అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?

విద్యావిధానం

రమేష్‌ పట్నాయక్‌

79012 86396

జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?

అఖిల భారత విద్యాహక్కు వేదిక జూలై 29న కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం 2020 ప్రకటించిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాతృభాషా మాధ్యమానికి మహర్దశ పట్టింది అనే భావం ్రచారంలో ఉంది. పప్రధానమంత్రిగారు కూడా మాతృభాషా మాధ్యమ ప్రాధాన్యత గురించి మాట్లాడే సరికి ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నూతన విద్యావిధానం మాతృభాషా మాధ్యమ ఆవశ్యకతను బహుళంగా చెప్పిన మాట వాస్తవమే కాని మాతృభాషా మాధ్యమానికి సంబంధించిన స్పష్టమైన నిస్టేశాలు ఏమి ఉన్నాయి అన్న విషయం వరిశీలించాలి. పదగుంభనం ఎంత సారవస్తువు ఎంత ఎంచి చూడాలి కదా! ఈ సందర్భంగా జుతీయ విద్యావిధానం 2020 ని ఇప్పుడు అధికారంలో ఉన్న “విద్యా హక్కు చట్టంతో అలాగే 1986 నాటి “విద్యలో జాతీయ విద్యావిధానం” తో పోల్చిచూడడం ఎంతైనా అవసరం.

2010 ఏప్రిల్‌ 1 నుండి 'బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009” అనే కేంద్ర చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే. 6 - 14 వయోపరిమితిలో ఉన్న బాలల రాజ్యాంగ బద్ధమైన ప్రాథమిక హక్కు 21 ఎ ని వాస్తవీకరించడానికి ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం విద్యావ్యాపారాన్ని నిషేధించళ పోయినందున, ఉమ్మడి బడి విధానానికి మార్గం వేయనందున ఇంకా పాఠశాలలో వనరుల మరియు వసతుల విషయంలో తక్కున స్థాయి నిబంధనలు కలిగి ఉన్నందున విమర్శలకు గురవుతున్నది. అయితే, పాఠ్య ప్రణాళిక విషయంలో విద్యాహక్కు చట్టం పెద్దగా విమర్శలను ఎదుర్మోలేదు. ఈ చట్టం విభాగం 29(2)(యఫ్‌)లో వీలయినంత వరకు, మాతృభాషా మాధ్యమంలోనే విద్య అందించాలని నిశ్టేశిన్సుంది. ఈ నిబంధన (వ్రభుత్వ మరియు (పైవేటు పాఠశాలలన్నింటికి 1 నుండి 8వ తరగతి వరకు వర్తిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. ఉల్లంఘించబడని చట్టం మన దేశంలో ఏదీ లేదు. అది వేరే విషయం. ఈ చట్టం వచ్చిన తరువాత కూడా (ఫైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయమని (ఫైవేటు పాఠశాలలను నిర్బంధించడానికి బదులు (వభుత్వ పాఠశాలలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని వివిధ స్థాయిలలో ప్రవేశపెడుతున్నాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానంలో మాతృభాషామాధ్యమం విషయంలో ప్రభుత్వంపై వచ్చిన కేసు నందర్శంలో రావ (వభుత్వం విద్యావాక్కు చట్టంలో “వీలయినంతవరకు” అని ఉందని ఆ వెసులుబాటును 'ప్రజాఖీష్టం మేరకు” తాము ఉపయోగించుకుంటున్నామని చెప్పింది. ప్రభుత్వ వివరణను హైకోర్టు తిరస్కరించింది. 'వీలయినంతవరకు" అన్నది వెసులుబాటు మాత్రమే కావున చాలా ప్రత్యేక సందర్భాలలోనే అంటే మాతృభాషలో విద్య అందించలేని సందర్భాలలోనే ఉపయోగించుకోవాలని న్యాయస్థానం వివరించింది. అనేక చట్టాలలో “వీలయినంతవరకు” అనే పదబంధం ఉంటుందని దానిని ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం తీనుకున్న చర్యలు లిటిగేషను దారితీయకుండా ముందు జాగ్రత్తగా చేరుస్తారని గత కొన్ని తీర్పులను ఉటంకిస్తూ కోర వివరించింది. బాలల విద్యాహక్కు చట్టం మాతృభాషా మాధ్యమం విషయంలో అధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్ట్రోకు గాని, ఫైవేటు మేనేజ్‌మెంట్ల ప్రయోజనాలకు గాని, చివరకు తల్లిదండ్రుల అభీష్టానికి గాని ఎటువంటి అవకాశం కల్పించలేదు. విద్యాహక్కు చట్టం బాలల సమగ్ర మరియు సహజ అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం తరపున మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశించింది. అదే చట్టంలో ఉన్న “బాలల కేంద్రగతంగా, వారికి స్నేహపూర్వకమైనదిగా విద్య అందించబడాలి” అన్న నిబంధన కూడా మాతృభాషా మాధ్యమాన్నే సూచిస్తుంది. ఇప్పటికీ అధికారం (ఫోర్సు)లో ఉన్న 'బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009” వ్రభుత్వ మరియ (మైవేటు యాజమాన్యాలన్నింటిలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే నిర్దేశిస్తుంది.

ఇప్పుడు మనం జుతీయ విద్యావిధానం 2020 ని పరిశీలిద్దాం. ఈ విధానం 4 11 విభాగంలో '“వీలయిన చోట (వీలయిన ప్రతిచోట అని ఇంకా వీలయిన ప్రతి సందర్భంలో అని కూడా అర్ధం చెప్పవచ్చు) కనీసం 5వ తరగతి వరకు, 8వ తరగతి మరియు ఆపై స్థాయిలో కూడా అయితే మంచిదే, ఇంటి బాష లేదా మాతృభాష లేదా స్టానిక భాష లేదా ప్రాంతీయ భాష బోధనామాధ్యమంగా ఉంటుంది" అని పేర్కొంది. పై ఉటంకింపును బట్టి ఈ విధానం ప్రకారం, 5వ తరగతి వరకు వారి వారి భాషలలోనే బాలలకు విద్య అందించాలి. ఇంకా ఈ విధానం ప్రకారం 8వ తరగతి వరకు మరియు ఆపై స్థాయిలలో విద్యార్థులకు వారి వారి భాషలలో విద్య అందించగలిగితే మంచిదే. విద్యాహక్కు చట్టం అయితే 8వ తరగతి వరకు బాలలకు మాతృభాషలోనే విద్య అందించాలని స్పష్టంగా పేర్కొంది. విద్యాహక్కు చట్టంలో ఉన్న 'వీలయినంతవరకు' మరియు ఈ విధానంలో ఉన్న “వీలయిన చోట” అన్న పదబంధాలను మనం ప్రక్కన పెడితే విద్యా హక్కు చట్టం 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశిస్తే ఈ విధానం 5వ తరగతి వరకు మాత్రమే మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశిస్తున్నది. మరి ఈ నూతన విద్యావిధానం విద్యాహక్కు చట్టం నుంచి ఒక అడుగు వెనుకకు వేసినట్లే కదా. మరొక విషయం ఏమంటే జాతీయ విద్యావిధానం 2020 దానికదే అమలు జరగదు. సదరు విధానానికి పార్లమెంటు ఆమోదం లేదుకాబట్టి దానిని అమలు చేయడానికి పార్లమెంటులో అంశాల వారీగా చట్టాలు చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్యలో ఇప్పటికే ఒక కేంద్ర చట్టం (విద్యాహక్కు చట్టం 2009) ఉంది కాబట్టి దానిని మారుస్తూ చట్టం చేయవలసి ఉంటుంది. అప్పుడు విషయాలు మరింత స్పష్టమవుతాయి. 1 నుంచి 8 వతరగతి వరకు వర్తించే విద్యాహక్కును ఇటు పూర్వ ప్రాథమిక విద్యకు అటు సెకండరీ విద్యకు విస్తరించాలని కస్తూరి రంగన్‌ కమిటీ చేసిన సిఫారసును ఈ విధాన పత్రం పట్టించుకోలేదు. మరి అట్టి హక్షుపై ఆధారపడిన చట్టాన్ని అలాగే ఉంచి పూర్వ ప్రాథమిక విద్యకు మరియు సెకండరీ విద్యకు క్రొత్త చట్టాలను తీసుకువస్తారా, ఆ చట్టాన్ని రద్దుచేసి పూర్వ ప్రాథమికవిద్య నుంచి 12వ తరగతి వరకు ఒకే కొత్త చట్టాన్ని తీసుకువస్తారా అన్న విషయం ఇంకా తేలవలసి ఉంది. ఎలా చేసినా ఈ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలంటే బోధనా మాధ్యమం విషయంలో ప్రస్తుతం ఉన్న విద్యా హక్కువట్టాన్ని సవరించవలసి ఉంటుంది. ప్రధానంగా 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమం అని ఉన్న ప్రస్తుత నిబంధనని 5వ తరగతి వరకు అని సవరించవలసి ఉంటుంది. అంటే ఉన్న చట్టానికి అభివృద్ధినిరోధకమైన సవరణ చేయవలసి ఉంటుంది. మాతృభాషా మాధ్యమం విషయంలో 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలు జరుగుతున్న విద్యాహక్కుచట్టం కంటే 'జుతీయ విద్యావిధానం 2020” ఒక అడుగు వెనుకన ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

బోధనా మాధ్యమం ఒక విషయం అయితే, ఈ విధానం ప్రకారం ఏఏ భాషలను పాఠ్య విషయాలుగా బోధిస్తారు అనేది మరొక చర్చనీయాంశం. 1968 నాటి జుతీయ విద్యావిధానంలో ప్రకటించబడి మరియు 1986 నాటి జుతీయ విద్యావిధానంలో కొనసాగించబడిన త్రిభాషా విధానం ప్రకారం తెలుగు విద్యార్థులకు తెలుగు, హిందీ మరియు ఆంగ్లం అనే పద్ధతి ఉన్న విషయం తెలిసిందే. (క్రొత్త విద్యావిధానంలో కూడా త్రిభాషా విధానం కొనసాగుతుందని పేర్కొనబడింది. కాని ఈ జాతీయ విద్యా విధానం 2020 లో 413 విభాగంలో నిర్దేశించిన త్రిభాషా విధానం ఇంత వరకు అమలు అవుతున్న విధానంతో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంది. కస్తూరి రంగన్‌ నివేదికలో హిందీ తప్పనిసరి అని ప్రతిపాదించబడితే హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా తమిళనాడు నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని విధాన వత్రంలో హిందీ తప్పనిసరి అనే భావనను తొలగించారు. అంతమేరకు మంచిదే. అంత కంటే ప్రధానమైన విషయం ఏమంటే ఈ విధానంలో మాతృభాషగాని అలాగే ఆంగ్లం కాని తప్పనిసరి అని పేర్కొనకపోవడం. ఈ విధానం విద్యార్ధికి చాలా వెనులుబాటు ఇచ్చింది. ఆయా ర్యాష్ట్రాలు, ప్రాంతాలు, ఇంకా ప్రధానంగా విద్యార్థులు తమ అభీష్టం ప్రకారం ఏవేని మూడు భాషలను ఎంపిక చేసుకోవచ్చని, అయితే అట్టి ఎంపికలో కనీసం రెండు దేశ (నేటివ్‌) భాషలు ఉందాలని ఈ చట్టంలో పేర్కొనబడింది. వునాదిలో విద్యావ్యాపారం ఉన్నప్పుడు 'వెసులుబాటులు వివక్షలకు దారితీస్తాయి. ఈ విధానం ప్రకారం విద్యార్థి ఆంగ్లం లేకుందా కూడా మూడు దేశీయ భాషలు నేర్చుకోవచ్చు. అలా దక్షిణాది రాష్ట్రాలలో జరగదు కాని కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో జరగవచ్చు. మరొక వైపు చూస్తే ఈ విధానం ప్రకారం మాతృభాష లేకుందా కూడా మూడు భాషలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో (ఫైవేటు పాఠశాలలలో తెలుగు లేకుండా ఇంగ్లీషుతో పాటు 'స్కోరింగ్‌ సబ్బక్టులైన" హిందీ, సంస్కృతం

ర్తరువాయి 14వ పుటలో.......

చేసుకోవాలంటే కొత్త జాతీయ విద్యావిధానాన్ని సూక్ష్యంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ భాషలను నేర్చుకుని మన విద్యార్థులు అత్యంత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఈ విధాన నిర్మాతలు - అందుకోసం మాతృభాషల్ని శక్తిమంతం చెయ్యాలన్న మౌలిక అంశాన్ని విస్మరించారు!

భావతోపాటు చర్చించాల్సిన అంశాలెన్నో జాతీయ విద్యావిధానంలో ఉన్నాయి. మనదేశంలోని సామాజిక అసమానతలు, చారిత్రక సమస్యలు, సాంస్కృతికతలోని వైవిధ్యాలు లాంటి అంశాల గురించి ఈ విద్యావిధానం మాట్లాడినా, వాటి విషయంలో చేపట్టడలచిన చర్యలన్నీ ఆ సమస్యల పరిష్కారానికి, శక్తివంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించే దిశగానూ ఏమాత్రం దోహదం చేయలేవు. పైగా ఈ సమాజాన్ని మరింతగా వైరుధ్యాలతో నిర్వీర్యం చేయడానికే పనికివస్తాయి. మొత్తంగా ఈ విద్యావిధానం పెద్ద పెద్ద ఆలోచనలతో ఆశయాలతో నిండివున్నా, అందుకు అనుసరించదలచిన వ్యూహాలు, విధానాల కారణంగా విరుద్ధమైన వలితాలనిచ్చేదిగా ఉందని చెప్పక తప్పుదు.


తెలుగు వెలుగు” సెప్టెంబరు 2020, సంచిక సౌజన్యంతో

“తమిళనాడులో ఆంగ్ల మాధ్యమం వైపు.

10 వ పుట తరువాయి.......

తెచ్చుకున్నది. తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ వారి 2016-17 విధాన పత్రంలో * పిల్లలకు గరిష్టంగా సదుపాయాలను కల్పిస్తూ, తద్వారా, సాంథింక, ఆర్థిక అడ్బంకులను, అవరోధాలను అధిగమిస్తూ, అందరికీ చదువుకునే విశాల అవకాశాన్నికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. అంతేకాకుండా, సాంఫిక-ఆర్థిక అడ్డంకులు లేకుండా పిల్లలందరూ చదువుకొనునట్లుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టటడంలో అ(గ్రగామి తమిళనాడు. అన్ని ప్రభుత్వాలు తమ సాఫల్యాలను అతిశయంగా చెప్పుకుంటాయి. కళ్ళ ముందున్న వాస్తవాలను ఒప్పుకుంటున్నప్పటికీ, విద్యాశాఖ వారి దృష్టిలో మాత్రం, నిర్ణీత పట్టిక వేరకు సదుపాయాలు కల్పించడం వల్లే ప్రాథమికవిద్య పెంపొందించబడుతుంది. ఈ నిర్ణీత పట్టికలోని వస్తువులైన - యూనిఫాంలు, జామెట్రీ పెట్టెలు, పుస్తకాలు, ఆంగ్ల మాధ్యమం ఇస్తేనే అది సాధ్యమవుతుంది . కానీ బోధనామాధ్యమం మార్చడమన్నది సంచులు, సుద్దముక్కల పెట్టెలు ఇచ్చినంత సులువు కాదు.

ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యలో “ఉచిత” యూనిఫాంలు, నంచులు, వుస్తకాలు ఇవ్వడం ఒక కోణం. (ఫైవేటు (సొంత) పాఠశాల _ విద్యార్థులకున్న అవకాశాలకన్నా తక్కువ స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నారు. కాని, ప్రభుత్వపాఠశాలలో చదువుకోవ డానికి సమానమైన అవకాశాలు కల్పించామని అధికారులు చెప్పుకోవడం పరిపాటి. ఇది పెద్ద మోసం.

(Why Tamil Nadu shift to English Medium instruction is not helping children వ్యాసానికి ఇది తెలుగుసేత.)


12 వ పుట తరువాయి....


అనే త్రిభాషా విధానం అమలు కావచ్చు. మాతృభాషను తప్పనిసరి చేయని ఈ త్రిభాషా విధానం వలన విద్యావ్యాపారీకరణ నేపథ్యంతో మాతృభాషలకే గండం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక మూడు భాషలకు అదనంగా ఏదేన ఒక భాషను (ఫ్రెంచ్‌, జర్మన్‌, కొరియన్‌, జపనీన్‌ వంటివి) ఒక ఐచ్చిక పాఠ్య విషయంగా తీసుకోవచ్చని జాతీయ విద్యావిధానం 2020లో పేర్కొనబడింది. ఈ విధానంలో అకడమిక్‌ కోర్సులైన సామాజిక, ప్రకృతి మరియు గణిత శాస్త్రాల వంటివి కూడా ఐచ్చిక పాఠ్య విషయాలుగా కుదించబడ్దాయి. అంటే ఎవరైనా ప్రకృతి, సామాజిక మరియు గణిత శాస్త్రాలలో ఒకదానిని (ఆచరణలో సామాజిక శాస్త్రాన్ని) విడిచిపెట్టి ఆంగ్లానికి అదనంగా. మరొక విదేశీ భాషను ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఈ వీలును ప్రధానంగా ఉపయోగించుకునేది ప్రైవేటు పాఠశాలలు. ఒక స్థాయి వైవేటు పాఠశాలలలో జర్మనీ, జపనీస్‌, కొరియన్‌ వంటి భాషలకు డిమాండు ఉంది. ఆ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్దేశాన్ని రూపొందించి ఉండవచ్చు. ఈ విధానం అమలు జరిగితే అధిక ఫీజులు వసూలుచేసే ఐదు నక్షత్రాల ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థులు సామాజిక శాస్త్రాలు నేర్చుకోకుందానే పై స్థాయిలకు వెళ్ళిపోతారు. అట్టివారు నైపుణ్యం కలిగిన కార్బోరేటు మేనేజర్లు కాగలరు గాని సామాజిక స్పృహ కలిగిన పౌరులు మాత్రం కాలేరు. ఈ విధానం యొక్క పర్యవసానంగా తెలుగు రాష్ట్రాలలో, ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం ఉన్న త్రిభాషా విధానం కొనసాగే అవకాశం ఉండగా, ప్రైవేటు పాఠశాలలలో తెలుగును తొలగించి 6వ తరగతి నుంచే నంస్కృతం ప్రారంభం కాగలదు. త్రిభాషావిధానంలో భాగంగా మాతృభాషను తప్పనిసరి చేయకపోవడం మరిమొకవైవు సంస్కృతాన్ని అన్ని పరిధులు దాటి ప్రోత్సహించడం, మాతృభాషా మాధ్యమాన్ని ఐదవ తరగతికి పరిమితం చేయడం ఈ విధానంలో (ప్రధానమైన సమస్యలు. ఈ విధానం పేదల ఎడల మాత్రమే కాక భాషల ఎడల కూడా వివక్షగా పరిణమించగలదు.

రచయిత అఖిలభారత విద్యాహక్కువేదిక అధ్యక్షవర్గ సభ్యులు

ఈ వ్యాసంలో కొంతభాగం “ఆంధ్రజ్యోతి”

15 సెప్టెంబరు 2020 సంచికలో వచ్చింది.


'వికీపీడియా'కు మప్పిదాలు

'సెష్టెంబరు సంచికలో శ్రీ రహ్మానుద్దీన్‌ రచించిన “ఈశాన్య రాష్రాల జనజాతుల భాషలకు పొంచివున్న ముప్పు” వ్యాసానికి సంబంధించి 9,10,11, పుటల్లోనూ ముఖచిత్రంలోనూ ప్రచురించిన ఫోటోలను 'వికీపీడియా” నుంచి తీసుకొన్నాము. వారికి మప్పిదాలు -సం.

భాష నశిస్తే జాతి నశిస్తుంది. వాడని భాష వాడిపోతుంది