగణించదగినది. మాతృభాషలో నేర్చుకున్న విద్యార్థి, రెండవ భాష, మూడవ భాష సునాయసంగా నేర్చుకుంటాదని పరిశోధనలు పేర్కొంటున్నాయి; అదీ కూడా ప్రతి భాషా చక్కగా బోధిస్తేనే. నేర్పడానికే భావరానివారు ఆ భాషలో విల్లలకు బోధన చేయపూనుకోవడం (శ్రేయన్మరం కాదు. ఏ మాత్రం పెద్దగా మాట్లాడలేని భాషలో బోధన చేయడం విపత్మరం.
పాఠశాలకు వెళ్ళండి, పిల్లల అథమస్థాయి అభ్యాసనల గురించి ఉపాధ్యాయులను అడగండి. తక్కువ సదుపాయాల ఆంగ్ల భాషాబోధన, గణిత శాటస్తాన్ని నేర్చుకోవడంలో విల్లల వెనుకుబాటుతనం.... గమనించగలరు. “రాష్ట్ర స్థాయి సాధన సర్వే ప్రతి సంవత్సరం బోధనలో ప్రగతిని ప్రస్తావిస్తుండగా, అందుకు భిన్నంగా ఉపాధ్యాయులు ఆ ప్రగతి తరగతి గదులలో లేదు అంటున్నారు. దీన్ని అధిగమించడానికి, 1వ తరగతి నుంచి 4 వరకు క్రియా ఆధారిత బోధనావద్ధతి, 5వ తరగతి నుంచి (క్రియాశీలక అభ్యననా పద్ధతిని ప్రవేశ పెట్టడం జరిగింది. అయినప్పటికీ, బాగా నేర్చుకొని, అర్ధం చేనుకొని, విశ్లేషణ చేయగలిగిన విద్యార్థులు ఆంగ్లం మాత్రం రాయడానికి కష్ట పడుతున్నారు.
“తమిళనాడు ఆంగ్ల విద్యా విధానం, భాషా విద్యను తక్కువ చేసిన విధాన అవలక్షణం! అంటారు చరిత్రకారుడు ఎ.ఆర్ వెంకటాచలపతి. ప్రభుత్వ నిధులతో ఆంగ్లం, తమిళ భాషలలో నిర్వహిస్తున్న చెన్నైలోని పాఠశాలను ఆయన సందర్శించారు. పిల్లలకు ఆయన పాఠం చెప్పారు. పిల్లలు కనీసం ఒక దినపత్రికను చదినే స్థాయిలో లేరని ఆయన గ్రహించారు. విద్యావిధానం, భాషను కేవలం ఒక సాదనంగా, భావవ్రసారానికి కీలకంగా చూడడం వల్ల ఇలా జరిగింది. భాష అనేది అలోచించుకో వడానికి అవనరమైనది. కానీ ఏవరూకూదా దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఆంగ్లాన్ని రెండవ భాషగా సరిగా బోధించక పోవడంతో, చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఆంగ్లాన్ని సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. వారు ఉపాధ్యాయులైన తర్వాత ఈ సమస్య రెట్టింపు అవుతుంది. చెన్నై లోని డైట్ (జిల్లా విద్యా శిక్షణా సంస్థ) లో పని చేసే ఓ ఆంగ్ల అధ్యాపకురాలు .... చాలా మంది శిక్షణార్థులైన ఉపాధ్యాయులు, 12 ఏళ్ళపాటు ఆంగ్లాన్ని అభ్యసించినా, ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నారు. కేవలం భట్టీ పట్టి భాషాపరీక్షలలో ఉత్తీర్ణులవుతున్నారు తక్కువ సమయంలో పెద్దవారు ధారాళంగా మాట్లాడే రీతిలో భాషను నేర్వజాలరు. తన తరగతులలో ఆంగ్లం లో మాట్లాడితే ఏ మాత్రం స్పందన వుండదు. అదే తమిళంలో మాట్లాడడం (ప్రారంభిస్తే అందరూ ఉత్తేజితులవుతున్నారు. అని ఆంగ్ల అధ్యాపకురాలు వివరించారు.
శిక్షణా లోపం
ఉపాధ్యాయుల విద్యలో లోపాల వలన సమస్యలు ఉధృతమవు తున్నాయి. ఉపాధ్యాయుల శిక్షణాసంస్థలైన “దైటొలు ప్రథమ భాష - ద్వితీయ భాషా బోధనల మధ్య భేదాలను గుర్తించలేకపోతున్నాయి. సమగ్రమైన విద్యపై అవగాహన లేకుందా, కేవలం వ్యాకరణం లాంటి అంశాలలో ఉత్తీర్ణులవుతున్నారన్న వాస్తవాన్ని ఈ విద్యాసంస్థలు గుర్తించడం లేదు. కాబట్టి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల బోధకులు, బయట పడలేనంతగా, ఒక విషవలయంలో కూరుకుపోయారు. ఈ విషయమై విద్యాశాఖ దృష్టి సారించడం లేదు. మాతృభాషలో విద్యా బోధన లాభదాయకమన్న వయోజన విద్యా పద్ధతులను పరిగణించ కుందా, ద్వితీయ భాషగా అంగ్ల బోధనలో ఉత్పన్నమవుతున్న వ్రశ్నలను ఉపేక్షిన్తున్నారు- అన్నారు. ఆమె నవోధ్యాయి అనిత తన మాటలలో “ఆంగ్లం సాంకేతికకు, సమాచార వెల్లడికి బాగున్నప్పటికీ, తమిళంలాగా వుండదు. మేము తమిళంలోనే ఆలోచిస్తాము. తమిళంలోనే మా భావాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయాలన్నదే మా నంకల్పం” అని పేర్కొన్నది. ప్రభుత్వ విధానం కాబట్టి, ఆంగ్లంలోనే బోధిస్తామని వారు చెప్పడం జరిగింది.
తమ ఉద్యోగాలను నిలుపుకోవడానికి, వారు ఆంగ్ల బోధన చేస్తారు. తమిళనాడులో ఉపాధ్యాయుల ఉద్యోగాలు విద్యార్థుల నమోదుతో ముడిపడివున్నవి. ఇది ఒక రకంగా ఓ విషపు ఒప్పందం. సామర్థ్యమో, మొగ్గు చూపడమో ఏదేమైనప్పటికీ, వారి ఉద్యోగాల పణంగా ఆంగ్ల బోధన చేస్తున్న విషపు ఒప్పందం ఇది. ఈ ఒప్పందాన్ని విద్యాశాఖ ఎలా సమర్థిస్తుంది? వాస్తవానికి భిన్నంగా, ఉపాధ్యాయులందరూ “ఉన్నతమైన శిక్షణా పొందారన్న విషయాన్ని విశ్వసించడం. రెండో విషయం, ఆంగ్లంలో విద్యాబోధనకు ప్రతి సంవత్సరం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇన్వడం జరుగుతుంది అని బలంగా విశ్వసించడం ఎలా సమర్ధనీయమవుతుంది?
నాలుగు రోజుల స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ కౌన్సిల్ వారి బోధకుల శిక్షణ వలన, ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయుల సామర్శ్యం పెంవులో ఉన్న నమన్యలను అధిగమిస్తుందని విద్యాశాఖ ప్రగాఢ విశ్వాసం.
ఉపాధ్యాయులు మిడిమిడి ఆంగ్ల పరిజ్ఞానంతో, అరకొర ఆంగ్ల బోధనా నైపుణ్యాలతో ఎలా ఆంగ్ల బోధన చేస్తారన్న ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి బ్లాక్ అభివృద్ధి అధికారుల వరకు ఒకటే స్థిరమైన సమాధానం: “వారికి శిక్షణ ఇస్తున్నాము”. శిక్షణ ప్రభావం ఎంత? ఉన్నత పాఠశాలలో ఆంగ్ల బోధన చేసిన మేరి అనే బ్లాకు స్థాయి ఉపాధ్యాయుల బోధకురాలి మాటలలో “భాషాపరమైన శిక్షణ వలన ఆంగ్లంలో ఉపాధ్యాయులు 40%- 50% స్థాయిలో ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారు” అని చెబుతూ, ఇది అచ్చెరువును కలిగించే గణాంకాలు అని ఒప్పుకుంటున్నది. ఉపాధ్యాయులు గడించిన పూర్వవిద్యకు ఇలాంటి వృత్తిపరమైన శిక్షణలు ప్రత్యాన్నూయం కానేరదు అని పేర్కొన్నది. తమిళనాడు విద్యావ్యవస్థలోని అధికారస్వామ్యం ఉపాధ్యాయులను ఒక సమస్యగా భావిస్తుంది. ఉపాధ్యాయులు సరైన శిక్షణ పొందరని, సోమరిపోతులుగా వుంటారని, జవాబుదారీతనం వుండదని, రాజకీయ ప్రయోజనాల వల్ల రక్షింవబదతారని ( ఉపాధ్యాయులు రాష్ట్ర రాజకీయాలలో బలమైన వారు) రాష్ట్ర విద్యాశాఖ విశ్వసిస్తుంది. ఏదిఏమైనా, ఉపాధ్యాయుల నియమాలను రూపొందించేది ఈ అదికారస్వామ్యమే. ఈ నియామకనియ మాలలో, ప్రధాన అంశమైన “బోధనా సామర్థ్యం"ను ఉపేక్షించడం జరిగిందని కొందరు ఆలోచనాపరులైన ఉపాధ్యాయులు ప్రస్తావించారు. వాస్తవంగా, స్వల్ప ఆంగ్ల పరిజ్ఞానంతోనే ఆంగ్ల బోధన చేయాలన్న అధికారుల బలవంతం వల్ల , అంగ్ల బోధనకు అవసరమైన కనీస నైపుణ్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
జరిగిన నష్టం
చెన్నై కార్పొరేషన్ వారు వారి పాఠశాలలో ఒక వినూత్న పద్దతిని అవలంబించారు. *ట్రీచ్ ఫర్ ఇండియా” అనే సంస్థకు 32 పాఠశాలలు అప్పగించారు. ఈ సంస్థ సభ్యులు, లాభాపేక్షలేని, బోధనేతర ఉద్యోగం చేసిన, లేదా పట్టభద్రులైన యువకులు. బోధనా వద్దతుల గురించి రెండు వారాల పాటు, అదీ కూడా క్రియా ఆధారిత బోధనా పద్ధతి లేకుండా _ శిక్షణపొంది, రెండు నంవత్సరాల పాటు ఆంగ్ల శిక్షణ ఇవ్వడానికి ఒవ్పందం చేనుకుంటారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతారు, ఆంగ్లంలో బోధిస్తారు, కానీ స్థానిక భాషను నేర్చుకోవాలనుకోరు.
సెంట్రల్ చెన్నైలోని ఓ పాఠశాలలో రెండవ సంవత్సరం ఆంగ్ల బోధన చేస్తున్న మాలిని ఇలా బోధించడం అద్భుతమన్నారు. ఏదైనా సమస్య ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్చక్షు, 4 వ తరగతి విద్యార్థుల గురించి ఆమె ఇచ్చిన సమాధానం “* పిల్లలు నేర్చుకోవడంలో ఇప్పటికీ సమస్య ఉన్నది”. నార్త్ చెన్నై పాఠశాలలోని నాల్లవ తరగతి ఉపాధ్యాయుడు ఒక ఇండో అమెరికన్. ఆయన తన విద్యార్థుల చేత ఒక ప్రశ్నకు సమాధానం చెప్పించడానికి ప్రయత్నం చేశాడు. “సెర్రిబెల్లం (చిన్న మెదడు) ఎటువంటి విధులను నియంత్రిస్తుంది” అన్న ప్రశ్ళకు విద్యార్థులు తమ. తలల మీద చేయి పెట్టి సెరిబెల్లం ఎక్కడ వుందో చెప్పడానికి ప్రయత్నించారు.
సెంట్రల్ చెన్నైలోని ప్రధానోపాధ్యాయురాలైన ఎస్ థెరిసా, తమ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుల కారతవున్నందున “టీచ్ ఫర్ ఇండియా” సంస్థకు బుణపడివున్నానని తొందరపాటుతో చెప్పినప్పటికీ, “ఈ ఆంగ్ల బోధనా కార్యక్రమాలు ప్రభుత్వేతర సంస్థలకు 1-2 సంవత్సరాల పాటు ఇవ్వబడినవి. ఈ ఏర్పాటు సముచితం కానిది. దీనివలన అటు అరవం రాదు, ఇటు ఆంగ్లం రాదు. నాలుగవ తరగతి విద్యార్థులు ఆంగ్లంలో రాయడం చేతకాక, సాంఘికశాస్త్రంలో ఉత్తీర్ణులు కాలేకపోయారు. వారికి ఏ భాషా రాదు. రాయదానికి అంగ్లం రాదు. అంతేకాదు, ఇప్పుడు పిల్లలు “తమిళం వద్దు, అంగ్లమే ముద్దు అంటున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు తమిళాన్ని రెందవ భాషగా నేర్పుతున్నప్పటికీ, పిల్లలు చదివే, రాసే నైపుణ్యాలు కోల్పోతారని ఆమె భయపదుతున్నది. దీని ఫలితంగా, తమిళ ఉపాధ్యాయురాలు వారానికి రెండు గంటలు అదనంగా ఈ విద్యార్థులకు తమిళం బోధించడం జరుగుతున్నది.
తమిళనాడు విభిన్నతకు ప్రతీకయైన రాష్ట్రంగా గుర్తింపు
తరువాయి 14వ పుటలో....